ఇందుకూరుపేట : తెలుగుజాతికి, రాష్ట్రానికి ప్రపంచ దేశాల్లోనే ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన మహానుభావుడు దివంగత ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థతే కారణమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. మండలంలోని సోమరాజుపల్లిలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసన్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భారత మాజీప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయి, మదన్‌మోహన్ మాలవీయాకు కేంద్రం భారతరత్న ప్రకటించిన మోదీని అభినందించారు. గతంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడూ ఎన్టీఆర్‌కు భారత రత్న ప్రకటింప చేయడంలో చంద్రబాబు నిర్లక్ష్యం వహించారన్నారు.
ఇప్పుడూ అదే తీరుగా వ్యవహరించారన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకు అసలు ఇష్టం లేదన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, మానసికంగా హత్య చేసి చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకున్నారన్నారు. తెలుగు ప్రజలు భగవంతుని నిజ రూపం చూడలేదన్నారు.
ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు, కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి వంటి పాత్రల్లో నటించడంతో ఆయా రూపాల్లోని దేవుళ్లు ఉంటారనే ముద్ర వేశారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న ఇచ్చి తీరాలన్నారు. మోదీ ప్రధాని మంత్రి కాగానే వాజ్‌పేయి సేవలను గుర్తించి భారతరత్న పురస్కారం దక్కేలా చేశారన్నారు. ఆయన స్థాపించిన పార్టీ పుణ్యంతో ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్న నీకు ఆ మాత్రం కృతజ్ఞత లేదాని ప్రశ్నించారు. తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించేలా చూడాలని ప్రసన్నకుమార్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, అధికార ప్రతినిధి గొల్లపల్లి విజయ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు బీవీ రమణయ్య,నాప వెంకటేశ్వరనాయుడు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ
విభాగాల పదవులు కేటాయింపు
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా బీవీ రమణయ్య, మైనార్టీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా ఎస్‌కే షబ్బీర్, సాంస్కృతిక విభాగం జిల్లా అధికార ప్రతినిధిగా తోట పద్మనాభయ్య, మాహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్‌కే దిల్షాబేగం, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చిల్లకూరు విజయ్‌కుమార్, మత్స్యకార విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముక్కంటి కాంతారావు, యువత జిల్లా కార్యదర్శిగా గురజాల జ్ఞానస్వరూప్ నాయుడు (బుజ్జిబాబు), బీసీ సెల్ జిల్లా కార్యదర్శిగా గూడూరు జయరామయ్య, రైతు విభాగం జిల్లా కార్యదర్శిగా గోనుగుంట హరనాథ్‌నాయుడు, ప్రచార విభాగం జిల్లా కార్యదర్శిగా కొండ్లపూడి శ్రీనివాసులురెడ్డి, వాణిజ్య, వర్తక విభాగం జిల్లా కార్యదర్శి బిరుదవోలు రూప్‌కుమార్‌రెడ్డి, లీగల్ సెల్ జిల్లా కార్యదర్శిగా శ్రీరం నవీన్‌కుమార్, సేవాదళ్ జిల్లా కార్యదర్శిగా కైలసం శ్రీనివాసులురెడ్డి, ప్రచార కమిటీ జిల్లా జాయింట్ సెక్రటరీగా నాగిరెడ్డి వెంకటరమణయ్య, రైతు విభాగం జిల్లా జాయింట్ సెక్రటరీగా చిట్టిబోయిన మనోహర్, ప్రచార విభాగం జిల్లా జాయింట్ సెక్రటరీగా వరిగొండ బాబయ్య, సేవాదళ్ జిల్లా జాయింట్ సెక్రటరీగా వేణుంబాక సదాశివరెడ్డిని ఎంపిక చేసి ప్రకటించారు.
బాబు అసమర్థత వల్లే ఎన్టీఆర్‌కు భారతరత్న దక్కలేదు
Published Fri, Dec 26 2014 1:50 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement