హైదరాబాద్: ఫ్యూచర్ స్టార్స్ మీడియం పేసర్ శ్రీధర్ రెడ్డి (9/33) చెలరేగాడు. ఆక్స్‌ఫర్డ్ బ్లూస్‌తో జరిగిన ఎ-డివిజన్ రెండు రోజుల మ్యాచ్‌లో అతను అద్భుతమైన స్పెల్ (15.2-4-33-9) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. తొలిరోజు ఆటలో ఫ్యూచర్‌స్టార్స్ 318/9 స్కోరు చేసింది. రెండో రోజు ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ తొమ్మిది శ్రీధర్ ఖాతాలోకే వెళ్లాయి. తర్వాత ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆక్స్‌ఫర్డ్ జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్ ఫ్యూచర్‌స్టార్స్‌కు 9, ఆక్స్‌ఫర్డ్‌కు 3 పాయింట్లు దక్కాయి.
ఖురేషీ 3కే ఏడు వికెట్లు
శ్రీచక్ర ఆటగాడు అబ్దుల్ ఎలల్ ఖురేషీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో మూడే పరుగులిచ్చి 7 వికెట్లు కూల్చిన ఖురేషీ బ్యాటింగ్‌లో అర్ధసెంచరీ సాధించాడు. మొదటి రోజు ఆటలో తొలుత బ్యాటింగ్ చేపట్టిన అవర్స్ 72 పరుగులకే ఆలౌటైంది. ఖురేషీ (5.5-2-3-7) అసాధరణ స్పెల్‌తో రెచ్చిపోయాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీచక్ర ఆట నిలిచే సమయానికి 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఖురేషీ (63) రాణించాడు. అనిశ్ కుర్దుకర్‌కు 4 వికెట్లు దక్కాయి.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
జిందా తిలిస్మాత్ తొలి ఇన్నింగ్స్: 93 (అజారుద్దీన్ 21; సౌరవ్ కుమార్ 5/55, ఈశ్వర్ రావు 4/18), బడ్డింగ్ స్టార్స్ తొలి ఇన్నింగ్స్: 279 (ముకేశ్ 54; అమర్ అయూబ్ 7/106), జిందా తిలిస్మాత్ రెండో ఇన్నింగ్స్: 105 (అజార్ అలీ 36; అబ్దుల్ మొఖిత్ 5/24, ముకేశ్ 4/34).
ఉస్మానియా తొలి ఇన్నింగ్స్: 226, న్యూబ్లూస్ తొలి ఇన్నింగ్స్: 218, ఉస్మానియా రెండో ఇన్నింగ్స్: 200/4 (ఆశిష్ 100, సిద్ధాంత్ 49, వసీయుద్దీన్ 3/81), న్యూబ్లూస్ రెండో ఇన్నింగ్స్: 59/3.
అగర్వాల్ సీనియర్స్ తొలి ఇన్నింగ్స్: 178, ఎస్‌బీఐ తొలిఇన్నింగ్స్: 199/9 (క్రాంతి కుమార్ 42, అబు బాకర్ 44), అగర్వాల్ రెండో ఇన్నింగ్స్: 25/5.
గ్రీన్‌టర్ఫ్ తొలి ఇన్నింగ్స్: 376, నిజామ్ కాలేజి తొలి ఇన్నింగ్స్: 259 (సాయికుమార్ 81, సందీప్ 55; సాయి శ్రాగ్వీ 5/63, త్రిశాంక్ గుప్తా 5/118).
విజయ్ హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 231, మహమూద్ సీసీ తొలి ఇన్నింగ్స్: 235/9 డిక్లేర్డ్ (గణేష్ 65; మెహర్ ప్రసాద్ 4/66), విజయ్ హనుమాన్ రెండో ఇన్నింగ్స్: 162/3 (భరత్ తేజ 38).