రాజన్నకు ఘన నివాళి | YSR Death Anniversary In Vizianagaram | Sakshi
Sakshi News home page

రాజన్నకు ఘన నివాళి

Published Mon, Sep 3 2018 1:28 PM | Last Updated on Mon, Sep 3 2018 1:41 PM

YSR Death Anniversary In Vizianagaram - Sakshi

చీపురుపల్లిలోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న బెల్లాన, మజ్జి

సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డికి జిల్లా వాసులు ఘననివాళులర్పించారు. తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేయడంతో పాటు అనేక చోట్ల క్షీరాభిషేకాలు చేశారు. రక్తదాన శిబిరాలు, రోగులు, వృద్ధులకు పండ్లు, దుస్తులు పంచిపెట్టారు. అన్నదానం చేశారు. కేరళ వరద బాధితుల కోసం సాయం అందజేశారు. ఆనాడు వైఎస్‌ చేపట్టిన సంక్షేమ పథకాలను స్మరించుకుంటూ ఆయనే గనుక ఉండి ఉంటే రాష్ట్రం ఇంతటి దుస్థితిలో ఉండేది కాదని ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వైఎస్‌ పాలనను గుర్తు చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలే కాకుండా వైఎస్సార్, ఆయన తనయుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం పట్టణంలోని వెంకటలక్ష్మీ జంక్షన్‌ వద్ద  వై.ఎస్‌.ఆర్‌. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేరళ వరద బాధితులకు నియోజకవర్గం తరఫున రూ.4లక్షలు ఆర్థిక సాయం, పట్టణంలో పలు ప్రాంతాల్లో  నిర్మాణంలో ఉన్న దేవాలయాలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా  వెంకటలక్ష్మి కూడలి వద్ద వై.ఎస్‌.ఆర్‌. విభజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కోలగట్ల ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ రాజకీయ వ్యవహారాల జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్‌  వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ యువజన నాయకులు అవనాపు సోదరులు విక్రమ్, విజయ్‌ ఆధ్వర్యంలో వెంకటలక్ష్మి జంక్షన్‌ వద్ద  వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుచ్చలవీధిలో అవనాపు సోదరుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది.
 సాలూరు పట్టణం బోసుబొమ్మ జంక్షన్‌ వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి ఎమ్మెల్యే రాజన్న దొర క్షీరాభిషేకం చేశారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో

రోగులకు  పండ్లు అందజేశారు.  
 కురుపాంలో ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజుల ఆధ్వర్యంలో రావాడ రోడ్డు కూడలిలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నసమారాధన చేశారు.

 నెల్లిమర్ల నియోజక వర్గ సమన్వయకర్త పెనుమత్స సాంబశివరాజు ఆధ్వర్యంలో స్థానిక మొయిద, రామతీర్థం జంక్షన్‌లో ఉన్న వైఎస్సార్‌ విగ్రహాలకు  పూలమాలలు  వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆస్పత్రి, మారుతి హాస్పటల్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండల కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, వైఎస్సార్‌ సీపీ జిల్లా కోశాధికారి కందుల రఘుబాబు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజులు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీచేశారు.
 గజపతినగరంలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో   ఆర్టీసీ కాంప్లెక్స్‌ దగ్గరలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు.
 చీపురుపల్లి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి  జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గరివిడి మండల కేంద్రంలో జరిగిన వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మెరకముడిదాం మండల కేంద్రం వద్ద జరిగిన వేడుకల్లో డీసీఎం ఎస్‌ చైర్మన్‌ ఎస్‌.వి.రమణరాజు పాల్గొన్నారు.

 ఎస్‌.కోట పట్టణంలో  ఎస్‌.కోట నియోజకవర్గ  కన్వీనర్‌ ఎ.కె.వి.జోగినాయుడు, రాష్ట్ర కార్యదర్శులు రొంగలి జగన్నాథం, నెక్కల నాయుడు బాబు, గుడివాడ రాజేశ్వరరావు, షేక్‌ రహేమాన్‌ తదితరుల నేతృత్వంలో స్థానిక దేవీ జంక్షన్‌లోనూ, శ్రీనివాస థియేటర్‌ వద్ద ఉన్న రాజశేఖరరెడ్డి  విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు  పండ్లు పంపిణీ చేశారు.
 పార్వతీపురం పట్టణంలో వైఎస్సార్‌ విగ్రహాని కి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అలజంగి జోగారా వు, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మొక్కలు పంపిణీ చేశారు. సీతానగరం మండలంలో అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు, సమన్వయకర్త జోగారావులు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వెయ్యి మందికి అన్నదానం చేశారు.
 బొబ్బిలిలోని పార్టీ  కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కర్త శంబంగి వెంకట చినప్పలనాయుడు వైఎస్సార్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీహెచ్‌సీలో రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పోల అరుణ్‌కుమార్, తారకరామ కాలనీలోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమ్మిగారు కోనేటి గట్టు వద్ద  జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల రామసుధీర్‌ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

ఆయన మేలు మరచిపోలేం  
వైఎస్సార్‌ పాలన స్వర్ణయుగం. ప్రజలకు ఆయన చేసిన మేలు ఎన్నటికీ మరచిపోరు. రైతులకు ఉచిత విద్యుత్, రుణాల మాఫీ, విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్, పేదలకు ఆరోగ్యశ్రీ వైద్యసేవలు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు 108 సేవలు అందించిన ఘనత వైఎస్సార్‌దే. జలయజ్ఞం చేపట్టి బీడు భూములను సస్యశ్యామలం చేశారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైఎస్సార్‌ది.– పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement