venkateshwara swamy
-
కరీంనగర్ : వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు..వైభవంగా ఎదుర్కోలు వేడుక (ఫొటోలు)
-
స్వర్ణగిరి : తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి పాదరక్షలు ఎందుకు అరిగిపోయి ఉంటాయి?
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పాదరక్షలకోసం ఏటేటా తిరుమలకు ఉత్తరాన గల శ్రీకాళహస్తి గ్రామం, దక్షిణానగల కాంచీపుర గ్రామాలలోని చర్మకారులకు శ్రీవారి పాదముద్రలు ఇస్తారు. వారిరువురు విడివిడిగా ఆ పాదముద్రల కొలతలతో పాదరక్షలను చేసి వాటిని శిరస్సున పెట్టుకుని, ఊరూరా తిరిపమెత్తుకుంటూ వచ్చి అలిపిరి పూజ చేసి ఆ పాదరక్షను పూజామందిరంలో ఉంచుతారు. ఈ కొత్తపాదరక్షలు తయారై వచ్చే సమయానికి పాత పాదరక్షలు చాలావరకు అరిగిపోయి ఉంటాయి. శ్రావణ శనివారాలు ఉపవాసం ఉండి, పిండి తళిగలు వేస్తారు. ఆ పిండిమీద శ్రీవారి పాదముద్రలు వేస్తారు. ఆ రెండు పాదముద్రలను ఒకరికి తెలియకుండా మరొకరికి ఇస్తారు. శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన ఎందుకు? సిరులను, సంపదలను, సకలైశ్వర్యాలను కోరగానే భక్తులకు అందించే శ్రీమహాలక్ష్మికి పూవులన్నా, గాజులన్నా, కుంకుమన్నా బహుప్రీతి. విష్ణుమూర్తి అలంకారపియుడు కావడానికి బహుశ ఇదే కారణమేమో! పరమేశ్వరునికి పాలతో, ఉదకంతో అభిషేకం చేయడం, ఆంజనేయునికి సింధూరం పూత పూయడం, విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించడం ఎంతటి సత్ఫలితాలను ఇస్తుందో, శ్రీ మహాలక్ష్మికి కుంకుమతో చేసే పూజ అంతటి దివ్యసంపదలను అందిస్తుంది. త్వరిత గతిన శుభాలను చేకూరుస్తుంది. -
నేడు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్న సీఎం జగన్
-
నెల్లూరులో రెండోరోజు వెంకటేశ్వర వైభవోత్సవాలు
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘ఉప్పెన’ టీం
సాక్షి, తిరుమల: ‘ఉప్పెన’ సినిమాతో భారీ విజయం అందుకున్నారు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చి బాబు. వీరందరికి టాలీవుడ్లో ఇది డెబ్యూ చిత్రం కావడం విశేషం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. అదే రేంజ్లో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ‘ఉప్పెన’ ఘన విజయం సాధించడంతో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం వెంకటేశ్వర స్వామీ ఆశీస్సుల కోసం తిరమల వెళ్లారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీ శెట్టి, నిర్మాత నవీన్, డైరెక్టర్ బుచ్చిబాబు తదితరులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరంతా కాలినడకన కొండెక్కి స్వామిని దర్శించుకున్నారు. హీరో, హీరోయిన్లు కాలినడకన తిరుమల కొండ మెట్లెక్కుతున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలువుతున్నాయి. అనంతరం వీరంతా వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ‘ఉప్పెన’ టీంతో పాటు తుడా చైర్మన్ చెవి రెడ్డి కూడా ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న శివన్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తొలిసారి ప్రైవేట్ సంస్థలకు చెందిన ఐదు ఉపగ్రహాలను ప్రయోగించనున్న సంగతి తెలిసిందే. పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ ద్వారా ఈ నెల 28 ఉదయం షార్ నుంచి రోదసిలోకి ఉపగ్రహాలను పంపనున్నారు. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్, ఎంపీ మార్గాని భరత్ తదితరులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: వరంగల్‌లో ఉప్పెన టీం సందడి -
చక్రస్నానంతో సేద తీరిన శ్రీవారు
తిరుమల: లక్షలాది భక్తుల జయజయ ధ్వానాల నడుమ 9 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగిశాయి. చివరి రోజైన మంగళవారం ఉదయం 3 గంటల నుంచే పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవంతో స్వామివారు వరహాస్వామి ఆలయానికి చేరుకున్నారు. వివిధ వాహనాలపై ఊరేగి అలసి సొలసిన శ్రీవారు తిరుమంజనం సేవలో సేద తీరారు. జీయర్లు, ఆలయ అర్చకుల నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. వైదికంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ, పండితుల వేదఘోష, అశేష భక్త జన గోవింద నామ స్మరణల మధ్య గర్భాలయంలోని మూలమూర్తి అంశమైన సుదర్శన చక్రాళ్వార్కు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. భక్తులు సైతం పుష్కరిణిలో పెద్దఎత్తున ఆచరించి పునీతులయ్యారు. వేడుకగా సాగిన ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో పి.బసంత్‌కుమార్, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్ పాల్గొన్నారు. అనంతరం రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఆగమ శాస్త్రోక్తంగా గరుడ పతాకాన్ని కిందకు దించి బ్రహ్మోత్సవాల్ని ముగించారు. వచ్చిన భక్తులు 7 లక్షల పైనే.. బ్రహ్మోత్సవాల సందర్భంగా 7.07 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. గరుడ సేవ రోజున శ్రీవారి మూలమూర్తిని 92 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ పెట్టామని, 34.01 లక్షల లడ్డూలను విక్రయించామని తెలిపారు. హుండీ ద్వారా రూ.20.40 కోట్లు, వగపడి ద్వారా రూ.8.82 కోట్ల ఆదాయం లభించిందని వివరించారు. స్థానికులతో కలిసి 3 లక్షల మందికిపైగా భక్తులు గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకున్నారన్నారు. 3.23 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. 8 రోజుల్లో 26 లక్షల మందికి భోజనాలు, అల్పాహారం, 13.67 లక్షల యూనిట్ల పాలు, టీ, కాఫీలను భక్తులకు అందించామని వివరించారు. గరుడ సేవ రోజున 2.47 లక్షల మందికి అన్న ప్రసాదాలు, అల్పాహారం, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 5 లక్షల తాగునీటి బాటిళ్లు అందించినట్టు వెల్లడించారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా 1.50 లక్షల జియో ట్యాగ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేసిన టీటీడీ అధికారులకు, సిబ్బందికి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి ధన్యవాదాలు తెలిపారు. వేడుకగా బాగ్ సవారి ఉత్సవం బ్రహ్మోత్సవాల ముగిసిన అనంతరం బుధవారం సాయంత్రం బాగ్ సవారి ఉత్సవం నిర్వహించారు. తన భక్తుడైన అనంతాళ్వారు భక్తికి మెచ్చిన స్వామివారు బ్రహ్మోత్సవాల మరునాడు అనంతాళ్వారు తోటలోకి అప్రదక్షిణంగా వెళ్లి.. తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తానని అభయమిచ్చారని ప్రతీతి. అందులో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరుమల శ్రీవారిని విజయదశమినాడు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి మహాద్వారం వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఈవో, అడిషనల్ ఈవోలు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో జస్టిస్ మహేశ్వరికి ఆశీర్వచనం అందించారు. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరుడిని కూడా దర్శించుకున్నారు. సమష్టి కృషితో విజయవంతం టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీవారి సేవకుల సమష్టి కృషితోనే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. చక్రస్నానం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. వాహన బేరర్లు ఎంతో భక్తిభావంతో వాహనాలను మోశారని.. ఈవో, అదనపు ఈవో, తిరుపతి జేఈవో, సీవీఎస్వోతోపాటు ఉన్నతాధికారులు విశేష సేవలందించారని కొనియాడారు. -
తిరుమలలో భద్రతా వైఫల్యం
తిరుమల : నిరంతర నిఘా వుండే తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. క్యూకాంప్లెక్స్‌లోని గేట్లను పగలగొట్టి ముగ్గురు వ్యక్తులు శనివారం అక్రమంగా శ్రీవారి దర్శనానికి ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయంలో విధుల్లో వున్న టీటీడి సిబ్బంది వారిని అడ్డగించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. శ్రీవారి దర్శనార్థం మహారాష్ట్ర లోని పుణేకు చెందిన 15 మంది భక్తులు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు చేరుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూలైన్లు నిండిపోవడంతో వీరు క్యూకాంప్లెక్స్‌కు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లోకి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి క్యూకాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలోకి చేరుకున్నారు. ఇందులో 12మంది శ్రీవారి దర్శనం కోసం వేచివుండగా...ముగ్గురు మాత్రం కంపార్టుమెంట్ నుంచి బయటకు వచ్చారు. అడ్డదారి గుండా ఆలయంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించి ఎలిఫెంట్ గేట్ వద్ద వున్న గేట్ తాళాలను పగలగొట్టారు. వేకువజామున శ్రీవారి సుప్రభాతసేవ జరిగే సమయంలో మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలనిడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 63,332 మంది భక్తులు దర్శించుకోగా..హుండీ ఆదాయం రూ. 2 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని శుక్రవారం 63,238 మంది భక్తులు దర్శించుకోగా స్వామివారి హుండీకి రూ. 2.05 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో గురువారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనార్థం బుధవారం ఉదయం రెండు కంపార్టెమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామి వారిని 74,628 మంది భక్తులు దర్శించుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.03 కోట్లు వచ్చిందని ఆలయాధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి మంగళవారం ఉదయం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. సోమవారం 87,077 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.36 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 7 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న(ఆదివారం) స్వామివారిని 82,242 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీకి రూ. 2.06 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి 3 గంటలు
తిరుమల: తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2 గంటల సమయం పడుతోంది. రద్దీ తక్కువగా ఉండడంతో సర్వదర్శనానికి మూడు గంటల సమయం మాత్రమే పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది. మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. -
తిరుమలలో రద్దీ సాధారణం
తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ ఓ మోస్తరుగా ఉంది. బుధవారం ఉదయం సమయానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(శుక్రవారం) స్వామివారిని 64,915 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.92 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
కాసులు చెల్లిస్తేనే వైద్యం చేస్తున్నారు
సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి పట్టణ శివారులోని గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రికి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి పట్టణంలోని ఎఫ్ఆర్ఎస్ వద్ద ఉన్న దర్గాలో మంత్రి ప్రార్ధనలు చేశారు. సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ పనులు, నూతనంగా ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన ఫలహార శాలను డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను పద్మాదేవేందర్‌రెడ్డి, హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆస్పత్రిలో అందిస్తున్న ైవె ద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ శరత్, వైద్య విధాన పరిషత్ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ వీణాకుమారి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పద్మ, ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రి సేవలపై రోగుల ఫిర్యాదు మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రిని పరిశీలిస్తున్న సమయంలో రోగులు ఆస్పత్రిలో అందుతున్న సేవలపై ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో డ బ్బులు ఇవ్వనిదే వైద్యం చేయడం లేదన్నారు. మంగళవారం ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన ఆస్పత్రిని పరిశీలించారు. ఈ క్రమంలో మెటర్నిటీ వార్డులోని మహిళా రోగులు ప్రసవం కోసం వస్తే వైద్య సిబ్బంది డ బ్బులు డిమాండ్ చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకవచ్చారు. రోగులకు అవసరమైన మందులను బయటి నుంచే తెచ్చుకోవాలని చెబుతున్నారన్నారు. డ్యూటీ డాక్టర్లు సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రి విషయంలో ఇకపై ఫిర్యాదులు రాకుండా చూడాలని ప్రత్యేకంగా ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేసి బాక్స్‌పై సూపరింటెండెంట్ ఫోన్ నెంబర్ రాసి ఉంచాలని సూచించారు. ఆసుపత్రి వెనకాల పిచ్చిమొక్కలు పెరగడం వాటిని తొలగించకపోవడంతో ఆసుపత్రి ఆవరణను శుభ్రంగా ఉంచాలని సూచించారు. -
వైభవంగా వెంకన్న రథోత్సవం
నారాయణవనం, న్యూస్‌లైన్: పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణల మధ్య ఉప్పు, మిరియాలు చల్లుతుండగా 40 అడుగుల చెక్క రథంపై స్వామి వారు పురవీధుల్లో విహరించారు. ఉదయం 7.20 గంటలకు ప్రారంభమైన రథోత్సవం సాయంత్రం 5.30 గంటలకు పూర్తయింది. వేకువ జామున 2.30 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించిన అర్చకులు శుద్ది, నిత్యకట్ల, గంట తదితర కార్యక్రమాలను పూర్తి చేశారు. ఉదయం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వరుడు మాడవీధుల్లో హారతులు అందుకుని రథాన్ని అధిరోహించారు. ఉదయం 7.20 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. నగరువీధి, ట్రంకురోడ్డు, మట్లవారివీధి, బజారువీధి మీదుగా గంగుండ్ర మండపానికి 11 గంటలకు రథం చేరుకుంది. గ్రామీణ ప్రజల కోసం ఆగిన రథం తిరిగి 3.30 గంటలకు బయలుదేరి పద్మశాలివీధి, తేరువీధి మీదుగా గమ్యస్థానానికి 5.30 గంటలకు చేరుకుంది. ఆలయానికి చేరుకున్న ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్థానిక ఎస్ఐ వెంకటశివకుమార్ తన సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా జిల్లా పద్మసాలి సంఘం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కనువిందు చేసిన కల్యాణోత్సవం బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి ఆలయంలో నిర్వహించిన కల్యాణోత్సవం భక్తులకు కనువిందు చేసింది. గంటన్నర పాటు నిర్వహించిన ఆర్జిత కల్యాణంలో వందల సంఖ్యలో దంపతులు పాల్గొని తీర్థ ప్రసాదాలతో పాటు వస్త్రబహుమానం పొందారు. అన్ని ప్రాంతాల్లో శ్రీదేవి, భూదేవితో స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. అయితే నారాయణవనం వెంకన్నకు వివాహం జరిగిన క్షేత్రం కావడంతో ఉభయ నాంచారులతో పాటు పద్మావతీ అమ్మవారితో కల్యాణోత్సవం నిర్వహించారు. టీటీడీ ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ విభాగాధిపతులతో పాటు స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెండెంట్ పీతాంబరరాజు, ఆలయ అధికారి బాలనరసింహారావు, సహాయకులు వీరయ్య, షరాబులు మణి, గోవిందస్వామి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రి 11 గంటలకు స్వామి వారు అశ్వవాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో విహరించారు. మంగళవారం ఉదయం పద్మసరస్సులో చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
పెద్ద హనుమంతునిపై వెంకన్న విహారం
నారాయణవనం,న్యూస్‌లైన్ : పద్మావతీ సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శనివారం ఉదయం రామబంటు హనుమంతున్ని వాహనంగా చేసుకుని పురవీధుల్లో విహరించారు. గజ, వృషభాలతో భజన బృందాలు, కేరళ సాంస్కృతిక మేళాలతో స్వామి వారి ఊరేగింపు కొనసాగింది. సాయంత్రం శ్వేతాంబరాలను ధరించిన శ్రీదేవి,. భూదేవితో కల్యాణ వెంకన్న వసంతోత్సవంలో పాల్గొన్నారు. రాత్రి గజ వాహనంపై భక్తులను కటాక్షించారు. వేకువజామున 5 గంటలకు సుప్రభాతసేవతో పాటు నిత్యకట్ల, శుద్ధి, గంట తదితర కార్యక్రమాలను అర్చకులు పూర్తి చేశారు. శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 8.30 గంటలకు గ్రామోత్సవంలో పెద్దహనుమంతునిపై అధిరోహించిన స్వామి వారు భక్తుల నుంచి హారతులను అందుకున్నారు. అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామివారికి ఉభయ నాంచారులతో కలిసి స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, పాలు, పెరుగు, పసుపుతో అభిషేకాలు చేశారు. సాయంత్రం కైంకర్యాల అనంతరం తిరుచ్చి వాహనంపై వెంకన్న ఉభనాంచారులతో తెల్లటి పట్టు వస్త్రాలను ధరించి మాడ వీధుల్లో విహరించారు. ఈ సందర్భంగా స్వామి పరిచారకులు భక్తులపై సుగంధ ద్రవాలతో కూడిన తిరువర్ణాలను చల్లారు. రాత్రి 8 గంటలకు తెల్లటి ఐరావతాన్ని అధిరోహించి స్వామివారు ఊరేగింపుగా వెళ్లి భక్తులకు కనులవిందు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకన్న ఆలయంతో పాటు మాడవీధుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో హరినాథ్, సూపరింటెండెంట్ పీతాంబరరాజు, ఆలయాధికారి బాలనరసింహరావు, సహాయకులు వీరయ్య, షరాబ్‌లు మణి, గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆర్జిత కల్యాణంలో పాల్గొనండి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి ఆలయంలో కల్యాణ వెంకటేశ్వరస్వామికి నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవంలో దంపతులు పాల్గొనాలని స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో హరినాథ్ కోరారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారని తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి రెండున్నర గంటల పాటు ఆర్జిత కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ఆలయ కార్యాలయంలో 500 రూపాయల రుసుము చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చని తెలిపారు. కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు వస్త్ర బహుమానం ఇస్తారని తెలిపారు. -
ఘోరం
తమ తొమ్మిది నెలల కుమారునికి పుట్టెంటుకలు తీయించుకోవడానికి ఆ దంపతులు బంధువులతో కలిసి వెంకన్న దర్శనానికి బయలుదేరారు. పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లె సమీపంలోని మలుపు మృత్యుపాశమైంది. వారు ప్రయాణిస్తున్న వాహనం మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి చెట్టును ఢీ కొంది. ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. పుట్టెంటుకలు తీయించుకోవాల్సిన తొమ్మిదినెలల చిన్నారి మృత్యువాత పడడం విషాదం. ఇదే ప్రమాదంలో రోడ్డు పక్కనే ఉన్న వెంకటప్రసాద్ అనే బాలుడు మృతి చెందడం మరో విషాదాంతం. పుల్లంపేట, న్యూస్‌లైన్: తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతూ మంగళవారం ఉదయం ఐదుగురు మృతి చెందిన సంఘటన పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లె సమీపంలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం ఉత్తరతాండాకు చెందిన టిల్లు, శారద దంపతులు తమ కుమారునికి పుట్టు వెంట్రుకలు (9నెలలు) తీయించేందుకు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. డైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం సంభవించింది. వారు ప్రయాణిస్తున్న కారు పుత్తనవారిపల్లె మలుపు వద్దకు రాగానే అదుపు తప్పడంతో బోల్తా కొట్టి చింత చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీరాములు(70), పెంటమ్మ(40), హుస్సేన్(15), సోను(6)తో పాటు 9నెలల శిశువు రాహుల్ కూడా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. టిల్లు, బాలు, చిన్న, శారద, విజయ, డ్రైవర్ సైదులు తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికు లు సహాయక చర్యలు చేపట్టి రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సైదులు, చిన్న,బాలు పరిస్థితి విషమంగా వుండడంతో తిరుపతికి తరలించారు. ఇదిలా వుండగా మండలపరిధిలోని శ్రీరాములు పేట గ్రామానికి చెందిన కాసారం వెంకటశివప్రసాద్ తన మేనత్తతో కలిసి చింతచిగురుకోసం పుత్తనవారిపల్లెకు ద్విచక్రవాహనంలో వచ్చారు. మేనత్త క్రిష్ణవేణి చెట్టు ఎక్కి చింతచిగురు కోస్తూ ఉండగా ప్రమాదానికి గురైన కారు చెట్టు కింద ఉన్న వెంకటశివప్రసాద్(5)ను ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న హెడ్‌కానిస్టేబుల్ గోపీనాయక్, కానిస్టేబుల్ నాగేంద్రలు క్షతగాత్రులను రాజంపేటకు తరలించారు. సంఘటనా స్థలంలో పడివున్న బాధితుల నగదు, బంగారు నగలను వారి బంధువులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ గోపీనాయక్ పేర్కొన్నారు. ఆ మలుపు ప్రమాదాల నెలవు పుత్తనవారిపల్లె సమీపంలో మలుపు ప్రమాదాలకు నెలవుగా మారింది. ఈ ప్రదేశంలో పలుమార్లు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గతేడాది ఆటో-లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు మృత్యు ఒడికి చేరుకోగా మరో నలుగురు గాయాలపాలైయ్యారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోలేదు. రోడ్డు ట్యాక్సుల పేరిట వేలాదిరూపాయలు వసూలు చేస్తున్న సంబంధిత శాఖ అధికారులు ప్రయాణికుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పుత్తనవారిపల్లె సమీపంలో అతిపెద్ద మలుపు ఉన్నా సంబంధిత ప్రాంతంలో ప్రమాదాల నివారణకు కనీసం ఎల్ బోర్డును కూడా ఏర్పాటు చేయలేదు. ఇకనైనా సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఆర్డీఓ పరామర్శ రాజంపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని, మృతదేహాలను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆర్డీఓ విజయసునీత పరామర్శించారు. ఎంవీఐ దామోదర్‌నాయుడు ప్రమాద కారణాలపై ఆరా తీశారు. మృతుల వద్దనున్న నగదు, నగలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుల్లంపేట పోలీసులు రూ.13,100లు నగదు, తాళిబొట్టు, ఇతర ఆభరణాలను పరిశీలించి భద్రపరిచారు. ప్రథమ చికిత్స అనంతరం క్షతగాత్రులను తిరుపతికి తరలించారు. -
శ్రీవారి సేవలో చీఫ్ సెక్రటరీ మహంతి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి శనివారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తొలుత వసంత మండపంలో జరిగిన శ్రీవారి వార్షిక వసంతోత్సవంలో సీఎస్ దంపతులు పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత స్వామిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ కూడా ఉన్నారు. రంగనాయక మండపంలో సీఎస్ దంపతులకు జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
సినిమాలో బ్రహ్మోత్సవం
చిలుకూరు బాలాజీ ఆలయ స్థల పురాణం ఆధారంగా రూపొందిన చిత్రం ‘చిలుకూరు బాలాజీ’. అల్లాణి శ్రీధర్ దర్శకుడు. ఇందులో వెంకటేశ్వరస్వామిగా ‘శ్రీభాగవతం’ ఫేమ్ సునీల్‌శర్మ నటించారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఏకాదశ ప్రదక్షిణాలతో భక్తులకు మహర్దశను కలిగించే మహోన్నత పుణ్యక్షేత్రం చిలుకూరు. ఈ స్థల పురాణంలో ఎన్నో ఆసక్తికరమైన ఘట్టాలున్నాయి. నాలుగొందల ఏళ్ల క్రితం భక్తుని కోరిక మేరకు ఏడుకొండలు దిగివచ్చి చిలుకూరులో వెలిసిన కోనేటి రాయని వృత్తాంతం ప్రేక్షకుల్ని తన్మయానికి లోను చేస్తుంది. ‘కదిలింది పాదం’ అనే పాటలో వైకుంఠం నుంచి శ్రీవారు తిరుమల గిరుల్లో కొలువవ్వడం, తర్వాత స్వయంగా ఆయనే... చిలుకూరు చేరుకోవడం లాంటి సన్నివేశాలు గ్రాఫిక్స్‌లో తీశాం. ఆ పాట సినిమాకే హైలైట్. చిలుకూరులో ప్రధాన ఆర్చకులైన కోవిదుల సౌందర్‌రాజన్ ఆధ్వర్యంలో ఈ చిత్రానికి రచన జరిగింది. ప్రస్తుతం చిలుకూరులో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను చిత్రీకరిస్తున్నాం. మగధీర, రుద్రమదేవి చిత్రాలకు గ్రాఫిక్స్ అందించిన మైండ్ విజన్ సంస్థ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందిస్తోంది. మే నెలలో పాటలను, జూన్ తొలివారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుమన్, సాయికుమార్, ఆమని, భానుశ్రీ మెహ్రా తదితరులు ఇందులో ముఖ్య తారలు. -
కల్యాణ వైభోగం...
మన్యంకొండ (దేవరకద్ర రూరల్), న్యూస్‌లైన్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగ తిరుకల్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అమ్మవారి కల్యాణం కన్నులపండువగా జరిగింది. ముందుగా ప్రత్యేక అలంకరణలో ఉన్న వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగతాయారు దేవతామూర్తుల విగ్రహాలను గర్భగుడి నుంచి శేషసాయి వాహనంలో ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం శోభాయమానంగా అలంకరించిన మండపంలో అమ్మవారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు చేసిన గోవింద నామస్మరణతో కల్యాణ మండపం మార్మోగింది. అనంతరం ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. రకరకాల పూలు, బంగారు అభరణాలు, నూతన వస్త్రధారణల మధ్య వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ అమ్మవారు ధగధగ మెరిసిపోతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం అధికారులు భ క్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కల్యాణమహోత్సవ ఘటాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా దేవస్థానం వద్ద రకరకాల తినుబండారాలు, ఆట వస్తువులు తదితర దుకాణాలు వెలిశాయి. కార్యక్రమంలో దేవస్థానం వంశపార్యపర ధర్మకర్త అళహరి నారాయణస్వామి, ఈఓ రాఘవేంద్రరావు, పాలక మండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది, పురోహితులు పాల్గొన్నారు. -
తిరుమలలో మొదలైన నీటి కష్టాలు
-
కిరీటదారి
-
మార్మోగిన హరినామస్మరణ
మన్యంకొండ పుణ్యక్షేతం గోవింద నామస్మరణతో పులకించింది. ఆదివారం మన్యం కొండ బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. సంప్రదాయం ప్రకారం మొదటిరోజు తిరుచ్చిసేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భజనలు,కోలాటాలతో భక్తులు స్వామివారిని కోటకదిరనుంచి కొండపైకి తీసుకొచ్చారు. దేవరకద్ర రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రసిద్ధి చెందిన మన్యం కొండ లక్షీ్ష్మవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆది వారం రాత్రి 10 గంటలకు అం గరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మన్యంకొండ సమీపంలోని కోటకదిర ఆళహరి వంశీయుల ఇంట్లో ప్రత్యేకపూజల అనంతరం స్వామివారిని మన్యంకొండపైకి పల్లకీలో ఊరేగింపుగా (తిరుచ్చిసేవ) తీసుకువచ్చారు. స్వామివారిని గుట్టపైకి తీసుకువచ్చి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సం దర్భంగా ఊరేగింపులో భక్తులు భజ నలు, కోలాటాలు వేశారు. భ క్తుల హరినామస్మరణతో కోటకదిర పులకించిపోయిం ది. పురోహితుల వేదమంత్రాలు, సన్నా యి వాయిద్యాలు, బ్యాండు మేళతాళాల మధ్య స్వామివారి మధ్య పల్లకీసేవ ముం దుకు కదిలింది. ఊరే గింపులో మహిళలు పెద్దఎత్తున బొడ్డెమ్మలు వేశా రు. పెద్దఎ త్తున భక్తులు బాణాసంచా కా ల్చారు. కో టకదిర నుంచి కాలిబాటన స్వామివారి ని కాగడాల వెలుతురులో ఊరేగిస్తూ ప ల్లకీలో దాదాపు నాలుగు కిలోమీటర్ల దూ రంలో ఉన్న మన్యంకొండ గుట్టపైకి తీ సుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అ నంతరం ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నేడు సూర్యప్రభ వాహనసేవ మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వా మి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో భాగం గా సోమవారం స్వామివారి సూర్యప్రభ వాహనసేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి ని గర్భగుడి నుంచి మండపం వరకు సూ ర్యప్రభ వాహనంలో పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య తీసుకొస్తారు. అక్కడ ప్రత్యేక పూ జలు చేసిన అనంతరం మళ్లీ స్వామివారిని సూర్యప్రభ వాహనంలో గర్భగుడిలోకి తీసుకెళ్తారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఆళహరి నారాయణస్వా మి, ఈఓ రాఘవేందర్రావు, దేవస్థానం సిబ్బంది, పురోహితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ
= స్వామి నగలు భద్రం = అర్చకునికి చెందిన 9 కాసుల బంగారం, రూ.10 వేల నగదు మాయం = రూ. 2.45 లక్షల విలువైన సొమ్ము అపహరణ పామర్రు, న్యూస్‌లైన్ : మండలంలోని కాపవరం శివారు పెరిశేపల్లిలో పద్మావతి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరి గింది. అయితో స్వామి నగలు భద్రంగా ఉండగా, అర్చకుడికి చెందిన రూ.2.45 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురైంది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు... వెంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు చలమచర్ల శ్రీమన్నారాయణాచార్యులు సోమవారం రాత్రి పూజలు ముగించుకుని 8 గంటల సమయంలో గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లి పోయారు. ధనుర్మాసం కావడంతో మంగళవారం తెల్లవారుజామునే ఆల యానికి వచ్చిచూసేసరికి తలుపులకు ఉన్న ఏడు తాళాలను బద్దలుగొట్టి, గొళ్లాలు విరగగొట్టి ఉన్నాయి. దక్షిణంవైపు తలుపు తీసి ఉండటంతో ఆయన వెంటనే ఆలయ ధర్మకర్త చెరుకూరి వెంకటరత్న గిరిబాబుకి విషయం తెలిపారు. దీంతో గిరిబాబు, గ్రామస్తులు ఆలయం వద్దకుచేరుకున్నారు. సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు పోయివుంటాయని భావించిన వారు తలుపులను తాకకుండా, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆలయంలోనికి వెళ్లి చూడగా స్వామివారి ఆభరణాలు యథాతథంగా ఉన్నాయి. స్వామి లాకర్ కూడా భద్రంగానే ఉంది. గర్భగుడిలోని బీరువాలో భద్రపరిచిన అర్చకులకు చెందిన 6 కాసుల గొలుసు, 3 కాసుల మరో గొలుసు సహా రూ.2.25 లక్షల విలువైన వస్తువులు, రూ.10 వేల నగదు కనిపించలేదు. డాగ్ స్క్యాడ్, క్లూస్‌టీమ్ పరిశీలన ఘటనాస్థలాన్ని డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీమ్ పరిశీలించాయి. పోలీసు జాగిలం ఆలయంలోని దక్షిణ పక్కన ఉన్న గోడ వెంబడి గ్రామంలోని పసుమర్రు డొంక రోడ్డు వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పాత కోళ్ల ఫారం వద్ద ఆగిపోయింది. ఆ ప్రాంతంలో రెండు వారాలుగా వలస కూలీలు ఉంటున్నారు. సోమవారం రాత్రే వారు తమ ఖాళీ చేసి వెళ్లి పోయారు. వారే చోరీచేసి ఉంటారని భావిస్తున్నారు. పామర్రు సీఐ శ్రీనివాసయాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ ఏసుపాదం, హెచ్‌సీ అయ్యన్న, మాజీ ఎంపీపీ జి.లక్ష్మీదాసు ఘటనాస్థలాన్ని సందర్శించారు. -
శ్రీవారి ప్రియభక్తులు
వేంకటేశ్వరస్వామికి 32,000 కీర్తనల మణిహారాన్ని వేసిన వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. శ్రీవారినే తన ‘వారు’ గా భావించుకున్న 18 కావ్యాల భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ. వీరి ప్రస్తావన లేకుండా స్వామి సేవ సంపూర్ణం కాదు. తిరుమలకు పశ్చిమ దిశలోని తరిగొండ గ్రామంలో కృష్ణయ్య, మంగమ్మ దంపతులుండేవారు. వారికి ఐదుగురు మగ సంతానం. కన్యాదానం చేయడానికి పుత్రికను ప్రసాదించమని వేంకటేశ్వరస్వామికి మొక్కుకుంటే, పుట్టింది కనుక, ఆమెను స్వామి పేరుతో వెంగమ్మ అన్నారు. అది క్రీ.శ.1730. శ్రీవారే నా వారు ‘‘శ్రీవేంకటేశ్వరుడే నా భర్త. నాకు పెళ్లేమిటి?’’ అనేది వెంగమ్మ. అయినా, చిత్తూరుకు సమీపంలోని నారగుంటపాళెం గ్రామానికి చెందిన ఇంజేటి వెంకటాచలపతితో ఆమెకు బలవంతంగా పెళ్లి జరిపించారు. ఇంతాచేస్తే ఆప్పుడామె వయసు పదేళ్లే. అయితే, కలసి కాపురం చేయకముందే వెంకటాచలపతి తనువు చాలించాడు. అయినా శ్రీనివాసుడినే భర్తగా భావించి పూలు, గాజులు, చెవికమ్మలతో నిత్యసుమంగళిగా ఉండేది. చివరకు తండ్రి కృష్ణయ్య మదనపల్లెకు చెందిన రూపావతారం సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద వెంగమ్మకు ఉపదేశం చేయించారు. దాంతో భక్తిమార్గంలో ఆమె మరింత పరిపూర్ణత చెందారు. తపస్వినిగా మారారు. ఆమె కలాన భక్తి శతకాలు... నోట కీర్తనలు అలవోకగా జాలువారేవి. ఆమె రచనలు చదివినవారు, భక్తిమార్గాన్ని కళ్లారా వీక్షించినవారు వెంగమ్మను ‘మహాయోగిని’గా భావించి, ‘వెంగమాంబ’ అని గౌరవంగా సంబోధించారు. అలా వెంగమ్మ వెంగమాంబ అయ్యారు. పుట్టినూరుతో కలిసి తరిగొండ వెంగమాంబగా ప్రసిద్ధి చెందారు. ఇరవై ఏళ్ల వయసులో వెంగమాంబ తిరుమలను తన ఆవాసంగా చేసుకున్నారు. స్వామికి ప్రతిరోజూ పుష్పాలు సమర్పించాలని, ప్రతి సాయంత్రం చివర్లో కర్పూర నీరాజనం ఇవ్వాలని కొండ వద్ద తులసివనం పెంచారు వెంగమాంబ. పూలమొక్కలు నాటారు. ఇందుకోసం దిగుడుబావిని తవ్వించారు. పగలు తుంబురుకోనలో తపస్సు... రాత్రి స్వామి ఆలయంలో పూజలు తిరుమలకు వచ్చే భక్తుల సందడి వల్ల తన ధ్యానానికి ఆటంకం కలుగుతోందని వెంగమాంబ ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలోని తుంబురుకోనకు చేరుకున్నారు. అక్కడ ఆమె నిశ్చింతగా తపస్సు చేసుకునేవారు. రాత్రి వేళలో బంగారు వాకిళ్లు మూసినా బిలమార్గం ద్వారా ఆమె ఆలయానికి వచ్చేవారు. రాత్రి అర్చనలో ఉపయోగించిన పూలు మారివుండటం, కొత్త పూలు కనిపిస్తూ ఉండటంతో ఆచారులు ఇది వెంగమాంబ మహిమగా రూఢిచేసుకున్నారు. దీంతో యాత్రికులకు భక్తి ప్రపత్తులు కలిగాయి. ఎందరెందరో జమీందారులు, భూస్వాములు, పాలెగాళ్లు, సంస్థానాధీశులు ఆమెకు భక్తితో విరాళాలు సమర్పించారు. సమస్తాన్నీ తిరుమలకు వచ్చే భక్తులకే వినియోగించారు. అన్న సత్రాలు నిర్వహించారు. వేసవిలో చలివేంద్రాలు, బ్రహ్మోత్సవాల్లో అన్నప్రసాదాలు కల్పించారు. క్రీ.