పెళ్లికి వేళాయె | Keerthy Suresh Marriage In December: Suresh Kumar | Sakshi
Sakshi News home page

పెళ్లికి వేళాయె

Published Sun, Nov 24 2024 12:19 AM | Last Updated on Sun, Nov 24 2024 12:19 AM

Keerthy Suresh Marriage In December: Suresh Kumar

హీరోయిన్‌ కీర్తీ సురేష్‌ పెళ్లి పీటలు ఎక్కే సమయం ఆసన్నమైందట. తన స్నేహితుడు, ప్రియుడు ఆంటోని తటిల్‌ను ఆమె పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ వార్తలపై కీర్తీ సురేష్‌ తండ్రి, నిర్మాత జి. సురేష్‌ కుమార్‌ ఓ మలయాళ మీడియాతో మాట్లాడుతూ– ‘‘కీర్తీకి 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఆంటోని తటిల్‌తోనే వివాహం జరగబోతోంది.

గోవాలో ఈ పెళ్లి జరుగుతుంది’’ అని  పేర్కొన్నారాయన. కాగా ఆంటోని తటిల్‌–కీర్తీలది డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అట. గోవాలోని ఓ రిసార్ట్‌లో డిసెంబరు 11 లేదా 12న వీరి వివాహం జరగనుందని టాక్‌. వివాహ వేడుకలను గోవాతో పాటు కేరళలోనూ జరిపేలా ΄్లాన్‌ చేశారనే వార్త కూడా వినిపిస్తోంది. ఇక ఆంటోని తటిల్‌ విషయానికొస్తే... ఆయన కేరళకు  చెందిన వ్యాపారవేత్త. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement