కావలిలో నేడు ‘వైఎస్సార్ జనభేరి’ | Y.S jagan mohan reddy arrives in Nellore district | Sakshi
Sakshi News home page

కావలిలో నేడు ‘వైఎస్సార్ జనభేరి’

Published Sun, May 4 2014 3:04 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

కావలిలో నేడు ‘వైఎస్సార్ జనభేరి’ - Sakshi

కావలిలో నేడు ‘వైఎస్సార్ జనభేరి’

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: లోక్‌సభ, శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం కావలిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీడీఓ కార్యాలయం సెంటర్‌లో జరిగే వైఎస్సార్ జనభేరి బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి తొలివిడతగా గత నెల 19, 20 తేదీల్లో వెంకటగిరి నియోజకవర్గం రాపూ రు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గం వింజ మూరులో ఏర్పాటుచేసిన జనభేరి బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
 
 పొదలకూరు, సంగం, దుత్తలూరు మండలాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. నిర్ణీత సమయం కంటే జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నాలుగైదు గంటలు ఆలస్యంగా సాగినా ఆయన కోసం జనం ఎదురుచూసి సాదరస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో రెండో విడతగా జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం కావలికి వస్తున్నారు. సభను విజయవంతం చేయడానికి పార్టీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డితో పాటు పార్టీ నేతలు, శ్రేణులు రంగంలోకి దిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement