కోవూరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కోవూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం 11.14 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. ప్రసన్నకుమార్‌రెడ్డి తన నివాసం నుంచి 10.30 గంటలకు కోవూరుకు వచ్చారు. అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న పార్టీ నా యకులు, కార్యకర్తలను ఆయన కలుసుకున్నారు. నియోజకవర్గ నాయకులు, ప్రజల ఆశీర్వాదంతో పాటు దైవానుగ్రహంతో నామినేషన్ వేసేందుకు తహశీల్దార్ కార్యాలయానికి బయల్దేరారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ప్రసన్నకుమార్‌రెడ్డికి బీ ఫారాన్ని అందజేశారు.
మేకపాటి రాజమోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 145 స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకోవడం తథ్యమన్నారు. అలాగే 25 లోక్‌సభ స్థానాల్లో 23 స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కావడమే కాకుండా ఢిల్లీలో కీలకనేతగా అవతరిస్తారని స్పష్టం చేశారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, తమ కు సేవ చేసే నాయకులను ఎంచుకోవడం వారికి తెలుసన్నారు. 2012 ఉప ఎన్నికల్లో మాదిరిగా ప్రసన్నను ఆశీర్వదించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.
మా కుటుంబానికి
నియోజకవర్గ ప్రజలే దేవుళ్లు
మొదటి నుంచి కోవూరు నియోజకవర్గ ప్రజలే తమ కుటుంబానికి దేవుళ్లతో సమానమని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తనకు నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారన్నారు. మహా నేత వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన మేనిఫెస్టో తమ విజ యానికి సోపానమని ప్రసన్న స్పష్టం చేశారు. వైఎస్సార్ అమలు చేసిన వినూత్న సంక్షేమ పథకాలను ప్రజల మనసుల్లో నుంచి చెరపడం ఎవరి తరం కాదన్నారు. సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్‌మోహన్‌రెడ్డితోనే వైఎ స్సార్ స్వర్ణయుగం మళ్లీ రానుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ, షర్మిల మొదటి నుంచి పోరాడారన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. సీమాంధ్రను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు జగన్‌కు పట్టం కట్టాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని ప్రసన్న అన్నారు.
నల్లపరెడ్డి గీతమ్మ
నామినేషన్ దాఖలు
ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సతీమణి నల్లపరెడ్డి గీతమ్మ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రసన్నతోపాటు గీతమ్మ నామినేషన్ దాఖలు చేశారు.
ఆమెతో పాటు తనయుడు నల్లపరెడ్డి రజత్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మండల కన్వీనర్లు ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, బెజవా డ గోవర్ధన్‌రెడ్డి, గంధం వెంకటశేషయ్య, టంగుటూరి మల్లికార్జున్‌రెడ్డి, నేతలు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నిరంజన్‌బాబురెడ్డి, వీరి చలపతి, మల్లికార్జున్‌రెడ్డి, నరసింహులురెడ్డి, వినీత్‌రెడ్డి, సర్పంచ్‌లు కూట్ల ఉమా, గడ్డం రమణమ్మ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కోలాహలంగా ప్రసన్న నామినేషన్
Published Wed, Apr 16 2014 2:16 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement