సాక్షి, నెల్లూరు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంతకాలతో రాష్ట్రంలో సువర్ణయుగ పాలనకు నాంది పలుకుతారని నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.
నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ జాకీర్ హుస్సేన్ నగర్, సత్యనారాయణపురం, బోడిగాడితోట, ధర్మశాలిగుంట తదితర ప్రాంతాల్లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక మహిళలు మంగళహారతులతో వారికి ఘనస్వాగతం పలికారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ వృద్ధులు, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం జగన్‌మోహన్‌రెడ్డి బృహత్తర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టనున్నారన్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల చదివించుకోలేక ఎన్నోకష్టాలు పడుతున్న పేద తల్లుల కోసం ‘అమ్మబడి పథకాన్ని’ ప్రవేశపెట్టి సమాజంలో అందరూ గౌరవంగా మెలిగేలా తీర్చిదిద్దుతారన్నారు. అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ ఇక 14 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్ర దిశ, దశ మార్చే నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి బలపరిచిన తనకు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం రూ.200 ఉన్న వృద్ధుల పింఛన్‌ను రూ.700కు పెంచి వారికి బాసటగా నిలువనున్నారన్నారు.
రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేసే కార్యక్రమానికి జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో నగర కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి అబ్దుల్‌అజీజ్, నాయకులు ఓజిలి రవిచంద్ర, ఎం.విజయభాస్కర్‌రెడ్డి, ఎస్‌కే మంజూర్, మున్నా, పాడేటి పెంచలయ్య, బత్తిన శోభన్‌బాబు, లెక్కల వెంకారెడ్డి, పి. మధురెడ్డి, అశ్వద్దామ, సానా శ్రీహరిరెడ్డి, సానా సుబ్బారెడ్డి, మస్తాన్‌వలి, నాగేంద్ర, వెంకటేశ్వర్లురెడ్డి, మందాడి మహేష్, బాబూరావు, జయకృష్ణ, నాగరాజారెడ్డి, నరసింహులు, పవన్, మాబాషా, సునీల్ పాల్గొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
నెల్లూరు 49వ డివిజన్‌కు చెందిన మహిళలు సంతపేటలోని మెటల్ రేవు ప్రాంతంలో డాక్టర్ పి. అనిల్ కుమార్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో కె.విజయలక్ష్మి, ఎన్.చిన్ని, సరోజనమ్మ, ఎస్.లక్ష్మి, కాంచనమ్మ, నీరజ, ఎన్.జనార్దన్, ప్రవీణ్ చేరారు. కార్యక్రమంలో వందవాసి పద్మ, ముప్పసాని శ్రీనివాసులు, ప్రభాకర్, రమేష్ పాల్గొన్నారు. అలాగే 8,9వ డివిజన్లకు చెందిన మహిళలు రాజన్నభవన్‌లో డాక్టర్ పి. అనిల్‌కుమార్‌యాదవ్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారిలో వనజమ్మ, బాల, కామాక్షి, రఫి, జయంతి, రాజీ, తోట నరసింహులు, శేషయ్య, రావమ్మ, మంజుల, సుజాత ఉన్నారు. అదే విధంగా నగరంలోని 5వ డివిజన్‌కు చెందిన మహిళలు అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో మానస, శ్రీలక్ష్మి, రమణమ్మ, విజయలక్ష్మి, హరి, ప్రవీణ, సుమన్, నాగార్జున, సాయి తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఐదు సంతకాలతో సువర్ణపాలన
Published Fri, Apr 25 2014 3:16 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement