నెల్లూరురూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో మళ్లీ రాజన్న పాలన రానుందని, తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని బీవీనగర్, అనగుంట, కల్యాణ్‌నగర్, రాజుకాంప్లెక్స్, పాతవేదాయపాళెం, జనగణమనకాలనీ, దండోరా కాలనీల్లో ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రానుందన్నారు.
తొలిరోజే రాష్ట్ర ప్రగతిని మలుపు తిప్పేలా జగనన్న ఐదు సంతకాలు చేస్తారని చెప్పారు. ఆ సంతకాలు రాష్ట్ర గతిని సమూలంగా మార్చివేస్తాయని, కొత్త అభివృద్ధి విప్లవం వస్తుందన్నారు. ఉచిత విద్యను అందించే అమ్మఒడిపై తొలి సంతకం, రూ.700 వృద్ధాప్య పింఛన్‌పై రెండో సంత కం, రైతన్నల కోసం రూ.3వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటుపై మూడో సంతకం, డ్వాక్రా రుణాల రద్దుపై నాల్గో సంతకం, గ్రామానికి, వార్డుకు ఒక ఆఫీసు చొప్పున పెట్టి ఏ కార్డు అయినా 24గంటల్లోనే వచ్చేలా ఐదో సంతకం జగనన్న చేస్తారని స్పష్టం చేశారు. ఐదు సంతకాలతో రాష్ట్రంలో మళ్లీ జగనన్న సంక్షేమ రాజ్యం వస్తుందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు సంతోషంగా జీవిస్తారన్నారు. ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే అయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు.
రాష్ట్రంలో మళ్లీ రాజన్న పాలన
Published Mon, May 5 2014 3:33 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement