నెల్లూరు రూరల్, న్యూస్‌లైన్ : ప్రజలు వేసే ఓట్లపైనే కొత్త రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. బుజబుజనెల్లూరులో వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలసి రాజమోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమైందన్నారు. ఓటర్లు సరైన తీర్పు ఇచ్చి సుస్థిరపాలనకు అవకాశం కల్పించాలని కోరారు. మహానేత వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు మరలా సమర్ధవంతంగా అమలుచేయగల సత్తా జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరన్నారు. సీమాంధ్రలో 150 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందన్నారు. జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు కూడా వైఎస్సార్‌సీపీవేనన్నారు. ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తాడని వివరించారు. కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలు తనను, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బాబు, పవన్‌ల వైఖరి శోచనీయం
జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సినీనటుడు పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు శోచనీయమని ఎంపీ రాజమోహన్‌రెడ్డి అన్నారు. నరేంద్రమోడీ నరహంతకుడని విమర్శించిన బాబు మళ్లీ అదే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటైన విషయమన్నారు. ఎన్‌టీఆర్ ద్వారా రాజకీయ గుర్తింపు పొందిన చంద్రబాబు ఆయన మరణానికే కారకుడయ్యాడని విమర్శించారు.
అలాగే రాష్ట్ర విభజన విషయంలో ఆమోదం తెలిపి తెలుగుజాతిని రెండుగా విడదీసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఇక పవన్‌కల్యాణ్ నెల్లూరు సభలో సీమాంధ్ర నుంచి జగన్‌ను తరిమికొట్టాలంటూ వ్యాఖ్యలు చేయటం విచారకరమన్నారు. పోకిరి మాటలు మాట్లాడి గుండు కొట్టించుకోవటం పవన్‌కు అలవాటేనన్నారు. జగన్‌ను తరిమికొట్టడం పవన్ అబ్బతరం కాదని ఆవేశంగా మాట్లాడారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ వైఖరి కారణంగా మోడీ స్థాయి పూర్తిగా దిగజారిందన్నారు. రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావటం తథ్యమన్నారు. కీలకమైన కేంద్ర మంత్రిగా రాజమోహన్‌రెడ్డి పదవిలోకి వస్తారన్నారు. వైఎస్‌ఆర్ వలన పదవులు పొందిన కాంగ్రెస్ నాయకులు ఆయన కుటుంబాన్ని విస్మరించడమే కాకుండా దూషణలకు దిగటం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వైఎస్ పథకాలు తిరిగి అమలు అవుతాయన్నారు. అన్నివర్గాల వారికి లబ్ధిచేకూరుతుందన్నారు.
రాష్ట్ర భవిష్యత్‌ను ఓటుతో నిర్ణయించండి
Published Sat, May 3 2014 2:53 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement