పులివెందుల రూరల్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారు. మంగళవారం వైఎస్ జగన్‌ను ఆయన స్వగృహంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిశారు. ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. పలు సమస్యలను విన్నవించారు. తనను కలవడానికి వచ్చిన మహిళలు, యువకులతో వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ వారిని జగన్ ఆప్యాయంగా పలకరించారు. నియోజకవర్గంలోని పులివెందుల, లింగాల, వేముల, వేంపల్లె, చక్రాయపేట, సింహాద్రిపురం, తొండూరు మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు కలిశారు.
జగన్‌ను కలిసిన మిథున్‌రెడ్డి
జగన్‌ను రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కలిశారు. నామినేషన్, ప్రచార తీరు, ప్రస్తుత పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. పోలింగ్ రోజున తీసుకోవాల్సిన పలు అంశాలపై చర్చించారు. భారీ విజయం సాధించి తిరిగి రావాలని ఆయన మిథున్‌రెడ్డిని ఆకాంక్షించారు.
ప్రజలతో మమేకం
Published Wed, May 7 2014 2:33 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement