
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వెంకటేశ్వరస్వామి దర‍్శనార‍్థం బుధవారం ఉదయం రెండు కంపార్టెమెంట‍్లలో భక‍్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర‍్వదర‍్శనానికి 3 గంటలు, ప్రత‍్యేక దర‍్శనానికి 2 గంటలు, కాలినడకన వచ‍్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
మంగళవారం స్వామి వారిని 74,628 మంది భక‍్తులు దర్శించుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.03 కోట్లు వచ్చిందని ఆలయాధికారులు తెలిపారు.