sridhar reddy
-
ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపితే భయంతో కేసులు పెడుతున్నారు
-
వరుడిని ఆశీర్వదించిన వైఎస్ భారతిరెడ్డి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలో ఆర్అండ్బీ డీఈగా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి, వైఎస్ మెమోరియల్ బాలికల కళాశాల అధ్యాపకురాలిగా పనిచేస్తున్న అనితమ్మల కుమారుడు యశ్వంత్ రెడ్డి వివాహం కాకినాడకు చెందిన శ్రీనిజతో ఆదివారం రాత్రి జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ఆమె తల్లి ఈసీ సుగుణమ్మలతో పాటు మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్సార్సీపీ పులివెందుల నియోజకర్గ ఇన్చార్జి దుష్యంత్‌రెడ్డి, ఆయన సతీమణి శిల్పతో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ ఆనందరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి తదితరులు శనివారం నూతన వరుడిని ఆశీర్వదించారు. -
పోలవరం డాక్యుమెంట్ల వెనక చంద్రబాబు కుట్ర..!
-
ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేటుపరం వెనుక అసలు నిజం
-
కొల్లాపూర్ ఘటనపై జూపల్లి రియాక్షన్
-
కరువు, చంద్రబాబు కవలపిల్లలు
పుట్టపర్తి: కరువు, చంద్రబాబు కవలపిల్లలని, ఆయన హయాం మొత్తం కరువు రాజ్యమేలిందని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను కృష్ణా జలాలతో నింపే పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఆయన తొమ్మిది రోజులపాటు చేపట్టిన ‘వైఎస్సార్ రైతు విజయ సంకల్ప పాదయాత్ర’ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా పుట్టపర్తి మండలం చెర్లోపల్లి వద్ద పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ముగింపు సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే దుద్దుకుంట మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో తీవ్ర దుర్భిక్షంతో పంటలు ఎండిపోయి రైతులు అల్లాడిపోయారన్నారు. వైఎస్సార్ చలువతో హంద్రీ–నీవా కాలువ తవ్వడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం అనేక చెరువులకు నీరందుతుండడంతో రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులను నింపితే రెండు లక్షల ఎకరాలు సాగులోకి రావడమే కాకుండా సుమారు రెండు లక్షల జనాభాకు తాగునీరు అందుతుందని తెలిపారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో రైతులకు అన్ని విధాలా మేలు జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు. -
నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మన్నెం రంజిత్‌యాదవ్?
మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగనుంది. పార్లమెంటులో అడుగుపెట్టడానికి తెలంగాణ రాష్ట్రము నుంచి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది.రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రధానంగా ఢిల్లీ పీఠం 2024 లో బీజేపీకె చెందుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రము నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది విజయం సాధించారు. అదేవిదంగా 2019 ఎన్నికల్లో కూడా రాష్ట్రం నుంచి బీజేపీ అభ్యర్థులు నలుగురు పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులుగా పార్లమెంట్ కు పోటీచేయడానికి రాష్ట్రము నుంచి పోటీ ఎక్కువగానే కనపడుతోంది. ప్రధానంగా నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి యాదవ సామాజిక వర్గం నుంచి మన్నెం రంజిత్ యాదవ్ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రంజిత్ యాదవ్ ఇప్పటి నుంచే నల్ల గొండ నుంచి పావులు కదుపుతున్నారు. పార్టీలో కొత్తగ చేరినప్పటికీ, ఆయనకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు స్నేహపూర్వక వాతావరణం ఉంది. కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి...! నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు.. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గత రెండు మూడు ఎన్నికల నుండి మిర్యాలగూడ.. నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్న రఘువీర్ రెడ్డికి కాలం కలిసి రాకపోవడంతో పాటు రాజకీయ సమీకరణలు అనుకూలించకపోవడంతో పోటీ చేసే అవకాశం రాలేదు. అయితే ఈసారి పరిస్థితులన్నీ ఆయనకు అనుకూలంగా మారిన క్రమంలో నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు రఘువీర్ రెడ్డి. బరాబర్ సిద్ధమై ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ తేరా చిన్నపరెడ్డి...! నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త.. మాజీ శాసనమండలి సభ్యులు డాక్టర్ తేరా చిన్నపరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఎందుకంటే గతంలోనూ నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అనుభవం ఉండటంతో పాటు కుందూరు జానారెడ్డి కుటుంబంతో పోటీ అనగానే వాళ్లని ఎదుర్కొనే సత్తా... తేరా చిన్నపరెడ్డికి మాత్రమే ఉందనే రాజకీయ ఎత్తుగడలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అట్లనే గత సాగర్ ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తేరా చిన్నపరెడ్డి పేరును పరిశీలించడంతో పాటు ఎమ్మెల్సీ గానూ మరోసారి అవకాశం ఇవ్వకపోవడం వంటిపరిస్థితుల్లో తేరా చిన్నపరెడ్డికి ఈసారి నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తుందనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఈయనతో పాటు ట్రైకార్ రాష్ట్ర మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ నుంచి రంజిత్ యాదవ్..! నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉండి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే నిడమనూరు మండలానికి చెందిన మన్నెం రంజిత్ యాదవ్.. బీజేపీ పక్షాన నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన రంజిత్ యాదవ్.. ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన రంజిత్ యాదవ్ సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో... జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పక్షాన నల్లగొండ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల క్రమంలో పరిస్థితులన్నీ కలిసి వస్తే జరగబోయే నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన వాళ్లే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అట్లనే టికెట్ సాధించి బరిలో నిలిచే గెలిచే అభ్యర్థులు ఎవరో.. అదృష్టం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సి ఉంది. -
ఒక్కసారిగా చిదిమిన జీవితాలు.. ఆ గ్రామంలో విషాదఛాయలు..
సాక్షి, ఖమ్మం: అశ్వాపురంమండలంలోని మల్లెలమడుగు గ్రామంలో హైస్కూల్ సమీపంలో మొండికుంట – భద్రాచలం రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మొండికుంట గ్రామానికి చెందిన యువకులు ఎడ్ల సంతోష్‌రెడ్డి (32), మీ సేవ కేంద్రం నిర్వాహకుడు కందిమళ్ల శ్రీధర్‌రెడ్డి (37) మృతి చెందారు. సంతోష్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి బైక్‌పై మొండికుంట నుంచి భద్రాచలం వెళ్తుండగా హైస్కూల్ సమీపంలో మొండికుంట వైపు వెళ్తున్న ట్రాక్టర్ లైట్లు లేకుండా అతి వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో ఎడ్ల సంతోష్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీధర్‌రెడ్డిని 108 ద్వారా భద్రాచలం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంతోష్‌రెడ్డి పాల్వంచ కేటీపీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనకు గతంలో వివాహం జరగగా దంపతులు విడిపోయారు. మరో పది రోజుల్లో మరో యువతితో వివాహం జరగనుంది. వివాహానికి సంబంధించిన పనులపై శ్రీధర్‌రెడ్డితో కలిసి బైక్‌పై భద్రాచలం వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. శ్రీధర్‌రెడ్డి మొండికుంట గ్రామంలో ఎన్నో ఏళ్లుగా మీ సేవ కేంద్రం నిర్వహిస్తూ ఓ దినపత్రిక రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. వారిద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని ఎస్ఐ సురేశ్‌కుమార్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఇవి చదవండి: 'నన్ను మోసం చేశాడంటూ..' యువకుడి ఇంటి ముందే.. యువతి -
కేబుల్‌రెడ్డి కథ
సుహాస్ టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జేఎస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘2000 సమయంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా కనిపిస్తారు సుహాస్’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగుల. -
రాష్ట్రంలో 5 వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లు
సాక్షి, అమరావతి: ఉల్లి, టమాటా రైతులకు ఏడాది పొడవునా గిట్టుబాటు ధర, పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్టు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎస్‌ఎఫ్‌పీఎస్) సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన 100 యూనిట్లు విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. దీంతో రూ. 84 కోట్ల అంచనాతో 5 వేల యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సోమవారం విజయవాడలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. సొసైటీ సీఈవో శ్రీధర్‌రెడ్డి, బీవోబీ డీజీఎం చందన్ సాహూ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్కో యూనిట్ అంచనా వ్యయం రూ.1.68 లక్షలని చెప్పారు. ప్రాజెక్టు వ్యయంలో ప్రభుత్వం 35 శాతం (రూ.29.40కోట్లు) సబ్సిడీగా భరిస్తుందని, లబ్ధిదారులు 10 శాతం (రూ.8.40 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందన్నారు.మిగిలిన 55 శాతం (రూ.46.20 కోట్లు) బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ఆహార వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడం, గ్రామీణ మహిళా సాధికారత ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలన్నారు. కర్నూలులో పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా ఒక్కో మహిళ సగటున రూ.12 వేల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని చెప్పారు. బి, సి గ్రేడ్ ఉల్లి, టమాటాలకు సైతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాయలసీమ జిల్లాల్లో 3,500 యూనిట్లు, మిగిలిన జిల్లాల్లో మరో 1,500 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంక్ డీజీఎం చందన్ సాహూ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులకు ఆర్థి క చేయూతనిచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బ్యాంక్ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఎఫ్‌పీఎస్ స్టేట్ లీడ్ సుభాష్ కిరణ్ కే, మేనేజర్ సీహెచ్ సాయి శ్రీనివాస్, బ్యాంక్ రీజనల్ మేనేజర్లు కె.విజయరాజు, పి.అమర్నాథ్రెడ్డి, ఎంవీ శేషగిరి, ఎంపీ సుధాకర్, రీజనల్ ఇన్చార్జి డి. రాజాప్రదీప్, డీఆర్ఎం ఏవీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ధరణి రద్దు చేస్తామని కాంగ్రెస్ ఎందుకంటోంది..?
-
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, నాటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నేత ఎం.శ్రీధర్‌రెడ్డి (77) కన్నుమూశా రు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో శ్రీధర్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యార్థి నేతగా ఉద్యమంలోకి.. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాడారు. ఆ సమయంలో యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఉన్న శ్రీధర్‌రెడ్డి.. ఉవ్వెత్తున ఉద్యమాన్ని రేపి, ముందుండి నడిపించారు. అప్పట్లో మర్రి చెన్నారెడ్డి ఏర్పాటు చేసిన సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి (ఎస్టీపీఎస్)కు పోటీగా తెలంగాణ ప్రజాసమితి (టీపీఎస్)ని ఏర్పాటు చేశారు. జనతాపార్టీ ఆవిర్భావం తర్వాత అందులో చేరి ఆలిండియా యువ జనతా విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్.జనార్ధనరెడ్డి ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఏపీ స్పోర్ట్ కౌన్సిల్ చైర్మన్‌గా పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రముఖుల దిగ్భ్రాంతి.. శ్రీధర్‌రెడ్డి మృతి తీరని లోటు అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన నాయకత్వ లక్షణాలున్న గొప్ప నేత అని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పారు. శ్రీధర్‌రెడ్డి మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, వీహెచ్, నిరంజన్, కోటూరి మానవతారాయ్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీధర్‌రెడ్డి నిఖార్సయిన తెలంగాణ పోరాట యోధుడని.. ఆయన మరణం రాష్ట్రానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకు డిగా రాజీలేని పోరాటం చేసిన శ్రీధర్‌రెడ్డి మర ణం తెలంగాణకు తీరని లోటు అని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. విలువల కోసం కట్టుబడిన శ్రీధర్‌రెడ్డి: సీఎం తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్‌రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో శ్రీధర్‌రెడ్డి చేసిన కృషిని స్మరించుకున్నారు. 1969 నాటి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన శ్రీధర్‌రెడ్డి.. తాను నమ్మిన విలువలకు కట్టుబడి, రాజీపడకుండా పనిచేశారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శ్రీధర్‌రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మ¯Œ వినోద్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. -
రైతులకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని బట్టబయలు చేశారని బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ తెలంగాణ గోబెల్స్‌గా మారిపోయి వానాకాలం వడ్లను కొనకుండా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరో పించారు. శనివారం జరిగిన కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. ఎఫ్‌సీఐతో ఒప్పందం చేసుకున్న బియ్యాన్నే ఇంతదాకా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేక పోయిందనే విషయాన్ని పీయూష్ తేటతెల్లం చేశారన్నారు. రైతులకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కేసీఆర్ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పా లన్నారు. వడ్లను కొనుగోలు చేయకపోతే ఆం దోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్‌పై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలన్నార -
నిర్మాత శ్రీధర్ రెడ్డి కన్నుమూత
‘సోగ్గాడి కాపురం, ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ చిత్రాల నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి ఇకలేరు. అనారోగ్యం కారణంగా శనివారం రాత్రి ఆయన మరణించారు. శ్రీధర్ రెడ్డి స్వస్థలం నెల్లూరు. సినిమా ఇండస్ట్రీపై ఉన్న మక్కువతో చెన్నై వెళ్లారు. శోభన్‌బాబు, జయసుధ జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడి కాపురం’ సినిమా నిర్మించారాయన. ఆ తర్వాత సుమన్, సౌందర్య హీరో హీరోయిన్లుగా వై. నాగేశ్వరావు దర్శకత్వంలో ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ చిత్రం నిర్మించారు. శ్రీధర్ రెడ్డి మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఆపరేషన్ బ్లూస్టార్ హీరో న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’దుర్ఘటనకు నేటి(గురువారం)తో ఏడాది పూర్తయింది. వైద్యురాలైన దిశను శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి గేటు వద్ద లారీ డ్రైవర్లు, క్లీనర్లు అపహరించి, లైంగికదాడి జరిపి దారుణంగా హతమార్చి, దహనం చేసిన ఘటనపై దేశం భగ్గుమంది. తర్వాత దిశను దహనం చేసిన షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దనే పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితులు మరణించిన సంగతి తెలిసిందే. దిశ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ఆమె జీవితంలో జరిగిన అత్యంత విషాద క్షణాలను సినిమాగా తీయడంపై ఆమె తండ్రి, మాజీ సైనికుడు శ్రీధర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను చట్టపరంగా ఆపేందుకు న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. రిజర్వ్ ఫోర్స్‌లో సేవలు! న్యాయపోరాటం చేస్తున్న నేపథ్యంలో దిశ తండ్రి, మాజీ సైనికుడు శ్రీధర్‌రెడ్డితో ‘సాక్షి’మాట్లాడింది. 1981 నుంచి 1987 వరకు శ్రీధర్‌రెడ్డి సైన్యంలో పనిచేశారు. పంజాబ్ కపుర్తలాలోని 12 ఆర్మ్డ్ రెజిమెంట్‌లో ఆయన విధులు నిర్వహించారు. 1984లో అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టింది. ఈ పోరులో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఓ వైపు యుద్ధం జరుగుతుండగానే రిజర్వ్ ఫోర్స్ కింద 12వ ఆర్మ్డ్ రెజిమెంట్ పనిచేసింది. నేరుగా యుద్ధక్షేత్రంలోకి వెళ్లకపోయినా ఆ క్షణంలో అవసరమైతే ప్రాణాలర్పించేందుకు ఈ రెజిమెంట్ సిద్ధమైంది. అలాంటి తనకు ఈ సమాజం ఏమిచ్చిందని శ్రీధర్‌రెడ్డి వాపోయారు. ఇలాంటి మృగాల కోసమా తాను సరిహద్దులో గుండెలడ్డుపెట్టి పహారా కాసింది? అని ఆవేదన వ్యక్తం చేశారు. నోరులేని ఎన్నో మృగాలకు వైద్యం చేసి ప్రాణం పోసిన తన కూతురు మానవ మృగాల చేతిలో ప్రాణాలు కోల్పోతుందని ఎన్నడూ ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. -
దీనిని మేమంతా స్వాగతిస్తున్నాం: మంత్రి
సాక్షి, అనంతపురం: పరిపాలన వికేంద్రీకరణకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఆర్డీఏ చట్టం రద్దును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయమని, ఇందుకు మూడు రాజధానులు ఆయన లక్ష్యం అన్నారు. అదే విభజన గాయాలు మానాలంటే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ తథ్యమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి డ్రామాలు ఆడారని, అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని మంత్రి ధ్వజమెత్తారు. రైతుల కడుపు కొట్టి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. సీఎంజగన్ వల్లే ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమోందని, రాయలసీమలో హైకోర్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. నిపుణుల నివేదిక మేరకే మూడు రాజధానుల నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: మూడు రాజధానులకు రాజముద్ర పడిందిలా..) పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దును గవర్నర్ ఆమోదించడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి శుభ సూచకమని ఆనందం వ్యక్తం చేశారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికై కర్నూలును న్యాయ రాజధానిగా గుర్తించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. రాయలసీమ వాసుల తరుపున సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుకుంటున్నానని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్సార్ కలలుకన్న రాయలసీమ, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి తీరుతామన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు అవినీతితో అమరావతిని నిర్మించాలన్న కలలు కల్లలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ: పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆమె హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దుకు శుక్రవారం గవర్నర్ ఆమోదం తెలపడాన్ని ఆమె స్వాగతిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో ఉండడం వల్ల ఎంతగానో నష్టపోయామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పటికీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటులో ఉన్నాయని, మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఉండాలనే ఏకైక లక్ష్యంతోనే మూడు రాజధానులను సీఎం జగన్ తీసుకొచ్చినట్ల ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని, ఏపీలో మూడు రాజధానులు ఎంతో అవసరమన్నారు. శాసనమండలిలో బిల్లులు ఆమోదం పొందకుండా చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన గవర్నర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చారిత్రక అవసరమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. -
ఇలాంటి రాక్షసుల కోసమా.. పహారా కాసింది?
సాక్షి, హైదరాబాద్ : దేశం నీకు ఏమిచ్చిందన్నది కాదు.. దేశానికి నువ్వు ఏమిచ్చావు అన్నది ముఖ్యం అంటారు పెద్దలు. సైన్యంలో పనిచేసి దేశానికి సేవలందించే వీర జవానుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఒకవేళ దేశ సేవలో అసువులుబాసితే అతని త్యాగానికి సెల్యూట్ చేస్తాం. అమరుడంటూ కీర్తిస్తాం. దిశ తండ్రి కూడా ఓ వీరసైనికుడే. కానీ ఆయనకు నలుగురు కీచకులు మిగిల్చిందేమిటి? తన గారాలపట్టి, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని అన్యాయంగా చిదిమేశారు. పైశాచికత్వంగా తెగబడి ప్రాణాలు తీసి కాల్చేశారు. నా గుండె బరువు ఎన్నటికీ దిగదు... దిశ నిందితుల ఎన్కౌంటర్ తరువాత ‘సాక్షి’ఆమె తండ్రి శ్రీధర్‌రెడ్డిని పరామర్శించింది. నలుగురు నిందితులు ఎన్కౌంటర్లో మరణించడాన్ని ఆయన స్వాగతించారు. పోలీసుల పనితీరును అభినందిస్తున్నానని, వారికి కృత జ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నేను దేశంపై ప్రేమతో 1981 లో సైన్యంలో చేరా. అహ్మద్‌నగర్‌లో శిక్షణ తర్వాత అంబాలాలో పోస్టింగ్ ఇచ్చారు. తరువాత పంజాబ్‌లోని కపుడ్తలాలో పోస్టింగ్. అదే సమయంలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’కూడా జరిగింది. అప్పుడు పంజాబ్‌లో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఆపరేషన్ మొదలైందని మాకు సందేశం అందింది. పలు రెజిమెంట్ల నుంచి వెళ్లాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. సిద్ధంగా ఉండాలని, రిజర్వు ఫోర్సు గా తరువాత వెళ్లాల్సింది మా యూనిట్ సభ్యులేనని ఆదేశాలు వచ్చాయి. నాతోటి వారితో సహా సిద్ధంగా ఉన్నాం. మేము ఆ ఆపరేషన్‌లో నేరుగా పాల్గొనలేదు కానీ రిజర్వు ఫోర్సు కిం ద పని చేశాం. సైన్యంలో ఆరేళ్లపాటు సేవలందించా. ఏ సైనికుడూ ప్రాణాల కోసం ఎప్పుడూ బాధపడడు. నేను కూడా ఎప్పుడూ భయపడలేదు. గుండెనిండా ధైర్యం కలవాడిని. కా నీ నేడు నా గుండె కూడా బరువెక్కింది. ఎన్ని చేసినా ఆ గుండె బరువు దిగదు’’అని అన్నారు. కీచకులకు త్వరగా శిక్షలు పడాలి.. ‘‘మాలాంటి సైనికులు సరిహద్దులో కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెడతారు. మేం అందరి కోసం పాటుపడతాం. మాకు కుల, మత, ప్రాంతీయ భేదాలు ఉండవు. కానీ మాలాంటి సైనికుల గుండెలు కూడా బరువెక్కేలా చేస్తున్న ఇలాం టి పిశాచాలు దేశంలో స్వేచ్ఛగా తిరుతుండ టం బాధాకరం. ఇలాంటి వారి కోసమా మే ము ప్రాణాలు పణంగా పెట్టి పని చేసింది? అన్న ఆలోచన మమ్మల్ని మరింత బాధకు గురిచేస్తోంది. అందుకే ఇలాంటి రాక్షసులకు త్వర గా శిక్షలు పడేలా ప్రస్తుతమున్న చట్టాలను స వరించాలి. కొత్త చట్టాలు తీసుకురావాలి. నిర్భ య కేసులో ఏడేళ్లు గడిచినా నేటికీ దోషులకు శిక్ష పడలేదు. యూపీలోని ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని నిందితులు బెయిల్‌పై వచ్చి మరీ చంపడం అత్యంత హేయం. అం దుకే ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని చట్టపరంగా, శీఘ్రంగా శిక్షించేలా చట్టాలను బలోపేతం చేయాలి’’అని దిశ తండ్రి ప్రభుత్వాలను కోరారు. -
‘తండ్రీకొడుకులు నాటకాలు ఆడుతున్నారు’
సాక్షి, సంగారెడ్డి : ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముల్లు గుచ్చితే పంటితో తీస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శించారు. సంగారెడ్డిలో శనివారం జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు రఘునందన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీధర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కార్మికులను డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరించడం దారుణం అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో రాయితో కొడితే.. మనం ఇటుకతో కొడదామన్న కేసీఆర్ ఇప్పుడు చేస్తుందేమిటి అని ప్రశ్నించారు. ‘కార్మికులు ఏమైనా మీ ఫాం హౌజ్‌లో వాటా అడిగారా సీఎం. తండ్రేమో జీహెచ్ఎమ్సీ నుంచి నిధులిస్తామంటే.. కొడుకు కేటీఆర్ మాత్రం నిధుల కేటాయింపు సాధ్యం కాదంటాడు. తండ్రీ కొడుకులు కలిసి నాటకాలు ఆడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు 45 రోజులకు ముందే నొటీసులిచ్చి సమ్మెకు వెళ్లారని పేర్కొన్నారు. ఐఏస్ అధికారి సోమేశ్ కుమార్ కార్మికులు వినకుంటే తొలగిస్తామని బెదిరిస్తున్నారని, ఇప్పటి వరకూ పోలీసు కానీస్టేబుల్ ఉద్యోగాలు తప్ప మరే ఉద్యోగాల భర్తీ జరగలేదని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ పిరికిపందల సంఘం ఆధ్యక్షుడని ఎద్దేవా చేశారు. సకల జనుల సమ్మెతో సమైక్యాంధ్రులను వణికించిన చరిత్ర ఆర్టీసీ కార్మికులదని అన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత బాగుపడింది ఆంధ్రా కాంట్రాక్టర్లని, మీకు మేము అండగా ఉంటాం.. ఎవరు భయపడవద్దని రఘునందన్ భరోసా ఇచ్చారు. చదవండి : లైవ్ అప్డేట్స్: నిలిచిన బస్సులు.. ప్రయాణికుల కష్టాలు -
అన్ని సమస్యలూ ఎదుర్కొన్నా
‘‘ఒక కొత్త నిర్మాత ఎదుర్కొన్న అన్ని సమస్యలను నేనూ ఎదుర్కొన్నాను. వీటన్నింటినీ ఒక లెర్నింగ్ ప్రాసెస్‌గా భావించాను. అందరికీ వినోదం కావాలి. కానీ చాలామందికి సినిమాలంటే చిన్నచూపు’’ అన్నారు నిర్మాత ఎం. శ్రీధర్ రెడ్డి. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో కిశోర్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మాది అనంతపురం. ఇంజినీరింగ్ పూర్తి చేశాను. కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేశాను. సినిమాలపై ఆసక్తితో నిర్మాణరంగంలోకి వచ్చాను. చిన్నతనం నుంచే నిర్మాణరంగంపై ఆసక్తి ఉంది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు గారు నాకు ప్రేరణ. సినిమాల డిస్ట్రిబ్యూషన్ కూడా చేశా. లాభ నష్టాలను చూశాను. ఈ అనుభవంతో ఒక సినిమాను నిర్మించాలనుకుని ఈ సినిమా చేశాను. ముందు మూడున్నర కోట్ల బడ్జెట్ అనుకున్నాం. కానీ దాదాపు ఆరుకోట్లు అయ్యింది. అయితే అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘రాయ్ లక్ష్మీకి మంచి క్రేజ్ ఉంది. అందరికీ నచ్చేలా ఉంటుంది ఈ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా మంచి ఎమోషన్ కూడా ఉంది. టీమ్ అందరూ బాగా సహకరించారు. హీరో హీరోయిన్లు బాగా నటించారు. మధునందన్, ప్రవీణ్‌ల పాత్రలు నవ్విస్తాయి. మరో నాలుగు ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు శ్రీధర్ రెడ్డి. -
‘వెయ్యి అబద్ధాలు ఆడినా రాహుల్ పెళ్లి చేయలేరు’
సాక్షి, హైదరాబాద్ : రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు అంశానికి సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదికను చూసి కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యిందని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆ నివేదికతో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగి పోయిందన్నారు. గురువారం మీడియా మాట్లాడిన శ్రీధర్ రెడ్డి.. ‘ ఇన్ని రోజులుగా రఫేల్ డీల్‌పై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలకు వత్తాసు పలుకుతున్న ప్రతిపక్ష నేతల మాటలన్నీ విష ప్రచారం అని తేలిపోయింది. రఫేల్‌పై ఎలాంటి తప్పులు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లుగా కాంగ్రెస్ వ్యవహారశైలి ఉంది. తాజా కాగ్ నివేదిక కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటింది. ఈ నివేదికలో 16 అంశాలు ప్రస్తావించారు. రాడార్, చీకట్లో శత్రువులను ఛేదించే పనితీరు విమానాలు ఇందులో ఉన్నాయి. అబద్ధాలు మాట్లాడమే పనిగా పెట్టుకున్న రాహుల్‌కు నిజాలు మింగుడు పడటం లేదు. రఫేల్‌పై మోదీకి మరకపూయాలని రాహుల్ చూశారు. అబద్ధాన్ని గట్టిగా ప్రచారం చేసి అధికారంలోకి రావాలని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి అబద్ధాలు ఆడినా రాహుల్ గాంధీ పెళ్లి చేయలేరు. విష ప్రచారం చేసి అధికారంలోకి రాలేరు. కమీషన్లు రావని అప్పట్లు రఫేల్ విమానాలను కొనుగోలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. అవసమరి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చెప్తే వాటిని మేము కొనుగోలు చేశాం. రాహుల్, సోనియా, రాబర్ట్ వాద్రాలు ట్యాక్స్ ఎగ్గొట్టి దేశాన్ని దోచుకున్నారు. రాష్ట్రాలను దేశాన్ని దోచుకున్నది కాంగ్రెస్ పార్టీ’ అని తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ చదవండి: ధర 2.86 శాతం తక్కువే -
కాంగ్రెస్‌లో చంద్రబాబు కోవర్ట్ రేవంత్: శ్రీధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చంద్రబాబు కోవర్ట్ అని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని విమర్శిస్తే పెద్దనాయకుడు అవుతానని రేవంత్‌రెడ్డి భ్రమపడుతున్నారని, మోదీని విమర్శించే హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు. మరోవైపు అమిత్‌షా ఒక్కసారి రాష్ట్రానికి వస్తేనే కాంగ్రెస్ వణికిపోతోందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
టీఆర్ఎస్కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టే’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఎంఐఎం (మజ్లీస్) పార్టీ కి వేసినట్టేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓల్డ్‌సిటీ ప్రాంతానికి పరిమితమైన ఒక పార్టీ నేత మాట్లాడుతూ కర్ణాటకలో కుమారస్వామి సీఎం కాగా లేనిది.. తెలంగాణలో తాను సీఎం కాలేనా అన డం అర్థంలేని మాటలన్నారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరు మార్చుకోండి
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరు మార్చి గాంధీ భవన్ అని పెట్టుకోవాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి హితవు పలికారు. విలేకరులతో మాట్లాడుతూ..మానిపోయిన గాయాలను మళ్లీ తెరమీదకు తెస్తూ మీ స్వార్థ రాజకీయాల కోసం తెలుగు దేశం, కాంగ్రెస్ నాయకులు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడతారా అని ప్రశ్నించారు. విధానం, సిద్ధాంతం లేని పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనేనని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో సొంతంగా పోటీ చేసే దమ్ముందా అని సూటిగా అడిగారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని వ్యాక్యానించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ నిన్న మాట్లాడుతూ కర్నాటకలో కుమారస్వామి సీఎం అవ్వగా లేనిది తాను సీఎం కాలేనా అన్న విషయాన్ని గుర్తు చేశారు. అక్బరుద్దీన్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. పాతనగరంలో కేవలం ఏడు స్థానాలకు పరిమితమైన ఎంఐఎం పార్టీ నుంచి ఏవిధంగా సీఎం అవుతారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ, పాముకు పాలుపోసి పెంచిపోషిస్తుందని ఎంఐఎం నుద్దేశించి వ్యాఖ్యానించారు. మళ్లీ తెలంగాణాలో రజాకార్ల పాలన పునరుద్దరించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. సెక్యులరిజం అంటున్నటీఆర్ఎస్ ఇప్పుడు ఎంఐఎం మాటలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బూటకపు సెక్యులరిజాన్ని తెలంగాణ ప్రజలు నమ్మకూడదని, నిజమైన సెక్యులరిజం ఉందంటే అది బీజేపీలోనే ఉందని అన్నారు. -
