జెడ్పీ చైర్మన్ ఎన్నికను నిష్పక్షపాతంగా జరపండి | The election of the chairman of the nonpartisan group repository | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్మన్ ఎన్నికను నిష్పక్షపాతంగా జరపండి

Published Sun, Jul 13 2014 2:38 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

The election of the chairman of the nonpartisan group repository

సాక్షి, నెల్లూరు: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను ఆదివారం నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నాయకుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. శనివారం సాయంత్రం పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, నెల్లూరు మేయర్ అబ్దుల్‌అజీజ్‌తో ఎంపీ మేకపాటి కలెక్టర్ శ్రీకాంత్‌ను కలిశారు.

అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలన్నారు. ఈ నెల 5న జరిగిన ఘటన పునరావృతం కాకుండా చూడాలని కోరారు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని, జిల్లా అధికారిగా  అలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని వారు కలెక్టర్‌ను కోరారు. తమపార్టీ సభ్యులు, నేతల నుంచి శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాదని వైఎస్సార్‌సీపీ నేతలు  కలెక్టర్ శ్రీకాంత్‌కు హామీ ఇచ్చారు. ఎన్నికను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సజావుగా నిర్వహిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement