ఇందుకూరుపేట(బుచ్చిరెడ్డిపాళెం), న్యూస్‌లైన్: తొమ్మిదేళ్ల తన పాలనలో చంద్రబాబు ఏం ఉద్ధరించాడని, నేడు సీమాంధ్రను సింగపూర్ చేస్తా, మలేషియా చేస్తా, జపాన్ చేస్తానని చెబుతున్నాడని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని పున్నూరులో మంగళవారం ఆయన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ప్రజలను గాలికొదిలేశాడు. ఐదేళ్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ మేరకు ప్రజాభివృద్ధికి సహకరించాయో ప్రజలందరికీ తెలుసన్నారు.
అదే చంద్రబాబు హయాంలో రెండు రూపాయల కిలో బియ్యం రూ.5కు, విచ్చలవిడిగా బెల్టుషాపులు పెట్టడం మినహా చేసిందేమీ లేదన్నారు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి మేనిఫెస్టోలో చెప్పని పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర పథకాలను చెప్పకుండా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టినవని ఆయన గుర్తు చేశారు. నెల్లూరులో పది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు.
కోవూరు ఎమ్మెల్యేగా ప్రసన్నకుమార్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆయన తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళి మాట్లాడుతూ నేడు ఎన్నికల సమయంలో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చక్కపడాలంటే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలన్నారు. అప్పుడే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులు రెడ్డి, నాయకులు, గొల్లపల్లి విజయ్‌కుమార్, కల్యాణ్‌రెడ్డి, బి. వెంకటేశ్వర్లు , కృష్ణ ప్రసాద్, ఏలూరు కృష్ణయ్య, జయరామయ్య, జనార్దన్‌రెడ్డి, రమణయ్య, లక్ష్మయ్య, వెంకటరమణయ్య, శివకోటారెడ్డి పాల్గొన్నారు.
బాబు తొమ్మిదేళ్లు ఏం ఉద్ధరించాడు
Published Wed, Apr 23 2014 3:20 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement