
శ్రీవారి సేవలో చీఫ్ సెక్రటరీ మహంతి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి శనివారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తొలుత వసంత మండపంలో జరిగిన శ్రీవారి వార్షిక వసంతోత్సవంలో సీఎస్ దంపతులు పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు.
అనంతరం ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత స్వామిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ కూడా ఉన్నారు. రంగనాయక మండపంలో సీఎస్ దంపతులకు జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.