prasana kumar reddy
-
బాబు అసమర్థత వల్లే ఎన్టీఆర్‌కు భారతరత్న దక్కలేదు
ఇందుకూరుపేట : తెలుగుజాతికి, రాష్ట్రానికి ప్రపంచ దేశాల్లోనే ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన మహానుభావుడు దివంగత ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థతే కారణమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. మండలంలోని సోమరాజుపల్లిలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భారత మాజీప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయి, మదన్మోహన్ మాలవీయాకు కేంద్రం భారతరత్న ప్రకటించిన మోదీని అభినందించారు. గతంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడూ ఎన్టీఆర్‌కు భారత రత్న ప్రకటింప చేయడంలో చంద్రబాబు నిర్లక్ష్యం వహించారన్నారు. ఇప్పుడూ అదే తీరుగా వ్యవహరించారన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకు అసలు ఇష్టం లేదన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, మానసికంగా హత్య చేసి చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకున్నారన్నారు. తెలుగు ప్రజలు భగవంతుని నిజ రూపం చూడలేదన్నారు. ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు, కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి వంటి పాత్రల్లో నటించడంతో ఆయా రూపాల్లోని దేవుళ్లు ఉంటారనే ముద్ర వేశారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న ఇచ్చి తీరాలన్నారు. మోదీ ప్రధాని మంత్రి కాగానే వాజ్‌పేయి సేవలను గుర్తించి భారతరత్న పురస్కారం దక్కేలా చేశారన్నారు. ఆయన స్థాపించిన పార్టీ పుణ్యంతో ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్న నీకు ఆ మాత్రం కృతజ్ఞత లేదాని ప్రశ్నించారు. తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించేలా చూడాలని ప్రసన్నకుమార్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, అధికార ప్రతినిధి గొల్లపల్లి విజయ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు బీవీ రమణయ్య,నాప వెంకటేశ్వరనాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల పదవులు కేటాయింపు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా బీవీ రమణయ్య, మైనార్టీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా ఎస్కే షబ్బీర్, సాంస్కృతిక విభాగం జిల్లా అధికార ప్రతినిధిగా తోట పద్మనాభయ్య, మాహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్కే దిల్షాబేగం, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చిల్లకూరు విజయ్‌కుమార్, మత్స్యకార విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముక్కంటి కాంతారావు, యువత జిల్లా కార్యదర్శిగా గురజాల జ్ఞానస్వరూప్ నాయుడు (బుజ్జిబాబు), బీసీ సెల్ జిల్లా కార్యదర్శిగా గూడూరు జయరామయ్య, రైతు విభాగం జిల్లా కార్యదర్శిగా గోనుగుంట హరనాథ్నాయుడు, ప్రచార విభాగం జిల్లా కార్యదర్శిగా కొండ్లపూడి శ్రీనివాసులురెడ్డి, వాణిజ్య, వర్తక విభాగం జిల్లా కార్యదర్శి బిరుదవోలు రూప్‌కుమార్‌రెడ్డి, లీగల్ సెల్ జిల్లా కార్యదర్శిగా శ్రీరం నవీన్‌కుమార్, సేవాదళ్ జిల్లా కార్యదర్శిగా కైలసం శ్రీనివాసులురెడ్డి, ప్రచార కమిటీ జిల్లా జాయింట్ సెక్రటరీగా నాగిరెడ్డి వెంకటరమణయ్య, రైతు విభాగం జిల్లా జాయింట్ సెక్రటరీగా చిట్టిబోయిన మనోహర్, ప్రచార విభాగం జిల్లా జాయింట్ సెక్రటరీగా వరిగొండ బాబయ్య, సేవాదళ్ జిల్లా జాయింట్ సెక్రటరీగా వేణుంబాక సదాశివరెడ్డిని ఎంపిక చేసి ప్రకటించారు. -
11న వైఎస్సార్సీపీ జిల్లా సమావేశం
-పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సాక్షి, నెల్లూరు: ఈ నెల 11న గురువారం వైఎస్సార్సీపీ జిల్లా సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని విజయమహల్ గేట్ పక్కనున్న ఎంసీఎస్ కల్యాణ మండపంలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, రాష్ట కమిటీ సభ్యులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, మండల కన్వీనర్లు, పట్టణపార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సొసైటీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు వైఎస్సార్ అభిమానులు, జగన్మోహన్రెడ్డి అభిమానులు భారీగా వచ్చి విజయవంతం చేయాలని ప్రసన్న పిలుపునిచ్చారు. -
సంచలన తీర్పు ఇవ్వనున్న ప్రజలు
కోవూరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో ప్రజలు చరిత్రలో సంచలనాత్మక తీర్పు ఇవ్వనున్నారని కోవూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 122 అసెంబ్లీ స్థానాలతో పాటు 18 పార్లమెంటు స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రస్తుతం తెలుగుజాతి ద్రోహులకు, ధర్మానికి మధ్య పోరాటం జరుగుతోందన్నారు. ఈ పోరాటంలో ప్రజలదీ, వైఎస్ జగన్మోహన్రెడ్డిదే విజయం ఖాయమన్నారు. పచ్చని రాష్ట్రాన్ని విడదీసిన చొరబాటుదారులు, ద్రోహులైన సోనియాగాంధీ, టీడీపీ, బీజేపీకి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పబోతున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి సీమాంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపిస్తారని సీమాంధ్ర రాజధానిని ఏర్పాటు చేసి కులమతాలకు అతీతంగా ప్రజలను ఆదుకుంటారన్న నమ్మకం వారిలో ఉందన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా సీమాంధ్ర రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజల హృదయాల్ని తాకిందన్నారు. తొలుత కోవూరు టీఎన్సీ, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, పీఆర్కాలనీ ప్రాథమికోన్నత పాఠశాల, గంగవరం, పాటూరు ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. పరిశీలనంతరం ఆయన మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగాలంటే అందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే సమర్థవంతమైన నాయకుడు అన్నారు. ఆయన పాలనలోనే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారన్నారు. ప్రజలు కూడా రాక్షసపాలనలో ఎన్నో సమస్యలు అనుభవించారన్నారు. ఈ పాలనకు చరమగీతం పాడి స్వర్ణయుగంలో అడుగు పెట్టబోతున్నారన్నారు. అందులో భాగంగానే బుధవారం జరిగిన ఓటింగ్ సరళిని ఆది నుంచి వేగంగా పుంజుకోవడం నిదర్శనమన్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీకి అండగా నిలబడి పురుషుల కంటే తాము దేనిలో తీసిపోబోమని ఉరకలు వేయడం శుభపరిణామన్నారు. కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేయడం అమానుషమన్నారు. పోలింగ్ సమయంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడిచేయడం సమంజసం కాదన్నారు. ప్రజలు ఎవరివైపు అయితే మొగ్గు చూపుతారో వారికే అధికారం దక్కుతుందన్నారు. అంతే తప్ప ప్రజలను మభ్యపెట్టి, బెదిరిస్తే ఓట్లు వేస్తారనుకోవడం అవివేకమన్నారు. ఏదీ ఏమైనా రాష్ట్రంలో మరి కొన్ని రోజుల్లో రాజన్న రాజ్యం రానున్నందన్నారు. ఆ రాజ్యానికి జగన్మోహన్రెడ్డి రారాజుగా వెలుగొంది ప్రజల కష్టసుఖాలు చూసుకుంటారన్నారు. ఈయన వెంట ప్రసన్నకుమార్‌రెడ్డి సతీమణి గీతమ్మ, తనయుడు రజత్‌కుమార్‌రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మండల పార్టీ కన్వీనర్ ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, శివుని నరసింహులురెడ్డి, శ్రీనివాసులు, రమేష్ ఉన్నారు. -
బాబు తొమ్మిదేళ్లు ఏం ఉద్ధరించాడు
ఇందుకూరుపేట(బుచ్చిరెడ్డిపాళెం), న్యూస్‌లైన్: తొమ్మిదేళ్ల తన పాలనలో చంద్రబాబు ఏం ఉద్ధరించాడని, నేడు సీమాంధ్రను సింగపూర్ చేస్తా, మలేషియా చేస్తా, జపాన్ చేస్తానని చెబుతున్నాడని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని పున్నూరులో మంగళవారం ఆయన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ప్రజలను గాలికొదిలేశాడు. ఐదేళ్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ మేరకు ప్రజాభివృద్ధికి సహకరించాయో ప్రజలందరికీ తెలుసన్నారు. అదే చంద్రబాబు హయాంలో రెండు రూపాయల కిలో బియ్యం రూ.5కు, విచ్చలవిడిగా బెల్టుషాపులు పెట్టడం మినహా చేసిందేమీ లేదన్నారు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి మేనిఫెస్టోలో చెప్పని పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాలను చెప్పకుండా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టినవని ఆయన గుర్తు చేశారు. నెల్లూరులో పది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. కోవూరు ఎమ్మెల్యేగా ప్రసన్నకుమార్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆయన తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళి మాట్లాడుతూ నేడు ఎన్నికల సమయంలో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చక్కపడాలంటే జగన్మోహన్రెడ్డి సీఎం కావాలన్నారు. అప్పుడే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులు రెడ్డి, నాయకులు, గొల్లపల్లి విజయ్‌కుమార్, కల్యాణ్‌రెడ్డి, బి. వెంకటేశ్వర్లు , కృష్ణ ప్రసాద్, ఏలూరు కృష్ణయ్య, జయరామయ్య, జనార్దన్‌రెడ్డి, రమణయ్య, లక్ష్మయ్య, వెంకటరమణయ్య, శివకోటారెడ్డి పాల్గొన్నారు. -
కోలాహలంగా ప్రసన్న నామినేషన్
కోవూరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కోవూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం 11.14 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. ప్రసన్నకుమార్‌రెడ్డి తన నివాసం నుంచి 10.30 గంటలకు కోవూరుకు వచ్చారు. అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న పార్టీ నా యకులు, కార్యకర్తలను ఆయన కలుసుకున్నారు. నియోజకవర్గ నాయకులు, ప్రజల ఆశీర్వాదంతో పాటు దైవానుగ్రహంతో నామినేషన్ వేసేందుకు తహశీల్దార్ కార్యాలయానికి బయల్దేరారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ప్రసన్నకుమార్‌రెడ్డికి బీ ఫారాన్ని అందజేశారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 145 స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. అలాగే 25 లోక్‌సభ స్థానాల్లో 23 స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కావడమే కాకుండా ఢిల్లీలో కీలకనేతగా అవతరిస్తారని స్పష్టం చేశారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, తమ కు సేవ చేసే నాయకులను ఎంచుకోవడం వారికి తెలుసన్నారు. 2012 ఉప ఎన్నికల్లో మాదిరిగా ప్రసన్నను ఆశీర్వదించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మా కుటుంబానికి నియోజకవర్గ ప్రజలే దేవుళ్లు మొదటి నుంచి కోవూరు నియోజకవర్గ ప్రజలే తమ కుటుంబానికి దేవుళ్లతో సమానమని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తనకు నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారన్నారు. మహా నేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపొందించిన మేనిఫెస్టో తమ విజ యానికి సోపానమని ప్రసన్న స్పష్టం చేశారు. వైఎస్సార్ అమలు చేసిన వినూత్న సంక్షేమ పథకాలను ప్రజల మనసుల్లో నుంచి చెరపడం ఎవరి తరం కాదన్నారు. సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్మోహన్రెడ్డితోనే వైఎ స్సార్ స్వర్ణయుగం మళ్లీ రానుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని జగన్మోహన్రెడ్డి, విజయమ్మ, షర్మిల మొదటి నుంచి పోరాడారన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. సీమాంధ్రను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు జగన్‌కు పట్టం కట్టాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని ప్రసన్న అన్నారు. నల్లపరెడ్డి గీతమ్మ నామినేషన్ దాఖలు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సతీమణి నల్లపరెడ్డి గీతమ్మ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రసన్నతోపాటు గీతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు తనయుడు నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మండల కన్వీనర్లు ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, బెజవా డ గోవర్ధన్‌రెడ్డి, గంధం వెంకటశేషయ్య, టంగుటూరి మల్లికార్జున్‌రెడ్డి, నేతలు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నిరంజన్‌బాబురెడ్డి, వీరి చలపతి, మల్లికార్జున్‌రెడ్డి, నరసింహులురెడ్డి, వినీత్‌రెడ్డి, సర్పంచ్‌లు కూట్ల ఉమా, గడ్డం రమణమ్మ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో చీఫ్ సెక్రటరీ మహంతి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి శనివారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తొలుత వసంత మండపంలో జరిగిన శ్రీవారి వార్షిక వసంతోత్సవంలో సీఎస్ దంపతులు పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత స్వామిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ కూడా ఉన్నారు. రంగనాయక మండపంలో సీఎస్ దంపతులకు జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
రేపటి నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి పాదయాత్ర
విడవలూరు, న్యూస్‌లైన్: త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం నుంచి పాదయాత్ర చేయనున్నారు. తొలుత మండలంలోని తీర ప్రాంత పంచాయతీ రామచంద్రాపురం నుంచి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. పాదయాత్ర ఇలా రామచంద్రాపురం పంచాయతీలోని పొన్నపూడి పెదపాళెంలో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కొత్తూరు, దళితవాడ, లక్ష్మీపురం, ప్రశాంతగిరి, వెంకటనారాయణపురం, పొన్నపూడి, బుసిగాడిపాళెం, గిరిజనకాలనీ, చంద్రశేఖరపురం, రవీంద్రపురం, రామచంద్రాపురం వరకు సాయంత్రం ఐదు గంటల దాకా నిర్విరామంగా పాదయాత్ర సాగుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంతో పాటు స్థానిక సమస్యలు ఆయన తెలుసుకుంటారు. 15వ తేదీ మండలంలోని దండిగుంట, వరిణి, వీరారెడ్డిపాళెం, గాదెలదిన్నె గ్రామాల్లో పాదయాత్ర సాగుతుంది. 16, 17, 18వ తేదీల్లో కోవూరు , 22, 23 తేదీల్లో బుచ్చిరెడ్డిపాళెం , 24, 25 తేదీల్లో కొడవలూరు , 26, 27, 28 తేదీల్లో ఇందుకూరుపేట మండలాల్లో పాదయాత్ర సాగుతుంది. ఈ పాదయాత్రకు కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, ఇందుకూరుపేట మండలాల నుంచి భారీగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. -
ప్రసన్నను భారీ మెజార్టీతో గెలిపించండి
ఇందుకూరుపేట, న్యూస్‌లైన్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని గెలిపించి విజయభేరి మోగించాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. మండలంలోని గంగపట్నం శ్రీచాముండేశ్వరీదేవి ఆలయం వద్ద కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తలపెట్టిన ఎన్నికల ప్రచార విజయభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటర్లే దేవుళ్లని, ఓటు అనే ఆయుధంతో మంచి నాయకత్వాన్ని కోరుకోవాలన్నారు. రాజకీయమంటే సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయడమేనని నిరూపించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తొలిసారిగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార విజయభేరికి ప్రసన్నకుమార్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ తమ ఓట్లను ప్రసన్నకు వేసి భారీ మెజార్టీతో కోవూరు చరిత్రను తిర గరాయాలని జూపూడి అన్నారు. విజయభేరికి అధ్యక్షత వహించిన వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి రైతాంగానికి ఉచిత విద్యుత్ అందించిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. అటువంటి కుటుంబంపై కుట్ర పన్ని ఏ కేసులో ఆధారాలు లేకున్నా జగన్మోహన్రెడ్డిని జైల్లో పెట్టించారన్నారు. న్యాయస్థానానికి సమాధానం చెప్పలేక సీబీఐ చెత్తులెత్తేసిందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో తొలుత ఆమరణ నిరాహారదీక్ష చేసిన వ్యక్తి ప్రసన్నకుమార్రెడ్డే అని అన్నారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే తన చివరి రక్తపు బొట్టు వరకు ఉంటానని తెలిపారు. వైఎస్సార్ స్వర్ణయుగ పాలన జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు. ఊటీని తలపిస్తున్న ఇందుకూరుపేట తరహాలోనే జగన్ నాయకత్వంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలను తీర్చి దిద్దుతానన్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి రానున్న సాధారణ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ నెల్లూరు రాజకీయాల్లో నల్లపరెడ్డి కుటుంబీకులకు ప్రత్యేకత ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ మరణాంతరం సంక్షేమ పథకాలు కుంటుపడ్డాయని, వాటిని కొనసాగించే సత్తా జగన్మోహన్రెడ్డికే ఉందన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. నెల్లూరు రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్లు క ల్పించిన ఘనత వైఎస్సారేదనన్నారు. రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపగల సత్తా జగన్మోహన్రెడ్డికే ఉందన్నారు. గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ కోవూరు రికార్డులు బద్దలు కొట్టేలా నియోజకవర్గ ప్రజలు సాధారణ ఎన్నికల్లో ప్రసన్నకుమార్‌రెడ్డిని గెలిపించాలన్నారు. రాష్ట్రవిభజన విషయంలో రెండు పార్టీలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న తరుణంలో జగన్మోహన్రెడ్డి జైల్లో ఉండి నిరాహార దీక్ష చేశారన్నారు. నేడు దేశంలోని ప్రముఖులను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కూడగడుతున్నారన్నారు. ఈ తరుణంలో జగన్మోహన్రెడ్డి నాయకత్వం ప్రజలకు అవసరమని తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ను మరచిన నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రచ్చబండ ప్రవేశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సాధారణ ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ వైఎస్సార్సీపీ విధివిధానాలు, వైఎస్సార్ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లనున్నామన్నారు. దీనిలో భాగంగానే జిల్లా లో తొలిసారిగా ప్రసన్నకుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారభేరిని ప్రారంభించారన్నారు. ప్రసన్నను గెలిపించాలని ఆయన కోరారు. ఇందుకూరుపేట వైఎస్సార్సీపీ నాయకులు దువ్వూరు కల్యాణ్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, గొల్లపల్లి విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్, పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు అనిత, మండల కన్వీనర్లు ములుమూడి వినోద్‌కుమార్ రెడ్డి, గంధం వెంకటశేషయ్య, బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి, రూప్‌కుమార్ యాదవ్, నాపా వెంకటేశ్వర్లునాయుడు పాల్గొన్నారు.