వైఎస్సార్‌ పేరు కాదు.. బ్రాండ్‌: రోజా | YSRCP MLA Roja Talk About YS Rajasekhar Reddy On His Jayanthi | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ పేరు కాదు.. బ్రాండ్‌: రోజా

Published Sun, Jul 8 2018 11:51 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM

YSRCP MLA Roja Talk About YS Rajasekhar Reddy On His Jayanthi - Sakshi

సాక్షి, విజయవాడ : నేడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 69వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగిరి ఎమ్మెల్యే రోజా వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యలయంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రతి గుండే ఇప్పటికీ వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తలుచుకుంటోందని రోజా అన్నారు. వైఎస్సార్‌ అనేది పేరు కాదు.. బ్రాండ్‌ అని తెలిపారు. విశ్వసనీయత, నమ్మకానికి మారు పేరు వైఎస్సార్‌ అని పేర్కొన్నారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. తొమ్మిదేళ్ల పాలనలనో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైఎస్సార్‌లాగా సంక్షేమాన్ని అందించగలిగే, వైఎస్సార్‌ వారసత్వాన్ని నిలబెట్టగలిగే వ్యక్తి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమేనని రోజా అన్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబుది దోచుకొని దాచుకునే నైజమని రోజా వ్యాఖ్యానించారు. బాబు అసమర్ధత సీఎం అని, విదేశీ పర్యటనలో పేరుతో దోచుకున్న డబ్బుని దాచి వస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి, టీడీపీ మంత్రులు దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యనమల రామకృష్ణుడు నువ్వు కూడా జగన్‌ని విమర్శిస్తావా.? నాలుగేళ్లు బీజేపీతో ఉండి ఇప్పుడు విమర్శలా.. అని దుయ్యబట్టారు. అఫిడవిట్‌ విషయంలో సుప్రీం కోర్టు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement