అనిరుధ్ విజృంభణ
సాక్షి, హైదరాబాద్: ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో రాకేశ్ ఎలెవన్ బౌలర్ ఎన్. అనిరుధ్ (4–1–10–5) విజృంభించాడు. దీంతో కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రాకేశ్ ఎలెవన్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ అనిరుధ్ ధాటికి 18.1 ఓవర్లలో 44 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ రోహన్ అలీ (11) మినహా ఏ ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. అనిరుధ్ 10 పరుగులిచ్చి 5 వికెట్లతో చెలరేగగా, మరో బౌలర్ జి. రిత్విక్ 9 పరుగులిచ్చి 3 వికెట్లను పడగొట్టాడు. అనంతరం స్వల్పలక్ష్యం కోసం బరిలోకి దిగిన రాకేశ్ ఎలెవన్ జట్టు 10.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 45 పరుగులు చేసి గెలిచింది.
ఇతర మ్యాచ్‌ల వివరాలు: జై భగవతి: 125 (బి. సారంగ్ 30, శివ కుమార్ 31; ఎఫ్‌కే ముజ్తబా 6/31, అభిషేక్ 2/16), పాషాబీడీ: 126/5 (విశేష్ 39, కార్తీక్‌రెడ్డి 34 నాటౌట్; మహ్మదుల్లా ఖాన్ 2/27). u రోహిత్ ఎలెవన్: 95 (సర్తాజ్ 36; ప్రేమ్ కుమార్ 4/9), ఖల్సా: 35 (పవన్ శర్మ 5/7). u విజయ్ హనుమాన్: 117 (పి. సాయినాథ్ 43, తౌసీఫ్ 3/64, అజ్మత్ ఖాన్ 5/22), న్యూ బ్లూస్: 120/5 (అకేందర్ కుమార్ 30, అజిత్ సింగ్ 39). u నిజాం కాలేజ్: 301, ఎలిగెంట్ సీసీ: 149 (అద్నాన్ అహ్మద్ 33, విపిన్ చౌదరి 50 నాటౌట్; అక్షయ్ 6/27, డి. శ్రీనివాస్ 3/50). u ఆక్స్‌ఫర్డ్ బ్లూస్: 87, గ్రీన్‌టర్ఫ్: 88/2 (వాహెద్ 36 నాటౌట్).