ఒక్కసారిగా చిదిమిన జీవితాలు.. ఆ గ్రామంలో విషాదఛాయలు.. | - | Sakshi

ఒక్కసారిగా చిదిమిన జీవితాలు.. ఆ గ్రామంలో విషాదఛాయలు..

Oct 28 2023 12:04 AM | Updated on Oct 28 2023 9:57 AM

- - Sakshi

సంతోష్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి (ఫైల్‌)

సాక్షి, ఖమ్మం: అశ్వాపురంమండలంలోని మల్లెలమడుగు గ్రామంలో హైస్కూల్‌ సమీపంలో మొండికుంట – భద్రాచలం రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మొండికుంట గ్రామానికి చెందిన యువకులు ఎడ్ల సంతోష్‌రెడ్డి (32), మీ సేవ కేంద్రం నిర్వాహకుడు కందిమళ్ల శ్రీధర్‌రెడ్డి (37) మృతి చెందారు. సంతోష్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి బైక్‌పై మొండికుంట నుంచి భద్రాచలం వెళ్తుండగా హైస్కూల్‌ సమీపంలో మొండికుంట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ లైట్లు లేకుండా అతి వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో ఎడ్ల సంతోష్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

శ్రీధర్‌రెడ్డిని 108 ద్వారా భద్రాచలం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంతోష్‌రెడ్డి పాల్వంచ కేటీపీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనకు గతంలో వివాహం జరగగా దంపతులు విడిపోయారు. మరో పది రోజుల్లో మరో యువతితో వివాహం జరగనుంది. వివాహానికి సంబంధించిన పనులపై శ్రీధర్‌రెడ్డితో కలిసి బైక్‌పై భద్రాచలం వెళ్తుండగా ట్రాక్టర్‌ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. శ్రీధర్‌రెడ్డి మొండికుంట గ్రామంలో ఎన్నో ఏళ్లుగా మీ సేవ కేంద్రం నిర్వహిస్తూ ఓ దినపత్రిక రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ఇవి చదవండి: 'నన్ను మోసం చేశాడంటూ..' యువకుడి ఇంటి ముందే.. యువతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement