తాగునీటికి భారీగా ఎంపీ నిధులు
10 రోజుల్లో రూ.1.50 కోట్లు విడుదల
నెల్లూరు (సెంట్రల్) : జిల్లాలోని పలు గ్రామాల్లో తాగునీటి అవసరాల కోసం ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆది, సోమ, మంగళవారాల్లో రూ.60 లక్షలు విడుదల చేశారు. అలాగే గడిచిన పది రోజుల్లో తాగునీటికి మొత్తం రూ.1.50 కోట్ల నిధులను విడుదల చేశారు. గత మూడురోజుల్లో విడుదల చేసిన వివరాలివీ..జలదంకి మండలంలోని కోదండరామాపురానికి రూ.2 లక్షలు, బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళేనికి పది బోర్లు, ఉదయగిరికి రూ.9 లక్షలు, చేజర్ల మండలం కొల్లపనాయుడుపల్లికి రెండుబోర్లు, కొండాపురం మండలం మర్రిగుంటకు ఒక బోరు, వీకేపాడు మండలం తిమ్మారెడ్డిపల్లికి రూ.1.70 లక్షలు, ఎస్‌ఆర్‌పురం బసినేనిపల్లికి రెండు బోర్లు, చేజర్ల మండలం పాడేరుకు ఒకబోరు, మర్రిపాడు మండలం సింగనపల్లెకు ఒక బోరు, నెర్దనంపాడుకు రూ.1.3లక్షలు, కదిరినేనిపల్లికి రూ.1.3 లక్షలు మంజూరు చేశారు.
అలాగే సంగం మండలం నేలాయిపాళేనికి ఒక బోరు, కొండాపురం మండలం మనంవారిపల్లికి ఒకబోరు, కోవూరు మండలం వేగూరుకు రెండు బోర్లు, చేజర్ల మండలం ఓబులాయిపల్లికి ఒక బోరు, పాతపాడు ఎస్టీ కాలనీకి ఒక బోరు, విడవలూరుకు రూ.4 లక్షలు, ఉదయగిరి మండలం అన్నంపల్లికి రూ.2.5 లక్షలు, పుల్లాయపల్లికి ఒక బోరు, ఉదయగిరి మండలం అప్పసముద్రానికి రూ.4 లక్షలు, కొండాయపాళెం పంచాయతీకి రూ.4 లక్షలు, అనంతరంసాగరం మండలం రేవూరుకు మూడు బోర్లు, మినగల్లుకు ఒక బోరు, దగదర్తి మండలం బాడుగులపాడుకు రూ.2 లక్షలను ఎంపీ తన నిధుల నుంచి మంజూరు చేశారు.
కోవూరు మండలం పాటూరుకు రూ.3 లక్షలు, సంగం మండలం జెండాదిబ్బకు 10 బోర్లు, మక్తాపురానికి 5 బోర్లు, విడవలూరు మండలం ముదివర్తికి రూ.5 లక్షలు, మర్రిపాడు మండలం కంపసముంద్రంకు ఒక బోరు, వీకేపాడు మండలం టి.కొండారెడ్డిపల్లికి రూ.2 లక్షలు, కాంచెరువుకు రూ.2 లక్షలు, కనియంపాడు ఎస్సీకాలనీకి రూ.1.5 లక్షలు, జలదంకి మండలం చామదలకు రెండు బోర్లు, దగదర్తి మండలం దుండిగంకు రూ.1.5 లక్షలను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ మొత్తాలను ఆదివారం నుంచి మంగళవారం వరకు గ్రామాల్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు తన నిధుల నుంచి విడుదల చేసినట్లు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు.