నెల్లూరురూరల్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా అధికారం చేపట్టగానే తాను కేంద్రమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. రూరల్ మండలంలోని ములుముడిలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాను కేంద్రమంత్రి అయిన తర్వాత రెండున్నరేళ్లలో జిల్లాలో విమానాశ్రయం పూర్తి చేస్తామన్నారు.
అలాగే నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం, బిట్రగుంటలో రైల్వే పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నెల్లూరు నగరాన్ని సుందరనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కేంద్రంలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ రాదన్నారు. రాబోయేవి సంకీర్ణ ప్రభుత్వాలని జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కీలక పాత్ర పోషించనుందన్నారు. సీమాంధ్రలో 175 ఎమ్మెల్యే స్థానాలకుగాను 150 స్థానాలు వైఎస్సార్‌సీపీ దక్కించుకోవడం ఖాయమన్నారు. అలాగే 25 లోక్‌సభ స్థానాల్లో 20కిపైగా వైఎస్సార్‌సీపీ సాధిస్తుందన్నారు.
అత్యధిక ఎంపీ స్థానాలను సాధించి కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు. జిల్లాలో 10 ఎమ్మెల్యేల స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తారన్నారు. తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. కాంగ్రెస్ దిక్కులేని పార్టీగా మారిందన్నారు. తెలంగాణాలో కూడా వైఎస్ అభిమానులు అధికంగా ఉన్నారన్నారు. సోనియాగాంధీ, చంద్రబాబు కుట్రల కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. కుట్రతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని 16 నెలలు జైల్లో ఉంచినా సంకల్పం వీడకుండా జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగారన్నారు. రూరల్ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారన్నారు.
జననీరాజనాలు
మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలకు ప్రజలు నీరాజనాలు పట్టారు. దేవరపాళెం, కొమ్మరపూడి గ్రామాల్లో జరిగిన రోడ్‌షో, ములుముడిలో జరిగిన ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కేంద్రమంత్రిని కావడం ఖాయం
Published Sun, Apr 27 2014 3:57 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement
Advertisement