అధ్వానంగా ఆస్పత్రుల నిర్వహణ: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ అధ్వానంగా మారిందని శుక్రవారం బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా ఆస్పత్రి భవనం పెచ్చులూడుతూ రోగులు గాయపడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరో పించారు. కాలుకు ఆపరేషన్ కోసం రెండ్రోజుల క్రితం ఉస్మానియాకు వచ్చిన రోగి ఇలాగే గాయపడి ఐసీయూలో చేరాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటన ఆస్పత్రుల నిర్వహణ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఓ నిదర్శనమన్నారు. నేడు కృష్ణా–తుంగభద్ర సంగమంలో.. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ అస్తికలను ఈ నెల 25న అలంపూర్ కృష్ణా–తుంగభద్ర సంగమంలో నిమజ్జనం చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు. బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఉదయం 7 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి నిమజ్జన యాత్ర ప్రారంభమవుతుందన్నారు. -
‘ముందస్తు’ రాజకీయ జిమ్మిక్కు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘ప్రతి రోజూ ముందస్తు ఎన్నికలు.. ఎప్పుడొస్తాయో.. నాకు అధికారం వస్తదా.. నా కుమారుడికి అధికారం వస్తదా అనే ఆలోచనే తప్ప.. ప్రజల ఆరోగ్యం గురించి పట్టింపే లేద’న్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆసుపత్రిలోనే కాలు విరిగి వచ్చిన వ్యక్తి మీద పెచ్చులూడి మీద పడితే ఐసీయూలో చేర్చారు, హైదరాబాద్‌లోనే ఇట్లా ఉంటే ఊర్లలో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డాక్టర్లు, నర్సులు భయంగా పనిచేయాల్సిన పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు. సీఎం కంటికి ఢిల్లీ వెళ్లి వైద్యం చేసుకుంటారు కానీ ఊర్లలో ఉన్న ప్రజలు ఉస్మానియా ఆసుపత్రికి కూడా రావొద్దా అని సూటిగా అడిగారు. రోజూ కొత్తకొత్త ప్రకటనలు మాత్రం చేస్తారురూ.200 కోట్లు ఇచ్చినట్లుగానే ఇచ్చి రూ.6 కోట్లు మాత్రమే శాంక్షన్ చేశారు. చివరికి రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. పండుగలకు పబ్బాలకు, ఇఫ్తార్లకు వందల కోట్లు ఖర్చు పెట్టే మీరు ఆసుపత్రులకు డబ్బులు కేటాయించడానికి చేతులు రావడం లేదా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన డయాలిసిస్ సెంటర్లకు రిబ్బన్ కట్ చేసి పబ్బం గడపుకుంటున్నారని విమర్శించారు. ప్రగతి నివేదన సభకు రూ.200 కోట్లు ఖర్చు పెడతారు కానీ అందులో పదిశాతం ఉస్మానియా ఆసుపత్రికి ఇవ్వరా అని సూటిగా అడిగారు. సీఎం సామాజిక వర్గానికి చెందిన కార్పొరేట్ ఆసుపత్రుల యజమాని మాత్రం బిల్డింగ్‌ల మీద బిల్డింగ్లు కడుతున్నారని తెలిపారు. ఎన్నికలు రాగానే కేంద్రాన్ని తిట్టడం కేసీఆర్‌కు సాధారణమైపోయిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండా కనీసం పూట గడవదు. అన్నీ తెచ్చుకుని కేంద్రంపైనే విమర్శలా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి బాలేదు కాబట్టే బీజేపీని విమర్శించడం మొదలు పెట్టారని అన్నారు. ముందస్తు హడావిడి అంతా రాజకీయ జిమ్మిక్కని, ముందస్తు రాదు.. టీఆర్ఎస్, బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.