Raja mohan reddy
-
ఏయూలో ‘మేకపాటి గౌతంరెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్’
ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘మేకపాటి గౌతంరెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ అండ్ దమ్మ’ నిర్మాణానికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి భూమి పూజ చేశారు. శనివారం ఉదయం ఏయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అసెంబ్లీ మందిరం వెనుక భాగంలో నూతనంగా మహాబోధి సొసైటీ నిర్వహించే ఈ కేంద్రం నిర్మాణాన్ని భూమి పూజతో ప్రారంభించారు. భవనం నిర్మాణానికి అవసరమైన రూ.1.4 కోట్లను రాజమోహన్‌రెడ్డి అందించనున్నారు. భూమి పూజ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏయూలో ఏర్పాటవుతున్న ఇలాంటి మంచి కార్యక్రమంలో తాను భాగం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. నగరం మధ్యలో విశాఖ ప్రజలకు ఉపయుక్తంగా ఇంతటి సువిశాల ప్రాంగణంలో మెడిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన గొప్పదన్నారు. దీనికి తన కుమారుడు మేకపాటి గౌతంరెడ్డి పేరు పెట్టడం సంతోషకరమన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ధమ్మ చార్య విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖను రాజధానిగా చేస్తే అంతర్జాతీయ ఖ్యాతి విశాఖ మన రాజధాని అయ్యేలా అందరూ చూడాలని మాజీ ఎంపీ మేకపాటి కోరారు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడే విశాఖ రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసి అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసి ఉంటే ప్రజలంతా సంతోషించేవారని చెప్పారు. అలా జరిగి ఉన్నట్లయితే అంతర్జాతీయ నగరంగా విశాఖ ఈ పాటికే రూపుదిద్దుకునేదని, ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేయడం మంచి పరిణామమన్నారు. బహుశా న్యాయ వ్యవస్థ సైతం దీనికి సహకరిస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. -
కేంద్ర నిధుల పథకాలపై ప్రత్యేక దృష్టి
నెల్లూరు(రెవెన్యూ): కేంద్రప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో అమలవుతున్న పింఛన్లు, ఉపాధి హామీ తదితర పథకాలు దుర్వినియోగం కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక గోల్డెన్ జూబ్లీహాల్లో నిర్వహించిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కేంద్ర నిధులతో అమలవుతున్న పథకాల అమలతీరు, నిధుల ఖర్చు తదితర అంశాలపై క్రమంతప్పకుండా సమీక్షించుకోవాలన్నారు. గతంలో కమిటీ సమావేశాలు సక్రమంగా జరగలేదన్నారు. ఇకపై ప్రతి 3 నెలలకు సమావేశం నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశానికి ప్రజాప్రతినిధులందరూ హాజరైతే పథకాల అమలుతీరుపై చర్చించవచ్చునన్నారు. సామాజిక పింఛన్ల విషయంలో అర్హులైన లబ్ధిదారులను తొలగించారన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ రూ.75గా ఉన్న పింఛన్‌ను రూ.200లకు పెంచారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రూ.200లను రూ.1,000లకు పెంచిందన్నారు. అయితే పరిశీలన పేరుతో అర్హులవి తొలగిస్తున్నారన్నారు. రాజకీయ కారణాలతో అర్హులను ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలు తమకు ఓట్లు వేయలేదనే సాకుతో అర్హుల పింఛన్లు తొలగించారన్నారు. కమిటీలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో మూడేళ్ల నుంచి వర్షాలు పూర్తిస్థాయిలో కురవలేదన్నారు. మెట్టప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయన్నారు. ఫ్లొరైడ్తో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారన్నారు. రాబోయే ఎండాకాలంలో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించలేకపోయిందన్నారు. ఇప్పటివరకు జిల్లాకు రూ. 962 కోట్లు మాత్రమే కేటాయించరన్నారు. పదికాలలపాటు గుర్తుండే పని ఒక్కటి చేపట్టలేదన్నారు. సంబంధిత మంత్రితో మాట్లాడి జిల్లాకు నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఆగస్టు 15లోపు ప్రతి పాఠశాల్లో మరుగుదొడ్లు నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జెడ్పీ చెర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ పింఛన్ల తొలగింపులో ఎంపీడీఓలపై ఒత్తిడి ఉందన్నారు. దాంతోనే ఎంపీడీఓలు పూర్తిస్థాయిలో చేయలేకపోతున్నారన్నారు. భూమి ఉందని అనేకమంది పింఛన్లు తొలగించారన్నారు. వాస్తవానికి వారికి భూమిలేదన్నారు. అటువంటి వారి పింఛన్లు పునరుద్ధరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ఎద్దడి నివారించేందుకు కొత్త బోర్లు మంజూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ ఎం. జానకి, డీఆర్డీఏ, డ్వామా పీడీలు చంద్రమౌళి, వెంకటసుబ్బయ్య, జెడ్పీ సీఈఓ ఎం. జితేంద్ర, హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరెడ్డి, కమిటీ సభ్యులు జి. ప్రసాద్‌రెడ్డి, రాజసులోచనమ్మ, వి. జయరామయ్య పాల్గొన్నారు. పింఛన్ల తొలగింపుపై గరంగరం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అర్హుల పింఛన్లు తొలగించారన్నారు. గ్రామ కమిటీల్లో సంఘసేవకులకు బదులు టీడీపీ కార్యకర్తలను నియమించారన్నారు. ఓట్లు వేయలేదనే కక్షతో పింఛన్లను తొలగించారన్నారు. దీనిపై ఎమ్మెల్యే కె. రామకృష్ణ కలుగజేసుకుని అనర్హుల పింఛన్లు మాత్రమే తొలగించారన్నారు. పింఛన్ల విషయంలో సీఎం కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. సీఎం కచ్చితంగా ఉన్నా.. స్థానిక నాయకులు పడనీయడం లేదని రామిరెడ్డి అన్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఎంపీ కలుగజేసుకుని సమస్య పెద్దది కాకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామ కమిటీలను రద్దుచేయాలి: రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే ఓటు వేయలేదనే సాకుతో పింఛన్లు తొలగించారు. ఈ విషయం అనేక పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితంలేదు. గ్రామ కమిటీలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కావలి నియోజకవర్గంలో వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటిపోయాయి. గతేడాది ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసిన వారికి ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. తీరప్రాంతాల్లోని గ్రామాల్లో మంచినీటిని సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలి. కావలి ప్రాంతంలో పంటల సాగుకు సోమశిల జలాలను నెలరోజులు అలస్యంగా విడుదల చేశారు. నెల రోజుల నీటిని చెరువులకు సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. వితంతువులను ఇబ్బందులు పెడుతున్నారు: - కిలివేటి సంజీవయ్య,ఎమ్మెల్యే నియోజకవర్గంలో వితంతువులకు పింఛన్లు తొలగించారు. గ్రామ కమిటీలు ఎదో ఒక సాకుచూపి సంతకం పెట్టడంలేదు. పింఛన్ల విషయంలో ఎంపీడీఓలకు ప్రత్యేక అధికారాలివ్వాలి. నియోజకవర్గంలో మంచినీటి సమస్యను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రోడ్లకు మరమ్మతులు చేయాలి. నూతన రోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీకి సంబంధించి పనులు అధికారుల పర్యవేక్షణలో పనులు జరగాలి. ఉపాధి నిధులు దుర్వినియోగమవుతున్నాయి. పేమెంట్లు సకాలంలో చెల్లించాలి. ఫ్లొరైడ్ నుంచి ప్రజలను కాపాడండి: -గౌతమ్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఆత్మకూరు ఆత్మకూరు నియోజకవర్గం వెనుకపడిన ప్రాంతం. మెట్టప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటడంతో ఫ్లొరైడ్ నీటిని ప్రజలు తాగాల్సి వస్తుంది. ఫ్లొరైడ్ నుంచి ప్రజలను కాపాడేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాల్లో మంచినీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. వాటికి త్వరగా మరమ్మతులు చేపట్టాలి. చేజర్ల మండలం కొలపనాయుడుపల్లిలో మంచినీటికి ప్రజలు నానా ఇబ్బందులుపడుతున్నారు. యుద్ధప్రాతిపదికన మంచీనీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి. పింఛన్ల కమిటీలు లేవు. పింఛన్ల పరిశీలన కమిటీలు ఎక్కడ నుంచి వచ్చాయి. అర్హులైన వారి పింఛన్లు తొలగించారు. కార్యాలయాల ఎదుట వందల సంఖ్యలో బాధితులు క్యూలో ఉంటున్నారు. తొలగించిన పింఛన్లను పునరద్ధరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు ఖర్చు చేస్తుంది: -కురుగొండ రామకృష్ణ, వెంకటగిరి ఎమ్మెల్యే జిల్లాలో పింఛన్ల పంపిణీకి సంబంధించి కేంద్రం ఇస్తున్నది కేవలం రూ.47 లక్షలు మాత్రమే. రాష్ట్రం రూ. 2కోట్లు ఖర్చు చేస్తుంది. జిల్లాలో చెరువుల అక్రమణలు అధికంగా ఉన్నాయి. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోని పార్టీలకతీతంగా అక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలి. -
వైఎస్సార్సీపీలో జిల్లాకు కీలక పదవులు
సాక్షి, నెల్లూరు: పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్రస్థాయి కమిటీల పునర్య్యవస్థీకరణలో జిల్లాకు కీలక పదవులు దక్కాయి. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడి గా, తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ను కేంద్ర పాలక మండలి సభ్యుడిగా నియమించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీ అధికార ప్రతినిధిగా, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇటీవల వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన మేరిగ మురళీధర్‌ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా ఏడు చోట్ల ఎమ్మెల్యేలుగా పార్టీ నాయకులే ఉన్నారు. నెల్లూరు, తిరుపతి ఎంపీలుగా కూడా వైఎస్సార్సీపీ నేతలే కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వైఎస్సార్సీపీనే దక్కించుకుంది. ఈ క్రమంలోనే పార్టీని మరింత పటిష్టం చేసేందుకు జిల్లాకు చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. -
జెడ్పీ చైర్మన్ ఎన్నికను నిష్పక్షపాతంగా జరపండి
సాక్షి, నెల్లూరు: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను ఆదివారం నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నాయకుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. శనివారం సాయంత్రం పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, నెల్లూరు మేయర్ అబ్దుల్‌అజీజ్‌తో ఎంపీ మేకపాటి కలెక్టర్ శ్రీకాంత్‌ను కలిశారు. అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలన్నారు. ఈ నెల 5న జరిగిన ఘటన పునరావృతం కాకుండా చూడాలని కోరారు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని, జిల్లా అధికారిగా అలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని వారు కలెక్టర్‌ను కోరారు. తమపార్టీ సభ్యులు, నేతల నుంచి శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాదని వైఎస్సార్సీపీ నేతలు కలెక్టర్ శ్రీకాంత్‌కు హామీ ఇచ్చారు. ఎన్నికను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సజావుగా నిర్వహిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. -
అధికార దుర్వినియోగాన్ని సహించం
సాక్షి, నెల్లూరు: ‘ప్రజాస్యామ్యాన్ని గౌరవించాం..అధికార పార్టీ కవ్విం చినా, మహిళలని కూడా చూడకుండా దాడులకు దిగినా ఓపికపట్టాం..మా సహనాన్ని జిల్లా ప్రజలందరూ చూశారు. ఇంకా అధికార దుర్వినియోగం జరుగుతుంటే సహించేది లేదు’ అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్, ఎస్పీ ఆత్మపరిశీలన చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషిచేస్తే గౌరవం ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ పరిశీలకుడి సమక్షంలో జెడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్, జెడ్పీ చైర్మన్ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన రభస టీడీపీ దుర్మార్గానికి, అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. జిల్లా పరిషత్‌లో 31 మంది సభ్యులతో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజార్టీ ఉండగా, టీడీపీకి 15 మంది సభ్యులు మాత్రమే ఉన్నారన్నా రు. టీడీపీ ప్రలోభాల నేపథ్యంలో ఎన్నిక సమయానికి వైఎస్సార్సీపీ బ లం 25కి తగ్గిందన్నారు. అయినా చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు పూర్తి బలం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కలెక్టర్, ఎస్పీ అధికార పార్టీకి దాసోహ మై ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. టీడీపీలోకి వెళ్లిన సభ్యులు తిరిగి వెనక్కురావాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ ఆగడాలపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఎంపీ చెప్పారు. అధికార పార్టీ తొత్తులుగా అధికారులు జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ వారు ఎంత స్థాయిలో కవ్వింపులకు పాల్పడినా వైఎస్సార్సీపీ నేతలు, సభ్యులు సహనంతో ఉన్నారన్నారు. అధికార పార్టీ అక్రమాలపై కలెక్టర్‌కు వివరించినా ఫలితం కరువైందన్నారు. జిల్లా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన కలెక్టర్ అధికారపార్టీ నేతల దాడితో ఆత్మరక్ష ణలో పడడం దురదృష్టకరమన్నారు. పోలీసులు ఎమ్మెల్యేలను అడ్డుకొని జెడ్పీటీసీ సభ్యులను అధికారపార్టీ నేతలకు అప్పగించారని మండిపడ్డారు. ఎస్పీ, కలెక్టర్ సమక్షంలోనే దాడులు జరగడం దారుణమన్నారు. ఇలాంటి అధికారులు జిల్లాలో పనిచేయడానికి అర్హులా? వారు తాము చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేసినట్టా! ద్రోహం చేసినట్టా? అని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా సమర్థులైన అధికారులతో ఎన్నిక జరిపించాలని డిమాండ్ చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధిష్టించడం ఖాయమన్నారు. మాయని మచ్చ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం చోటుచేసుకున్న ఘటన జిల్లా చరిత్రకు మాయనిమచ్చని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. 30 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమమన్నారు. టీడీపీ నేతలు చేయిచేసుకున్నా ఊరుకున్నామన్నారు. కలెక్టర్, ఎస్పీ అధికార పార్టీకి తలొగ్గడం దారుణమన్నారు. ఎమ్మెల్యే మైకులు విరగ్గొట్టి ఏకంగా కలెక్టర్‌నే దుర్బాషలాడితే ఐఏఎస్‌ల సంఘం ఏంచేస్తోందని ప్రశ్నించారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చన్నారు. 13న జరిగే ఎన్నికను ఎన్నికల కమిషన్ పరిశీలకుడి సమక్షంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
ఏసీ స్టేడియం అభివృద్ధికి రూ.20 లక్షలు
నెల్లూరు(బృందావనం): నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మౌలిక వసతుల కల్పనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయిస్తానని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. వాకర్స్ అసోసియేషన్, సింహపురి స్విమ్మర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు బుధవారం ఆయన స్టేడియంను సందర్శించారు. తన విజయానికి సహకరించిన వాకర్స్‌కు రాజమోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్టేడియం అభివృద్ధికి తన వంతు తోడ్పాటునందిస్తానన్నారు. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఆయా అసోసియేషన్లు అంచనాలు రూపొందిస్తే తక్షణమే రూ.20 లక్షలు కేటాయిస్తామన్నారు. స్విమ్మింగ్‌పూల్, జిమ్‌తో పాటు మైదానాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. స్టేడియం పరిస్థితిని డీఎస్డీఓ ఎతిరాజ్ ఎంపీకి వివరించారు. వివిధ అభివృద్ధి పనులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లు కేటాయించిందని చెప్పారు. అనంతరం ఏసీ స్టేడియం వాకర్స్, సింహపురి స్విమ్మర్స్ అసోసియేషన్ల అధ్యక్షులు పూండ్ల దయాకర్‌రెడ్డి, నిర్మల నరసింహారెడ్డి మాట్లాడుతూ వాకర్స్‌కు మరుగుదొడ్లు, మినీ వాటర్ ప్లాంట్, ఫుట్ట్రాక్, బేబి స్విమ్మింగ్‌పూల్, స్విమ్మింగ్‌పూల్‌లో జిమ్‌కు నిధులు కేటాయించాలని ఎంపీ మేకపాటిని కోరారు. కార్యక్రమంలో ఆయా అసోసియేషన్ల నిర్వాహకులు శేషగిరిరావు నారాయణ, దద్దోలు రమణయ్య, డాక్టర్ శ్రీనివాసకుమార్, వీరిశెట్టి హజరత్‌బాబు, నలబోలు బలరామయ్యనాయుడు, సుందరరామిరెడ్డి, ఎల్లారెడ్డి, రమేష్, విజయకుమార్‌రెడ్డి, రాఘవేంద్రశెట్టి, దశయ్య, కోటుసింగ్, బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటికి భారీగా ఎంపీ నిధులు
10 రోజుల్లో రూ.1.50 కోట్లు విడుదల నెల్లూరు (సెంట్రల్) : జిల్లాలోని పలు గ్రామాల్లో తాగునీటి అవసరాల కోసం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆది, సోమ, మంగళవారాల్లో రూ.60 లక్షలు విడుదల చేశారు. అలాగే గడిచిన పది రోజుల్లో తాగునీటికి మొత్తం రూ.1.50 కోట్ల నిధులను విడుదల చేశారు. గత మూడురోజుల్లో విడుదల చేసిన వివరాలివీ..జలదంకి మండలంలోని కోదండరామాపురానికి రూ.2 లక్షలు, బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళేనికి పది బోర్లు, ఉదయగిరికి రూ.9 లక్షలు, చేజర్ల మండలం కొల్లపనాయుడుపల్లికి రెండుబోర్లు, కొండాపురం మండలం మర్రిగుంటకు ఒక బోరు, వీకేపాడు మండలం తిమ్మారెడ్డిపల్లికి రూ.1.70 లక్షలు, ఎస్ఆర్పురం బసినేనిపల్లికి రెండు బోర్లు, చేజర్ల మండలం పాడేరుకు ఒకబోరు, మర్రిపాడు మండలం సింగనపల్లెకు ఒక బోరు, నెర్దనంపాడుకు రూ.1.3లక్షలు, కదిరినేనిపల్లికి రూ.1.3 లక్షలు మంజూరు చేశారు. అలాగే సంగం మండలం నేలాయిపాళేనికి ఒక బోరు, కొండాపురం మండలం మనంవారిపల్లికి ఒకబోరు, కోవూరు మండలం వేగూరుకు రెండు బోర్లు, చేజర్ల మండలం ఓబులాయిపల్లికి ఒక బోరు, పాతపాడు ఎస్టీ కాలనీకి ఒక బోరు, విడవలూరుకు రూ.4 లక్షలు, ఉదయగిరి మండలం అన్నంపల్లికి రూ.2.5 లక్షలు, పుల్లాయపల్లికి ఒక బోరు, ఉదయగిరి మండలం అప్పసముద్రానికి రూ.4 లక్షలు, కొండాయపాళెం పంచాయతీకి రూ.4 లక్షలు, అనంతరంసాగరం మండలం రేవూరుకు మూడు బోర్లు, మినగల్లుకు ఒక బోరు, దగదర్తి మండలం బాడుగులపాడుకు రూ.2 లక్షలను ఎంపీ తన నిధుల నుంచి మంజూరు చేశారు. కోవూరు మండలం పాటూరుకు రూ.3 లక్షలు, సంగం మండలం జెండాదిబ్బకు 10 బోర్లు, మక్తాపురానికి 5 బోర్లు, విడవలూరు మండలం ముదివర్తికి రూ.5 లక్షలు, మర్రిపాడు మండలం కంపసముంద్రంకు ఒక బోరు, వీకేపాడు మండలం టి.కొండారెడ్డిపల్లికి రూ.2 లక్షలు, కాంచెరువుకు రూ.2 లక్షలు, కనియంపాడు ఎస్సీకాలనీకి రూ.1.5 లక్షలు, జలదంకి మండలం చామదలకు రెండు బోర్లు, దగదర్తి మండలం దుండిగంకు రూ.1.5 లక్షలను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ మొత్తాలను ఆదివారం నుంచి మంగళవారం వరకు గ్రామాల్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు తన నిధుల నుంచి విడుదల చేసినట్లు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. -
బాబు మాట తప్పితే కాంగ్రెస్ గతే
కావలి: ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజావిశ్వాసాన్ని కోల్పోవటానికి చంద్రబాబుకు తక్కువ సమయమే పడుతుందని వైఎస్సార్సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన పట్టణంలోని ఆర్ఎస్సార్ కల్యాణమండపంలో శనివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజావిశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లేనివిధంగా నామరూపాలు కోల్పోయి 44 ఎంపీ సీట్లకు పరిమితమైందని అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందన్నారు. ఫలితంగా ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారన్నారు. సోనియాగాంధీ పార్లమెంటులో వెనుక వరుస సీటులో కూర్చోవలసిన దుస్థితి ఆ పార్టీకి నెలకొందన్నారు. బాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులకు అర్జీలు ఇవ్వడం తప్ప ఎలాంటి నిధులను రాష్ట్రానికి తేలేకపోయారన్నారు. ఇచ్చిన హామీలను ఈసారైనా నిలుపుకుంటారని టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులు రుణాలు మాఫీ అవుతాయని భావించారన్నారు. ప్రలోభాలు పెట్టి తమ పార్టీ ఎంపీ ఎస్పీవెరైడ్డిని టీడీపీలో చేర్చుకున్నారన్నారు. వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్న నెల్లూరు జెడ్పీ, కార్పొరేషన్, కావలి, ఆత్మకూరు, గూడూరు మున్సిపాలిటీల్లోనూ జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గందరగోళ వాతావరణాన్ని సృష్టించేలా పత్రికల్లో టీడీపీ నేతలు కథనాలు రాయిస్తున్నారన్నారు. అతి విశ్వాసం తమ పార్టీ ఓటమికి ఓ కారణమని చెప్పారు. మొత్తం ఓట్ల సరళిని చూస్తే రెండు పార్టీల మధ్య 5.4 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉందన్నారు. ఉపఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపొందిన సమయంలో వచ్చిన మెజారిటీ ఎంత ఉందో అన్ని ఓట్లు మాత్రమేనన్నారు. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలను గెలవాల్సి ఉండగా, చిన్న తప్పిదాల కారణంగా ఉదయగిరి, కోవూరు, వెంకటగిరిల్లో ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు. ఎన్నికలను డబ్బుమయం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కిందన్నారు. కోట్లాది రూపాయలను ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు చంద్రబాబు పంపి ఈ ఎన్నికల్లో గెలిచారన్నారు. పార్లమెంటు పరిధిలో ఏ వ్యక్తికైనా తాను పరిష్కరించగల సమస్య ఉంటే నేరుగా తనను కలవవచ్చని చెప్పారు. 2019 ఎన్నికల్లో తప్పనిసరిగా జగన్ సీఎం అవుతారన్నారు. అభివృద్ధిలో ప్రతాప్‌కుమార్‌రెడ్డికి అండగా ఉంటానన్నారు. అందరి సహకారంతో అభివృద్ధి : ప్రతాప్‌కుమార్‌రెడ్డి అందరి సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతానన్నారు. కావలి కాలువను ఆధునీకరించి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చూడాలనేది తన లక్ష్యమన్నారు.ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. రామాయపట్నంకు పోర్టు తీసుకొచ్చేలా తన వంతు కృషి చేస్తానన్నారు. దేశచరిత్రలో లేని విధంగా ఎన్నికలు: విష్ణు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో గడిచిన మూడు నెలల్లో ఎన్నికలు జరిగాయని, అన్ని ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టారని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రామాయపట్నంలో పోర్టు వస్తే కావలి కనకపట్నం అవుతుందన్నారు. డబ్బుతో గెలవాలని బీద మస్తాన్‌రావు అనుకున్నాడని, ప్రజలు ప్రతాప్‌కుమార్‌రెడ్డికి అండగా నిలిచి ఎమ్మెల్యేను చేశారన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ అడిగే ప్రశ్నలకు ప్రతిపక్షం నుంచి అసెంబ్లీలో సమాధానం లేదన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్యపడవద్దని, ఏ ప్రాంతంలో కార్యకర్తకు అన్యాయం జరిగినా ఏడుగురు ఎమ్మెల్యేలం అక్కడికి వచ్చి వారికి అండగా నిలుస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సహకారంతో జిల్లాను అభివృద్ధిపథంలో నిలుపుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గోసల గోపాల్‌రెడ్డి, ముసునూరు పీఏసీఎస్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు పోనుగోటి శ్రీనివాసులరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు చీదెళ్ల కిషోర్ గుప్తా, దగదర్తి, బోగోలు మండలాల కన్వీనర్లు తూపిలి పెంచలయ్య, గోగుల వెంకయ్య, అల్లూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు మన్నేమాల సుకుమార్‌రెడ్డి, కావలి రూరల్, బోగోలు, దగదర్తి జడ్పీటీసీ సభ్యులు సోమయ్యగారి పెంచలమ్మ, బాపట్ల కామేశ్వరి, దండా పద్మావతి, నెల్లూరు మాజీ కార్పొరేటర్ మదన్‌మోహన్‌రెడ్డి, నాయకులు కుందుర్తి శ్రీనివాసులు, రాంబాబు, అశోక్‌రెడ్డి, జంపాని రాఘవులు పాల్గొన్నారు. -
కేంద్రీయ విద్యాలయంలో రెండో షిఫ్ట్‌కు వినతి
-ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో రెండో షిఫ్ట్‌ను నిర్వహించాలని నెల్లూరు ఎంపీ, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ప్రతిపాదనలు పంపినట్లు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. కేంద్రీయ విద్యాలయంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రతిపాదనలు పంపామన్నారు. రెండో షిఫ్ట్ ప్రారంభమైతే ఎక్కువ మంది విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ విద్యాసంవత్సరం నుంచి రెండో షిఫ్ట్ ప్రారంభించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రిని కోరామని ఎంపీ తెలిపారు. -
ఎంపీగా మేకపాటి హ్యాట్రిక్ విజయం
సాక్షి, నెల్లూరు: మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డితో తలపడిన ఆయన ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటి రౌండ్ నుంచి 12వ రౌండ్ వరకు మెజార్టీ సాధించారు. చివరి రౌండ్లలో మాత్రం ఆదాలకు కొద్దిపాటి ఆధిక్యత లభించింది. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 11,79,869 లక్షల ఓట్లు పోల్‌కాగా మేకపాటి రాజమోహన్‌రెడ్డికి 5,76,396, ఆదాల ప్రభాకర్‌రెడ్డికి 5,62,918 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డికి కేవలం 22,771 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆత్మకూరు, నెల్లూరు నగరం, రూరల్, ఉదయగిరి, కావలి, ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గాల్లో మేకపాటికి ఆధిక్యం లభించింది. వరుసగా మూడు సార్లు ఆయన నెల్లూరు ఎంపీగా విజయం సాధించడంపై పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. హామీలు నెరవేర్చాలి: మేకపాటి చంద్రబాబు ఇబ్బడిముబ్బడిగా ప్రజలకిచ్చిన హామీలతో పాటు మోడీ ఫ్యాక్టర్ పనిచేసిందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. విజేతగా ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని సూచించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాము నిత్యం ప్రజల వెన్నంటి ఉంటామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. -
విజయభేరి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ మరోసారి ఆధిక్యత చాటుకుంది. ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీ సీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో లాగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూడా నెల్లూరువాసులు వైఎస్సార్సీపీకి ఆధిక్యతనిచ్చారు. జిల్లాలోని 10 శాసనసభ స్థానాల్లో ఏడు వైఎస్సార్సీపీ గెలవగా, టీడీపీ మూడు స్థానాలు గెలిచింది. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో వైస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి 13,478 పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. తిరుపతి లోక్‌సభ స్థానాన్ని వైఎస్సార్సీపీ అభ్యర్థి వరప్రసాదరావు 37,425 పైచిలుకు మెజారిటీతో గెలిచారు. తిరుపతి నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచిన చింతామోహన్‌కు కేవలం 33,333 ఓట్లు మాత్రమే వచ్చి ఆయన డిపాజిట్ గల్లంతయింది. ఆత్మకూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి తొలిరౌండ్ నుంచి చివరిగా 18వ రౌండ్ ముగిసేప్పటికి 31,412 ఓట్ల ఆధిక్యతతో టీడీపీ అభ్యర్థి కన్నబాబు మీద భారీ విజయం దక్కించుకున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనం రామనారాయణరెడ్డి 8,927 ఓట్లు మాత్రమే దక్కించుని డిపాజిట్ కోల్పోయారు. నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తొలి రౌండ్ నుంచి ఆధిక్యత చాటుతూ బీజేపీ అభ్యర్థి సురేష్‌రెడ్డి మీద 25,124 ఓట్ల ఆధిక్యతతో విజయకేతనం ఎగుర వేశారు. నెల్లూరు సిటీ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ టీడీపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మీద తొలి రౌండ్ నుంచి మెజారిటీ సాధిస్తూ 19,820 ఓట్లతో విజయఢంకా మోగించారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీకి దిగిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి తొలి ఆరు రౌండ్లలోనే భారీ ఆధిక్యత సాధించి చివరగా 16వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 5,447 ఓట్ల మెజారిటీతో విజ యం సాధించారు. ఇక్కడి నుంచి టీడీపీ పొ లిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఇదే ని యోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఓటమిపాలయ్యారు. 2012లో జరిగిన కోవూ రు ఉపఎన్నికలో సైతం సోమిరెడ్డి ఓటమి చ విచూశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్ప టి నుంచి సూళ్లూరుపేట, గూడూరు, వెంకట గిరి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మె జారిటీ సాధిస్తూ వచ్చింది. ఈ నియోజకవర్గాల్లో ఐదో రౌండ్లు ముగిసినప్పటి నుంచి వై ఎస్సార్సీపీ మెజారిటీలు ప్రారంభమయ్యా యి. ఉత్కంఠ భరితంగా సాగిన లెక్కింపులో సూళ్లూరుపేటలో 5 నుంచి 13వ రౌండ్ దాకా వైఎస్సార్సీపీ మెజారిటీ చాటుతూ వచ్చింది. 14, 15, 16 రౌండ్లలో టీడీపీ స్వల్ప ఆధిక్యత దక్కించుకుంది. దీంతో ఈ స్థానంలో టీడీపీ గెలుపు ఖాయమనే సూచనలు కనిపించాయి. అయితే 18, 19 రౌండ్లలో భారీ ఆధిక్యత ల భించి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పరసారత్నం మీద వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలివేటి సం జీవయ్య 3,726 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గూడూరు నియోజకవర్గంలో సైతం తొలి నుంచి ఆరు రౌండ్ల వరకు టీడీపీ అభ్యర్థి డాక్టర్ జ్యోత్స్నలత మెజారిటీ సాధి స్తూ వచ్చారు. 7వ రౌండ్ నుంచి 19వ రౌండ్ వరకు వైస్సార్సీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ఆధిక్యత చాటుతూ వచ్చారు. చివరి రౌండ్ ముగిసేప్పటికి సునీల్‌కుమార్ 9,088 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వెం కటగిరిలో 1 నుంచి 6వ రౌండ్ దాకా 8,146 ఓట్ల ఆధిక్యత సాధిస్తూ వచ్చిన వైఎస్సార్సీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు 9వ రౌండ్ నుంచి వెనుకపడ్డారు. ఆ తర్వాత అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో చివరిగా 20వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేప్పటికి టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ 5,560 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. కావలిలో తొలి రౌండ్ నుంచి స్వల్ప మెజారిటీతో విజయ ప్రస్థానం ప్రారంభించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి 18వ రౌండ్ ముగిసే సమయానికి 4,971 ఆధిక్యతతో విజయం సాధించారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు ఓటమి పాలవుతారని ఆ పార్టీ అంచనా వేయలేకపోయింది. కోవూరులో తొలి రౌండ్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రసన్నకుమార్‌రెడ్డి స్వల్ప ఆధిక్యత సాధిస్తూ వచ్చినా 12వ రౌండ్ నుంచి టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధిక్యత బాట పట్టారు. చివరి రౌండ్ ముగిసే సమయానికి ఆయన 7,942 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఉదయగిరి నియోజకవర్గంలో తొలి నుంచి ఉత్కంఠ భరితంగా కౌంటింగ్ సాగి వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రమోహన్‌రెడ్డి మీద టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావు 4,673 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. రెండు ఎంపీలు వైఎస్సార్సీపీకే నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగిన కాంట్రాక్టర్ ఆదాల ప్రభాకరరెడ్డి విజయం మీద పూర్తి ధీమాగా వ్యవహరించారు. విజయం కోసం కోట్ల రూపాయలు కుమ్మరించారు. దీంతో ఇక్కడ వై ఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి ఆదాల మధ్య తీవ్ర స్థా యిలో పోరు నడిచింది. కౌంటింగ్ ముగిసేప్పటికి రాజమోహన్‌రెడ్డి 14వేల పై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు. తిరుప తి లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావుకు బీజేపీ అభ్యర్థి జయరాం కంటే తొలి రెండు రౌండ్లలో వెనుకపడ్డారు. మూడో రౌం డ్ నుంచి వరప్రసాద్ ఆధిక్యత పెరుగుతూ వచ్చింది. ఈ నియోజకవర్గం పరిధిలోని తి రుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే వరప్రసాద్‌కు ఎక్కువ ఓట్లు లభించా యి. దీంతో ఆయన చివరకు 35వేల పైచిలు కు మెజారిటీతో విజయం దక్కించుకున్నా రు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ డాక్టర్ చింతామోహన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన ఈ సారి వరప్రసాద్ చేతిలో పరాజయం చెందారు. -
రాష్ట్ర భవిష్యత్‌ను ఓటుతో నిర్ణయించండి
నెల్లూరు రూరల్, న్యూస్‌లైన్ : ప్రజలు వేసే ఓట్లపైనే కొత్త రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. బుజబుజనెల్లూరులో వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలసి రాజమోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమైందన్నారు. ఓటర్లు సరైన తీర్పు ఇచ్చి సుస్థిరపాలనకు అవకాశం కల్పించాలని కోరారు. మహానేత వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు మరలా సమర్ధవంతంగా అమలుచేయగల సత్తా జగన్మోహన్రెడ్డికే ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరన్నారు. సీమాంధ్రలో 150 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందన్నారు. జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు కూడా వైఎస్సార్సీపీవేనన్నారు. ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి కీలకపాత్ర పోషిస్తాడని వివరించారు. కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలు తనను, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బాబు, పవన్‌ల వైఖరి శోచనీయం జగన్మోహన్రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సినీనటుడు పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు శోచనీయమని ఎంపీ రాజమోహన్‌రెడ్డి అన్నారు. నరేంద్రమోడీ నరహంతకుడని విమర్శించిన బాబు మళ్లీ అదే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటైన విషయమన్నారు. ఎన్టీఆర్ ద్వారా రాజకీయ గుర్తింపు పొందిన చంద్రబాబు ఆయన మరణానికే కారకుడయ్యాడని విమర్శించారు. అలాగే రాష్ట్ర విభజన విషయంలో ఆమోదం తెలిపి తెలుగుజాతిని రెండుగా విడదీసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఇక పవన్‌కల్యాణ్ నెల్లూరు సభలో సీమాంధ్ర నుంచి జగన్‌ను తరిమికొట్టాలంటూ వ్యాఖ్యలు చేయటం విచారకరమన్నారు. పోకిరి మాటలు మాట్లాడి గుండు కొట్టించుకోవటం పవన్‌కు అలవాటేనన్నారు. జగన్‌ను తరిమికొట్టడం పవన్ అబ్బతరం కాదని ఆవేశంగా మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వైఖరి కారణంగా మోడీ స్థాయి పూర్తిగా దిగజారిందన్నారు. రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావటం తథ్యమన్నారు. కీలకమైన కేంద్ర మంత్రిగా రాజమోహన్‌రెడ్డి పదవిలోకి వస్తారన్నారు. వైఎస్ఆర్ వలన పదవులు పొందిన కాంగ్రెస్ నాయకులు ఆయన కుటుంబాన్ని విస్మరించడమే కాకుండా దూషణలకు దిగటం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వైఎస్ పథకాలు తిరిగి అమలు అవుతాయన్నారు. అన్నివర్గాల వారికి లబ్ధిచేకూరుతుందన్నారు. -
వైఎస్సార్ రుణం తీర్చుకుందాం
సాక్షి, నెల్లూరు: ఈ నెల 7న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి వైఎస్సార్ రుణం తీర్చుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి మహానేత వైఎస్సార్ అహర్నిశలు కృషి చేశారన్నారు. వనంతోపు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత శ్రీనివాసరావు (ఆర్ఎస్సార్) వెయ్యి మంది అనుచరులతో బుధవారం పార్టీ నెల్లూరు రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమక్షంలో స్థానిక మేకపాటి అతిథిగృహంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, మేయర్ అభ్యర్థి అబ్దుల్అజీజ్ పాల్గొన్న కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ కుట్రలతోనే జగన్ ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. పేదల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని అన్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి జగన్‌ను సీఎంను చేసుకోవాల్సిన అవసరముందన్నారు. మేరిగ మురళీధర్ మాట్లాడుతూ జగన్ సీఎం అయితేనే రాష్ర్ట అభివృద్ధి చెందుతుందన్నారు. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వైఎస్సార్ వల్లే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు వచ్చాయన్నారు. ఎంపీ సమక్షంలో కాంగ్రెస్ నేత ఆర్ శ్రీనివాసరావు, ఆయన అనుచరులు భరత్, శేషయ్య, చెన్నమ్మ, చౌడమ్మ, మాతాశేఖర్, శ్రీని వాసులు, మురుగ, నాగేంద్ర, మల్లి, ఉష మ్మ, శంకరమ్మ, అనీల్, మస్తాన్, పాపిరెడ్డి, వేణుతో పాటు వెయ్యి మంది పార్టీలో చే రారు. ఆర్ఎస్సార్ ఆధ్వర్యంలో 300 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. -
ఇఫ్కో తెస్తాం
కొడవలూరు, న్యూస్‌లైన్: ఇఫ్కోకు గ్యాస్ సరఫరా చేసేందుకు కృషి చేసి ఫ్యాక్టరీ నిర్మాణం జరిగేలా చూస్తామని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహనరెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని కొడవలూరులో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలసి ఆయన మంగళవారం పాదయాత్ర చేశారు. వేలాదిగా జనం తరలివచ్చి పాదయాత్రలో వారి వెంట నడిచారు. ప్రధాన రహదారులు సైతం జనంతో కిక్కిరిసిపోయాయి. అశేషంగా తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి కొడవలూరు ప్రధాన కూడలిలో ఎంపీ మేకపాటి మాట్లాడుతూ ఇఫ్కోకు గ్యాస్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చిందన్నారు. లేని పక్షంలో సెజ్ ప్రాంతంలో ఇఫ్కో ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉండేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఇఫ్కోకు గ్యాస్ సరఫరా ఇచ్చే దాకా విశ్రమించబోనన్నారు. దగదర్తి వద్ద విమానాశ్రయానికి స్థలం ఎంపికైనప్పటికీ ఏర్పాటులో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక దాని ఏర్పాటుకూ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. నడికుడి, శ్రీకాళహస్తి రైల్వేలైన్ మంజూరైనప్పటికీ నిధుల విడుదల జాప్యం కారణంగా పనులు మందకొడిగా సాగుతున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి పెద్దపీఠ వేసి ఆ పనులు వేగవంతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అనుకూలమైన జిల్లాల్లో వందల కోట్ల రూపాయల నిధుల విడుదల చేసి మన జిల్లాకు బాగా అన్యాయం చేసిందని ఆరోపించారు. నాలుగేళ్లపాటు కాంగ్రెసేతర ఎమ్మెల్యేలున్న చోట ఒక్క పని కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలు నాలుగేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. 42 యేళ్ల ప్రాయంలోనే సోనియాగాంధీని ఎదిరించి ఢిల్లీ పీఠాన్ని కదిలించిన మహా వ్యక్తి జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని కొనియాడారు. చంద్రబాబు తొమ్మిదేళ్లలో ప్రజలకేమీ చేయకుండా ఇపుడు రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియాగా మారుస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబేనని చెప్పారు. కిలో రెండు రూపాయలు ఉన్న బియ్యాన్ని రూ.5.25 చేసిన వ్యక్తి కూడా బాబేనన్నారు. సామాన్యులను విస్మరించి పాలించిన బాబు ఇపుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వస్తున్నారని ప్రశ్నించారు. 150 అసెంబ్లీ స్థానాలు సాధించి రాష్ట్రంలోనూ, తగినన్ని ఎంపీ స్థానాలు సాధించి కేంద్రంలోనూ జగన్మోహన్రెడ్డి కీలక భూమిక పోషించనున్నారని తెలిపారు. త్వరలోనే ప్రజాపాలన రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కోవూరు నియోజకవర్గంపై పక్షపాతం చూపిందన్నారు. ఆ పార్టీ అభ్యర్థి ఓడారన్న అక్కసుతో నియోజకవర్గానికి పైసా నిధులు ఇవ్వలేదని తెలిపారు. నియోజకవర్గంలో నాలుగేళ్లలో ఆశించిన అభివృద్ధి జరగకపోవడానికి కాంగ్రెస్ పాలకులే కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్‌రెడ్డి తనయుడు రజత్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు వీరి చలపతిరావు, నల్లావుల శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, నాయకులు నాపా వెంకటేశ్వర్లునాయుడు, పిట్టి సూర్యనారాయణ, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒట్టూరు సునీత, తిరుపతమ్మ, నీలకంఠం శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌లు వెంకటాద్రి, నాగిరెడ్డి రమేష్ పాల్గొన్నారు. -
ప్రజల మనస్సుల్లో కొలువైన వైఎస్సార్
సాక్షి, నెల్లూరు : మహాప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన మహానేత డాక్టర్ వైఎస్సార్, వాటిని తొలగించేందుకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టి వారి మనస్సుల్లో దేవుడిలా కొలువయ్యారని నెల్లూరు ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని నాగేంద్రనగర్, లక్ష్మీపురం, వీవర్స్‌కాలనీ, రంగనాయకులపేట, ఇసుకడొంక, గోపవరం ప్రాంతాల్లో ఆదివారం ఆయన సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్, మేయర్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహానేత చేపట్టిన పథకాలకు ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. అంతటితో ఆగక వైఎస్ కుటుంబాన్ని అనేక రకాలుగా వేధింపులకు గురిచేసి ఇబ్బంది పెట్టిందన్నారు. కాంగ్రెస్‌లో ఉంటే తండ్రి ఆశయ సాధన సాధ్యం కాదని భావించిన జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారన్నారు. ఆయన సీఎం అయితేనే వైఎస్సార్ పథకాలన్నీ తిరిగి అమలవుతాయన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అధికారం కోసం కూతురినిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్ల పాలనలో ఆయన ప్రజలకు చేసింది శూన్యమన్నారు. అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వైఎస్సార్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించి వారి అభివృద్ధికి పాటుపడ్డాడన్నారు. ముస్లింలందరూ వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేస్తారని చెప్పారు. అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ రాజన్న కాలం నుంచి స్వర్ణయుగం వస్తుందన్నారు. ఐదేళ్లుగా ఆయన నిరంతరం ప్రజలతో మమేకమై వారి కష్టాలను దగ్గర నుంచి చూశారన్నారు. ప్రజలందరూ ఫ్యాను గుర్తుకు ఓట్లేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమాల్లో 7వ డివిజన్లో పెళ్లూరు శ్రీనివాసులు, బాలరాజు, డీపీఎల్ నారాయణ, తులసీరామ్, నాగభూషణం, రాములు యాదవ్, సుధాకర్, ముక్కాల ద్వారకానాథ్, ఎడిచర్ల శివకుమార్, 52వ డివిజన్లో పఠాన్ ఫయాజ్‌ఖాన్, ఎస్కె. తాజుద్దీన్, అస్రఫ్భాయ్, ముప్పసాని శ్రీనివాసులు, ఇతియాజ్, పిగిలం సుధీర్, జలీల్, షాబుద్దీన్, షాన్వాజ్, ఆసిఫ్ అహ్మద్, సలీమ్ అహ్మద్, మునీస్ సిద్దిక్, వెంకటరమణ, అంజాహుస్సేన్, బాషా, ఖలీల్ అహ్మద్, ఉదయ్ కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రమంత్రిని కావడం ఖాయం
నెల్లూరురూరల్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా అధికారం చేపట్టగానే తాను కేంద్రమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. రూరల్ మండలంలోని ములుముడిలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాను కేంద్రమంత్రి అయిన తర్వాత రెండున్నరేళ్లలో జిల్లాలో విమానాశ్రయం పూర్తి చేస్తామన్నారు. అలాగే నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం, బిట్రగుంటలో రైల్వే పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నెల్లూరు నగరాన్ని సుందరనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కేంద్రంలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ రాదన్నారు. రాబోయేవి సంకీర్ణ ప్రభుత్వాలని జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కీలక పాత్ర పోషించనుందన్నారు. సీమాంధ్రలో 175 ఎమ్మెల్యే స్థానాలకుగాను 150 స్థానాలు వైఎస్సార్సీపీ దక్కించుకోవడం ఖాయమన్నారు. అలాగే 25 లోక్‌సభ స్థానాల్లో 20కిపైగా వైఎస్సార్సీపీ సాధిస్తుందన్నారు. అత్యధిక ఎంపీ స్థానాలను సాధించి కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు. జిల్లాలో 10 ఎమ్మెల్యేల స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తారన్నారు. తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. కాంగ్రెస్ దిక్కులేని పార్టీగా మారిందన్నారు. తెలంగాణాలో కూడా వైఎస్ అభిమానులు అధికంగా ఉన్నారన్నారు. సోనియాగాంధీ, చంద్రబాబు కుట్రల కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. కుట్రతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని 16 నెలలు జైల్లో ఉంచినా సంకల్పం వీడకుండా జగన్మోహన్రెడ్డి ముందుకు సాగారన్నారు. రూరల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. జననీరాజనాలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలకు ప్రజలు నీరాజనాలు పట్టారు. దేవరపాళెం, కొమ్మరపూడి గ్రామాల్లో జరిగిన రోడ్‌షో, ములుముడిలో జరిగిన ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఐదు సంతకాలతో సువర్ణపాలన
సాక్షి, నెల్లూరు : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంతకాలతో రాష్ట్రంలో సువర్ణయుగ పాలనకు నాంది పలుకుతారని నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్, సత్యనారాయణపురం, బోడిగాడితోట, ధర్మశాలిగుంట తదితర ప్రాంతాల్లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక మహిళలు మంగళహారతులతో వారికి ఘనస్వాగతం పలికారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ వృద్ధులు, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం జగన్మోహన్రెడ్డి బృహత్తర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టనున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదివించుకోలేక ఎన్నోకష్టాలు పడుతున్న పేద తల్లుల కోసం ‘అమ్మబడి పథకాన్ని’ ప్రవేశపెట్టి సమాజంలో అందరూ గౌరవంగా మెలిగేలా తీర్చిదిద్దుతారన్నారు. అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ ఇక 14 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్ర దిశ, దశ మార్చే నాయకుడు జగన్మోహన్రెడ్డి బలపరిచిన తనకు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం రూ.200 ఉన్న వృద్ధుల పింఛన్‌ను రూ.700కు పెంచి వారికి బాసటగా నిలువనున్నారన్నారు. రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేసే కార్యక్రమానికి జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో నగర కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి అబ్దుల్అజీజ్, నాయకులు ఓజిలి రవిచంద్ర, ఎం.విజయభాస్కర్‌రెడ్డి, ఎస్కే మంజూర్, మున్నా, పాడేటి పెంచలయ్య, బత్తిన శోభన్‌బాబు, లెక్కల వెంకారెడ్డి, పి. మధురెడ్డి, అశ్వద్దామ, సానా శ్రీహరిరెడ్డి, సానా సుబ్బారెడ్డి, మస్తాన్‌వలి, నాగేంద్ర, వెంకటేశ్వర్లురెడ్డి, మందాడి మహేష్, బాబూరావు, జయకృష్ణ, నాగరాజారెడ్డి, నరసింహులు, పవన్, మాబాషా, సునీల్ పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక నెల్లూరు 49వ డివిజన్‌కు చెందిన మహిళలు సంతపేటలోని మెటల్ రేవు ప్రాంతంలో డాక్టర్ పి. అనిల్ కుమార్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో కె.విజయలక్ష్మి, ఎన్.చిన్ని, సరోజనమ్మ, ఎస్.లక్ష్మి, కాంచనమ్మ, నీరజ, ఎన్.జనార్దన్, ప్రవీణ్ చేరారు. కార్యక్రమంలో వందవాసి పద్మ, ముప్పసాని శ్రీనివాసులు, ప్రభాకర్, రమేష్ పాల్గొన్నారు. అలాగే 8,9వ డివిజన్లకు చెందిన మహిళలు రాజన్నభవన్లో డాక్టర్ పి. అనిల్‌కుమార్‌యాదవ్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో వనజమ్మ, బాల, కామాక్షి, రఫి, జయంతి, రాజీ, తోట నరసింహులు, శేషయ్య, రావమ్మ, మంజుల, సుజాత ఉన్నారు. అదే విధంగా నగరంలోని 5వ డివిజన్‌కు చెందిన మహిళలు అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో మానస, శ్రీలక్ష్మి, రమణమ్మ, విజయలక్ష్మి, హరి, ప్రవీణ, సుమన్, నాగార్జున, సాయి తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
బాబు తొమ్మిదేళ్లు ఏం ఉద్ధరించాడు
ఇందుకూరుపేట(బుచ్చిరెడ్డిపాళెం), న్యూస్‌లైన్: తొమ్మిదేళ్ల తన పాలనలో చంద్రబాబు ఏం ఉద్ధరించాడని, నేడు సీమాంధ్రను సింగపూర్ చేస్తా, మలేషియా చేస్తా, జపాన్ చేస్తానని చెబుతున్నాడని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని పున్నూరులో మంగళవారం ఆయన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ప్రజలను గాలికొదిలేశాడు. ఐదేళ్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ మేరకు ప్రజాభివృద్ధికి సహకరించాయో ప్రజలందరికీ తెలుసన్నారు. అదే చంద్రబాబు హయాంలో రెండు రూపాయల కిలో బియ్యం రూ.5కు, విచ్చలవిడిగా బెల్టుషాపులు పెట్టడం మినహా చేసిందేమీ లేదన్నారు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి మేనిఫెస్టోలో చెప్పని పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాలను చెప్పకుండా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టినవని ఆయన గుర్తు చేశారు. నెల్లూరులో పది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. కోవూరు ఎమ్మెల్యేగా ప్రసన్నకుమార్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆయన తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళి మాట్లాడుతూ నేడు ఎన్నికల సమయంలో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చక్కపడాలంటే జగన్మోహన్రెడ్డి సీఎం కావాలన్నారు. అప్పుడే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులు రెడ్డి, నాయకులు, గొల్లపల్లి విజయ్‌కుమార్, కల్యాణ్‌రెడ్డి, బి. వెంకటేశ్వర్లు , కృష్ణ ప్రసాద్, ఏలూరు కృష్ణయ్య, జయరామయ్య, జనార్దన్‌రెడ్డి, రమణయ్య, లక్ష్మయ్య, వెంకటరమణయ్య, శివకోటారెడ్డి పాల్గొన్నారు. -
శ్రీధర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
నెల్లూరు రూరల్, న్యూస్‌లైన్: మే నెల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు అయ్యప్పగుడి సెంటర్లోని రాధాకృష్ణ కల్యాణమండపంలో ఆదివారం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీధర్‌రెడ్డి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారన్నారు. ఆయన విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు. సీమాంధ్రకు మంచి రోజులు వస్తున్నాయని, రెండు నెలల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. తెలుగువారిని రెండు ముక్కలు చేసిన సోనియాకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు ఎన్ని ప్రజాగర్జనలు నిర్వహించినా ప్రజాభిమానం పొందలేరన్నారు. నెల్లూరులో నిర్వహించిన బాబు సభకు ప్రలోభపెట్టి జనసమీకరణ చేశారన్నారు. తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మంలో నిర్వహించిన సభలోనూ జగన్మోహన్రెడ్డి తాను సమైక్యవాదినని చెప్పడం గర్వించదగిన విషయమన్నారు. కాంగ్రెస్ నుంచి వలసలు ఎక్కువయ్యాయని, వైఎస్సార్సీపీలో అవకాశం లేని వారు టీడీపీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. సీమాంధ్రను చంద్రబాబు సింగపూర్ చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్న జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ స్వర్ణయుగం సాధ్యమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసింది టీడీపీయేనన్నారు. ఆత్మకూరు సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీధర్‌రెడ్డి పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమించారని, ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లను వైఎస్సార్సీపీ అభ్యర్థులు కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా జగన్మోహన్రెడ్డి లెక్క చేయలేదన్నారు. రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు జవాబుదారిగా ఉంటానన్నారు. 30 ఏళ్లుగా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న తనను ఎమ్మెల్యే చేస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సిటీ సమన్వయకర్త పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ కార్పొరేషన్‌ను ఎమ్మెల్యే వివేకానందరెడ్డి తన గుప్పెట్లో పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ విలువైనదని, వైఎస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సిటీ కన్వీనర్ ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ శ్రీధర్‌రెడ్డి విజయానికి కృషి చేస్తానన్నారు. పదవులు ఉన్నా, లేకున్నా పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. మేకపాటి సోదరుల వెంటే తన పయనం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, నెల్లూరు రూరల్ మండల కన్వీనర్ పిగిలం నరేష్‌యాదవ్, మాజీ కార్పొరేటర్లు తాటి వెంకటేశ్వరరావు, సన్నపరెడ్డి పెంచలరెడ్డి, నెల్లూరు మదన్‌మోహన్‌రెడ్డి, నాయకులు ఎస్డీ సలీంఅహ్మద్, సన్నపరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో పలువురి చేరిక ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమక్షంలో పలువురు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి రాజమోహన్‌రెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ కార్పొరేటర్లు రావులపల్లి వెంకటజ్యోతి, సూళ్లూరు రమాదేవితో పాటు సూళ్లూరు దేవరాజులు, పడారుపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి పాతపాటి ప్రభాకర్‌రెడ్డి అలియాస్ పుల్లారెడ్డి, సిద్ధార్ధ స్కూలు అధినేత సురేష్‌రెడ్డి, భక్తవత్సలనగర్ ప్రాంత నేత యనమల వీరారెడ్డి, వేదాయపాళెం ప్రాంత టీడీపీ నేత ఎంపీ కృష్ణారెడ్డి, హరనాథపురం కాంగ్రెస్ నేతలు మారంరెడ్డి కుమార్, మోహన్‌రావు తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్, టీడీపీని ప్రజలు క్షమించరు