శ.1817లో ఈశ్వర శ్రావణ శుద్ధ నవమినాడు వెంగమాంబ సమాధిలోకి ప్రవేశించారు. నేడు ఆ పుణ్యప్రదేశం వెంగమాంబ బృందావనంగా పేరొందింది. భవరోగ వైద్యుడు అన్నమయ్య అన్నమయ్య తాళ్లపాకలో (క్రీ.శ.1408-1503)జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజంపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. తన పదహారవ యేటనే తిరుమలకు చేరుకుని స్వామి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుని తన స్వరార్చనతో కీర్తించి తరించాడు అన్నమయ్య. శ్రీనివాస స్మరణే బతుకుగా, తిరువారాధనే తెరువుగా జీవించి సంకీర్తనా భవసాగరంలో మునిగితేలాడు. ‘మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా’ అంటూ మేలుకొలుపు పాటతో స్వామిని నిద్రలేపాడు. ‘జోవచ్యుతానంద’ అంటూ నిద్రపుచ్చాడు. నేటికీ అన్నమయ్య వంశీయులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆలయంలో అన్నమయ్య సంకీర్తనా భండారం వేంకటేశ్వరుడిని వే విధాలుగా స్తుతిస్తూ 32 వేల సంకీర్తనలు రచించారు అన్నమయ్య. వీటిలో దాదాపుగా 12వేల సంకీర్తనలు మాత్రమే రాగి రేకుల రూపంలో నిక్షిప్తమై లభిస్తున్నాయి. అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుడు, ఈతని కుమారుడు చినతిరుమలాచార్యుల సత్సంకల్పబలం వల్లే అవైనా మనకు దక్కాయి. తిరుమల ఆలయంలో నెలకొల్పిన అన్నమయ్య ‘సంకీర్తనా భాండారం (తాళ్లపాక అర)’ తరతరాల్ని ఉత్తేజితుల్ని చేస్తూ స్వామి సన్నిధానానికి నడిపించే ఆధ్యాత్మిక కోశాగారం. స్వామి ఆలయంలో ప్రతి రోజూ అర్ధరాత్రి సమయంలో ఏడుకొండలవాడికి ఏకాంత సేవ (పవళింపుసేవ) జరుగుతుంది. ఇందులో గర్భాలయానికి ముందున్న శయన మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన పట్టెమంచంపై ‘మణవాళ పెరుమాళ్’(నిత్యనూతన వరుడు) అనే భోగశ్రీనివాసమూర్తి వేంచేపు చేస్తారు. అదే సమయంలో ఆనంద నిలయ గర్భాలయ మూలమూర్తికి చిట్టచివరగా ‘ముత్యాల హారతి’ అనే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారి మంగళ కర్పూర నీరాజనం ఇస్తారు. తర్వాత అదే హారతి భోగ శ్రీనివాసుడికి ఇస్తారు. తాళ్లపాకవారి జోలపాట అందజేసి ఏకాంత సేవ ముగిస్తారు. తాళ్లపాక వారి లాలిపాట, తరిగొండ వారి ముత్యాల హారతి స్వామికి సమర్పించటం ఆనవాయితీగా మారింది. అలా ఆ ఇద్దరు మహాభక్తులు స్వామివారిని శాశ్వతంగా కొలుస్తూనే ఉన్నారు. అన్నంపెట్టే తండ్రి- ఆత్మనింపే తల్లి ‘‘మానవునికి అసంకల్పితంగా దైవం అనుభవంలోకి రావటానికి అందివచ్చినవి లలితకళలు. ‘పాట’ మధ్యమంగా శ్రీవేంకటేశ్వరుని తత్త్వాది విశేషాలను జనసామాన్యానికి అందించినవాడు అన్నమయ్య. మాండలికాలు, జాతీయాలు, సామెతలు వయ్యారాలు పోతూ ఈ సంకీర్తనలకు అపూర్వ రామణీయతను సంతరించి పెట్టాయి.’’ ‘‘తరిగొండ వెంగమాంబ చాలాకాలం తిరుమలకొండపైన, తుంబురకోన తీర్థం వద్ద తపస్సు చేస్తూ- తరిగొండ నృశింహస్వామికి, తిరుపతి వేంకటేశ్వరస్వామికి అభేదంగా కావ్యాలు, యక్షగానాలు, దండకాలు రచించింది. ఎన్నో సంప్రదాయాలకు ఎదురీది, అచంచలమైన భక్తితో స్వామిని సేవించి, ఎన్నెన్నో మహిమలు చూపి నారీలోకానికి ఆదర్శంగా నిలిచిన మాతృశ్రీ వెంగమాంబ గురించి ఎంతైనా చెప్పవచ్చు. ఆ తల్లి రచించిన సంకీర్తనలు సుమారు వంద వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆడియో రికార్డింగ్ చేయగా అందులో కొన్ని నేను స్వరపరిచి గానం చేసినవి కూడా ఉండటం నా పూర్వజన్మ సుకృతం.’’ - గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ అన్నమయ్య జోలపాట - వెంగమాంబ హారతి ‘‘దేవుడంటే ఓ పరిమితమైన ఆకారమేనన్న మౌఢ్యం, అర్థరహితమైన కుల విభేదత్వంతో సమాజం అనారోగ్యం పాలవుతుందని గ్రహించిన సర్వాంతర్యామి అన్నమయ్యగా అవతరించి సంకీర్తనౌషధం పంచాడు. సకలోపనిషత్సారాన్ని బ్రహ్మమొక్కటే అన్న సందేశంగా అందించాడు అన్నమయ్య. ఆ నాద సందేశాన్ని గ్రహించి, మనిషి మనిషికీ మధ్య ఉన్న అర్థరహితమైన అడ్డుగోడలు తొలగించుకొని, విశ్వజీవంతో అనుసంధానం కుదుర్చుకున్నప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది.’’ ‘‘దైవభక్తి అను అమృతపానంలో మత్తిల్లిన భక్తులను సమాజమెప్పుడూ అర్థం చేసుకోలేదు. భర్త రోగ కారణంగా అకారణమరణమందగా సమాజం వెంగమాంబను సుమంగళీ చిహ్నాలను తీసివేయమని శాసించింది. అర్థరహితమైన ఆ ఆచారాన్ని రెండు శతాబ్దాల క్రితమే ప్రశ్నించి, ఎదురించి నిలిచిన దృఢశీల వెంగమాంబ. వేంకటేశ్వర స్వామికి అన్నమయ్య జోల ప్రీతి. అన్నమయ్య జోల విన్న తర్వాత ఇంకేదీ వినని స్వామి తరిగొండ వెంగమాంబ హారతి మటుకు స్వీకరించాడట!’’ - ‘పద్మశ్రీ’ శోభారాజు -
నేటి నుంచి ఉపమాకలో బ్రహ్మోత్సవాలు
నక్కపల్లిన్యూస్లైన్: ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాకలో వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శని వారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రతిఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఉపమాకలో నేత్రపర్వంగా జరుగుతాయి. తిరుపతిలో మాదిరిగా ఇక్కడ కూడా ఏటా కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవా లు, ధనుర్మాసోత్సవాలను దేవాదాయశాఖ ఘనంగా నిర్వహిస్తుంది. బ్రహ్మోత్సవాల్లో బాగంగా శని వారం రాత్రి అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆదివారం (6వతేదీ) మధ్యాహ్నం ధ్వజారోహణ, రాత్రి తిరువీధి సేవ నిర్వహిస్తారు. ఆలయంలో ధ్వజ స్తంభం వద్ద ధ్వజ పటాన్నిఎగురవేసి అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించే కార్యక్రమంజరుగుతుంది. ఏడు నుంచి 14 వరకు ఉదయం, రాత్రి స్వామివారికి తిరువీది సేవలు నిర్వహిస్తారు. తిరువీధి సేవల్లో బాగంగా శ్రీదేవి,భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామిని వివిధ వాహనాల్లో ఉంచి ఉపమాక మాడ వీధుల్లో ఊరేగిస్తారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11న ఇత్తడి గరుడవాహనంపై స్వామికి తిరువీధి సేవ జరుగుతుంది. 12 రాత్రి రథోత్సవం సందర్భంగా స్వామిని, అమ్మవార్లను పుణ్యకోటి వాహనంపై తిరువీధుల్లో ఊరేగిస్తారు.13న సాయంత్రం మృగయా వినోదం కార్యక్రమం అనంతరం గజవాహనంపై తిరువీధి సేవ చేస్తారు. ఈరోజే విజయదశమి కావడంతో శమీపూజ నిర్వహించిన అనంతరం పుణ్యకోటి వాహనంపై తిరువీధి నిర్వర్తిస్తామని ప్రధానార్చకుడు వరప్రసాద్ చెప్పారు. 14న మధ్యాహ్నం పూర్ణాహుతి, వినోదోత్సవం, ఆపై స్వామివారి చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలకు సంబందించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో శేఖర్‌బాబు తెలిపారు. -
‘స్వర్ణమయ’కు శ్రీకారం
ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ విమాన గోపురాన్ని స్వర్ణమయం చేసే బృహత్తర కార్యానికి సోమవారం శ్రీకారం చుట్టారు. శ్రీవారి శేషాచలకొండపై దేవస్థానం ఆలయ చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు స్వర్ణమయ పథకాన్ని ప్రారంభించి తొలి విరాళాన్ని దేవస్థానం ఈవో త్రినాథరావుకు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం విరాళాలు, సేవల రుసుములు,ఫిర్యాదులు, సలహాల స్వీకరణ, ఆలయంలో జరిగే ఉత్సవాల వీక్షణకు ఏర్పాటు చేసిన ఏపీ ఆన్లైన్ సేవలను కూడా ఆయన ప్రారంభించారు. సుధాకరరావు మాట్లాడుతూ.. విమాన గోపురానికి బంగారు తాడపం చేయించాలని ట్రస్టుబోర్డు నిర్ణయం తీసుకుందని, ఇందుకు రూ. 6 కోట్లు అవసరమని అంచనా వేశామని చెప్పారు. ఈ పథకంలో భక్తులను భాగస్వాములను చేసేందుకు వారి నుంచి బంగారం లేదా రూ. 1,116 ఆపైన విరాళాలు స్వీకరించనున్నట్లు వివరించారు. విమాన గోపురాన్ని స్వర్ణమయం చేయటం రెండేళ్లలో పూర్తి చేయాలని సంకల్పించామన్నారు. భక్తులకు ఇచ్చే దేవస్థానం గదుల రిజర్వేషన్లు, దేవస్థానం, ఆలయ ఇతర సేవలు పొందేందుకు విదేశాలు, దూర ప్రాంతాల వారికి వెసులుబాటు కోసం ఎస్బీఐతో ఒప్పందం చేసుకునేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ ఆన్లైన్ సేవలు దేవస్థానం అధీనంలో ఉండేలా ప్రత్యేక గేట్‌వే కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ తరహా సేవలు విజయవాడ, భద్రాచలం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో అమలవుతున్నాయన్నారు. రాష్ట్రంలోని దేవస్థానాల్లో ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రగతి పథంలో ఉందన్నారు. గో సంరక్షణ, కాటేజీల నిర్మాణం, వైఖానస ఆగమ పాఠశాల నిర్వహణలో అగ్రగామిగా నిలుస్తోందని చెప్పారు. స్వర్ణమయ పథకానికి శ్రీవారి ఆలయ ట్రస్టుబోర్డు సభ్యుడు వేగేశ్న ఆనందరాజు తనతోపాటు ఆయన బంధువులు 18 మంది పేరున విరాళం అందించారు. మిగిలిన ట్రస్టుబోర్డు సభ్యులు, గ్రామస్తుడు తరగళ్ల శ్రీనివాస్ తదితరులు విరాళాలు ఇచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ భాస్కర్, ట్రస్టుబోర్డు సభ్యులు వెంపరాల నారాయణమూర్తి, కూరాకుల వీరవెంకట సత్యనారాయణ, వుద్దాల నాగవెంకట కనకదుర్గవల్లి, కటకం కృష్ణవుూర్తి, వీవీఎస్ఎన్ వుూర్తి, పర్వతనేని శ్రీని వాసరావు, వేగేశ్న ఆనందరాజు, మెరజోతు రాములునాయుక్ తదితరులు పాల్గొన్నారు