YS Rajasekhara Reddy Government
-
వైఎస్ఆర్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారు : మంత్రి విడదల రజని
-
రాజన్న రాజ్యం అది రామ రాజ్యం
-
నిరుద్యోగుల పాలిట ‘సిరి’ సిటీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రజల సంక్షేమం కోసం పరితపించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన అది. రాళ్లు, రప్పలతో కూడిన భూముల్లో.. వర్షాధారిత వ్యవసాయంతో ప్రజలు అత్యంత దుర్భర జీవనం సాగించిన ప్రాంతమది. వారి జీవితాలను, ఆ ప్రాంతాన్ని మెరుగుపర్చాలనే సంకల్పం ఆ మహా నాయకుడిలో మొగ్గ తొడిగింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రజల జీవన ప్రమాణాలు బాగుపడతాయని భావించిన ఆయన ‘సెజ్’ (స్పెషల్ ఎకనమిక్ జోన్) ఏర్పాటు చేశారు. ఇప్పుడది ఇంతింతై.. ఒటుడింతై అన్నట్టుగా దినదినాభివృద్ధి చెందుతూ.. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు పొందుతోంది. చిత్తూరు జిల్లాకు మణిహారంగా నిలుస్తోంది. పారిశ్రామక వాడగా మొదలై.. పారిశ్రామిక నగరంగా వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల పరిధిలో 14 గ్రామాల మధ్య శ్రీసిటీని ఆగస్టు 8, 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. దీనిద్వారా ప్రస్తుతం 5 0వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరో ఐదేళ్లలో 1.50 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళుతోంది. పారిశ్రామిక వాడగా మొదలైన శ్రీసిటీ పారిశ్రామిక నగరంగా రూపుదిద్దుకుంది. సామాజిక బాధ్యతను దృష్టిలో ఉంచుకుని వర్క్, లైవ్, లెర్న్, ప్లే అనే విధానంలో ప్రణాళికాబద్ధంగా వృద్ధి చెందుతోంది. ఇందులో ట్రిపుల్ ఐటీ, డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యాయి. నాలుగు లేన్ల రహదారులు వచ్చి చేరాయి. 3 లక్షల మంది నివసించేందుకు వీలుగా భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కన్జర్వేషన్ పద్ధతిలో భూగర్భ జలాలను పెంపొందించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా చెరువులు నిర్మించారు. కాలువల ద్వారా ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు చేరేలా లింక్ చానల్స్ నిర్మించారు. తద్వారా భూగర్భ జలాలు 4 మీటర్లు పెరిగాయి. శ్రీసిటీలో అన్ని పరిశ్రమలకు శుద్ధి చేసిన నాణ్యమైన నీరు సరఫరా చేస్తూనే.. పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత, వ్యర్ధ జలాలను శుద్ధి చేసి ఉద్యాన వనాలను పెంచుతున్నారు. 50 ఎకరాల్లో ప్రత్యేకంగా నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. సెజ్ వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటారు. ఫలితంగా కాలుష్య రహిత ప్రాంతం ఇక్కడ ఆవిష్కృతమైంది. సెకనుకు 3 సెల్ఫోన్ల తయారీ శ్రీసిటీ మొబైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లల్లో ప్రతి సెకనుకు 3 సెల్ఫోన్ల చొప్పున నిమిషానికి 180 తయారవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, సిమెన్స్ సంస్థ సంయుక్తంగా శ్రీసిటీలో టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పి నిరుద్యోగులను నిష్ణాతుల్ని చేస్తున్నారు. ఇలా రెండేళ్లలో 5వేల మందిని తీర్చిదిద్దారు. శిక్షణ తర్వాత ఉద్యోగం చూపించే లక్ష్యంతో ట్రైనింగ్ ఇస్తుండటం విశేషం. ఇక్కడ 27 దేశాలకు చెందిన 185 కంపెనీలకు వివిధ ఉత్పత్తులను విదేశీ సామర్థ్యంతో చేపడుతున్నారు. ఇస్రో, నాసా పరిశోధన సంస్థల రాకెట్ ప్రయోగంలో వినియోగించే లిక్విడ్ హైడ్రోజన్ ట్యాంక్స్, ఇసుజి వాహనాలు, సిద్ధార్థ లాజిస్టిక్స్, రఫేల్ యుద్ధ విమానాల ల్యాండింగ్ సీలింగ్ నిర్మాణం ఇక్కడే తయారవుతున్నాయి. డ్రగ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్ ఇలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు సైతం ఇక్కడే చేస్తున్నారు. మహిళలకూ ఆర్థిక స్వావలంబన శ్రీసిటీ సెజ్ కారణంగా ఎందరో మహిళలు ఆర్థికంగా లాభపడ్డారు. దశాబ్ద కాలంలో అక్షరాస్యత అత్యంత వేగంగా పుంజుకుంది. పుష్కర కాలంలోనే ఇక్కడి పౌరుల సగటు ఆదాయం 200 శాతం పెరిగింది. ప్రతి కుటుంబంలో ఉద్యోగులు ఉన్నారు. పూరి గుడిసెల స్థానంలో అందమైన ఇళ్లు వెలిశాయి. శ్రీసిటీ పరిధిలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ వేలాది మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇందులో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 50 శాతం మంది మహిళలే ఉండటం మరో విజయం. ఫాక్స్గాన్ సెల్ఫోన్ల తయారీ కంపెనీలో దాదాపు 15 వేల మంది మహిళలు ఉద్యోగులున్నారు. పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన మహిళలకు కూడా స్కిల్ డెవలప్మెంట్, డీఆర్డీఏ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి సెల్‌ఫోన్ ఉత్పత్తి ఉద్యోగాల్లో నియమించారు. ఎంఐ, ఆపిల్, నోకియా, ఒన్ ప్లస్ ఫోన్లు ఇక్కడ తయారై ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. తాజాగా శుక్రవారం కోవిడ్ బాధితులకు రూ.20 లక్షల విలువ చేసే 10 వేల లీటర్ల ఆక్సిజన్‌ను శ్రీసిటీ విరాళంగా అందించింది. -
పోలవరం ఓ చిరకాల స్వప్నం
ప్రపంచ ప్రముఖులు అనేకమంది ప్రారంభం నుంచి ప్రశంసించిన పోలవరం ప్రాజెక్టును మడతపెట్టడంలో బ్రిటిష్ పాలకులనుంచి భారత పాలకులకు కూడా తిలాపాపం తలా పిడికెడు భాగముందని చెప్పాలి. 1941 జులై నాటికే ఈ ప్రాజెక్టును తలపోసి కార్యాచరణకు దిగిన మహామేధావి శొంఠి వెంకట రమణమూర్తి. తాను ప్రతిపాదించిన రామపాద సాగరం ప్రాజెక్టే నేటి పోలవరం ప్రాజెక్టు. కేంద్రమే కాక ఆంధ్ర ప్రాంతంలోని తొంటి నాయకత్వం చేసిన వక్రభాష్యాల వల్లే పోలవరం ఇంతకాలంగా సాకారం చెందలేదు. కె.ఎల్.రావు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి అకుంఠిత దీక్ష వల్లే నిర్మాణం ఇంతవరకూ నెట్టుకురాగలిగింది. అంతే దీక్షా దక్షతతో ప్రస్తుత రాష్ట్ర సీఎం వై.ఎస్. జగన్ సూత్రబద్ధమైన చొరవతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎక్కడా రాజీపడకుండా సకాలంలో పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగు ప్రజల జీవనదులలో ఒకటైన గోదావరి జలాలను బృహత్ ప్రాజెక్టుల ద్వారా సద్వినియోగం చేసుకుని పాడి పంటలను సస్యశ్యామలం కావించు కోవడానికి గత రెండేళ్లుగా తెలుగువారు వెన్నుపోట్లకు గురి కావలసి వచ్చిందో తెలుసుకొని స్వార్థపరుల కుట్రలను ఈ తరం యువతీ యువ కులు అవశ్యం గుర్తుపెట్టుకొని జాగరూకులై ఉండాల్సిన అవసరముంది. సర్ ఆర్థర్ కాటన్ ‘ధాతు కరువు’కు శాశ్వత పరిష్కారంగా ఉభయ గోదావరి జిల్లాలకు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం తలపెట్టినదే, యావదాంధ్రలోని బీడువారుతున్న పొలాలకు, పంటలకు సేద్య ధారలు పండించడానికి గోదావరి పైన ఒక పెద్ద నీటిపారుదల ప్రాజెక్టును ఊహించి ఆలోచన చేసిన తొలి వ్యక్తి భారత సుప్రసిద్ధ సివిల్ అధికారి శొంఠి వెంకట రమణమూర్తి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ముందు దేశ స్వాతంత్య్రానికి ముందు 1941 జూలై నాటికే ఈ ప్రాజెక్టును తలపోసి కార్యాచరణకు దిగిన మహామేధావి. అప్పటికి మద్రాసులో ఫోర్ట్ సేంట్ జార్జ్జ్తో స్టేట్ అభివృద్ధి కార్యక్ర మాల ప్రధాన సలహాదారుగా ఉంటూ బంగాళాఖాతంలో నీటి ప్రవా హాన్ని పరిశీలిస్తున్న సందర్భంలోనే రామపాద సాగరం ప్రాజెక్టు (అదే పోలవరం) ఆలోచన తట్టింది. సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది కాబట్టి గోదావరి నీరు సముద్రంలోకి చేరకముందే దానిని నిలిపేసి నిల్వచేసి ప్రజా అవసరాలకు వినియోగించడం మంచిదన్న ఊహకు నిచ్చెన వేసినవాడు శొంఠి. గోదావరి, కృష్ణా నదుల నీటిలో 7 శాతం మాత్రమే ఉపయోగపడుతున్నందున మిగతా జలసంపద సముద్రం పాలవడానికి వీలులేదని భావించినవాడాయన! అంతేకాదు, గోదా వరి నది రెండువైపుల ఉన్న గట్లూ మద్రాసు ప్రెసిడెన్సీలో (అంటే ఆంధ్రప్రాంతం కలిసి ప్రెసిడెన్సీ) ఉండేటట్లుగా స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ ‘డ్యామ్’ నిర్మిస్తే ఇతర రాష్ట్రాల వల్ల చిక్కులు ఎదుర్కోవలసిన పరిస్థితులు రావని కూడా ఆలోచించిన వ్యక్తి శొంఠి. పోలవరం దగ్గర్లో పాపికొండల వద్ద గండికి దిగువన గోదావరిపై డ్యామ్ నిర్మించడం సబబని ఆయన భావించి ఆనాడు చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న ఎల్. వెంకట కృష్ణయ్యర్‌ను కూడా ఆ ప్రాంతానికి వెళ్లిరమ్మని పురమాయించాడు. అక్కడికి వెళ్లొచ్చి డ్యామ్ నిర్మాణం సాధ్యమేమని ఇంజనీర్ నివేదిక ఇచ్చాడు. ఐతే గోదావరి డ్యామ్ అగ్రభాగం భద్రాచల రామాలయానికి అడుగుభాగమై ఉండాలని, అక్కడ తీరం వద్ద పేరుకొనే నిలవనీరై (బ్యాక్‌వాటర్) ఉండాలని శొంఠి చెప్పారు! ఆనాటి అంచనా ప్రకారం ఇక్కడ (పోలవరం వద్ద) బ్యారేజి కడితే రెండు పంటలకూ కలిపి మూడున్నర లక్షల ఎకరాలకు నీరు అందజేయడంతో పాటు 40 మెగా వాట్ల విద్యుత్ కేంద్రం కూడా ఏర్పాటు చేయవచ్చని మద్రాసు ప్రెసి డెన్సీ ఏలికలుగా ఉన్న ఇంగ్లిష్ దొరలకు నివేదిక ఇచ్చాడు! ఈ ప్రాజెక్టుకే ‘రామపాద సాగర్ ప్రాజెక్టు’ అని ఆనాడు పేరుపెట్టడానికి కారణం. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వెళ్లి భద్రాచలం రాములవారి గుడి దాకా వెళ్లే అవకాశం ఉంది కనుక ఆ పేరు పెట్టారు! అందువల్ల శొంఠివారి ‘రామపాద సాగరమే’ నేటి పోలవరం నిర్మాణంలో ఉన్న బృహత్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు విశ్వరూపాన్ని 1948లోనే రాజ మండ్రిలో జరిగిన రామపాద సాగర్ ప్రాజెక్టు మహాసభకు అధ్యక్షత వహిస్తూ ఆనాటి అంచనా ప్రకారం శొంఠి ఇలా వర్ణించారు. ‘‘ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఏడాదికి 10 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అంటే రోజుకి కోటి రూపాయల విలువైన బియ్యం తయారు అవుతాయి. తెలుగు భూమి ధనధాన్య సమృద్థిని కలిగి యావత్ భారతదేశ కళ్యాణానికి తోడ్పడుతుంది. ఇది ఆంధ్రదేశాన్ని, భారత దేశంలో కెల్లా సుసంపన్నమైన ప్రాంతంగా చేస్తుంది. ఇది అఖిల భార తావని పథకం. ఈ ప్రాజెక్టు (రామపాద సాగర్ / పోలవరం) ఖండాం తరాలలోని ఇంజనీర్ల దృష్టిని కూడా ఆకర్షించింది. ఇటువంటి నిర్మా ణంలో ప్రపంచ మొత్తం మీదనే రెండవస్థానం ఆక్రమించబోయే ఈ భగీరథ ప్రయత్నానికి సహాయపడదామని మానవబలం, ధనబలం, వస్తుబలంతో అమెరికా వారు కూడా ముందుకు వచ్చారు. మనకు పండించగల రకరకాల పంటలున్నాయి. జలసమృద్ధి ఉంది. వరిపైరు సంప్రదాయం తెలిసిన రైతులున్నారు. కావలసింది పెద్ద ప్రాజెక్టులు. కాని ప్రాజెక్టు నిర్మాణానికి జరిగిన అంతూపొంతూ లేని కాలహరణం తలచుకుంటే ఆశ్యర్యం కల్గుతుందని’’ శొంఠి మొత్తుకున్నారు! ‘అంతేకాదు, ఇలా బహుళార్థసాధక ప్రాజెక్టు నిర్మాణానికి భారత ప్రభుత్వం నడుం బిగించకపోవడమే అత్యంత విషాదకరమని’ సుప్ర సిద్ధ అమెరికన్ ఇంజనీర్ డాక్టర్ జె.ఎల్.శావేజ్ తనకుS పంపిన లేఖను అప్పటికి రిటైర్ అయిన శొంఠి నాటి ప్రధాని నెహ్రూకి పంపితే ఆయన దానిని ప్రణాళికా సంఘానికి పంపారు. పోలవరం ప్రాజెక్టు విష యంలో కేంద్ర ప్రభుత్వంలోనే కాదు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభు త్వానికీ శ్రద్ధలేదు. కానీ, ఉత్తరభారతంలో అదే సమయంలో మూడు ప్రాజె క్టులకు కేంద్రం ధనకేటాయింపుల్ని జరిపింది కానీ ప్రపంచ నిపుణులు పెక్కుమంది ప్రశంసలందుకున్న పోలవరం ప్రాజెక్టును మాత్రం ‘మాడ’బెడుతూ వచ్చింది. దానికితోడు తెలుగువారికి ‘మద రాసీల’న్న పేరిట ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఓ తప్పుడు వాదు ప్రచారంలో ఉన్నందున, రామపాదసాగరం ప్రాజెక్టు (పోలవరం) గురించి మద రాసు ప్రభుత్వ పెద్దలు కేంద్రానికి తప్పుడు సమాచారం అందజేస్తూ వచ్చినట్టు ప్రాజెక్టుల ప్రాధాన్యతా నిర్ణయ సంఘానికి అధ్యక్షుడైన గోపాలస్వామి అయ్యంగారే స్వయంగా శొంఠివారికి తెలపడం మరో వక్రబుద్ధి కోణం! ఇలాంటి వక్రబుద్ధులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులం విడివడిపోయినా ఆ తొంటి బుద్ధులు ఆంధ్రనాయ కుల్లో నాటికీ నేటికీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాకా తొలగి పోలేదు. ఎంతగా బీజేపీతో బాహాటం గానూ లోపాయికారిగాను బాబు భుజాలు రాసుకుని తిరగజూస్తున్నా ప్రధాని మోదీ మాత్రం పోలవరానికి కేంద్రం ఇంతకుముందు మంజూరు చేసిన వాటాధనం వాడకానికి బాబు జమా ఖర్చులు చూప నందుకు ‘కేంద్ర నిధులను ఏటీఎం నుంచి లాక్కున్నట్లుగా దోసిళ్లతో గుంజేసి వాడుకున్నాడని, హావభావాలతో ఎద్దేవా చేశాడని మరచి పోరాదు! నిజానికి ఆదినించీ పోలవరం ప్రాజెక్టును ఆంధ్రులకు అçపు రూపమైన వరంగా భావించబట్టే ప్రధానంగా, కె.ఎల్.రావు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభృతుల అకుంఠిత దీక్ష చొరవ కారణంగానే నిర్మాణం ఇంత వరకూ నెట్టుకురాగలిగింది. ఆ తర్వాత అంతే దీక్షా దక్షతతో ప్రస్తుత రాష్ట్ర సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సూత్రబద్ధమైన చొర వతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎక్కడా రాజీపడకుండా సకాలంలో పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. పోలవరం ప్రాజెక్టు కన్నా తక్కువ ప్రయో జనం గల కోసీ, హీరాకుడ్, ప్రాజెక్టులను ప్రారంభించడం ఇంజ నీరింగ్ నిపుణులకు విడ్డూరంగా తోచింది! అంతేగాదు చివరికి శొంఠి రామమూర్తి 1946లో నాటి బ్రిటి‹ష్ పైస్థాయి లార్డ్ వేవెల్స్ కలిసిన ప్పుడు పోలవరం (రామపాదసాగర్) ప్రాజెక్టు మొత్తం దక్షిణ భారత దేశాన్నే బియ్యం విషయంలో స్వయం సామర్థ్యంగా ఉంచగల దని చెప్పారు. ఆ మాట మీద వేవెల్ తనకు ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న వి.పి. మీనన్‌కు (ఈయన తర్వాత భారత హోంశాఖSమంత్రి సర్దార్ పటేల్ కార్యదర్శి) పోలవరం ప్రాజెక్టు మంజూరు చేస్తున్నట్టు ఉత్త ర్వులు టైప్ చేయమంటే, మీనన్ తన పూజారి’ డ్రామా తాను ఆడాడు. ఈ సమస్యపై శొంఠి స్పందిస్తూ ‘తక్కువ వ్యయంతో ప్రజలకు ఎక్కువ మేలు చేసే స్కీమును బుట్టదాఖలు చేసి, అధికారంలో ఉన్నవారికి అనుకూలమైన స్కీములను మాత్రమే చేపట్టే ప్రయత్నం జరిగిందని’’ అప్పటికే నిందించక తప్పలేదు. ఈ కోవలోనే తన ముఖ్యమంత్రి త్వంలో చంద్రబాబుకు తలపెట్టిన పెక్కు స్కీములపైన ప్రాజెక్టులకైనా దుబారా వ్యయంపైన, అవినీతి పైన ‘కాగ్’ విచారణ సంస్థ పలు వివరాలను బట్టబయలు చేస్తూ వచ్చింది. చివరికి 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య పోలవరం ప్రాజె క్టుకు శంకుస్థాపన చేసినా, అక్కడ నుంచి అడుగు ముందుకు సాగ లేదు. వైఎస్సార్ 2004లో సీఎం అయిన తర్వాతనే ఈ ప్రాజెక్టు ఫైలును పట్టిన ఏళ్ల తరబడి బూజును దులిపి రంగంలోకి దిగేసరికి ప్రాజెక్టు వ్యయం తడిసి మోపై వేలకోట్లకు పడేసింది! అందుకే విదే శాలలో జవహర్‌లాల్‌కు విశ్వవిద్యాలయంలో సహాధ్యాయి అయి ఉండి కూడా శొంఠి వారి సేవలను గుర్తించకపోవడం విచారకరం. ఆంధ్రులైన తెలుగువారు కూడా శొంఠి సేవలను ఉపయో గించుకుని ఆయనకు బాసటగా నిలువలేకపోయినందుకు ‘అభినవ తిక్కన’ తుమ్మల సీతారామ మూర్తి ఏనాడో అనేక ఇంజనీరింగ్ పథ కాల రూపశిల్పి, ప్రణాళికా సంఘం తొలి సలహాదారైన.. శొంఠి గురించి ఇచ్చిన ఆత్మీయ నివాళిని స్మరించకుండా ఉండలేము. ‘‘శొంఠికి తగ్గ పీఠమునీయలేక చెడెగదా తెలుగువాడని సిగ్గు పడెద’’! (అవును మరి, సిగ్గుకు సిగ్గులేనితనానికి మనం అలవాటు పడ్డాం గదూ?!) -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.ina -
వైద్యులపై దాడులు: ఆ చట్టాన్ని అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కోవిడ్-19(కరోనా వైరస్) బారిన పడ్డ పేషెంట్లకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులు గర్హనీయమని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. దాడులకు పాల్పడ్డ వారిని గుర్తించి వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై దాడులకు వ్యతిరేకంగా దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ చట్టం చేసిందని పేర్కొన్నారు. (ఆత్మీయుడిని కోల్పోయిన బాధ ఇప్పటికీ) 2007లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కేవీపీ రామచంద్రారెడ్డి కోరారు. ఏపీ తర్వాత హర్యానా, తదితర రాష్ట్రాలు సైతం అదే తరహా చట్టాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ఆపత్కాల సమయంలో మనందరి క్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించే మార్గదర్శకాలను, విధించే ఆంక్షలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నవారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాయం చేయాలని పిలుపునిచ్చారు. (కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్) -
నిక్షేపాల ఖిల్లా.. కొటియా ఆశలకు బీట
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. 2014లో నవ్యాంధ్రగా రూపాంతరం చెందింది. ఈ 66 ఏళ్లలో ఎన్నో రాజధానులు మారాయి. భౌగోళికంగా ఎన్నెన్నో మార్పులొచ్చాయి. కానీ, దాదాపు 75 ఏళ్లుగా.. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో గిరి శిఖరాన గల కొటియా గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తాయనే వివాదం మాత్రం తేలలేదు. అక్కడి ఆదివాసీలు తమను ఆంధ్ర రాష్ట్ర పరిధిలోకి తీసుకెళ్లాలని ఏళ్ల తరబడి కోరుతుండగా.. అక్కడున్న అపార ఖనిజ నిక్షేపాలపై కన్నేసిన ఒడిశా ప్రభుత్వం ఆ ప్రాంతంపై పట్టు బిగిస్తోంది. అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా ఆ ప్రాంతాన్ని వశం చేసుకునేందుకు శరవేగంగా పావులు కదుపుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు.. వాటిమధ్య అమాయక ఆదివాసీలు.. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ శివారు ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని 34 గిరి శిఖర గ్రామాల సమాహారమైన కొటియా ప్రాంతమది. విలువైన ఖనిజ నిక్షేపాలకు నిలయమైన ఆ ప్రాంతంపై ఒడిశా ప్రభుత్వం కన్నేసింది. ఆ గ్రామాలను వశం చేసుకునేందుకు పట్టు బిగిస్తోంది. అభివృద్ధి పనుల వేగం పెంచి.. రహదారులు, ఆస్పత్రి, వసతి గృహాలను నిర్మిస్తోంది. త్వరలో పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతోంది. ఓటుహక్కు వినియోగించుకోలేని గిరిజనులు దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో స్థానిక ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్రత్యేక కృషితో కొటియా గ్రూప్ గ్రామాల్లో విరివిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు జరిగేవి. దండిగాం నుంచి కొటియాకు తారు రోడ్డు మంజూరైంది. ఎగువశెంబి వరకు రోడ్డు నిర్మించారు. వైఎస్సార్ హఠాన్మరణం తరువాత రోడ్డు ఫార్మేషన్ జరిగినా నిర్మాణం పూర్తికాలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తమను ఎవ్వరూ పట్టించుకోలేదని ఇక్కడి ప్రజలు అంటున్నారు. గత ఎన్నికల్లో కొటియా ప్రజలు ఆంధ్రా ఓట్లను వినియోగించుకోలేకపోయారు. ఇదే అదనుగా ఒడిశా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఖనిజ నిక్షేపాల కోసమే ఆరాటం ఇక్కడ ఉన్న విలువైన ఖనిజాల కోసమే ఒడిశా ఆరాటపడుతోంది. ఒడిశా ప్రభుత్వం ఇక్కడ కొన్నేళ్లుగా రహస్యంగా ఖనిజాన్వేషణ చేస్తోంది. ఎగువశెంబి, కొటియా, కుంబిమడ మధ్య బంగారం నిక్షేపాలు గల కొండ ఉందనే ప్రచారం నేపథ్యంలో దానిని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పాగా వేసేందుకు గిరిజనులకు సౌకర్యాల ఎర వేస్తోందని ఆ ప్రాంత గిరిజన నాయకులు చెబుతున్నారు. రూ.180 కోట్లతో ఎర కొటియా గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఒడిశా ప్రభుత్వం సుమారు రూ.180 కోట్లను మంజూరు చేసింది. అక్కడి ప్రజలు ఘనంగా జరుపుకునే కోరాపుట్ గిరిజన (పరబ్) పండుగకు సుమారు రూ.15 లక్షలు వెచ్చించింది. గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లతోపాటు మరో 21 గ్రామాలకు కొత్తగా రహదారులు నిర్మిస్తోంది. 10 పడకల ఆస్పత్రి, బీఎస్ఎన్ఎల్ టవర్, పోలీస్ స్టేషన్, పాఠశాల, వారపు సంతలో వసతులు, ఎగువ గంజాయిభద్ర, దిగువ గంజాయిభద్ర మధ్య ఆశ్రమ పాఠశాల, కొండనుంచి వచ్చే ఊట నీరు కిందికి వృథాగా పోకుండా ట్యాంక్‌ల ద్వారా స్థానిక పంటలకు మరల్చడం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. గంజాయిభద్రలో పాఠశాల భవన నిర్మాణం అసలు వివాదం ఇదీ స్వాతంత్య్రానికి పూర్వం పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాల ఏర్పాటు ఆలోచన సాగింది. దానికోసం బ్రిటిష్ ప్రభుత్వం 1942లో సర్వే జరిపించింది. ఆ క్రమంలో ఏపీ–ఒడిశా మధ్య సరిహద్దుల్లోని 101 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో ఒడిశా రాష్ట్రంలో విలీనం చేయగా మిగిలిన కొటియా పంచాయతీ పరిధిలో 21 గ్రూపు గ్రామాల సంగతి తేల్చలేదు. ఈ గ్రామాలు తమవని ఒడిశా, ఆంధ్రా పట్టుబడుతున్నాయి. అప్పట్లో 21 మాత్రమే ఉన్న ఆ గ్రామాల సంఖ్య ఇప్పుడు 34కి పెరిగింది. ఇక్కడ 15 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో 3,813 మంది ఓటర్లు. వీరు ఆంధ్రాలోనూ, ఒడిశాలోనూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ గ్రామాల వివాదంపై రెండు రాష్ట్రాలు 1968లో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. నేటికీ పరిష్కారం లభించలేదు. గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాం.. అసెంబ్లీలో ప్రస్తావిస్తాం అక్టోబర్ 31న సాలూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి కొటియా గ్రామాల సమస్యను తీసుకువెళ్లాం. ఇరు రాష్ట్రాలను సమన్వయపరిచి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరాం. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొటియా ప్రజలకు మంచి జరిగేలా ప్రయత్నిస్తాం. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు ప్రభుత్వం పట్టించుకోవాలి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొటియా ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా మా ప్రాంతాన్ని విడిచిపెట్టేసింది. ఇప్పుడు ఒడిశా ప్రభు త్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. మాకు మాత్రం ఆంధ్రావైపు ఉండాలని ఉంది. – బీసు, మాజీ ఉప సర్పంచ్, గంజాయిభద్ర త్వరలో పర్యటిస్తా కొటియా గ్రామాల్లో త్వరలో పర్యటిస్తాను. ఈ గ్రామాల అభివృద్ధికి ఆం ధ్రా ప్రభుత్వం తరఫున కృషి చేస్తాం. దీనిపై సమ గ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. – బీఆర్ అంబేడ్కర్, ఐటీడీఏ పీవో, పార్వతీపురం -
ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి!
సాక్షి, నల్లగొండ: ఉదయ సముద్ర ఎత్తిపోతల పథకంలో దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని చెబుతున్నా ఇంకా.. టన్నెల్ లైనింగ్, కాల్వలు, డిస్టిబ్యూటరీల నిర్మాణంలో పెండింగ్ పనులు, పంప్ హౌజ్ యాగ్జిలరీ పనులు పూర్తి కావాల్సి ఉంది. భూ సేకరణకు రూ.250 కోట్లు, అదే మాదిరిగా, మరో రూ.200 కోట్లు వివిధ పనులు, ప్రైస్ ఎస్కలేషన్ తదితరాలకు కలిపి మొత్తంగా రూ.450 కోట్లు ఇస్తే కానీ ఈ ఎత్తిపోతల పథకం ముందర పడేలా లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ వాస్తవాలు, గణాంకాల ఆధారంగానే ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. రాజకీయ అంశంగా మారిన ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులు గడిచిన పదకొండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాజెక్టును మంజూరు చేసిన నాటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా శంకుస్థాపన చేశారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ద్వారా కృష్ణా జలాలను తీసుకు వచ్చి నల్లగొండ పట్టణ సమీపంలోని ఉదయసముద్రంలో నింపడం.. అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్‌కు (మధ్యంలో కొంత సొరంగం) చేర్చి అక్కడినుంచి కుడి, ఎడమ మేజర్ కాల్వల ద్వారా ఆరుతడి పంటల కోసం లక్ష ఎకరాలకు సాగునీరు అందివ్వడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. కానీ, పదకొండేళ్లు గడిచిపోతున్నా పనులు తీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉంది. ఇప్పటికే పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయని, టన్నెల్ లైనింగ్ పని ఒక్కటే పెండింగ్‌లో ఉందని, అది పూర్తి కావడానికి మరో పదకొండు నెలలు పడుతుందని, ఆ తర్వాతే ప్రాజెక్టుకు నీరిస్తామని అధికార టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం శీత కన్నేసిందని, రైతులకు ఎంతగానో ఉపయోగపడే దీనిని పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుం దనే నిధులు ఇవ్వడం లేదని ఆ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలోనే ప్రాజెక్టుకు ఎక్కువ నిధులు కేటాయిం చామని అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతివిమర్శల మాటెల్లా ఉన్నా.. ఉదయ సముంద్రం ఎత్తి పోతల పథకం పనులు నత్తనకడక సాగడానికి వాస్తవ కారణాలు వేరేగా ఉండడం విశేషం పూర్తి కాని భూసేకరణ.. రూ.250కోట్లు అవసరం ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకానికి, కాల్వ లు, డిస్టిబ్యూటరీల కోసం మొత్తంగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి మొత్తంగా 3,880 ఎకరాలు అవసరమని నివేదికలు చెబుతున్నాయి. కానీ, ఇప్పటిదాకా గడిచిన పదకొండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమి మాత్రం 1,379 ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. నిధుల కొరత వల్లే భూ సేకరణ పనులు ముందుకు సాగడం లేదని చెబుతున్నారు. గతంలో సేకరించిన భూమికి ఇంకా పూర్తిస్థాయిలో నష్టపరిహారం కూడా చెల్లించలేదని సమాచారం. భూ సేకరణ కోసం రూ.35 కోట్లు అత్యవసరంగా కావాలని అధికారులు నివేదికలు పంపగా, ఈ ఏడాది జనవరినుంచి ఆర్థికశాఖ క్లియరెన్స్ కోసం వారి వద్దే పెండింగులో పడిపోయిందంటున్నారు. మరో రూ.35 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేదంటే పనులు చేయలేమని కాంట్రాక్టు ఏజెన్సీ నెత్తినోరు కొట్టుకుంటున్నా ఆర్థికశాఖ నుంచి ఎలాంటి చలనమూ లేదని విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టు ఏజెన్సీకి ఇవ్వాల్సిన రూ.35కోట్లు బిల్లుల ఫైల్ 2018 అక్టోబర్నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాయని సమాచారం. పెండింగ్ బిల్లులు చెల్లించనిదే పనులు చేయలేమని చేతులు ఎత్తేసిన కాంట్రాక్టు సంస్థను ఒప్పించే మార్గమే కనిపించడం లేదని, పనులు ముందుకు సాగాలంటే అత్యవసరంగా రూ.70 కోట్లు నిధులు అవసరమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇవి కాకుండా.. మరో రూ.80కోట్లు నిధులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తే కానీ... టన్నెల్ లైనింగ్, కుడి, ఎడమ మేజర్ కాల్వలు, పంప్ హౌజ్ ఆగ్జిలరీ పనులు చేపట్టడానికి వీలు కాదని చెబుతున్నారు. ఇక, అత్యంత ప్రధానమైన భూసేకరణకు సంబంధించి ఇప్పటికి సేకరించింది పోను మిగిలిన 2,501 ఎకరాల భూ సేకరణకు రూ.250 కోట్లు అవసరమని, ఇది సేకరిస్తే కానీ, కెనాల్, డిస్టిబ్యూటరీలు పూర్తి చేయడానికి వీలు కాదని చెబుతున్నారు. ప్రాజెక్టు ఖర్చు... ఇలా ! రాజకీయ వాదోప వాదాలకు కారణమైన ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంలో ఇప్పటి దాకా రూ.363 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రాజెక్టు మంజూరు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా రూ.197 కోట్లు ఖర్చు చేయగా.. తెలంగాణ ఏర్పాటు నుంచి ఈ ఏడాది జూలై వరకు రూ.166 కోట్లు వెచ్చించారు. ఇందులో ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పంపులు మోటార్ల కోసం రూ.76 కోట్లు, సొరంగం తవ్వకం, పంప్ హౌజ్, జలాశయ నిర్మాణం తదితర సివిల్ పనులకు రూ.121 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా, 2014 మే నుంచి ఈ ఏడాది జులై వరకు తెలంగాణ స్వరాష్ట్రంలో పంపులు, మోటార్ల కోసం రూ.68కోట్లు, సొరంగం పనులు, పంప్ హౌజ్, జలాశయ నిర్మాణం తదితర సివిల్ పనుల కోసం రూ.98కోట్లు వెరసి రూ.166 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈ ఎత్తిపోతల పథకం పూర్తి కావడానికి రూ.450 కోట్లు అవసరం కానుండడం, ప్రధానంగా ఎక్కువ మొత్తంలో భూ సేకరణ జరపాల్సి ఉండడంతో ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది..? తమ బీడు భూములకు నీరెప్పుడు వస్తుందోనన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. -
అక్రమాలకు కేరాఫ్ ఆటోనగర్
సాక్షి, మంగళగిరి: పట్టణంలోని ఆటోనగర్ అక్రమాలకు కేరాఫ్‌గా మారిందనే విమర్శలున్నాయి. ఆటోమొబైల్ రంగం మొత్తాన్ని ఒక చోటకి చేర్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరచి పరిశ్రమలు నెలకొల్పాలనే లక్ష్యంతో 2007వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏపీఐఐసీ పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటు చేశారు. 116 ఎకరాల భూములను సేకరించి ఆటోనగర్ స్థాపించారు. 396 మందికి కేటాయింపు ఆటోనగర్‌లో వివిధ రంగాలకు చెందిన 396 మందికి పరిశ్రమలకు స్థలాలను కేటాయించారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా స్థలాల ధరలు పెరిగిపోవడంతో చాలామంది లబ్ధిదారులు ఏపీఐఐసీ నుంచి తక్కువ ధరలకు తీసుకుని అధిక ధరలకు విక్రయించారనే విమర్శలున్నాయి. అధిక మంది లబ్ధిదారులు ఈ విధంగానే విక్రయాలు చేసి సొమ్ము చేసుకోగా ఇప్పుడున్న వారిలో సగానికి పైగా స్థలాలను విక్రయాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. ఏపీఐఐసీ నిబంధనల మేరకు పరిశ్రమ నెలకొల్పేందుకు స్థలం తీసుకున్న యజమాని గడువు సమయంలో పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అయితే 12 ఏళ్లు కొందరు ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకపోయిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికి 55 మంది తాను తీసుకున్న స్థలాల్లో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో ఏపీఐఐసీ అధికారులు తిరిగి స్థలాలను అప్పగించాలని నోటీసులు జారీ చేయడంతో స్థలాల యజమానులు కోర్టును ఆశ్రయించి కాలయాపన చేస్తున్నారు. ప్రారంభం కాని కంపెనీలు పట్టణానికి దగ్గరగా ఉండడంతో ఆటోనగర్‌లోని స్థలాల ధరలు భారీగా పెరగడంతో విక్రయాలు చేయకూడదనే నిబంధనలను అతిక్రమించి విక్రయాలు జరిపారు. మరో వైపు స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకపోయినా కొనుగోలుదారులు కేవలం స్వాధీన విక్రయ అగ్రిమెంట్లతో కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరు నిబంధనలను తుంగలో తొక్కి కల్యాణ మండపాలు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్యాస్ గోడౌన్ పేరుతో స్థలం పొంది కల్యాణ మండపం నిర్మించి రూ.లక్షలు అర్జిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మరో వైపు ఐదేళ్ల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఐటీ హబ్‌కు ఆటోనగర్‌లోని స్థలాలను తక్కువ ధరలకు కేటాయించింది. పది ఎకరాలు కేటాయించినా తొలి దశ పనులు పూర్తి కాగా రెండో దశ పనులు ప్రారంభం కాలేదు. మరికొన్ని ఐటీ కంపెనీలకు స్థలాలను కేటాయించగా వాటిలో ఇప్పటికి కొన్ని కంపెనీలు గడువు ముగిసినా పనులు ప్రారంభించలేదు. రాజధానిలో ప్రధాన పట్టణంగా విస్తరిస్తున్న మంగళగిరి ఆటోనగర్‌పై అధికారులు దృష్టి సారించి అక్రమాలకు అడ్డుకట్టవేసి పరిశ్రమలను స్థాపించే వారికి స్థలాలను కేటాయిస్తే పరిశ్రమలు ఏర్పాటు కావడంతో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని ఆ దిశగా నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నోటీసులు ఇస్తాం పరిశ్రమలు స్థాపించని 55 మందిని గుర్తించి నోటీసులు జారీ చేశాం. వారు కోర్టును ఆశ్రయించారు. ఐటీ పార్కులో పరిశ్రమలు స్థాపించని వారికి నోటీసులిస్తాం. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరిపితే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. –పీఎస్ రావు, జెడ్ఎం, ఏపీఐఐసీ -
కరువు సీమపై ..పచ్చని సంతకం
అభివృద్ధికి రూపం.. సంక్షేమంపై చెరగని సంతకం.. జలయజ్ఞంతో సిరులు కురించిన నేత... ‘అనంత’ గుండె గుడిలో కొలువైన మహానేత... ఆయనే వైఎస్సార్. కరువు సీమలో పచ్చని పొలాలు.. విద్యాలయాలు.. అడుగడుగునా అభివృద్ధి.. ప్రజల మదిలో చెరగని ముద్ర రాజన్న. అందుకే జిల్లా అభివృద్ధిని విశ్లేషించాల్సి వస్తే వైఎస్సార్‌కు ముందు, ఆ తర్వాత అని చెప్పాల్సిన పరిస్థితి. సొంత జిల్లా కడపను మించి ఇక్కడి ప్రజలపై ఆదరాభిమానాలు చూపిన అపర భగీరథుడు. బీళ్లు మురిసేలా.. దాహం తీరేలా అభివృద్ధి ఫలాలను అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి ప్రతినిధి, అనంతపురం • హంద్రీ–నీవా సుజల స్రవంతి పేరుతో 2004లో రూ. 6,850 కోట్లతో పథకాన్ని చేపట్టారు. తొలిదశ కింద 1.98 లక్షలు.. రెండో దశ కింద రూ.4.04 లక్షలు కలిపి మొత్తం 6.02 లక్షల ఎకరాలకు సాగునీళ్లిచ్చేలా వైఎస్సార్ ప్రణాళిక సిద్ధం చేశారు. • హంద్రీనీవా కోసం వైఎస్సార్ హయాంలోనే రూ.4,054 కోట్లను ఖర్చుచేశారు. అందువల్లే 2012లోనే కృష్ణాజలాలు జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరాయి. • ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్సార్ 421 జీఓ జారీ చేశారు. ఈ జీఓ మేరకు చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.1.50 లక్షల మేర అప్పట్లో పరిహారం ఇచ్చారు. • వేరుశనగ రైతులను ఆదుకునేందుకు 2008లో గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకాన్ని వర్తింపజేశారు. • మడకశిరను విద్యాకేంద్రంగా మార్చారు. వ్యవసాయ, వ్యవసాయ ఇంజనీరింగ్, హార్టికల్చర్, వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేశారు. రిజర్వేషన్లు లేక అభివృద్ధికి నోచుకోని వక్కలిగ, సాదర, వీరశైవ కులాల వారిని బీసీలుగా గుర్తించి ఆదుకున్నారు. • తాడిపత్రి నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలు తీర్చేందుకు రూ.536 కోట్లతో చాగల్లు, పెండేకల్లు, యాడికి కాలువను నిర్మించాలని నిర్ణయించారు. వీటి ద్వారా 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలన్న లక్ష్యంతో పనులకు శ్రీకారం చుట్టారు. • హిందూపురం తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.650 కోట్ల వ్యయంతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని చేపట్టారు. 14 వందల కి.మీ పైపులైన్లు వేయించి 2008 డిసెంబర్ 30న ప్రారంభించి ‘పురం’ దాహార్తి తీర్చారు. అనంతపురం జిల్లా కరువుకు చిరునామా. ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారతావనిలో పాలకులు వస్తున్నారు.. పోతున్నారు కానీ ఇక్కడి ప్రజలు, దారిద్య్ర పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పరిష్కారానికి ఉపక్రమించిన నేతలు మాత్రం అరుదు. ఎక్కడైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే అయ్యో అంటాం.. కానీ ఇక్కడ సర్వసాధారణం. ఈ క్రమంలోనే జిల్లా సమస్యలపై వైఎస్సార్ ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. రైతుల కష్టాలు, వ్యవసాయ దీనావస్థకు చలించిపోయారు. నా జీవితం రాజన్న తాత చలువే.. నాకిప్పుడు పదమూడేళ్లు. రాజన్న తాత పేరు ఎక్కడ వినిపించినా మా నాన్న చెప్పే మాటలు వింటుంటే నా జీవితం ఆయన చలువేనన్న విషయం గుర్తుకొస్తుంది. నాకప్పుడు నాలుగు నెలల వయసంట. మెదడు సంబంధ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉండగా చికిత్స చేయించేందుకు అమ్మానాన్న ఎక్కడెక్కడో చూపించారంట. ఆరోగ్య కుదుటపడకపోగా వయస్సు కూడా పెరుగుతుండటంతో ఎంతో బాధ పడ్డారంట. మాటలు కూడా రాకపోవడంతో ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడిపారంట. అప్పట్లో రాజన్న తాత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నాకు మూడుసార్లు ఆపరేషన్ చేశారంట. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. అందరిలా బడికి పోతున్నా. రాజన్న తాతకు జీవితాంతం రుణపడి ఉంటాం. – అభిషేక్, పెడపల్లి, పుట్టపర్తి మండలం పండుగలా వ్యవ‘సాయం’ 2004లో వైఎస్సార్ అధికారం చేపట్టిన తర్వాత వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్ద పీట వేశారు. ప్రమాణాస్వీకారం చేసిన మరుక్షణమే విద్యుత్ బిల్లులు మాఫీ చేసి ఉచిత విద్యుత్ సరఫరాకు సంతకం చేయడంతోనే రైతులకు భరోసా లభించింది. జిల్లా రైతులకు సంబంధించిన బకాయిలు రూ.70.65 కోట్లు మాఫీ కావడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. అప్పట్లో ఉన్న 1.75 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచితంగా కరెంటు ఇచ్చారు. ఆయన ఐదేళ్ల హయాంలో రూ.150 కోట్లు విలువైన ఉచిత కరెంటు రైతులకు అందజేసి వ్యవసాయానికి జీవం పోశారు. వైఎస్ అధికారంలో ఉన్న ఆరేళ్లలో పంట రుణాల కింద 27.37 లక్షల మంది రైతులకు రూ.6,594 కోట్లు అందజేశారు. ఏటా పంట రుణాలు పెంచుతూ, అందులోనూ కొత్త రైతులకు ప్రాధాన్యత ఇవ్వడంతో వ్యవసాయం పండుగలా సాగింది. సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ కింద ఐదేళ్లలో 12 లక్షల అకౌంట్లకు రూ.44 కోట్లు అందజేశారు. – అనంతపురం అగ్రికల్చర్ బీమాతో ధీమా చంద్రబాబు హయాంలో మండలం యూనిట్‌గా అమలవుతున్న పంటల బీమా పధకాన్ని రైతులకు ఉపయోగపడేలా గ్రామం యూనిట్‌గా మార్పు చేసి అమలు చేశారు. 2004–2009 మధ్య కాలంలో దెబ్బతిన్న వేరుశనగ పంటకు సంబంధించి పంటల బీమా కింద ఏకంగా రూ.1,138 కోట్లు పరిహారం ఇచ్చారు. 2008లో తీవ్ర వర్షాభావంతో 80 శాతం మేర పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 4.64 లక్షల మంది రైతులు తమ వాటా కింద రూ.32 కోట్లు ప్రీమియం కట్టారు. గ్రామం యూనిట్‌గా బీమా పథకం కింద 4.59 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.620 కోట్లు పరిహారం విడుదల చేసి పంటలు పండకున్నా ప్రభుత్వం ఉందనే భరోసా కల్పించారు. 2008లో నెలకొన్న తీవ్ర కరువు దృష్ట్యా ప్రకటించిన రుణమాఫీ పథకంలో భాగంగా బ్యాంకులో ఉన్న 3,03,937 మంది రైతులకు సంబంధించి రూ.554.92 కోట్లు రుణాలు ఒకేవిడతలో మాఫీ అయ్యాయి. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన రైతులకు ప్రోత్సాహకాల కింద 3,61,269 మంది రైతులకు రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. 2004 నుంచి 2009 వరకు 28,05,901 మంది రైతులకు 26,02,717 క్వింటాళ్లు విత్తనకాయ పంపిణీ చేశారు. దీని కోసం ఏకంగా రూ.280.88 కోట్లు సబ్సిడీ వర్తింపజేశారు. కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా రూ.360 కోట్లు విత్తన రాయితీ కల్పించాడు. పండిన వరి, వేరుశనగ, ఇతర పంటలకు కనీస మద్ధతు ధర (ఎంఎస్పీ) కల్పించడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభించాయి. – అనంతపురం అగ్రికల్చర్ కరువు సీమలో ‘పాడి’ సిరులు కరువు సీమ ‘అనంత’లో క్షీరవిప్లవం సృష్టించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్... పాడి పరిశ్రమకు చేయూతనిచ్చారు. 2006లో ప్రజాకర్షకమైన పశుక్రాంతి, జీవక్రాంతి లాంటి పథకాలకు రూపకల్పన చేశారు. పాల వెల్లువతోనే పేద వర్గాల జీవణప్రమాణాలు మెరుగుపడతాయని భావించి 50 శాతం రాయితీ వర్తింపజేసి గుజరాత్, హరియానా, తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలకు మేలుజాతి సంకరజాతి, ముర్రా జాతి పాడి ఆవులు, గేదెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. 2007, 2008, 2009... కేవలం మూడు సంవత్సరాల్లోనే 50 శాతం రాయితీతో రూ.22 కోట్లు బడ్జెట్ కేటాయించి 7,200 పాడి పశువులు, గేదెలు రైతులు, పేద వర్గాలకు అందజేశారు. ఈ క్రమంలో 2007–10 మధ్య కాలంలో ఏపీ డెయి రీ రోజుకు 60 వేల లీటర్ల పాలు సేక రించి లాభా ల బాట పట్టింది. – అనంతపురం, అగ్రికల్చర్ ‘108’తో పునర్జన్మ శరణార్థుల పాలిట సంజీవినిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘108’ మారింది. 2005 ఆగస్టు 15న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 108 వాహనాలను ప్రవేశపెట్టారు. జిల్లాలో మొదటిదశగా అనంతపురం, గుంతకల్లు, హిందూపురం, ధర్మవరం, కదిరి ప్రాంతాల్లో ప్రారంభించారు. మొత్తంగా 37 వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రమాదాలు, గుండెజబ్బులు, ప్రసవాలు ఇలా ఏ సమస్య వచ్చిన 108కు ఫోన్ చేస్తే చాలు వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకుని ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రికి చేరుస్తూ వచ్చారు. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం మొదటి ఏడాది మినహా ప్రతి నెలా 5వేల మంది రోగులను ఆస్పత్రికి చేర్చారు. 2006 నుంచి ఈ ఏడాది వరకు 8,23,549 మందిని ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడారు. 2007 ఏప్రిల్‌లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి, వెయ్యి రకాల జబ్బులకు ఉచిత వైద్యం అందించారు. – అనంతపురం సాంకేతిక విద్యా ప్రదాత కరువు సీమలో కల్పతరువుగా జేఎన్టీయూ(ఎ)ను డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తీర్చిదిద్దారు. 2008 ఆగస్టు 18న జేఎన్టీయూ(ఎ)కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ వర్సిటీగా మార్పు చేశారు. అనంతపురం లాంటి వెనుకబడిన జిల్లాలో సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వర్సిటీ పరిధిలో 98 ఇంజినీరింగ్ కళాశాలలు, 33 ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. ఏటా ఒక లక్ష మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే 2007–08 విద్యాసంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది రూ.2వేల కోట్లు కేటాయించి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్ , ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ అగ్రికల్చర్, వంటి కోర్సులను నిరుపేద విద్యార్థులకు చేరువ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో లబ్ధి పొందిన అనేక మంది నేడు ఉన్నత స్థానాల్లో స్ధిరపడ్డారు. జాతీయ స్థాయిలో ఈ పథకం అమలు తీరుతెన్నులపై చర్చ జరిగి, అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని స్ఫూర్తిదాయకంగా అనుసరిస్తున్నాయి. – జేఎన్టీయూ -
షుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం!
సాక్షి, కోవూరు(నెల్లూరు) : కోవూరు చక్కెర కర్మాగారంతోపాటు రాష్ట్రంలో ఉన్న చిత్తూరు, రేణిగుంట, కడప ప్రాంతాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీల్ని పరిశీలించి నివేదికను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సభ్యులు చీఫ్ ఇంజినీర్ ప్రసాద్‌రావు, చీఫ్ కెమిస్ట్ రవికుమార్, ప్రధాన వ్యవసాయాధికారి కె.వి.రమణ, ఇన్చార్జి షుగర్స్ ఏడీ తిరుపాలురెడ్డి తెలిపారు. శుక్రవారం కోవూరు చక్కెర కర్మాగారంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఫ్యాక్టరీలో ఏయే పరికరాలు పనికివస్తాయి.. ఎంత నిధులు అవసరమో పరిశీలించామన్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు ఏమాత్రం చేస్తున్నారు.. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే వారంతా కోవూరు షుగర్స్‌కు చెరకు సరఫరా చేస్తారా లేదా అనే అంశాలపై చర్చించారు. చక్కెర కర్మాగార కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 6 చక్కెర కర్మాగారాల పరిస్థితి తదితర అంశాలను 6వ తేదీ లోపు పరిశీలించి నివేదిక అందజేస్తామన్నారు. గత నెల 28వ తేదీ నుంచి ఈ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితుల్ని అధ్యాయనం చేస్తున్నామన్నారు. అనంతరం పలువురు రైతు నాయకులు, కర్మాగార ఉద్యోగులు మాట్లాడుతూ గతంలో జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించిన కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి మరలా పూర్వవైభవం కల్పించేలా చూడాలని పరిశీలనకు వచ్చిన కమిటీని కోరారు. కోవూరు చక్కెర కర్మాగారానికి సంబంధించిన వాటాదారులైన తమతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రైతు నాయకులు కోరారు. ప్రధానంగా ఫ్యాక్టరీ పట్ల రైతులకు నమ్మకం పెంచాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చాలని కోరారు. ఇప్పటివరకు కోవూరు చక్కెర కర్మాగారాన్ని నాలుగు సర్వే బృందాలు పరిశీలించి పోయాయన్నారు. సర్వే బృందాలు ఇచ్చిన నివేదికలు బుట్టదాఖలాలు అయ్యాయే తప్ప వాటి వల్ల ఉపయోగం లేదన్నారు. కర్మాగారాన్ని నమ్ముకొని జీవిస్తున్న కార్మికులు ఎంతో మంది అప్పులపాలై విగతజీవులుగా మృతిచెందిన సందర్భాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 21 చక్కెర కర్మాగారాలు ఉన్నాయన్నారు. కర్మాగారానికి సంబంధించి వందల కోట్ల రూపాయలు ఉన్నా వాటిని విడుదల చేసి బకాయిలు చెల్లించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదన్నారు. గతంలో రోడ్డు నిర్మాణ సమయంలో కర్మాగారానికి సంబంధించిన స్థలాన్ని బేరం పెట్టుకొని వాటిని అమ్మకాలు చేపట్టడం చాలా బాధకరమన్నారు. రైతులను సంప్రదించకుండా అమ్మకాలు చేపట్టడం చాలా బాధకరమన్నారు. ఫ్యాక్టరీ స్థితిగతుల్ని పరిష్కరించడానికి వచ్చిన సభ్యులు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రస్తుతం వరిసాగు రైతులకు ఇబ్బందిగా ఉన్న విధి లేని పక్షంలో వరిసాగు చేయాల్సి వస్తుందన్నారు. చెరకు సాగుపై దృష్టి సారించే అవకాశం కోవూరు చక్కెర కర్మాగారం అందుబాటులోకి వస్తే ఆరుతడి పంట అయిన చెరకు సాగుపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని రైతులు తెలిపారు. దీనిపై ఆధారపడి 4600 మంది రైతులు ఉన్నారని, 2020 నాటికి అయినా ఫ్యాక్టరీని ప్రారంభించేలా కమిటీ ప్రభుత్వానికి సూచించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 9.5 శాతం క్రషింగ్ ఉందన్న విషయాన్ని సర్వే బృందం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిందన్నారు. రాష్ట్రంలోనే ఈ కర్మాగారానికి ఎంతో ఘన చర్రిత ఉందన్న విషయం కూడా మరచిపోవద్దన్నారు. అనంతరం సర్వే బృందం కర్మాగారం మొత్తాన్ని పరిశీలించారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు వెంకమరాజు, శ్రీనివాసరావు, నిరంజన్‌రెడ్డి, శ్రీరాములు, డానియల్, ఎంవీ రమణయ్య, శ్రీనివాసులురెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. -
కుయ్.. కుయ్ సేవలు నై..
పేదల సంజీవనికి పెద్ద తిప్పలొచ్చింది. డీజిల్, ఇతరత్రా సమస్యలతో 108 వాహనాల నిర్వహణ గాలిలో దీపంలా మారింది. జిల్లాలో వారం రోజులుగా వాహనాలు రోడ్డెక్కకపోవడంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, అత్యవసర వైద్యం కోసం ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక్కో దశలో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికి సరైన సమయానికి వైద్యం అందక కన్నుమూసే పరిస్థితులు నెలకొన్నాయి. సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి కుయ్.. కుయ్‌మంటూ శబ్దం చేస్తూ పేదల ముంగిట్లో్ల వాలే 108 సేవలకు డీజిల్ కష్టాల వల్ల క్షతగాత్రుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఖమ్మంవైద్యవిభాగం: ప్రాణాపాయ స్థితిలో తక్షణ వైద్య సేవలు అందించే 108 వాహనాల సేవలు డీజిల్ కారణంగా వారం రోజులుగా నిలిచిపోయాయి. బంక్ యజమానులకు రూ.లక్షల్లో బకాయిలు ఉండడంతో వారు 108 వాహనాలకు డీజిల్ పోయడం నిలిపివేశారు. దీంతో సేవలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలో 14 వాహనాలు అత్యవసర సేవలు అందిస్తుండగా.. అందులో 11 వాహనాలు పూర్తిగా షెడ్లకే పరిమితమయ్యాయి. కొన్ని నెలలుగా పేరుకుపోయిన బకాయిలకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలోని మధిర, సత్తుపల్లి, కల్లూరు వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని బంక్ యజమానులకు నచ్చజెప్పి అక్కడి వాహనాలను పైటెట్లు నెట్టుకొస్తున్నారు. వారంలోపు వాటి బకాయిలు చెల్లించని పక్షంలో అవి కూడా షెడ్లకే పరిమితమవుతాయని అక్కడి వాహనాల పైలెట్లు చెబుతున్నారు. రూ.12లక్షల బకాయిలు సాధారణంగా 108 వాహనాలకు సంబంధించి అధికారులు బంక్ యజమానులతో ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. మధిర, సత్తుపల్లి, కల్లూరు, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన వాహనాలకు ఆయా ప్రాంతాల్లో బంక్ యజమానులతో ఒప్పందం ఉంటుంది. ప్రతి నెల వాహనాల్లో పోయించిన డీజిల్‌కు అయ్యే ఖర్చు బంక్ యజమానులకు చెల్లిస్తుంటారు. అయితే జిల్లాలోని 14 వాహనాలకు సంబంధించి మూడు, నాలుగు నెలలుగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.12లక్షల బకాయిలు బంక్ యజమానులకు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో బంక్ యజమానులు క్రమక్రమంగా డీజిల్ పోయడం నిలిపివేస్తున్నారు. ప్రస్తుతం మూడు వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి. రేపో మాపో అవి కూడా మూలనపడనున్నాయి. 108 వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేకపోవడంతో అత్యవసర సేవలు నిలిచిపోనున్నాయి. రోడ్డు ప్రమాద బాధితులు, ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాలకు గురైన వారు 108 వాహనాలు లేక మార్గమధ్యలోనే ప్రాణాలు వదలాల్సిన దుస్థితి ఏర్పడింది. మొబైల్ సేవలు ఎప్పుడో? రాష్ట్ర ప్రభుత్వం టూ వీలర్ ద్వారా 108 సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అందుకుగాను జిల్లాకు రెండు 108 మొబైల్ వాహనాలను సమకూర్చింది. అయితే అవి జిల్లాకు చేరి నెలలు గడుస్తున్నా ఇంతవరకు సేవలు ప్రారంభించలేదు. 108 వాహనం కంటే అతి త్వరగా మారుమూల ప్రాంతాలకు అత్యవసర సేవలు అందించేందుకు మొబైల్ 108 సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని అందుబాటులోకి తెస్తే కొంతమేర సేవలు విస్తృతమవుతాయి. ఒకపక్క ఉన్న వాహనాలు మూలనపడి ఉండగా.. వచ్చిన వాహనాలను వినియోగంలోకి తేకపోవడంతో అత్యవసర సేవలు జిల్లాలో కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా బకాయిలు చెల్లించి.. 108 వాహనాలతోపాటు ఉన్న మొబైల్ వాహనాలు వినియోగంలోకి తెచ్చి.. ప్రమాదంలో ఉన్న వారిని రక్షించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పరిష్కారమవుతుంది.. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. బకాయిలు చెల్లించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. డీజిల్ సమస్య తీరనుంది. ప్రస్తుతం బంక్ యజమానులను ఒప్పించి డీజిల్ పోయించే ఏర్పాట్లు చేస్తున్నాం. మొబైల్ వాహనాలు కూడా ఈ వారంలోనే రోడ్డెక్కుతాయి. త్వరలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. – లక్ష్మణ్, 108 జిల్లా కోఆర్డినేటర్ వైఎస్ ప్రవేశపెట్టిన సేవలకు ఈ దుస్థితి దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2008లో రాష్ట్రవ్యాప్తంగా 108 సేవలను ప్రారంభించారు. అదే సమయంలో జిల్లాలో కూడా సేవలను అందుబాటులోకి తెచ్చారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు 108 వాహనంలో తరలించడంతో వారు తమ బిడ్డతో సహా క్షేమంగా ఇంటికెళ్లేవారు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులను కాపాడేందుకు సైతం ఫోన్ చేసిన 5 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని.. వారికి ప్రథమ చికిత్స చేసి.. ప్రాణాపాయం నుంచి కాపాడడం నుంచి గుండెనొప్పి, పురుగు మందులు తాగి ఆత్మహత్యలకు పాల్పడిన వారిని కూడా సకాలంలో ఆస్పత్రికి చేర్చి వారికి ప్రాణదానం చేస్తోంది 108 వాహనం. కొన్నేళ్లుగా 108 సేవల కారణంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రజలంతా మహానేత ప్రవేశపెట్టిన 108 పథకానికి జేజేలు పలికారు. కానీ.. నేడు పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. డీజిల్ కష్టాలతో సేవలు నిలిచిపోవడంతో క్షతగాత్రులు ఇబ్బంది పడుతున్నారు. వైఎస్సార్ సేవలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అంపశయ్యపై.. అపర సంజీవని
రోడ్డు ప్రమాదమైనా.. అస్వస్థతకు గురైనా.. పురిటి నొప్పులు పడుతున్నా.. కళ్లముందు ఎవరైనా మృత్యువుతో పోరాడుతున్నా ప్రతి ఒక్కరికీ ఠక్కున గుర్తుకు వచ్చే అపర సంజీవని 108 అంబులెన్స్. ఫోన్ చేసిన 15 నిమిషాల్లో పూర్తి సరంజామాతో వాలిపోయి.. పోతున్న ప్రాణాలను పట్టి జీవితాలను నిలబెట్టిన ప్రాణదాత ఈ వాహనం. ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ 108 సేవలు ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం, నిర్వాకంతో పూర్తిస్థాయిలో అందని దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆపన్నులు విగతజీవులుగా మారిపోతున్నారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేక మొన్న పిఠాపురంలో ఒకరు మృతి చెందితే.. వాహనం సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోక నాలుగు నెలల క్రితం పిఠాపురం సమీపంలోని చేబ్రోలు వద్ద రోడ్డు ప్రమాదంలో ఏడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రాణదాత అంపశయ్య పైకి చేరి.. సేవలు నిర్వీర్యమవుతున్న వేళ.. సకాలంలో వైద్యం అందక జిల్లాలో పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. మండపేట/ కాకినాడ సిటీ: సంఘటన జరిగినా పెద్దల నుంచి చిన్నారుల వరకూ వెంటనే 108కు ఫోన్ చేసేంతగా అనతికాలంలోనే ప్రజల్లోకి ఈ సేవలు చొచ్చుకుపోయాయి. వైఎస్సార్ ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని 18 రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఆయన హఠాన్మరణానంతరం వచ్చిన పాలకులు 108 సేవలను క్రమంగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. దీంతో అంతంతమాత్రంగా మారిన ఈ సేవలు ఐదేళ్లుగా పట్టిన ‘చంద్ర’గ్రహణంతో మరింతగా క్షీణించాయి. వైఎస్ గురుతులను చెరిపేయాలన్న లక్ష్యంతో 108 సేవల్ని టీడీపీ ప్రభుత్వం దెబ్బతీస్తూ వచ్చింది. ఫలితంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రథమ చికిత్సను సహితం అందించలేని దుస్థితికి 108 సేవలు చేరుకున్నాయి. 108 సేవలు సక్రమంగా అందకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం ఎన్నికల ముందు జగ్గంపేట, ప్రత్తిపాడు, అన్నవరం, కరప, తాళ్లరేవు మండలాలకు ఒక్కొక్కటి చొప్పున కొత్త వాహనాలను అందించింది. అయినప్పటికీ ఇతర సమస్యలు అలాగే ఉండడంతో 108 సేవలు సకాలంలో అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవీ సమస్యలు జిల్లాలో 42 వాహనాలకు గాను అధికారిక లెక్కల ప్రకారం 39 తిరుగుతున్నాయి. వాస్తవానికి దాదాపు 13 వాహనాలు నాలుగు నెలల నుంచి ఏడాది కాలంగా పాడై షెడ్లలోనే ఉండగా, 29 వాహనాలు మాత్రమే తిరుగుతున్నట్టు తెలుస్తోంది. చాలా 108 అంబులెన్సులలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ప్రతి అంబులెన్స్‌కు ఇద్దరు పైలట్లను, ఇద్దరు టెక్నీషియన్లను నియమించారు. చాలా అంబులెన్సులలో నిన్నమొన్నటి వరకూ టెక్నీషియన్లు కూడా లేక ప్రథమ చికిత్స కూడా అందేది కాదు. కొన్ని వాహనాలు ఒక్క పైలట్‌తోనే నడుస్తున్నాయి. సిబ్బంది ఉన్న చాలా వాహనాల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన పరికరాలు కూడా లేవు. దీంతో ప్రమాద బాధితులు, అపాయంలో ఉన్నవారికి అత్యవసర వైద్య సేవలు అందడం లేదు. దీనినిబట్టి ఈ సేవలపై ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్లక్ష్యం చూపుతోందో అర్థం చేసుకోవచ్చు. అధిక శాతం వాహనాలు మైనర్ రిపేర్లతో నడుస్తున్నాయి. ఇంజిన్ ఆయిల్ మార్చకపోవడం, టైర్లు అరిగిపోవడం, బ్రేకులు పని చేయకపోవడం తదితర సమస్యలు అపర సంజీవని లక్ష్యానికి ప్రతిబంధకమవుతున్నాయి. సాధారణంగా రెండు లక్షల కిలోమీటర్లు తిరిగిన అంబులెన్సులను మార్చాల్సి ఉండగా.. జిల్లాలో అధిక శాతం వాహనాలు నాలుగు నుంచి ఐదు లక్షల కిలోమీటర్లు తిరిగినవి కావడం గమనార్హం. దీంతో అత్యవసర సమయాల్లో ఇవి ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అత్యవసరంగా వెళ్లాల్సిన సమయంలో వాహనాలు మొరాయించి తీవ్ర జాప్యం జరుగుతూండటంతో ప్రాణనష్టం జరిగిపోతోంది. ఫిట్నెస్ లేకపోవడంతో తరచూ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల ఆరు కొత్త వాహనాలు ఇచ్చినట్టు చెబుతుండగా మరమ్మతులు చేయించక పాత వాహనాలు షెడ్లలోనే మూలుగుతున్నాయి. వైఎస్ హయాంలో అత్యవసర వైద్యసేవల కోసం అంబులెన్సులలో 120 రకాల మందులు అందజేస్తే ప్రస్తుత ప్రభుత్వం 100కు తగ్గించేసి, వాటిని కూడా అరకొరగానే అందిస్తోంది. ఆక్సిజన్ లేక పోతున్న ఆయువు అత్యవసర కేసుల్లో క్షతగాత్రులకు, రోగికి ఆక్సిజన్ అందించడం తప్పనిసరి. ఆస్పత్రికి తరలించేంత వరకూ రోగి ప్రాణాలు నిలపడంలో ఆక్సిజన్ కీలకం. కాగా జిల్లాలో కేవలం ఐదు వాహనాల్లో మాత్రమే ఆక్సిజన్ అందుబాటులో ఉండడం గమనార్హం. మిగిలిన వాహనాల్లో సిలిండర్లు కూడా లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఒక్కో వాహనంలో రెండు ఆక్సిజన్ సిలిండర్లు ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆక్సిజన్ అయిపోయిందని చెప్పినా నిర్వాహకులు ఆక్సిజన్ సమకూర్చడం లేదని పలువురు 108 సిబ్బంది చెబుతున్నారు. శ్వాస సంబంధ సమస్యతో బాధ పడుతున్న పిఠాపురం ఇందిరా కాలనీ వాసి కూరపాటి చినగంగరాజు 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. అంబులెన్సులో ఆక్సిజన్ లేక మార్గంమధ్యలోనే మృతి చెందడం ‘అపర సంజీవని’ సేవలు నిర్వీర్యమవుతున్న తీరుకు నిదర్శనం. ఇంధనమూ కష్టమే 108 వాహనాలకు డీజిల్ నింపడం కూడా కష్టంగా మారింది. రోజూ డీజిల్ నింపుకొనేందుకు ఆయా ప్రాంతాల్లో 108 వాహనాలకు కొన్ని బంకులు కేటాయించారు. ఇదివరకు ఆన్లైన్ బిల్లింగ్ పేరుతో ఫుల్ట్యాంక్ కొట్టేవారు. అయితే ఇప్పటికే లక్షల రూపాయల మేర డీజిల్ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో బంకు యజమానులు డీజిల్ పోయడానికి నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. అత్యవసర సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలి 108 అనేది అత్యవసర సేవ. దీనిపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు. ప్రమాదాలు జరిగిన సమయాల్లో వేలాది మంది ప్రాణాలను కాపాడిన ఘనత 108కు ఉంది. కొత్త వాహనాలను ఏర్పాటు చేసి సేవలను మెరుగుపరచాలి. ప్రసూతి కోసం ఇదే వాహనాలను ఉపయోగించడంతో ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వాహనాలు అందడం లేదు. ప్రసూతి కోసం గర్భిణులను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నిధులు కేటాయించి, డీజిల్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి. – అడ్డూరి ఫణీశ్వర రవిరాజ్‌కుమార్, జిల్లా ప్రయాణికుల సంఘం కార్యదర్శి, డీఆర్‌యూసీసీ మెంబర్, కాకినాడ -
పుడమి పులకించగా.. రైతు పరవశించగా..
అది 1995–2003 మధ్య కాలం.. ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకుని చంద్రబాబు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన సమయం. చినుకు రాలక.. పాతాళగంగపైకి పొంగక కరువు రక్కసి కరాళనృత్యం చేసిన సందర్భం. వర్షాలు లేవు, పంటలు పండవు. చేతిలో పైసా లేదు. అప్పుల కుప్పలు.. అన్నమో రామచంద్రా.. అంటూ అన్నదాత దిక్కులు చూశారు. రైతులే కాదు.. కూలీలు, పేదలు... అన్ని వర్గాల ప్రజలు పొట్ట చేతపట్టుకుని ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లారు. పచ్చని పల్లెసీమలు కళ తప్పాయి. అలాంటి సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ‘అనంత’ ఆశాకిరణంగా కనిపించారు. 2004లో ముఖ్యమంత్రి కాగానే జనరంజక పాలనను అందించారు. జిల్లాకు ఆత్మబంధువుగా, ఆపద్బాంధవుడయ్యారు. రైతులకు పెద్దపీట వేస్తూనే మిగతా అన్ని వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచారు. సాక్షి, అనంతపురం అగ్రికల్చర్ :: తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రైతులను దారుణంగా అవమానించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా సువర్ణపాలనను అందించారు. ‘అనంత’పై ప్రత్యేక దృష్టి సారించారు. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణాస్వీకారం చేసిన తక్షణం రైతుల విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తూ తొలిసంతకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,259 కోట్లు కరెంటు బిల్లులు మాఫీ కాగా.. అందులో అనంతపురం జిల్లా రైతులకు సంబంధించిన రైతులవి రూ.70.65 కోట్లు మాఫీ అయ్యాయి. అలాగే అప్పట్లో ఉన్న 1.75 లక్షల మోటార్లకు ఉచితంగా కరెంటు ఇచ్చారు. ఆయన ఆరేళ్ల హయాంలో రూ.150 కోట్లు విలువైన ఉచిత కరెంటు రైతులకు అందించారు. పెంచిన పంట రుణాలు వైఎస్సార్ హయాంలో పంట రుణాల కింద 27.37 లక్షల మంది రైతులకు రూ.6,594 కోట్లు అందజేశారు. అంతకు మునుపు 1995 నుంచి 2003 వరకు చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో 15.76 లక్షల మందికి కేవలం రూ.2,175 కోట్లు మాత్రమే పంట రుణాలు ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో ఏటా పంట రుణాలు పెంచుతూ, అందులోనూ కొత్త రైతులకు ప్రాధాన్యత ఇవ్వడంతో వ్యవసాయం సాఫీగా సాగింది. సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ కింద ఐదేళ్లలో 12 లక్షల అకౌంట్లకు రూ.44 కోట్లు ఇచ్చారు. బీమాతో ధీమా చంద్రబాబు హయాంలో మండలం యూనిట్‌గా తీసుకుని వేరుశనగ పంటల బీమాను అమలు చేయగా...చాలా మంది రైతులకు అది అందలేదు. దీంతో వైఎస్సార్ అధికారంలోకి రాగానే గ్రామం యూనిట్‌గా అమలు చేసి నష్టపోయిన ప్రతి రైతుకు పారదర్శకంగా బీమా పరిహారం ఇచ్చారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్ ప్రభుత్వం దెబ్బతిన్న వేరుశనగ పంటకు సంబంధించి అర్హులైన రైతులకు పంటల బీమా కింద ఏకంగా రూ.1116 కోట్లు పరిహారం ఇచ్చారు. పంట కోత ప్రయోగాల ఆధారంగా పంట నష్టం లెక్కకట్టి పారదర్శకంగా పరిహారం అందజేశారు. 2008లో తీవ్ర వర్షాభావంతో 80 శాతం మేర పంటలు దెబ్బతినగా... అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 4.64 లక్షల మంది రైతులు తమ వాటా కింద రూ.32 కోట్లు ప్రీమియం కట్టారు. గ్రామం యూనిట్‌గా బీమా పథకం కింద అమలు చేయగా 4.59 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.620 కోట్లు పరిహారం అందింది. అదే చంద్రబాబు 1995–2003 మధ్య తొమ్మిదేళ్లలో పంటల బీమా పథకం కింద కేవలం రూ.323 కోట్లు పరిహారం ఇచ్చారు. ఇక 2011 నుంచి కొత్తగా అమలులోకి వచ్చిన వాతావరణ బీమా రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. లోపభూయిష్ట నిబంధనల కారణంగా ఏటా రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఏకకాలంలో రుణమాఫీ, ప్రోత్సాహం ఖరీఫ్–2008లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో 9 లక్షల హెక్టార్లలో పంటలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రుణమాఫీ చేశారు. 2008–09లో 3,03,937 మంది రైతులకు సంబంధించి రూ.554.92 కోట్లు రుణాలు ఒకేసారి మాఫీ అయ్యాయి. అలాగే పంట రుణాలు చెల్లించిన 3,61,269 మంది రైతులకు ప్రోత్సాహకాల కింద రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. మొత్తమ్మీద 6,65,206 మంది రైతులకు రూ.625 కోట్లు లబ్ధిచేకూరింది. విత్తనానికి బాసట 2004 నుంచి 2009 వరకు వైఎస్సార్ తన ఆరేళ్ల పాలనలో 28,05,901 మంది రైతులకు 26,02,717 క్వింటాళ్లు విత్తనకాయ పంపిణీ చేశారు. దానికోసం ఏకంగా రూ.280.88 కోట్లు సబ్సిడీ వర్తింపజేశారు. ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా రూ.360 కోట్లు విత్తన రాయితీ అందించారు. అదే చంద్రబాబు తన తొమ్మిదేళ్లలో విత్తన వేరుశనగకు రూ.49 కోట్లు మాత్రమే కేటాయించారు. తొమ్మిదేళ్లలో కలిపి 12,73,829 మంది రైతులకు కేవలం 9,58,800 క్వింటాళ్లు విత్తన వేరుశనగ పంపిణీ చేశారు. వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలైన పాడి, పశుసంవర్ధక, పట్టు, ఏపీఎంఐపీ, ఉద్యానశాఖలకు వైఎస్సార్ పెద్దపీట వేశారు. దీంతో ప్రత్యామ్నాయ వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, పేదలు కూడా సమస్యల నుంచి గట్టెక్కారు. ఉద్యాన విప్లవం 2004కు ముందు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పండ్లతోటలను జిల్లా నలుమూలలా విస్తరించేలా పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటించారు. వైఎస్సార్ తన పాలనా కాలంలో రూ.80 కోట్లు మేర సబ్సిడీ ఇవ్వడంతో కొత్తగా 40 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పండ్లతోటలు విస్తరించాయి. వైఎస్సార్ ఇచ్చిన ప్రోత్సాహంతో అనంతపురం జిల్లా ‘ప్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరుగాంచింది. సూక్ష్మసాగుకు ప్రోత్సాహం జిల్లా రైతులకు సూక్ష్మసాగు సేద్యం అత్యవసరమని గుర్తించిన వైఎస్సార్... రైతులకు బిందు, తుంపర పరికరాలను ప్రోత్సహించారు. ఎస్సీ ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో సూక్ష్మసేద్యాన్ని భారీగా విస్తరించారు. ఆరేళ్ల పాలనకాలంలో రూ.280 కోట్లు బడ్జెట్ ఇవ్వడంతో కొత్తగా 1.13 లక్షల హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్లు అందజేశారు. రూ.12,500 కోట్లు ఖర్చు చంద్రబాబు తన తొమ్మిదేళ్ల కాలంలో జిల్లా వ్యవసాయం, అనుబంధ రంగాలన్నింటికీ రూ.2,938 కోట్లు ఖర్చు చేయగా... అదే వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరేళ్లలోనే ఏకంగా రూ.12,500 కోట్లు వెచ్చింది రైతులకు వివిధ రూపాల్లో ప్రయోజనం చేకూర్చారు. అన్నదాత ఆత్మబంధువు.. వైఎస్సార్.. చంద్రబాబు హయాంలో కబళించిన కరువు 2004లో వైఎస్సార్ సీఎం కాగానే మారిన రైతుల తలరాత ‘అనంత’ సంక్షేమానికే అధిక ప్రాధాన్యమిచ్చిన రాజన్న పంటల బీమా కింద రూ.1,116 కోట్లు పరిహారం రూ.100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విద్యుత్ బకాయిలు మాఫీ.. రూ.150 కోట్లతో ఉచిత విద్యుత్ రూ.555 కోట్ల రుణమాఫీ.. ప్రోత్సాహకాలకు రూ.170 కోట్లు -
నీళ్ల కోసం కాదు..నిధుల దోపిడికే! పేరూరు
రాప్తాడు నియోజకవర్గ రైతుల కల పేరూరు ప్రాజెక్టు. 70 ఏళ్ల క్రితం నిర్మితమైన ఆ ప్రాజెక్టుకు నీళ్లొస్తే ఈ ప్రాంతాల ముందు కోనసీమ దిగదుడుపే. ఎటు చూసినా పచ్చని పంట చేలతో వ్యవసాయాన్ని పండుగలా చేసేవారు. అలాంటి పేరూరు ప్రాజెక్ట్‌కు నీటి వనరులు లేకుండా పోయాయి. సాగునీళ్లు అందుతాయని, బీడు భూముల్లో పంటలు పండి తమ బతుకులు మారుతాయని వేల కుటుంబాలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ వచ్చాయి. ప్రతి ఎన్నికల్లోనూ పేరూరు ప్రాజెక్ట్‌ను నీటితో నింపుతామంటూ నాయకులు లబ్ధి పొందుతూ వచ్చారు. రాప్తాడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ పరిటాల సునీతనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ రెండు ఎన్నికల్లోనూ పేరూరు ప్రస్తావనే ఆమెకు ఓట్లు పడేలా చేశాయి. కానీ నీళ్లవ్వలేదు. తాజా ఎన్నికల్లో సునీత తనయుడు శ్రీరాం బరిలో నిలిచారు. ఇప్పుడు కూడా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పేరూరు ప్రస్తావనే తెరపైకి తీసుకువచ్చారు. అసలు ప్రాజెక్ట్‌ను తామే తెచ్చామని, దానికి నీళ్లు రావాలంటే తిరిగి తనను గెలిపించాలని ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నాలకు తెరలేపారు. వాస్తవానికి ప్రాజెక్టు నిర్మాణంలో పరిటాల కుటుంబానికి రాజకీయ కోణం మినహా మానవీయ కోణం లేదనేది అక్షర సత్యం. ప్రకాష్‌రెడ్డి పోరాటాలు.. పేరూరు ప్రాజెక్టుకు నీళ్లివ్వాలని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త, ప్రస్తుత ఆ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పలు పోరాటాలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చొరవ తీసుకుని ప్రకాష్‌రెడ్డి అందించిన ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా రూ.119కోట్లతో ప్రాజెక్టుకు నీళ్లిచ్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. హంద్రీ–నీవాలో భాగంగా ‘పేరూరు బ్రాంచ్‌కెనాల్’ ఏర్పాటు చేసి నీళ్లు ఇవ్వాలని భావించారు. వైఎస్సార్ మరణానంతరం ఈ ప్రణాళికను చెత్తబుట్టలో పడేశారు. తర్వాత మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా తురకలాపట్నం నుంచి నీళ్లిస్తే పైసా ఖర్చు లేకుండా పేరూరుకు నీళ్లివ్వొచ్చని విపక్షపార్టీల నేతలను కలుపుకుని ప్రకాష్‌రెడ్డి పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. అయినా నాలుగేళ్లుగా పేరూరు ప్రాజెక్టును మంత్రి సునీత పట్టించుకోలేదు. ప్రణాళిక ప్రకారమే నిధుల దోపిడీ పేరూరు ప్రాజెక్ట్‌కు నీరు ఇవ్వాలనే అంశాన్ని ఎన్నికలకు ముందు మంత్రి సునీత తెరపైకి తెచ్చారు. గత ప్రభుత్వం డీపీఆర్ ప్రకారం బోరంపల్లి లిప్ట్ నుంచి రూ.119 కోట్లతో ఈ ప్రాజెక్టుకు నీళ్వివ్వొచ్చు. ఈ అంచనా వ్యయాన్ని రూ.803కోట్లకు పెంచేలా సునీత పావులు కదిపారు. కేవలం అడ్డగోలు గా నిధులు దోచుకోవడంలో భాగం గానే అంచనా వ్యయాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పరిధిలో పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి వద్ద రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఇందులో 0.6 టీఎంసీలతో 26లక్షల క్యూబిక్ మీటర్ల విస్తీర్ణంలో పుట్టకనుమ రిజర్వాయర్ నిర్మించి నీళ్లివ్వాలని అప్పటి ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇప్పుడు ప్రభుత్వం నిర్మిస్తున్న పుట్టకనుమ సామర్థ్యం కూడా 0.6టీఎంసీలే! అయితే విస్తీర్ణం మాత్రం 26లక్షల నుంచి 76లక్షలకు పెంచారు. అంటే 50లక్షల క్యూబిక్ మీటర్ల పనిని పెంచారు. నిల్వ సామర్థ్యం పెరగనప్పుడు ప్రాజెక్టు విస్తీర్ణం పెరగడం దోపిడీకి అద్దం పట్టింది. దోపిడీపై న్యాయ పోరాటం.. పేరూరుకు నీళ్లిచ్చేందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నా, తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేసే మార్గాలు ఉన్నా,కేవలం ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు రూ.803కోట్లతో ప్రభుత్వం పాలన అనుమతులు ఇవ్వడంపై ఆయకట్టు రైతులు జెడ్పీటీసీ రవీంద్రారెడ్డి, పి.నల్లపురెడ్డి తదితరులు లోకాయుక్తను ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 59లోని లోపాలు, నిపుణుల కమిటీ వ్యవహరించిన తీరు, ప్రభుత్వం ఆమోదించిన డీపీఆర్‌లోని లోపాలు, ఆయకట్టు పరిస్థితి తదితర అంశాలను ససాక్ష్యాలతో వివరించారు. పేరూరుకు నీళ్లిచ్చే పేరుతో సోమరవాండ్లపల్లి, పుట్టకనుమ రిజర్వాయర్లను పొందుపరిచారని, నిజానికి ఆ రిజర్వాయర్ల పరిధిలో ఆయకట్టు లేదని, కేవలం కాస్ట్బెనిఫిట్ రేషియో ప్రకారం పాలన అనుమతులు వచ్చేందుకే వాటిని పొందుపరిచారని పిటీషన్లో పేర్కొన్నారు. ఆ రిజర్వాయర్ల పరిధిలో పేర్కొన్న గ్రామాలకు హంద్రీ–నీవా, పీఏబీఆర్ డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీరు ఇచ్చే అవకాశం ఉందని వివరించారు. కేవలం పెంచిన అంచనాలకు ఆమోద ముద్ర వేయించుకుని, ప్రజాధనాన్ని దోచుకునేందుకే ఈ రిజర్వాయర్లను డీపీఆర్‌లో పొందుపరిచారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఇదీ ప్రాజెక్టు చరిత్ర స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పేరూరు ప్రాజెక్టును 1950–58లో నిర్మించారు. 1.82 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో రూ.1.69 కోట్లు ఖర్చు చేశారు. 3.5 కిలో మీటర్లున్న ప్రాజెక్టు పరిధిలో 10,048 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కుడికాలవ పరిధిలో 9,448, ఎడమకాలవ పరిధిలో 600 ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలి. గత 60 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో 14 సార్లు నీళ్లు వచ్చాయి. 75 శాతం ఒకసారి, 25 శాతం ఒకసారి వచ్చాయి. దాదాపు 34 ఏళ్లు ఈ ప్రాజెక్ట్‌కు చుక్కనీరు చేరలేదు. 25 సంవత్సరాల పాటు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చిన పరిటాల కుటుంబీకులు ఈ పాతికేళ్లలో ఏనాడూ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. ఫలితంగా ప్రాజెక్టుపై ఆధారపడిన భూములన్నీ బీళ్లుగా మారాయి. బతికే మార్గం లేక రైతులు వలసబాట పట్టారు. గుడ్‌విల్ కింద రూ.47 కోట్లు? పేరూరుకు నీటిని తరలించే పనులను మెయిల్ అనే నిర్మాణసంస్థ దక్కించుకుంది. ఈ సంస్థకు టెండర్ దక్కేలా సునీత ముందే పథకం రచించారు. దీంతో ‘గుడ్‌విల్’ కింద రూ.47కోట్లను మంత్రి కుటుంబీకులకు ఆ సంస్థ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డబ్బులే ఇప్పుడు ఎన్నికల్లో పరిటాల కుబీంకులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు రాప్తాడు ఎమ్మెల్యేగా ఇన్నేళ్లుగా ఎవరు కొనసాగుతున్నారు? ఎందుకు ఈ ప్రాజెక్టుకు నీరు రాలేదు? ఇందులో ఎవరి వైఫల్యం ఉంది? పేరూరు ప్రాజెక్టు పేరుతో దోపిడీ ఎలా జరిగింది? రైతులకు ఏతీరున అన్యాయం జరిగింది? అనే అంశాలపై నియోజకవర్గంలో ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. పొలాన్ని బలవంతంగా లాక్కొన్నారు కేఎన్ పాళ్యం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 336–1లో ఐదు ఎకరాల భూమికి 1976లో నా భర్త మంగల ముత్యాలప్ప పేరున ప్రభుత్వం డి–పట్టా ఇచ్చిం ది. 4 నెలల క్రితం పేరూరు డ్యాంకు కాలువ పనులకంటూ మా భూమిని ఇతరుల పేరుమీద మార్చి బలవంతంగా లాక్కొన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులు సైతం మాకు న్యాయం చేయలేదు. – మంగల నరసమ్మ, మద్దెలచెరువు, కనగానపల్లి మం‘‘ -
హర్ దిల్‌మే వైఎస్సార్
మైనార్టీల ఆత్మబంధువై వారి జీవితాల్లో వెలుగులు నింపారు.. 4 శాతం రిజర్వేషన్లు కల్పించి వారికి సమాజంలో సమున్నత స్థానాన్ని అందించారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుల విప్లవం తీసుకువచ్చి పేద విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పడ్డారు.. ముస్లింల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. హర్ దిల్‌మే వైఎస్సార్ అంటూ ముస్లింలంతా మహానేతకు నీరాజనాలు అర్పిస్తున్నారు. సాక్షి, దెందులూరు: ముస్లింల వెనుకబాటుతనాన్ని చూసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారికి రిజర్వేషన్లు వర్తింపజేశారు. బీసీ–ఈ జాబితాలో చేర్చి విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2004–05లో ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమంది వ్యతిరేకించినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆర్డినెన్స్ తీసుకువచ్చి.. 2007 జూలై 7న జీవో నంబర్ 23, బీసీడబ్ల్యూ(సీ2) జారీ చేశారు. ఆ నిర్ణయాలు సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఫలితంగా ఆర్డినెన్స్‌ను నిలుపుదల చేస్తూ అప్పట్లో ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రిజర్వేషన్లు తాత్కాలికంగా రద్దయ్యాయి. 15 ఉపకులాలకు వర్తింపు హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో రిజర్వేషన్ల అమలుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, రాజ్యాంగ సూచిక ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలని ఆదేశించింది. దీంతో ముస్లింలకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను 4 శాతానికి కుదించి వైఎస్సార్ అమలులోకి తెచ్చారు. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా చూసిన ఆయన వారి శాశ్వత అభివృద్ధి కోసం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. నాలుగు శాతం రిజర్వేషన్లను 15 ముస్లిం ఉపకులాలకు వర్తింపజేశారు. దీంతోపాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడంతో ఎందరో పేద ముస్లిం విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు అభ్యసించగలిగారు. మంత్రివర్గంలో సైతం ముస్లిం ప్రతినిధులకు స్థానం కల్పించి ముస్లింల పాలిట ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభుత్వపరంగా అన్నిరకాలుగా ఆదుకునేందుకు ముందుండేవారు. వైఎస్ చలువ వల్లే.. గతంలో ఏ ప్రభుత్వం కూడ ముస్లింల అభివృద్ధిని పట్టించుకోలేదు. మాది చింతలపూడి. నేను టైలరింగ్ చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ముగ్గురు పిల్లలు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ల వల్ల నా పిల్లలు ముగ్గురూ టీచర్ ట్రైనింగ్ పూర్తిచేశారు. వైఎస్ చలువ వల్ల పిల్లల భవిష్యత్‌పై మా కుటుంబానికి బెంగ లేకుండా పోయింది. వచ్చే డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జగన్ ఇచ్చిన హామీపై మాకు నమ్మకముంది. – మహమ్మద్ జిలానీ, టైలర్, చింతలపూడి టీడీపీ చిన్నచూపు 2014లో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం అభివృద్ధిపై చిన్నచూపు చూసింది. గద్దెనెక్కిన తర్వాత నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి ఉండటంతో కనీసం మంత్రివర్గంలో ముస్లింలకు చోటుకల్పించలేదు. ముస్లిం సంక్షేమం కోసం ఎటువంటి నిధులు కేటాయించలేదు. ఇలా అన్నిరకాలుగా ముస్లింలు తెలుగుదేశం పార్టీ పాలనలో నిరాదరణకు గురయ్యారు. రిజర్వేషన్ల కల్పన చారిత్రాత్మకం 4 శాతం రిజర్వేషన్లను మా ముస్లింలకు కల్పించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాకు అల్లాతో సమానం. ఆయన నిర్ణయం చారిత్రాత్మకం. ఎంతో మంది పేద ముస్లింలు నాలుగు శాతం రిజర్వేషన్‌తో లబ్ధి పొంది స్థిరపడ్డారు. –షేక్ చంటి, కొవ్వలి, దెందులూరు మండలం వైఎస్సార్‌కు రుణపడి ఉంటాం ముస్లింల అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పన వంటి రంగాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన మేలును ఎన్నటికీ మరువలేం. ముస్లింలంతా వైఎస్సార్ కుటుంబానికి రుణపడి ఉంటారు. – షేక్ మీరాబీ, కొవ్వలి, దెందులూరు మండలం -
రాజన్న పాలనలో..నాలుగింతల సంక్షేమం
భవిష్యత్తుపై భరోసా కల్పించిన రిజర్వేషన్ ముస్లింలలో ఉన్న ఆర్థిక వెనుకబాటు తనాన్ని రూపుమాపేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రిజర్వేషన్లను అమలులోకి తీసుకొచ్చారు. 15 ఉపకులాలను బీసీలుగా గుర్తించి వారికి విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో ఐదు శాతం రిజర్వేషన్లకు అవకాశం కల్పించారు. దీనికి ప్రత్యేకంగా జీఓను తెచ్చి ఆచరణలో పెట్టారు. కొన్ని అడ్డంకులు ఎదురైన ఇచ్చిన మాటకు కట్టుబడి న్యాయస్థానంలో స్టే తీసుకొచ్చి అమలు చేశారు. ఆటంకాలు తొలగించేందుకు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2007లో జీఓ ఎంఎస్ 23 జారీ చేశారు. దీంతో వేలాది ముస్లింలు ఉద్యోగ, వయో పరిమితి ఉపాధి రంగాల్లో అర్హత సాధించి జీవితాల్లో స్థిరపడ్డారు. మంత్రి వర్గంలో స్థానమివ్వని బాబు 2014 ఎన్నికల సమయంలో ముస్లిం సంక్షేమానికి చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చలేకపోయారు. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లిం వ్యతిరేక భావజాలంతో ఈ ఐదేళ్లు పాలన సాగించారు. ముస్లిం సంక్షేమానికి వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలకు తిలోదకాలిచ్చేశారు. ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలులో చిత్తశుద్ధి లోపించడంతో వేలాదిగా ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు. తన మంత్రి వర్గంలో ఏ ఒక్క ముస్లింలకు స్థానం కల్పించకుండా తనలోని ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లైంది. చివరకు వైఎస్సారసీపీ తరుఫున గెలిచిన పలువురు ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి, పార్టీలోకి చేర్పించుకున్నారు. ఈ ఐదేళ్లు ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖను ముస్లిమేతరులకు కేటాయించి తీరని అన్యాయం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నాలుగు నెలల ముందు ఎన్ఎండీ ఫరూక్‌కు నామమాత్రంగా మంత్రి పదవిని ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్య సాకారం పేదరికం కారణంగా ముస్లింల ఇళ్లలో నిరక్షరాస్యత వికట్టాటహాసం చేస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలతో పదో తరగతి పూర్తి చేయడమే గగనం. దీంతో సమాజంలో చిన్నాచితక పనుల్లో చిన్నప్పటి నుంచే ముస్లిం పిల్లలు నలిగిపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి ముస్లింలను తప్పించేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ముస్లింలకు 2007లో వైఎస్సార్ వర్తింపజేశారు. అర్హులైన నిరుపేద ముస్లిం విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, బీఈడీ, పీజీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా, లా, నర్సింగ్, ఐఐటీ వంటి వృత్తి విద్యా కోర్సులను ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకునే బృహత్తర అవకాశాన్ని వైఎస్సార్ కల్పించారు. ఆయన చలువ వల్ల నేడు ఎందరో ముస్లింలు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, డాక్టర్లుగా జీవితంలో స్థిరపడ్డారు. ముస్లింలకు ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు ముస్లింల పట్ల చిత్తశుద్దితో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. ముస్లింల అభ్యున్నతిపై ఆయనకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 2014 ఎన్నికల్లోనూ నాలుగు అసెంబ్లీ స్థానాలను ముస్లింలకు జగన్ కేటాయించిన వైనం విదితమే. 2019 ఎన్నికల్లో ఈ సంఖ్య ఐదుకు ఎగబాకింది. ముస్లింల అభ్యున్నతికి జగన్ భరోసా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే ముస్లింల అభ్యున్నతికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా భరోసానిస్తున్నారు. ప్రధానంగా అధికారంలోకి రాగానే ముస్లింలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలతో సమానంగా 45 ఏళ్లకే పింఛన్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. మసీదుల్లో పనిచేస్తున్న ఇమాంలకు రూ. 10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు గౌరవ వేతనాన్ని అందిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులకు ఆస్కారం కల్పిస్తామన్నారు. అన్ని కాంట్రాక్ట్ పనుల్లో మైనార్టీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలతో సమానంగా 50 శాతం పనులు కేటాయిస్తామన్నారు. దుల్హన్ పథకం ద్వారా రూ. లక్షను అందిస్తామన్నారు. ఈ పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ ఫలాలను అందించేందుకు సిద్ధంగా ఉన్న జగన్ విశ్వసనీయతను ముస్లింలు నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌కే తమ మద్దతు అంటూ బాహటంగానే ప్రకటిస్తున్నారు. డిగ్రీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా మెడిసిన్ సీటు రాలేదు. బీడీఎస్‌లో అవకాశం దక్కింది. వైఎస్సార్ కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ ఉంది మరోసారి ప్రయత్నించు అని అమ్మ నుస్రత్, నాన్న అతావుల్లా నన్ను ప్రోత్సహించారు. దీంతో రెండో సారి ప్రయత్నించడంతో మెడిసిన్‌లో సీటు దక్కింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ రిజర్వేషన్ కల్పించకపోయింటే ఏ డిగ్రీనో, ఇతర కోర్సులు చేసేదాన్నేమో. వైఎస్సార్ చలువతోనే ఈ స్థాయికి చేరుకున్నా. మొదటి ఏడాది అనాటమీలో గోల్డ్‌మెడల్ సాధించా. – అయిషా తస్నీమ్, గోల్డ్ మెడలిస్టు, మెడికో 2016 బ్యాచ్, అనంతపురం కొత్త రుణాలతో ఆర్థిక చేయూత జీవనోపాధుల కోసం ముస్లింలు తీసుకున్న రుణాలను ఆర్థిక పరిస్థితులు సహకరించక చెల్లించలేకపోతున్న ఎందరికో వైఎస్సార్ అండగా నిలిచారు. ఇందు కోసం ప్రత్యేకంగా 2005లో రుణమాఫీ పథకాన్ని వైఎస్సార్ అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో సమానంగా రూ. లక్షలోపు ఉన్న వివిధ రకాల ముస్లింల రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు తిరిగి వారికి కొత్తగా రుణాలను అందజేసి ఆదుకున్నారు. దీని ద్వారా జిల్లాలో 12 వేల మంది ముస్లింలకు లబ్ధి చేకూరింది. దీంతోపాటు లబ్దిదారులకు మార్జిన్ మనీ విధానాన్ని రద్దు చేసి 50 శాతం సబ్సిడీతో రుణాలను అందించే పథకాన్ని వైఎస్సార్ ప్రవేశపెట్టి నిరుపేద ముస్లిం కుటుంబాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు పాలనలో రుణాలు అందక ముస్లింలు నలిగిపోయారు. కమిటీల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి చంద్రబాబు తెరలేపారు. జిల్లా వ్యాప్తంగా 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రౌండింగ్ చేసిన రుణాలు కేవలం 145 మాత్రమే. దీని ద్వారా ఈ ప్రభుత్వానికి ముస్లింల పట్ట ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ముస్లిం పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు నిరుపేద ముస్లిం పిల్లల ఉన్నత చదువులకు చంద్రబాబు పాలనలో భరోసా లేకుండా పోయింది. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎన్నడూ చూడలేదు. మా పిల్లల చదువులు, వారి భవిష్యత్తు బాగుండాలనుకుంటే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు మళ్లీ అమలులోకి రావాలి, ఇందుకు జగన్‌ను సీఎంగా చేసుకోవాలి. – బాబావలి, డ్రైవర్, బత్తలపల్లి పెద్దాయన చలువతోనే ఇంజినీర్నయ్యా మాది పరిగి మండలం కొడిగెహళ్లి. మా నాన్న అల్లాబకాష్ కార్పెంటర్‌గా పనిచేస్తు అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని పోషించుకుని వచ్చేవారు. నిజం చెప్పాలంటే పదో తరగతి తర్వాత మా చదువులు ఆగిపోతాయని భయపడ్డాను. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, నాలుగు శాతం రిజర్వేషన్ కారణంగా నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని కాగలిగాను. ఈ రోజు మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉందంటే అదంతా వైఎస్సార్ చలువే. ఆనాడు వైఎస్సార్ సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేయకపోయి ఉంటే ఈ రోజు నేనను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. – కొడిగెనహళ్లి షబ్బీర్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, బెంగళూరు మా ఊళ్లో రెండో డాక్టర్ నేనే నాన్న షేక్‌మహబూబ్ బాషా రైతు. అమ్మ మహబూబ్‌బీ. రైతు కుటుంబంలో కష్టాలు ఎన్ని ఉంటాయో అందరికీ తెలుసు. మెడిసిన్ చదువుతానని అనుకోలేదు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే రిజర్వేషన్ కల్పించారు. ఆయన గొప్పమనసే మాలాంటి ఎంతో మందిని ఉన్నత స్థాయికి చేర్చింది. మా ఊళ్లో రెండో డాక్టర్‌ను నేనే. మా సమీప బంధువు సోదరుడు సద్దాం హుస్సేన్ కూడా రిజర్వేషన్ ద్వారానే సీటు సాధించాడు. వైఎస్సార్ చేసిన మేలును మేమేన్నటికీ మరచిపోం. – డాక్టర్ షేక్ రియాజ్ హుస్సేన్, హౌస్‌సర్జన్, అయ్యలూరు, నంద్యాల ఉచిత సామూహిక వివాహాలతో కొండంత ఊరట మిగిలిన అన్ని సామాజిక వర్గాల కంటే ముస్లింలలో పేదరికం అత్యధికంగా ఉంది. ఈ ఒక్క కారణమే వారిని చదువులకు దూరం చేస్తూ వచ్చింది. పేదరికం కారణంగా ముస్లిం అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయలేని స్థితిలో తల్లిదండ్రులు నలిగిపోసాగారు. ఇలాంటి తరుణంలోనే కుమార్తెకు పెళ్లి చేసివ్వడం ద్వారా ఆ నిరుపేద ముస్లిం తల్లిదండ్రులు ఆర్థికంగా చితికి పోరాదనే తలంపుతో ఉచిత సామూహిక వివాహాలకు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. పెళ్లిళ్లతోపాటు నవ వధూవరులకు పెళ్లి దుస్తులు, రెండు గ్రాముల బంగారంతో కూడిన నల్లపూసల హారం(కాలిపోతాకా లచ్చా) పవిత్ర ఖురాన్ గ్రంథం, మంచం, వంట సామగ్రి, ఒక్కో జంటకు రూ. 15వేలు అందిస్తూ వచ్చారు. ఈ పథకం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున వివాహాలు నిర్వహించారు. -
కరువు నేలపై..హరిత సంతకం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘ఎన్నికల ముందు నేను చేసిన వాగ్దానం ప్రకారం రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించే కార్యక్రమానికి చెందిన ఫైలుపై తొలి సంతకం చేస్తున్నాను’’ అంటూ తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారు వైఎస్. ఒకే ఒక్క నిమిషంలో..ఒక్క మాట ద్వారా..ఒక్క సంతకం ద్వారా...తానేమిటో, తన విశ్వసనీయత ఏమిటో చేసిన వాగ్దానాల పట్ల నిబద్ధత, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఏంటో చెప్పకనే చెప్పారు వైఎస్. తెలుగుదేశం హయాంలో 2004కు ముందు రాష్ట్రంలో కరువు కాటకాలు విలయతాండవం చేశాయి. తాగునీరు అందని దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి వైఎస్ సీఎం అయ్యారు. 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ ప్రజారంజక పాలనను సాగించారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఇందిరా క్రాంతి పథకం, రూ.2 కిలో బియ్యం, ఇందిర ప్రభ, రాజీవ్ గృహకల్ప, రాజీవ్ యువశక్తి, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర పథకాలను ప్రవేశపెట్టారు. రూ.75 మాత్రమే ఉన్న పింఛన్‌ను రూ.200 పెంచారు. రూ.45,600 కోట్లతో జలయజ్ఞం ద్వారా 26 నీటి ప్రాజెక్టులు ప్రారంభించి వాటిలో కొన్నింటిని పూర్తి చేసి లక్షలాది ఎకరాలు సాగు, తాగు నీటిని అందించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనకే దక్కింది. మొత్తంగా వైఎస్ ఐదేళ్ల పాలన జనరంజకంగా సాగింది. 2009 శాసనసభ ఎన్నికల్లో 156 స్థానాలు గెలుచుకొని రెండో మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్. వైఎస్ ఐదేళ్ల పాలనా కాలంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగింది. జలయజ్ఞంలో భాగంగా జిల్లా పరిధిలో వెలిగొండ, రామతీర్థం, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టులకు పెద్ద నిధులిచ్చి పనులు చేయించిన ఘనత వైఎస్‌కే దక్కింది. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు కేటాయించి 70 శాతం పనులను పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన నిధుల్లో 80 శాతం నిధులు వైఎస్ హయాంలో కేటాయించినవే. గుండ్లకమ్మ ప్రాజెక్టు దాదాపు రూ.592.18 కోట్ల నిధులిచ్చి 95 శాతం పనులను పూర్తి చేశారు. వందల కోట్లు వెచ్చించి అన్ని నియోజకవర్గాల్లో తారు, సిమెంటు రోడ్లను నిర్మించారు. ప్రధానంగా రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్, మెడికల్ కాలేజీని నిర్మించారు. ఒంగోలు ప్రజలకు తాగునీటిని అందించారు. ఆరోగ్యశ్రీ ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి పేదల ప్రాణాలను నిలబెట్టారు. వేలాది మంది రైతులకు రుణవిముక్తి కలిగించారు. మహిళలను ఆదుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించారు. వృద్ధులకు పింఛన్ల ద్వారా భరోసా ఇచ్చారు. ప్రతి పేదవాడికి పక్కా గృహం నిర్మించి ఇచ్చాడు. వైఎస్ హయాంలో నియోజకవర్గాల వారీ అభివృద్ధి పనులు: ఒంగోలు నియోజకవర్గంలో రూ.250 కోట్లతో వెయ్యి పడకల రిమ్స్ ఆస్పత్రిని వైఎస్ హయాంలోనే నిర్మించారు. ఒంగోలు నగరానికి తాగునీటిని అందించేందుకు రామతీర్థం నుంచి పైప్‌లైన్‌ను నిర్మించారు. నగరంలో ఏడు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించి ప్రజలకు నీటిని అందించారు. మినీస్టేడియం మంజూరు చేశారు. కొత్తపట్నం–ఒంగోలు ఫ్లైఓవర్‌ను మంజూరు చేశారు. పోతురాజు కాలువ ఆధునికీకరణకు నిధులిచ్చారు. వేలాది మందికి ఇంటి స్థలాలిచ్చి పక్కా గృహాలు నిర్మించారు. జిల్లా జైలును నిర్మించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వెలిగొండ ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లకుపైగా నిధులిచ్చి పనులను ప్రారంభించటమే గాక వేగవంతం చేశారు. యర్రగొండపాలెంలో మోడల్ డిగ్రీ కాలేజీని నిర్మించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో చీమకుర్తి మండలంలో రామతీర్థం జలాశయాన్ని నిర్మించారు. దీని ద్వారా 70 వేల ఎకరాలకు సాగు నీటితో పాటు ఈ ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించారు. మద్దిపాడు మండలంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించి 80 వేల ఎకరాలకు సాగునీరు, 84 గ్రామాలకు తాగునీరు అందించారు. గుండ్లాపల్లిలో పరిశ్రమల కేంద్రాన్ని నెలకొల్పారు. పర్చూరు నియోజకవర్గంలో రూ.400 కోట్లతో నాగార్జున సాగర్ కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టి ఆయకట్టుకు నీరందించిన ఘనత వైఎస్‌కే దక్కింది. మార్కాపురం నియోజకవర్గంలో రూ.35 కోట్లతో సాగర్ జలాలను తీసుకువచ్చారు. మార్కాపురంలో రైల్వేబ్రిడ్జిని నిర్మించారు. ఈ నియోజకవర్గ పరిధిలో వెలిగొండ ప్రాజెక్టులు పనులను వేగవంతం చేశారు. కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలం చెన్నుపాడు వద్ద రూ.50 కోట్లతో సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. పొన్నలూరు, జరుగుమల్లి, కొండపి, మర్రిపూడి మండలాల పరిధిలో 9,500 ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు పలు గ్రామాలకు తాగునీటిని సైతం వైఎస్ అందించారు. దర్శి నియోజకవర్గంలో రూ.120 కోట్లతో రక్షిత మంచినీటి పథకం నిర్మించారు. మరో రూ.120 కోట్లతో సాగర్ కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు. రూ.2 కోట్లతో మార్కెట్ కమిటీ భవనాలను నిర్మించారు. 133 కె.వి. విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. కనిగిరి నియోజకవర్గంలో రూ.175 కోట్లతో కనిగిరికి సాగర్ జలాలతో కనిగిరి రక్షిత మంచినీటి పథకాన్ని వైఎస్ 2008 ఆగస్టులో ప్రారంభించారు. కందుకూరు నియోజకవర్గంలో పట్టణ వాసులకు రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మించి తాగునీటిని అందించారు. రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువను వైఎస్ ప్రారంభించారు. గిద్దలూరు నియోజకవర్గంలో రూ.12 కోట్లతో బైరేనిగుండాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. గిద్దలూరు నగర పరిధిలోని 6 గ్రామాలకు పరిసరాల్లోని 14 గ్రామాలకు దీని ద్వారా తాగునీటిని అందించారు. రాచర్ల మండలంలో రూ.22 కోట్లు వెచ్చించి రామన్నకతువ ప్రాజెక్టును నిర్మించారు. దీని ద్వారా 20 గ్రామాలకు తాగునీటిని అందించారు. గుండ్లమోటు ప్రాజెక్టుకు వైఎస్ రూ.11 కోట్లు నిధులిచ్చారు. చీరాల నియోజకవర్గంలో కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులకు రూ.2 వేల కోట్లు కేటాయించారు. చేనేతలకు 50 సంవత్సరాల వయస్సుకే పింఛన్‌ను ఇప్పించారు. చిలపనూలుపై ఉన్న 22 శాతం ఎక్సైజ్ సుంకాన్ని వైఎస్ రద్దు చేశారు. రంగు, రసాయనాలు, నూలుపు 10 శాతం సబ్సిడీ ఇచ్చారు. అద్దంకి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో నార్కెట్‌పల్లి, అద్దంకి, మేదరమెట్ల రాష్ట్రీయ రహదారిని నిర్మించారు. జలయజ్ఞంలో భాగంగా బల్లికురవ మండలంలో భవనాశి రిజర్వాయర్‌ను నీరిచ్చి 5 వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. కొరిశపాడులో యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి 5 వేల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత వైఎస్‌కే దక్కింది. -
ఆయనది చెరగని సంతకం
సాక్షి, మైలవరం : ఆరోగ్యశ్రీతో ఉచితంగా వైద్యసాయం పొందిన పేదవాడి కుటుంబంలో ఆనందం.. డెల్టా ఆధునికీకరణతో అన్నదాత కళ్లలో వెలుగు.. పావలావడ్డీ రుణాలు పొందిన మహిళ మోములో చిరునవ్వు.. రీయింబర్స్‌మెంట్‌లో ఉచితంగా ఉన్నత విద్యాఫలాలు అందుకున్న విద్యార్థుల్లో నమ్మకం.. ఇవీ రాజన్న రాజ్యంలో చెరగని సంతకాలు. జిల్లావాసులు ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమమే అజెండాగా అభివృద్ధి ఫలాలను అందజేసిన మహానేతను మననం చేసుకుంటున్నారు. చెప్పినవీ.. చెప్పనివి కూడా చేసి చూపించిన ఆ విశ్వసనీయతను తలచుకుంటున్నారు. ఆ రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. సాగుకు భరోసా.. మైలవరం నియోజకవర్గంలోని రైతులకు సాగునీరందించడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారానికి వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. అప్పటికే కృష్ణాజలాలు ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు వరకు అందించేందుకు గత ప్రభుత్వం మొదటి దశ పనులను పూర్తి చేసింది. కానీ మైలవరం, రెడ్డిగూడెం మండలాలకు కూడా తాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.5 కోట్లు కేటాయించి రెండోదశ పనులను పూర్తి చేశారు. కృష్ణావాటర్పైపులైను రెండోదశ పనులతో పాటు తారకరామ ఎత్తిపోతల రెండోదశ పనుల పూర్తి చేసి 2006 మే 10న ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ ప్రారంభించారు. పోలవరం కాలువ మళ్లింపు వెఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా పోలవరం కుడికాల్వ తవ్వకం చేస్తున్న సందర్భంలో కాలువకు చివరి భాగంలో ఉన్న వెలగలేరు గ్రామాన్ని అనుకొని తవ్వ వలసి ఉంది. అయితే కాలువను గ్రామానికి అనుకొని తవ్వడంతో గ్రామానికి ఒక వైపు బుడమేరు, రెండో వైపు పోలవరం కాల్వ ఉంటే వరదల వచ్చిన సమయంలో గ్రామం ముంపునకు గురవుతుందని అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే చనమోలు వెంకట్రావు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. చనమోలు అడిగిందే తడువుగా కాలువ రూట్‌మ్యాప్‌ను మార్చి వెలగలేరు గ్రామానికి తూర్పువైపుగా కాలువను తవ్వించి బుడమేరులో కలిపారు. వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికీ మరవలేమని వెలగలేరు గ్రామ ప్రజలు అంటున్నారు. తారకరామతో రైతులకు సాగనీరు మైలవరం నియోజకవర్గానికి తలమానికమైన తారకరామ ఎత్తిపోతల పథకం రెండోదశ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరందించిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిది. తారకరామ ఎత్తపోతల పథకాన్ని నిర్మించడానికి అధికారులు మూడు దశలుగా విభజించారు. మొదటి దశలో ఇబ్రహీంపట్నం,జి కొండూరు, విజయవాడరూరల్ మండలాల పరిధిలోని 12,556 ఎకరాలకు నీరందించడం లక్ష్యం. మొదటి దశ పనులు అప్పటి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే,వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు ఆధ్వర్యంలో 2004 నాటికి పూర్తయ్యాయి. వెలగలేరు గ్రామానికి తూర్పువైపుగా దారిమళ్లించి తవ్వించిన పోలవరం కుడి కాల్వ రెండవ దశలో జి.కొండూరు మండలంలోని 8గ్రామాలకు చెందిన 4,242ఎకరాలకు నీరందించడం లక్ష్యం.దీనికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సారధ్యంలో 10–05–2006న పనులు ప్రారంభించి 2009కల్లా పూర్తి చేసి రైతులకు సాగునీరందించారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం రాజకీయాలలో సంచలన మార్పులు కారణంగా మూడో దశ పనులు నిలిచిపోయాయి. రైతు బాంధవుడు వైఎస్సార్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లనే తారకరామా ఎత్తిపోతల పథకం రెండవదశ పనులు పూర్తయ్యాయి. దీంతో రైతులకు సాగునీరు అందింది. ఆయన బతికి ఉంటే మూడో దశ పనుల కూడా పూరై్త నియోజకవర్గం సస్యశ్యామలమయ్యేది. కృష్ణా జలాలను మైలవరానికి అందించిన ఘనత కూడా వైఎస్సార్‌దే. వైఎస్సార్ హయాంలో రైతులకు సాగునీరు పుష్కలంగా అందింది. నాలుగున్నరేళ్లుగా రైతులు సాగునీరు లేక అల్లాడిపోతున్నారు. జలవనరులశాఖా మంత్రిగా ఉండి కూడా దేవినేని ఉమా తన సొంత నియోజకవర్గంలో ఉన్న తారకరామను నిర్వీర్యం చేశారు. కృష్ణా జలాలను అందించడంలో దేవినేని విఫలమయ్యారు. -పామర్తి వెంకటనారాయణ, రైతు, కుంటముక్కల -
నేటి వారధికి..సారథి ఆయనే..
సాక్షి, పెడన : కడలి సుడులలో కొట్టుకుంటూ బాహ్య ప్రపంచంతో బంధం లేని దీవికి వారధి రూపంలో దారి కల్పించిన దేవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇసుక తిన్నెలనే రహదారిగా చేసుకుని అలసిన పాదాల కష్టాలకు విరామాన్నిస్తూ సొగసైన రహదారి నిర్మాణం ఆయన సొంతం. గుక్కెడు నీటి కోసం అలమటించి పోతున్న వేల గొంతుల దాహం తీర్చే ఆలోచన చేసిన అపరభగీరథుడు. రెండు జిల్లాలను వంతెనతో అనుసంధానం చేసిన మహోన్నతుడు. అభివృద్ధికి ఆయన చిరునామా..పేదవాడి కష్టం తెలిసిన ప్రేమమూర్తి దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి. పెడన నియోజకవర్గంలోనే అరుదైన అభివృద్ధి సొంతం చేసుకున్న ఘనత ఆయనది. తీరప్రాంతమే కాక జిల్లాకు శివారునున్న కృత్తివెన్ను మండలానికి 2007 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ రాకతో అభివృద్ధికి బీజం పడింది. నాడు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఉప్పుటేరుపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి వైఎస్సార్ వచ్చారు. బాహ్య ప్రపంచంతో రవాణా సంబంధం లేని చినగొల్లపాలెం దీవి వంతెనకు శంకుస్థాపన చేశారు. దీవిలో దారి.. ఇసుక తిన్నెలపై ప్రయాణంతో నిత్యం ప్రత్యక్ష నరకం చూస్తున్న దీవి వాసుల కోసం ఎంతో వ్యయ ప్రయాసలైన పడవలపై ఇసుక, కంకర తరలించి రహదారి నిర్మాణానికి కృషి చేసిన ఘనత ఆయనదే. -
తొలి అడుగు..పడమర ఖండ్రికలోనే..
కపిలేశ్వరపురం (మండపేట): ఎన్నికల ప్రచారం వేడెక్కింది. పార్టీల తమ అభ్యర్థులను గెలిపించే పనిలో వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థులైతే గెలిచేందుకు కలిసి వచ్చే అంశాలపై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ దశలో ఎవరికి ఓటేద్దామా అనే ఆలోచన చేస్తున్న క్రమంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనా తీరును ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన హయాంలో పలు సంక్షేమ పథకాలకు ఇందిరమ్మ పథకం అని పేరు పెట్టారు. ఆ రాష్ట్ర వ్యాప్త పథకానికి పునాది పడింది జిల్లాలోని కపిలేశ్వరపురం మండలం పడమర ఖండ్రికలోనే. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద 2006లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పథకం అమలులో భాగంగా గ్రామంలోని దళిత కుటుంబమైన నేల సౌధామణి ఇంటి నిర్మాణ పనులకు వైఎస్సార్ కొబ్బరికాయ కొట్టారు. ఈ పర్యటనలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ఆ చిరునవ్వు నేటికీ గ్రామంలో చెక్కు చెదరలేదు. ప్రజల గుండెలోతుల్లో ఇమిడిన ఆయన నడవడిక తీపి గుర్తులను ప్రజలు మననం చేసుకుంటున్నారు. పేదలకు ఎన్నటికీ సాధ్యం కావనుకున్న విద్య, వైద్య సదుపాయాలను కల్పిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే చెల్లిందంటున్నారు. ఆయనే స్వయంగా కొబ్బరికాయ కొట్టారు వైస్ రాజశేఖర్‌రెడ్డిగారు పడమర ఖండ్రికలో ఇందిరమ్మ పథకాలను ప్రారంభించేందుకు వచ్చినప్పుడు గృహ నిర్మాణ పథకం పనులను మా ఇంటితోనే ప్రారంభించారు. ఆయన మీ వైఎస్సార్ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మీ ఇంటికి వస్తారమ్మా అన్నప్పుడు పెద్దొళ్లు మనింటికేం వస్తారులే అనుకున్నాను. ఆ రోజు ఆయన ఎంతో ఆప్యాయతగా వచ్చి కొబ్బరికాయ కొట్టారు. నేను మా పిల్లలు ఆశ్చర్యపోయాం. నవ్వుతూ ఎంతో ఆప్యాయతతో పలకరించారు. ఆయన పుణ్యమా అని ఇల్లు కట్టుకోగలిగాం. నాలాంటి వాళ్లెందరికో మేలు చేసిన గొప్పాయన ఆయన. – నేల సౌదామణి, పడమర ఖండ్రిక -
రాజన్న పాలన మరువలేం
జి.సిగడాం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే తమకు మేలు జరిగిందని పలువురు ముస్లింలు గుర్తు చేసుకుంటున్నారు. జి.సిగడాం మండల పరిధిలో మెట్టవలస– పాలఖండ్యాం జంక్షన్లో సుమారు 40 ముస్లిం కుటుంబాలు నివాసముంటున్నాయి. వైఎస్సార్ సీఎం కాకముందు ముస్లిం సంక్షేమాన్ని ఏ నాయకుడూ పట్టించుకోలేదు. ఫలితంగా సంక్షేమ పథకాలకు దూరమయ్యేవారు. ఈ తరుణంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గద్దెనెక్కిన తర్వాత ముస్లింకు 4 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. దీంతో అనేక మందికి ఉద్యోగాలతో పాటు సంక్షేమ పథకాలు దక్కాయని ముస్లింలు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న హయాంలో విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్లో ఇద్దరికి ఉపాధ్యాయ కొలువులు దక్కాయని గర్వంగా చెప్పుకుంటున్నారు. మహానేత పాలనను మరువలేమంటూ మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తమకు మరోసారి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లతో మేలు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రిజర్వేషన్ల కారణంగా రెండుసార్లు మండల పరిషత్‌లో కో ఆప్షన్ సభ్యునిగా పదవులు కేటాయించారు. వీటితో పాటు సంక్షేమ పథకాలు కూడా అందించారు. రాజశేఖరరెడ్డి దయవల్లే మాకు సంక్షేమ పథకాలు అందాయి. – బడాన్, మెట్టవలస, జి.సిగడాం రాజన్న రుణం తీర్చుకోలేనిది పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్న సమయంలో చదువుకున్న యువతీ, యువకులకు నాలుగుశాతం రిజర్వేషన్లు ప్రకటించడంతో ముస్లింలకు ఉద్యోగ అవకాశాలు దక్కాయి. ఇదంతా రాజశేఖరరెడ్డి ప్రకటించిన రిజర్వేషన్ల ఫలితమే. మహానేత రుణం తీర్చుకునేందుకు అందరూ కృషి చేస్తున్నాం. – ఫాతీమా బేగం, ఉపాధ్యాయురాలు -
ఫీజు రీఎంబర్స్‌మెంటుకు ‘చంద్ర’గ్రహణం
సాక్షి కడప/రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులతో చెలగాటమాడుతోంది. పాలకుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలక్ష్యం వెరసి వారికి తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. విద్యా సంవత్సరాలు ముగుస్తున్నా అందాల్సిన రీయింబర్స్మెంట్ అందకపోవడంతో విద్యార్థులకు అవస్థలు ఎదురవుతున్నాయి. పైగా నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజుల రూపంలో కోట్లకు కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ప్రస్తుత టీడీపీ సర్కార్ పుణ్యమా అని చెదలు పడుతోంది. 2019వ విద్యా సంవత్సరం చివరి దశకు వచ్చినా విద్యార్థులకు సంబంధించిన ఫీజులు అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు విద్యార్థులు...మరోవైపు యాజమాన్యాలు సైతం ఫీజుల కోసం ఆందోళన చెందుతున్నాయి. ఇటీవల తిరుపతిలో విద్యానికేతన్ సంస్థల అధినేత, సినీ నటుడు మోహన్‌బాబు నడిరోడ్డుపై బైఠాయించిన సంగతి అందరికీ తెలిసిందే. జమ కాని ఫీజులు.. స్కాలర్షిప్లు.... జిల్లాలో 500 ఇంటర్మీడియట్ ఆపై విద్యను బోధించే కళాశాలలు ఉన్నాయి. కాగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఆయా కళాశాలలో చదివే విద్యార్థులకు ఆ విద్యార్థికి సంబంధించిన ఫీజును ప్రభుత్వం ఒక ఏడాదిలో నాలుగు విడతలుగా ఆయా కళాశాల ఖాతాల్లో జమ చేయాలి. అలాగే స్కాలర్షిప్లను ప్రతి నెలా విద్యార్థుల ఖాతాల్లో వేయాలి. అయితే ఈ రెండు సక్రమంగా జరగలేదు. ఫీజులను ప్రభుత్వం రెండు విడతలుగా చెల్లించింది. ఉదాహరణకు ఇంజినీరింగ్ విద్యకు ఒక ఏడాదికి రూ. 80 వేలు అయితే, అందులో ప్రభుత్వం రూ. 40 వేలు మాత్రమే చెల్లించింది .అలాగే విద్యార్థులకు స్కాలర్షిప్ గత జనవరి నెల నుంచి రావాల్సి ఉంది. ఫీజు కట్టు..హాల్ టికెట్ పట్టు... విద్యార్థులకు ఇది పరీక్షల కాలం. కళాశాల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించే సమయం. దీంతో ఆయా కళాశాల యాజమాన్యాలు ముందు మీరు ఫీజు కట్టండి.. పరీక్ష రాయడానికి హాల్ టికెట్ తీసుకోండని అంటున్నారు. ‘ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తోంది కదా..! అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే, ‘వారు చెల్లించలేదు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం..ఇప్పుడు కట్టండి. ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తే అప్పుడు తీసుకోండని’ కాలేజీ యాజమాన్యాలు బదులిస్తున్నాయి. దీంతో చేసేది లేక విద్యార్థుల తల్లిదండ్రులు అప్పు చేసి ఫీజులు కడుతున్నారు. మొత్తం మీద పరీక్షల సమయంలో విద్యార్థులు అసలైన ఫీజుల పరీక్షలను ఎదుర్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ‘చంద్ర’గ్రహణం దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి టీడీపీ సర్కార్ తూట్లు పొడుస్తోంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు కళాశాలలో చేరిన మొదలు తర్వాత ఏడాది చివరిలో ప్రభుత్వ చెల్లింపులు ఆలస్యం కావడంతో విద్యార్థులకు ఒత్తిళ్లు తప్పడం లేదు. పైగా ఆలస్యం చేయడం ఒక కారణం, చెల్లించకపోవడం మరో కారణం లాంటి సమస్యలతో రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని నీరుగారుస్తున్నారన్న అభిప్రాయం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. ఎప్పుడూ లేని తరహాలో హామీలు ఇచ్చి నెరవేర్చలేక కొట్టుమిట్టాడుతూ చివరకు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులోనూ తాత్సారం వారికి తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. యాజమాన్యాలు కూడా బాబు తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రీయింబర్స్మెంట్ సక్రమంగా రాకుంటే నిర్వహణ కష్టం ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా రాకుంటే కళాశాల నిర్వహణ కష్టమవుతుంది. ఈ ఏడాది పూర్తి, గత ఏడాది కొంత ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సి ఉంది. గతంలో వైఎస్ హయాంలో ఫీజురీయింబర్స్‌మెంట్ సక్రమంగా మంజూరయ్యేది. ఇటీవల కాలంలో సక్రమంగా చెల్లించకపోవడంతో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కళాశాలలో దాదాపు 100 మంది దాకా అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి ఉంటారు. వీరికి జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు ఇబ్బంది. – ఓ.గురుబ్రహ్మయ్య, గౌతమి మహిళా ఇంజినీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్, ప్రొద్దుటూరు చదువుల ప్రదాత వైఎస్సార్.. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు పెద్ద..పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా విద్యను పొందగలిగారు. నాడు...ఏనాడూ విద్యార్థులకు ఉపకార వేతనాల సమస్య వచ్చేది కాదు. విద్యార్థులకు సంబంధించి చిన్న సమస్య కూడా ఏర్పడకుండా చూసుకున్నారు. విద్యా సంవత్సరం పూర్తి కాకమునుపే యాజమాన్యాలకు ఫీజులు చెల్లించే పరిస్థితి ఉండేది. అయితే ఆయన మరణానంతరం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం బాలారిష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థులు చదువు మానేస్తున్నారు తగిన సమయంలో ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోవడంతో విద్యార్థులు కీలక దశలో డిగ్రీ చేతికి అందకముందే చదువు మానేయాల్సిన దయనీయమైన స్థితి దాపురించింది. ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విద్యార్థులు చదువు మధ్యలో మానేస్తే వారికి ఏం భవిష్యత్తు ఉంటుంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మూడేళ్లుగా ప్రభుత్వం కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం కోట్లాది రూపాయలకు చేరింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది విద్యా సంస్థలు మూసివేయక తప్పదు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను పసుపు–కుంకుమలకు మళ్లించడం ఏం న్యాయం. ఈనెల 30వ తేదీలోగా రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుంటే సమైక్యంగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి ఉంటుంది - లయన్ పఠాన్ అక్బర్‌ఖాన్, మైనార్టీ విద్యా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌తోనే పథకానికి వెలుగు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి మళ్లీ ఒక వెలుగు వచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే వైఎస్సార్ మరణానంతరం అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ ప్రభుత్వాలు పథకాన్ని నిర్వీర్యం చేశాయి. బకాయిలు పేరుకుపోతున్నా పట్టించుకోని తీరే అందుకు బలం చేకూరుస్తోంది. పైగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా విద్యార్థుల ఫీజులతోపాటు హాస్టల్ ఫీజు కింద రూ. 20 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. విద్యార్థుల చదువుల భారాన్ని మోసేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. చిన్నతనం నుంచే బడికి పంపించిన తల్లిదండ్రుల అకౌంటుకు ప్రతి సంవత్సరం రూ. 15 వేలు ఇస్తూనే ఇంజినీరింగ్ లాంటి పెద్ద పెద్ద చదువులు చదివించే బాధ్యత తీసుకోనున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు ప్రభుత్వం ఓసీ విద్యార్థులకు రీయింబర్స్మెంట్ విడుదలలో తీవ్ర జాప్యం చేస్తోంది విద్యా సంవత్సరం ముగిసినా మంజూరు చేయడం లేదు. కిందటి ఏడాదికి సంబంధించిన ఫీజు రెండో ఏడాది సగం విద్యా సంవత్సరం గడిచిన తరువాత అందిస్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – విష్ణువర్దన్‌రెడ్డి, అగ్రికల్చర్ బీఎస్సీ, వరికుంట్ల, కాశినాయన మండలం జిల్లాలో ఫీజుల వివరాలు (ఫ్రెష్, రెన్యూవల్) ఎస్సీ విద్యార్థుల సంఖ్య 19500 ఫీజులకు అవసరం రూ. 25 కోట్లు ఇంకా రావాల్సిన నిధులు రూ. 6 కోట్లు స్కాలర్షిప్పులకు అవసరం రూ. 8.50 కోట్లు ఇంకా అందాల్సిన నిధులు రూ. 2.50 కోట్లకు పైగా బీసీ విద్యార్థుల సంఖ్య 36,845 ఫీజులకు అవసరం రూ. 60 కోట్లు బకాయిలు రూ. 10 కోట్లకు పైగా సాల్కర్షిప్పులకు అవసరం రూ. 14 కోట్లు ఇంకా రావాల్సిన నిధులు రూ. 150 కోట్లకు పైగా ఈబీసీ విద్యార్థుల సంఖ్య 21,710 ఫీజులకు అవసరం రూ. 50 కోట్లు బకాయిల మొత్తం రూ. 13.20 కోట్లకు పైగా మైనార్టీ విద్యార్థులు 16335 ఫీజులకు అవసరం రూ. 29.86 కోట్లు రావాల్సిన బకాయిలు రూ. 5.24 కోట్లు స్కాలర్షిప్పులకు అవసరం రూ. 74.12 లక్షలు రావాల్సిన బకాయిలు రూ. 14 లక్షలకు పైగా ఏటా ఇదే ఆలస్యం ఫీజు రీఎంబర్స్మెంట్ మంజూరులో ఏటా ఇదే తంతు. కోర్సు పూర్తయ్యే సరికి కనీసం 25 శాతం కూడా మంజూరు చేయడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కళాశాలల్లో సొంత జేబు నుంచి ఫీజు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. గత నాలుగేళ్లుగా ఇలానే జరుగుతోంది. – ఉపేంద్ర, బీకాం కంప్యూటర్స్, పోరుమామిళ్ల పేదల చదువుకోసమే జగనన్న హామీ వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల అభివృద్ధిలో భాగంగా ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ ను జగన్ అనుసరిస్తున్నారు. వైఎస్సార్ అడుగుజాడలలోనే వస్తున్నాడు. పేదల చదువుల కోసమే వైస్ జగన్ పాటుపడడం సంతోషంగా ఉంది. ఐ. శ్రావణి బీకామ్, రంగాపురం, ఖాజీపేట మండలం -
గృహ రుణం వదిలిస్తా
రేయనక..పగలనక..ఎండనక..వాననక..సర్వకాల సర్వావస్థల్లో..సరైన నీడ లేక అల్లాడుతున్న పేదలకు ఓ గూడు కావాలంటే ప్రస్తుత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఇల్లు మంజూరుకు ముందుగానే వారికి లంచాలు ముట్టజెప్పాలి. ఎలాగోలా అవస్థలు పడగా ఇల్లు మంజూరైతే నిర్మాణం సమయంలో బిల్లు కోసం మళ్లీ వాళ్ల కాళ్ల చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తీరా బిల్లు వచ్చిందంటే దాన్ని పొందడానికి కమీషన్ ముట్టజెప్పాలి. ఇన్ని కష్టనష్టాలకు ఓర్చి ఇంటి నిర్మాణం పూర్తిచేస్తే చివరి బిల్లు వస్తుందో రాదో? అది ఎవరి ఖాతాలోకి పోతుందో తెలియని అగమ్య గోచర పరిస్థితి ఇప్పటివరకు ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నిర్వహించిన సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో పేదలు పడుతున్న గూడుగోడును స్వయంగా పరిశీలించిన మేరకు పేదల సొంతింటి కల నెరవేర్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పి భరోసా కల్పించారు. వైఎస్సార్సీపీ భరోసా ఇది ఇప్పటి వరకు ఇల్లులేని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు మంజూరవుతుంది. దీనికి ఎటువంటి సిఫార్సులు అవసరం లేదు. పేదరికమే వారి ఆర్హతగా భావించి సొంతింటి కలను నెరవేరుస్తాం. ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 25 లక్షలు, జిల్లాలో రెండు లక్షలకు తక్కువ లేకుండా పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం. ఇల్లు మంజూరైన రోజునే ఆ ఇంటి గృహిణ పేరిట ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. ఇక ఇల్లు నిర్మాణానికి మంజూరు చేసే నగదును రూ.ఐదు లక్షల వరకు ప్రభుత్వం పెంచి నేరుగా అందజేస్తుంది. ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బు సరిపడకపోతే, బ్యాంకుతో ప్రభుత్వం మాట్లాడి, పావలా వడ్డీకి రుణం కల్పిస్తుంది. జన్మభూమి కమిటీల పెత్తనం సిఫార్సులు, కమీషన్లు, లంచాల ప్రహసనంతో సొంతిల్లు అనే మాటను పేదలు దాదాపు మర్చిపోయారు. ఇల్లు కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా, జన్మభూమి కమిటీలకు మొక్కలేక, ఆ విధానాలతో విసిగిపోయిన ప్రజలు చాలామంది ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవడమే మర్చిపోయారు. మరికొంతమంది జన్మభూమి సభలు, ఇతర సభలు, గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేసుకున్నా అవన్నీ బుట్టదాఖలయ్యాయే తప్ప, దరఖాస్తుదారులకు ఎటుంటి ప్రయోజనం చేకూరలేదు. సగం కూడా పూర్తి కాని నిర్మాణాలు టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పాలనలో మొదటి రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. చివరి మూడు సంవత్సరాల్లో ఇళ్లు మంజూరు చేసినా, వాటికి నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఇల్లు మంజూరయ్యేందుకు సిఫార్సుల కోసం పేదలకు సమస్యలు తప్పలేదు. నిజాయితీగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవు. అన్ని అవినీతి మయంగా మారాయి. 2016–17 నుంచి 2018–19వరకు జిల్లాలో 42,800 ఇళ్లు మంజూరు కాగా 26,450 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయగలిగారు. నాటి వైఎస్ స్వర్ణయుగంలో.. 2014వ సంవత్సరం ఎన్నికల్లో గెలుపొంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇందిరమ్మ పథకం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటి సర్వేలు చేయించి అధికారులతో అర్హులను గుర్తించి, ఇల్లు కావాలని అడిగిన ప్రతి ఒక్కరికి అక్కడికక్కడే పక్కా ఇల్లు మంజూరు చేశారు. ఎంటుంటి సిఫార్సులు లేకుండా పేదరికమే అర్హతగా పేదలను ఆదుకున్నారు. ఈ పథకం ద్వారా మూడు విడతల్లో జిల్లాలో 2, 24,000 ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో ఆయన హయాంలోనే 2,10, 000 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రూ.5 లక్షలకు పెంచడం హర్షణీయం పేదవాడి ఇల్లు నిర్మాణానికి మంజూరు చేసే నిధులు రూ.5 లక్షలకు పెంచడం హర్షణీయం. ఇప్పటివరకు టీడీపీ ప్రభుత్వం ఇల్లు నిర్మాణానికి రూ.1.50 లక్షలు మాత్రమే ఇచ్చింది. పేదలకు ఆ నిధులు సరిపడక, ఇల్లు పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అప్పులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హమీతో పేదల్లో సంతోషం వచ్చింది. –పేడాడ తేజేశ్వరరావు, వాకలవలస, శ్రీకాకుళం రూరల్ బ్యాంకు రుణం కూడా ప్రభుత్వం ఇప్పించడం మంచిదే ఇంటి రుణంలో ప్రభుత్వం సాయం చేస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ వల్ల పేదలకు రుణ సమస్య ఉండదు. రూ.5 లక్షలు చాలని పక్షంలో అప్పు కూడా దొరుకుతుంది. దీంతో జిల్లలో ప్రతి పేదవాడు సొంతింటి కలను నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. –బలివాడ స్వరూప్, బలివాడ, శ్రీకాకుళం మహిళ పేరిట రిజిస్ట్రేషన్ మంచి ఆలోచన ప్రభుత్వం మంజూరు చేసే ఇల్లు మహిళల పేరిట నేరుగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మహిళల జీవితాలకు భద్రత ఉంటుంది. వారికి భరోసా దొరుకుతుంది. సమాజంలో స్త్రీలపై చిన్నచూపు పోయి, వారిలో మనోధైర్యం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలకు మరింత మేలు జరుగుతుంది. –అల్లంశెట్టి శ్రీదేవి, శ్రీకాకుళం రూ.5 లక్షలతో మంచి ఇల్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కాలనీ ఇళ్లు కట్టుకునే లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. అ సొమ్ముతో ఇంటిల్లిపాదీ కష్టపడి మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇస్తున్న రూ.లక్షన్నర ఏమూలకూ సరిపోవడం లేదు. జగన్ సీఎం కావాలని ఎదురు చూస్తున్నాం. – ఎస్.చిరంజీవి, మురగడలోవ, ఎల్.ఎన్.పేట -
‘రైతు’కు జగన్ భరోసా..
మట్టి తల్లినే నమ్ముకున్నారు వారంతా. రేయింబవళ్లు ఆ తల్లి ఒడిలోనే కాలం గడుపుతారు. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని వారంతా కరాల సత్తువ..నరాల బిగువుతో స్వేదం చిందించి..ఆరుగాలం ఇంటిల్లిపాది కష్టపడి పంటలు సాగుచేస్తే..అతివృష్టి, లేకపోతే అనావృష్టి కారణంగా వారి శ్రమ మట్టిలో కలిసిపోతోంది. అన్నీ బాగుండి పంట చేతికొచ్చినా సరైన మద్దతు ధర లభించకపోవడంతో పెట్టుబడికి కూడా నోచుకోలేకపోతున్నారు. దీంతో రైతులు పంట పెట్టుబడి కోసం బ్యాంకుల్లోను, వ్యాపారుల దగ్గర తెచ్చే రుణాలకు వడ్డీలు పేరుకుపోయి తడిసిమోపెడవుతున్నాయి. ఎవరో వస్తారని..ఏదో చేస్తారని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అన్నదాతలు విసిగి వేశారిపోయారు. అంతలో అన్నదాత దీనస్థితిని ఆకళింపు చేసుకుని..రైతులకు భరోసా కల్పించాలని భావించి నేనున్నానంటూ ముందుకు వచ్చారు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతుకు భరోసా కల్పిస్తానని ధైర్యం చెబుతూ రైతు భరోసా పేరిట అన్నదాతలను ఎలా ఆదుకుంటామో తెలియజేస్తూ వారికి కొండంత మనోస్థైర్యాన్ని కల్పించారు. సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: రైతు దేశానికి వెన్నెముక. రైతు లేనిదే తినడానికి తిండి లేదు. జీవనం లేదు. ప్రజలందరికీ అన్నం పెట్టే రైతులు అర్ధాకలితో, ఆర్థిక ఇబ్బందులతో, రుణ భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందరి జీవితాలతో ముడిపడి ఉన్న రైతులు ఆధారపడిన వ్యవసాయ రంగం మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతో రైతులకు వ్యవసాయం చేయడం సమస్యగా మారింది. గతి లేక వ్యవసాయం చేస్తే, చివరిలో విపత్తు వస్తే, ఆ ఏడాది పంట తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ పరిస్థితి నుంచి రైతాంగాన్ని కాపాడాలని, వ్యవసాయాన్ని పునరుద్ధరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు రైతాంగానికి, వ్యయసాయ రంగానికి మేలు చేసేందుకు ముందుకువచ్చారు. తాను రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాల్లో ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ పేరిట రైతాంగాన్ని అదుకుంటామని ధైర్యం చెబుతున్నారు. ఈ హామీతో సగటు రైతుకు ఏడాదిలో కనీసం ఒక రూ.లక్ష వరకు ప్రయోజనం కలుగుతుంది. ఏటా రూ.12,500 ఆర్థిక సాయం, ఉచిత బోరు, ఉచిత విద్యుత్, రోడ్ ట్యాక్స్, సున్నా వడ్డీ వంటి సేవలతో రైతులకు ప్రతి ఏటా ప్రయోజనం చేకూరుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీతో ప్రతి రైతు ధైర్యంగా వ్యయసాయం చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి నెలకొంటుంది. గతంలో రైతులు పంటలకు భద్రత లేక, పెట్టుబడికి భరోసా లేక వ్యయసాయాన్ని విడిచి, ఇతర పనులు, ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. ఒక్కోసారి రాత్రింబవళ్లు తేడా లేకండా విద్యుత్ సరఫరా కోసం పొలంలో పడిగాపులు కాసిన సందర్భాలు కోకొల్లలు. పంటలు వేసే సమయంలో పెట్టుబడి లేక, అప్పు దొరక్క అవస్థలు పడిన పరిస్థితులు అధికం. తీరా బ్యాంకు నుంచి రుణం పొందినా, ప్రతిఏటా వడ్డీ కట్టలేని పరిస్థితి. రైతులకు ఎప్పటికప్పుడు అప్పు కావాలంటే దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రతిపక్షనేత, వైస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాల్లో భాగంగా రైతాంగాన్ని ఆదుకోవడం సంతోషమంటూ రైతులు సంబరపడుతున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా ఇలా.. ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు ఇస్తాం. ఆ మొత్తాన్ని మే నెలలో పెట్టుబడి కోసం రూ.12,500 చొప్పున నాలుగేళ్లు చెల్లిస్తాం. రెండవ సంవత్సరం నుంచి, రైతన్నకు వడ్డీలేని రుణాలు, రైతులకు ఉచిత బోర్లువేయిస్తాం. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలు యూనిట్‌కి రూ.1.50 తగ్గింపు రైతుల కోసం రూ.3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు,రైతులకు రూ.4000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయనిధి ఏర్పాటు ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, అవసరం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు మొదటి ఏడాది సహకార రంగం పునరుద్ధరణ రెండో ఏడాది సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటరుకు రూ.4 సబ్సిడీ వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు దురదృష్టవశాత్తు ఆత్మహత్యకు పాల్పడిన రైతుకు వైఎస్ఆర్ బీమా పేరిట ఆ బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం. అంతేకాకుండా ఆ డబ్బు అప్పుల వారికి చెందకుండా అసెంబ్లీ తీర్మానం తీసుకువస్తామని నవరత్నాలు పథకంలో పేర్కొన్నారు. వైఎస్ఆర్ బీమాతో ఆర్థిక ఆసరా మృతిచెందిన రైతు కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ బీమా పేరిట రూ.5 లక్షలు నగదు ఇస్తామని చెప్పడం చూస్తుంటే ఆ రైతు కుటుంబానికి ఆసరా లభించినట్లు కనిపిస్తోంది. ఇంతవరకు పేద రైతులు చనిపోతే, బాధిత కుటుంబం రోడ్డున పడుతోంది. ఇక నుంచి ఈ పథకంతో రైతుల కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఇది రైతు కుటుంబాలకు నిజంగా మంచి ఆసరా. –సాధు రామారావు, ఏవీ పేట, గార మండలం రైతుకు పెట్టుబడి ప్రకటన ఎంతో మేలు ప్రతి రైతుకు ఏటా రూ.12,500 ఇస్తామని, అది కూడా ఖరీఫ్ సీజన్‌కు ముందు వ్యవసాయానికి పెట్టుబడికి పనికి వచ్చేలా సకాలంలో అందజేస్తామని, ఇలా ఐదేళ్లలో ప్రతి రైతుకు రూ. 50 వేలు ఆర్థిక ప్రోత్సాహం సమకూరుస్తామని చెప్పాడం వల్ల రైతుకు చాలా మేలు జరుగుతుంది. దీని వల్ల రైతుకు వ్యవసాయంపై ఆసక్తి కలుగుతుంది. – గోండు రఘురాం, వైఎస్ఆర్సీపీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు వడ్డీలేని రుణంతో ప్రయోజం వడ్డీలేని రుణాలను మంజూరు చేయడం వల్ల రైతులు తీసుకున్న అప్పులో అసలు వేగంగా చెల్లించవచ్చు. వడ్డీ పెరిగే ప్రమాదం లేనందున ఏటా అప్పుతీసుకోవడం, సకాలంలో తీర్చుకోవడం కుదురుకుంది. –అనుపోజు నాగరాజు, శ్రీకాకుళం తీరనున్న సాగునీటి సమస్య సాగునీరు అందుబాటులోలేని, వర్షాభావంపై ఆధారపడి ఉన్న భూములలో ఉచితంగా లక్షలాది రూపాయల వ్యయంతో మెట్టు భుముల్లో బోర్లు వేయడం వల్ల పంటలు పండుతాయి. పల్లం, మెట్టు భూముల రైతులకు మేలు చేకూరుతుంది. మూడు పంటలు పండించే అవకాశం ఉంది. –యతిరాజుల ప్రసాదరావు, రైతు, శ్రీకాకుళం జిల్లాలో రైతుల పరిస్థితి....... ఏ జిల్లాలో ఉన్న రైతు కుటుంబాల సంఖ్య –6.70 లక్షలు ఏ రైతులు ప్రతి ఏటా తీసుకున్న రుణాల మొత్తం రూ. 1,400 కోట్లు ఏజిల్లాలో ఉన్న విద్యుత్ బోర్లు 11,000 ఏజిల్లాలో ఆక్వా ప్లాంట్లు 10,000 ఏజిల్లాలో సహకార సంస్థలు 48 (ఎన్జీవో–ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ 100) ఏ జిల్లాలో వ్యసాయ ట్రాక్టర్లు 7,000 -
భగీరథ సారథి..వైఎస్
సాక్షి, అమరావతి : ఒకనాడు అన్నపూర్ణగా భాసిల్లిన తెలుగు నేల దుర్భిక్షం బారిన పడటాన్ని చూసి చలించిపోయిన మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి... కరువనేది ఎరుగుని నేలగా మార్చడానికి జలయజ్ఞం చేపట్టారు. సముద్రం వైపు ఉరకలెత్తుతున్న గోదావరిని... పరుగులిడుతున్న కృష్ణవేణిని... కదలిపోతున్న వంశధారను తెలుగు నేలలకు మళ్లించి... సస్యశ్యామలం చేయడానికి అహోరాత్రులు శ్రమించారు. ఐదేళ్లలోనే రూ.53,205.29 కోట్ల వ్యయంతో 17 ప్రాజెక్టులు సంపూర్తిగా, మరో 24 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 18.48 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించారు. 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఉమ్మడి రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఇదో రికార్డు. కేవలం రూ.17,368 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామంటూ ప్రగల్భాలతో అధికారం చేపట్టి... ఐదేళ్లలో రూ.65,345.45 కోట్లు ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్కదానినీ గట్టెక్కించలేకపోయారు చంద్రబాబు. వైఎస్ హయాంలోనే పూర్తయినవాటికి గేట్లు ఎత్తుతూ, అదంతా తన ఘనతేనంటూ పూటకో నాటకం, రోజుకో రియాలిటీ షోతో రక్తికట్టించారు. ఉమ్మడి ఏపీ 1994 నుంచి 2004 మధ్య వరుస కరవులతో తల్లడిల్లింది. దేశానికి ధాన్యాగారంగా భాసిల్లిన తెలుగు నేల కరవు కాటకాలతో అలమటించింది. పదిమంది ఆకలి తీర్చే అన్నదాత.. సాగుపై ఆశలు కోల్పోయి, అప్పుల భారంతో బలవన్మరణాలకు పాల్పడ్డాడు. మహా ప్రస్థానం పాదయాత్రలో అడుగడుగునా ఎదురైన ఇలాంటి ఘట్టాలు వైఎస్‌ను కదలించాయి. అధికారంలోకి వస్తే గోదావరి, కృష్ణా జలాలను ప్రతి ఎకరాకు అందించి, కరవు రక్కసిని తరిమికొడతానని ఆ సందర్భంగా బాస చేశారు. 2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే... అనేక ప్రాజెక్టులకు కార్యరూపం ఇచ్చారు. 2004–05లో రాష్ట్ర బడ్జెట్ అంచనా వ్యయం రూ.51,142.92 కోట్లు. కానీ, రూ.1,33,730 కోట్ల వ్యయంతో ఒకేసారి 86 సాగునీటి ప్రాజెక్టుల పనులకు అనుమతిచ్చేశారు. కొత్తగా 97.69 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు 23.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రణాళిక రూపొందించారు. గేట్లెత్తి... గొప్పలు వైఎస్ హయాంలో పూర్తయిన తోటపల్లి, గాలేరు–నగరి, హంద్రీ–నీవా తదితర ప్రాజెక్టుల గేట్లు ఎత్తి జాతికి అంకితం చేసి వాటిని తానే చేసినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి ఐదేళ్లలో ప్రాజెక్టుల పేరుతో టీడీపీ ప్రభుత్వంలోని వారు దొరికినంత దోచుకున్నారు. ఇందులో సీఎం బినామీలు, కోటరీ కాంట్రాక్టర్లకు తప్ప రైతులకు ప్రయోజనం చేకూరలేదని మాజీ సీఎస్‌లు ఐవైఆర్, అజేయ కల్లం పలు సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. తాజాగా పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సైతం ప్రాజెక్టుల టెండర్లలో చంద్రబాబు సర్కారు అక్రమాలను ఎత్తిచూపి, అందుకు తాను బాధ్యత వహించలేనని హై పవర్ కమిటీ నుంచి తప్పుకోవడం గమనార్హం. బాబు కుయుక్తులను తట్టుకుని మహా నేత చేపట్టిన జలయజ్ఞంపై అప్పట్లో చంద్రబాబు కుయుక్తులకు దిగారు. సరిహద్దు రాష్ట్రాలను ఉసిగొల్పుతూ ప్రాజెక్టులను అడ్డుకునేలా న్యాయస్థానాల్లో కేసులు వేశారు. చివరకు సొంత నియోజకవర్గం కుప్పంలో పాలార్ నదిపై ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన జలాశయం పనులకు అడ్డుతగిలి, దానికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో కేసులు వేసేలా తమిళనాడు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారని నాడు టీడీపీ సీనియర్ నేతలే విమర్శించారు. చంద్రబాబు సైంధవుడిలా అడుగడుగునా అడ్డుతగిలినా వైఎస్ వెనుకడుగు వేయలేదు. అప్పుడు... ఇప్పుడు... వైఎస్ మరణం జలయజ్ఞానికి శాపంగా మారింది. 2009 నుంచి 2014 మధ్య రూ.44,851.71 కోట్లు ఖర్చు చేసి... మిగిలిన కొన్ని పనులే పూర్తి చేయగలిగారు. విభజన నేపథ్యంలో రూ.17,368 కోట్లతో అంతా అయిపోతుందని అధికారం చేపట్టిన తొలినాళ్లలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. కానీ, ఇప్పటికి రూ.65,435.45 కోట్లు ఖర్చు చేసినా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ లేదు. పారదర్శకంగా టెండర్లు... ప్రాజెక్టుల పనులకు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ విధానంలో గ్లోబల్ టెండర్లు ఆహ్వానించి వైఎస్ పారదర్శకత పాటించారు. దీంతో దేశ, విదేశాల నుంచి కాంట్రాక్టర్లు వచ్చారు. వారి మధ్య టెండర్లలో పోటీతో సగటున 15 శాతం తక్కువకే బిడ్లు దాఖలై ఖజానాకు రూ.పదివేల కోట్లపైగా ఆదా అయ్యాయని సాగునీటి ప్రాజెక్టుల సలహాదారు సీతాపతిరావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి సీవీఎస్కే శర్మ పలు వేదికలపై పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు పనులు శరవేగంగా పూర్తిచేసేలా వైఎస్ పరుగులు పెట్టించారు. బడ్జెట్ కేటాయింపుల కన్నా అధికంగా ఖర్చు చేశారు. వంశధార రెండో దశ ప్రాజెక్టుకు ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేస్తే, వెంటనే రీ డిజైన్ చేసి, ట్రిబ్యునల్‌ను ఒప్పించి మెప్పించారు. వైఎస్ చలవతోనే రైతులకు మేలు నాకు హంద్రీ–నీవా కాలువ కింద ఎకరం పొలం ఉంది. ఇందులో వేరుశనగ పంట వేశా. నీటికి కొరత లేకపోవడంతో పంట బాగా వచ్చింది. మళ్లీ ఇప్పుడు రెండో పంటగా జొన్న వేశా. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూడా రెండు పంటలకు నీటికి ఎలాంటి ఢోకా లేదు. ఇదంతా వైఎస్సార్ పుణ్యమే. ఆయన చలువతో ఎంతో మంది రైతులకు మేలు జరుగుతోంది. – చిన్నగొల్ల చిట్టిబాబు, పందికోన -
చంద్రబాబు జమానా... 108కు మాయ రోగం
సాక్షి, అమరావతి : ఆపదలో ప్రాణాలు నిలిపే 108... ఊహించని వ్యాధి బారినపడితే అండగా నిలిచే ఆరోగ్య శ్రీ... మారుమూల ప్రాంత వృద్ధులు, బాలింతలకు మందులిచ్చే 104 పథకాలు చంద్రబాబు హయాంలో తిరోగమనంలో ఉన్నాయి. పేదలను స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ఆరోగ్య ఇబ్బందుల నుంచి బయటపడేసే గొప్ప ఉద్దేశంలో మహా నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన పథకాలు... ఈ ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ అసమర్థతతో నీరుగారాయి. వైఎస్ పాలనలో విలువైన సేవలతో, పలు రాష్ట్రాల్లో అమలుకు ఆదర్శంగా నిలిచిన వాటికి... చంద్రబాబు జమానాలో నిధుల విడుదల జాప్యం, అమలులో రకరకాల ఆంక్షలతో పురిటి గడ్డపైనే నూకలు చెల్లుతున్నాయి. 2010 నుంచి పతనం ప్రారంభం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ఆరోగ్య శ్రీ పథకానికి మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో కష్టాలు దాపురించాయి. 2010 నాటికి 938 వ్యాధులు ఆరోగ్య శ్రీలో ఉన్నాయి. తర్వాతి ప్రభుత్వం వీటిలో 133 జబ్బులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయకూడదని, ప్రభుత్వాస్పత్రుల్లోనే చేయాలని నిబంధన విధించింది. ఒకవేళ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు లేకపోతే రోగులు ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు చెల్లించి వైద్యం చేయించుకోవాలి. మరోవైపు తొలినాళ్లలో పుట్టుకతోనే మూగ, చెవుడు చిన్నారులకు 12 ఏళ్ల వరకు వైద్యం చేయించుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత దీన్ని రెండేళ్ల వయసుకు పరిమితం చేశారు. దీంతో లక్షలమంది చిన్నారులు వైద్యానికి అనర్హులయ్యారు. ఇక 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే 1,600 మంది ఆరోగ్యమిత్రలను తొలగించింది. కాంక్లియర్ ఇంప్లాంట్స్ చేసే ఆస్పత్రులకు నెలకు ఒకటి మాత్రమే కొత్త కేసు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. అయితే, మన రాష్ట్రంలో ఇప్పటికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం సరిగా లేకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల్లో గాయపడినవారికి చికిత్స అందించేందుకు చాలా ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. అదేమంటే ప్యాకేజీ రేట్లు చాలడం లేదంటున్నాయి. న్యూరో, కాలేయ బాధితులకు వైద్యానికి చాలాచోట్ల ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. అన్నిటికి మించి వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోకుంటే వారిని ఆరోగ్య శ్రీ నుంచి టీడీపీ ప్రభుత్వం తొలగించింది. మంత్రి గారికేమో సింగపూర్ వైద్యం సామాన్యులు ఆరోగ్య శ్రీ కింద ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వెళ్లి వైద్యం చేయించుకోవడానికి అనుమతించని ప్రభుత్వం... మంత్రి విషయంలో మాత్రం ఎంతో ఔదార్యం ప్రదర్శించింది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకష్ణుడు సింగపూర్ వెళ్లి దంత చికిత్స చేయించుకోవడానికి ఏకంగా రూ.2,88,823 మంజూరు చేసింది. రూ.15 వేలు కూడా వ్యయం కాని రూట్ కెనాల్ చికిత్సకు ఇంత మొత్తం ఖర్చేమిటని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆరోగ్య శ్రీకి రూ.500 కోట్ల బకాయిలు రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందించే 650 పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆరు నెలలుగా ప్రభుత్వం రూ.500 కోట్లపైగా బకాయి పడింది. దీంతో తమవల్ల కాదంటూ ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వానికి చెప్పేశాయి. ఇప్పటికే కొన్ని కేసులను తిప్పి పంపుతున్నాయి. చిన్నచిన్న నర్సింగ్ హోంలు మాత్రం విధిలేని పరిస్థితుల్లో స్వీకరిస్తున్నాయి. ఈ జాప్యం కారణంగా చాలామంది మృత్యువుకు చేరువవుతున్నారు. ‘బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వం నిధులు లేవంటోంది. ఇక మేమేం చేయాలంటూ’ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. 2014 తర్వాత ఆరోగ్యశ్రీ - ఆరోగ్యశ్రీ భారంగా ఉందని నిధుల కేటాయింపు భారీగా తగ్గించారు. - కాంక్లియర్ ఇంప్లాంట్స్ చికిత్సకు నిబంధనలు విధించి సర్జరీలకు కోతపెట్టారు. - ఆరోగ్యశ్రీ చికిత్సల కంటే అదనంగా వ్యయమైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం వర్తించదని మెలిక పెట్టారు. - హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదని కొర్రీ విధించారు. - రోగులకు రవాణా చార్జీలు ఇవ్వడం లేదు - ఇన్‌పేషెంట్‌గా చేరకముందు అయ్యే వైద్య పరీక్షలకు సొంతంగా ఖర్చు పెట్టుకోమన్నారు. - తాజాగా... డైట్ కింద ఇచ్చే రూ.100కు కోత పెడుతూ అందరిలాగే సాధారణ డైట్ పెట్టాలని ఆదేశాలిచ్చారు. - డైట్‌తో మిగిలిన మొత్తం రోగుల ఖాతాలో వేస్తున్నామంటున్నా జమ కావడం లేదు. 104 వాహనాల సొమ్ము కార్పొరేట్ జేబుల్లోకి ఎక్కడైనా పదిమంది పేదలకు మేలు జరుగుతుంటే అక్కడి సర్కారు కూడా ముందుకొచ్చి మరింత ప్రోత్సాహం ఇస్తుంది. కానీ మన రాష్ట్రంలో ప్రభుత్వం 104 పథకం అమలులో కార్పొరేట్ కంపెనీకి లబ్ధి చేయడానికే మొగ్గుచూపింది. ఇలా కోట్లాది పేదలను గాలికొదిలేసి తమ జేబులు నింపుకోవడం ఏ రాష్ట్రంలోనూ ఉండదేమోనని అధికారుల్లో చర్చ జరుగుతోంది. పిరమల్‌కు అప్పగించి.. రాష్ట్రంలో 104 వాహనాల (చంద్రన్న సంచార చికిత్స) నిర్వహణను పిరమల్ స్వాస్థ్య సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ దేశంలో అత్యంత ప్రముఖుడికి చెందినది. దీంతో రాష్ట్రంలో పిరమల్‌కు అడ్డు చెప్పేవారు లేకపోయారు. ఈ సంస్థ 2016లో వక్ర మార్గంలో టెండరు దక్కించుకున్న నాటి నుంచి రూ.కోట్లు బిల్లులు చేసుకోవడమే గాని, పేదలకు నాలుగు రకాల మందులు పంచిన దాఖలాలు తక్కువ. వాహనాలు, మందులు సమకూరుస్తూ.. డీజిల్, సిబ్బంది జీతభత్యాలకు నెలకు వాహనానికి రూ.2.44 లక్షలు చెల్లిస్తున్న ప్రభుత్వం ఇందులో సంస్థ నుంచి రూ.లక్ష కూడా ఖర్చు చేయించలేకపోయింది. అప్పుడు రూ.1.04 లక్షలు ఇప్పుడు రూ.2.44 లక్షలు 2014కు ముందు 104 వాహనాల నిర్వహణ జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో సాగేది. టీడీపీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాలని నిర్ణయించి పిరమల్ స్వాస్థ్య సంస్థకు కట్టబెట్టారు. అప్పటివరకు ఒక్కో వాహనానికి నెలకు రూ.1.04 లక్షలు ఇచ్చేవారు. కానీ, పిరమల్ స్వాస్థ్య సంస్థకు వచ్చేసరికి దానిని రూ.2.44 లక్షలకు పెంచి మూడేళ్లలో రూ.240 కోట్ల పైగా చెల్లించారు. 104 వాహనాల్లో పరిస్థితిది - మొత్తం 292లో మెజారిటీ వాహనాలకు ఫిట్నెస్ లేదు. - ఇన్వర్టర్, బ్యాటరీలు లేవు. టైర్లు అరిగిపోయాయి. - నెలలో 15,432 గ్రామాలకు వెళ్లి మందులివ్వాల్సి ఉండగా ఇందులో సగం కూడా వెళ్లడం లేదు - ఏపీ09టీఏ2732 వాహనం 2010 ఏప్రిల్ 23న ప్రమాదానికి గురై షెడ్డులో ఉంది. ఐనా తిరుగుతున్నట్టు చూపి నెలకు రూ.2.44 లక్షలు తీసుకుంటున్నారు - 2018 ఆగస్ట్ నుంచి సిబ్బందికి రవాణా భత్యం, డిసెంబరు నుంచి దినసరి భత్యం చెల్లించడం లేదు - 60 రకాల మందులకు 27 కూడా లేవు గర్భిణులు, మధుమేహ రోగులకు రక్త పరీక్షలు చేసేందుకు కొన్ని నెలలుగా రసాయనాలు లేవు. - మధుమేహం, మూర్ఛ సంబంధిత జబ్బులకు ప్రధాన మందులు లేవు. - 60 శాతం వాహనాల్లో డాక్టర్లు లేరు. -
చంద్రబాబు ఏమంటారో చూడండి..!
ఎన్నికష్టాలు ఎదురైనా సత్య మార్గాన్ని వదలని రాజు సత్యహరిశ్చంద్రుడి గురించి విన్నాం.. అశోక చక్రవర్తి నుంచి గాంధీ మహాత్ముని వరకూ.. అంతా ‘సత్యమేవ జయతే’అన్నారు. అందుకే మనమంతా.. సత్యమే గెలుస్తుంది, ధర్మమే నిలుస్తుందని నమ్ముతాం.. సామాన్య ప్రజలమైన మనమే సత్యాన్ని ఇంతగా అనుసరిస్తుంటే.. ఇక ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి...ఇంకా ఎంతో సత్యనిష్ట కలిగి ఉంటారని భావిస్తాం కదా..! కాని, మన సీఎం చంద్రబాబు మాత్రం అందుకు మినహాయింపు!! ఆయనకు అసత్య నిష్ట ఎక్కువ... ప్రచారమే పరమావధిగా నమ్ముతారు.. తాను చేయని పనులను చేసినట్లు తన ఖాతాలో వేసుకుంటారు. చెప్పిందే చెబుతూ అబద్ధాన్ని నిజం చేయాలని నిత్యం గోబెల్స్ ప్రచారం చేస్తుంటారు.. హైదరాబాద్, సైబరాబాద్ నేనే నిర్మించా.. ఐటీ, రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు నేనే తెచ్చా..పోలవరం నేనే పూర్తిచేశా.. ప్రపంచంలో నదుల అనుసంధానం చేసింది నేనే.. రెయిన్ గన్లతో కరువన్నదే లేకుండా చేశా.. ఇంద్రుడి అమరావతిని తలదన్నే రాజధానిని నిర్మించింది నేనే అంటూ... కళ్లార్పకుండా కమిట్మెంట్తో కలియుగ అసత్యహరిశ్చంద్రుడు చెబుతున్న మాటల్లో వాస్తవమెంతో చూద్దామా..! రైతుల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేసేశా.. వాస్తవం: రైతుల రుణాలు రూ.87,612 కోట్లు. ఇప్పటివరకు ఇచ్చిన రూ.15,300 కోట్లు వడ్డీకి కూడా సరిపోవు. గతేడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక మేరకు రైతుల అప్పులు రూ.1,37,502.19 కోట్లకు పెరిగాయి. వాస్తవం ఇలా ఉంటే మరి రైతుల రుణాలను మాఫీ చేసిందెక్కడ? డ్వాక్రా రుణాలను మాఫీ చేసేశా.. వాస్తవం: బాబు అధికారంలోకి వచ్చే నాటికి డ్వాక్రా సంఘాల అప్పులు రూ.14,204 కోట్లు..డ్వాక్రా సంఘాల రుణ మాఫీకి ఎగనామం పెట్టారు. దాంతో గతేడాది సెప్టెంబర్ నాటికి డ్వ్రాక్రా సంఘాల అప్పులు రూ.25,424 కోట్లకు పెరిగాయి. కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసేశా.. వాస్తవం: కాపులను బీసీల్లో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు చంద్రబాబు. దానినే ఘనంగా చెప్పుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్రవర్ణాల పేదలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తుత్తి జీవో జారీ చేసింది. దీన్నే ప్రచారం చేసుకుంటూ కాపులను మోసగిస్తోంది. రాష్ట్రంలో క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తూ.. ఖాళీలన్నీ భర్తీచేస్తున్నాం.. వాస్తవం: రాష్ట్రంలో మొత్తం పోస్టులు 6,97,621 ఉండగా.. అందులో ఖాళీలు 1,42,825. ఈ నాలుగున్నరేళ్లలో పదవీ విరమణ చేసిన వారిని కలిపితే ఖాళీల సంఖ్య 2.40 లక్షల వరకు ఉంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మంజూరు అయిన ఉద్యోగాల సంఖ్య 4.83 లక్షలని... అందులో ఖాళీలు కేవలం 77,737 మాత్రమేనని పోస్టుల సంఖ్యను కుదించింది. ఆ పోస్టుల్లోనూ 20వేలు మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తామని.. తక్కిన వాటిని అవుట్సోర్సింగ్ విధానంలో నింపుతామని ప్రకటించి నిరుద్యోగుల ఆశలపై బాబు నీళ్లు చల్లారు. 2014 నుంచి ఇప్పటివరకూ 5వేల పోలీసు ఉద్యోగాలు పోగా.. ఏపీపీఎస్సీ ద్వారా నికరంగా భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 2300 మాత్రమే. మరి ఇది ఉద్యోగాలను భర్తీ చేసినట్లు అవుతుందాం?! దేశంలో తొలిసారిగా నదులను అనుసంధానం చేసి చరిత్ర సృష్టించా. గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేశా. వాస్తవం: పోలవరం కుడి కాలువను 145 కిలోమీటర్ల పొడువున లైనింగ్‌తో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పేరిట పది పంపులతో గోదావరి నీటిని పోలవరం కుడి కాలువలోకి ఎత్తిపోసి.. వాటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేశానని.. దేశంలో ఇదే ప్రథమమని చంద్రబాబు ప్రకటించుకున్నారు. కానీ..కృ ష్ణా–గోదావరి నదులను అనుసంధానం చేయలేదని కేంద్ర జలసంఘం అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. పోలవరం కుడి కాలువకు శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న అప్పటి సీఎం వైఎస్సార్ ఒక నదిపై ఆనకట్ట నిర్మించి.. నీటిని నిల్వ చేసి వాటిని కాలువ ద్వారా తరలించి.. మరో నదిపై నిర్మించిన ఆనకట్టలోకి తరలించినప్పుడే వాటిని నదుల అనుసంధానం చేసినట్లుగా భావిస్తామని కేంద్ర జలసంఘం ఛైర్మన్ మసూద్ హుస్సేన్ ప్రకటించారు. గోదావరిపై నీటి నిల్వ చేసే ఆనకట్ట పోలవరం ప్రాజెక్టు.. ఆ ప్రాజెక్టును పూర్తి చేసి.. కుడి కాలువ మీదుగా ప్రకాశం బ్యారేజీకి గ్రావిటీపై నీటిని తరలించి.. కష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేయడానికి దివంగత సీఎం వైఎస్ ప్రణాళిక రచించారు. 1863లో స్వాతంత్య్రం రాకముందు డచ్ దేశానికి చెందిన ఓ సంస్థ తుంగభద్ర, పెన్నా నదులను అనుసంధానం చేస్తూ.. కేసీ కెనాల్‌ను తవ్వింది. స్వాతంత్య్రం వచ్చాక తుంగభద్ర జలాశయం నుంచి తుంగభద్ర, పెన్నా, చిత్రావతి నదులను అనుసంధానం చేస్తూ.. హెచ్ఎల్సీ (ఎగువ కాలువ) తవ్వారు. ఇప్పుడు చెప్పండి.. చంద్రబాబు నదులను అనుసంధానం చేసి నిజంగా చరిత్ర సృష్టించారా? నేనే ప్రాజెక్టులు పూర్తిచేశా.. నేనే ఆయకట్టుకు నీళ్లిచ్చా.. వాస్తవం: 1995 నుంచి 2004 వరకూ సీఎంగా అధికారం వెలగబెట్టిన చంద్రబాబు..1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో, 1998 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల సమయంలోనూ, 1999 సాధారణ ఎన్నికల సమయంలోనూ సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం.. ఎన్నికలయ్యాక వాటిని వదిలేయడం రివాజుగా మార్చుకున్నారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకేసారి లక్షా మూడు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కోటి ఎకరాలకు నీళ్లందించడమే లక్ష్యంగా 83 ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టారు. ఐదేళ్లలో 41 ప్రాజెక్టులను దాదాపుగా పూర్తిచేశారు. అప్పట్లో మిగిలిపోయిన ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. జూలై 28, 2014న సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. రూ.17,368 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తిచేసి.. 35.04 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తానని ప్రకటించారు. జూన్ 8, 2014 నుంచి ఇప్పటివరకూ రూ.65,345.45 కోట్లు ఖర్చు చేసినా.. ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. అదనంగా కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకూ నీళ్లందించలేకపోయారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో దాదాపుగా పూర్తయిన తోటపల్లి, గాలేరు–నగరి, హంద్రీ–నీవా తదితర ప్రాజెక్టుల గేట్లు ఎత్తి.. వాటిని తానే పూర్తి చేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ను, సైబరాబాద్‌ను నేనే నిర్మించా.. హైదరాబాద్‌లో ఐటీని నేనే తెచ్చా. రింగ్‌రోడ్డును, ఎయిర్‌పోర్ట్‌ను నేనే నిర్మించా. ప్రపంచపటంలోహైదరాబాద్కు గుర్తింపు తెచ్చా. వాస్తవం: అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థలు 1991లో తమ డేటాను నిల్వ చేసుకోవడానికి, భూకంపాలు, తుఫాన్ల తాకిడి లేని.. సురక్షిత ప్రాంతాల కోసం అన్వేషించాయి. భూకంపాల తాకిడే లేని హైదరాబాద్ అత్యంత సురక్షిత ప్రాంతమన్న ప్రధాని పీవీ సూచనల మేరకు ఐటీ సంస్థలు నాటి సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డిని సంప్రదించాయి. దాంతో సైబర్ టవర్స్‌కు నేదురుమల్లి శంకుస్థాపన చేసి.. ఐటీ దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌కు వచ్చేలా చేశారు. ఆ తర్వాత ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు తరలిరావడంతో హెటెక్ సిటీ రూపుదిద్దుకుంది. దీన్ని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. అదేవిధంగా 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్ విమానాశ్రయం పనులను ప్రారంభించి కేవలం మూడేళ్లలో పూర్తిచేసి.. మార్చి 23, 2008న జాతికి అంకితం చేశారు. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల రింగ్ రోడ్డును 2005లో ప్రారంభించి.. 2008 నాటికి దాదాపుగా పూర్తిచేశారు. ఇప్పుడు చెప్పండి హైదరాబాద్ నిర్మించిందెవరు? సోనియా గాంధీతో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో వైఎస్ ఐటీ రంగానికి ఆద్యుడిని నేనే. ఐటీ రంగంలో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించా. వాస్తవం: ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003–04 నాటికి ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 85 వేలు మాత్రమే. నాటి ఐటీ ఎగుమతుల విలువ రూ.5,025 కోట్లే. మే 14, 2004న సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు స్వీకరించాక హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడప, వరంగల్ వంటి చిన్న పట్టణాలకు విస్తరించారు. కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతోపాటు మైక్రోసాఫ్ట్ మూడో దశ, విప్రో రెండో దశ పనులు అప్పట్లోనే మొదలయ్యాయి. యూఎస్ కాన్సులేట్‌ను ఏర్పాటయ్యేలా చేశారు. అప్పట్లోనే రాష్ట్రంలో 50వేల ఎకరాల్లో ఐటీఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ఏర్పాటుకు ఆమోదం లభించింది. వైఎస్ కషి వల్ల 2009 నాటికి ఐటీ రంగం ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 2.85 లక్షలకు చేరుకుంది. ఐటీ ఎగుమతులు 2004–05లో రూ.8,145 కోట్లకు, 2005–06లో రూ.12,521 కోట్లు, 2006–07లో రూ.18,582 కోట్లు, 2007–08లో రూ.26,122 కోట్లు, 2008–09లో రూ.32,509 కోట్లు, 2009–10లో రూ.33,482 కోట్లకు చేరుకోవడం గమనార్హం. గణాంకాలు ఇలా ఉంటే... మరి ఇందులో ఎవరి ఘనత ఎంతో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తున్న అప్పటి సీఎం నేదురుమల్లి (ఫైల్) పోలవరం ప్రాజెక్టు నా కల. ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తా. వాస్తవం: తెలుగు ప్రజల ఏడు దశాబ్దాల స్వప్నం పోలవరం. 2004 వరకూ ఆ స్వప్నాన్ని సాకారం చేయడానికి ఏ ముఖ్యమంత్రి సాహసించలేదు. మే 14, 2004న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమని దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అవసరమైన ‘సైట్ క్లియరెన్స్’ను సెప్టెంబరు 19, 2005న.. అటవీ పర్యావరణ అనుమతిని అక్టోబర్ 25, 2005న.. అభయారణ్యం అనుమతిని జూలై 6, 2007న.. సహాయ పునరావాస ప్యాకేజీకి ఏప్రిల్ 17, 2007న కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులను సాధించారు. రూ.10,151.04 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టారు. కుడి కాలువ పనులను 145 కిలోమీటర్ల పొడవున లైనింగ్‌తో సహా పూర్తి చేశారు. ఎడమ కాలువను 134 కిలోమీటర్ల పొడవున లైనింగ్‌తో సహా పూర్తి చేశారు. హెడ్ వర్క్స్(జలాశయం) పనులను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే..పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా సాధించడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. ఇందుకు అవసరమైన కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతిని ఫిబ్రవరి 25, 2009న సాధించారు. 2009 నాటికే రూ.5135.87 కోట్లు ఖర్చు చేసి 44.84 శాతం పనులు పూర్తి చేశారు. ఇది వాస్తవం. నిజంగా పోలవరం తన కలైతే 1995 నుంచి 2004 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు పనులు చేపట్టడానికి వీలుగా కనీసం పరిపాలన అనుమతి ఇవ్వడానికి చంద్రబాబుకు ఎందుకు చేతులు రాలేదు. పోలవరం ఎవరి కలో చెప్పడానికి పై సాక్ష్యాలే నిదర్శనం. అన్ని అనుమతులు సాధించి ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్న అప్పటి సీఎం వైఎస్సార్ సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుంటా.. అంతర్జాతీయ ప్రమాణాలతో తలదన్నే రాజధాని అమరావతిని నిర్మిస్తా. వాస్తవం: రాజధాని కోసం బహుళ పంటలు పండే 33వేల ఎకరాల భూమిని సమీకరించారు. ఇందులో 40 ఎకరాల్లో చదరపు అడుగుకు రూ.11వేల వంతున ఖర్చు చేసి.. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక శాసనసభ, శాసన మండలి భవనాలను నిర్మించారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు.. తాత్కాలిక సచివాలయం, శాసనసభ భవనాలు లీకేజీ కావడం వల్ల మడుగులను తలపించడం రివాజుగా మారింది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రూ.39,875 కోట్లతో శాశ్వత సచివాలయం, శాసనసభ, మండలి భవనాలతోపాటు రహదారుల పనులకు టెండర్లు పిలిచారు. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ, బీఎస్సార్ ఇన్ఫ్రా, ఎన్సీసీ కాంట్రాక్టు సంస్థలకు వాటిని సగటున 4.89 శాతం అధిక ధరలకు అప్పగించారు. ఆ నాలుగు సంస్థలకే ఈ పనులను హడావుడిగా అప్పగించేసి.. రూ.3,987.50కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సులుగా ఇచ్చేయడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. ఐదేళ్లు అధికారంలో కొనసాగి కూడా రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టలేదన్నది వాస్తవం. రాష్ట్రంలోకి రూ.19.61లక్షల కోట్లు పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించేలా 1761 ఒప్పందాలు చేసుకున్నా. వీటిద్వారా 32,55,263 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సులు నిర్వహించింది. పెట్టుబడులు తెస్తానంటూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే విదేశీ పర్యటనలకు వెళ్లారు. దేశంలోనూ విదేశాల్లోనూ చేసుకున్న ఒప్పందాల(ఎంవోయూ) ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోకి రూ.19.61లక్షల కోట్లు పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించేలా 1761 ఒప్పందాలు చేసుకున్నాం అన్నారు. కానీ.. 2014 నుంచి ఇప్పటివరకూ కేవలం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.9,553 కోట్లు మాత్రమేనని డీఐపీపీ(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పాలసీ అండ్ ప్రమోషన్) ప్రకటించడం వాస్తవం కాదా!! ఇదీ రాజధాని ప్రాంత పరిస్థితి –సాక్షి, అమరావతి -
సమగ్ర సోమశిల.. తీరిన రైతు కల
సాక్షి, సోమశిల (నెల్లూరు): మూడు దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన జిల్లా జల వరప్రదాయని సోమశిల ప్రాజెక్ట్‌కు సమగ్రతను తీసుకువచ్చారు. మునుపెన్నడూ లేని విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డి సోమశిల జలాశయంలో ప్రతిష్టాత్మకంగా 72 టీఎంసీలు నీరు నిల్వ చేశారు. గత ప్రభుత్వంలో ముంపు పరిహారంలో జాప్యం, అటవీ అనుమతి లభించక 38 టీఎంసీలకు నీటి నిల్వకు అధిగమించలేదు. 2004లో అధికారంలోకి రాగానే నిర్వాసితులతో వైఎస్సార్ అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పాత ప్రభుత్వాల కంటే రెట్టింపు నష్ట పరిహారం ఇవ్వడంతో పాటు భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ఇంటికో ఉద్యోగం సైతం ఆయన ప్రకటించారు. రూ.260 నుంచి సుమారు రూ.300 కోట్ల వరకు నిధులు కేటాయించటంతో నెల్లూరు జిల్లా ఎప్పిరాళ్ల, వైఎస్సార్ జిల్లా అట్లూరు, ఎగువరాచపల్లి, కొత్త, పాత మాధవరం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన వారు సంతోషంగా ప్రాజెక్టు అభివృద్ధికి సహకరించారు. జలాశయంలో 38 టీఎంసీల సామర్థ్యం నుంచి 51 టీఎంసీలకు పెంచారు. వైఎస్సార్ ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన బాధితులకు నష్టపరిహారం చెల్లింపులాంటి చర్యలు చేపట్టడంతో 2007 నాటికి సమగ్ర సోమశిల లక్ష్యం మేరకు 72 టీఎంసీల నీటిని సోమశిల ప్రాజెక్టు చరిత్రలో తొలి సారిగా నీటిని నిలిపారు. ప్రతిష్టాత్మకంగా 2008లో మొదటి సారిగా 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఇచ్చిన మాట మేరకు పలువురికి ఉద్యోగాలు ఇచ్చారు. అయితే అప్పట్లోనే ఆయన సోమశిల జలాలు మెట్ట ప్రాంతమైన కొండాపురం, వింజమూరు, కలిగిరి మండలాలతో పాటు రాళ్లపాడు ప్రాజెక్టర్ వరకు పారుదలయ్యేందుకు రూపొందించిన ఉత్తర కాలువ పొడిగింపు పనులతో పాటు కలువాయి, చేజర్ల, పొదలకూరు మండలాలకు సాగు–తాగు నీరు అందించేందుకు దక్షిణకాలువ నిర్మాణ పనులకు ప్రణాళికలు రూపొందించి, నిధులు కేటాయించినా ఆయన మరణాంతరం నత్త నడకన సాగుతున్నాయి. ప్రాజెక్ట్‌కు శ్రీకారం - 4 జూన్ 1975 తొలుత ప్రాజెక్ట్ అంచనా వ్యయం - రూ.553 కోట్లు ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం లక్ష్యం - 72 టీఎంసీలు 2004 నాటికి నిల్వ సామర్థ్యం - 38 టీఎంసీలు 2007 నాటికి నిల్వ సామర్థ్యం - 72 టీఎంసీలు (సమగ్ర సోమశిల) నాలుగు దశల్లో ఉత్తర కాలువ మూడు ప్రత్యేక ప్యాకేజీలు, నాలుగో చివరి దశ పనుల కోసం రూ.260 కోట్లు అప్పట్లో వైఎస్సార్ కేటాయించారు. మూడు ప్రత్యేక ప్యాకేజీల్లో భాగంగా ప్యాకేజీ–11 నిర్మాణం మేరకు 0 కి.మీ నుంచి 13 కి.మీ చిలకలమర్రి వరకు రూ.34.23 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ప్యాకేజీ–96లో 13 కి.మీ నుంచి 73.92 కి.మీ ఏఎస్‌పేట మండలం గుడిపాడు వరకు రూ.104.72 కోట్లు మంజూరు కాగా అందులో 80 శాతం మాత్రమే పనులయ్యాయి. మిగిలిన పనులు చేసేందుకు కాంట్రాక్టర్ చేతులెత్తేయటంతో నిలిచి పోయాయి. ప్యాకేజీ–32లో భాగంగా 73.92 కి.మీ నుంచి 100వ కి.మీ కొండాపురం మండలం ఉప్పుటేరు వరకు రూ.73 కోట్లతో జరగాల్సిన పనులు 66 శాతం మాత్రమే అయ్యాయి. ఈ రెండు ప్యాకేజీల్లో పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులపై దృష్టి సారించకపోవటం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది. సోమశిల దక్షిణ కాలువ ద్వారా నీరు కలువాయి,చేజర్ల మెట్ట మండలాలకు సరఫరా అయ్యేందుకు నిర్దేశించిన దక్షిణ కాలువ పనులు ప్యాకేజీ 95 కింద రూ.28.81 కోట్ల మంజూరు కాగా పనులు నత్తనడకన జరుగుతున్నాయి. కాలువ లైనింగ్ పనులు నాసిరకంగా చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ కాలువ కింద నిర్దేశించిన 41 వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించగా కాలువ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే 61.53 వేల ఎకరాలు ఆయకట్టు అభివృద్ధిలోకి రానుంది. మెట్ట ప్రాంతాల దాహార్తికి హైలెవల్ కాలువ జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాల్లో మర్రిపాడు, దుత్తలూరు, వింజమూరు మండలాల్లోని మెట్ట ప్రాంత ప్రజానీకానికి తాగు, సాగునీరు అందించేందుకు ఐదు టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రణాళికలు రూపొందించారు. అప్పటి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వైఎస్సార్‌ను కలిసి మెట్ట ప్రాంత మండలాలకు సాగునీరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు జలాశయం నుంచి ఈ మూడు మండలాలతో పాటు అనంతసాగరం మండలంలోని ఉత్తర కాలువ సాగునీరు అందని ఎగువ ప్రాంతాలైన బొమ్మవరం, అగ్రహారం, చాపురాళ్లపల్లి గ్రామాల్లోని సాగునీరు సరఫరా చేసేందుకు రూపొందించిన ఈ హైలెవల్ కెనాల్ పనులకు రూ. 880 కోట్ల నిధులు మంజూరు చేశారు. రెండు దశల్లో చేయాల్సి ఉండగా నత్తనడకన సాగుతూ ఇప్పటికీ తొలి దశ నిర్మాణం పూర్తి కాకుండానే రెండో ఫేజ్ పనుల కోసం టెండర్లు పిలవడం చంద్రబాబు కమీషన్ల కోసమేనని స్థానికులు విమర్శిస్తున్నారు. నష్టపరిహారం ఆయన చలవే సోమశిల ప్రాజెక్ట్ కోసం వైఎస్సార్ జిల్లాలోని మాధవరం మండలంలో ఇళ్లు, భూములు కోల్పోయాం. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అరకొరగా నష్టరిహారం ఇవ్వడంతో కోర్టుకు వెళ్లాం. వైఎస్సార్ మాతో ప్రత్యేకంగా సమావేశమై నష్ట పరిహారం విషయంలో పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు చెల్లించారు. ఆయన చొరవతోనే మాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ఆత్మకూరులో స్థిర పడ్డాం. కొందరికి ఉద్యోగాలు ఇచ్చారు. – కొప్పోలు చిన్నపు రెడ్డి, రైతు, ఆత్మకూరు, వైఎస్సార్ జిల్లా మాధవరం మండలం నీటి కోసం ఎదురు చూపులు సోమశిల ప్రాజెక్టు నీరు ఉత్తర కాలువ ద్వారా సాగి మా గ్రామంలోని చెరువుకు వస్తాయని అప్పట్లో వైఎస్సార్ హయాంలో చెప్పారు. ఆ ప్రకారం కాలువ పనులు జరిగాయి. అయితే నాలుగు ఏళ్లుగా ఉత్తర కాలువ పొడిగింపు పనులు హసనాపురం వద్ద నిలిపి వేయటంతో మా గ్రామ చెరువుకు నీరు సరఫరా కాని పరిస్థితి నెలకొంది. తీవ్ర కరువు తాండవిస్తుంది. కాలువ పనులు పూర్తి చేసి చెరువుకు సాగు నీరు ఇవ్వాలి. – చెంచులరెడ్డి, శ్రీ కొలను, ఏఎస్ పేట మండలం -
అదును దొరికితే బాదుడే...
విజయనగరం అర్బన్: ప్రజల కష్ట,సుఖాలనెరిగి పరిపాలన చేసేవారిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. అలాంటి నాయక వారసత్వాన్నే కోరుకోవడం సహజం. దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన పాలనను కూడా మరలా ప్రజలు కోరుకుంటున్నారు. తన హయాంలో పేదల సంక్షేమానికి పెద్దపీట చేశారు. తన ఐదేళ్ల పదవీకాలంటే ఆర్టీసీ వ్యవస్థను పరిరక్షిస్తూ ఏనాడూ బస్సు చార్జీలు పెంచకపోడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మహానేత మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు ఎడాపెడా చార్జీలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు. దీంతో బస్సు ఎక్కాలంటే పేదోడు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి తొమ్మిదేళ్ల పాలనలో ఇలాగే విద్యుత్, బస్సు చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు. రవాణా సౌకర్యం.. పేద, ధనిక అనే తేడాలేకుండా ప్రభుత్వం అందరికీ రవాణా సౌకర్యం కల్పించాలి. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మినహా మిగతా ముఖ్యమంత్రులెవ్వరూ దీనిని అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్లపాలనా కాలంలో ఇష్టానుసారంగా బస్సుచార్జీలు పెంచి ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అదే టీడీపీ తాజాగా గడచిన ఐదేళ్లలో బసు చార్జీలు పెంచకపోయినా.. ఖరీదైన లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, సూపర్‌లగ్జరీ, గరుడా వంటి సర్వీసులను ప్రవేశపెట్టింది. అలాగే నష్టం వస్తుందనే సాకుతో చాలా గ్రామాలకు పల్లె వెలుగు సర్వీసులను రద్దు చేశారు. కొన్ని చోట్ల ఆర్డినరీ బస్సులన్నా ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేయడం విశేషం. పైగా సంస్థ నష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ఆర్థిక సాయం చేయలేదు. కానీ వైఎస్సార్ తన హయాంలో ఏడాదికి రూ. 300 కోట్ల ఆర్థిక సాయం చేయడంతో పాటు కార్మికులు కోరిన వేతన ఒప్పందం అందజేశారు. నాలుగేళ్లలో నాలుగుసార్లు.. నష్టాల్లో ఉన్న రోడ్డు రవాణా సంస్థను ఆదుకునేందుకు అనేక మార్గాలు ఉన్నా పట్టించుకోకుండా చార్జీలు పెంచడమే లక్ష్యంగా రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు పనిచేశాయి. ఆ తర్వాత వచ్చిన టీడీపీ ఖరీదైన లగ్జరీ సర్వీసులను ప్రవేశ పెట్టి సామాన్యులకు ఆర్టీసీ ప్రయాణం భారంగా మార్చారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని నెక్ రీజయన్లో 920 బస్సులకు పైగా ఉన్నాయి. ఇవి రోజుకు మూడు లక్షలకు పైగా కిలోమీటర్లు తిరుగుతున్నాయి. 2010 జనవరి 6న రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చార్జీల పెంచి రూ. 30 కోట్ల భారం మోపారు. ఆ తర్వాత 2011 జూలై 16న కిరణ్‌కుమార్ రెడ్డి సర్కారు పెంచిన చార్జీలతో ఏటా రూ. 26 కోట్ల భారం పడగా.. 2012 సెప్టెంబర్ 24న పెంచిన చార్జీలతో ఏటా రూ. 35 కోట్లు.. 2013 నవంబర్ 6వ తేదీన చార్జీలు పెంచడంతో రూ. 35.50 కోట్ల మేరకు భారం పడింది. దీంతో చార్జీల భారం సుమారు రూ.130 కోట్లకు చేరింది. టీడీపీ హయాంలో అభివృద్ధి సెస్ పేరుతో టిక్కెట్‌కి రూపాయలు వసూలు చేయడంతో ప్రయాణికులపై రూ. 3.50 కోట్ల భారం పడింది. టోల్‌ప్లాజా చార్జీని ఆర్డినరీ మినహా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ.3 నుంచి ఐదు రూపాయలకు... ఇంద్ర, వెన్నెల, గరుడా, వెన్నెలా ప్లస్, తదితర సర్వీసుల టోల్ ప్లాజా చార్జీని మూడు రూపాయల నుంచి రూ.6కు పెంచారు. పల్లె వెలుగు కనీసం చార్జీ రూ. 3 నుంచి ఐదు రూపాయలకు పెంచి గ్రామీణ ప్రాంత ప్రయాణికుల నడ్డి విరిచారు. రాజన్న రాజ్యం రావాలంటే ఆయన ఆశయ సాధనకు కృషి చేసే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. -
రాజకీయాల్లో హుషారు..తిరువూరు
సాక్షి, తిరువూరు : జిల్లాకు వాయువ్యంలో కొలువై ఉంది తిరువూరు నియోజకవర్గం. నాలుగు మండలాలు, 71 పంచాయతీలతో ఉన్న ఈ ప్రాంతం పశ్చిమ కృష్ణాలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల చెంతన ఉంది.నియోజకవర్గానికి మూడువైపులా తెలంగాణలోని ఖమ్మం జిల్లా పెనుబల్లి, వేంసూరు, మధిర, కల్లూరు మండలాలున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి పారే కట్లేరు, పడమటివాగు, తమ్మిలేరు, గుర్రపువాగు, వెదుళ్ళవాగులు ఈ నియోజకవర్గంలో ప్రవహించి మున్నేరులో కలుస్తున్నాయి. నియోజకవర్గంలో 360 సాగునీటి చెరువులు ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచక నిరుపయోగంగా ఉన్నాయి. కృష్ణాజిల్లా కంటే తెలంగాణా ప్రాంతంతోనే ఈ నియోజకవర్గ వాసులకు ఎక్కువ అనుబంధం ఉంది. తిరువూరు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. మైలవరం, తిరువూరు నియోజకవర్గాలు అప్పట్లో కలిసి ఉండగా, 1955లో పునర్విభజన చేశారు. 1967లో ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు చేశారు. ఇదీ నియోజకవర్గ చరిత్ర 2014లో తిరువూరు నియోజకవర్గాన్ని మూడోసారి పునర్విభజన చేశారు. ప్రస్తుతం చాట్రాయి మండలాన్ని నూజివీడు నియోజకవర్గంలో చేర్చగా, మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఏకొండూరు మండలాన్ని పూర్తిగా తిరువూరులో విలీనం చేశారు. తిరువూరులో రెండుసార్లు గెలిచిన కోనేరు రంగారావు కంకిపాడులో ఒకసారి గెలిచారు. గెలిచిన మూడుసార్లు ఆయన మంత్రివర్గంలో పదవి పొందటం ఆయన ప్రత్యేకత. కోట్ల క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా నిర్వహించారు.ఇక స్వామిదాస్, కోట రామయ్య, పేట బాపయ్య రెండు సార్లు గెలుపొందారు. విజయవాడ లోక్ సభ పరిధిలో తిరువూరు కొనసాగుతోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటర్లు పట్టం కట్టారు. తండ్రీ కొడుకుల పోటీ! 1952లో తండ్రి–కొడుకులు పరస్పరం పోటీపడగా కొడుకు పేట రామారావు విజయం సాధించారు. తిరిగి 1955లో తండ్రి పేట బాపయ్య కుమారుడిని ఓడించారు. కుమారుడు సీపీఐ పక్షాన, తండ్రి కాంగ్రెస్ తరుపున బరిలో దిగారు. పాడి పరిశ్రమతో ఉపాధి మెట్ట ప్రాంతమైన తిరువూరుతో పాటు పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో పాడిపరిశ్రమాభివృద్ధికి లక్ష్మీపురం పాలశీతల కేంద్రం విశేష కృషి చేస్తోంది. కృష్ణా మిల్క్ యూనియన్ సహకారంతో రైతులకు పాడిపశువుల సంరక్షణలో శిక్షణ ఇవ్వడం, పాలు మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ బోనస్ కూడా చెల్లిస్తున్నారు. దీంతో 50 గ్రామాల్లో పలు కుటుంబాలు పాడి పరిశ్రమనే జీవనాధారం చేసుకుని ముందుకు సాగుతున్నాయి. విద్యారంగంలో వెనుకబాటు ఉన్నత విద్యాభివృద్ధికి గతంలో గెలిచిన ప్రజాప్రతినిధులు పలు ప్రణాళికలు వేసినప్పటికీ అమలుకు నోచలేదు. ప్రైవేటు రంగంలో తిరువూరులో ఇంజనీరింగ్ కళాశాల, విస్సన్నపేటలో పీజీ కళాశాల మినహా ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు కాలేదు. తిరువూరులో మహిళా తదితర కళాశాల కోసం డిమాండ్ చేస్తున్నారు. సెంటిమెంటు తిరగబడింది! తిరువూరు నియోజకవర్గం ఏర్పడిన నాటినుంచీ ఎప్పుడూ అధికారపక్షం అభ్యర్థి గెలుపొందడమే సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజకీయ పండితుల విశ్వాసం. 2014లో ఈ సెంటిమెంటు కాస్త తిరగబడింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి రక్షణనిధి ఇక్కడ గెలుపొందినా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ హయాంలోనే అభివృద్ది పలువురు ప్రముఖులు తిరువూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలోనే ఈ నియోజకవర్గంలో పలు శాశ్వత ప్రాజెక్టులకు బీజం పడింది. సాగు, తాగునీటి వెతలు తీర్చడానికి ఎత్తిపోతల పథకాలను వైఎస్ ప్రారంభించారు. నాగార్జునసాగర్ నీటిపై ఆధారపడిన నూతిపాడు, మాధవరం, తెల్లదేవరపల్లి, ఎత్తిపోతల పథకాలు రాష్ట్ర విభజన తర్వాత నిరుపయోగంగా మారాయి. మొత్తం జనాభా : 2,58,000 మొత్తం పోలింగ్ కేంద్రాలు : 234 మొత్తం ఓటర్లు : 2,05,000 పురుషులు: 99,802 స్త్రీలు : 1,05,191 ఇతరులు : 7 అత్యధిక మెజారిటీ : కోనేరు రంగారావు : 17,300 (2004) -
ఎన్టీఆర్ వైద్యసేవన్నారు.. వైద్యం చేసే దిక్కు లేదు..
సాక్షి, గుంటూరు : ఏ మారుమూల పేదోడి గొంతులో కాస్తంత దగ్గు వినబడినా వైఎస్ చలించిపోయారు. ఏ వీధిన బడుగుల గుండెకు బాధ కలిగినా నేనున్నానంటూ ధైర్యమిచ్చారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంటా వైద్యుడిలా మారారు. అందుకే ఆయన చిరకాలం పేదల గుండెల్లో నిలిచిపోయారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా ఆరోగ్యశ్రీ పేరు మార్చి.. పథకాన్ని నీరు గార్చింది. కనీసం కాలు ఆపరేషన్లకు కూడా ఉచిత వైద్యాన్ని అందించలేక అభాగ్యులకు ఆవేదనలు మిగిల్చింది. జిల్లాలో ఎనిమిది నెలలపాటు ఎన్టీఆర్ వైద్యసేవ బిల్లులు ఆపేసి.. పథకం సేవలకు మంగళం పాడింది. ఈ నేపథ్యంలో ప్రజా సంకల్పయాత్రికుడై ప్రతి గుండె వేదనను వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలకించారు. రూ.1000 దాటిన ఎలాంటి వైద్యానికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని ప్రకటించారు. జగన్ ప్రకటనపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చారు. దీని ద్వారా 938 జబ్బులకు వైద్యం అందిస్తామని చెప్పినప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రిలో 130 వ్యాధులకు మించి అమలు లేదు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఆపరేషన్లు, వైద్య సేవలు అందించినందుకు ప్రైవేటు ఆస్పత్రులకు ఎనిమిది నెలలకుపైగా ప్రభుత్వం నిధులు చెల్లించలేదు. దీంతో పలు మార్లు లిఖిత పూర్వకంగా ఆస్పత్రుల నిర్వాహకులు ప్రభుత్వానికి హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదు. దీంతో 2019 జనవరిలో ఐదు రోజులపాటు వైద్య సేవలు నిలిపేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు. నిధులు విడుదల చేస్తామంటూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ ఆస్పత్రుల నిర్వాహకుల అకౌంట్లోకి జమ కాలేదు. మరో దఫా సమ్మె చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకం ప్రకటించారు. దీంతో ప్రజల్లో కోటి ఆశలు రేకెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఇవీ జగన్ వరాలు ∙వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు ∙ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచితం ∙ఎక్కడ చికిత్స చేయించుకున్నా (హైదరాబాద్, బెంగళూరు, చెన్నై) ఆరోగ్యశ్రీ వర్తింపు ∙అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి.. ∙వైద్యం తర్వాత ఆ కుటుంబం బతకడానికి ఆర్థికసాయం ∙కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛన్ అందజేత బతకాలని ఉంది నా పేరు నక్కా ఏడుకొండలు. బాపట్ల మండలంలోని ఉప్పరపాలెం ఆరో మైలు స్వగ్రామం. నాకు భార్య, ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తెకు వివాహం చేశాను. లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రెండు సంవత్సరాల క్రితం ప్రతి రోజూ అయాసం, దగ్గు వస్తుండటంతో వైద్యశాలకు వెళ్లాను. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిందని చెప్పారు. నేను లారీ తోలితేనే కుటుంబం గడిచేది. ఓ వైపు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ లారీకు వెళ్లేవాడిని. ఏడు నెలల క్రితం తట్టుకోలేనంత దగ్గు, ఆయాసం రావడంతో ప్రైవేటు వైద్యశాల్లో చూపించా. రూ.70 వేలు ఖర్చయింది. అయినప్పటీ తగ్గలేదు. ప్రస్తుతం ఊపిరితిత్తులకు ఆపరేషన్ చేయాలంటున్నారు. దీనికి రూ.1.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. గుంటూరులోని పెద్ద ఆస్పత్రులకు వెళితే ‘ఉచితంగా చేయబోమన్నారు. చేసేదేమీలేక బాపట్ల ఏరియా వైద్యశాలలో టీబీ మందులు తీసుకొని మింగుతున్నా. 20 రోజుల క్రితం రాత్రి విపరీతమైన దగ్గు, ఆయాసం వచ్చి ఊపిరి కూడా తీసుకోలేకపోయాను. నా శరీరం చచ్చుపడుతుంటే.. నా కుటుంబ పరిస్థితి గుర్తొచ్చి ఊపిరి ఆగిపోయినంత పనయ్యేది. దేవుడా.. నా పిల్లల కోసమైనా నన్ను బతికించు అని ఎన్నోసార్లు వెక్కివెక్కి ఏడ్చాను. కొడుకు పెళ్లి చేయలేదు. కనీసం ఆ శుభకార్యం చేసేంత వరకైనా బతకాలని ఉంది. – బాపట్ల టౌన్ కుటుంబానికి జీవం పోశారు మాది కాకుమాను గ్రామం. నా పేరు షేక్ అక్బర్. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. రెక్కాడితేగానీ డొక్క నిండని బతుకులు మావి. పూరిగుడిసెలో జీవిస్తూ, నేనూ నా భార్య నిత్యం కూలి పనులకు వెళతాం. మేము పడే కష్టాలు మా పిల్లలు పడకూడదనుకున్నాం. నా ఇద్దరు పిల్లల్ని ఉన్నతంగా చదివించాలనుకున్నాం. ఇంతలో నా ఆరోగ్యం పూర్తిగా పాడయ్యింది. ఒక రోజు వంట్లో బాగోలేదని చెప్పడంతో నా భార్య కరీమూన్ నన్ను ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అక్కడ పరీక్షలన్నీ చేసి నాకు కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు. మానసికంగా పూర్తిగా కుంగిపోయాను. పనులకు కూడా వెళ్లలేని దైన్యస్థితికి చేరాను. కుటుంబం గడవటం కష్టంగా మారింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో పిల్లలు చదువు మాన్పించి వారిని కూడా కూలి పనులకు తీసుకెళ్లింది వాళ్ల అమ్మ. కొడుకు సిమెంటు పనులకు వెళితే.. కూతురు మాత్రం తల్లితోపాటే వ్యవసాయ కూలి పనులు చేస్తోంది. కానీ నేనైతే బతికానంటే అది కచ్చితంగా వైఎస్ఆర్ దయే అనే చెబుతాను. నాకున్న పరిస్థితికి, అనారోగ్య సమస్యకు పెద్దాసుపత్రి మెట్లు ఎక్కే ధైర్యం కూడా లేదు. కానీ ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2013లో కిడ్నీల ఆపరేషన్ చేశారు. మళ్లీ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. –కాకుమాను ఆ మహానుభావుడి దయతోనే తిరగగలుగుతున్నా నాపేరు షేక్ హుస్సేన్ సాహెబ్. స్వగ్రామం తాళ్లచెరువు. వృతి టైలరింగ్. 2008లో నాకు గుండెపోటు వచ్చింది. ఆపరేషన్ చేయాలంటే చాలా ఖర్చవుతుందని చెప్పారు. అంత డబ్బులేదు. అందరూ బతకవన్నారు. నేను కూడా బతుకుపై ఆశలు వదులుకున్నా. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి మా వాళ్లు చెప్పారు. వెంటనే గుంటూరులో లలితా సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు వెళ్లా. ‘గుండె ఆపరేషన్ చేయాలి... ఆలస్యం చేయవద్దు వెంటనే ఆస్పత్రిలో చేరాల’న్నారు. డబ్బులు లేవని చెప్పా.. ‘డబ్బులేమీ అవసరం లేదు, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేస్తామ’ని చెప్పారు. ఆపరేషన్ చేసి ఇప్పటికి 11 సంవత్సరాలైంది. ఆ మహానేత దయవల్ల నా భార్య, ముగ్గురు పిల్లలను పోషించుకోగలుగుతున్నా. మళ్లీ ఆయన కొడుకు జగన్ అలాంటి వైద్యం అందిస్తానని హామీ ఇవ్వడం సంతోషకరం. – అచ్చంపేట వైద్యానికి భరోసా ఇచ్చేవారు కావాలి ఖరీదైన వైద్యం చేయించుకునే పరిస్థితులు లేక ఎందరో తనువు చాలిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల మెట్లు ఎక్కేందుకు కూడా సాహసించడం లేదు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆరోగ్యశ్రీ పథకం.. వైఎస్ మరణానంతరం సక్రమంగా అమలు కావడం లేదు. మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే పేదోడి వైద్యానికి భరోసా లభిస్తుంది. – మోపర్తి శ్రీను, తిక్కిరెడ్డిపాలెం, ప్రత్తిపాడు మండలం వైద్యం అందక కుమార్తె మృతి చెందింది నా పేరు, కలిశెట్టి శేఖర్. నరసరావుపేట మండలంలోని అగ్రహారం స్వగ్రామం. నా కుమార్తె అక్కమ్మ నాలుగేళ్ల క్రితం యాసిడ్ తాగింది పేగులు కాలిపోయాయి. వైద్యశాలలో చేర్చగా శస్త్ర చికిత్స చేయాలన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలో ఆ ఆపరేషన్ లేదంట. సీఎం సహాయ నిధి కోసం స్పీకర్ కోడెలను ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆరు నెలల క్రితం తన తొమ్మిదేళ్ల బాలిక ప్రవల్లికను అనాథను చేసి వెళ్లిపోయింది. తెలుగుదేశం హయాంలో కొందరికి మాత్రమే పథకాలు అందాయి. వైఎస్ఆర్ మాదిరిగానే ఆరోగ్యశ్రీని అమలు చేయాలి. – నరసరావుపేట టౌన్ -
చైతన్య గీతిక..అనంతపురం
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు నిలయం. విద్యార్థి ఉద్యమాలకు పెట్టింది పేరు. ఎందరో ఉద్దండులను రాష్ట్రానికి అందించిన నేల. దాతృత్వంలోనైనా.. అన్యాయాన్ని ఎదిరించడంలోనైనా ఇక్కడి ప్రజలు ముందుంటారు. అందుకే ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం అనంతం. ఇప్పటిదాకా రెండు ఉప ఎన్నికలతో పాటు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ అత్యధికంగా 9 సార్లు విజేతగా నిలిచింది. సాక్షి, అనంతపురం : అనంతపురం నియోజకవర్గం 1952లో ఏర్పడింది. గతంలో అనంతపురం పట్టణంతోపాటు రూరల్ మండలం, బుక్కరాయసముద్రం, రాప్తాడు మండలాల్లో కొంత భాగం ఉండేది. 2009లో నియోజక వర్గాల పునర్విభజన జరిగిన తరువాత అనంతపురం పట్టణంతో పాటు రూరల్ మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీ పరిధిలో సగభాగం, రుద్రంపేట, రాజీవ్‌కాలనీ, రూరల్ పంచాయతీలు మాత్రమే ఈ నియోజక వర్గంలోకి వచ్చాయి. బుక్కరాయసముద్రం శింగనమల నియోజవర్గంలోకి వెళ్లగా, రాప్తాడు నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గంలోకి అనంతపురం రూరల్ మండలంలో 80 శాతం విలీనం చేశారు.అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 4.50 లక్షల జనాభా ఉంది. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 2,22,652 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,10,503 మంది, మహిళలు 1,12,109 మంది ఉన్నారు. థర్డ్ జండర్ 40 ఓట్లు ఉన్నాయి. అనంతపురం నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలంలోని ఎ.నారాయణపురం, రాజీవ్‌కాలనీ, రుద్రంపేట, అనంతపురం రూరల్ పంచాయతీలు వస్తాయి. ఈ పంచాయతీల్లో 33వేలు ఓట్లు ఉన్నాయి. తక్కిన 1,89,319 ఓట్లు నగర పరిధిలో ఉన్నాయి. మొత్తం 256 బూత్‌లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా హోదా పెరిగిన తరువాత రెండుసార్లు మేయర్ ఎన్నికలు జరిగాయి. అనంతపురం నగర మొదటి మేయర్‌గా కాంగ్రెస్ పార్టీ తరపున రాగే పరశురాం 2009 నుంచి 2014 దాకా పనిచేశారు. రెండో మేయర్‌గా టీడీపీకి చెందిన స్వరూప ప్రస్తుతం కొనసాగుతున్నారు. జిల్లాలో ఉన్న మిగతా 13 నియోజకవర్గాలతో పోల్చితే అనంతపురం నియోజక వర్గంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన దాదాపు అన్ని సామాజిక వర్గాలు ఇక్కడ స్థిరపడ్డాయి. ఏటా ఇక్కడికి వలసలు వచ్చి ఓటర్లుగా నమోదవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, శ్రామికుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఓట్లు పరిశీలిస్తే బలిజలు, ముస్లింలు, ఆర్యవైశ్యులు ప్రాధాన్యతగా ఉంటాయి. వైఎస్సార్ కృషితో తాగునీటి సమస్య పరిష్కారం 2004కు ముందు అనంతపురం పట్టణంలో విపరీతమైన తాగునీటి ఎద్దడి ఉండేది. మామూలు రోజుల్లోనే నాలుగైదు రోజులకోసారి తాగునీళ్లు వచ్చేవి. ఇక వేసవి కాలం వస్తే 10–15 రోజులకోసారి కూడా వదిలే పరిస్థితి ఉండేది కాదు. రోజూ నీటి ట్యాంకుల వద్ద మహిళల యుద్ధాలు జరిగేవి. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ. 67 కోట్లతో పీఏబీఆర్ పథకానికి శ్రీకారం చుట్టారు. కేంద్రాన్ని ఒప్పించి 80 శాతం నిధులు తెప్పించారు. తక్కిన 20 శాతంలో పది శాతం రాష్ట్ర ప్రభుత్వం, తక్కిన 10 శాతం మునిసిపాలిటీ భరించాల్సి ఉన్నా...ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పది శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా వైఎస్సార్ చర్యలు తీసుకున్నారు జీఓ విడుదల అయి, పనులు ప్రారంభించి 2010 నాటికి నగరానికి నీళ్లు వచ్చాయి. వచ్చే 30 ఏళ్ల వరకు అంచనాతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినా 40 ఏళ్లు దాకా ఎలాంటి ఇబ్బందులుండవని అధికారులు చెబుతున్నారు. పీఏబీఆర్ నీటి పథకం రావడంతో నగరంలోని ఏ కాలనీలోనూ నీటి సమస్యే లేదు. రోజూ ప్రజలకు అవసరం కంటేకూడా ఎక్కువగానే నీటి నిలువ ఉంటోంది. అయితే ప్రస్తుత పాలక వర్గం తప్పిదాలతో చాలా కాలనీలకు నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.15 కోట్లతో రహదారుల నిర్మాణం, అనంతపురం–తాడిపత్రి రహదారికి రూ.55 కోట్లు వెచ్చించి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. వర్షం వస్తే మురుగునీరు రోడ్లు, నివాసాల్లోకి రాకుండా ఉండేందుకు మరువవంక, నడిమివంకల ఆధునికీకరణకు రూ.56 కోట్లు మంజూరు చేసిన కరకట్టలు నిర్మించారు. నడిమివంక దాదాపు పూర్తయినా మరువవంక పెండింగ్ ఉంది. మిగులుగా ఉన్న రూ. 17 కోట్ల నిధులను ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మరో నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణానికి తరలించారు. ఫలితంగా మరువవంక ఆనుకుని ఉన్న కాలనీలను చిన్నపాటి వర్షానికి జలమయం అవుతూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ హయాంలోనే నగరంలోని పేదలకు ఇందిరమ్మ పథకం కింద 2,200 ఇళ్లు నిర్మించి ఇచ్చారు. వేలాది మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు మంజూరు చేశారు. ‘అనంత’ను అక్కున చేర్చుకున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరుఫున నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన అనంత వెంకటరామిరెడ్డి ఈసారి అనంతపురం అసెంబ్లీలో వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలుస్తున్నారు. వివాదారహితుడిగా, సౌమ్యుడిగా పేరున్న ‘అనంత’ నియోజకవర్గ ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన తర్వాత నగరంలోని 50 డివిజన్లతో పాటు ఎ.నారాయణపురం, రాజీవ్‌కాలనీ, రుద్రంపేట, అనంతపురం రూరల్ పంచాయతీల్లో ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో నిర్ణయాత్మకమైన ఓటర్లుగా ఉన్న ముస్లింలు పూర్తిగా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చిన వైఎస్సార్సీపీ, ఈసారి మరోసీటు పెంచి ఐదుసీట్లు ఇచ్చింది. తమకు ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని ఆ వర్గం నిర్ణయించింది. చౌదరికి ఇంటిపోరు ప్రస్తుత ఎమ్మెల్యే వై.ప్రభాకర్‌చౌదరికి సొంత పార్టీలో అసమ్మతి పోరు ఎక్కువగా ఉంది. కేఎం జకీవుల్లా, జయరాంనాయుడు వర్గాలు ప్రభాకర్‌చౌదరిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో చౌదరికి టికెట్ ఇస్తే తాము పార్టీని వీడతామంటూ ఆల్టిమేటం జారీ చేశారు. పదిమంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారు. బలిజలు కూడా తమకు కేటాయించకపోతే తగిన గుణపాఠం చెబుతామంటూ టీడీపీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రభాకర్‌చౌదరి, ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. మరోవైపు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చౌదరి, మేయర్ స్వరూప మధ్య కూడా విభేదాలున్నాయి. వీరి ముగ్గురూ మూడుముక్కలాట ఆడుతూ పార్టీని భ్రష్టు పట్టించారంటూ కార్యకర్తలు పలు సందర్భాల్లా వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ పనుల్లో పర్సెంటీజీల వ్యవహారంలో ఎమ్మెల్యే, మేయర్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ కనుమరుగైన తర్వాత అనంతపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి మంచి ఆదరణ ఉంది. -
వర్గోన్నతి.. అధోగతి
సాక్షి, కొవ్వూరు: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో నరసాపురం, పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు సామాజిక (కమ్యూనిటీ) ఆస్పత్రులను ఏరియా ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఆస్పత్రి భవనాలపై అప్పట్లో బోర్డులు సైతం మార్చారు. కొద్దినెలలకే ఆయన హఠాన్మరణంలో అప్‌గ్రేడేషన్ ప్రక్రియ మరుగున పడింది. ఐదేళ్ల నుంచి చంద్రబాబు సర్కారు దీనిపై శ్రద్ధ చూపలేదు. ఫలితంగా పేదలు ఉచిత వైద్య సేవలకు దూరమవుతున్నారు. రెండు నెలలు క్రితం నరసాపురం, భీమవరం ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేస్తూ ప్ర«భుత్వం జీఓ 44ని జారీ చేసింది. అయితే ఇందుకు అవసరమైన వైద్యులు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలను సమకూర్చలేదు. కొవ్వూరు, పాలకొల్లు ఆసుపత్రులు ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.5 కోట్లతో ఇటీవల నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. అప్‌గ్రేడేషన్ కాకపోవడంలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించలేక రిఫరల్ ఆసుపత్రిగా మారింది. దీంతో జిల్లాలోని నాలుగు సామాజిక ఆస్పత్రులను ఏరియా ఆస్పత్రులుగా మార్చాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. అప్‌గ్రేడేషన్ చేస్తే ఉన్నత వైద్యం జిల్లాలోని ఆయా నాలుగు ఆస్పత్రుల్లో రోజుకు సుమారు 2 వేల మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. సామాజిక ఆసుపత్రులను 100 పడకల ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న వైద్య సిబ్బంది కంటే రెట్టింపు సిబ్బంది సమకూరే అవకాశం ఉంది. 50 పడకల ఆస్పత్రులకు సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్ తోపాటు ఐదుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, దంత వైద్యులు, పది మంది స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సు ఉంటారు. 100 పడకల ఆస్పత్రులుగా మార్చితే నలుగురు సివిల్ సర్జన్లు, 12 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లతోపాటు 24 మంది స్టాఫ్ నర్సులు, నలుగురు హెడ్ నర్సుల పోస్టులు రావడంతోపాటు దాదాపు అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. బెడ్స్ పెరుగుతాయి. వైద్యం.. పూజ్యం ప్రభుత్వాస్పత్రులు అప్‌గ్రేడ్ కాకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రుల బాటపడుతున్నారు. నరసాపురం, పాలకొల్లు, భీమవరం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రులను, ఏలూరు జిల్లా ఆస్పత్రిని ఆశ్రయించాల్సి వస్తుంది. అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఉన్నాయి. కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి వస్తున్న రోగులను రాజమండ్రి, కాకినాడ ఆస్పత్రులకు తరలివస్తున్నారు. జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు, ఏలూరులో జిల్లా ప్రభుత్వాస్పత్రి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ వైద్య సేవలో పలు రోగాలకు వైద్యం చేయకపోవడం, సకాలం లో వైద్యానికి అనుమతి రాకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వాహనాల నిర్వహణ సరిగా లేక 108 వాహనాలు కూడా పూర్తిస్థాయిలో సేవలందించలేకపోతున్నాయి. కాగితాలకే పరిమితం భీమవరం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా మార్చుతూ ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. వైద్యులు, వైద్య సిబ్బంది నియామకంపై శ్రద్ధ చూపలేదు. ఆసుపత్రి అప్‌గ్రేడేషన్ కాగితాలకే పరిమితం అయ్యింది. భీమవరం ఆసుపత్రి డెల్టా ప్రాంతంతో పాటు కృష్ణా జిల్లానుంచి రోగులు వస్తుంటారు. వందలాది మంది వైద్యసేవలు పొందుతున్నారు. ఐదేళ్ల నుంచి ప్రభుత్వం అప్‌గ్రేడేషన్ గురించి పట్టించుకోలేదు. ఎన్నికలకు నెలరోజుల ముందు జీఓ జారీ చేసి చేతులు దులుపుకుంది. – కోడే యుగంధర్, భీమవరం -
గొప్ప ఆసరా అమ్మ ఒడి
సాక్షి, పెంటపాడు: తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రతీ తల్లిదండ్రులు తాపత్రయపడతారు. కూలీ నాలీ చేసుకొనైనా పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలని కలలు కంటారు. వారి ఆశలకు గండి కొడుతూ ప్రస్తుత ప్రైవేటు విద్య చాలా ఖరీదైపోయింది. సామాన్యులకు అది అందని ద్రాక్షలా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు. జగన్ తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే పేదపిల్లల పట్ల జాలి ఉన్న నేత. పిల్లల చదువుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, వారి చదువు బాల్యంలోనే ఆగిపోకూడదనే ఉద్దేశంతో ప్రాథమిక స్థాయి నుంచే చేయూత అందిస్తున్నారు. పేదలకెంతో ఉపయోగకరం.. పేదింటి పిల్లల చదువుకు ఏడాదికి రూ. 15 వేలు తల్లి బ్యాంకు ఖాతాలో జమచేస్తానని ఇచ్చిన హామీపై నియోజకవర్గంలోని తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తవుతోంది. గూడెం పట్టణం, మండలంలోని 32, పెంటపాడు మండలంలోని 21 గ్రామాలలో సుమారు 25 వేల మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. నియోజవర్గంలో 1 నుంచి 10వ తరగతి వరకు 190 ప్రాథమిక పాఠశాలు, మరో 70కి పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. బాల్యవివాహాలు, బడి మాన్పించడం, పేదరికం వల్ల చదువుకు స్వస్తిపలకడం వంటివి చేస్తున్నారు. ఈ సమయంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే ఈ పథకం ద్వారా రూ. 15 వేలు వారి చదువుకు ఎంతో ఆసరాగా ఉంటుంది. టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ వసతి గృహాలను క్రమంగా మూసివేస్తోంది. క్రమ బద్ధీకరణ పేరుతో పలు పాఠశాలలను ఇప్పటికే మూసివేసారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వాటిని పునరుద్ధరించడమే కాకుండా పిల్లలు చదువులు మానేయకుండా ఈ పథకం ఉపయోగపడుతుందని తల్లిదంర్రులు భావిస్తున్నారు. కాగా ఈ సమయంలో పేదలు చదువుకుంటే దేశం బాగుపడుతుందని, జగన్ ఇచ్చిన ఆసరా పేదలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పలువురు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘అమ్మఒడి’ పేదలకు వరం.. ఈ పథకం అమల్లోకి వస్తే పేదపిల్లలు ఉత్సాహంగా చదువుకొంటారు. ఫీజు రియింబర్స్‌మెంట్ ద్వారా అలనాడు రాజశేఖరరెడ్డి విద్యార్థుల గుండెల్లో కొలువైనాడు. జగన్ పథకం కూడా అలాంటి ఫలితాలే అందిస్తుంది. -గొర్రెల కోటేష్, పరిమెళ్ల రాష్ట్రంలో అక్షరాస్యత పెరుగుతుంది.. ఉన్నత లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ పథకంతో రాష్ట్రంలో అక్షరాస్యత గణనీయంగా పెరుగుతుంది. ప్రాథమిక స్థాయిలో ఇటువంటి పథకం వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుంది. చదువులో కేరళ రాష్ట్రాన్ని అధిగమించే అవకాశం ఉంది. -దేవరశెట్టి రాంబాబు, కొండేపాడు -
గిరిపుత్రుల గుండెల్లో వైఎస్
సాక్షి, బుట్టాయగూడెం: పేదరిక నిర్మూలనే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్తశుద్ధితో ఎనలేని కృషి చేశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి వైఎస్సార్ చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. కూలీలుగా ఉన్న వారికి భూములు ఇచ్చి ఆ భూముల్లో మోటార్లు వేయించడంతో పాటు వాటికి విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసి, ఉచిత కరెంట్ ఇచ్చారు. దీంతో కూలీలు రైతులుగా మారారు. జిల్లాలో అర్హులైన నిరుపేదలకు 30 వేల ఎకరాల భూపంపిణీ చేశారు. ఇందిరప్రభ పథకం ద్వారా బోర్లు వేసి విద్యుత్ సౌకర్యం కల్పించి ఇచ్చారు. దీంతో బీడు భూములు సైతం సాగుకు యోగ్యంగా మారి పచ్చని పంటలతో కళకళలాడుతూ సస్యశ్యామలంగా కనిపిస్తున్నాయి. ఏజెన్సీలో 15 వేల ఎకరాల పంపిణీ గిరిజన ప్రాంతంలో తరతరాలుగా భూములు లేక కూలీలుగానే జీవిస్తున్న వారికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరం నియోజకవర్గంలో సుమారు 15 వేల ఎకరాల వరకు భూములు పంచి వాటికి పట్టాలు ఇచ్చారు. ఆ భూముల్లో పంటలు పండించుకుని దినదినాభివృద్ధి చెందుతున్న గిరిజన చిన్న, సన్నకారు రైతులు వైఎస్సార్‌ను దేవుడుగా కొలుస్తున్నారు. సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు రాజన్న అకాల మరణం తరవాత పేదోడికి సెంటు భూమి పంచి ఇచ్చే నాథుడే లేరంటూ ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 2 వేల మందికి పైగా అటవీ హక్కుల చట్టంలో భూముల పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జానెడు భూమి పంచలేదని గిరిపుత్రులు విమర్శిస్తున్నారు. పేదల బతుకుల్లో వెలుగులు నిండాలంటే రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి రావాలని, ముఖ్యమంత్రి కావాలని వారు కోరుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలోని ప్రకాశరావుపాలెం సమీపంలో గిరిజన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజనులకు అండగా ఉంటానని గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. దీంతో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు మరింత మారతాయని ఆదివాసీలు ఆశిస్తున్నారు. వైఎస్ చలవతోనే భూమి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నాకు 5 ఎకరాల భూమిని పంచి ఇవ్వడంతో పాటు ఆ భూముల్లో బోర్లు వేసి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం వల్ల ఆ భూముల్లో ప్రత్తి, మొక్కజొన్న, బెండ, కంది వంటి పంటలు పండిస్తున్నాను. వ్యవసాయ కూలీగా ఉన్న నేను రైతుగా మారతానని కలలో కూడా అనుకోలేదు. వైఎస్ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. – ముచ్చిక బేబి, గిరిజన మహిళా రైతు, మర్లగూడెం ఇందిర ప్రభలో నీటి సదుపాయం రాజశేఖరరెడ్డి పాలనలో మాకు వ్యవసాయ పోడు భూములకు రెండెకరాలకు పట్టా ఇచ్చి హక్కు కల్పించారు. అదేవిధంగా సాగునీటి ఇబ్బందులు రాకుండా ఇందిర ప్రభ పథకంలో నీటి సదుపాయం కూడా కల్పించారు. ఆ భూముల్లో వరి, మొక్కజొన్న, ప్రత్తి పంటలు వేసుకుంటూ ఆదాయ వనరులను పెంచుకుంటున్నాం. భూమికి హక్కు పత్రం ఇవ్వడం వల్ల వ్యవసాయ రుణం పొందేందుకు కూడా అవకాశం కలిగింది. – మడకం రాజు, గిరిజన రైతు, లంకాలపల్లి, బుట్టాయగూడెం మండలం ఐదేళ్లుగా పట్టాలు రాలేదు మా గ్రామంలోని భూమిలేని 24 మంది గిరిజనులకు కుటుంబానికి 2 ఎకరాల చొప్పున వైఎస్ రాజశేఖరరెడ్డి భూములిచ్చారు. ఆ సమయంలో 12 మంది దరఖాస్తులు చేసుకోగా పట్టాలు వచ్చాయి. వైఎస్సార్ మరణం తర్వాత మిగిలిన 12 మంది దరఖాస్తులు పెట్టుకున్నా ఇంతవరకూ పట్టాలు రాలేదు. వైఎస్సార్ ఉంటే ఎప్పుడో పట్టాలొచ్చేవి. జగన్ ముఖ్యమంత్రి అయితేనే పోడు భూములకు పట్టాలొస్తాయని నమ్ముతున్నాం. – పెనువెల్లి సోమరాజు, రైతు, బండార్లగూడెం, బుట్టాయగూడెం మండలం -
మీ పాలనకై వేచి చూస్తున్నం..
సాక్షి, గుంటూరు : గుప్పెడు మెతుకుల కోసం ఏ రోజుకారోజు కండలు కరిగించే పేదోడి గుండెకు జబ్బు చేస్తే నువ్వెందుకయ్యా విలవిలలాడిపోయావు. బక్కచిక్కినోళ్ల ఇళ్లలో భవిష్యత్ వెలుగు దీపమై ప్రకాశించాల్సిన బిడ్డల చదువులు మధ్యలో ఆగిపోతుంటే నువ్వెందుకయ్యా దిగులు పడ్డావుఅవ్వాతాతల ఆవేదనలు ఓ మూలన దీనంగా వినిపిస్తుంటే .. నీ గుండెపై ఎందుకయ్యా కన్నీటి తడి తెచ్చుకున్నావు. పాదయాత్ర ఆసాంతం.. ప్రతి అడుగులో బడుగుల ఆరని కన్నీళ్లు నిన్ను కదిలించాయా.. అప్పటి చంద్రబాబు పాలనలో దుర్భిక్ష పరిస్థితులు నిన్ను చలింపచేశాయా.. అందుకేనా.. ఆరోగ్యశ్రీ పథకంలో మనసున్న వైద్యుడిగా మారావు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బిడ్డల జీవితాలకు ఉజ్వల దారులు పరిచావు. పింఛన్లతో అవ్వాతాతల బోసినవ్వులను దోసిటపట్టావు. సంక్షేమాన్ని పేదోళ్ల గుమ్మానికి తోరణంగా కట్టావు.. ఇన్ని చేసిన నిన్ను ఎవరూ మరిచిపోలేదయ్యా. ప్రజల నుంచి దూరమై ఏళ్లు గడుస్తున్నా ప్రతి గుండెచప్పుడులోనూ నిత్యం వినిపిస్తూనే ఉన్నావు. పేదోళ్ల ప్రతి మాటలోననూ కనిపిస్తూనే ఉన్నావు. నిర్మలమైన నీ రూపంతో ప్రతి గుండె గుడిలో దేవుడిలా కొలువై నిలిచిపోయావు. అందుకే గుంటూరు గుండె చప్పుడు ఎదురు చూస్తోంది మళ్లీ సంక్షేమ సారథివై వస్తావని.. జిల్లావాసుల సుదీర్ఘ స్వప్నమైన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం వైఎస్ హయాంలో ప్రారంభమైంది. 2004లో జలయజ్ఞంలో భాగంగా జిల్లా పరిధిలోని బెల్లంకొండ మండలం పులిచింతల గ్రామం, నల్గొండ జిల్లాలోని మేళ్ళచెరువు గ్రామాల మధ్య పులిచింతల నిర్మాణ పనులు చేపట్టారు. 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే ఉద్దేశంతో రూ.682 కోట్లతో ప్రాజెక్టు మంజూరైంది. ప్రాజెక్టు నిర్మాణం రూ.483.33 కోట్లతో పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తితో హెక్టారుకు 3.4 టన్నుల ఆహార ధాన్యాల అధిక ఉత్పత్తి అవుతుందని, తద్వారా రూ.808 కోట్ల నికర ఆదాయం పొందవచ్చని అంచనా. నాగార్జునసాగర్ కుడి కాల్వ పరిధిలో రూ.7.46 కోట్లతో కాల్వ ఆధునికీకరణ పనులు చేపట్టారు. కృష్ణా పశ్చిమ డెల్టాలకు దివంగత వైఎస్ఆర్ హయాంలో మహర్దశ పట్టింది. రెండు డెల్టాలకు రూ.4,444.41 కోట్లతో 604 కిలోమీటర్ల పొడవునా కాల్వల ఆధునీకరణ, 848 కొత్త బ్రిడ్జిల మంజూరయ్యాయి. జిల్లాలో 1,59,489 ఎకరాల ఆయకట్టుకు నీరందించటానికి 234 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 483.27 కోట్లతో మంజూరైనా .. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంతో వాటిని పట్టించుకునే నాథుడు లేక నిలిచిపోయాయి. అడిగిన వెంటనే ఎత్తిపోతల వరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వినుకొండ ప్రాంతం అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. 2004లో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వినుకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామస్తులు ముఖ్యమంత్రిని కలసి తమ గ్రామం గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్నప్పటికీ సాగు నీరు అందడం లేదని తెలిపారు. వైఎస్ వెంటనే స్పందించి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.4.80 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సభాస్థలిలోనే ప్రకటించారు. దీంతో చకచకా పథకం నిర్మాణం పూర్తయింది. 1050 ఎకరాలు మెట్ట భూములకు సాగు నీరు వచ్చింది. గతంలో రూ.50 వేలు ధర కూడాలేని భూములు ఇప్పుడు లక్షల రూపాయలు పలుకుతున్నాయి. ఆయన జ్ఞాపకార్థంగా గ్రామంలో వైఎస్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. గొంతు తడిపిన మహనీయుడు గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, – గురజాల పట్టణ ప్రజల మంచినీటి కష్టాలను చూసి వైఎస్ చలించిపోయారు. గోవిందాపురం కృష్ణానది నుంచి రూ.36 కోట్ల వ్యయంతో పిడుగురాళ్ల పట్టణానికి మంచినీటిని అందించే రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తి చేశారు. గురజాలకు సైతం బుగ్గవాగు నుంచి రూ.12 కోట్ల వ్యయంతో మంచినీటిని అందించారు.సత్తెనపల్లి పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.14.5 కోట్లతో 120 ఎకరాల మంచినీటి చెరువును కొనుగోలు చేసి బాగు చేయించారు. మరో రూ.20 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మించి రెండు పూటలా మంచినీరు అందించారు. -
వైఎస్ శకం..విద్యకు నవయుగం
సాక్షి,గుంటూరు : ‘ప్రతి విద్యార్థి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి. అక్షరజ్ఞానంతో అభివృద్ధి పథంలో పయనించాలి. సమాజంలో చదువుల విప్లవం రావాలి. కార్పొరేట్ స్థాయి విద్య కార్మికుడి బిడ్డకు కూడా అందాలి. ప్రతిభ ముందు పేదరికం తలవంచాలి. ఇంటికో ఇంజినీర్ తయారవ్వాలి.. ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటాలి’.. ఇది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే ఆయన పని చేశారు. ఈ క్రమంలోనే మొదటి సారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రోసూరుకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేశారు. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి మోడల్ స్కూల్ నిర్మాణానికి సంకల్పించారు. ఎందరో విద్యా కుసుమాల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారు. ఇచ్చిన మాట ప్రకారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2009లో మండల కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మోడల్‌స్కూల్, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 9 బ్యాచ్‌ల విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసుకున్నారు. అప్పట్లో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా విద్యార్థులకు అందింది. అదే విధంగా పేద విద్యార్థులకు ఇంగ్లిషు మీడియంలో బోధన అందించి ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా చదువులు అందించాలన్న కాంక్షతో 2009 లో నిధులు కేటాయించగా 2013 లో భవనాలు పూర్తిచేసుకుని పాఠశాల ప్రారంభమైంది. ప్రవేశ పరీక్షల ద్వారా ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. తరగతికి 80 మంది విద్యార్థులు చొప్పున ప్రతిఏటా 650 మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. బాలికల హాస్టల్, కస్తూర్బాగాంధీ పాఠశాల ద్వారా ఎంతో పేద బాలికలకు చదువుకోగల్గుతున్నారు. అయితే మొత్తం అభివృద్ధిని నేనే చేశానని చెప్పుకునే టీడీపీ నాయకులు ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క కొత్త విద్యాసంస్థను నెలకొల్పకపోగా, రేషనలైజేషన్‌లో పేరుతో ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని మూసివేశారు. మాలాంటి పేద విద్యార్థులకు వరం నేను మోడల్ స్కూల్లో ఏడో తరగతి నుంచి చదువుతున్నా. ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం. స్థానికంగా కాలేజీ ఉండటం మాలాంటి ఆడపిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రైవేట్ కాలేజీలో వేల రూపాయల ఫీజులు చెల్లించలేం. ఈ ఏడాది నీట్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. – వీ వాణి, సీనియర్ ఇంటర్, ఎంపీసీ నాణ్యమైన విద్య.. మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఎందరో పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి చదువులకు దగ్గరయ్యారు. విద్యార్థుల మెరిట్ కోసం నిరంతం కృషి చేస్తున్నాం. – ఝాన్సీవాణి, మోడల్‌స్కూల్ ప్రిన్స్‌పాల్ -
యముడిని తరిమికొట్టిన సంజీవుడు..
సాక్షి, జగన్నాథపురం (కాకినాడ రూరల్): ‘ఆ మారాజు చనిపోయి ఎక్కడున్నారో కానీ.. నాకు మళ్లీ ప్రాణం పోశారు. నాకొచ్చిన పాడుజబ్బుతో బతుకుతాననుకోలేదు. నాలాంటి కడుపేదకు కూడా ఎంతో ఉన్నతమైన చికిత్సను కార్పొరేట్ ఆస్పటల్లో చేయించిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నాను అనుకుంటే అది ఒకేఒక్కరికి.. మనసున్న మారాజు మా రాజన్నకే’.. హృదయం పట్టని కృతజ్ఞత.. కన్నుల కరకట్టలు దాటి అశ్రువుల రూపంలో ధారలు కడుతుండగా ఈ మాటలు చెప్పే వారెందరో. సమాజగమనానికి ఇంధనం వంటి శ్రామికుల స్వేదానికి ఖరీదు కట్టే షరాబు ఎవరని మహాకవి ప్రశ్నించాడు. ప్రాణావసాన స్థితిలో ఉన్న వేళ కబళించ వస్తున్న కాలయముడిని ఆరోగ్యశ్రీ పథకం అనే సంజీవినిని కొరడాలా ఝుళిపించి, తోక ముడిచేలా చేయడం ద్వారా ఈ జన్మలోనే పునర్జీవితాన్ని పొందిన వారి కృతజ్ఞతను లెక్క కట్టగలవారెవ్వరు? ఆ మహానేత దివంగతుడై దశాబ్దం కావస్తున్నా.. ఆ పేరు వినగానే ఎన్ని కుటుంబాలకో ఓ దేవుడి పేరు వీనుల పడ్డట్టుంటుంది. అలాంటి కుటుంబాల్లో ఒకటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని తూరంగి గ్రామం సత్యదుర్గా నగర్లో నివాసం ఉంటున్న కొక్కిరిగెడ్డ తాతారావు కుటుంబం. వారిది రెక్కాడితేగానీ, డొక్కాడని బతుకు. తాతారావు భార్య దుర్గాలక్ష్మికి గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడ్డాయి. విపరీతమైన ఛాతీనొప్పి. ఊపిరి తీసుకోలేని పరిస్థితి. డాక్టర్లు ఆపరేషన్ తప్పదన్నారు. వారి 16 ఏళ్ల కూతురు సత్యకుమారికి గుండె జబ్బు. విపరీతమైన ఆయాసం వచ్చేది. డాక్టర్లు గుండెకు బెలూన్ సర్జరీ పడుతుందని చెప్పారు. ఇద్దరి ఆపరేషన్లకు లక్షల్లో ఖర్చవుతుంది. తాతారావుకి దిక్కుతోచలేదు. భార్యాబిడ్డల్ని దక్కించుకోవడమెలాగో తెలియక, ఆ ఆవేదనతో ఎన్నో నిద్రపట్టని రాత్రిళ్లు గడిపాడు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందామనుకున్న రోజులు కూడా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితుల ప్రభావం ఎటువంటిదో. 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ గురించి తెలుసుకుని, విశాఖపట్నంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇద్దరికీ ఆపరేషన్లు చేయించాడు. ఆ పథకం పుణ్యమా అని ఇంటి దీపాన్నీ, కంటి పాపనూ.. ఇద్దర్నీ రక్షించుకోగలిగాడు. పథకాన్ని నీరుగార్చిన ‘బాబు’ సర్కారు ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ స్ఫూర్తితో ఎంతోమంది ముఖ్యమంత్రులు వారి రాష్ట్రాలలో కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారు. కానీ మన రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీరే వేరు. ఆరోగ్యశ్రీ పథకం జాబితా నుంచి ఒక్కో జబ్బునీ తొలగిస్తూ, ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించక పథకాన్ని నీరుగార్చారని ప్రజలు దుయ్యబడుతున్నారు. జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలవాలని, దివంగత నేత రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలని, ఆరోగ్యశ్రీకి మరలా జవసత్వాలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నా దేవుడు వైఎస్సారే.. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ తప్పనిసరి అన్నారు. విపరీతమైన ఛాతీనొప్పి వచ్చేది. ఊపిరి ఆడేదికాదు. 2008లో ఆరోగ్యశ్రీ పథకంద్వారా ఆపరేషన్ చేయించుకున్నాను. వైఎస్సార్ ఇటువంటి పథకం పెట్టుండకపోతే నేను బతికుండేదాన్నికాదు. నా దేవుడు వైఎస్సారే. – కొక్కిరిగెడ్డ దుర్గాలక్ష్మి, సత్యదుర్గానగర్, తూరంగి దేవుడి మందిరంలో వైఎస్సార్ పటం 16 ఏళ్ల వయస్సులో ఛాతీలో నొప్పి వస్తోందని డాక్టర్ దగ్గరకు వెళితే గుండెజబ్బన్నారు. బెలూన్ సర్జరీ పడుతుందన్నారు. లక్షల్లో ఖర్చు. కూలి పని చేసి కుటుంబాన్ని పోషించే నాన్న ఆపరేషన్ చేయించలేని పరిస్థితి. 2008లో నేను కూడా అమ్మలాగే ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్ చేయించుకున్నాను. తర్వాత పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. ఆరోగ్యంగా ఉన్నాను. మా ఇంట్లో దేవుడి మందిరంలో రాజశేఖరరెడ్డిగారి పటం పెట్టుకున్నాము. –ఓలేటి సత్యకుమారి, సత్యదుర్గానగర్, తూరంగి ఈ సంతోషం వైఎస్సార్ చలవే.. నా ఆరోగ్యమే అంతంత మాత్రం. 2008లో నా భార్యకు, నాకూతురికీ ఆరోగ్యం బాగోకపోవటంతో దిక్కుతోచలేదు. ఇద్దరి మీదా ఆశ వదిలేసుకున్నాను. నిరాశానిçస్పృహæలతో ఉన్న అలాంటి సమయంలో అదృష్టం కొద్దీ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించటంతో ఇద్దరికీ ఒక్క పైసా ఖర్చులేకుండా ఆపరేషన్లు కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరిగాయి. వాళ్ల ప్రాణాలు నిలిచి, మా కుటుంబం సంతోషంగా ఉందంటే.. అంతా వైఎస్సార్ చలవే. –కొక్కిరిగెడ్డ తాతారావు, సత్యదుర్గానగర్, తూరంగి. ప్రాణం నిలిపిన పథకం 2009లో గుండెనొప్పి రావడంతో హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంటే.. ఆపరేషన్ చేయాలని, రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంతంత మాత్రం సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్న నాకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో బతుకు మీద ఆశ వదులుకున్నాను. అయితే అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేశారు. మహానేత పథకం నాకు పునర్జన్మ ఇచ్చిందని నేడు కూడా కృతజ్ఞతతో చెబుతాను. –పురాలశెట్టి సూర్యనారాయణ, శబరిఒడ్డు, చింతూరు -
గూడు లేని గోడు.. అలసత్వంలో ప్రభుత్వం
సాక్షి, అమరావతి : గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తాం.. అంటూ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పదే పదే చెబుతూ పేద ప్రజల్లో సొంతింటిపై ఆశలు కల్పించారు. కాని ఈ మూడేళ్లలో 8.41 లక్షల ఇళ్లు పూర్తి చేశామని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో 5 లక్షల ఇళ్లు కూడా పూర్తి కాలేదు. వాస్తవానికి బిల్లులు సరిగా ఇవ్వకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. ప్రభుత్వం అనుకున్న ప్రకారం 25 లక్షల ఇళ్లు పూర్తీ చేయాలంటే రూ.78,093 కోట్లు అవసరమవుతాయని అధికారుల అంచనా. కాగా ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల మేరకు మాత్రమే బిల్లులు మంజూరు చేశారు. జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిందే చంద్రబాబు ప్రభుత్వంలో ఇల్లు మంజూరు కావాలనుకునే పేదలు.. జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరిగి వారికి సమర్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మంజూరైన ఇళ్లకు సైతం బిల్లులు సకాలంలో అందక అప్పు తెచ్చుకొని నిర్మాణాలు చేపడుతున్న పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహ నిర్మాణాల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నా నిర్మాణాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. సింగపూర్, మలేషియా, చైనాల టెక్నాలజీ ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదల కల సాకారం చేస్తామని చంద్రబాబు ఘనంగా పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. కాని ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగినప్పటికీ.. పేదల సొంతింటి కల మాత్రం నెరవేరలేదు. వైఎస్ హయాంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో అడిగిన ప్రతి పేదవాడికి ఇళ్లు మంజూరు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పాదయాత్ర ద్వారా సొంతిల్లు లేని పేదల ఇబ్బందులను కళ్లార చూసిన ఆయన... ముఖ్యమంత్రి కాగానే అడిగిన వారందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేశారు. ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 44.80 లక్షల ఇళ్లు మంజూరు చేసి.. ఏకంగా 31.24 లక్షల ఇళ్లను పూర్తి చేశారు. మిగిలిన 13.56 లక్షల ఇళ్లకు టీడీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపివేయడంతో ఇంటి నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయి. ఇప్పటికీ అవి మొండి గోడలుగా దర్శనమిస్తున్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు పేదల గురించి ఆలోచించక పోవడంతో.. ప్రతి రోజూ ఎక్కడో ఒక ప్రాంతంలో ఇంటి పట్టా, ప్రభుత్వ ఇళ్ల కోసం కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిత్యం ఆందోళనలు జరిగేవి. వైఎస్ అధికారంలోకి వచ్చాక.. అడిగిన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇళ్లు లేని పేదలు 30 లక్షల మందికి పైగానే: ప్రభుత్వం నిర్వహించిన పల్స్ సర్వేలో.. రాష్ట్రంలో 30.31 లక్షల మంది పేదలు ఇంకా గుడిసెల్లోనే నివాసం ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. శ్రీకాకుళం జిల్లాలో 1,53,716, విజయనగరంలో 1,23,076, విశాఖపట్నంలో 1,91,358, తూర్పు గోదావరి 4,85,219, పశ్చిమ గోదావరిలో 3,75,220, కృష్ణాలో 3,19,586, గుంటూరులో 3,08,722 మంది పేదలకు ఇంకా సొంతిళ్లు లేవని గుర్తించారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 2,10,370, నెల్లూరులో 1,59,744, చిత్తూరులో 1,51,472, వైఎస్సార్ కడపలో 1,25,571, అనంతపురంలో 2,03,817, కర్నూలు జిల్లాలో 2,23,418 కుటుంబాలు గుడిసెల్లోనే నివాసం ఉంటున్నట్లు గుర్తించింది. ఎన్నికల కోసమే గృహాలు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ ప్రభుత్వం గృహాల నిర్మాణాలకు అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసినట్టు అర్థమవుతోంది. మార్కాపురం లో గతేడాది నవంబర్‌లో మంత్రి లోకేశ్ చేసిన శంకుస్థాపనలు పునాది దాటలేదు. ఎప్పుడు పూర్తవుతాయో అధికారులు చెప్పడం లేదు. స్థల సేకరణ కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. వైఎస్ హయాంలో దరఖాస్తు చేయగానే ఇళ్లు మంజూరయ్యాయి. బిల్లుల మంజూరు ఎలాంటి జాప్యం జరగలేదు. – కె.వెంకటేశ్వరరెడ్డి, మార్కాపురం రెండు నెలలుగా బిల్లులు రాలేదు.. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద నాకు ఇల్లు మంజూరైంది. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఇంటి నిర్మాణం అసంపూర్తిగానే ఉండిపోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నాకు బిల్లులు మంజూరు చేస్తే మిగతా పనులు పూర్తిచేసుకుంటా. – బూదాల ప్రదీప్, రాయవరం, ప్రకాశం జిల్లా ఇంతవరకు దిక్కులేదు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇళ్లు మంజూరు కావడంతో నిర్మాణాన్ని మొదలెట్టాం. బిల్లు కోసం హౌసింగ్ అధికారులను సంప్రదిస్తే బేస్ లెవెల్ అయ్యాక ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత 35 బ్యాగుల సిమెంట్ మాత్రమే ఇచ్చి.. బిల్లులు అకౌంట్లో పడతాయని చెప్పారు. ఎలాగో బిల్లు వస్తుంది కదా అని రూ.2.5 లక్షల వరకూ అప్పుచేసి ఇళ్లు కట్టుకుంటూ వచ్చాం. బిల్లు కోసం అడిగిన ప్రతిసారీ అధికారులు ఖాతాలో పడతాయనే చెబుతున్నారు. ఇంత వరకూ దిక్కు లేదు. అప్పు చేసే ధైర్యం లేక ఇంటి నిర్మాణాన్ని ఆపేశాం. - గొల్ల రుక్మిణి, కసాపురం, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లా డి. రాజగోపాల్ సాక్షి, అమరావతి -
మహా నేత... జన నేత
సాక్షి, శ్రీకాకుళం : పడుగు.. పేకలా అల్లుకున్న బంధం వారిది. నిజానికి వాళ్లు కార్మికులు కాదు.. కళాకారులు. చితికిపోయిన చేనేత రంగం వారి బతుకుల్ని ఛిద్రం చేసింది. చేనేత కార్మికులంటూ ప్రభుత్వాలు వారిని చులకన చేశాయి. ‘ఆదుకోండి బాబూ’ అంటున్నా ఆకలి కేకలు సర్కారు చెవిన పడటం లేదు. వారి బతుకులు బాగుపడటం లేదు. ‘ఆ దేవుడు (వైఎస్ రాజశేఖరరెడ్డి) మా కట్టాలు తెల్సుకున్నాడు. సేనేత పని తప్ప మాకేమీ సేతగాదు. ఈ పని కూడెట్టడం నేదు. రోజంతా కట్టపడ్డా యాభై, అరవై కూడా రావటం నేదు. మా బాధలన్నీ ఇన్న వైఎస్ బాబు పింఛనీ వయసు 65 నుంచి 50 ఏల్లకి తగ్గించాడు. మాలాటోళ్లందరికీ పింఛనీలిచ్చి పున్నుం గట్టుకున్నాడు. సెంద్రబాబొచ్చి ఇంట్లో ఇద్దరికి పెన్షన్లుంటే ఈల్లేదని ఒకరికి తీసేశాడు. వైఎస్‌లాగా అతని కొడుకు జగన్‌బాబే కనపడతన్నాడు. ఆయన అధికారంలోకొత్తే ఇంట్లో ఎంతమంది ముసలోళ్లున్నా పింఛనీలిత్తానని సెప్పాడు. తండ్రిలాగే మాట తప్పడు. ఆ బాబు ముఖ్యమంత్రి ఎప్పుడవుతాడా.. మా కట్టాలెప్పుడు గట్టెక్కుతాయా అని ఎదురు సూత్తనామయ్యా..!’ అని సిక్కోలు చేనేత కార్మికులు ముక్తకంఠంతో చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు, బొంతలకోడూరు గ్రామాలను ‘సాక్షి’ సందర్శించింది. బొంతలకోడూరులో వృత్తినే దైవంగా నమ్ముకుని.. కూలిపోయే ఇంట్లో ఒంటరిగా బతుకీడుస్తున్న 85 ఏళ్ల బొల్ల జగన్నాథమ్మ రోజంతా కష్టపడితే వచ్చేది 20 రూపాయలే. ఈ వయసులో ఇంత కష్టమేంటమ్మా.. అని అడిగితే ‘గాంధీ మహాత్ముడు సృష్టించిన ఈ రాట్నమే నాకు ఇంకా బతుకునిస్తోంది బాబూ’ అని సమాధానం ఇచ్చింది. ఇంతలో అక్కడకు ఓ పదిమంది వయసు మళ్లిన చేనేత కళాకారులు చేరుకున్నారు. వారిని కదిలిస్తే.. ‘ఈ ఐదేళ్లలో మమ్మల్ని సెంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పెన్షను వయసు 65 నుంచి 50కి తగ్గించి పుణ్యం గట్టుకున్నారు. మా శరీరం సహకరించకపోయినా ఆ దేవుడు దయవల్లే 50 ఏళ్లకే పెన్షన్లు అందుకుంటున్నాం’ అని పోలిశెట్టి రాంబాబు (80) చెప్పాడు. ‘జగన్ వత్తే భార్యాభర్తలిద్దరికీ పెన్షనిత్తాడంట. తెలుగుదేశం ప్రభుత్వంలో మొగుడికో, పెళ్లానికో ఒక్కరికే ఇత్తన్నారు. నా పెన్షన్ పీకేశారు’ అని సాంబశివరావు అనే కార్మికుడు చెప్పారు. తండ్రిలాగే జగన్ ఇచ్చిన మాట తప్పడని అంటున్నారు. జగన్ బాబు త్వరగా సీఎం అయితే చేనేతల బతుకులు మారతాయన్న నమ్మకం ఉంది. పెన్షన్లు అందరికీ వస్తాయి’ అని మరికొందరు చేనేత కార్మికులు తమ నమ్మకాన్ని వెల్లడించారు. - బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, శ్రీకాకుళం -
వైఎస్ అలా.. బాబు ఇలా..
సాక్షి, అమరావతి: చేనేత కుటుంబాలకు 100 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అని ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు నెలల క్రితం చంద్రబాబు ప్రకటించారు. కానీ అమలుకు నోచుకోలేదు. - వర్షాకాలంలో ఆరుబయట నేతకు వీలుగా షెడ్లు వేస్తామని 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. - వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు చేనేతలకు హెల్త్ కార్డులిచ్చారు. రూ.500 నుంచి రూ.1,500 వరకు వైద్యానికయ్యే ఖర్చును చెల్లించేవారు. చంద్రబాబు దానికి మంగళం పాడేశారు. - చేనేత కుటుంబాలకు పూర్తిగా పని కల్పించేందుకు వీలుగా ప్రభుత్వ ఉద్యోగులు విధిగా వారానికి రెండు రోజులు ఖద్దరు వస్త్రాలు ధరించేలా వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అమలు చేసే లోగా మరణించారు. - వైఎస్ హయాంలో చేనేత వికలాంగులకు నెలకు 25 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేవారు. చంద్రబాబు వచ్చాక దానిని ఎగ్గొట్టారు. - వైఎస్ పాలనలో తక్కువ వడ్డీకి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు రుణాలిచ్చారు. బాబు వచ్చాక ఇవ్వడం లేదు. రూ.15 వేల విలువచేసే కుంచె, పైపులకు 90 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. చేనేత కార్మికులకు జిల్లాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్న హామీ నిలబెట్టుకోలేదు. -
రుణమాఫీ అనగానే వద్దు ‘బాబూ’ అంటూ బెంబేలు
సాక్షి, అనంతపురం: రుణమాఫీ అనగానే రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారు. రుణమాఫీ హామీ ప్రకటించే నాటికి రుణాలు కట్టని రైతులతో పాటు కట్టిన రైతులకూ తనదైన శైలిలో న్యాయం చేసి శభాష్ అనిపించుకున్నారు. కరువు కాటకం సంభవించిన 2008లో 6.63 లక్షల మంది రైతులకు నెల రోజుల వ్యవధిలోనే ఒకే విడత కింద రూ.733 కోట్లు లబ్ధి చేకూర్చారు. అప్పట్లో రూ.733 కోట్లు అంటే ఆషామాషీ కాదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. రైతులకు భరోసా.. కరువు పరిస్థితులు ఏర్పడిన కష్ట కాలంలో భయపడవద్దు... నేనున్నా... అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘అనంత’ రైతుల్లో భరోసా ఇచ్చాడు. 2008లో కరువు కరాళనృత్యం చేస్తున్న పరిస్థితుల్లో వైఎస్సార్ కేంద్ర ప్రభుత్వ సాయంతో రుణమాఫీకి చర్యలు చేపట్టాడు. జిల్లాలో 3.04 లక్షల మంది రైతులకు రూ.555 కోట్లు ఒకేసారి మాఫీ చేశారు. నెల రోజుల్లోనే రైతులను రుణ విముక్తులను చేశారు. అప్పట్లో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ ఏ జిల్లాలోనూ జరగలేదు. వైఎస్సార్ ఆదుకునే చర్యలు చేపట్టడంతో లక్షల రైతు కుటుంబాల ఇంట ఆనందం తాండవించింది. ఫలితంగా ఇప్పటికీ ఎప్పటికీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇది బాబు మార్క్ మాఫీ సీఎం చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ అంటేనే రైతులు జడుసుకుంటున్నారు. రుణమాఫీ అనగానే వద్దు ‘బాబూ’ అంటూ బెంబేలెత్తిపోతున్నారు. వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి 2014 ఎన్నికల్లో రైతుల నుంచి ఓట్లు దండుకున్న చంద్రబాబు సీఎం పీఠం ఎక్కగానే స్వరం మార్చేశారు. కొర్రీలు, కమిటీలు, షరతులు విధించి మాఫీ సొమ్మును బాగా తగ్గించేశారు. 2013 డిసెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా పంట, బంగారు, వ్యవసాయ అనుబంధరంగాల రుణాలు 10.24 లక్షల అకౌంట్ల పరిధిలో రూ.6,817 కోట్లు రుణాలు ఉంటే చివరకు రూ.2,744 కోట్లు మాఫీకి ఒప్పుకున్నారు. ఐదేళ్లవుతున్నా ఇంకా 1,165 కోట్లు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. విడతలు వారీ, రుణమాఫీ పత్రాలు, రుణమాఫీ వేదికలు, గ్రీవెన్స్‌లు, చెక్కులు అంటూ ఐదేళ్ల నుంచి రైతులకు కంటినిండా నిద్ర లేకుండా చేశారు. ఐదేళ్లవుతున్నా చంద్రబాబు మాఫీ మాయ నుంచి రైతులు ఇప్పటికీ తేరుకోలేదు. అసలు ఎంత, వడ్డీ ఎంత, ఎంత మాఫీ అయింది, ఎంత సొమ్ము జమ అయిందనేది రైతులకు అర్థం కాకుండా పోయింది. రుణమాఫీ కోసం మండలాలు, డివిజన్లు, జిల్లా కేంద్రం, హైదరాబాద్, విజయవాడ, గన్నవరం, బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. మాఫీ అయిన సొమ్ము కన్నా రోజుల తరబడి అటుఇటు తిరగడానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిన వారు వేలల్లో ఉన్నారు. ఇపుడు ఎన్నికలు సమీపించడంతో రైతులు గుర్తుకు రావడం ఎన్నికల కోడ్ ప్రకటించిన సమయంలోనే 4, 5వ విడత రుణమాఫీ సొమ్ము ఇస్తామంటూ చంద్రబాబు ఎన్నికల ఎత్తుగడ కింద ప్రకటించడంతో రైతులు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. రుణాలు కట్టిన రైతులకు ప్రోత్సాహకం వైఎస్సార్ 2008లో రుణమాఫీ చేసే సమాయానికి అప్పటికే చాలా మంది రైతులు తమ రుణాలు చెల్లించారు. వారిని గౌరవిస్తున్నట్లు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సగర్వంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సాయం లేకుండా రుణాలు చెల్లించిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 వేల చొప్పున ప్రోత్సాహకం కింద అందజేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 3.59 లక్షల మంది రైతులకు రూ.178 కోట్లు పంపిణీ చేశారు. 2008లో ఇచ్చిన ప్రోత్సాహకాలు, రుణమాఫీతో 6.63 లక్షల మందికి ఒకే విడత కింద రూ.733 కోట్లు లబ్ధిచేకూర్చడంతో రైతు ఇంట సంబరాలు చేసుకున్నారు. అదే ఏడాది వేరుశనగ, ఇతర పంటల నష్టానికి గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకం ద్వారా 5.20 లక్షల మందికి రూ.620 కోట్లు పరిహారం అందించారు. పావలా వడ్డీ కింద మరో రూ.42 కోట్లు అందించారు. ఇలా 2008లో ఒకే సంవత్సరం జిల్లా రైతులకు ఏకంగా రూ.1,400 కోట్ల వరకు లబ్ధి చేకూర్చిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుంది. వైఎస్సార్ చలువతో రూ.5 లక్షల రుణమాఫీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతోనే నా బ్యాంకు రుణం రూ.5 లక్షలు మాఫీ అయ్యింది. 2008లో పామిడి ఆంధ్రాబ్యాంకులో స్వరాజ్ ట్రాక్టర్ కోసం రూ.2,70 లక్షలు, వ్యవసాయ మోటారుకు 3 ఇంచుల పైపుల కోసం రూ.40 వేలు రుణం పొందాను. ట్రాక్టర్‌కు అసలుకు వడ్డీతో కలిపి రూ.3.40 లక్షలు, పైపులకు అసలు వడ్డీతో కలిపి రూ.60 వేలు మొత్తం బ్యాంకు రుణం రూ.5 లక్షలైంది. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ అప్పట్లో మొత్తం మాఫీ అయ్యింది. అప్పట్లో మండలంలోనే అన్ని లక్షలు రుణమాఫీ అయిన ఏకైక రైతును నేనే. వైఎస్‌కు నేను సర్వదా రుణపడి ఉంటా. – బంగారు శ్రీనివాసులురెడ్డి, పి.కొత్తపల్లి, పామిడి వాతావరణ బీమాతో ఊరట నాకు గ్రామంలో 5 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. 2008లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో పంటలు నష్టపోయాం. దిక్కుతోచనిస్థితిలో ఉన్న మాకు వాతావరణ బీమా కింద రూ.35 వేలు పరిహారం మంజూరైంది. దీంతో పంట సాగుకు చేసిన అప్పు తీర్చా. అయితే ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఏటా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల వేరుశనగ పంట నష్టపోతున్నా ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా మంజూరు కావడం లేదు. – వెంకటేశులు, రైతు ఒంటారెడ్డిపల్లి, కంబదూరు మండలం వైఎస్ ప్రభుత్వం మాఫీ చేసిన సొమ్ము రూ.555 కోట్లు రుణాలు కట్టిన రైతులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు రూ.77 కోట్లు ఖరీఫ్ పంట నష్టానికి ఇచ్చిన బీమా పరిహారం రూ.620 కోట్లు పావలావడ్డీ కింద అందించిన ప్రయోజనం రూ.42 కోట్లు రైతులకు ఒకే విడతగా లబ్ధి చేకూర్చిన మొత్తం రూ.1,400 కోట్లు చంద్రబాబు హామీ మేరకు వ్యవసాయ రుణాలు రూ.6,817 కోట్లు చివరకు మాఫీకి అంగీకరించిన మొత్తం రూ.2,744 కోట్లు మూడు విడతలుగా విడుదల చేసిన మొత్తం రూ.1,900 కోట్లు ఐదేళ్లవుతున్నా ఇంకా పెండింగ్‌లో పెట్టిన మొత్తం రూ.1,165 కోట్లు అరకొరగా మాఫీ అయిన రైతుల సంఖ్య 1.10 లక్షల మంది అర్హత ఉన్నా మాఫీకి నోచుకోని వారి సంఖ్య 35 వేల మంది -
వైఎస్ మాట..విశ్వవిద్యాలయానికి బాట
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ : శ్రీకాకుళం జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. జిల్లా విద్యార్థులు ఉన్నత విద్యభ్యాసానికి గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని 1980వ సంవత్సరం నుంచి జిల్లా ప్రజలు ఉద్యమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అనేక కమిటీలు వేశాయి. అయినా విశ్వవిద్యాలయం ఏర్పాటు కాలేదు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు 2008వ సంవత్సరం జూన్ 25న జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీని మంజూరు చేసి ఏర్పాటు చేశారు. గార మండలం కళింగపట్నానికి చెందిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఏయూ ప్రొఫెసర్ చోడిపల్లి వెంకట సుధాకర్‌ను తొలి వైస్‌చాన్స్‌లర్‌గా నియమించారు. ప్రస్తుతం ఈ వర్సిటీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యలో కీలకంగా మారింది. వర్సిటీలో ఎల్ఎల్బీ, గణితం, జియోఫిజిక్స్, ఫిజిక్స్, జియాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంసీఏ, ఎఈడీ, యోగా డిప్లమో, ఎంఎల్ఐఎస్సీ, బీఈడీ మెంటల్లీ రి టార్డ్, బయోటెక్నాలజీ, తెలుగు, సోషల్ వర్క్, ఎల్ఎల్ఎం, ఇంగ్లీష్, రూరల్ డెవలప్మెంట్, ఎకనామిక్స్, ఎంకాం, ఎంజేఎంసీ, ఎంబీఏ, ఇంజినీరింగ్‌లో సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్ కోర్సులు ఉన్నాయి. కోర్సులు విస్తరిస్తూ విద్యార్థులకు విశ్వవిద్యాలయం అందుబాటులో ఉంది. ప్రత్యేక దృష్టి పెడితే ఈ వర్సిటీ రాష్ట్రంలోనే ఉత్తమ వర్సిటీగా రూపొందే అవకాశం ఉంటుందని పలువురు మేధావులు అభిప్రాయ పడుతున్నారు. విద్యా ప్రగతితోనే ప్రాంతీయ అభివృద్ధి విద్యా ప్రగతితేనే ప్రాంతీయ అభివృద్థి సాధ్యమవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విద్య ప్రాధాన్యాన్ని గుర్తించారు. అందుకే జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం విద్యార్థులు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వెళ్లి చదువుకునేవారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న విశ్వవిద్యాలయాన్ని రానున్న ప్రభుత్వాలు ఉన్నత విద్యా ప్రమాణాలతో కూడిన సంస్థగా తీర్చి దిద్దాలి. -మిర్యాల చంద్రయ్య,మాజీ ఇన్చార్జ్ వైస్‌చాన్సలర్ -
జగన్ హమారా..!
టీడీపీ, బీజేపీ బంధం ముస్లింలను ఏనాడూ స్థిరంగా ఉండనివ్వలేదు. ఒకసారి వాజ్‌పేయి, మరోసారి మోదీ పుణ్యామా అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ముస్లింను ఎదగనివ్వకుండా చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఏ ఒక్క సీటును ముస్లింలకు కేటాయించకపోవడం చంద్రబాబులోని ముస్లిం వ్యతిరేక భావజాలానికి అద్దం పడుతోంది. దీనికి తోడు తన మంత్రివర్గంలో ముస్లింలకు అవకాశమివ్వని చంద్రబాబు వైఖరితో ఆ సామాజిక వర్గాన్ని అవమానానికి గురైంది. వైఎస్సార్సీపీ తరుఫున గెలిచిన అత్తార్ చాంద్‌బాషాను సంతలో పశువులా కొనుగోలు చేసి టీడీపీలోకి చేర్చుకున్న అంశం ముస్లింల మనోభావాలను మరింత దెబ్బతీసింది. ఇలాంటి దశలో వైఎస్సార్ పాలనను ప్రతి ఒక్క ముస్లిం గుర్తుకు చేసుకుంటున్నాడు. సాక్షి, అనంతపురం: టీడీపీ ఆవిర్భావం నుంచి ఆపార్టీలోనే కొనసాగుతున్న వారిలో కదిరి మహమ్మద్ ఇస్మాయిల్ ఒకరు. ఆయనకు కదిరి సీటు కేటాయించాలని ఢిల్లీ స్థాయిలో జమాతే హింద్ పెద్దలు స్వయంగా చంద్రబాబును కలిసి విన్నవించుకున్నారు. వారి విన్నపాన్ని చంద్రబాబు తోసిపుచ్చాడు. దీంతో దాదాపు జిల్లాలోని అన్ని మసీదుల ముతవల్లిలు, పేష్ ఇమామ్‌లు ఇటీవల ప్రెస్‌క్లబ్‌లో సమావేశమై ముస్లింల పట్ల టీడీపీ సర్కార్ అవలంభిస్తున్న నిర్లక్ష్యం వైఖరిపై చర్చించారు. చంద్రబాబుకు తమ తడాఖా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 210 ఎకరాల వక్ఫ్ భూములున్నాయి. వీటిలో ఒక్క కదిరి ప్రాంతంలోనే 110 ఎకరాలు అన్యాక్రాంతం కాగా, అనంతపురంలోని గుత్తి రోడ్డులో సుమారు 90 సెంట్ల రూ. కోట్లలో విలువైన భూమిని టీడీపీకి చెందిన ప్రముఖులు కబ్జా చేశారు. ఈ విషయంలో టీడీపీలోని ముస్లింలు వర్గాలుగా విడిపోయి న్యాయం చేయాలంటూ ఓ వర్గం వారు అప్పటి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని కలిసారు. దీంతో కబ్జాదారులు మంత్రి సునీత పంచన చేరారు. రాజకీయ ప్రాబల్యం కోసం ముస్లింలలో ఐక్యతను అప్పటి నుంచి టీడీపీ పెద్దలు దెబ్బతీస్తూ వచ్చారు. ఇదే అలుసుగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మసీదుల్లో, దర్గాల్లో అధికార పెత్తనానికి వారు తెరలేపారు. వారి మాటే చెల్లుబాటు అయ్యేలా పావులు కదుపుతూ వచ్చారు. ఎలాంటి పాండిత్యం లేకపోయినా తమ పార్టీకి చెందిన వారిని ఖాజీగా నియామకం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం చివరకు న్యాయస్థానం మెట్టు ఎక్కేలా చేసింది. జిల్లా ముస్లింల చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు ఖాజీలను టీడీపీ సర్కార్ నియమించింది. ఆఖరుకు ఈద్గా మైదానంలో నమాజు చేయించే విషయంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటూ వచ్చారు. పొంతన లేని టీడీపీ సర్కార్ పథకాలు ముస్లిం మైనారిటీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఏవీ సక్రమంగా అమలుకు నోచుకోలేదు. కేవలం ప్రచారానికే తప్ప మరేందుకు అవి ఉపయోగపడలేదు. ముస్లింలను ఇంతలా మభ్య పెట్టిన చంద్రబాబు సర్కార్ పథకాలు పరిశీలిస్తే.. పేద ముస్లిం యువతి వివాహానికి దుల్హన్ పథకం కింద రూ. 50 వేలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది కేవలం టీడీపీ కార్యకర్తలకు తప్ప సామాన్యులకు అందలేదు. మైనారిటీ సబ్‌ప్లాన్ అమలుతో ముస్లింల అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవంగా సబ్‌ప్లాన్ అమలు ఎక్కడా కనిపించలేదు. ఇదే విషయాన్ని టీడీపీకి చెందిన ముస్లిం నాయకులే అంగీకరిస్తున్నారు. ముస్లింకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీవనోపాధుల పెంపునకు విరివిగా రుణాలు అందజేస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముస్లింలను పూర్తి నిరాదరణకు గురి చేశారు. ప్రత్యేక కార్పొరేషన్‌తో పాటు, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందివ్వకపోవడంతో చాలా మంది ముస్లిం విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేసుకోవాల్సి వచ్చింది. రాబోవు రోజులు మంచివి మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పలు పథకాల వల్ల ముస్లింలలో చాలా మంది ఉన్నత విద్యావంతులయ్యారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆయన బాటలోనే నడుస్తున్న వైఎస్ జగన్ ప్రకటించిన పథకాలు చాలా బాగున్నాయి. జగన్ సీఎం అయితే ముస్లింలకు మంచి రోజులు వస్తాయి. – రఫీ, చిరు వ్యాపారి అనంతపురం ఉపాధి దొరుకుతుంది కుటుంబపోషణకు ఏదైనా చిన్న వ్యాపారం చేయాలని అనుకుంటున్నా. అయితే పెట్టుబడులకు అప్పులు చేయాల్సి వస్తోంది. మా పరిస్థితి చూసి బ్యాంక్ వాళ్లేవరూ అప్పు ఇవ్వడం లేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే ముస్లిం సబ్‌ప్లాన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే నిజమైతే మాలాంటి వారికి ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణాలు సులువుగా అందుతాయి. – మల్లికా జహా, పాతూరు, అనంతపురం -
ఉంగుటూరు.. ఆ దారే వేరు..
సాక్షి, భీమడోలు(ఉంగుటూరు) : నియోజకవర్గం 1967లో ఆవిర్భవించింది. అంతకుముందు తొలుత 1955లో అలంపురం నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఆ తర్వాత పెంటపాడు నియోజకవర్గంలో ఉండేది. 1967లో ఉంగుటూరు నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2009 పునర్విభజనకి ముందు పూర్తి మెట్టప్రాంతంగా ఉండేది. పునర్విభజన తర్వాత భీమడోలు, ఉంగుటూరు మండలాలకు డెల్టా మండలాలైన నిడమర్రు, గణపవరం మండలాలను కలపడంతో మెట్ట, డెల్టా మేలుకలయికగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన కొల్లేరు ప్రాంతం నియోజవర్గంలోనూ విస్తరించి ఉంది. భౌగోళిక స్వరూపం గ్రామాలు : 81 సాగు విస్తీర్ణం : 27,064హెక్టార్లు ఆక్వా సాగు విస్తీర్ణం : 14,474 ప్రధాన పంటలు : వరి, మొక్కజొన్న,చెరకు, అపరాలు మెట్ట. ఇదీ ఉంగుటూరు నియోజకవర్గం ముఖచిత్రం. నియోజకవర్గంలో మండలాలు:భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు, గణపవరం జనాభా : 2,66,139 పురుషులు:1,19,070 స్త్రీలు:1,47,069 ఓటర్లు : 1,93,475 పురుషులు:96,241 స్త్రీలు:97,221 ఇతరులు:13 రాజకీయ ప్రత్యేకత ఉంగుటూరు నియోజవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందనే భావన బలంగా ఉంది. అలాగే చరిత్రను చూస్తే ఒకసారి గెలిచిన వారు రెండోసారి విజేతలైన దాఖాలాలు ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వచ్చింది. దీంతో వరుసగా 2004, 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వట్టి వసంతకుమార్ గెలుపొందారు. రాజకీయ చైతన్యం ఎక్కువ ఈ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే, విద్యావేత్త, విద్యాదాత చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా వాటిలో ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. భీమడోలు మండలం పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురానికి చెందిన వట్టి వెంకటరంగ పార్థసారథి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. డీసీసీబీ చైర్మన్‌గా పని చేశారు. వీవీఆర్ పార్థసారథి తనయుడు వట్టి వసంతకుమార్ దివంగత సీఎం వైఎస్సార్ ప్రధాన అనుచరుడు. ఆయన ఆశీస్సులతో 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో రెండో సారి గెలిచి రాష్ట్ర మంత్రిగా పని చేశారు. కాంటూరు హామీకి తూట్లు కొల్లేరు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ప్రాంత పరిరక్షణకు గత ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కొల్లేరులోని అభయారణ్యం పరిధి ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరు కుదించి తీరుతానని, మిగిలిన భూములు పేదలకు పంచుతానని స్పష్టం చేశారు. కొల్లేరులోని 9 మండలాల్లో ఐదో కాంటూరు దిగువన గల 77138 ఎకరాల్లో చేపల చెరువులను కొల్లేరు ఆపరేషన్‌లో ధ్వసం చేశారు. అయితే ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు కుదిస్తే 14,861 ఎకరాల మిగులు భూములు ఉంటాయి. వాటన్నింటినీ పేదలకు పంచుతానని పేర్కొన్నారు. అయితే ఈ హామీకి చంద్రబాబు తూట్లు పొడిచారు. జిరాయితీ భూములకు నష్టపరిహారం ఇస్తామని ఇచ్చిన హామీనీ విస్మరించారు. బాబు హయాంలోనే కొల్లేరు కలుషితం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఆక్వా బకాసురులు కొల్లేరుపై కన్నేశారు. చేపల చెరువులు తవ్వేశారు. దీంతో కొల్లేరు కలుషితమైపోయింది. సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వచ్చే విదేశీ పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో పక్షుల జాతి అంతరించిపోవడాన్ని గమనించిన విదేశాలు తాము ఇచ్చిన నిధులు దుర్వినియోగమవుతున్నాయని ప్రపంచ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీంతో చంద్రబాబు కొల్లేరు చెరువుల ధ్వంసానికి జీఓ నంబర్ 120 ఇచ్చారు. ఆ జీఓ కొల్లేరు ప్రజల పాలిట శాపంగా మారింది. 2006లో సుప్రీంకోర్టు ఉత్తర్వులతో అప్పటి ప్రభుత్వం చెరువులను ధ్వంసం చేసింది. కొల్లేరు వాసుల జీవనం అధ్వానంగా మారేందుకు చంద్రబాబు కారకుడయ్యారు. ముఖ్య సమస్యలివీ.. ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్ హయాంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చారు. అయితే టీడీపీ హయాంలో పేదల కోసం ఒక్క సెంటు భూమి కొనలేదు. వైఎస్సార్ హయాంలో సేకరించిన భూమిలోనే ఇళ్లస్థలాలు ఇచ్చి జబ్బలు చరుచుకుంది టీడీపీ సర్కార అర్హులైన వారికి ఇళ్లస్థలాలు ఇచ్చిన దాఖలాలే లేవు. ఫలితంగా అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ హామీతో హర్షాతిరేకం చంద్రబాబు జీఓతో కొల్లేరు వాసులు పొట్టకొట్టిన నేపథ్యంలో ఇక్కడి మత్స్యకారులకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్సీని ఇస్తానని, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో కొల్లేరు ప్రాంత ప్రజలు ఆయన అధికారం చేపట్టే క్షణం కోసం నిరీక్షిస్తున్నారు. వలసల పాపం బాబుదే నియోజకవర్గంలోని నిడమర్రు, భీమడోలు మండలాల్లో కొల్లేరు పరీవాహక ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ మత్స్యసిరికి కొదవ ఉండేది కాదు. విదేశీ పక్షుల కిలకిలారావాలతో ఆహ్లాదంగా ఉండేది. ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి సంతాన ఉత్పత్తి కోసం పక్షులు ఇక్కడికి వచ్చేవి. దీంతో కొల్లేరు సంరక్షణకు ఆయా దేశాలు ఆర్థిక చేయూతనిచ్చేవి. అయితే స్వచ్ఛ కొల్లేరు ధ్వంసం అయిపోయింది. మత్స్యసంపదపై ఆధారపడి జీవించే వేలాది జీవితాలు నాశనమయ్యాయి. మత్స్యకారులు వలసబాట పట్టారు. పొట్ట చేత పట్టుకుని ఇతర జిల్లాలకు వెళ్లిపోయారు. కొందరు ఇళ్లలో వృద్ధులు, పిల్లలను వదిలేసి మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలకు పనుల కోసం పోయారు. ఈ పాపమంతా ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఈ ప్రాంత వాసులు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. భీమడోలు మండలంలోని పాతూరు సహకార చక్కెర కర్మాగారం చంద్రబాబు హయాంలోనే మూతపడింది. ఆ ఫ్యాక్టరీని నమ్ముకున్న వేలాదిమంది రోడ్డున పడ్డారు. జీవనం కోసం వలసపోయారు. -
అల్లా..వారిని క్షమించరు!
సాక్షి, కర్నూల్: అవినీతి, అక్రమాల్లో మునిగి తేలిన వారిని అల్లా కూడా క్షమించబోరని ఏపీ ముస్లిం కౌన్సిల్ అధ్యక్షుడు, రిటైర్డ్ తహసీల్దార్ సయ్యద్ రోషన్ ఆలీ అన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో రెవెన్యూ, పోలీస్ శాఖలు పూర్తిగా నిర్వీర్యమై పోయాయని విమర్శించారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితులు దాపురించాయన్నారు. ఉద్యోగాలు పోయినా బతికేస్తామనే భరోసాతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు. రెవెన్యూ మంత్రికి తెలియకుండానే ప్రభుత్వ భూముల బదిలీలు జరిగిపోయాయని ఆరోపించారు. జిల్లాలోని ఓర్వకల్లు, జూపాడుబంగ్లా, కొలిమిగుండ్ల ప్రాంతాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని.. ఆయా ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి మార్గాలను చూపలేక పోయిందన్నారు. దుల్హన్ పథకం ఉన్నప్పుడే పేద, మధ్య తరగతి ప్రజలకు న్యాయం జరిగేదని, ప్రస్తుతం ఆ పథకం స్థానంలో ఉన్న చంద్రన్న పెళ్లి కానుకతో ముస్లిం, మైనారిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ‘సాక్షి’తో ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ప్రభుత్వ భూములు విచ్చలవిడిగా కబ్జా ... ఎంతో విలువైన ప్రభు త్వ భూములను అధికారాన్ని అడ్డం పెట్టుకొని జిల్లాలో కొందరు నేతలు బహిరంగంగా కబ్జా చేస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. అనేక మండలాల్లో వీఆర్ఐ, ఆర్ఐ, తహసీల్దార్లకు తెలియకుండానే భూముల బదిలీలు జరిగిపోతున్నాయి. అవసరాలకు సొంత పట్టా భూములు అమ్ముకునేందుకు కూడా వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఆదోనిలో ఓ మాజీ ప్రజా ప్రతినిధి సోదరుని ప్రమేయం లేకుంటే ఎవరు భూములు, స్థలాలు అమ్ముకునేందుకు, కొనేందుకు వీలులేని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను మునుపెన్నడూ చూడలేదు. చంద్రన్న పెళ్లి కానుకతో మైనారిటీలకు కష్టాలు ... దుల్హన్ పథకం స్థానంలో చంద్రన్న పెళ్లి కానుక ప్రవేశ పెట్టడం వల్ల మైనారిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. దుల్హన్ పథకంలో వివాహం అనంతరం దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సహకారం అందేది. ప్రస్తుతం చంద్రన్న పెళ్లి కానుకలో వివాహానికి 20 రోజుల ముందే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు పలు రకాల నిబంధనలను పెట్టడం వల్ల నిరక్షరాస్యులైన మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఇబ్బంది పడుతున్నారు. దుల్హన్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న 285 జంటలకు రూ.1,42,50,000 ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది. ఇక ... మైనారిటీ రుణాల గురించి చెప్పాల్సిన పని లేదు. ముందుగా అధికార పార్టీకి చెందిన వారికి మొదటి ప్రాధాన్యం, డబ్బున్నోడికి రెండవ ప్రాధాన్యతగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అర్హులైన పేద వారికి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందని పరిస్థితి నెలకొనింది. స్థలాలు చూపించడంలో నిర్లక్ష్యం ... కేంద్ర ప్రభుత్వం పలు మైనారిటీ విద్యా సంస్థల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి 15 పాయింట్ ప్రోగ్రామ్ కింద జిల్లాకు నిధులు విడుదల చేసినా, ఆయా విద్యా సంస్థల ఏర్పాటుకు స్థలాలు చూపించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చాగలమర్రిలో మైనారిటీ విద్యా సంస్థకు 8 కిలోమీటర్ల దూరంలో స్థలం చూపించారు. నందికొట్కూరులో స్థలం లేక బ్రాహ్మణకొట్కూరులో చూపిస్తున్నారు. ఆదోనిలో మైనారిటీ జూనియర్ కళాశాలకు రజకులకు సంబంధించిన స్థలం చూపించి రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించారు. చుక్కల భూములతో రైతులకు చుక్కలు చూపించారు ... చుక్కల భూముల పేరుతో జిల్లాలో రైతులకు చుక్కలు చూపించారు. దాదాపు 1.75 లక్షల ఎకరాల చుక్కల భూములు ఉన్నట్లు తేలడంతో వేలాది మంది రైతులు తమ భూములను తిరిగి తమ అనుభవంలోకి తీసుకునేందుకు అనేక ఆర్థిక, మానసిక కష్టాలను అనుభవించారు. యువతకు లభించని ఉపాధి జిల్లాలోని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌కు 16 వేల ఎకరాలు, గని సోలార్ పార్కుకు 5 వేలు, కొలిమిగుండ్ల సిమెంట్ హబ్‌కు 12 వేలు, జూపాడుబంగ్లా మెగా సీడ్ పార్కుకు 1600 ఎకరాల భూములను తీసుకున్నారు. అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పట్టా భూమలను ఇష్టానుసారం ప్రభుత్వం లాగేసుకుంది. పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. నిరుద్యోగ యువతకు ఉపాధి చూపలేదు. ఉన్నత విద్యను అభ్యసించిన వేలాది మంది యువతీ యువకులు జిల్లాలో ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో పొట్ట చేతపట్టుకొని సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. 4 శాతం రిజర్వేషన్ అమలు శూన్యం ముస్లింల కోసం వైఎస్సార్ అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్ చంద్రబాబు పాలనలో ఏ మత్రం అమలు కాలేదు. రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. ఇక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన భర్తీ అవుతున్న ఉద్యోగాలు కూడా రాజకీయ పలుకుబడి, డబ్బు ఉన్న వారికి మాత్రమే దక్కుతున్నాయి. మైనారిటీ వర్గాలకు 4 శాతం రిజర్వేషన్ వల్ల ఈ పాలనలో ఎలాంటి ఉపయోగం కనిపించడం లేదు. -
వైఎస్సార్ హయాంలో ఉద్యాన విప్లవం
సాక్షి, అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం జిల్లాకు ‘ప్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ’గా పేరు వచ్చిందంటే అదంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ప్రోత్సాహమే.. అని జిల్లాలో ఏ రైతును అడిగినా చెబుతారు. కరువు కాటకాలకు నిలయమైన ‘అనంత’లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో పండ్లతోటల విప్లవమే కొనసాగింది. ఆయన ఐదేళ్ల హయాంలో పండ్లతోటల రైతులకు వివిధ రూపాల్లో రూ.80 కోట్ల వరకు రాయితీలు కల్పించారు. కొత్తగా 45 వేల హెక్టార్లలో ఉద్యాన తోటలు విస్తరించాయి. వైఎస్సార్ రాయితీలతో పండ్లతోటల విస్తరణ.. ఉద్యాన పంటలంటే పెద్దగా తెలియని రైతులు కూడా వైఎస్ కల్పించిన రాయితీలను ఉపయోగించుకోవడంతో మారుమూల ప్రాంతాల్లో సైతం పండ్లతోటలు విస్తరించాయి. ఫలితంగా వేరుశనగ పంట నష్టాలతో వ్యవసాయ జూదంలో దారుణంగా దెబ్బతింటున్న రైతులు కోలుకున్నారు. వ్యవసాయ పంటల స్థానంలో పండ్లతోటల సాగుపై దృష్టి సారించారు. ఓ వైపు పండ్ల తోటలకు రాయితీలు ఇచ్చిన వైఎస్సార్ అదే సమయంలో సూక్ష్మసాగు కింద డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీకి పెద్దపీట వేశారు. ఎస్సీ ఎస్టీలకు 100 శాతం, మిగతా రైతులకు 90 శాతం రాయితీతో అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్, స్ప్రింక్లర్లు ఇవ్వడంతో ఉద్యానతోటలు మూడు పవ్వులు, ఆరు కాయలు మాదిరిగా విరాజిల్లాయి. 2004కు ముందు కొన్ని ప్రాంతాలకే పరిమితం.. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన 2004కు ముందు వరకు జిల్లాలో కేవలం కొన్ని ప్రాంతాలకే పండ్లతోటలు పరిమితమయ్యాయి. 1995 నుంచి 2003 వరకు తొమ్మిదేళ్లు చంద్రబాబునాయుడు పాలించారు. అయినా ఉద్యానతోటల జాడ కనిపించలేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చీనీ, అరటి లాంటి రెండు మూడు రకాల పండ్లు,కూరగాయలు, పూలతోటలు 15 నుంచి 20 వేల హెక్టార్ల వరకు సాగులో ఉన్నాయి. పండ్ల తోటలంటే ఏమిటి, వాటి వల్ల ప్రయోజనాలేమిటి? ఎలా సాగు చేయాలి..పథకాలేంటి..? అమ్ముకోవడం ఎలా అనే విషయాలు జిల్లా రైతులకు ఏ మాత్రం తెలియని పరిస్థితి ఉండేది. వ్యవసాయం దండగగా మారిందంటూ ఆసమయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూడా వ్యవసాయాన్ని చిన్నచూపు చూసింది. దీంతో రైతులు అనేక కష్టాలు పడ్డారు. వైఎస్సార్ రాకతో పండ్ల తోటల విప్లవం 2004లో ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ వెంటనే రైతు సంక్షేమంపై దృష్టి సారించారు. విద్యుత్ బిల్లుల మాఫీతో పాటు ఉచిత కరెంటుకు శ్రీకారం చుట్టారు. వేరుశనగ వల్ల నష్టపోతున్న రైతుల దృష్టి పండ్లతోటల వైపు మళ్లించారు. పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీలు ప్రకటించారు. సూక్ష్మసాగుకు పెద్దపీట వేశారు. ఫలితంగా కరువు కోరల్లో చిక్కుకున్న అనంత రైతులు మెల్ల మెల్లగా పండ్లతోటల సాగుకు అడుగులు వేశారు. ఏడాది తిరగకముందే జిల్లాలో పండ్లతోటల విప్లవం కొనసాగింది. సమస్యల సుడిగుండం నుంచి బయటపడే మార్గం చూపించడంతో పండ్లతోటలు జిల్లా నలుమూలలా విస్తరించాయి. వైఎస్సార్ మరణం తర్వాత.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణంతో జిల్లాలో పండ్లతోటల రైతుల పరిస్థితి 2004కు ముందు పరిస్థితులు గుర్తుకు తెస్తున్నాయి. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు పండ్లతోటల రైతులకు ఇస్తున్న రాయితీలకు కోతలు పెట్టారు. బడ్జెట్ బాగా తగ్గించేశారు. ఆ తర్వాత 2014లో మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినా ఉద్యానంపై చిన్నచూపు చూశారు. బడ్జెట్, పథకాలు, రాయితీలు బాగా తగ్గించేశారు. ఫలితంగా రాయితీలు, మార్కెటింగ్ సదుపాయం లేక పండ్లతోటల రైతులు బాగా నష్టపోతున్నారు. జీవనాధారం దొరికింది వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధిహామి పధకంలో భాగంగా మాకున్న 3.50 ఎకరాల్లో గుంతలు తవ్వించి మామిడి మొక్కలు, డ్రిప్ ఉచితంగా అందజేశారు. దీంతో పాటు మూడేళ్ల పాటు ఎరువులు, కంచె వేయడానికి, ఎండి మొక్కల స్థానంలో కొత్తవి నాటుకునేందుకు డబ్బ సాయం చేశారు. ఇప్పుడు ఆ మామిడి తోట నుంచి ఏటా రూ.2లక్షలు ఆదాయం వస్తోంది. మా కుటుంబానికి జీవనాధారం ఆ తోటే. వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ వల్లే మా కుటుంబం సంతోషంగా ఉంది. – నరసింహారెడ్డి, బొడినేపల్లి, నల్లచెరువు -
వైఎస్.. ఒయాసిస్సై..దాహం తీర్చారు
సాక్షి, అమలాపురం టౌన్ / అల్లవరం: ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి ప్రజారంజక పాలన అందించినప్పుడు అమలాపురం నియోజకవర్గం కూడా అనూహ్యమైన అభివృద్ధిని సాధించింది. 2004 నుంచి 2009 వరకూ సాగిన డాక్టర్ వైఎస్ పాలన ఈ నియోజకవర్గంలో కొన్ని శాశ్వతమైన ప్రజా ప్రయోజనాలతో జరిగిన నిర్మాణాలు నేటికీ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నాయి. వాస్తవానికి 2004 అసెంబ్లీ ఎన్నికల నాటి నియోజకవర్గానికి 2009లో జరిగిన పునర్విభజనలో గతంలోని అల్లవరం నియోజకవర్గం దాదాపు 80 శాతం అమలాపురంలో చేరింది. దీంతో వైఎస్ హయాంలో ఆ రెండు నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి అంతా పునర్విభజన తర్వాత ఏర్పడ్డ అమలాపురం నియోజకవర్గంలోకి రావడంతో రెండు నియోజకవర్గాల అభివృద్ధిని మూట కట్టుకున్నట్లయింది. 2004 ఎన్నికల్లో వైఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చాక అప్పటి అమలాపురం, అల్లవరం ఎమ్మెల్యేలు కుడుపూడి చిట్టబ్బాయి, గొల్లపల్లి సూర్యారావులు తమ తమ నియోజకవర్గాలకు అభివృద్ధిపరంగా నిధులను అడిగిందే తడవుగా ముఖ్యమంత్రిగా వైఎస్ నిధుల మంజూరు చేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా వైఎస్ మళ్లీ సీఎం కావడంతో, నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పినిపే విశ్వరూప్‌ను తాగునీటి సరఫరా మంత్రిని చేయడంతో తాగునీటి పథకాలకు కొదవ లేకుండా చేశారు. అమలాపురం నియోజకవర్గం మీదుగా ఉన్న 216 జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న గోదావరిపై వైఎస్ వారధి నిర్మించి అటు రాజోలు దీవిని అనుసంధానం చేయడంతో అమలాపురంతో కలిపారు. నియోజకవర్గంలో వైఎస్ అభివృద్ధి జాడలు నిత్యం కనిపిస్తూనే ఉంటోంది. ఆయన ముద్ర నియోజకవర్గంపై శాశ్వతమై ఉంది. ఆ మహానేత హయాంలో జరిగిన అభివృద్ధి పనుల వారీగా ఓ సారి పరిశీలిస్తే అవి నేడు నియోజకవర్గ ప్రజలకు ఎంతలా ఉపయోగపడుతున్నా యో... ఎంతటి సేవలు అందిస్తున్నాయో అర్థమవుతుంది. వారధి నిర్మించి చిరకాల వాంఛ తీర్చారు. అది 2000 సంవత్సరం.. అప్పటి లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కోనసీమ మీదుగా జిల్లాలోని కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకూ దాదాపు 235 కిలో మీటర్ల రహదారికి జాతీయ రహదారి హోదా కల్పించారు. అయితే ఈ జాతీయ రహదారిలో కాకినాడ వైపు నుంచి కోనసీమ ముఖద్వారమైన యానాం–ఎదుర్లంక మధ్య ఉన్న గౌతమీ నదిపై వారిధి నిర్మించారు. తర్వాత ఇదే జాతీయ రహదారిలో కోనసీమలో ఉన్న దిండి–చించినాడ మధ్య గల వశిష్ట నదిపై వారధి కూడా నిర్మితమైంది. అయితే కోనసీమలో ఇదే జాతీయ రహదారిపై అమలాపురం– పి.గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య ఉన్న వైనతేయ నదిపై వారధి నిర్మించలేదు. దీంతో జాతీయ రహదారి అనుసంధానం కాకపోవడంతో అమలాపురం ప్రాంతమే జాతీయ జీవన స్రవంతితో కలిసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నదిపై వారధి నిర్మించాలన్న ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను డాక్టర్ వైఎస్సార్ గుర్తించారు. 2005లో ఈ వారిధికి రూ.76 కోట్లు విడుదల చేసి వైఎస్సే దాని నిర్మాణానికి పునాది రాయి వేశారు. 2009 నాటికి వారధి పూర్తయ్యి జాతీయ రహదారుల సేవలో అనుసంధానమైంది. పట్టణ ప్రజలకు భారీ సమ్మర్ స్టోరేజీ అమలాపురం పట్టణంలో వైఎస్ ప్రభుత్వం రాక ముందు, వాటర్ వర్క్స్ వద్ద రెండు తాగునీటి చెరువులు (రిజర్వాయర్లు), మూడు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండేవి. వీటితోనే పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీరాయి. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక పట్టణ శివారులో 44 ఎకరాల్లో నిర్మించిన భారీ సమ్మర్ స్టోరేజీ రిజర్వాయర్‌ను అందుబాటులోకి తెచ్చారు. 2005లో వైఎస్సే ఈ భారీ తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. గోదావరి జలాలు ప్రవహించే పంట కాల్వల నుంచి ఈ సమ్మర్ స్టోరేజీ రిజర్వాయర్‌కు నీటిని ముడి నీటిగా మళ్లించి పట్టణ ప్రజలకు 70 రోజుల పాటు నీటి నిల్వలు ఉండే సామర్థ్యంతో అందుబాటులోకి తెచ్చారు. ఈ రోజు పట్టణంలో పైపులైన్ల మరమ్మతులు, శివార్లు విస్తరించి జనాభా పెరిగిపోయి సరైన పర్యవేక్షణ లేక తాగునీటి చౌర్యం, వృధాను అరకట్టలేక పలు చోట్ల తాగునీటి సమస్యలు అనివార్యం చేశారు. అయితే తాగునీటి వనరుల పరంగా నాటి భారీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే సామర్ధ్యం ఉన్నా పర్యవేక్షణ లోపంతో, అధికారుల వైఫల్యంతో నిరుపయోగంగా మారాయి. అప్పట్లో దాదాపు రూ.5 కోట్లతో ఆ తాగునీటి ప్రాజెక్టును నిర్మించారు. 3 మండలాలు...4 భారీ తాగునీటి ప్రాజెక్టులు.. డాక్టర్ వైఎస్ 2009లో మళ్లీ సీఎం అయ్యాక ఆయన మంత్రివర్గంలో ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి అయ్యారు. దీంతో నియోజకవర్గంలోని మండలాలకు దాదాపు 60 కోట్ల వ్యయంతో భీమనపల్లి, కూనవరం, చిందాడగరువు, బోడసకుర్రు గ్రామాల్లో నాలుగు ప్రాజెక్ట్‌లు ఏకకాలంలో నిర్మించారు. నియోజకవర్గంలోని 60 గ్రామాల్లో మూడొంతుల గ్రామాలు నదీ పరీవాహకం, సముద్ర తీరం వెంబడి ఉన్నాయి. దీంతో ఇక్కడ భూగర్భ జలాల్లో ఉప్పు నీటి శాతం ఉండడంతో అవి దాహార్తి తీర్చవు. ఈ కారణంతోనే అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే, సంబంధిత మంత్రి విశ్వరూప్ సీఎం వైఎస్‌తో చర్చించి మూడు మండలాలకు నాలుగు తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆమోదముద్ర వేశారు. ఫలితంగా ఆ రోజు పట్టణంలోని 54 వేల మంది జనాభా, 60 గ్రామాల్లోని 2.30 లక్షల జనాభా దాహార్తి తీరుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి వారధిగా నామకరణం చేయాలి జాతీయ రహదారిలో అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాలను కలుపుతూ నిర్మించిన బోడసకుర్రు వారధి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే వచ్చింది. అందుకే ఆ వారధికి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని వల్ల అమలాపురం ప్రాంతానికి, రాజోలు దీవికి మధ్య దూరాభారం కూడా తగ్గింది. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే వారధి నిర్మాణం జరిగింది. – దొమ్మేటి శివస్వామి, బోడసకుర్రు, అల్లవరం మండలం స్వచ్ఛమైన నీరు తాగుతున్నాం ఉప్పలగుప్తం మండలంలో రోజూ స్వచ్ఛమైన నీరు తాగుతున్నాం. గతంలో కలుషిత నీరును కాచుకుని తాగేవాళ్లం. భీమనపల్లి, కూనవరం గ్రామాల్లో నిర్మించిన తాగునీటి స్కీముల వల్ల ఇప్పుడు తాగునీటి సమస్యలే లేవు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి మా మండలానికి మంజూరు చేసిన రెండు తాగునీటి స్కీముల వల్లే ఈ రోజు మేమంతా మంచి నీరు తాగుతున్నాం. అప్పట్లో మా ఎమ్మెల్యే, మంత్రి విశ్వరూప్ ఈ స్కీములు మంజూరు చేసి మా ఇబ్బందులు తొలగించారు. – సూదా ఉమాపార్వతి, గృహిణి,వాడపర్రు, ఉప్పలగుప్తం మండలం బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య వైనతేయ నదిపై నిర్మించిన వారధి -
దాహార్తి తీర్చిన అపర భగీరథుడు !
సాక్షి, దాచేపల్లి: అది పల్నాడు ప్రాంతం. అందునా దాచేపల్లి మండలం. సిమెంటు, సున్నం కంపెనీలు, క్వారీలకు ప్రసిద్ధి చెందిన ఏరియాగా గుర్తింపు ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఒకప్పుడు గుక్కెడు నీరు దొరక్క దాహార్తితో అలమటించే వారు. బిందెడు నీటి కోసం నానా పాట్లు పడేవారు. నీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చి ప్రజలు కకావికలం అవుతున్న తరుణంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అపర భగీరథుడిగా నిలిచి ఈ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చారు. దాహంతో అలమటిస్తున్న ప్రజల గొంతులు తడిపారు. శాశ్వత ప్రాతిపదికన నీటి సమస్య లేకుండా చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఫ్లోరైడ్ నీరు తాగుతూ రోగాల బారిన పడుతున్న ప్రజలకు సురక్షితమైన కృష్ణమ్మ నీటిని అందించి ఎంతో మేలు చేశారు. పరవళ్లు తొక్కిన కృష్ణమ్మ.... అపర భగీరథుడిగా పేరొందిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇంటింటికి కృష్ణమ్మను పరవళ్లు తొక్కించారు. చెంతనే కృష్ణమ్మ ఉన్న గుక్కెడు నీరు అందని పరిస్థితిలో ప్రజల దాహార్తిని తీర్చి ప్రజల పాలిట ఆపద్బాంధవుడిగా వెలుగొందారు. మహానేత స్వర్ణయుగంలో గురజాల నియోజకవర్గంలోని శ్రీనగర్, గామాలపాడు, పొందుగల, రామాపురం, శ్రీనివాసరావు, ఆంధ్రా సిమెంట్స్ పరిశ్రమ కాలనీ, దాచేపల్లి, నడికుడి, ఇరికేపల్లి, తంగెడ గ్రామాల ప్రజలు మహానేత పుణ్యమని కృష్ణానది నీటిని తాగుతున్నారు. సుమారుగా రూ.10 కోట్ల వ్యయంతో శ్రీనగర్, పొందుగల, దాచేపల్లి, ఇరికేపల్లి, తంగెడ గ్రామాల్లో సురక్షిత మంచినీటి పైలెట్ ప్రాజెక్ట్‌లను నిర్మించి ప్రజలకు పుష్కలంగా కృష్ణానది నీటిని అందిస్తున్నారు. అంతకు ముందు కలుషితమైన నీటిని తాగి రోగాలబారిన పడే ప్రజలు వైఎస్సార్ చొరవతో స్వచ్ఛమైన కృష్ణానది నీటిని తాగుతున్నారు. మనస్సున్న మారాజు వైఎస్సార్ ... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజేశేఖర్‌రెడ్డిని గురజాల నియోజకవర్గ ప్రజలు మనస్సున్న మారాజుగా ఆరాధిస్తుంటారు. వైఎస్సార్ సీఎం అయిన తరువాత అప్పటి గురజాల శాసనసభ్యుడు జంగా కృష్ణమూర్తి నియోజకవర్గంలో తాగునీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి పైలెట్ ప్రాజెక్ట్‌లు నిర్మించి వాటి ద్వారా సురక్షిత కృష్ణానది నీటిని ఇంటింటికి తరలించాలని కోరారు. దీంతో శ్రీనగర్, దాచేపల్లి, తంగెడ గ్రామాల్లో సురక్షిత మంచినీటి పైలెట్ ప్రాజెక్ట్‌ల నిర్మించేందుకు వైఎస్సార్ రూ.10 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం పనులు వేగవంతం పూర్తి చేశారు. దీంతో 2006 ఏప్రిల్ 16వ తేదిన శ్రీనగర్ గ్రామంలో జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ జంగాతో కలిసి శ్రీనగర్‌లో నిర్మించిన సురక్షిత మంచినీటి పైలెట్ ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. దీంతో శ్రీనగర్, గామాలపాడు, నడికుడి, ఇరికేపల్లి, దాచేపల్లి, పొందుగల గ్రామాల ప్రజలు కృష్ణానది నీటిని తాగుతున్నారు. తంగెడలో నిర్మించిన తాగునీటి పైలెట్ ప్రాజెక్ట్‌ను అప్పటి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. రైతుల కోరిక మేరకు విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు... శ్రీనగర్‌లో జరిగిన ప్రజాపథంలో పాల్గొన్న రైతులు దండివాగు ఎత్తిపోతల పథకంకు కరెంట్ సరఫరా సక్రమంగా లేకపోవటం వల్ల పంటలకు సాగునీరు అందటంలేదని, కరెంట్ సక్రమంగా ఇస్తే రెండు పంటలు పండుతాయని సీఎం వైఎస్సార్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తక్షణమే స్పందించిన వైఎస్సార్ మరొక ఆలోచన లేకుండా అక్కడికక్కడే 33/11 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి దండివాగు ఎత్తిపోతల పథకంకు 18 గంటల కరెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రూ.1.50 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్ కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో పూర్తి చేసి జంగా చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణంతో దండివాగుకు 18 గంటల నాణ్యమైన కరెంట్తోపాటుగా శ్రీనగర్‌కు 24 గంటల కరెంట్‌ను ఇస్తున్నారు. సబ్‌స్టేషన్ నిర్మాణంతో రెండు వేలకుపైగా ఎకరాల్లో రైతులు రెండు పంటలను సాగు చేసుకుంటున్నారు. కృష్ణానది నీరు ఇంటింటికి వస్తుండటం వల్ల ఫ్లోరిన్ ప్రభావం నుంచి ప్రజలు తప్పించుకున్నారు. వైఎస్సార్ చేసిన ఈ మంచి పనులను ప్రజలు ఇప్పటికి గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్ తనయుడు జగన్ సీఎం అయితే మళ్లీ అటువంటి పథకాలు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారు. -
పేదల పెన్నిధి.. ఉద్యోగాల సారథి
సాక్షి, పులివెందుల : పేదల పెన్నిధి.. ఉద్యోగాల సారధిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచారు. ఒకరు ఉద్యోగం చేసినా.. ఆ కుటుంబం బాగుపడుతుందనే ఆశయంతో ఆయన పని చేశారు. ఇందులో భాగంగా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పులివెందులలో 2008న డిసెంబర్ 25న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. దాదాపు 32 ఎకరాల్లో రూ.11 కోట్లతో భవనాలు ఏర్పాటు చేయించారు. పులివెందుల ప్రాంతంలో నిరుద్యోగ సమస్యలు ఉండకూడదనే లక్ష్యంతో నాక్ అకాడమీని నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాక్ అకాడమీలో 3,600 మందికి శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 2008 నుంచి 2019 వరకు ఫ్లంబర్, పెయింటింగ్, సర్వేయర్, ఎలక్ట్రికల్ కోర్సులలో వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చారు. 2013–14లో నాక్ అకాడమీలో 1984 మందికి 2014–14లో 1284 మందికి, 2015–16లో 1327 మందికి, 2016–17లో 550 మందికి, 2017–18లో 398 మందికి, 2018–19లో 75 మందికి శిక్షణ ఇచ్చారు. కుట్టు మిషన్ల పంపిణీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాక్ అకాడమీ ద్వారా నియోజకవర్గంలోని మహిళలకు శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తయిన తర్వాత వారికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం నాక్ అకాడమీలో శిక్షణ కార్యక్రమాన్ని తీసివేశారు. నిరుద్యోగ సమస్య ఉండకూడదనే.. జిల్లాలో నిరుద్యోగ సమస్య ఉండకూడదనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందులలో నాక్ అకాడమీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా చాలా మంది నిరుపేదలకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. నాక్‌లో మూడు నెలల పాటు శిక్షణతోపాటు ఉచితంగా భోజన సౌకర్యం కల్పించారు. – జీవయ్య (నాక్ శిక్షకుడు), పులివెందుల వైఎస్ మా పాలిట దేవుడు దివంగత సీఎం వైఎస్ ఆర్ పేదల పాలిట దేవుడు. ఆయన చొరవతోనే పులివెందుల ప్రాంతంలో నాక్ భవనం ఏర్పాటు చేశారు. ఈ అకాడమీ ఏర్పాటు చేయకపోతే ఎందరో నిరుద్యోగులు రోడ్లపై ఉండేవారు. అకాడమీ ఏర్పాటు వల్ల ఇప్పుడు చాలా మంది వివిధ ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. – జాకీర్(నాక్‌లో శిక్షకుడు), వేంపల్లె -
మంచి జీవితం నవరత్నాలతోనే సాధ్యం ..
సాక్షి, పెళ్లకూరు: చంద్రబాబు నిరంకుశ పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల అధికారాలను తుంగలో తొక్కి ‘జన్మభూమి కమిటీలు’ ఏర్పాటుచేసి నిధులను టీడీపీ నేతలు స్వాహా చేసేలా చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేశారు. సంక్షేమం పేరుతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అర్హుల చెంతకు చేరలేదు. తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి పాలన చూసిన ప్రజలు ‘మార్పు’ కోరుకుంటున్నారు. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు భరోసా కల్పిస్తున్నాయి. జగన్ సీఎం అయితే ప్రతి ఇంట ఆనందం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. రూ.40 వేలు రుణమాఫీ అయింది.. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పంటపై తీసుకున్న రుణం రూ.40 వేలు ఒకే దఫా రుణమాఫీ జరిగింది. చంద్రబాబునాయుడిని నమ్మి నిండా మునిగాం. ఆయన రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు. బ్యాంక్ నుంచి నోటీసులు రావడంతో రుణాన్ని విడతల వారీగా చెల్లించాల్సి వచ్చింది. వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచే వ్యక్తి జగన్. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతుల కష్టాలు తీరిపోతాయి. – కొండా చిన్నఅంకయ్య, రైతు, తల్లంపాడు గ్రామం నిరుద్యోగ సమస్య ఉండదు.. వైఎస్సార్ హయాంలో సెజ్ భూముల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అధికారంలోకి వస్తే జగన్మోహన్రెడ్డి పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా బిల్లు తెస్తామన్నారు. దీంతో నిరుద్యోగ సమస్య ఉండదు. జగన్‌పై నమ్మకం ఉంది. – పి.సుబ్బలక్ష్మి, ఎగువచావలి న్యాయం జరుగుతుంది.. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేసి అన్నివర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆయన ఇచ్చిన మాటపై నిలబడతారు. – ఎ.రామకృష్ణ, గోమతి గార్డెన్, తాళ్వాయిపాడు రైతులు రారాజుల్లా బతుకుతారు వైఎస్సార్ రైతు భరోసాతో రైతులందరూ రారాజుల్లా బతుకుతారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పడంతో అన్నదాతలకు భవిష్యత్‌పై భరోసా ఏర్పడింది. – రఘునాయుడు, పెళ్లకూరు మిట్ట పేదలకు కార్పొరేట్ వైద్యం వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చేస్తామని జగన్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ బాగా అమలవుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పెన్షన్ అందించి జగనన్న ఆదుకుంటారు. – పోలంరెడ్డి శ్రీదేవి, నెలబల్లి -
వైఎస్సార్‌తో వైవీయుకు విశ్వఖ్యాతి..
సాక్షి, వైఎస్సార్ : కరువు సీమలోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న తలంపుతో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయం విశ్వఖ్యాతిని చాటి చెబుతోంది. 2006 మార్చి 9న పీజీ కేంద్రం నుంచి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెంది నేడు 29 కోర్సులతో విలసిల్లుతోంది. దాదాపు 1500 మందికి పైగా విద్యార్థులు 115 మంది అధ్యాపక బృందం, 150 మంది పైగా పరిశోధక విద్యార్థులతో ప్రగతి పథంలో దూసుకువెళ్తోంది. 1977 నవంబర్ 20న తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కడప నగరానికి సమీపంలో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2006లో 652 ఎకరాల్లో విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. వైఎస్ఆర్ హయాంలో విశ్వవిద్యాలయానికి 100 కోట్లకు పైగా నిధుల వరద పారింది. ఇందులో భాగంగా 2008లో ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైంది. అనంతరం వైవీయూకు 12బీ, నాక్ బి గ్రేడ్, ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ర్యాంకింగ్ వంటి గుర్తింపుతోపాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, యంగ్ సైంటిస్టు అవార్డులను విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం సొంతం చేసుకున్నారు. ఆయన స్వహస్తాలతో ప్రారంభించిన విశ్వవిద్యాలయం నేడు ఎందరికో ఉన్నతవిద్య, ఉపాధిని కల్పిస్తూ రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. కాగా వైఎస్ఆర్ మరణానంతరం పాలకులు విశ్వవిద్యాలయం పట్ల వివక్షతను చూపడంతో విశ్వవిద్యాలయంలో నిలిచిన నిర్మాణాలు నేటికీ అదే విధంగా మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. రానున్న రోజుల్లో.. రాజన్న తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో విశ్వవిద్యాలయం మరింత ప్రగతి సాధిస్తుందని.. ఆ సువర్ణకాలం మరికొన్ని రోజుల్లోనే తిరిగి వస్తుందని పలువురు విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశోధనలు చేసే అవకాశం లభించింది కడపలో యోగివేమన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వల్లనే ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేసే అవకాశం లభిస్తోంది. వైఎస్ఆర్ ఇక్కడ వైవీయూ ఏర్పాటు చేయకపోయి ఉంటే పొరుగు జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఆయన చలువతో నేడు వైవీయూలో పరిశోధనలు చేయగలుగుతున్నాం. – పి.రోజారాణి, మైక్రోబయాలజీ విద్యార్థిని కరువు ప్రాంతంలో కల్పవృక్షం వైవీయూ కరువు ప్రాంతమైన కడప గడపలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడమే ఒక గొప్ప విషయం. ఈ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిందంటే.. అది ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తీసుకున్న చొరవే కారణం. – డాక్టర్ కె.శృతి, వైవీయూ పరిశోధకురాలు గొప్ప అవకాశం లభించింది జిల్లాలో ప్రసిద్ధ తత్వవేత్త వేమన పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జిల్లా వాసులుగా మనందరి అదృష్టం. వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వల్లే.. ప్రస్తుతం ఉన్నత విద్యను చదవడంతోపాటు పరిశోధనలు చేసే అవకాశం లభించింది. – ఎం. పావని, రాజంపేట, ఫిజిక్స్ స్కాలర్, వైవీయూ -
జల దీవెన @ మరపురాని పాలన
సాక్షి, ఆమదాలవలస(శ్రీకాకుళం): అది 2004వ సంవత్సరం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తూ జిల్లాకు వచ్చారు. ఇక్కడ రైతుల పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఆయన చలించిపోయారు. అన్నపూర్ణగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో సాగునీరు అందక పంటలు పండడం లేదనే విషయాన్ని రైతుల నుంచి తెలుసుకున్నారు. అప్పుడే రైతులకు భరోసా ఇచ్చారు. మంచి రోజులు వస్తాయి, రైతన్న కల నెరవేరుతుందని చెప్పారు. అన్నట్టుగానే వంశధార కుడికాలువకు అనుసంధానంగా వయోడెక్ట్‌ను నిర్మించి వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేశారు. డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2007లో ఆమదాలవలస మండలం తాండ్రసిమెట్ట వద్ద వంశధార కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా ఆక్విడెక్ట్(వయోడెక్ట్)ను ప్రారంభించారు. ఈ సాగునీటి కాలువ నిర్మాణం లేక ముందు రెండు మండలాల్లో పంటపొలాలకు సాగునీరు అందక బీడు భూములుగా ఉండేవి. ఆసియాలోనే మొదటిసారిగా.. వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో వంశధార కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా ఆక్విడెక్ట్ నిర్మాణం చేశారు. ఈ నిర్మాణం వల్ల ఆమదాలవలస, శ్రీకాకుళం మండలాల్లో 32 వేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. ఈ ఆక్విడెక్ట్ నిర్మాణం కూడా ఆసియా ఖండంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతంలోనే నిర్మించారు. ఆక్విడెక్ట్ నిర్మించే సమయంలో రైల్వే ట్రాక్ అడ్డంగా ఉంటే రైల్వే రాకపోకలకు అంతరాయం కలుగకుండా భూమిలోపల నుంచి సాగునీటి కాలువను నిర్మించారు. రైల్వేట్రాక్‌కు మధ్యలో ఉన్న ఈ ఆక్విడెక్ట్ నిర్మాణాన్ని సందర్శించేందుకు చాలా మంది టూరిస్ట్‌లు ఇక్కడకు వస్తుం టారు. రెండు మండలాలకు సాగునీటిని అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. వేలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని రైతులు చెబుతున్నారు. సాగునీటి రంగానికి పెద్దపీట వైఎస్సార్ హయాంలో సాగునీటి రం గానికి పెద్ద పీట వేయడంతో ప్రస్తుతం ఇప్పుడు వేలాది ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. సాగునీరు అందక పంటపొలాలు బీడు భూములుగా మారుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వయోడెక్ట్ నిర్మాణం చేపట్టి 32 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. దీంతో పాటు చింతాడ గ్రామం వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి మెట్ట ప్రాంతాలకు కూడా సాగునీరు అందించిన ఘనతను దక్కించుకున్నారు. – బోర చిన్నంనాయుడు, రైతు, చింతాడ, ఆమదాలవలస -
సొంతిల్లు సాకారం పెద్దాయన చలవే..
సాక్షి, మండపేట: ప్రతి పేదవాడూ కలలు కనేది సొంతింటి కోసమే. తన సొంత ఇంటిలో ప్రశాంతంగా జీవించాలని సంబరపడుతుంటారు. అధికారంలోకి వచ్చిందే తడవు పేదల కలను సాకారం చేసి చూపించారు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. పేదవర్గాల వారి అద్దె ఇంటి వెతలు తీర్చేందుకు ఇందిరమ్మ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేశారు. మూడు విడతలుగా అమలుచేసే ఈ పథకానికి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. మూడేళ్లలో జిల్లాకు 2,14,205 ఇళ్లను మంజూరు చేసిన వైఎస్ దాదాపు రూ.743.96 కోట్లు విడుదల చేశారు. వైఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన ఇందిరమ్మ పథకాన్ని 2006 ఏప్రిల్ 1వ తేదీన కపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రిక నుంచే ప్రారంభించారు. అప్పటి వరకు అర్బన్ ప్రాంతాల్లో రూ.30 వేలు, రూరల్ ప్రాంతాల్లో రూ.22,500 ఉన్న గృహనిర్మాణ సాయాన్ని పెరిగిన ధరలకు అనుగుణంగా అర్బన్‌లో రూ.55 వేలు, రూరల్‌లో రూ.45 వేలకు పెంచారు. అలాగే ఎస్సీలకు ఇచ్చే సాయాన్ని అర్బన్‌లో రూ.75 వేలు, రూరల్‌లో రూ.65 వేలకు పెంచారు. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సొంత స్థలాలు లేని పేదవర్గాల కోసం కోట్లాది రూపాయల వ్యయంతో జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలు సేకరించారు. ఇందిరమ్మ మూడు దశల్లో భాగంగా స్థలాలు మెరక పనులు చేసి లబ్ధిదారులకు అప్పగించడంతో పాటు గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేశారు. మూడు విడతల్లోను మొత్తం జిల్లాకు 2,14,205 ఇళ్లను మంజూరు చేశారు. అందుకోసం సుమారు రూ.743.96 కోట్లు విడుదల చేశారు. పేదవర్గాల వారి సొంతింటి కలను సాకారం చేస్తూ వీటిలో సుమారు 1.95 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. మండపేటలో దాదాపు 4,500 మంది పేదవర్గాల వారికి పంపిణీ చేసేందుకు స్థానిక గొల్లపుంత ప్రాంతంలో రెండు విడతలుగా రూ.18.14 కోట్లతో 122.72 ఎకరాలు సేకరించారు. పేదల సొంతింటి కోసం రాష్ట్రంలోనే ఇది రెండో అతి పెద్ద స్థల సేకరణ కావడం గమనార్హం. తొలి విడతలో సేకరించిన 55.77 ఎకరాల్లో మెరక పనులు పూర్తి కాగా ఒక్కొక్కరికీ సెంటున్నర చొప్పున 2009 ఫిబ్రవరి 27న పట్టాల పంపిణీని వైఎస్ ప్రారంభించారు. 1979 ప్లాట్లుగా విభజించి లబ్ధిదారులకు అప్పగించారు. వీటిలో 1834 మందికి గృహనిర్మాణ రుణాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 1200కు పైగా ఇళ్లు పూర్తయ్యాయి. పేదల సొంతింటి కలను సాకారం చేయడం ద్వారా వారి గుండె గూటిలో గూడు కట్టుకున్నారు వైఎస్. పేదల సొంతింటి కలను సాకారం చేసిన దివంగత వైఎస్ దివికేగి ఏళ్లు గడుస్తున్నా పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పక్కా ఇళ్లకు ‘చంద్ర’గ్రహణం పేదల పక్కా ఇళ్లకు నేడు చంద్రగ్రహణం పట్టింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు ఎన్టీఆర్ గృహనిర్మాణం పేరిట పక్కా ఇళ్ల నిర్మాణానికి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. 2016–17, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు జిల్లాకు కేవలం 64,647 ఇళ్లు మంజూరు చేయడం పేదల పక్కా ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. రూ.1.5 లక్షల ఆర్థిక సాయమంటూ మూడేళ్లలో ఆయా ఇళ్లకు కేటాయించింది రూ.594.75 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. నిర్మాణంలో ఉన్నవి, నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు రూ. వంద కోట్లకు పైగా బిల్లుల చెల్లింపులు చేయాల్సి ఉన్నట్టు అంచనా. మూడేళ్లలో... మంజూరైన ఇళ్లు నిధులు నిర్మాణం పూర్తయినవి నిర్మాణంలో ఉన్నవి వైఎస్ హయాంలో.. 2,14,205 రూ. 743.96 కోట్లు 1,99,890 14,315 చంద్రబాబు హయాంలో.. 64,647 రూ. 594.75 కోట్లు 46,614 11,998 -
బుడ్డా రాజశేఖర్ రెడ్డి అ‘రాజ’క పాలన ఇంకెన్నాళ్లు..
సాక్షి, ఆత్మకూరు రూరల్: ఎన్నికలు మళ్లీ వచ్చాయి.. మైకుల రొదలు మొదలయ్యాయి.. అవి చేస్తాం..ఇవి చేస్తాం..అడిగినవన్నీ చేస్తాం.. ఎన్నెన్నో హామీలు..అంతటా వాగ్దానాలు గతాన్ని పరికిస్తే..పాలనను విశ్లేషిస్తే.. శ్రీశైల ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అ‘రాజ’క పాలన కళ్ల ముందు కదలాడుతుంది. నీళ్లివ్వకుండా ఆయన చేసిన దాష్టీకం మరవబోమని రైతులోకం మండిపడుతోంది. సిద్ధాపురం..జిల్లాలోనే అతిపెద్ద చెరువు. వర్షాలు పడక నిండేది కాదు. ఎత్తిపోతలతో దీనికి జీవ కల తీసుకురావాలన్నది రైతుల ఆకాంక్ష. ఎందరో ముఖ్యమంత్రులు చేతులెత్తేయగా..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పూనికతో ఈ ప్రాజెక్ట్ సాకరమైంది. వైఎస్సార్ పాలనలో 80 శాతం పనులు పూర్తికాగా..మిగిలిన 20 శాతం టీడీపీ ప్రభుత్వ పూర్తి చేయలేకపోయింది. కాల్వలు, ప్రధాన రహదారుల కల్వర్టులు పూర్తి కాకుండానే గతేడాది జనవరి 7న ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రారంభోత్సవం చేశారు. ఆయకట్టు రైతులకు 2018లో రబీకి నీరందిస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయకట్టులోని అన్ని గ్రామాల నుంచి సాగు నీటి కోసం డిమాండ్ పెరగడంతో బుడ్డా..తమ రాజకీయాలకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. అందరికీ నీరందించేందుకు శ్రమిస్తున్నట్లు డ్రామాలాడారు. అయితే నీరు లేకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. పైగా కాల్వలపై తిరుగుతూ రైతులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే పెద్దనంతాపురం గ్రామానికి చెందిన ఇద్దరు, సిద్ధపల్లెకు చెందిన మరో రైతుపై టీడీపీ నాయకులు భౌతిక దాడులకు దిగారు. ఇదీ వైఫల్యం.. శ్రీశైలంలో 200 టీఎంసీలు, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 16 టీఎంసీల నీరున్నపుడు ఖరీఫ్‌కు అనుమతి లేదంటూ అధికారులు ఎత్తిపోతల మోటార్లను ఆన్ చేయలేదు. ఆన్ చేయించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించనూ లేదు. అరకొర నీటికోసం ఆయకట్టు గ్రామాల నడుమ జలయుద్ధాలు మొదలయ్యాయి. టీడీపీ నాయకులు మాత్రం చేయాల్సింది చేయకుండా కాల్వల వెంట పచార్లు చేస్తూ రైతులపై దాడులు చేస్తూ వచ్చారు. సిద్ధాపురం..జిల్లాలోనే అతిపెద్ద చెరువు. వర్షాలు పడక నిండేది కాదు. ఎత్తిపోతలతో దీనికి జీవ కల తీసుకురావాలన్నది రైతుల ఆకాంక్ష. ఎందరో ముఖ్యమంత్రులు చేతులెత్తేయగా..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పూనికతో ఈ ప్రాజెక్ట్ సాకరమైంది. వైఎస్సార్ పాలనలో 80 శాతం పనులు పూర్తికాగా..మిగిలిన 20 శాతం టీడీపీ ప్రభుత్వ పూర్తి చేయలేకపోయింది. కాల్వలు, ప్రధాన రహదారుల కల్వర్టులు పూర్తి కాకుండానే గతేడాది జనవరి 7న ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రారంభోత్సవం చేశారు. ఆయకట్టు రైతులకు 2018లో రబీకి నీరందిస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయకట్టులోని అన్ని గ్రామాల నుంచి సాగు నీటి కోసం డిమాండ్ పెరగడంతో బుడ్డా..తమ రాజకీయాలకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. అందరికీ నీరందించేందుకు శ్రమిస్తున్నట్లు డ్రామాలాడారు. అయితే నీరు లేకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. పైగా కాల్వలపై తిరుగుతూ రైతులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే పెద్దనంతాపురం గ్రామానికి చెందిన ఇద్దరు, సిద్ధపల్లెకు చెందిన మరో రైతుపై టీడీపీ నాయకులు భౌతిక దాడులకు దిగారు. నీటి కోసం పోరాటం చేశాం సిద్ధాపురం చెరువుకు నీళ్లు వస్తున్నాయి..ఇక కరువు ఉండదనుకున్నాం. చెరువుకు నీరు తీసుకురావడంలో అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారు. ఉన్న నీటికోసం పోరాటాలు చేయాల్సి వచ్చింది. చివరకు పైర్లు ఎండే పోయాయి. –ద్రోణారెడ్డి , రైతు, నల్లకాల్వ పంట కాల్వలు పూర్తి చేయండి పనులు పూర్తి కాకుండానే ప్రారంభించేసి తెలుగు దేశం నాయకులు లబ్ధి పొందాలనుకున్నారు. ప్రధాన కాల్వలే ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. పంటకాల్వల సంగతి అతీ గతీ లేదు. –లక్ష్మన్న, రైతు, కరివేన -
అభివృద్ధా..? అదెక్కడా..: వీర రాఘవరెడ్డి
సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతోంది. జిల్లాలో అభివృద్ధి ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. కేవలం ఓట్లు, సీట్లు ఆధారంగా ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తున్నారు తప్ప ఇక్కడ చెప్పుకునేంత అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. చివరకు అంతా అభివృద్ధి జరిగిన హైదరాబాదును వదులుకొని విజయవాడకు వచ్చినా.. చంద్రబాబు తెలిసి చేస్తున్నాడో...తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ. మళ్లీ అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను బాబు పూర్తిగా విస్మరించారు. ఐదేళ్లుగా అధికారంలో ఉన్నా ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోకుండా చివరి క్షణంలో బయటికి వచ్చి వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు టెంకాయ శంకుస్థాపన చేశారు. పట్టిసీమ నుంచి అధికారికంగా ఒక్క టీఎంసీ నీటిని కూడా నికర జలాలుగా తీసుకొచ్చిన చరిత్ర కనిపించడం లేదు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా.. చివరకు బెంచ్‌ను కూడా ఏర్పాటు చేయకపోవడం విచారకరం. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో దాదాపు 80 శాతానికి పైగా ప్రాజెక్టుల పనులు పూర్తయినా కేవలం 20 శాతం పనులు చేయడానికి కూడా ప్రభుత్వానికి మనసు రాలేదు.. అని పేర్కొన్నారు కడప బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, న్యాయవాదుల సీమ జేఏసీ మాజీ కన్వీనర్ వీరరాఘవరెడ్డి. గత ఐదేళ్ల చంద్రబాబు పాలన తీరుపై న ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. సాక్షి : రాయలసీమకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు వైఎస్సార్, చంద్రబాబు పరిపాలించారు. వీరి పరిపాలనలో మీరు చూసిన లోటుపాట్లు, అభివృద్ధి గురించి ఏమంటారు? వీర రాఘవరెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనలోగానీ, అభివృద్ధిలోగానీ వైఎస్సార్‌తో చంద్రబాబును పోలిస్తే నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. వైఎస్సార్ అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తూ వచ్చారు. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమం అందుతూ వచ్చింది. అంతెందుకు గాలేరు–నగరి, హంద్రీ–నీవా లాంటి పెద్ద ప్రాజెక్టులకు ఎప్పుడో పునాది రాయి వేస్తూ వైఎస్సార్ హయాంలో 80 శాతానికి పైగా పూర్తి చేసినా, ఆయన మరణం తర్వాత వచ్చిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విస్మరించాయి. గండికోట టన్నెల్ చరిత్రలోనే ఓ అద్భుతం. సాక్షి : ‘సీమ’లోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో వైఎస్సార్ జిల్లా ఒకటి. ఈ ఐదేళ్లలో టీడీపీ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందని భావిస్తున్నారు? వీర రాఘవరెడ్డి : వైఎస్సార్ జిల్లాలో అభివృద్ధే లేదు. అంతా ఓట్లు, సీట్లు ఆధారంగానే జరుగుతోంది. సీఎం బహిరంగంగానే ఎన్నోసార్లు సభలు, సమావేశాల్లో మీరు ఓట్లు వేయకున్నా అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రానికి అంతటికీ సీఎం అయినప్పుడు వైఎస్సార్ జిల్లాకు కూడా ఆయన ముఖ్యమంత్రే. కానీ అలాంటివన్నీ మరిచిపోయి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు లేకుండా ముందుకు వెళ్లారు. ఐదేళ్లు టీడీపీ హయాంలో జిల్లాకు ఒరిగింది శూన్యమే. సాక్షి : ఎన్నికలకు ముందు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేయడంపై మీరెమంటారు? వీర రాఘవరెడ్డి : కడప ఉక్కు–రాయలసీమ హక్కు అని 2014 నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. వామపక్షాలతోపాటు ఆర్సీపీ, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, ప్రజా సంఘాలు, ఉక్కు సాధన సమితి ఇలా అందరూ వచ్చి ఉద్యమంలో పాల్గొంటూ కేంద్రంపై పోరాటం చేశారు. ఒక్క అధికార పార్టీ నాయకులు మాత్రం ఆందోళనలకు రాలేదు. పైగా నాలుగున్నరేళ్ల తర్వాత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఉద్యమం పేరుతో టీడీపీ ముందుకు వచ్చింది. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన టీడీపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఒక ప్రణాళిక లేకుండా ముందుకు వెళుతూ అందరినీ విస్మరించడంతోనే సమస్య ఏర్పడింది. చివరగా ఏమీ చేయలేక...కేంద్రంపై పోరాడలేక ప్రజల్లో సానుభూతి కోసం...వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఉక్కుకు టెంకాయ శంకుస్థాపన చేశారు. అంతేతప్ప అది అయ్యేది కాదు...పోయేది కాదు...ఏదైనా ప్రభుత్వరంగ సంస్థ ఉంటేనే ఉక్కు ద్వారా పలువురికి ప్రయోజనం. సాక్షి : అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం లేదు. హైకోర్టు సీమలో ఏర్పాటు చేయాలని ఉద్యమించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కదా? వీర రాఘవరెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరూ సీఎంలు రాజధాని హైదరాబాదును బాగా అభివృద్ధి చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రధాన నగరాలు లేక రాజధానికి కూడా ఇబ్బందులు పడిన పరిస్థితులు చూశాం. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నా చంద్రబాబులో మార్పు కనిపించడం లేదు. తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తెలియదుగానీ మళ్లీ రాజధాని ప్రాంతంలోనే అభివృద్ధి చేస్తున్నారు. ఒకప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పినా ప్రస్తుతం పట్టించుకోలేదు. శ్రీబాగ్ ఒడంబడికతోపాటు వికేంద్రీకరణలో భాగంగా సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున న్యాయవాదులంతా ఉద్యమించినా మళ్లీ రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. చివరికి హైకోర్టు బెంచ్ విషయంలో కూడా ప్రకటనలు చేస్తున్నారేగానీ స్పష్టత లేదు. సాక్షి : న్యాయవాదుల సంక్షేమం విషయంలోప్రభుత్వ తీరు ఎలా ఉంది? వీర రాఘవరెడ్డి : తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో అందరితోపాటు న్యాయవాదుల సంక్షేమానికి అనేక హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబుకు హామీలు నెరవేర్చాలన్న ఆలోచన లేదు. జూనియర్ న్యాయవాదులకు స్టయిఫండ్ ఇస్తామన్నారు.అదీ లేదు. ఇల్లు మంజూరు అన్నారు...అతీగతీ లేదు. హెల్త్‌కార్డులు ఇస్తామని ప్రకటించారు...అదీ కనిపించడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు లైబ్రరీలు ఏర్పాటు చేస్తామన్నారు. అదీ లేదు...ఇలా ఒక్క వర్గాన్నే కాదు....అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసింది. చంద్రబాబు చాలా అనుభవజ్ఞుడని, అన్నీ చేస్తాడనుకుంటే ఏమీ చేయలేక పోయాడు. సాక్షి : ప్రాజెక్టులు, నీటి విషయంలో జిల్లాకు ఏ మేరకు ప్రయోజనం జరిగిందని భావిస్తున్నారు? వీర రాఘవరెడ్డి : రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పుల్లో ఉన్న నేపథ్యంలో నిధుల పొదుపు పాటిస్తూ సంక్షేమానికి పెద్దపీట వేయాలి. కానీ చిన్న పనికి సంబంధించి కూడా గోరంత జరిగితే కొండంతగా ప్రచార ఆర్భాటం చేస్తూ కోట్లకు కోట్లు తగిలేస్తున్నారు? కొంతమంది అధికారులు కూడా ప్రజల సొమ్మును తీసుకుంటూ ప్రభుత్వాలకు కొమ్ము కాస్తున్నారు. ఇది కరెక్టు కాదు. వారికి అందించే జీతాలు కూడా ప్రజల సొమ్మేనని గమనించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. జిల్లాకు సంబంధించి ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్సార్ మరణం తర్వాత అన్నీ ఆగిపోయాయి. నీళ్ల విషయానికి వస్తే పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చామని గొప్పలు చెబుతున్నారు. కనీసం ఒక్క టీఎంసీ అయినా నికర జలాల కింద సీమకు కేటాయించామని చెప్పమనండి. ఎక్కడా లేదు. కేవలం ఏదో ప్రచారానికి వాడుకోవడానికి తప్ప మరొకటి కాదు. చివరకు కేంద్రంపై పోరాటానికి ధర్మ పోరాట దీక్షలు పార్టీ తరుపున చేసుకోవాలి....అలా కాకుండా కేంద్రంపై పోరాటం చేసి ప్రజల డబ్బును ఖర్చు పెట్టారు. ఎవరి సొమ్మని ఇలా పెట్టారు? ఇది క్షమించరాని నేరం. -
కూలీలను రైతులను చేసిన మహానేత
ఒక నాడు వారంతా కూలీలు. కూలి దొరికితేనే పూట గడిచేది. ఊళ్లో కూలిపనులు లేకుంటే ఇంటిల్లిపాదీ పొరుగు గ్రామాలకు వలసవెళ్లి రోజులు నెట్టుకొచ్చేవారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వారు రైతులయ్యారు. సొంత ఊరిలోనే వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు వైఎస్సార్ అని కొనియాడుతున్నారు. సాక్షి, అచ్చంపేట(పెదకూరపాడు): రైతు కూలీలను రైతులుగా చూడాలన్నదే దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం. ఆ ఆశయ సాధనలో భాగంగా అమలుచేసిన భూపంపిణీ పథకం ఎంతో మంది వ్యవసాయ కూలీలను రైతులుగా మార్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు 1,250 ఎకరాల భూమి పంపిణీ చేయడంతోపాటు, వాటిపై హక్కులూ కల్పించారు. అచ్చంపేట మండలంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను ఎస్సీ, ఎస్టీ, బీస్సీ కులాలకు చెందిన అనేక మందికి భూపంపిణీ చేశారు. అప్పటిదాకా కూలీలలుగా పనిచేసిన అనేకమంది భూ యజమానులయ్యారు. అయితే నీటి వసతి లేక ఆ భూములను సాగుచేసే పరిస్థితి లేకపోవడాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తించారు. అంతే ఆ భూములను అభివృద్ధి చేసుకుని సేద్యానికి అనుకూలంగా మార్చేందుకు నిధులు సమకూర్చారు. వర్షాధార భూముల్లో ఏటా రెండు పంటలు పండించుకునేందుకు విలుగా ఇందిర ప్రభ పథకం కింద ఆ భూములో బోర్లు వేసి విద్యుత్ వసతి కల్పించారు. అప్పటి వరకూ కూలిపనులతో పొట్టపోసుకున్న కూలీలు రైతులయ్యారు. సొంత ఊరిలోనే ఏటా రెండు పంటలు సాగుచేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. తమ పిల్లలను బడులకు పంపిస్తూ వారి జీవితాలు తీర్చిదిద్దుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి 2007, 2008 సంవత్సరాల్లో భూ పంపిణీ పథకం అమలుచేశారు. అచ్చంపేట మండలంలోని మాదిపాడు, తాడువాయి, చల్లగరిగ గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ బీసీ కులాలకు చెందిన 614 మందికి ఒక్కొక్కరికి రెండు ఎకరాల చొప్పున 1,228 ఎకరాలను మూడు విడతల్లో పంపిణీ చేశారు. తాడువాయి, మాదిపాడు, చల్లగరిగ తదితర గ్రామాల రైతులకు భూములు పంపిణీచేసి రుణాలు పొందేందుకు వీలుగా హక్కులు సైతం కల్పించారు. పంపిణీ చేసిన భూములను అభివృద్ధి చేసేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అవకాశం కల్పించారు. ఎవరి పొలాలను వారే అభివృద్ధి చేసుకునేందుకు రోజుకు రూ.100 చొప్పున కూలి కూడా వచ్చేలా చర్యలు చేపట్టారు. ఇచ్చిన భూములన్నీ వర్షాధారం కావడంతో, భారీ పెట్టుబడులు పెట్టి పంటలు వేస్తే, వర్షాలు పడకపోతే ఈ నిరుపేద రైతుల పరిస్థితి ఏమిటా అని ఆలోచించారు. ఇందిరప్రభ పథకం ద్వారా ప్రభుత్వమే ఉచింతంగా ఆ భూముల్లో విద్యుత్ లైన్లు వేయించి, బోర్లు కూడా మంజూరు చేశారు. భూమి పొందిన ప్రతి రైతుకు సబ్మెర్సిబుల్ వ్యవయసాయ విద్యుత్ మోటార్లు ఇచ్చి, ఉచిత విద్యుత్ సరఫరా చేయించారు. ఆ మహానేత పుణ్యమా అని కూలలీలుగా చాలీచాలని సంపాదనతో జీవనం కొనసాగంచే ఆ బడుగు జీవులు ఇప్పుడు పత్తి, మిర్చి, జనుము, కూరగాయలు సాగుచేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. ఆ మహానేత చలువే.... మహానేత వైఎస్సార్ చలువ వల్ల నాకు పొలం సమకూరింది. మా ప్రాంతంలో వర్షం పడితేనే పంటలు పండుతాయి. నీటి వసతి లేకపోవడంతో తమకు పంచిన భూములను చాలా కాలం అలానే ఉంచాం. ఈ పరిస్థితిని గమనించిన వైఎస్సార్ ఆ భూముల్లో బోర్లు వేయించారు. విద్యుత్ కనక్షన్లు కూడా ఇప్పించారు. ఇప్పుడు పత్తి సాగుచేసుకుని హాయిగా జీవిస్తున్నాం. – చిట్యాల యేసోబు, ఎస్సీ రైతు, మాదిపాడు జన్మజన్మలకు రుణపడి ఉంటాం కూలీలుగా చాలీచాలని సంపాదనతో జీవితం కొనసాగించే మాకు మహానేత భూమి ఇచ్చి దారి చూపించాడు. అందుకు జన్మజన్మకు ఆ మహానేతకు రుణపడి ఉంటాం. ఇంటిల్లిపాదిమి కష్టపడి ఆ భూమిని బాగుచేసుకున్నాం. ఏటా మిర్చి పంట సాగుచేసుకుని వచ్చే ఆదాయంతో వేళకు ఇంత తింటూ హాయిగా జీవిస్తున్నాం. – బంకా దాసు, రైతు, మాదిపాడు -
చంద్రబాబు చెయ్యేస్తే.. ఎట్లా ఉంటాదో.. తెలుసా..
సాక్షి, ప్రొద్దుటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు చెయ్యేస్తే.. ఎట్లా ఉంటాదో.. తెలుసా.. కళకళలాడుతున్న పరిశ్రమలు మూతపడిపోతాయి. సంతోషంగా సాగుతున్న జీవితం రోడ్డు పాలవుతుంది. ఇందుకు నిదర్శనం ప్రొద్దుటూరు పాల పదార్థాల కర్మాగారం.. అందులో పని చేసిన కార్మికులు. ఆ పరిశ్రమ మూతపడటంతో.. వారు దుర్భరమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. ప్రొద్దుటూరులోని పాల ఉత్పత్తుల కర్మాగారం(ప్రొద్దుటూరు మిల్క్ ఫ్యాక్టరీ) ఒకప్పుడు దేశ స్థాయిలో ఖ్యాతి గాంచింది. పాలకుల నిర్లక్ష్యం మూలంగా మూతపడింది. దీంతో వేలాది మంది కార్మికులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రొద్దుటూరు ప్రాంత అవసరాలను గుర్తించి ప్రొద్దుటూరు మిల్క్ ఫ్యాక్టరీ (పీఎంఎఫ్) ఏర్పాటు చేశారు. 1974లో పరిశ్రమ ఏర్పాటుకు పనులు ప్రారంభం అయ్యాయి. 1980 మార్చి 16న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఈ కర్మాగారాన్ని ప్రారంభించారు. పెన్నానది ఒడ్డున 42 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పారు. కర్మాగారం ప్రాంగణంలో ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మించారు. అనతికాలంలోనే విశేష ఖ్యాతి సంపాదించింది. ఓ రకంగా సిరినగరికే వన్నెతెచ్చింది. కార్మికుల కృషితో ఎనలేని కీర్తి గడించడమే కాకుండా.. వందలాది గ్రామాల్లోని రైతులకు ఉపాధి కల్పించింది. గ్రామాల్లో నేటికీ పీఎంఎఫ్ భవనాలు సాక్షాలుగా ఉన్నాయి. మిలిటరీలో పని చేస్తున్న రక్షణ సిబ్బందికి ఇక్కడ తయారు చేసిన పాల ఉత్పత్తులను సరఫరా చేసే వారు. ప్రతి నెలా మిలిటరీ అధికారులు పాల కేంద్రంలోని గెస్ట్‌హౌస్ (అతిథి గృహం)లో విడిది చేసి.. తమకు అవసరమైన సరుకును తీసుకెళ్లే వారు. స్వచ్ఛమైన పాలు లభించడంతోపాటు పెన్నానది తీరాన పరిశ్రమ ఉండటంతో.. ఇక్కడి ఉత్పత్తులు చాలా నాణ్యతగా ఉండేవని పేరు వచ్చింది. కార్మికుల పరిస్థితి దయనీయం ఈ పరిశ్రమలో 350 మంది పర్మినెంట్ ఉద్యోగులతోపాటు మరో 100 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేసే వారు. రోజూ జిల్లాతోపాటు పక్క జిల్లాల నుంచి రైతులు కర్మాగారానికి పాలు సరఫరా చేసే వారు. రోజు వారీగా లక్షా 50 వేల లీటర్లు సరఫరా కాగా.. వీటి ద్వారా పాల ఉత్పత్తులు తయారు చేసేవారు. స్కీం మిల్క్, హోల్ మిల్క్, నెయ్యి, బేబి ఫుడ్ లాంటి వాటిని తయారు చేసి విక్రయించే వారు. బేబి ఫుడ్ ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అయ్యేదని ఉద్యోగులు నేటికీ చెబుతుంటారు. ఎంతో మంది లారీ ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా జీవనం సాగించే వారు. ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది ప్రస్తుతం రోడ్ల పాలయ్యారు. ఆర్థికంగా ఉన్న కొంత మంది జీవితాలు మెరుగుపడినా.. ఉద్యోగంపైనే ఆధారపడి జీవించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని చూసి తట్టుకోలేక చాలా మంది తనువు చాలించారు. ఇప్పటికే 60–70 మంది చనిపోయి ఉంటారని, కర్మాగారంలో పని చేసిన ఓ సెక్యూరిటీ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది జిరాక్స్ సెంటర్లు పెట్టుకోవడం, కూల్ డ్రింక్స్, టీ షాపులు, ఇతర దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవితాలను నెట్టుకొస్తున్నారు. చివరికి వీఆర్ఎస్ కూడా సక్రమంగా చెల్లించలేదనే విమర్శలు ఉన్నాయి. వీఆర్ఎస్ చెల్లింపుపై నేటికీ ఉద్యోగులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. చివరికి వీఆర్ఎస్ చెల్లింపులో కూడా చిత్తూరు జిల్లాతో పోల్చితే తమకు అన్యాయం చేశారని ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు హయాంలో మూసివేత ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ ద్వారా నడుస్తున్న పరిశ్రమను తర్వాతి కాలంలో సహకార సంఘం పరిధిలోకి బదలాయించారు. ప్రభుత్వ అలసత్వం, పాలకుల నిర్లక్ష్యంతోపాటు పర్యవేక్షణ లేమితో 1995 తర్వాత పరిశ్రమను మూసివేశారు. 1997 నాటికి పరిశ్రమను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత చిత్తూరు జిల్లాలోని పరిశ్రమను కూడా మూసివేయడం జరిగింది. నెరవేరని మంత్రి హామీ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ప్రొద్దుటూరుకు పశువైద్య కళాశాల మంజూరైంది. రూ.115 కోట్లతో నిర్మించిన కళాశాల శాశ్వత భవనాలను ప్రారంభించేందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 2015 ఏప్రిల్ 7న ప్రొద్దుటూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పీఎంఎఫ్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రకటించారు. ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై అ«ధ్యయనం చేస్తామని చెప్పారు. అదే నెల 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఎండీ బీవీ రమణమూర్తి పరిశ్రమను పరిశీలించి వెళ్లారు. ఆ నివేదిక ఏమైందో నేటికీ తేలలేదు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ హామీగానే మిగిలిపోయింది. వైఎస్ హయాంలో పాలశీతలీకరణ కేంద్రం చంద్రబాబు నాయుడు హయాంలో మూతపడిన పాల ఉత్పత్తుల కర్మాగారాన్ని చూసి చలించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 ఆగస్టు 3న ఇదే ప్రాంగణంలో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 2006 జనవరి 1 నుంచి 5 వేల లీటర్ల సామర్థ్యంతో ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఈ పరిశ్రమను సైతం ప్రభుత్వం ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంబశివ డెయిరీకి అప్పగించింది. 2008 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన పశువైద్య కళాశాలను.. ఈ పరిశ్రమలోని భవనాల్లో తాత్కాలికంగా నడిపారు. 2015 వరకు ఇందులోనే కళాశాలను నిర్వహించి తర్వాత గోపవరం వద్దకు మార్చు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంలేకపోవడం వల్లే.. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్లే 1995లో పీఎంఎఫ్ మూతపడింది. స్థానిక రాజకీయాల ప్రభావం ఉన్నా.. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు సహకార రంగాలపై సరైన అభిప్రాయం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాల ఉత్పత్తిదారుల పరిశ్రమలతోపాటు చక్కె పరిశ్రమలను మూసివేశారు. అప్పటి వరకు జిల్లాలో ప్రైవేటు పాడి పరిశ్రమలు లేవు. తర్వాతే హెరిటేజ్ డెయిరీ వెలుగులోకి వచ్చింది. పీఎంఎఫ్ ఉన్న సమయంలో జిల్లా వ్యాప్తంగా 380 సొసైటీలు ఉండేవి. వాటి ద్వారా రైతులతోపాటు నిరుద్యోగులకు ఉపాధి లభించేది. పరిశ్రమలో పని చేసే కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ.. అప్పట్లో నేను నిరవధిక నిరాహార దీక్ష చేపట్టగా 12వ రోజు రాత్రి పోలీసులు ఎత్తివేశారు. మళ్లీ రెండు రోజులు కలెక్టరేట్‌ను నిర్బంధించాం. రూ.4.92 కోట్ల బకాయిలను ఇప్పించాం. – జి.ఓబులేసు, సీపీఐ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు. ఒకప్పుడు వెలుగు వెలిగింది పీఎంఎఫ్ రాష్ట్రంలోనే ఒకప్పుడు వెలిగిపోయింది. తర్వాత కాలంలో మూతపడింది. ఉద్యోగులు రోడ్ల పాలయ్యారు. ఇంతటి దయనీయ పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. – ఎం.మాబువల్లి, రిటైర్డు సెక్యూరిటీ గార్డు, పీఎంఎఫ్ ఉత్పత్తులు నాణ్యతగా ఉండేవి పరిశ్రమలో తయారు చేసిన ఉత్పత్తులు చాలా నాణ్యతగా ఉండేవి. దూర ప్రాంతాల నుంచి వచ్చి వీటిని తీసుకెళ్లేవారు. ఇక్కడి వాతావరణం కూడా ఇందుకు కారణం. – ఎన్.లింగయ్య, ల్యాబ్ అసిస్టెంట్, పీఎంఎఫ్ సీఎంను కలిసినా ఫలితం లేదు 1997 నుంచి 1999 వరకు పని చేసినందుకు గాను 22 నెలల పూర్తి వేతనాన్ని ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారులు పలుకక పోవడంతో స్వయంగా తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి సమస్యను విన్నవించాం. తర్వాత మంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు జిల్లాలోని ముఖ్య నాయకులను కలిశాం. ఎవరూ పట్టించుకోలేదు. పైగా ప్రభుత్వం వేతనాలు ఇవ్వలేమని కోర్టు ద్వారా తెలిపింది. దీనిపై కండెంప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్లాం. – జి.సూర్యనారాయణ, పీఎంఎఫ్ ప్లాంట్ ఆపరేటర్, ప్రొద్దుటూరు. ఎన్నో కుటుంబాలు దీన స్థితిలో ఉన్నాయి పీఎంఎఫ్లో పని చేసిన ఎన్నో కుటుంబాలు నేడు దీనస్థితిలో ఉన్నాయి. ఎవరూ కనికరించే పరిస్థితిలో లేరు. 300 మందికి సుమారు రూ.3 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నాం. – కె.శ్రీనివాసులు, పీఎంఎఫ్ ఉద్యోగి, ప్రొద్దుటూరు. -
ఒక్క ఫైర్ ఇంజిన్.. సరిపోతుందా!
సాక్షి, క్రోసూరు: అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు సమయానికి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడే అగ్నిమాపక యంత్రం, సిబ్బంది అందుబాటులో ఉంటే ప్రజలకు ఎంతో భరోసా ఉంటుంది. అయితే పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదు మండలాలకు కలిపి ఒకే ఫైర్ ఇంజిన్ ఉండటంతో దూరాభారం కారణంగా, రోడ్లు బాగోలేకపోవటం, అందుబాటులోని నీటి సౌకర్యాలతో సమయానికి దూరప్రాంతాలకు చేరుకోలేక, అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఫలితంగా అగ్రిప్రమాద బాధితులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. క్రోసూరు మండల కేంద్రలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి 2004లో అగ్నిమాపక స్టేషన్ ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి పరిధిలోని సహాయ అగ్నిమాపక అధికారి రామకృష్ణ నేతృత్వంలో ప్రస్తుతం స్టేషన్లో ఒకే ఒక ఇంజిన్‌తో ఇద్దరు డ్రైవర్లు, 13 మంది ఫైర్ మెన్లు పనిచేస్తున్నారు. అగ్నిమాపక శకటం ద్వారా క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండలో అన్ని గ్రామాలు, అమరావతి, పెదకూరపాడు మండలంలో సగం గ్రామాలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు. ఈ ఐదు మండలాల్లో కలిపి 110 గ్రామాలున్నాయి. పెదకూరపాడులో సగం అంటే కనీసం 100 గ్రామాలకు ఈ వాహనాన్నే వినియోగించాలి. అయితే ప్రమాదాలు సంభవించినపుడు సంఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. గత ఏడాది 100 ప్రమాదాలకు హాజరైతే ఈ ఏడాది ఇంకా ప్రమాదాలు సంభవించలేదు. మండలానికి ఒక ఫైరఇంజిన్ ఏది ఏమైనప్పటికీ భానుడు తీవ్రతకు స్లాబ్ గృహాలే మండిపోతున్నందున పూరిళ్లు, పూరి పాకలు, చిన్నచిన్న షెడ్డులు, నిత్యం పొయ్యి మంటలతో వ్యాపారాలు నిర్వహించే వ్యాపార సంస్థలు, వంటగ్యాస్ ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మండలానికి ఒక ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. కనీసం రెండు మండలాలకైనా.. పేదల ఆస్తిపాస్తులు, గడ్డివాములకు వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవించి కట్టుబట్టలతో బయట పడిన కుటుంబాలకు తూతూ మంత్రంగా రేషన్ ఇచ్చి, ఐదు వేల నగదు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. ఇది చాలా దారుణం. ప్రమాదాల నుంచి కాపాడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సి ఉండి కూడా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవరించడం శోచనీయం. వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు సంభవించినపుడు, తక్షణమే ఆదుకునేందుకు కనీసం రెండు మండలాలకు ఒక అగ్నిమాపక శకటం అయినా ఏర్పాటు చేయాలి. కాల్వపల్లి ఏసురెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం కార్యదర్శి, క్రోసూరు -
మాట ఇస్తే తప్పని నేత
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): రాష్ట్రంలో ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారంటే ఎన్ని కష్టాలు వచ్చినా తప్పని గొప్ప నాయకుడు అని నెల్లూరుసిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక 42వ డివిజన్‌కు చెందిన మైనార్టీ సోదరులు షేక్ సత్తార్‌తోపాటు మరో 150 మంది స్థానిక మెక్లిన్స్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ సమక్షంలో సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా నవరత్నాలు పథకాలు తీసుకొచ్చారన్నారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబునాయుడు ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఎన్నికల సమీస్తున్న నేపథ్యంలో మాయమాటలు చెప్పేదానికి మరొమారు సిద్ధమయ్యారన్నారు. ఇన్నేళ్లు మైనార్టీలను పట్టించుకోని చంద్రబాబు మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చి నాటకాలాడుతున్నారన్నారు. ఇమామ్ మౌజ్‌లకు 14 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని చంద్రబాబు మైనార్టీలపై ప్రేమ చూపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనన్నారు. అందులో భాగంగానే నెల్లూరు నగరంలో బీసీకోటాలో అజీజ్‌ను మేయర్‌ను చేసినట్లు పేర్కొన్నారు. మేయర్ అయిన నెలరోజుల్లోపే 2019 ఎన్నికల్లో ఎమ్మెలే టికిట్ ఇస్తానని చెప్పి అజీజ్‌ను టీడీపిలోకి ఆహ్వానించిన మంత్రి నారాయణ ప్రస్తుతం మొండి చేయి చూపించారన్నారు. నారాయణే నగర అభ్యర్థిగా బరిలో దిగుతూ ముస్లిం మైనార్టీలను మోసం చేశారని విమర్శించారు. హౌస్ ఫర్ ఆల్ ఇళ్ల నిర్మాణం పేరుతో టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు మంచి చేసే అవకాశం కలుగుతుందన్నారు. షేక్ సర్దార్, జబ్బీర్, షాహుల్, ఆసిఫ్, షేక్ షబ్బీర్, నాసిర, షేక్‌హసీనా, షేక్ గౌసియా పార్టీలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో ఇంతియాజ్,. ఖలీల్ అహ్మద్, హంజా ఉస్సేని, ఇస్మాయిల్, బాబా అబ్దుల్, ఎండీ తారిక్ అహ్మద్, మున్వర్, ఆలిం, మీరా మొహిద్దీన్, ఫజల్ అహ్మద్, శివపురం సురేష్, ఎస్కే హాజీ పాల్గొన్నారు. -
చంద్రబాబుకైనా ఓటమి తప్పదు
సాక్షి, సంగం: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బొల్లినేని కృష్ణయ్యనాయుడే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేసినా గెలుపొందేది తానేనని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. సంగం మండలం దువ్వూరుకు చెందిన నాయకుడు సూరి మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది సోమవారం నెల్లూరులోని ఎమ్మెల్యే నివాసంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీ నాయకులకు ఏ అవసరమొచ్చినా తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. టీడీపీ నాయకులు పెట్టే ప్రలోభాలకు ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులు ఏ ఒక్కరూ లొంగబోరన్నారు. ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటి చేస్తున్న బోల్లినేని కృష్ణయ్యనాయుడు ఆదివారం చేజర్ల మండలంలో మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఓడిస్తానని అనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. బొల్లినేని కృష్ణయ్య ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమాలను అరికట్టాలని తెలిపారు. రైతుల కష్టాలను గుర్తించి టీడీపీ ప్రభుత్వానికి ముందు తెలియజేయాలన్నారు. అంతేగానీ గౌతమ్‌రెడ్డిని ఓడిస్తానంటే కృష్ణయ్య కాదు కదా సాక్షాత్తు చంద్రబాబు పోటీ చేసినా తన చేతిలో ఓటమి తప్పదని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేపట్టడంతో పేదలు పడుతున్న కష్టాలను గుర్తించి ఆరోగ్య శ్రీ తదితర గొప్ప పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పాదయాత్ర అనే పదానికి అర్థమే వైఎస్ కుటుంబమని, ఇది రాష్ట ప్రజలందరికీ తెలుసునన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని కుటుంబంలో నుంచి వచ్చిన రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని 2019లో ఓటు అనే ఆయుధంతో ఆశీర్వదించాలన్నారు. 2019లో రాజన్న రాజ్యం తిరిగి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వారు కోరిన పనిని ఒక్క రోజులో పూర్తి చేసే విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీలో చేరినవారిలో నాయకులు షేక్ మహబూబ్‌బాష, కరీముల్లా, నాయబ్బాషా, అబ్దుల్ జలీల్, రఫీ అహ్మద్, షాహుల్, హమీద్, అబిద్‌బాషా, జమీర్, అలీంబాషా, ఖాజారసూల్, సిరాజ్, ఇర్ఫాన్, వహాబ్బాషా, ఉస్మాన్, జలీల్, జన్నత్, చోటా, బాషా, గౌస్‌మొహిద్దీన్, షఫీ, సమీవుల్లా, గౌస్‌బాషా, జమీర్, నిజాం, అక్బర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు మెట్టుకూరు వాసుదేవరెడ్డి, రేబాల సురేంద్రరెడ్డి, వేల్పుల కోటేశ్వరరావు, భువన రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇందిరమ్మ జాగా.. వేసెయ్ పాగా
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ ఇంటి పథకం ఎంతోమందికి నీడనిచ్చింది. పేదోడికి గూడు దరిచేరింది. అయితే రామగుండం ఎన్టీపీసీ ప్రాంతంలో పేదలకు చెందాల్సిన నివాస స్థలాలు ధనవంతుల, ఆక్రమణదారుల చేతుల్లో చేరిపోతున్నాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్లో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా అవుతోంది. ఆక్రమణపై రెండేళ్ల క్రితం అధికారులకు ఫిర్యాదులు అందడంతో అధికారులు ఇందిరమ్మకాలనీలో ఇంటింటా సర్వే చేపట్టారు. అయితే ఈ సర్వే తూతూ మంత్రంగా నిర్వహించడంతో దళారులు ఇష్టారాజ్యంగా ఆక్రమణల పర్యవ కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూమి కొనాలన్నా, అమ్మాలన్నా వీరి ప్రమేయం తప్పనిసరి. ఇందిరమ్మకాలనీలోని స్థలాలను విక్రయించరాదని నిబంధనలు ఉన్నా యథేచ్చగా విక్రయాలు కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జ్యోతినగర్(రామగుండం): రామగుండం కార్పొరేషన్ మూడో డివిజన్లో పేదల కోసం కేటాయించిన ఇందిరమ్మ నివాస స్థలాలు ధనికుల చేతుల్లోకి వెళ్లి ఖరీదైన భవంతులు వెలుస్తున్నాయి. ప్రభుత్వం పేదలు నివసించడానికి ఏర్పాటు చేసిన ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ఉన్న వాళ్ల చేతిలోకి వెళ్లడంతో పేదలకు అన్యాయం జరుగుతోంది. ఇందిరమ్మ కాలనీలో 2008 నుంచి ఇప్పటి వరకు అధికారికంగా 6,365 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు సమాచారం. మంజూరైన ఇళ్లలో సుమారు 500 మంది లబ్ధిదారులు మాత్రమే నిర్మించుకుని నివాసముంటున్నారు. మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో ఉన్న కొందరు ప్లాట్లను తమ అజమాయిషీలో తెచ్చుకుని వ్యాపార కేంద్రంగా మలుచుకున్నారు. గతంలో పేదవారుగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ధనవంతులుగా మారిపోయారు. ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి ఒక్కోప్లాటు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు విక్రయిస్తున్నారు. అమ్మకాలు, కొనుగోలు అంతా సాదా పత్రాలలోనే మారుతూ ఉంది. సొంతంగా పట్టా ఉన్నవారి ప్లాట్లను ఆక్రమించిన సంఘటనలు ఇక్కడ సర్వసాధారణంగా మారాయి. అసలైన ఇందిరమ్మ లబ్ధిదారులు తమకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, తాము పోగుచేసుకున్న డబ్బులతో అరకొరగా నిర్మించుకుని నివసిస్తున్నారు. దళారుల నుంచి కొనుగోలు చేసిన కొందరు ఖరీదైన భవంతులు నిర్మిస్తున్నారు. ఇందిరమ్మకాలనీలో ఇంత ఖరీదైనా ఇళ్లు ఉంటుందా.. వీరు కూడా పేదవారేనా అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొనసాగుతున్న చదును పనులు ఇందిరమ్మకాలనీలో కొందరు ఒక టీంగా ఏర్పడి పేదలకు భూములు ఇస్తాం అంటూ ఖాళీ స్థలాల చదును ప్రారంభించారు. చదును చేపట్టడంతోపాటు స్థలాలు కావాల్సినవారి నుంచి ముందస్తుగా చదును పనుల కోసం రూ.1,000 ఇవ్వాలని వసూళ్లు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు సుమారు 70 మంది వద్ద వసూలు చేసినట్లు సమాచారం. 100 ఫీట్ల రోడ్డు కబ్జా.. ఇందిరమ్మ కాలనీలో 100 ఫీట్ల రోడ్డు నిర్మించేందుకు వీలుగా ప్లాట్లను ఏర్పాటు చేసి గతంలో అందించారు. అయితే వంద ఫీట్ల రోడ్డు నిర్మాణం కాకపోవడంతో 30 ఫీట్లు రోడ్డు వదిలి ఇరువైపులా మిగిలిన 35 ఫీట్ల చొప్పన ఉన్న భూమిని కూడా కాజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయంపై ఇటీవల మేయర్ పర్యటించిన క్రమంలో స్థానిక కార్పొరేటర్ ఫిర్యాదు కూడా చేశారు. అర్హులైన పేదలకు అన్యాయం జరిగిందని సమాచారం మేరకు రామగుండం రెవెన్యూ అధికారులు రెండేళ్ల క్రితం ఇందిరమ్మకాలనీలో ఎవరు నివిసిస్తున్నారు. స్థలాలు ఎవరి పేరుమీద ఉన్నాయనే సమాచారాన్ని సేకరించేందుకు సర్వే చేశారు. సర్వే పూర్తి చేయకపోవడమే దళారులకు వరంగా మారింది. పూర్తిస్థాయిలో కాలనీలోని మొత్తం నివాసాలు సర్వే చేసి అసలైన లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారు అనే విషయాలను సేకరించి మిగతా స్థలాలను పేదలకు ఇవ్వాల్సిన అవసరం అధికారులపై ఉంది. సర్వే అనంతరమే బినామీగా ఉన్నవారు ఎందరు, అసలు మంజూరు ఉన్నవారు ఎవరు.. అనే విషయాలు వెలుగులోకి రానున్నాయి. అక్రమంగా చదును చేస్తే చర్యలు కార్పొరేషన్ మూడో డివిజన్ ఇందిరమ్మకాలనీలోని ఖాళీ స్థలాలను కొందరు చదును చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. సమాచారం మేరకు రెవెన్యూ అధికారులను సంఘటన స్థలానికి పంపించి విచారణ చేపట్టాం. అసిస్టెంట్ సిటీ ప్లానర్‌కు కూడా సమాచారం ఇచ్చాం. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. - హనుమంతరావు, రామగుండం తహసీల్దార్ -
108కు సుస్తీ..
ఆత్మకూరు(పరకాల): ఆపద సమయంలో ఆదుకునే ఆపద్భందు 108కు సుస్తీ చేసింది. అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరిగితే రోగిని అత్యవసరంగా వాహనంలో చేర్చి ప్రథమ చికిత్స అందజేసి ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలను కాపాడేది 108. దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి గొప్ప మనసుతో ప్రవేశపెట్టిన ఈ సేవలకు ఇప్పుడు అంతరాయం కలుగుతోంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏడాదిలో ఎన్నో సార్లు సేవలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలో 16 అంతంతమాత్రమే..మండల కేంద్రాల్లో 108 వాహనం ఉండాల్సి ఉన్నప్పటికీ ఆ సౌకర్యం పూర్తిస్థాయిలో లేదు.8 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. పరకాల, ఆత్మకూరు, నల్లబెల్లి, పర్వతగిరి, నర్సంపేట, సంగెం, గీసుకొండ, నెక్కొండ మండలకేంద్రాల్లో ఉండగా ఒక్కో వాహనం రెండు మండలాల్లో సేవలందిస్తోంది. ఒకటే సమయంలో రెండు మండలాల్లో అత్యవసరం ఏర్పడితే ఇబ్బందులు పడాల్సిందే. పీహెచ్‌సీల్లో రాత్రివేళ అత్యవసర సేవలు మృగ్యమయ్యాయి. దీనికి తోడు 108 వాహనాలు ప్రతి మండలకేంద్రానికి లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నాలుగోసారి.. ఈ ఏడాది కాలంలో డీజిల్ లేక వాహనాలు నిలిచిపోయిన సందర్భం ఇది నాలుగోసారి. 2018లో ఆగస్టు, డిసెంబర్లలో ఇదే పరిస్థితి. మూడు సార్లు నిలిచిపోగా తాజాగా ఇప్పుడు నాలుగురోజులుగా జిల్లాలో ఈ పరిస్థితి ఉంది. నాలుగురోజులుగా డీజిల్‌కు డబ్బులు లేక వాహనాలు కదలడం లేదు. డబ్బులు ఎప్పుడొస్తయో అని సిబ్బంది ఎదురు చూస్తున్నారు. కనీసం డీజిల్‌కు డబ్బులు అందచేయలేని స్థితిలో నిర్వాహకులు ఉండడంపై రోగులు దుమ్మెత్తిపోస్తున్నారు. పైలెట్లు, ఈఎంటీల కొరత.. జిల్లాలో 108 సర్వీసుల్లో సేవలందించాల్సిన పైలెట్లు, ఈఎంటీ(ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్)ల కొరత ఉంది. ఒక వాహనానికి ఆరుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా ఇప్పుడు నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు. సిబ్బంది కొరతతో అక్కడక్కడ వాహనాలు కదలడం లేదు. మానిటరింగ్ వ్యవస్థ సరిగాలేదు. సమ్మెచేసినా..తీరని డిమాండ్లు.. ఇటీవల తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 108 సిబ్బంది సమ్మె చేసినప్పటికి వీరి డిమాండ్లు నెరవేరలేదు. వేరే వారిని తీసుకుంటున్న ఆందోళనతో విధుల్లో చేరారు. వీరికి కనీస కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. హైకోర్టు 8 గంటల సమయం పనిచేయాలని ఆదేశించినప్పటికీ 12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. సిబ్బంది సరిపడా లేకపోవడంతో అధనపు పనిభారంతో ఒత్తిడి, నిరాశలో సిబ్బంది ఉంటున్నారు. కుదరని జీవీకే ఒప్పందం.. ప్రభుత్వంతో 108 సేవలకు సంబంధించి జీవీకే కంపెనీతో ఒప్పందం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందంలో జాప్యం జరుగుతోందని సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం 108 సర్వీసులపై నిర్లక్ష్యం వీడాలని ప్రజలు కోరుతున్నారు. అంతరాయం కలుగకుండా చూస్తాం.. 108 సర్వీసులో అంతరాయం కలుగకుండా చూస్తాం. డీజిల్ నిధులు వచ్చాయి. వాహనాలు నడిపిస్తాం. వాహనాలను నిలుపకుండా చూస్తాం.సిబ్బంది కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. –శ్రీనివాస్, 108 జిల్లా కో ఆర్డినేటర్ -
పసిడి పంటకు ధర కరువు
మోర్తాడ్(బాల్కొండ): రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి, తొమ్మిది నెలలు కష్టపడి పంట పండిస్తున్న పసుపు రైతుకు కన్నీరే మిగులుతోంది.. పంట ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉన్నా ధర క్రమంగా పతనమవుతోంది. అదేం విచిత్రమో కానీ, పంట సాగు ఖర్చు ఏటేటా పెరుగుతుంటే, ధర మాత్రం దిగజారుతుండడం రైతాంగాన్ని కలవరపెడుతోంది. పదేళ్ల క్రితం పసుపు క్వింటాల్ ధర రూ.16 వేలు ఉంటే, ప్రస్తుతం రూ.6 వేలకు మించడం లేదు. ప్రభుత్వాల నుంచి ‘మద్దతు’ లేకపోవడంతో రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులంతా ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం మోర్తాడ్‌లో పసుపు రైతుల ఆవేదన సభ నిర్వహించనున్నారు. పడిపోయిన ధర పసుపు సాగు కోసం రైతులు పెడుతున్న పెట్టుబడులు ఏటేటా పెరుగుతున్నా పంటకు ఆశించిన ధర లభించక రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. పదేళ్ల క్రితం అంటే 2009లో పసుపు ధర రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు పలికింది. ప్రస్తుతం మార్కెట్లో పసుపు ధర కనిష్టంగా రూ.4 వేలు, గరిష్టంగా రూ.6 వేలు పలుకుతోంది. ఈ పదేళ్లలో పంట సాగు వ్యయం రెట్టింపు కాగా, అదే స్థాయిలో పెరగాల్సిన ధర 60 శాతం మేర దిగజారి పోవడం విశేషం. ఎకరా విస్తీర్ణంలో పసుపు సాగుకు రైతులకు రూ.1.20 లక్షలకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం రైతులకు పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు సరికదా వారు చేస్తున్న శ్రమకు ఫలితం లభించడం లేదు. వైఎస్ హయాంలో మద్దతు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పసుపు రైతులు దండిగా లాభాలు ఆర్జించారు. నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు వైఎస్ అప్పట్లో ఎంతో చొరవ తీసుకున్నారు. పసుపు పంటను ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా కొనుగోలు చేయించిన, పంటకు మద్దతు ధర ప్రకటించిన మొదటి, చివరి ముఖ్యమంత్రి ఆయనే కావడం విశేషం. మార్క్‌ఫెడ్ ద్వారా పసుపును కొనుగోలు చేయించిన వైఎస్ ప్రభుత్వం.. అప్పట్లో క్వింటాల్‌కు రూ.6 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించింది. దీంతో వ్యాపారులు పంట కొనుగోలుకు పోటీ పడి ధరను పెంచడంతో రైతులు భారీగా లాభాలు ఆర్జించారు. ఆయన మరణం తర్వాత మళ్లీ పాత పరిస్థితులే పునరావృతమయ్యాయి. అప్పట్లో రూ.16 వేలు పెలికిన ధర క్రమంగా పతనమైంది. దీంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పసుపు రైతుల కోసం ఉద్యమించారు. ఆర్మూర్‌లో 48 గంటల పాటు దీక్ష చేయడంతో అప్పటి ప్రభుత్వం కొంత వరకు స్పందించినా, ఆ తర్వాత ధర పతనం కొనసాగింది. డిమాండ్ ఉన్నా ధర లేదు.. వాస్తవానికి పసుపు పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పసుపు ఉత్పత్తులను వివిధ రకాల ఔషధాలు, కాస్మోటిక్స్, ఆహార పదార్థాల్లో వినియోగిస్తుంటారు. దీంతో పసుపు పంటకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పసుపు పంట దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లోనే పండిస్తారు. అందులో మన నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువగా పంట సాగవుతుంది. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో పసుపు ఎక్కువగా పండిస్తుంటారు. అయితే, మార్కెట్లో పసుపు ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా రైతుకు మాత్రం ధర దక్కడం లేదు. ఎకరా విస్తీర్ణంలో సాగుకు రూ.1.20 లక్షలకు పైగా ఖర్చు చేస్తుంటే ఆ పెట్టుబడి కూడా రావడం లేదు. పసుపు ధర క్వింటాల్‌కు కనీసం రూ.10 వేలు ఉన్నా లాభాలు రాకపోయినా పెట్టుబడితో పాటు శ్రమకు ఫలితం దక్కుతుందని రైతులు పేర్కొంటున్నారు. కానీ, ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. సర్కారు స్పందించాలి.. తొమ్మిది నెలలు కష్టపడి పండిస్తే ఏటా నష్టాలే మిగులుతున్నాయి. ప్రభుత్వాలేమో పట్టించుకోవడం లేదు. పసుపు రైతుల ఆవేదన సభతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. పసుపు పంటను వాణిజ్య పంటగా చూడటమే కాదు ఈ పంటను సాగు చేస్తున్న రైతులు ధర లేక పోవడంతో ఎంత మేర నష్టపోతున్నారో గుర్తించాల్సి అవసరం ప్రభుత్వంపై ఉంది. మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. – సుంకెట్ అన్వేష్ఏఊరెడ్డి, పసుపు రైతుల ఉద్యమ నాయకుడు నష్టాలే వస్తున్నాయి.. పసుపు పంటను సాగు చేస్తున్న రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. విత్తనం ఖర్చు, ఎరువులు, కూలీలకు ఇచ్చే కూలి, పసుపు తవ్వడానికి కూలీలకు చెల్లించే సొమ్మును లెక్క వేస్తే రైతులకు రూపాయి లాభం కూడా రావడం లేదు. ప్రభుత్వం స్పందించాల్సి అవసరం ఉంది. – కొప్పుల రాజశేఖర్, రైతు, మోర్తాడ్ -
రోగమొస్తే..ఇక అంతేనా
నవరత్నాలు –3 బతకాలనేది రోగులందరి ఆశ.. ఆ ఆశకు వైద్యమే శ్వాస.. ఇప్పుడా శ్వాసకు గడ్డు కాలం నడుస్తోంది. నిలువ నీడలేని, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల వారికి నేడు ఏదైనా పెద్ద జబ్బు వస్తే.. ప్రమాదాల బారిన పడితే ‘రేపటి రోజు’కు రూపు కరువైన దుస్థితి. రోగమొస్తే ఇక అంతే.. అనే దయనీయ పరిస్థితి రాజ్యమేలుతోంది. అధైర్య పడొద్దు.. బతికిస్తాం.. అనే భరోసా ఇవ్వడానికి పాలకులకు మనసొప్పని దౌర్భాగ్యపు రోజులివి. చావు బతుకులతో బడ్జెట్ లెక్కలు వేసి ‘మీ చావు మీరు చావండి’ అని వదిలించుకుంటున్న వైనం కళ్లారా చూస్తున్నాం. అర్ధాయుష్షుతో తనువు చాలించకుండా చూసేందుకు వైద్యులకు అవకాశం ఇవ్వని వైనమూ కంటున్నాం. ‘ఈ రోజులు పోవాలి. మళ్లీ వైఎస్సార్ నాటి స్వర్ణ యుగం రావాలి’ అని కోట్లాది మంది కోరుకుంటున్నారన్నది అక్షర సత్యం. ఆ రోజు త్వరగా రావాలి. ప్రజలంతా ఆరోగ్యంగా జీవించాలి. – సాక్షి, అమరావతి / సాక్షి నెట్వర్క్ అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దిగులుగా కూర్చున్న రఘుపతి దంపతులు ఇప్పుడేం చేసేది మా ఆయన రఘుపతి కూలి పని చేసి కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు. వారం క్రితం కూలి పనికి పోయినప్పుడు ఇసుక తిన్నెలు మీద పడటంతో కుప్ప కూలిపోయినాడు. నడవలేక పోవడంతో ఆటో మాట్లాడుకుని వెంటనే తాడిపత్రిలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఎక్స్‌రే తీసి చూశారు. కాలు విరిగిందని, ఆపరేషన్ చేసి రాడ్ వేయాలని చెప్పినారు. టెంపరరీ కట్టు కట్టారు. అనంతపురం తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వ అంబులెన్స్ కోసం చాలా సేపు ఎదురు చూశాం. ఎంతసేపటికీ రాకపోవడంతో 1,500 రూపాయలిచ్చి ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకుని అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాం. అక్కడ వెంటనే వైద్యం అందే పరిస్థితి లేదని అర్థమైంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఆరోగ్య శ్రీ కార్డు చూపించి, ఆపరేషన్ చేయాలని (ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బందిని) కోరాం. ఎంతసేపటికీ వాళ్లు ఏమీ చెప్పలేదు. ఆ ఆసుపత్రిలో చూపించుకోవడానికి వచ్చిన ఒకాయన మా పరిస్థితి చూసి వాళ్లతో మాట్లాడారు. ఆసుపత్రికి గవర్నమెంటోళ్ల నుంచి రావాల్సిన డబ్బులు (బకాయిలు) రాలేదని, అందుకే ఆపరేషన్లు చేయడం లేదని మాకు చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. డబ్బులిచ్చి వైద్యం చేయించుకోవాలంటే 40 వేల రూపాయలు అవుతుందని చెప్పారు. కూలి పనులు చేసుకునే మాకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. పక్కన పల్లెలో ఎవరో కట్టు కడతారని (నాటు వైద్యం) చెప్పారు. ఎలాగైనా 5 వేల రూపాయలు తీసుకుని రావాలని మా పిన్ని వాళ్లకు ఫోన్ చేసి చెప్పాను. వాళ్లు రాగానే మా ఆయన్ను అక్కడికి తీసుకెళ్లాం. అక్కడ ఏం చేస్తారో.. ఏమో.. మా ఖర్మ. – రఘుపతి భార్య, ఆలూరు, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా భర్త వద్ద దిగాలుగా కూర్చున్న కాంతమ్మ ఈ పరిస్థితి పగోళ్లకు కూడా రాకూడదు.. మా ఆయన అప్పలస్వామి (60)కి కొన్నాళ్ల క్రితం కిడ్నీ దెబ్బతినిందని చెప్పారు. ఎందుకు దెబ్బతినిందో తెలీదు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చూపించాం. మందులిచ్చారు. వాడాము. కొన్నాళ్ల తర్వాత వ్యాధి మరింత ముదిరింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సరిగా అందలేదు. దీంతో రెండెకరాల పొలం అమ్మాము. ఏకంగా 15 లక్షల రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేశాము. అయినా వ్యాధి ముదిరిపోయింది. డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పటికే అప్పులపాలయ్యాం. డయాలసిస్ చేయించడానికి కూడా ఇప్పుడు డబ్బులు లేవు. మా ఆయన్ను దక్కించుకోవడం ఎలానో తెలీక తల్లడిల్లిపోతున్నాం. ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో రోగులు క్యూకట్టారు. మరిన్ని కేంద్రాలు ఉండుంటే వెంట వెంటనే డయాలసిస్ చేయించడానికి వీలవుతుంది. మేము పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఇలాంటి కష్టం పగోడికి కూడా రాకూడదని కోరుకుంటున్నాం. – కాంతమ్మ, లొహరిబంద, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నా.. భర్త, పిల్లలతో కలిసి ఆనందంగా బతుకుతున్న రోజులవి. నా భర్త గురయ్య 15 ఏళ్ల క్రితం నన్నొదిలి కనిపించని లోకాలకు వెళ్లిపోయాడు. క్షయ వ్యాధి ఆయన్ను కబళించింది. తర్వాత ఐదేళ్లకు (ఇప్పుడు నాకు 48 ఏళ్లు) నేను వైద్య పరీక్షలు చేయించుకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధి ఉందని తేలింది. ఆ విషయం వినగానే గుండె ఆగినంత పనైంది. భవన నిర్మాణ పనులకు వెళ్లి పొట్ట పోసుకుంటున్న నాకు ఈ వ్యాధి రావడం బాధనిపించింది. మా ఆయన లేడు. ఇద్దరు పిల్లలు దుర్గారావు, భాస్కరరావులు ఇంకా చదువుకుంటున్నారు. డాక్టర్లు చూస్తే మందులు వాడుతూ బాగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఇలాగైతే ఇల్లు గడిచేదెలా? బాధను పంటి బిగువున భరిస్తూనే పనులకు వెళ్తున్నాను. రెండేళ్లుగా నా సమస్య మరింత ముదిరింది. దీంతో పిల్లలు 10వ తరగతి వరకు చదివి ఆపేశారు. ఆటో తోలుతున్నారు. ఇప్పుడు నాకు వారానికి మూడు మార్లు డయాలసిస్ చేయాల్సి వస్తోంది. మందుల కోసం నెలకు 8 వేల రూపాయలు ఖర్చవుతోంది. పిల్లలు సంపాదించింది నా ఖర్చులకే సరిపోతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. పలాసలో డయాలసిస్ కేంద్రం పెట్టారు కాని అక్కడ పడకలు లేవు. పిల్లలు ఆటో తోలుతున్నారు కాబట్టి దారి ఖర్చులు కాస్త కలిసొస్తున్నాయి. లేకుంటే ప్రత్యేకంగా ఆటో తీసుకుని వెళ్లాల్సి వచ్చేది. ప్రభుత్వం బస్సు పాస్‌లు ఇస్తామని ప్రకటించిందే కానీ ఇవ్వలేదు. మరోవైపు ఇల్లు గడవడం బాగా కష్టంగా మారింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా ముఖ్యమంత్రి అవుతారా అని కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నా. ఎందుకంటే మా లాంటోళ్లకు ఆయన నెలకు రూ.10 వేలు పింఛన్ ఇస్తామన్నారు. – మీలపల్లి పుణ్యావతి, గుణుపల్లి గ్రామం,వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా వైఎస్ జగన్‌తోనే ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజుల్లో పేదలకు ఒక ధీమా కల్పించింది. రోజు కూలీలు సైతం హైదరాబాద్‌కు వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నారు. ఏ ఒక్క రోగీ చికిత్సకు డబ్బులేదని బాధ పడకూడదనేది వైఎస్సార్ ధ్యేయం. ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు మించితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని చెబుతుండటం రోగుల్లో భరోసా నింపుతోంది. ఎంతో మంది రోగులు ఇతర రాష్ట్రాలకు వైద్యం కోసం వెళ్లే అవకాశం ఉన్నా సర్కారు అనుమతి లేక బాధ పడుతున్నారు. ఇలాంటి వారందరికీ ఉపశమనం కలుగుతుంది. మూడింట రెండొంతులకు పైగా జనం లబ్ధి పొందనున్నారు. గుండె జబ్బులు, కిడ్నీ, నరాల జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాలకు మంచి చికిత్స అందుతుంది. జగన్ సీఎం అయితేనే మళ్లీ ఈ పథకానికి పూర్వ వైభవం వస్తుందని నిత్యం ఎంతో మంది రోగులు మందుల కోసం ఇక్కడి కొచ్చినప్పుడు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు, కష్టాలు భవిష్యత్‌లో కనిపించే పరిస్థితే ఉండదన్న నమ్మకం ఉంది. జగన్ త్వరగా ముఖ్యమంత్రి అయితే లక్షలాది మంది పేదలు మృత్యు ముఖం నుంచి తప్పించుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రోజు కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. – గాండ్ల ఆదినారాయణ, మెడికల్ షాపు యజమాని, అనంతపురం. ఇదీ వైఎస్సార్ ఘనత ప్రమాదకర జబ్బు వస్తే ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందక, కార్పొరేట్ ఆస్పత్రుల మెట్లు ఎక్కే తాహతు లేక ప్రాణాలు కోల్పోతున్న దశలో పేదలు, సామాన్యుల కష్టాలను దగ్గరి నుంచి చూసిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2007 ఏప్రిల్ ఒకటిన పైలెట్ ప్రాజెక్టుగా ఆరోగ్యశ్రీని మూడు జిల్లాల్లో అమలు చేశారు. తర్వాత ఏడాది తిరక్కముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల్లోనూ అందుబాటులోకి తెచ్చారు. తొలుత 468 జబ్బులతో మొదలైన ఈ పథకం ఏడాది తిరక్కముందే 938 జబ్బులకు చికిత్స అందే స్థాయికి చేరింది. గుండె జబ్బు నుంచి కాలేయ జబ్బు వరకు, క్యాన్సర్ నుంచి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ వరకు.. ఏ జబ్బుకైనా సరే, ఏ కార్పొరేట్ ఆస్పత్రి అయినా సరే వెనుదిరిగి చూడకుండా వైద్యం చేయించిన రోజులవి. జబ్బు బారిన పడిన వారికి చికిత్సతో పాటు వైద్యం జరిగినన్ని రోజులూ భోజనం, రవాణా చార్జీలు సైతం ఆస్పత్రిలోనే చెల్లించిన తీరు సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఓ చరిత్ర. పుట్టుకతోనే మూగ, చెవుడు ఉన్న చిన్నారులు ఒక్కొక్కరికి కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసినందుకు రూ.6.5 లక్షలు చెల్లించారు. ఆరోగ్యశ్రీకి ఏటా రూ.925 కోట్లు చెల్లించారు. ఈ మొత్తం తక్కువైందని సీఎం సహాయ నిధి కింద ఏటా రూ.400 కోట్లు చెల్లించి చరిత్ర పుటల్లో నిలిచారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ తరహా ప్రాజెక్టు దేశంలో ఇంత పకడ్బందీగా ఎక్కడా అమలు కాలేదు. లక్షలాది మంది ఇన్ పేషెంట్లకు ప్రాణం పోసింది. చాలా విజయవంతమైన కార్యక్రమం ఇది. 80 శాతం కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగా వైద్యం అందించడం అంటే మాటలు కాదు. దీనివల్ల పేదలు తమ వైద్యం కోసం ఆస్థులమ్ముకునే దుస్థితి తప్పింది’ అని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సోఫీ బెర్గ్విస్ట్, ఆడం వాగ్‌స్టాఫ్, అనురాధా కాత్యాల్, ప్రబాల్ వి.సింగ్, అమిత్ సామ్రాట్, మాలారావులు అప్పట్లో కొనియాడారు. ఇదీ బాబు నిర్వాకం పుట్టుకతోనే మూగ, చెవుడు చిన్నారులకు వైద్యం చేయించుకునే వయసు 12 ఏళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు. (దీంతో వేలాది మంది చిన్నారులు వైద్యం చేయించుకోవడానికి అర్హత కోల్పోయారు) 938 జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉండగా అందులో 133 జబ్బులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయకూడదని నిర్ణయం. ప్రభుత్వాసుపత్రుల్లోనే చేయాలని నిబంధన. 1600 మంది ఆరోగ్యమిత్రల తొలగింపు. కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసే ఆస్పత్రులు నెలకు ఒక కొత్త కేసు మాత్రమే తీసుకోవాలని ఆదేశం. ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునే వీలు లేదని ఆంక్షలు. (మన రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం హైదరాబాద్ స్థాయిలో ఇంకా అభివృద్ధి కాలేదు) ప్రమాదంలో గాయపడిన (పాలీట్రామా) బాధితులకు వైద్యం అందించేందుకు ప్యాకేజీ రేట్లు సరిపోవడం లేదని ఆస్పత్రుల నిరాకరణ. న్యూరో, కాలేయ బాధితులకు వైద్యం చేసేందుకు చాలా చోట్ల ఆస్పత్రుల నిరాకరణ. రోగులకు మార్గదర్శకం చేసే ఆరోగ్య మిత్రల తొలగింపు. (ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులతో కొందరు ఉద్యోగంలో కొనసాగుతున్నారు) ఆరోగ్యశ్రీ ట్రస్ట్.. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు రూ.600 కోట్లు బకాయి పడటంతో 2019 జనవరి 1వ తేదీ నుంచి సేవల నిలిపివేత. సొంతూళ్లలో రేషన్ తీసుకుంటేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని లింకు. తద్వారా పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లిన పేదలు వైద్యానికి అనర్హులయ్యేలా చేశారు. మీ ఆరోగ్యానికి నాదీ భరోసా : వైఎస్ జగన్ ఏడాదికి రూ. 1 లక్ష నుంచి రూ. 10 లక్షలు లబ్ధి పిల్లలను ఉన్నత చదువులు చదివించినప్పుడో, కుటుంబీకులకు పెద్ద జబ్బు వచ్చినప్పుడో పేదలు అప్పులపాలవుతారని దివంగత మహానేత, నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చెప్పేవారు. వాళ్ల జీవితాలు చెదిరిపోకూడదనే ఉద్దేశంతోనే ఆయన ‘ఆరోగ్య శ్రీ’ ప్రారంభించారు. ఆ పథకం ద్వారా ఎంతో మంది ప్రజలు ఉచితంగా ఆపరేషన్లు చేయించుకున్నారు. కానీ గత నాలుగున్నరేళ్లుగా పరిస్థితి దారుణంగా తయారైంది. ఆరోగ్య శ్రీ కార్డు పట్టుకుని హైదరాబాద్‌కు పోతే.. ఏపీ కార్డులు అక్కడ చెల్లవని అంటున్నారు. 108కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్ వస్తోందా? మూడు నెలలుగా సిబ్బందికి జీతాల్లేవు.. డీజిల్ లేదని సమాధానం వస్తోంది. ఈ దుర్మార్గపు పాలన ముగిసి, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘ఆరోగ్య శ్రీ’లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సమున్నతంగా అమలు చేస్తాం. ఆ దివంగత నేత కుమారుడిగా పేదల కోసం నేను రెండడుగులు ముందుకు వేస్తానని చెబుతున్నా. ఏపీలోని పేదలు వైద్యం కోసం దేశంలోని ఏ నగరానికి వెళ్లినా, ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. కిడ్నీ, తలసేమియా.. లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలనెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తాం. మహానేత కాలంలో జరిగినట్లే.. మూగ, చెవిటి పిల్లలు అందరికీ ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయిస్తాం. క్యాన్సర్ చికిత్సకు కనీసం ఏడెనిమిది సార్లు కీమోథెరపీ చేయాలి. ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం రెండుసార్లకు మాత్రమే డబ్బులిస్తోంది. దీంతో ఆరు నెలల తర్వాత వారికి క్యాన్సర్ వ్యాధి తిరగబెడుతోంది. రోగులు చనిపోవాల్సిన దుస్థితి నెలకొంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సరిగా జరగడం లేదు. పేదలు ఆస్పత్రులకు వెళితే ఏడాది తర్వాత రమ్మంటున్నారు. దీంతో వారి ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తాం. ఆపరేషన్ పూర్తయ్యాక వైద్యులు సూచించే విశ్రాంతి కాలంలో పనులు చేసుకోలేరు కాబట్టి ఆర్థిక సాయం అందిస్తాం. ఈ సాయం వారం.. నెల.. ఆరు నెలలు అయినా సరే ప్రభుత్వం చేస్తుంది. -
‘ప్రాణహితా’స్త్రం
ప్రాణహిత–చేవెళ్ల... దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపైన తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మించి, ఎత్తిపోతల ద్వారా చేవెళ్ల వరకు నీరు అందించాలని ఆయన ఆశించారు. ఈ ప్రక్రియలో ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు నదులు, చెరువులు నింపుతూ ప్రాణహిత నీరు చేవెళ్ల వరకు చేరాలి. అయితే 2009 ఎన్నికల తరువాత మళ్లీ గద్దెనెక్కిన వైఎస్ఆర్ హెలీకాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ప్రాజెక్టు ముందుకు పడలేదు. 2014లో తెలంగాణ ఆవిర్భావ ప్రకటన తరువాత జరిగిన ఎన్నికల్లో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ప్రధానాంశమైంది. తాము అధికారంలోకి వస్తే ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తామని, ఐదేళ్లలో సాగునీరు, తాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తరువాత పరిస్థితి మారింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో రూపు మార్చుకుంది. గోదావరినదిపై కాళేశ్వరం ప్రాజెక్టుగా అవతరించింది. అయితే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు మాత్రం మాసిపోలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కూడా ఉమ్మడి జిల్లాలో ఇదే ప్రధానాంశంగా మారుతోంది. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ సాగిస్తున్న ఎన్నికల ప్రచారానికి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. జిల్లాల పర్యటనల్లో స్థానిక అంశాలను ఫోకస్ చేస్తూ టీఆర్ఎస్కు కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క నేతృత్వంలో కో చైర్పర్సన్ డీకే.అరుణ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. నాలుగురోజులు సాగే ఈ పర్యటనలో ఆదిలాబాద్‌కు నాలుగేళ్లలో జరిగిన అన్యాయంపైనే ప్రధానంగా దృష్టి సారించి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు డిజై¯ను మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించడంపై ప్రజలను చైతన్య పరిచాలని నిర్ణయించారు. కమీషన్ల కోసమే డిజైన్లు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని గత కొంతకాలంగా ధ్వజమెత్తుతున్న కాంగ్రెస్ నాయకులు ఇటీవల రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ప్రభుత్వాన్ని తూర్పార పట్టడం ప్రారంభించారు. ‘డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకం’గా శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు డిజైన్‌తో పాటు పేరు కూడా మార్చారని ధ్వజమెత్తారు. భైంసాలో రాహుల్‌గాంధీ నోట ప్రాణహిత మాట చేవెళ్ల–ప్రాణహిత డిజైన్ మార్చి కాళేశ్వరం నిర్మించడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. కొన్ని నెలల క్రితం బస్సు యాత్ర ద్వారా మంచిర్యాల, కుమురం భీం జిల్లాల్లో పర్యటించిన సమయంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఇతర నాయకులు ఇదే అంశంపై బహిరంగ సభల్లో ప్రసంగించిన నేతలు తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు సాకరమైతే ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 2లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారానే పుష్కలంగా నీరందేదని, కాళేశ్వరం వల్ల అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీరందదని తమ ప్రచారంలో వివరించారు. ఈ మేరకు ఈనెల 20న భైంసాకు వచ్చిన రాహుల్‌గాంధీకి తెలియజేసి, ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించకపోవడం వల్ల ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందనే విషయాన్ని చెప్పించారు. అదే సభలో రాహుల్ ‘అంబేద్కర్ అంటే కేసీఆర్‌కు నచ్చదు. అందుకే కాంగ్రెస్ హయాంలో బాబాసాహెబ్ పేరిట చేపట్టిన ప్రాజెక్టును లేకుండా చేసి, కాళేశ్వరం పేరిట కొత్త ప్రాజెక్టు చేపట్టారని, కేసీఆర్ కుటుంబానికి లబ్ధి జరిగింద’ని ఆరోపణలు చేయించారు. రాహుల్ మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీయడంతో నవంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే పర్యటనలో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా జనం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు . ప్రచారంలో తుమ్మిడిహెట్టి పర్యటన పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్ర, జిల్లా నేతలు నవంబర్ 1న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2గంటలకు ఇచ్చోడలో రోడ్‌షో నిర్వహించి, బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూరులో ప్రచారం నిర్వహిస్తారు. 2వ తేదీన జైనూరు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లలో ప్రచారం నిర్వహిస్తారు. 3వ తేదీన ఉదయం 8 గంటలకే కాగజ్‌నగర్ నుంచి తుమ్మిడిహెట్టికి హెలికాప్టర్లో ప్రయాణించి అక్కడే అల్పాహారం చేసి 10 గంటలకు బెల్లంపల్లి తిరుగు ప్రయాణం కానున్నారు. అనంతరం బెల్లంపల్లిలో ప్రచారం జరిపి హైదరాబాద్ వెళ్తారు. 4వ తేదీన చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. ఈ నాలుగు రోజుల పర్యటనలో తుమ్మిడిహెట్టిని హైలైట్ చేయడం ద్వారా అధికార టీఆర్ఎస్ను ఉమ్మడి జిల్లాలో ఇరుకాటంలో పెట్టాలనేది కాంగ్రెస్ నేతల ప్లాన్. తుమ్మిడిహెట్టి నుంచి వార్ధాకు మారిన ప్రతిపాదన తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు బ్యారేజీని కాళేశ్వరానికి తరలించడం వల్ల భూ సేకరణ కోసం వెచ్చించిన మొత్తంతో పాటు అప్పటికే నిర్మాణాలు పూర్తయిన కాలువల వల్ల సుమారు రూ.10వేల కోట్లు వృథా అయ్యాయనేది కాంగ్రెస్ వాదన. ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీతో నీరందడంతో పాటు చేవెళ్ల వరకు రూ.38వేల కోట్లతో నీటి సరఫరా జరిగేదని నేతల విమర్శ. వీటన్నింటికన్నా... తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పూర్తయితే పాత ఆదిలాబాద్ జిల్లాలోని 2లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందే అవకాశం ఉండేదన్న అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేయబోతుంది. ఇదే కాళేశ్వరం వల్ల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న ఆయకట్టు కన్నా ఎకరా అదనంగా రాదని ప్రచారం చేయబోతోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ప్రాణహిత–చేవెళ్ల మరోసారి ఎన్నికల ప్రచారాస్త్రంగా మారనుంది. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత బ్యారేజీ ప్రతిపాదిత స్థలాన్ని ప్రభుత్వం ఇటీవలనే తుమ్మిడిహెట్టి నుంచి దానికి ఎగువన గల వార్ధా నదిపైకి మార్చడం తెలిసిందే. -
ఫౌండేషన్ స్టోన్ మాదే
నర్సంపేట, (వరంగల్): గోదావరి జలాలను నర్సంపేటకు తరలించాలలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిధులు మంజూరు చేయగా ఫౌండేషన్ స్టోన్ వేసింది తామేనని, పనులు ప్రారంభించింది కూడా తామేనని ఏఐసీసీ సభ్యుడు, తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తూ పెద్ది సుదర్శన్‌రెడ్డి జలయాత్ర పేరుతో నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులను తరలించి అబద్దపు ప్రచారంతో లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు. వాస్తవానికి 2008–09లోనే ఫేజ్–3 ప్యాకేజీ–5 కింద కాంగ్రెస్ ప్రభుత్వం రూ.330 కోట్లను విడుదల చేసిందని గుర్తు చేశారు. ఈ పనులు జరుగుతున్న క్రమంలోనే 2014లో టీఆర్ఎస్ ప్రభ్వుం ఏర్పాటయ్యాక రీడిజైన్ పేరుతో స్వార్థం కోసం రైతులకు నష్టం కలిగే పనులు చేశారని ఆరోపించారు. జూరాల–పాకాల వాగ్దానం ఏమైందని, ప్రస్తుతం ఆ మాటను ఎందుకు దాటేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు గోదావరి–పాకాల అంటూ ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారని, దీనిని రైతులు గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ప్రతి పథకానికి లబ్ధిదారులను గ్రామసభల ద్వారానే ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ టీఆర్ఎస్ కార్యకర్తలకే మేలు జరుగుతున్న విషయమై కలెక్టర్ చొరవ తీసుకుని పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజవర్గ కన్వీనర్ ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మండల అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పెండెం రామానంద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హింగె మురళీ, కౌన్సిలర్ పుల్లూరి స్వామి, పట్టణ యూత్ అధ్యక్షుడు కోల చరణ్, వైనాల కార్తీక్, నియోజకవర్గ యూత్ నాయకులు వేముల ఇంద్రదేవ్‌తోపాటు పాల్గొన్నారు. -
కబ్జా గుప్పిట్లో సర్కారు భూమి
శంషాబాద్ రూరల్: ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమవుతోంది. రూ. కోట్లు విలువ చేసే స్థలాలను అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేసి ఇతరులకు విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అధికారుల నిర్లక్ష్యం.. ఉదాసీనత కబ్జాదారులకు వరంగా మారింది. శంషాబాద్ మండలం.. పాల్మాకుల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 87లో 13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పది సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందులోని కొంత స్థలం జేఎన్ఎన్యూఆర్ఎం గృహ సముదాయాలకు కేటాయించారు. ఇదే సమయంలో బెంగళూరు జాతీయ రహదారి– ఔటర్ రింగు రోడ్డు అనుసంధానం కోసం కొత్తగా పీ–వన్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ రహదారి ఇదే సర్వే నంబరులోని భూముల నుంచి వెళ్లింది. రోడ్డుకు రెండు వైపులా దాదాపు రెండెకరాల భూమి మిగిలిపోయింది. దక్షిణం వైపు జేఎన్ఎన్యూఆర్ఎం గృహ సముదాయాలను నిర్మించగా.. కొంత ఖాళీ స్థలం మిగిలింది. ఇక పీ–వన్ రోడ్డుకు ఉత్తరం వైపున సుమారు 2 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండిపోయింది. ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న పట్టా భూముల యజమానులు ప్రభుత్వ భూమిని తమ పొలంలో కలిపేసుకున్నారు. స్థానికంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది అండదండలు పుష్కలంగా ఉండడంతో కొందరు స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వ భూమిని పట్టా భూముల్లో కలిపేసి ఇతరులకు విక్రయించారు. ఈ భూమి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. విలువైన భూముల రక్షణ ఇంతేనా? శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు ఏర్పాటుతో మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. పాల్మాకులలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి పక్క నుంచే నాలుగు వరసల పీ–వన్ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సమీపంలోనే బెంగళూరు జాతీయ రహదారి కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఎకరం పొలం సుమారు రూ.కోటిన్నర వరకు ధర పలుకుతోంది. సర్వే నంబరు 87లో దాదాపు రెండు ఎకరాలు కబ్జాకు గురి కాగా.. ఈ భూములను ఆధీనంలోకి తీసుకున్న కొందరు ఇటీవలే అమ్మకానికి పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
మహానేత స్మరణలో..
శ్రీకాకుళం: వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు ప్రజలు కూడా మహా నేతను మనసారా స్మరించుకున్నారు. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలిలో వైఎస్సార్ తొమ్మిదో వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతా రాం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రెడ్‌క్రాస్ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆమదాలవలసలో తమ్మినేని సీతారాం అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, పొందూరు ఎంపీపీ ఎస్.దివ్య, బూర్జ నాయకులు కె.గోవిందరావు, సరుబుజ్జిలి మండల ఎం పీపీ కేవీజీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేటలోని 3 మండలాల్లోనూ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి పాల్గొన్నారు. ఎల్ఎన్ పేట మండలంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పాలకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.విక్రాం త్ నేతృత్వంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలోరక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులుతో పాటు నియోజకవర్గ నాయకులంతా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజాం సీహెచ్‌సీలో రోగులకు రొట్లు, పండ్లు పంపిణీ చేశారు. టెక్కలిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం టెక్కలి ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పలాసలో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, కౌన్సిలర్లు బస్టాండు కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. కవిటిలో పిరియా సాయిరాజ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నర్తు రామారావులు వేర్వేరుగా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఎచ్చెర్లలో సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో రణస్థలంలో వర్ధంతి కార్యక్రమాలు జరిపారు. -
రాజన్నకు ఘన నివాళి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి జిల్లా వాసులు ఘననివాళులర్పించారు. తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేయడంతో పాటు అనేక చోట్ల క్షీరాభిషేకాలు చేశారు. రక్తదాన శిబిరాలు, రోగులు, వృద్ధులకు పండ్లు, దుస్తులు పంచిపెట్టారు. అన్నదానం చేశారు. కేరళ వరద బాధితుల కోసం సాయం అందజేశారు. ఆనాడు వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను స్మరించుకుంటూ ఆయనే గనుక ఉండి ఉంటే రాష్ట్రం ఇంతటి దుస్థితిలో ఉండేది కాదని ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ పాలనను గుర్తు చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలే కాకుండా వైఎస్సార్, ఆయన తనయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం పట్టణంలోని వెంకటలక్ష్మీ జంక్షన్ వద్ద వై.ఎస్.ఆర్. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేరళ వరద బాధితులకు నియోజకవర్గం తరఫున రూ.4లక్షలు ఆర్థిక సాయం, పట్టణంలో పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న దేవాలయాలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి కూడలి వద్ద వై.ఎస్.ఆర్. విభజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కోలగట్ల ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ యువజన నాయకులు అవనాపు సోదరులు విక్రమ్, విజయ్ ఆధ్వర్యంలో వెంకటలక్ష్మి జంక్షన్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుచ్చలవీధిలో అవనాపు సోదరుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. సాలూరు పట్టణం బోసుబొమ్మ జంక్షన్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజన్న దొర క్షీరాభిషేకం చేశారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు అందజేశారు. కురుపాంలో ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజుల ఆధ్వర్యంలో రావాడ రోడ్డు కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నసమారాధన చేశారు. నెల్లిమర్ల నియోజక వర్గ సమన్వయకర్త పెనుమత్స సాంబశివరాజు ఆధ్వర్యంలో స్థానిక మొయిద, రామతీర్థం జంక్షన్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆస్పత్రి, మారుతి హాస్పటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండల కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, వైఎస్సార్ సీపీ జిల్లా కోశాధికారి కందుల రఘుబాబు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీచేశారు. గజపతినగరంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గరివిడి మండల కేంద్రంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మెరకముడిదాం మండల కేంద్రం వద్ద జరిగిన వేడుకల్లో డీసీఎం ఎస్ చైర్మన్ ఎస్.వి.రమణరాజు పాల్గొన్నారు. ఎస్.కోట పట్టణంలో ఎస్.కోట నియోజకవర్గ కన్వీనర్ ఎ.కె.వి.జోగినాయుడు, రాష్ట్ర కార్యదర్శులు రొంగలి జగన్నాథం, నెక్కల నాయుడు బాబు, గుడివాడ రాజేశ్వరరావు, షేక్ రహేమాన్ తదితరుల నేతృత్వంలో స్థానిక దేవీ జంక్షన్‌లోనూ, శ్రీనివాస థియేటర్ వద్ద ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పార్వతీపురం పట్టణంలో వైఎస్సార్ విగ్రహాని కి వైఎస్సార్సీపీ సమన్వయకర్త అలజంగి జోగారా వు, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మొక్కలు పంపిణీ చేశారు. సీతానగరం మండలంలో అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, సమన్వయకర్త జోగారావులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వెయ్యి మందికి అన్నదానం చేశారు. బొబ్బిలిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కర్త శంబంగి వెంకట చినప్పలనాయుడు వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీహెచ్‌సీలో రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పోల అరుణ్‌కుమార్, తారకరామ కాలనీలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమ్మిగారు కోనేటి గట్టు వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల రామసుధీర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆయన మేలు మరచిపోలేం వైఎస్సార్ పాలన స్వర్ణయుగం. ప్రజలకు ఆయన చేసిన మేలు ఎన్నటికీ మరచిపోరు. రైతులకు ఉచిత విద్యుత్, రుణాల మాఫీ, విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్, పేదలకు ఆరోగ్యశ్రీ వైద్యసేవలు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు 108 సేవలు అందించిన ఘనత వైఎస్సార్‌దే. జలయజ్ఞం చేపట్టి బీడు భూములను సస్యశ్యామలం చేశారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైఎస్సార్‌ది.– పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే -
మహానేత ఆశయాల కోసం పాటుపడదాం
పట్నంబజారు(గుంటూరు): మహానేత వైఎస్ ఆశయాల కోసం పాటుపడదామని వైఎస్సార్ సీపీ నేతలు పిలుపునిచ్చారు. వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని పట్టాభీపురం రెడ్డి జనసేవా సమితి కార్యదర్శి, వైఎస్సార్ అభిమాన సంఘం కానాల అంజనీ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి థియేటర్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంటరీ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య హాజరయ్యారు. ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి వైఎస్సార్ చేయూతనిచ్చారన్నారు. ఆయన ఆశయాల కోసం పేదలకు సాయం అందించటం సంతోషకరమైన విషయమన్నారు. పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ వైద్యశిబిరాన్ని నిర్వహించిన వైఎస్సార్ అభిమాన సంఘం సభ్యుల్ని అభినందించారు. కిలారి రోశయ్య మాట్లాడుతూ మహానేతను గుర్తు చేసుకుంటూ, పేదలకు అండగా నిలిస్తూ, గొప్ప మనసును చాటుకున్నారన్నారు. వైఎస్సార్ అభిమానం సంఘం సభ్యులు కానాల అంజనీ శ్రీకాంత్‌రెడ్డి, ఇన్నారెడ్డి, సీతారామిరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లుగా మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరు వేల మందికి ఉచితంగా మందులు పంపిణీ చేయటంతో పాటు పదివేల మందికి అన్నదానం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శిబిరానికి హాజరైన రోగులకు ఆసుపత్రికి వెళ్లిన తరువాత కూడా 50శాతం రాయితీ కల్పిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతంరం వైద్య శిబిరానికి హాజరైన వారికి పండ్లు, బ్రెడ్‌ను కూడా అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లాలుపురం రాము, వైఎస్సార్ అభిమాన సంఘం సభ్యులు మస్తాన్‌వలి, రాము, ప్రభు పాల్గొన్నారు. -
రాజన్నకు నీరాజనం
విజయవాడ సిటీ: మరపురాని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆదివారం గ్రామగ్రామాన నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. వైఎస్సార్ నాటి స్వర్ణయుగాన్ని తలచుకుని సంతోషించారు. మళ్లీ ఆనాటి పాలన రావాలని కోరుకున్నారు. పెనమలూరులో... పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్థంతి ఘనంగా జరిగింది. యనమలకుదురు, కానూరు, పోరంకి, పెనమలూరు, గోసాల, వణుకూరు, ఈడుపుగల్లు, కంకిపాడు, గొడవర్రు, పునాదిపాడు, నెప్పల్లి, చలివేంద్రపాలెం, కుందేరు గ్రామాల్లో కార్యక్రమాలకు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డలో అవనిగడ్డ నియోజకవర్గంలో లో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఆర్ఐ వికాస్ హైస్కూల్లో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మైలవరంలో.... మైలవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. మచిలీపట్నం, పామర్రులో... మచిలీపట్నంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని), నివాళులర్పించి, జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పామర్రులో నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో.... గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్సార్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గన్నవరం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలో ప్రసాదంపాడులో మహానేతకు ఘననివాళులర్పించడంతో పాటు ఏడు వేల మందికి అన్నదానం, ఇతర గ్రామాల్లో ఆల్పహారం పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పండ్ల వ్యాపారులకు ఆయన తోపుడు బండ్లు పంపిణీ చేశారు. నూజివీడులో... నూజివీడు పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటర్లో నిర్వహించిన వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపఠానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తిరువూరులో.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమాన్ని ఆదివారం తిరువూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మునుకుళ్ళలో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. కైకలూరులో.... కైకలూరు నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి వర్ధంతి కార్యక్రమం ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కైకలూరు, కైకలూరు సంతమార్కెట్ వద్ద 23 అడుగుల భారీ వైఎస్ విగ్రహం వద్ద డీఎన్నార్ ఆధ్వర్యంలో పూలమాలు వేసి నివాళి అర్పించారు. పెడనలో... పెడనలో పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ తూర్పు, పశ్చిమం, సెంట్రల్లో... విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త యలమంచిలి రవి ఆధ్వర్యంలో మహానేతకు నివాళి అర్పించడం తో పాటు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాస్ ఆ«ధ్వర్యంలో వైఎస్సార్ వర్థంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సెంట్రల్ నియోజవవర్గంలో వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. సింగ్‌నగర్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. నందిగామలో.... నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 9 వ వర్ధంతి కార్యక్రమాలు సమన్వయకర్త ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రతి గ్రామంలోను మహానేత విగ్రహాలు, చిత్ర పటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నందిగామ, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ నాయకుడు సామినేని వెంకట కృష్ణప్రసాద్ నియోజకవర్గంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. మహావ్యక్తి డాక్టర్ వైఎస్సార్ పార్టీలు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ బాగుచేయాలనే కలలుగన్న ఏకైక మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజÔóఖర్‌రెడ్డి వర్థంతిని పురస్కరించుకొని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేర్‌రెడ్డి విగ్రహానికి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగు నాగార్జున, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ నగర పార్టీ అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు, రాష్ట్ర అధికార ప్రతినిధి పైలా సోమినాయుడు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అ«ధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి పూలమాలలు వేసి రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. వైఎస్సార్ చిరస్మరణీయుడు... ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగు నాగార్జన మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిరస్మరణీయులన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమాన్ని, అభివృద్థిని రెండు కళ్లతో నడిపిన వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీలు, రైతులు, విద్యార్థులు, యువకులు, వృద్థులు, వికలాంగులు, ఉన్నత కులాల్లో పేదవారి అభివృద్దే, రాష్ట్ర అభివృద్థి అని తలచి పరిపాలించిన మహావ్యక్తి డాక్టర్ వైఎస్సార్ అన్నారు. డాక్టర్ అనే పదానికి సార్థకత... కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని ప్రతి పేదవాడు వారి ఇంటిలో తండ్రిగానో, సోదరునిగానో భావిస్తూ జరుపుకుంటున్నారంటే ఆయన వారి గుండెల్లో ఎంతగా నిలిచి ఉన్నారో అర్ధమవుతోందన్నారు. డాక్టర్ అనే పదానికి సార్థకత చేకూర్చిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేర్‌రెడ్డి అని అన్నారు. సమాజంలో పేద వర్గాలవారు ఎదుర్కొంటున్న అసమానతలు,, సమస్యలు గట్టెక్కాలంటే విద్య, వైద్యం అందించడం ఒక్కటే మార్గం అని గుర్తించిన రాజశేర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. సంక్షేమ రాజ్యం స్థాపించినమహనీయుడు.... నగర మర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఒక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబంలో ఓ పెద్ద కొడుకుగా చూపించిన ఔదార్యం ఎన్నడూ మరచిపోలేమని అన్నారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అ«ధ్యక్షుడు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ వర్థంతిని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. పేదప్రజలకు వైఎస్ తన పరిపాలన ద్వారా చేరువయ్యారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొప్పన భవకుమార్, సంయుక్త కార్యదర్శులు అడపాశేషు, చందన సురేష్, మైలవరపు దుర్గారావు, కాలే పుల్లారావు, ఎంవీఆర్ చౌదరి, అదనపు కార్యదర్శులు తోట శ్రీనివాస్, ప్రొఫెసర్ ఎం.పద్మారావు, విజయవాడ పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కట్లా మల్లేశ్వరరావు, ఎస్సీ సెల్ తోకల శ్యామ్, రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రమేష్ , డాక్టర్ సెల్ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ బండి నాగపుణ్యశీల, కార్పొరేటర్లు చోడిశెట్టి సుజాత, కావటి దామోదర్, ప్రచార విభాగం నగర అ«ధ్యక్షుడు పోతిరెడ్డి సుబ్బారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), తంగిరాల రామిరెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నగర సేవాదళ్ అ«ధ్యక్షుడు అక్కిపెద్ది శ్రీనివాస్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరాల ప్రభాకర్, నగర అధికార ప్రతినిధి మనోజ్ కొఠారి పాల్గొన్నారు. దివిసీమలో మెగా రక్తదాన శిబిరం అవనిగడ్డ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని దివిసీమలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఆర్ఐ వికాస్ హైస్కూల్లో మెగా రక్తదానం, ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా, మచిలీపట్నం నియోజకవర్గ కన్వీనర్, రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. మోపిదేవి, పేర్ని, పామర్రు నియోజకవర్గ కన్వీనర్ కైలే అనిల్‌కుమార్, అవనిగడ్డ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు తదితరులు మహానేత వైఎస్సార్ చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు. 315 మంది రక్తదానం చేయగా, 2500 మందికి ఉచిత వైద్యసేవలు అందించినట్టు సింహాద్రి చెప్పారు. మహానేత స్ఫూర్తితో ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు . -
జననేతకు ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లా ప్రజలు ఆదివారం ఆయనకు ఘన నివాళి అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాడవాడలా వైఎస్సార్ వర్ధంతికార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, వైద్యశిబిరాలు, అన్నదానాలు తదితర సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశారు. ఒంగోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలులో మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు కుప్పం ప్రసాద్ తదితరులు పాల్గొని మహానేతకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బాలినేని ⇔ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పేదల గుండె చప్పుడు అన్నారు. ఆయనే జీవించి ఉంటే నేడు ప్రకాశం జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్లేదనే భావన ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. వైఎస్సార్ స్వర్ణయుగం సాధన కోసం ప్రతి ఒక్కరూ చేయిచేయి కలిపి 2019 ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేద్దామని కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. అనంతరం ఒంగోలు నగరంతోపాటు కొత్తపట్నం మండలంలోను అన్నదాన కార్యక్రమాలు, సామాజిక సేవ కార్యక్రమాల్లో బాలినేని పాల్గొన్నారు. ఒంగోలు మండలంలోను వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి వైఎస్సార్‌కు నివాళి అర్పించారు. ⇔ కనిగిరిలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి చేశారు. మెగా రక్తదాన శిబిరం, అన్నదాన, వృద్దాశ్రమాలు, ప్రభుత్వ వైద్యశాలలో పండ్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ⇔ యర్రగొండపాలెం నియోజకవర్గంలో సమన్వయకర్త, సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వై.పాలెం, పెద్దారవీడు మండలాల్లోని కార్యక్రమాల్లో ఆదిమూలపు సురేష్ స్వయంగా పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళి అర్పించారు. యర్రగొండపాలెంలో అన్నదానం చేశారు. పుల్లలచెరువు మండలంలోని ఉమ్మడిచెరువులోను భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ⇔ దర్శి నియోజకవర్గంలో పార్టీ ముఖ్యనేతల ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాల వద్ద నివాళులర్పించడంతోపాటు అన్నదానం, పులిహోర పంపిణీ, పండ్లు పంపిణీ చేశారు. తాళ్లూరులో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సాయంత్రం ముండ్లమూరు మండలం నాయుడుపాలెంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి పాల్గొని వైఎస్సార్‌కు నివాళి అర్పించారు. రాజంపల్లిలో అన్నదానం చేశారు. ⇔ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐవి.రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేటు వద్ద వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అన్నదానంతోపాటు మానసిక వికలాంగుల పాఠశాలకు బియ్యం పంపిణీ చేశారు. బేస్తవారిపేటలో రక్తదాన శిబిరంతోపాటు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ⇔ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి ఆ«ధ్వర్యంలో నియోజకవర్గంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. మార్కాపురం పట్టణంలోని పాతబస్టాండు సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, వెన్నా హనుమారెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కంభం రోడ్డులో అన్నదానం చేశారు. వైఎస్సార్ జీవించి ఉంటే పశ్చిమ ప్రాంతంలోని ప్రజల కష్టాలు తొలగిపోయేవని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి నేడు ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా మారి ఉండేదన్నారు. ⇔ కొండపి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మాదాసు వెంకయ్య ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. మాదాసు వెంకయ్య భారీగా కార్యకర్తలు, నేతలతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని వైఎస్సార్‌కు నివాళి అర్పించారు. పలుచోట్ల అన్నదానం చేశారు. ⇔ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించడంతోపాటు పలు చోట్ల అన్నదానం చేశారు. అన్ని మండలాల్లో జరిగిన కార్యక్రమాలకు స్వయంగా మహీధరరెడ్డి హాజరై వైఎస్సార్‌కు నివాళి అర్పించారు. పండ్లు పంపిణీ చేపట్టారు. రాష్ట్ర కార్యదర్శి తూమాటి మాధవరావు నగరంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించారు. ⇔ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, యువనేత కృష్ణప్రసాద్‌ల నేతృత్వంలో అద్దంకి భవానీ సెంటర్‌తోపాటు అన్ని మండలాల్లో అన్నదాన కార్యక్రమాలు భారీగా నిర్వహించారు. పలుచోట్ల పులిహోర పొట్లాలు, అల్పాహారం పంపిణీ చేశారు. వైఎస్సార్ విగ్రహాలతోపాటు పలుచోట్ల వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ⇔ చీరాల నియోజకవర్గం సమన్వయకర్త యడం బాలాజీ నేతృత్వంలో వర్ధంతి కార్యక్రమాలు మిక్కిలిగా జరిగాయి. రక్తదానం, అన్నదానంతోపాటు రోగులకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాణి వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ⇔ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త రావిరామనాథంబాబు ఆ«ధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. పలుచోట్ల అన్నదానం చేశారు. చినగంజాంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ⇔ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త టీజేఆర్ సుధాకర్‌బాబు నేతృత్వంలో వర్ధంతి కార్యక్రమాలు జరగ్గా ముఖ్యఅతిథులుగా ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. చీమకుర్తిలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి తదితరులు హాజరయ్యారు. మద్దిపాడు, నాగులుప్పలపాడులలో కూడా పార్టీ ముఖ్యనేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
సరికొత్త చరిత్రను సృష్టించిన మహానీయుడు వైఎస్సార్
తూర్పు గోదావరి, మధురపూడి (రాజానగరం): రాజకీయాల్లో దివంగత మహానీయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సరికొత్త చరిత్రను సృష్టించి, రాజనీతిజ్ఞుడుగా నిలిచారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా కోరుకొండ మండలం బుచ్చెంపేటలో జరిగిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీస్తు పూర్వం, క్రీస్తుశకం తరహాలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి పూర్వం, తర్వాత అనిమాట్లాడుకొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్‌ను ప్రతిఒక్కరూ వారి గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తున్నారన్నారు. తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా మార్చడంలో ఆయన కృషి ఎనలేనిదన్నారు. నూతన రాజకీయాలకు రాజన్న దిక్చూచిగా నిలిచిపోతారన్నారు. రాజన్నబాటలోనే జగన్ నడుస్తున్నారన్నారు. అంతకు ముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాపవరం పార్టీ కార్యాలయంలో, మండలంలోని ప లు ప్రాంతాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. కార్య క్రమంలో పార్టీ మండల కన్వీనర్ వుల్లి బుజ్జిబాబు, పార్టీ నాయకులు నక్కా రాంబాబు, అడబాల సీతారామకృష్ణ, చింతపల్లి చంద్రం, అయిల రామకృష్ణ, బొరుసు బధ్రి, సలాది వెంకటేశ్వరరావు, తాడి హరిశ్చంద్రప్రసాద్ రెడ్డి, కాలచర్ల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ముందుచూపున్న మహానేత డాక్టర్ వైఎస్సార్ రామచంద్రపురం: రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఉండాలని ప్రజల కష్టాలను ముందుగానే తెలుసుకునే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల మహానేత విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ నేతృత్వంలో వైఎస్సార్ తొమ్మిదో వర్ధంతిని నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఎమ్మెల్సీ బోస్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఆయన చేసిన సేవ మరువలేనిదన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఆయన పరిపాలన సాగించి రాష్ట్ర ప్రజల గుండెల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్ అని ఆయన కొనియాడారు. రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి మాగాపు అమ్మిరాజు, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి సత్తిశంకర్‌రెడ్డి, పార్టీ నాయకులు చింతారామ్మోహన్రెడ్డి, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. -
సంక్షేమ ప్రదాతా.. సదా స్మరామి
జోహార్ వైఎస్సార్ నినాదం మార్మోగింది. పేదల గుండెల్లో దాగిఉన్న అభిమానం ఉప్పెనలా ఎగసి పడింది. సంక్షేమ ప్రదాత, జనహృదయ విజేతకు ప్రతి గుండె జేజేలు పలికింది. రాజన్నా.. మళ్లీరావా అంటూ నినదించింది. ఆదివారం దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతిని ప్రజలు జిల్లావ్యాప్తంగా జరుపుకున్నారు. సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి,ఏలూరు: పేదలు, బలహీనవర్గాల గుండెల్లో గూడు కట్టుకున్న దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ని ప్రజలు మనసారా స్మరించుకున్నారు. ఆయన అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకుని నివాళులర్పించారు. గ్రామగ్రామాన వైఎస్సార్ సీపీ శ్రేణులు,ప్రజలు మహానేత వర్ధంతి సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భారీగా అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పేదలు, వృద్ధులు, మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు. ఏలూరులో ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఆధ్వర్యంలో మహానేత వర్ధంతి నిర్వహించారు. తొలుత ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి, నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్‌తో కలిసి ఆళ్లనాని క్షీరాభిషేకం చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం నిర్వహించారు. నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురం స్టీమర్‌రోడ్డు జంక్షన్లో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పేదలకు పులిహోర పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంచారు. గర్భిణులకు చీరలు పంపిణీ చేశారు. వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ ఐలాండ్ సెంటర్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గుండుమోగుల సాంబయ్య, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ కర్రి భాస్కరరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కర్రి సుధాకర్‌రెడ్డి ఉన్నారు. గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో మహానేత వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. చిన్నాయగూడెం రూరల్ బ్యాంకు మాజీ ఛైర్మన్ ఆరేటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిమ్మకాయల మార్కెట్ వద్ద రైతు భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నిడదవోలు శాంతినగర్‌లో వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జి. శ్రీనివాసనాయుడు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కొవ్వూరు ఆస్పత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పార్టీ మండల అధ్యక్షులు అయినీడి పల్లారావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో సత్యసాయి నిత్యాన్నదాన పథకంలో అన్నసమారాధన నిర్వహించారు. తణుకు నియోజకవర్గ కో–ఆర్డినేటర్, పార్టీ రాష్ట్ర రాజకీయ సలహా మండలి సభ్యులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు నాయకత్వంలో వైఎస్ వర్ధంతి నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పాలకొల్లు సమన్వయకర్త గుణ్ణం నాగబాబు స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 200 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మున్సిపాలిటీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ యడ్ల తాతాజీ పాల్గొన్నారు. ఆచంట సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాలను భారీగా నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో సుమారు 2వేల మందికి అన్నదానం, 50 మంది వికలాంగులకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 30 మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆ«ధ్వర్యంలో వైఎస్ వర్థంతి నిర్వహించారు. దుప్పట్లు పంపిణీ చేశారు. చింతలపూడి సమన్వయకర్త ఉన్నమట్ల ఎలీజా ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నిర్వహించారు. ధర్మాజీగూడెంలో వైఎస్సార్సీపీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని కోటగిరి శ్రీధర్, ఎలీజా ప్రారంభించారు. సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తదానం చేశారు. దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. గ్రామాల్లో అన్నదానం, రక్తదానం చేశారు. పండ్లు పంపిణీ చేశారు. ఉండి సమన్వయకర్త పీవీఎల్ నర్శింహరాజు ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. గ్రామాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అన్నదా నం చేశారు. పేదలకు, వృద్ధులకు వస్త్రదానం చేశారు. భీమవరం సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వర్థంతి కార్యక్రమాలు జరిగాయి. సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. -
జోహార్ వైఎస్సార్...
మంకమ్మతోట(కరీంనగర్): దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతిని జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని గీతాభవన్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేష్ ముఖ్యతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభు త్వ ప్రధానాస్పత్రి పిల్లలవార్డులో, బాలసదన్‌లోని పిల్లలకు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమ వసతి గృహంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పేద ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ఆలోచించేవారని కొనియాడారు. పేదలందరికీ కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదల ప్రాణాలకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. అందరికీ ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేశారన్నారు. మహిళలకు పావలవడ్డీ, వృద్ధులు, వికలాంగులకు పింఛన్ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, జిల్లా అధికార ప్రతినిధి ఎండీ. షాహెంషా, నగర అధ్యక్షుడు ఇంజినీర్ సాన రాజన్న, యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.సలీం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గండి శ్యామ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, జిల్లా కార్యదర్శి దీటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన నేత : పొన్నం ఇచ్చిన మాటకు కట్టుబడిన నేత వైఎస్సార్ అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన కార్యాలయంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంత కష్టమైనా అనుకున్నది సాధించడం, నమ్ముకున్న వారికి న్యాయం చేయడం వైఎస్సార్ నైజామని పేర్కొన్నారు. తాను ప్రారంభించిన ప్రతి పథకానికీ ఇందిర, రాజీవ్ పేర్లను పెట్టి విశ్వసనీయతను చాటుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కర్ర రాజశేఖర్, మున్పిపల్ ఫ్లోర్‌లీడర్ ఆకుల ప్రకాష్, సరిళ్ల ప్రసాద్, బుచ్చిరెడ్డి, చెన్నాడి అజిత్‌రావు, మునిగంటి అనిల్, పడిశెట్టి భూమయ్య, వొంటెల రత్నాకర్, పొన్నం సత్యం, కటకం వెంకటరమణ, పొన్నం శ్రీనివాస్, బోనాల శ్రీనివాస్, మూల రవీందర్‌రెడ్డి, పిల్లి మహేష్, మడుపు మోహన్, తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, కె.సదానందచారి, తాజ్, లింగంపెల్లి బాబు, ఎండీ నదీమ్, గడప శ్రీనివాస్, పచ్చిమట్ల రాజశేఖర్, మర్రి శ్రీనివాస్, సుంకరి గణపతి తదితరులు పాల్గొన్నారు. రామడుగులో.. రామడుగు(చొప్పదండి): రామడుగులో వైఎస్సార్ వర్ధంతిని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పులి ఆం జనేయులుగౌడ్ అధ్వర్యంలో నిర్వహించారు. పో చమ్మ చౌరస్తాలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు. కార్యక్రమానికి యు వజన కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ హాజరై మాట్లాడుతూ.. పేదల కోసం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోల రమేష్, నాయకులు పంజాల శ్రీనివాస్‌గౌడ్, కాడె శంకర్, గోనెపల్లి బాలాగౌడ్, దేవకిషన్, బొమ్మరవేని తిరుపతి, బాపురాజు, నారాయణ, పిండి శ్రీని వాస్‌రె డ్డి, వెంకటేష్, రాజశేఖర్, సముద్రాల సత్యం, అజయ్, సుంకె ఆశాలు, శ్రీనివాస్ పాల్గొన్నారు. వైఎస్సార్ సేవలు మరువలేనివి వైఎస్సార్సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సందమల్ల నరేష్ హుజూరాబాద్: వైఎస్సార్ సేవలు మరువలేనివని వైఎస్సార్సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సందమల్ల నరేష్ అన్నారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులకు ఉచిత విద్యుత్, ప్రాంతాలకతీతంగా నిరుపేద విద్యార్థులకు సాంకేతిక విద్య, ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మేడ్దుల అర్జున్ యాదవ్, మునిగంటి రాకేష్‌రెడ్డి, అపరాధ మహేందర్, బరిగే తిరందాస్, పెద్ది చంద్రకాంత్, ముక్క అన్వేష్, కాతం రణదీర్, నాగవెల్లి మధుసూదన్, శ్రీకాంత్, విష్ణు, పవన్, మహేష్, ప్రవీన్ పాల్గొన్నారు. -
మరపురాని మహానేత
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనలు, అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భౌతికంగా వైఎస్సార్ దూరమైనా ఎల్లప్పుడూ తమ గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని పేర్కొన్నారు. ఆయన ఎప్పటికీ మరపురాని మహానేతగా నిలిచిపోతారన్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. నెల్లూరు(సెంట్రల్) : కావలిలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదివారం వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ మరణించి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఎన్నటికీ మరచిపోలేనివని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేద్దామన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సూళ్లూరుపేట పట్టణం, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందారని గుర్తు చేశారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. వెంకటగిరిలో జెడ్పీ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. బొమ్మిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయసాధనకు కృషి చేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉందామన్నారు. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ చూపి న అడుగుజాడల్లో నడుద్దామన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కలసి పనిచేద్దామన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత చేసిన సేవలను ఆయన గుర్తు చేశారు. గూడూరు నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో సమన్వయకర్త మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ లాంటి ప్రజాసంక్షేమ పాలన వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నగర డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మహానేత రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్సార్‌కు గుర్తుగా జగనన్నకు తోడుగా ఉందామన్నారు. మహానేత మన మధ్య లేక పోయినా ఆయన చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మరవలేమన్నారు. ఆత్మకూరు పట్టణంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో స్థానిక వైఎస్సార్సీపీ నేతల ఆధ్వర్యంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కరెంటు ఆఫీçసు సెంటర్లో స్థానిక నేతల ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యులు, నేతల ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. -
మహానేతకు జననివాళి
సాక్షి, కడప : దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని నివాళి అర్పించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ను మరువలేక..అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ అనుక్షణం తలుచుకుంటూనే ఉన్నామంటూ స్మరించుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్సార్ విగ్రహాలతోపాటు చిత్రపటాల వద్ద నివాళులర్పించిన అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్‌ను అడుగడుగునా తలుచుకుంటూ అన్ని వర్గాల ప్రజలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు సామాజిక సేవల్లో భాగంగా ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనాథ శరణాలయాల్లో అన్నదానం, వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. వైఎస్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యుల నివాళి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్ సతీమణి, వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ, వైఎస్ భారతమ్మ, బ్రదర్ అనిల్‌కుమార్, సాక్షి గ్రూపు సంస్థల చైర్ పర్సన్ వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ సోదరి విమలమ్మ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, సోదరులు వైఎస్ వివేకానందరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, సుధీకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కె.సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి తదితరులు నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయనను స్మరించుకునే సమయంలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురి కావడంతో నిశ్శబ్ద వాతావరణం చోటుచేసుకుంది. కడపలో సేవా కార్యక్రమాలు జిల్లా కేంద్రమైన కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టాయి. పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ నాయకులు బండి నిత్యానందరెడ్డి, మాసాపేటలో జహీర్ ఏర్పాటు చేపిన అన్నదాన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, మేయర్ పాలుపంచుకున్నారు. కోటిరెడ్డిసర్కిల్ వద్ద వైఎస్సార్ చిత్రపటం వద్ద విద్యార్థి సంఘం నాయకుడు ఖాజా రహమతుల్లా, యువజన విభాగం అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ల ఆధ్వర్యంలో 101 టెంకాయలు కొట్టారు. పులివెందులలో రక్తదాన శిబిరం, దుస్తుల పంపిణీ పులివెందులలో భాకరాపురంలో ఉన్న వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా సమన్వయకర్త, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకుడు వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైద్యుల విభాగం నాయకులు వైఎస్ అభిషేక్‌రెడ్డి పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సౌజన్యంతో దివ్యాంగులకు దుస్తుల పంపిణీ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొని అందజేశారు. పులివెందులలో అన్ని వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలతో పార్టీ శ్రేణులు నివాళులర్పించాయి. ప్రొద్దుటూరులో .. ప్రొద్దుటూరులోని పెన్నానగర్లో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ రాష్ట్రానికి చేసిన మేలు గురించి కొనియాడారు. వైఎస్సార్ సర్కిల్లో ఉన్న దివంగత సీఎం విగ్రహానికి కూడా రాచమల్లు పాలాభిషేకం చేశారు. రాయచోటిలో.. రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కమలాపురంలో అన్నదానం కమలాపురం నియోజకవర్గంలోని అన్నిచోట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదానాలు, పాలాభిషేకాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కమలాపురంలోని అనాథ ఛాత్రాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో విగ్రహానికి ఎమ్మెల్యే, సమన్వయకర్తలు పాలాభిషేకం, పూలమాలతో నివాళులర్పించారు. రైల్వేకోడూరులో.. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు టోల్‌గేటు వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకున్నారు. రాజంపేటలో.. రాజంపేట మన్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలో వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదానం, ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాజంపేటలో వైఎస్సార్ విగ్రహాలకు రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజంపేట పార్లమెంటరీ బీసీ కన్వీనర్ పసుపులేటి సుధాకర్ ఏరియా ఆస్పత్రిలో పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఆకేపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. జమ్మలమడుగు, బద్వేలులో.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బయ్యల ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ, అన్నదానం, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. జమ్మలమడుగులోని క్యాంబెల్, ప్రభుత్వ ఆస్పత్రిల్లో పండ్లు పంపిణీ చేశారు. జమ్మలమడుగు పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి డాక్టర్ సుధీర్‌రెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. పోరుమామిళ్ల, బద్వేలులో డాక్టర్ వెంకట సుబ్బయ్య రక్తదాన, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
ఈ ప్రగతి నీ చలువే..
వ్యవసాయం.. సంక్షేమం..అన్ని రంగాల్లో అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురైన చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు దివంగత మహానేత వైఎస్సార్. 2004లో ముఖ్యమంత్రి కాగానే జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపారు. ఒకటి కాదు రెండు కాదు జిల్లా అభివృద్ధిలో ఆయనది చెరగని ముద్ర. 108, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల సృష్టికర్తగా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారు. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరులోని అనుప్పల్లెలో జరిగే రచ్చబండకు రావాల్సిన ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో అశువులు బాసారు. ఆయన భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో మనసున్న మారాజుగా చిరస్థాయిగా నిలచిపోయారు. ఆదివారం ఆయన వర్ధంతి సందర్భంగా.. చిత్తూరు, సాక్షి ఫీజు రీయింబర్స్మెంట్ జిల్లాలో 11.2 వేల బలహీనవర్గాల కుటుంబాలు.. 50 వేల ఎస్సీ కుటుంబాలు, 768 ఎస్టీ కుటుంబాలు, 15.3 వేల మైనార్టీ కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందాయి. జిల్లాలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద 4.2 లక్షల మంది విద్యార్థులు లాభపడ్డారు. డాక్టర్లు, ఇంజినీర్లుగా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పేదలకు ఆరోగ్య సిరి.. ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007లో ప్రవేశపెట్టారు. 942 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించారు. జిల్లాలో క్యాన్సర్ బాధితులే 30 వేల మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందారు. 56.4 వేల మంది గుండెజబ్బు బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పుట్టుకతోనే బధిరుడిగా జన్మించిన చిన్నారులకు కాక్లియర్ ఇంప్లాంట్స్ అమర్చేందుకు ఒక్కొక్కరికి రూ.6.5 లక్షలు వెచ్చిం చారు. నగరిలో వంద పడకల ఆస్పత్రిని తెరిపించారు. రైతే రాజు.. దశాబ్దాల పాటు వరుసగా కరువు కాటకాలతో రైతులు అప్పుల పాలయ్యారు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న రోజులవి. 2004 నుంచి జిల్లాలో నూతన శకం ప్రారంభం అయింది రైతుకు. అన్నదాతలే వెన్నెముక అని నమ్మిన రాజశేఖర్ రెడ్డి వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలిసంతకం చేశారు. వేల కోట్ల రుణాలు ఒక్క సిరా పోటుతో రద్దు చేశారు. 1998 జులై 1 నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలన్నింటికీ రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. జిల్లాలో 22 మంది రైతులకు సహాయం అందింది. సోమశిల– స్వర్ణముఖి కాలువ తవ్వకం వల్ల లక్ష ఎకరాలు సాగులోకి వచ్చింది. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు ఆయన కాలంలో ఎక్స్‌ప్రెస్‌లా జరిగాయి. జిల్లాలో వరి దిగుబడి రెండున్నర రెట్లు పెరిగింది. ఒక్క సారి కూడా విద్యుత్ చార్జీ పెంచలేదు. జిల్లాలో రూ.120 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలు మాఫీ చేశారు. చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీకి రూ.10 కోట్లు కేటాయించి తెరిపించారు. 13 వేల మంది చెరకు రైతులకు మేలు జరిగింది. పాడి రైతులకు భరోసా ఇస్తూ 2006 మహిళా సంఘాల ఆధ్వర్యంలో బీఎంసీ(బల్క్ మిల్క్ సెంటర్స్) తెరిచారు. దీంతో పాడి రైతులు ఆర్థికంగా స్థిర పడ్డారు. భూ దాత ..మహానేత జిల్లాలో వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచారు. ముఖ్యమంత్రిగా పని చేసిన ఐదు సంవత్సరాల కాలంలో జిల్లాలో రెండు విడతల్లో శ్రీకాళహస్తిలో 26 వేల ఎకరాలు, చంద్రగిరిలో 102 ఎకరాలభూమిని పేదల పరం చేశారు. వారి జీవితాల్లో నిండు వెలుగులు నింపారు. తిరుపతిలోనే 12వేల ఇళ్లు సొంత ఇళ్లు ప్రతి ఒక్కరికీ కల. దీన్ని నెరవేర్చేందుకు రాజశేఖర్‌రెడ్డి అహర్ని«శలు శ్రమించారు. జిల్లాలో ఆయన ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం భాగంగా 3.04 లక్షల ఇళ్లు నిర్మించారు. దీనికోసం రూ.243.32 కోట్లు ఖర్చు చేశారు. ఒక్క తిరుపతిలోనే దాదాపు 12వేల ఇళ్లు పేదలకు కట్టించి ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ కాలనీలు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్‌దే. ఆయన హయాంలో కుప్పం నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పరుగులు పెట్టింది. శాంతిపురంలో ఐటీఐ కళాశాల నిర్మించారు. కుప్పం పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.51 కోట్లతో పాలారు డ్యాంను నిర్మించేందుకు తలపెట్టగా చంద్రబాబు నాయుడు అడ్డుపుల్ల వేశారనే అపవాదు ఉంది. రాజన్న నిన్ను మరవలేం అంటూ జిల్లా ప్రజలు వైఎస్సార్‌ను తలచుకుంటూనే ఉన్నారు. -
చరితలో చెరగని గురుతు నీవు..
అడగకుండానే అన్నీ ఇచ్చిన దయాగుణం.. నిరుపేదలకు అది స్వర్ణయుగం.. జలయజ్ఞంతో కరువు నేల సస్యశ్యామలం.. రేపటి భవిష్యత్‌కు ఫీజు రీయింబర్స్మెంట్ వరం.. ఆగుతున్న గుండెలకు ఆరోగ్యశ్రీ మహాభాగ్యం.. పథకాలతో ఊరూరా సంక్షేమ సంతకం.. జనహృదయాల్లో నిలిచిన దైవం.. చరితలో నీ జ్ఞాపకం శాశ్వతం.. ప్రజా నాడి పట్టిన డాక్టర్ కర్నూలు(హాస్పిటల్): ఆరోగ్య పథకాలంటే దేశంలో వెంటనే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలేనంటే అతిశయోక్తి కాదు. కార్పొరేట్ కాదు కదా ప్రైవేటు ఆసుపత్రుల మెట్లు ఎక్కడానికి కూడా భయపడే పేదవాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా చేయించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించారు. అత్యవసర వైద్యం అందించేందుకు గాను 108 అంబులెన్స్‌లు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించేందుకు 104 సేవలు ఆయన హయాంలో వచ్చిన పథకాలే. స్వయంగా ఆయన డాక్టర్ అయినందున పేదల కష్టాలేంటో ఆయన గుర్తెరిగి ఈ పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెలో దేవుడయ్యాడు. జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం 2008లో ప్రారంభమైంది. అప్పట్లో 20 దాకా ప్రైవేటు ఆసుపత్రులతో పాటు కర్నూలు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఈ పథకం వర్తింపజేశారు. పెద్దాసుపత్రిలో గుండెకు ఊపిరి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆసుపత్రికి వచ్చారు. గుండె జబ్బుల విభాగంలో కేథలాబ్ యూనిట్ అవసరం అవుతుందని వైద్యులు చెప్పగానే అంగీకరించి ఏర్పాటు చేశారు. ఇది 2008లో ప్రారంభమై ఇప్పటికీ నిరంత రాయంగా హృద్రోగులకు సేవలు అందిస్తోంది. ఈ యంత్రం ద్వారా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టెంట్లు వేయడం వంటి సేవలు అందిస్తున్నారు. గతంలో ఈ సేవలు పొందాలంటే రోగులు హైదరాబాద్ వెళ్లేవారు. 8మాతాశిశు భవనం వైఎస్ చలువే ప్రస్తుతం పెద్దాసుపత్రిలోని మాతాశిశు భవనాలు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతోనే నిర్మించారు. 2006లో ఈ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. 2007లో దీని నిర్మాణం ప్రారంభమైంది. మొదట ఇప్పుడున్న చిన్నపిల్లల విభాగం భవన నిర్మాణం పూర్తయ్యింది. అప్పట్లో పాత భవనంలో ఉన్న చిన్నపిల్లల విభాగంలో సౌకర్యాలు లేక చిన్నపిల్లలు చనిపోతుండటంతో స్పందించిన అధికారులు ఉన్నఫలంగా కొత్త భవనంలోకి వార్డును మార్చారు. గైనిక్ కోసం నిర్మించిన ఈ విభాగంలో పిల్లల వార్డు చేరడంతో మళ్లీ గైనిక్ విభాగానికి టెండర్లు పిలిచారు. ఆరేళ్లకు పైగా ఈ భవనం నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసుకుని ఇటీవలే ప్రారంభమై ఉత్తమ సేవలు అందిస్తోంది. చికిత్సకు ఎంత ఖర్చయినా వైఎస్ఆర్ ఇచ్చేవారు నా కుమారుడు అశోక్‌కుమార్ నాయక్‌కు పుట్టుకతో గుండెజబ్బు, బుద్ధిమాంధ్యం ఉంది. హైదరాబాద్ ఇన్నోవా హాస్పిటల్లో 2010లో ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స చేయించాము. అయితే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చికిత్సకు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరించేది. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రూ.1. 25 లక్షలు మాత్రమే ఇచ్చారు. మాకు మాత్రం రూ.6.80 లక్షలు ఖర్చు అయింది. దాతల ద్వారా సహాయం పొంది వైద్యం అందించాము. ఇప్పుడు బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. – చంద్రపాల్ నాయక్, జమ్మినగర్తండా, వెలుగోడు చేనేతకు ఆ‘ధార’మై.. వైఎస్ఆర్ హయాంలో రూ.7.90 కోట్ల రుణాలు మాఫీ కర్నూలు(అర్బన్): చేనేత రంగానికి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేయూత అందించారు. చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక కార్యాక్రమాలను చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న నలుగురు చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల ప్రకారం మంజూరు చేశారు. వైఎస్ మృతి అనంతరం జిల్లాలో ఆరుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా ఇప్పటికీ నయాపైసా విడుదల చేయలేదు. రైతుల రుణమాఫీతో పాటు చేనేతల రుణాలు కూడా మాఫీ అయి న నేపథ్యంలో జిల్లాలో సహకార, వ్యక్తిగత రుణాలు రూ.7,90,54,288 మాఫీ అయ్యాయి. జిల్లాలోని 18 సహకార సంఘాల్లోని సభ్యులకు సంబంధించి రూ.4,53,17,935 మాఫీ అయ్యాయి. అలాగే 1942 మంది చేనేత కార్మికులకు వివిధ బ్యాంకుల్లో ఉన్న వ్యక్తిగత రుణాలు రూ.3,37,36,353 మాఫీ అయ్యాయి. ముఖ్యమంత్రిగా డా.వైఎస్ఆర్ ఉన్న సమయంలో 50 ఏళ్లకే చేనేత కార్మికులకు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 4,417 మంది నేత కార్మికులకు పెన్షన్ అందుతోంది. అలాగే నిరుపేద చేనేత కార్మికులను గుర్తించి వారికి అంత్యోదయ అన్నయోజన (ఏఏవై) పథకం కింద నెలకు 35 కేజీల బియ్యాన్ని అందించేందుకు ప్రత్యేకంగా వీవర్స్ కార్డులు అందించారు. ఇప్పటికి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో 115 మంది ఈ కార్డుల ద్వారా బియ్యం తీసుకుంటున్నారు. గృహ నిర్మాణానికి విడుదల చేసే మొత్తానికి చేనేతలకు అదనంగా రూ.20 వేలను విడుదల చేశారు. పేదోడి సొంతింటి కల.. నెరవేరిన వేళ కర్నూలు(అర్బన్): ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మదిలో పురుడు పోసుకున్న ‘ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం’ ద్వారా జిల్లాలో లక్షల మంది నిరుపేదలు ఇంటి యజమానులయ్యారు. జిల్లాలో మూడు విడతలుగా జరిగిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో 3.28 లక్షల గృహాలు మంజూరు చేసి రూ.1013 కోట్లు ఖర్చు చేశారు. పార్టీలకతీతంగా అడిగిన వారందరికీ గృహాలు మంజూరు కావడంతో గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి పేదవాడు సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం మొదటి విడతలో జిల్లాకు 1,22,225 గృహాలు మంజూరు కాగా, ఈ గృహాల నిర్మాణాలకు రూ.36009.37 లక్షలు వెచ్చించారు. రెండవ విడతలో 1,21,039 గృహాలు మంజూరు కాగా, ఈ నిర్మాణాలకు రూ.40446.74 లక్షలు ఖర్చు చేశారు. అలాగే మూడవ విడతలో 61,143 గృహాలు మంజూరు కాగా, ఈ నిర్మాణాలకు రూ.24909.76 లక్షలను వెచ్చించారు. అలాగే 2004–05 ఆర్థిక సంవత్సరం నుంచి 2009–10వ ఆర్థిక సంవత్సరం వరకు ఇందిరా ఆవాజ్ యోజన పథకం ద్వారా 23,396 ఇళ్లను మంజూరు చేసి ఈ ఇళ్ల నిర్మాణాలకు రూ.63 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాలుగు న్నరేళ్లలో ఇప్పటి వరకు జిల్లాకు కేవలం 74,121 గృహాలను మాత్రమే మంజూరు చేయగా, ఇప్పటి వరకు 31,135 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన గృహాలు వేర్వేరు దశల్లో కొనసాగుతున్నాయి. 30 ఏళ్ల కల నెరవేరింది ఇళ్లులేక 30 ఏళ్లుగా పూరి గుడిసెలోనే జీవనం సాగిస్తూ వచ్చాం. మహానేత రాజశేఖర్‌రెడ్డి వచ్చిన వెంటనే నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. అప్పట్లో రూ.35 వేలు రుణం వచ్చింది. సొంత స్థలం ఉండడంతో దానిలో ఇల్లు నిర్మించుకున్నాను. నా ఇల్లు ఆయన పుణ్యమే. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. – మగ్బుల్, శిరివెళ్ల