చేజర్ల(సోమశిల),న్యూస్‌లైన్ : కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దల డెరైక్షన్‌లోనే రాష్ట్రంలో సమైక్య ముసుగులో కొత్త పార్టీ రాబోతుందని నెల్లూరు పార్లమెంటు సభ్యుడు, వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి చేజర్ల మండలంలో చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. మాముడూరులో ఎంపీ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ సీమాంధ్రలో జగన్మోహన్‌రెడ్డి ప్రాబల్యాన్ని తగ్గించాలని కుట్రలు పన్నుతున్నారన్నారు.
రాష్ట్ర విభజనను బీజేపీ కూడా వ్యతిరేకిస్తోందన్నారు. దీని వల్ల విభజన బిల్లు ఆగిపోవడం తధ్యమన్నారు. మేలో సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. యువనేత జగన్మోహన్‌రెడ్డికి ప్రజల అండ పుష్కలంగా ఉందన్నారు. అందుకు తాజాగా వెలువడిన సర్వేలే నిదర్శనమన్నారు. పార్టీలు అన్నీ 52 శాతం ఉండగా, కేవలం వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ మాత్రమే సీమాం ధ్రలో 48 శాతం ఉందన్నారు.
సీమాంధ్రలో 20 ఎంపీ సీట్లను గెలుస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. అలాగే తెలంగాణలో కూడా మూడు ఎంపీ స్థానాలు గెలుస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆధారాభిమానాలతో జిల్లాలోని పది స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగిస్తుందన్నారు. నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లోనూ విజయం ఖాయమన్నారు. ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో జగన్ కీలకం కానున్నారన్నారు. కార్యక్రమంలో కందుకూరు మున్సిపల్ చైర్మన్ బూర్సు మాలకొండయ్య, నాయకులు బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బూదళ్ల వీరరాఘవ రెడ్డి, గిరిధర్‌రెడ్డి, పూనూరు రామమనోహర్‌రెడ్డి, బిజివేముల సురేంద్రరెడ్డి, మందా రామచంద్రారెడ్డి, వనిపెంట వెంకట సుబ్బారెడ్డి, సోమల మాధవరెడ్డి, మందా చిట్టిబాబు, నోటి సుందర రామిరెడ్డి, ఐ.సింహాద్రి నాయుడు, బాలిరెడ్డి రమాదేవి పాల్గొన్నారు.
గౌతమ్‌రెడ్డిని కలిసిన
ప్రకాశం జిల్లా కన్వీనర్ నూకసాని
వైఎస్సార్‌సీపీ ప్రకాశం జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ చేజర్ల మండలం ఓబులాయపల్లి వద్ద గౌతమ్‌రెడ్డిని కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డిపై ప్రజలు చూపుతున్న ఆదరణ, అభిమానం మరువలేనివన్నారు.
ఢిల్లీ డెరైక్షన్‌లోనే కొత్త పార్టీ
Published Thu, Jan 23 2014 3:42 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM
Advertisement
Advertisement