ప్రసన్నను భారీ మెజార్టీతో గెలిపించండి | prasana kumar reddy should win with huge majority | Sakshi
Sakshi News home page

ప్రసన్నను భారీ మెజార్టీతో గెలిపించండి

Published Mon, Nov 25 2013 4:09 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM

prasana kumar reddy should win with huge majority

ఇందుకూరుపేట, న్యూస్‌లైన్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని గెలిపించి విజయభేరి మోగించాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. మండలంలోని గంగపట్నం శ్రీచాముండేశ్వరీదేవి ఆలయం వద్ద కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తలపెట్టిన ఎన్నికల ప్రచార విజయభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటర్లే దేవుళ్లని, ఓటు అనే ఆయుధంతో మంచి నాయకత్వాన్ని కోరుకోవాలన్నారు.
 
 రాజకీయమంటే సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయడమేనని నిరూపించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తొలిసారిగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార విజయభేరికి ప్రసన్నకుమార్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ తమ ఓట్లను ప్రసన్నకు వేసి భారీ మెజార్టీతో కోవూరు చరిత్రను తిర గరాయాలని జూపూడి అన్నారు. విజయభేరికి అధ్యక్షత వహించిన వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి రైతాంగానికి ఉచిత విద్యుత్ అందించిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు.
 
 అటువంటి కుటుంబంపై కుట్ర పన్ని ఏ కేసులో ఆధారాలు లేకున్నా జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టించారన్నారు. న్యాయస్థానానికి సమాధానం చెప్పలేక సీబీఐ చెత్తులెత్తేసిందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో తొలుత ఆమరణ నిరాహారదీక్ష చేసిన వ్యక్తి ప్రసన్నకుమార్‌రెడ్డే అని అన్నారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే తన చివరి రక్తపు బొట్టు వరకు ఉంటానని తెలిపారు. వైఎస్సార్ స్వర్ణయుగ పాలన జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. ఊటీని తలపిస్తున్న ఇందుకూరుపేట తరహాలోనే  జగన్ నాయకత్వంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలను తీర్చి దిద్దుతానన్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి రానున్న సాధారణ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
 
 పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ నెల్లూరు రాజకీయాల్లో నల్లపరెడ్డి కుటుంబీకులకు ప్రత్యేకత ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ మరణాంతరం సంక్షేమ పథకాలు కుంటుపడ్డాయని, వాటిని కొనసాగించే సత్తా జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డిని గెలిపించి జగన్‌మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. నెల్లూరు రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్లు క ల్పించిన ఘనత వైఎస్సారేదనన్నారు.
 
 రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపగల సత్తా జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ కోవూరు రికార్డులు బద్దలు కొట్టేలా నియోజకవర్గ ప్రజలు సాధారణ ఎన్నికల్లో ప్రసన్నకుమార్‌రెడ్డిని గెలిపించాలన్నారు. రాష్ట్రవిభజన విషయంలో రెండు పార్టీలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న తరుణంలో జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఉండి నిరాహార దీక్ష చేశారన్నారు. నేడు దేశంలోని ప్రముఖులను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కూడగడుతున్నారన్నారు. ఈ తరుణంలో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం ప్రజలకు అవసరమని తెలిపారు.

 సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ను మరచిన నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రచ్చబండ ప్రవేశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సాధారణ ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ వైఎస్సార్సీపీ విధివిధానాలు, వైఎస్సార్ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లనున్నామన్నారు. దీనిలో భాగంగానే జిల్లా లో తొలిసారిగా ప్రసన్నకుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారభేరిని ప్రారంభించారన్నారు. ప్రసన్నను గెలిపించాలని ఆయన కోరారు.
 
 ఇందుకూరుపేట వైఎస్సార్సీపీ నాయకులు దువ్వూరు కల్యాణ్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, గొల్లపల్లి విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్, పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు అనిత, మండల కన్వీనర్లు ములుమూడి వినోద్‌కుమార్ రెడ్డి, గంధం వెంకటశేషయ్య, బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి, రూప్‌కుమార్ యాదవ్, నాపా వెంకటేశ్వర్లునాయుడు  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement