ముత్తుకూరు, న్యూస్‌లైన్ : విలువలతో కూడిన జననేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజకీయాలు, కుట్రలతో నిండిన చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకోవాలని వైఎస్సార్ సీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్ధి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కృష్ణపట్నం, ముత్తుకూరు పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీగా జనం పాల్గొన్న ముత్తుకూరు రోడ్‌షోలో ప్రసంగించారు. చంద్రబాబు కురిపిస్తున్న హామీల్లో విశ్వసనీయత లేదన్నారు. అబద్ధాలు ప్రచారం చేసే సోమిరెడ్డిపై ప్రజలకు నమ్మకం లేదన్నారు.
జిల్లా పరిషత్ చెర్మన్‌గా తాను జిల్లాలోని 961 పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేశానన్నారు. రెండుసార్లు మంత్రిగా పని చేసిన సోమిరెడ్డి నియోజకవర్గంలో సాధించింది ఏమిటో తనతో చర్చించగలరా అని కాకాణి ప్రశ్నించారు. సర్వేపల్లి ప్రజల మొహం చూడనని, కోవూరు సర్వస్వం అని సోమిరెడ్డి గత ఉప ఎన్నికల్లో అన్న విషయం అందరికీ తెలుసునన్నారు. అనంతరం నెల్లూరు రూరల్ ఎంతో ముద్దు అన్నారని, ఎక్కడా పప్పులుడకపోవడంతో విధిలేక మళ్లీ సర్వేపల్లిలో పోటీ చేస్తున్న సోమిరెడ్డిని ఎవరూ నమ్మడం లేదన్నారు.
తాను పేదవాడినంటూ ఆయన చేస్తున్న ప్రచారానికి టీడీపీ నేతలే నవ్వుకుంటున్నారన్నారు. పోరాటాల పేరుతో సోమిరెడ్డి ప్రాజెక్టుల నుంచి ప్యాకేజీలు పొందడం నిజం కాదా అని ప్రశ్నించారు. భగవంతుడి సాక్షిగా ఇప్పటి వరకు ప్రాజెక్టు నుంచి తాను ఒక్కపైసా కూడా ముట్టలేదన్నారు. ఊపిరి ఉన్నంత వరకు అక్రమార్జనకు పాల్పడనన్నారు. మత్స్యకారేతర ప్యాకేజీ సాధిస్తామన్నారు.
జగన్ సీఎం కావడం ఖాయం : దినేష్‌రెడ్డి
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని విశ్రాంత డీజీపీ వేణుంబాక దినేష్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిజాయితీ కలిగిన నాయకుడన్నారు. సర్వేపల్లి నుంచి కాకాణి అఖండ మెజార్టీతో గెలుపొందుతారని జోస్యం చెప్పారు. తిరుపతి పార్లమెంటు అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలన్నారు. కాంగ్రెస్ ఎంపీ చింతా మోహన్ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీలేదని ఎద్దేవా చేశారు.
రోడ్‌షోకు ఆదరణ
ముత్తుకూరులో ఆదివారం రాత్రి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన రోడ్‌షోలో కాకాణి, దినేష్‌రెడ్డి, వరప్రసాద్‌పై స్థానికులు పూలవర్షం కురిపించారు. కాలనీల్లో జనం వీరికి మనసారా స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు బొనిగి ఆనందయ్య, రాగాల వెంకటేశ్వర్లు, ప్రసాద్‌శర్మ, ముత్యంగౌడ్, మురాల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ దయాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.
విలువలు-మోసాల మధ్య పోటీ
Published Mon, May 5 2014 3:35 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement