11న వైఎస్సార్‌సీపీ జిల్లా సమావేశం | YSRCP district meeting on 11 | Sakshi
Sakshi News home page

11న వైఎస్సార్‌సీపీ జిల్లా సమావేశం

Published Mon, Sep 8 2014 2:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

YSRCP district meeting on 11

 -పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
 సాక్షి, నెల్లూరు: ఈ నెల 11న గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లా సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని విజయమహల్ గేట్ పక్కనున్న ఎంసీఎస్ కల్యాణ మండపంలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
 
   ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, రాష్ట కమిటీ సభ్యులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, మండల కన్వీనర్లు, పట్టణపార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సొసైటీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు,  విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు వైఎస్సార్ అభిమానులు, జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు భారీగా వచ్చి విజయవంతం చేయాలని ప్రసన్న పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement