మే నెల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
నెల్లూరు రూరల్, న్యూస్‌లైన్: మే నెల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు అయ్యప్పగుడి సెంటర్‌లోని రాధాకృష్ణ కల్యాణమండపంలో ఆదివారం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీధర్‌రెడ్డి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారన్నారు.
ఆయన విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు. సీమాంధ్రకు మంచి రోజులు వస్తున్నాయని, రెండు నెలల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. తెలుగువారిని రెండు ముక్కలు చేసిన సోనియాకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
చంద్రబాబు ఎన్ని ప్రజాగర్జనలు నిర్వహించినా ప్రజాభిమానం పొందలేరన్నారు. నెల్లూరులో నిర్వహించిన బాబు సభకు ప్రలోభపెట్టి జనసమీకరణ చేశారన్నారు. తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మంలో నిర్వహించిన సభలోనూ జగన్‌మోహన్‌రెడ్డి తాను సమైక్యవాదినని చెప్పడం గర్వించదగిన విషయమన్నారు. కాంగ్రెస్ నుంచి వలసలు ఎక్కువయ్యాయని, వైఎస్సార్‌సీపీలో అవకాశం లేని వారు టీడీపీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. సీమాంధ్రను చంద్రబాబు సింగపూర్ చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ స్వర్ణయుగం సాధ్యమన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసింది టీడీపీయేనన్నారు.
ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీధర్‌రెడ్డి పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించారని, ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా జగన్‌మోహన్‌రెడ్డి లెక్క చేయలేదన్నారు.
రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు జవాబుదారిగా ఉంటానన్నారు. 30 ఏళ్లుగా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న తనను ఎమ్మెల్యే చేస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
సిటీ సమన్వయకర్త పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ కార్పొరేషన్‌ను ఎమ్మెల్యే వివేకానందరెడ్డి తన గుప్పెట్లో పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ విలువైనదని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
సిటీ కన్వీనర్ ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ శ్రీధర్‌రెడ్డి విజయానికి కృషి చేస్తానన్నారు. పదవులు ఉన్నా, లేకున్నా పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. మేకపాటి సోదరుల వెంటే తన పయనం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నెల్లూరు రూరల్ మండల కన్వీనర్ పిగిలం నరేష్‌యాదవ్, మాజీ కార్పొరేటర్లు తాటి వెంకటేశ్వరరావు, సన్నపరెడ్డి పెంచలరెడ్డి, నెల్లూరు మదన్‌మోహన్‌రెడ్డి, నాయకులు ఎస్‌డీ సలీంఅహ్మద్, సన్నపరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో పలువురి చేరిక
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమక్షంలో పలువురు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి రాజమోహన్‌రెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో మాజీ కార్పొరేటర్లు రావులపల్లి వెంకటజ్యోతి, సూళ్లూరు రమాదేవితో పాటు సూళ్లూరు దేవరాజులు, పడారుపల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జి పాతపాటి ప్రభాకర్‌రెడ్డి అలియాస్ పుల్లారెడ్డి, సిద్ధార్ధ స్కూలు అధినేత సురేష్‌రెడ్డి, భక్తవత్సలనగర్ ప్రాంత నేత యనమల వీరారెడ్డి, వేదాయపాళెం ప్రాంత టీడీపీ నేత ఎంపీ కృష్ణారెడ్డి, హరనాథపురం కాంగ్రెస్ నేతలు మారంరెడ్డి కుమార్, మోహన్‌రావు తదితరులు ఉన్నారు.