వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గం ఎంపిక | YSR CP announced District Executive Gowri Reddy, Sridhar Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గం ఎంపిక

Published Fri, Jun 17 2016 1:37 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గం ఎంపిక - Sakshi

వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గం ఎంపిక

సంగారెడ్డి టౌన్ : వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గాన్ని గురువారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆమోదంతో జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం  చేసేందుకు ఈ నెల 18 నుంచి మండల కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. 

జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పి.శ్రీనివాస్‌రెడ్డి, క్రిస్టోఫర్, ఎండీ అజీర్, బి.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శులుగా నరేంద్రరెడ్డి, రాములు, వీరన్న, తిరుపతిరెడ్డి, దుర్గాప్రసాద్, అశోక్‌గౌడ్, రఘురామ్‌రెడ్డి, భిక్షపతి అశోక్ పటేల్, ఇబ్రహీం, పాండునాయక్, నర్సిములు, సంయుక్త కార్యదర్శులుగా సంగాగౌడ్, శ్రీనివాస్, సంజీవ్, అహ్మద్, సతీష్ రాథోడ్, మల్లన్న, ఇమ్రాన్, సురేష్, వీరారెడ్డి, కుమార్, అధికార ప్రతినిధిగా సీహెచ్ మల్లయ్య, జిల్లా కార్యనిర్వాహక సభ్యులుగా రమేష్, ఎల్లం యాదవ్, మల్లేశం, కుమార్, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులుగా ఎల్లయ్య, శశాంక్‌రెడ్డి, మల్లన్నను ఎన్నుకున్నట్లు తెలిపారు.

 వైఎస్సార్ సీపీ యూత్ కన్వీనర్‌గా రాజశేఖర్‌రెడ్డి
వైఎస్సార్ సీపీ సంగారెడ్డి నియోజకవర్గ యూత్ కన్వీనర్‌గా బి.రాజశేఖర్‌రెడ్డిని నియమించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కన్వీనర్‌గా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement