విజయభేరి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ మరోసారి ఆధిక్యత చాటుకుంది. ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీ సీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో లాగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూడా నెల్లూరువాసులు వైఎస్సార్‌సీపీకి ఆధిక్యతనిచ్చారు. జిల్లాలోని 10 శాసనసభ స్థానాల్లో ఏడు వైఎస్సార్‌సీపీ గెలవగా, టీడీపీ మూడు స్థానాలు గెలిచింది. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో వైస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి 13,478 పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
తిరుపతి లోక్‌సభ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరప్రసాదరావు 37,425 పైచిలుకు మెజారిటీతో గెలిచారు. తిరుపతి నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచిన చింతామోహన్‌కు కేవలం 33,333 ఓట్లు మాత్రమే వచ్చి ఆయన డిపాజిట్ గల్లంతయింది. ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి తొలిరౌండ్ నుంచి చివరిగా 18వ రౌండ్ ముగిసేప్పటికి 31,412 ఓట్ల ఆధిక్యతతో టీడీపీ అభ్యర్థి కన్నబాబు మీద భారీ విజయం దక్కించుకున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనం రామనారాయణరెడ్డి 8,927 ఓట్లు మాత్రమే దక్కించుని డిపాజిట్ కోల్పోయారు.
నెల్లూరు రూరల్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తొలి రౌండ్ నుంచి ఆధిక్యత చాటుతూ బీజేపీ అభ్యర్థి సురేష్‌రెడ్డి మీద 25,124 ఓట్ల ఆధిక్యతతో విజయకేతనం ఎగుర వేశారు.
నెల్లూరు సిటీ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ టీడీపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మీద తొలి రౌండ్ నుంచి మెజారిటీ సాధిస్తూ 19,820 ఓట్లతో విజయఢంకా మోగించారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీకి దిగిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి తొలి ఆరు రౌండ్లలోనే భారీ ఆధిక్యత సాధించి చివరగా 16వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 5,447 ఓట్ల మెజారిటీతో విజ యం సాధించారు. ఇక్కడి నుంచి టీడీపీ పొ లిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఇదే ని యోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఓటమిపాలయ్యారు. 2012లో జరిగిన కోవూ రు ఉపఎన్నికలో సైతం సోమిరెడ్డి ఓటమి చ విచూశారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్ప టి నుంచి సూళ్లూరుపేట, గూడూరు, వెంకట గిరి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మె జారిటీ సాధిస్తూ వచ్చింది. ఈ నియోజకవర్గాల్లో ఐదో రౌండ్లు ముగిసినప్పటి నుంచి వై ఎస్సార్‌సీపీ మెజారిటీలు ప్రారంభమయ్యా యి. ఉత్కంఠ భరితంగా సాగిన లెక్కింపులో సూళ్లూరుపేటలో 5 నుంచి 13వ రౌండ్ దాకా వైఎస్సార్‌సీపీ మెజారిటీ చాటుతూ వచ్చింది. 14, 15, 16 రౌండ్లలో టీడీపీ స్వల్ప ఆధిక్యత దక్కించుకుంది. దీంతో ఈ స్థానంలో టీడీపీ గెలుపు ఖాయమనే సూచనలు కనిపించాయి. అయితే 18, 19 రౌండ్లలో భారీ ఆధిక్యత ల భించి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పరసారత్నం మీద వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిలివేటి సం జీవయ్య 3,726 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గూడూరు నియోజకవర్గంలో సైతం తొలి నుంచి ఆరు రౌండ్ల వరకు టీడీపీ అభ్యర్థి డాక్టర్ జ్యోత్స్నలత మెజారిటీ సాధి స్తూ వచ్చారు.
7వ రౌండ్ నుంచి 19వ రౌండ్ వరకు వైస్సార్‌సీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ఆధిక్యత చాటుతూ వచ్చారు. చివరి రౌండ్ ముగిసేప్పటికి సునీల్‌కుమార్ 9,088 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వెం కటగిరిలో 1 నుంచి 6వ రౌండ్ దాకా 8,146 ఓట్ల ఆధిక్యత సాధిస్తూ వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు 9వ రౌండ్ నుంచి వెనుకపడ్డారు. ఆ తర్వాత అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో చివరిగా 20వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేప్పటికి టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ 5,560 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. కావలిలో తొలి రౌండ్ నుంచి స్వల్ప మెజారిటీతో విజయ ప్రస్థానం ప్రారంభించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి 18వ రౌండ్ ముగిసే సమయానికి 4,971 ఆధిక్యతతో విజయం సాధించారు.
టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు ఓటమి పాలవుతారని ఆ పార్టీ అంచనా వేయలేకపోయింది. కోవూరులో తొలి రౌండ్ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ప్రసన్నకుమార్‌రెడ్డి స్వల్ప ఆధిక్యత సాధిస్తూ వచ్చినా 12వ రౌండ్ నుంచి టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధిక్యత బాట పట్టారు. చివరి రౌండ్ ముగిసే సమయానికి ఆయన 7,942 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఉదయగిరి నియోజకవర్గంలో తొలి నుంచి ఉత్కంఠ భరితంగా కౌంటింగ్ సాగి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రమోహన్‌రెడ్డి మీద టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావు 4,673 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
రెండు ఎంపీలు వైఎస్సార్‌సీపీకే
నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగిన కాంట్రాక్టర్ ఆదాల ప్రభాకరరెడ్డి విజయం మీద పూర్తి ధీమాగా వ్యవహరించారు. విజయం కోసం కోట్ల రూపాయలు కుమ్మరించారు. దీంతో ఇక్కడ వై ఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి ఆదాల మధ్య తీవ్ర స్థా యిలో పోరు నడిచింది. కౌంటింగ్ ముగిసేప్పటికి రాజమోహన్‌రెడ్డి 14వేల పై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు. తిరుప తి లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావుకు బీజేపీ అభ్యర్థి జయరాం కంటే తొలి రెండు రౌండ్లలో వెనుకపడ్డారు. మూడో రౌం డ్ నుంచి వరప్రసాద్ ఆధిక్యత పెరుగుతూ వచ్చింది.
ఈ నియోజకవర్గం పరిధిలోని తి రుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే వరప్రసాద్‌కు ఎక్కువ ఓట్లు లభించా యి. దీంతో ఆయన చివరకు 35వేల పైచిలు కు మెజారిటీతో విజయం దక్కించుకున్నా రు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ డాక్టర్ చింతామోహన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన ఈ సారి వరప్రసాద్ చేతిలో పరాజయం చెందారు.