-ఎంపీ మేకపాటి కావలి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీలను తెలుగు ప్రజలు క్షమించరని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 14వ వార్డు ముసునూరులో గురువారం గడపగడపకు వైఎస్సార్సీపీలో భాగంగా ఆ పార్టీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన జనదీవెన కార్యక్రమానికి ఎంపీ మేకపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 40 సంవత్సరాల యువకుడైన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీ దుర్మార్గంగా రాష్ట్ర విభజన అంశాన్ని తెరపైకి తెచ్చాయన్నారు. తెలంగాణలో వైఎస్సార్సీపీని దెబ్బకొట్టేం దుకు వ్యూహాన్ని పన్నాయని తెలిపారు. సీమాంధ్రలో ఓ వ్యక్తిని సమైక్య చాంపియన్‌గా చూపించి అతని చేత రాజకీయ పార్టీని పెట్టిం చి ఇక్కడ ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నాయన్నారు. సమైక్యవాద ప్రజలు ఈ విషయాల న్నింటినీ గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన అంశం ఫిబ్రవరి 21కి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడుతామని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు చెప్పిన మాటలనుబట్టి చూస్తుంటే ఆ పార్టీకి కూడా ప్రస్తుతం జరుగుతున్న రాష్ర్ట విభజన అనుకూలంగా లేదన్నారు. రానున్న ఎన్నికలు సమైక్యాంధ్రలోనే జరుగుతాయన్నారు. రాష్ట్రంలో రానున్నది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమేనన్నారు. కేంద్రంలో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన వ్యక్తులే ప్రధాని అయ్యే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్సీపీకి 30 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2009లో జరిగే ఎన్నికల్లో తాను నెల్లూ రు ఎంపీగా ఎన్నికయ్యానన్నారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రజలను దురదృష్టం వెంటాడి మహానేత వైఎస్సార్ మరణించారన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో పాలన అస్తవ్యసంగా మారిందన్నారు. జగన్ సమైక్యశంఖారావాన్ని విజయవంతం చేయండి జిల్లాలో శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న సమైక్యశంఖారావాన్ని జయప్రదం చేయాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కోరారు. నాయుడుపేటలో ప్రారంభమై రెండు రోజుల పాటు జిల్లాలో జరగనున్న ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సమైక్యవాదులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు. -
ప్రజలే వైఎస్సార్ కుటుంబానికి అండ
ఆత్మకూరు, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని మంత్రులైన వారు ఆయన కుటుంబంపై రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజలే మహానాయకుడి కుటుంబానికి అండగా నిలబడుతున్నారని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరులో మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. గౌతమ్‌రెడ్డితో కలిసి ఎంపీ మేకపాటి పట్టణంలో పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని మున్సిపల్ బస్టాండు సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మహానేత రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందన్నారు. రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగాలంటే జగన్ నాయకత్వంలోని ప్రభుత్వమే ఏకైక మార్గమన్నారు. రాజశేఖర్‌రెడ్డి రెక్కల కష్టంతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజలను రాచిరంపాన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ తెలంగాణ అంశాన్ని ముందుకు తెచ్చిందన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం ఎన్ని కుట్రలు చేసినా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేవన్నారు. కాబోయే సీఎం జగన్ అని మేకపాటి అన్నారు. పాదయాత్ర ద్వారా గౌతంరెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకున్నారన్నారు. 514కిలోమీటర్ల నడిచి పల్లె ప్రజల ఇబ్బందులు చాలా దగ్గరగా గమనించారన్నారు. గౌతమ్‌రెడ్డి గెలుపుతో ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు. 514 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తయిన సందర్భంగా నువ్వురుపాడు వైఎస్సార్‌కాంగ్రెస్ నేత గడ్డం శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సిండికేట్ ఫార్మర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ డెరైక్టర్ దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, రామస్వామిపల్లి సర్పంచ్ సానా వేణుగోపాల్‌రెడ్డి, ఆత్మకూరు, సంగం మండలాల కన్వీనర్లు ఇందూరు నారసింహారెడ్డి, ఐవీ కృష్ణారెడ్డి, వైఎస్సార్‌కాంగ్రెస్ నేతలు అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, ఆనందరెడ్డి, సూరా భాస్కర్‌రెడ్డి, ఇరగన వెంకటేశ్వరరెడ్డి, గంగవరపు రాములునాయుడు, ఎర్రమళ్ల శంకరరెడ్డి, మందా రామచంద్రా రెడ్డి, వనిపెంట వెంకటసుబ్బారెడ్డి, సోమల మాధవరెడ్డి, మందా చిట్టిబాబు, శేషం హజరత్‌బాబు, రేవూరు వేణుగోపాల్‌రెడ్డి, చెన్ను వెంకటేశ్వర్లురెడ్డి, పందిళ్లపల్లి గోపీరెడ్డి, గడ్డం శ్రీనివాసులురెడ్డి, నాగులపాటి ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. -
జగ న్తోనే రాష్ట్రానికి సువర్ణ యుగం : ఎంపీ
దగదర్తి (బిట్రగుంట), న్యూస్‌లైన్: వైఎస్సార్సీప్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రానికి స్వర్ణయుగం వస్తుందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. దగదర్తి మండలం తడకలూరు, చౌటపుత్తేడు, ఊచగుంటపాళెంలో గురువారం పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు హాజరైన ఎంపీ మేకపాటి మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎక్కువ స్థానాలు సాధించి చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేసే సత్తా జగన్‌కు మాత్రమే ఉందన్నారు. ప్రజలకు అత్యంత అవసరమైన 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తదితర పథకాలు సక్రమంగా అమలవ్వాలంటే జగన్ సీఎం కావాల్సిందేనన్నారు. ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ, కాంగ్రెస్ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా జనం జగన్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి కాలువ ద్వారా సాగునీరు సక్రమంగా అందక రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి అన్నారు. సాగునీటి సమస్య కారణంగా రైతులు ఏటా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానమైన కావలి కాలువతో పాటు ఉపకాలువలు ఆధునికీకరణకు నోచుకోకపోవడం, కనీసం పూడిక తీయకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదన్నారు. ్రఏటా 40 శాతానికిపైగా పంట నష్టపోవడంతో పాటు నానా కష్టాలు పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రైతుల కష్టాలకు తెరపడుతుందని భరోసా ఇచ్చారు. వందలాది మంది పార్టీలో చేరిక దగదర్తి మండలంలో కాంగ్రెస్, టీడీపీల నుంచి వందలాది మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. తడకలూరుకు చెందిన శరత్, హరిబాబు, చౌటపుత్తేడుకు చెందిన రవి, రమణయ్య, ఊచగుంటపాళేనికి చెందిన వరుణ్, శూరయ్య ఆధ్వర్యంలో సుమారు 500 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి వచ్చారు. వీరికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గోగుల వెంకయ్య యాదవ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బీద రమేష్, నాయకులు వివేక్ తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ డెరైక్షన్లోనే కొత్త పార్టీ
చేజర్ల(సోమశిల),న్యూస్‌లైన్ : కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దల డెరైక్షన్లోనే రాష్ట్రంలో సమైక్య ముసుగులో కొత్త పార్టీ రాబోతుందని నెల్లూరు పార్లమెంటు సభ్యుడు, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి చేజర్ల మండలంలో చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. మాముడూరులో ఎంపీ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ సీమాంధ్రలో జగన్మోహన్రెడ్డి ప్రాబల్యాన్ని తగ్గించాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. రాష్ట్ర విభజనను బీజేపీ కూడా వ్యతిరేకిస్తోందన్నారు. దీని వల్ల విభజన బిల్లు ఆగిపోవడం తధ్యమన్నారు. మేలో సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. యువనేత జగన్మోహన్రెడ్డికి ప్రజల అండ పుష్కలంగా ఉందన్నారు. అందుకు తాజాగా వెలువడిన సర్వేలే నిదర్శనమన్నారు. పార్టీలు అన్నీ 52 శాతం ఉండగా, కేవలం వైఎస్సార్కాంగ్రెస్పార్టీ మాత్రమే సీమాం ధ్రలో 48 శాతం ఉందన్నారు. సీమాంధ్రలో 20 ఎంపీ సీట్లను గెలుస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. అలాగే తెలంగాణలో కూడా మూడు ఎంపీ స్థానాలు గెలుస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆధారాభిమానాలతో జిల్లాలోని పది స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయఢంకా మోగిస్తుందన్నారు. నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లోనూ విజయం ఖాయమన్నారు. ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో జగన్ కీలకం కానున్నారన్నారు. కార్యక్రమంలో కందుకూరు మున్సిపల్ చైర్మన్ బూర్సు మాలకొండయ్య, నాయకులు బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బూదళ్ల వీరరాఘవ రెడ్డి, గిరిధర్‌రెడ్డి, పూనూరు రామమనోహర్‌రెడ్డి, బిజివేముల సురేంద్రరెడ్డి, మందా రామచంద్రారెడ్డి, వనిపెంట వెంకట సుబ్బారెడ్డి, సోమల మాధవరెడ్డి, మందా చిట్టిబాబు, నోటి సుందర రామిరెడ్డి, ఐ.సింహాద్రి నాయుడు, బాలిరెడ్డి రమాదేవి పాల్గొన్నారు. గౌతమ్‌రెడ్డిని కలిసిన ప్రకాశం జిల్లా కన్వీనర్ నూకసాని వైఎస్సార్సీపీ ప్రకాశం జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ చేజర్ల మండలం ఓబులాయపల్లి వద్ద గౌతమ్‌రెడ్డిని కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డిపై ప్రజలు చూపుతున్న ఆదరణ, అభిమానం మరువలేనివన్నారు. -
వైఎస్ జగన్‌తోనే సువర్ణయుగం
సోమశిల, న్యూస్‌లైన్ : దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సువర్ణయుగమని, భవిష్యత్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డితో తప్ప మరెవరితో ఇటువంటి పాలన రాబోదని నెల్లూరు పార్లమెంటు సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి చేపట్టిన పాదయాత్ర అనంతసాగరం మండలంలో గుడిగుంట, చిలకలమర్రి, మంగుపల్లి, కామిరెడ్డిపాడు పంచాయతీల్లో జరుగుతుండగా ఎంపీ మేకపాటి పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తొమ్మిదేళ్లు చంద్రబాబు పాలనలో సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ఎందుకు బతుకుతున్నామా అనే విధంగా బాధలు పడ్డారన్నారు. రాజశేఖరరెడ్డి తన హాయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను, ప్రయోజనాలను ప్రతి ఒక్కరికీ అందించారన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే 108, ఆరోగ్యశ్రీతో ఎంతో మందికి పునర్జనమ్మ ప్రసాదించారన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివారంటే వైఎస్సార్ పుణ్యమేనన్నారు. చంద్రబాబు హయాంలో విద్యార్థులు ఉన్నతచదవులు చదవలేక నిరుద్యోగులుగా మారారన్నారు. మహానేత బతికి ఉంటే నేడు రాష్ట్రం, దేశంలో ఇలాంటి క్లిష్టపరిస్థితులు వచ్చేవి కావన్నారు. జగన్మోహన్రెడ్డిపై ఉన్న ప్రజాభిమానాన్ని తగ్గించేందుకు రాష్ట్ర విభజన ప్రక్రియ చేపడుతున్నారన్నారు. కానీ ప్రజలు జగన్మోహన్రెడ్డిని ఎప్పుడు ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి చేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. విభజన కుట్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ అయిందన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరగనున్నాయన్నారు. తెలంగాణలో కూడా వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు. కేంద్రంలో వైఎస్సార్సీపీ చక్రం తిప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, అనంతసాగరం మండల కన్వీనర్ రాపూరు వెంకటసుబ్బారెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనర్ ఇందూరు నారసింహారెడ్డి, మర్రిపాడు నాయకులు బిజివేములు సుబ్బారెడ్డి, నాయకులు అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, మందా రామచంద్రారెడ్డి, యర్రమళ్ల శంకర్‌రెడ్డి పాల్గొన్నారు. సోమశిలలో ఎంపీ మేకపాటి భోగి వేడుకలు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మంగళవారం సోమశిలలో భోగి పండగ వేడుకలు జరుపుకున్నారు. ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సోమశిల అతిథి గృహంలో బస చేశారు. తెల్లవారుజామున భోగి పండగను స్థానికులతో కలిసి జరుపుకున్నారు. సంప్రదాయాలకు భారతదేశం ప్రతీక అన్నారు. దేశ సంప్రదాయాలను ఇతర దేశాలు సైతం ఇష్టపడుతున్నాయన్నారు. మేకపాటి గౌతంరెడ్డి చిలకలమర్రి సమీపంలో పాదయాత్ర క్యాంపు వద్ద మంగళవారం భోగి పర్వదిన వేడుకలు జరుపుకున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రలో భాగంగా మండలంలోని సోమవారం రాత్రి చిలకలమర్రికి చేరుకున్నారు. -
రాష్ట్ర విభజన తగదు
మర్రిపాడు, న్యూస్‌లైన్: అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లా కలిసి ఉన్న తెలుగు వారిని రాష్ట్ర విభజన పేరుతో వేరు చేయడం తగదని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. విభజనకు నిరసనగా శుక్రవారం మర్రిపాడులో నిర్వహించిన బంద్‌ను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని జగన్మోహన్రెడ్డి ఆది నుంచే ఖండిస్తున్నారన్నారు. విభజన నిర్ణయం వచ్చిన వెంటనే సీమాంధ్రలోని 175 మంది ఎమ్మెల్యేలతో సమైక్య తీర్మానం చేయిం చాలని జగన్ ప్రయత్నించారని తెలి పారు. కొన్ని పార్టీలు ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం ఈపరిస్థితి దాపురించిందన్నారు. అసెంబ్లీకి వచ్చిన బి ల్లును అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోరాటం చేస్తున్నారన్నా రు. శుక్రవారం కూడా అసెంబ్లీ సమావే శం ప్రారంభమైన వెంటనే తమ ఎమ్మెల్యేలు సమైక్య తీర్మానం కోసం పట్టుబ ట్టారని గుర్తుచేశారు. బాబు విభజనకు అనుకూలంగా 2008 ఆగస్టులో లేఖ ఇచ్చారన్నారు. ఇప్పుడు రెండు కళ్ల సి ద్ధాంతం పాటిస్తూ ప్రజలను మోసగించడం తగదని హెచ్చరించారు. మ హానేత వైఎస్సార్ ఉండుంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రజ లను మోసగిస్తూ నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు తగిన గు ణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సీ మాంధ్రలోని 175 స్థానాల్లో 150 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందన్నారు. తెలంగాణలోనూ 30 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. కొం దరు నేతలు తిన్నంటి వాసాలు లెక్కేసే విధంగా వైఎస్ కుటుంబంపై బురద జల్లడం పద్ధతి కాదన్నారు. ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేయడం కుదరదన్నా రు. ఆత్మకూరు నియోజకవర్గంలో స మస్యలు అన్ని పరిష్కారం కావాలంటే గౌతమ్‌రెడ్డిని గెలిపించాలని పిలుపుని చ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి చేస్తున్న పాదయాత్ర అభినందనీయమన్నారు. గ్రామగ్రామాన పర్యటి స్తూ ప్రజా సమస్యలు తెలుసుకొనేం దుకు ఆయన కృషి మరువలేనిదన్నా రు. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ని ర్వహించిన బంద్‌కు సహకరించిన వా రందరికి కృతజ్ఞతలు తెలిపారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జగన్మోహన్రెడ్డి దేశంలోని అన్ని పార్టీలను కలిసి పో రాటం చేస్తున్నారన్నారు. ఆయనకు ప్ర జలందరూ అండగా నిలవాలన్నారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ధి గౌ తమ్రెడ్డితోనే సాధ్యమన్నారు. సూళ్లూరుపేట నేత దబ్బల రాజారెడ్డి మాట్లాడుతూ ఆనం వారిపై జగన్ విసిరిన బాణం మేకపాటి గౌతమ్రెడ్డేనన్నారు. ఆయన ఆరు అడుగుల బుల్లెట్లా ప్రజల్లోకి దూసుకుపోతున్న తీరు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యుడు పాపకన్ను రాజశేఖర రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పాండురంగారెడ్డి, సన్నపురెడ్డి సుబ్బారెడ్డి, బిజివేముల వెంకటసుబ్బారెడ్డి, ఇందూరు నారసింహారెడ్డి, పందిళ్లపల్లి గోపిరెడ్డి, రాములు నాయుడు, సోమల మాధవరెడ్డి, సూరా భాస్కర్ రెడ్డి, అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, సతీష్, ఏఎస్‌పేట జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు పందిళ్లపల్లి రాజేశ్వరమ్మ, పర్వీన్, చంద్రికారెడ్డి, పద్మజయాదవ్ పాల్గొన్నారు.