YSR Special
-
మరుపురాని మహానేత
ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాపైనా చెరగని ముద్రవేశారు. ఆరోగ్యశ్రీతో ఎందరికో ప్రాణాలు పోసి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి.. రుణమాఫీ, ఉచిత విద్యుత్‌తో అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచారు. నిమ్స్, కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలి అడుగులు పడింది వైఎస్ హయాంలోనే. హ్యాండ్లూమ్ పార్క్, మూసీ కాల్వల ఆధునికీకరణ మహానేత ఘనతే. సోమవారం వైఎస్సార్ జయంతి సందర్భగా ఉమ్మడి జిల్లాలో మహానేత హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలైన సంక్షేమ పథకాలపై ప్రత్యేక కథనాలు.. సాక్షి, యాదాద్రి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేరరెడ్డి హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పై చెరగని ముద్ర వేశారు. వైఎస్ చేపట్టిన పథకాలతో లబ్ధిపొందిన వారు ఆయనను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత, సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన అభివృద్ధి ప్రదాతగా వైఎస్సార్ నేడు కీర్తించబడుతున్నారు. జిల్లాలో చేనేత పరిశ్రమను నుమ్ముకుని జీవిస్తున్న వేలా దిమంది వృత్తిదారుల కోసం భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లి మండలం కనుముక్కుల శివారులో పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌ను ప్రారంభించారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా 10వేల మందికి నేడు ఉపాధి లభిస్తోంది. ప్రాణహిత చేవేళ్ల పథకం రూపకల్పన సాగు నీటి వసతి లేని జిల్లాకు ప్రాణహిత చేవెళ్ల ద్వారా గోదావరి నదీజలాలను అందించడానికి బస్వాపురం రిజర్వాయర్ ప్రతిపాదించి పనులను పూర్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి పథకం పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ప్యాకేజీ 15,16 ద్వారా బస్వాపురం రిజర్వాయర్, సాగునీటి కాల్వల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం రీడిజైనింగ్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వైఎస్ రూపకల్పన చేసిందే. జిల్లాలో వృథాగా పోతున్న మూసీ జలాలను రైతులకు అందించడానికి బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలను మంజూరు చేసి జిల్లా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్సార్. ఆలేరులో ఆరోగ్యశ్రీ ప్రారంభం.. ఆలేరులో ఆరోగ్య శ్రీ పథకాన్ని 2007లో ప్రారంభించారు. భువనగిరి మండలం వడాయిగూడెంలో 2009లో రూపాయికి కిలో బియ్యం పథకం ప్రారంభించారు. ఫ్లోరిన్నీటి నివారణకు ఆలేరు నియోజకవర్గానికి రూ.70కోట్లతో ఉదయసముద్రం నుంచి కృష్ణా నీటి సరఫరా నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఇదేకాక ఉమ్మడి జిల్లాలోనే ఫ్లోరైడ్ నివారణకు అంకురార్పణ చేసిన మహనీయుడు రాజశేఖరరెడ్డి. యాదగిరిగుట్టలో రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం పనులను నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత అభివృద్ధిపై చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్సార్. బీబీనగర్‌లో ఎయిమ్స్.. వైఎస్ చలవే.. బీబీనగర్ శివారులోని రంగాపూర్ వద్ద నిమ్స్‌ను ప్రా రంభించింది వైఎస్సారే. ప్రస్తుతం కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్ వైఎస్ ప్రారంభించిన నిమ్స్‌లోనే కావడం విశేషం. అప్పట్లోనే ఎయిమ్స్ తరహాలో నిమ్స్‌ను అభివృద్ధి చేయాలని తపించిన దార్శనికుడు వైఎస్. 2005 డిసెంబర్ 31న శంకుస్థాపన చేశారు. నిమ్స్ పనుల కోసం రూ.100 కోట్లను మంజూరు చేశారు. అనంతరం 2009 ఫిబ్రవరి 22న ఆస్పత్రిని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం నిమ్స్‌లో ఓపి సేవలను ప్రారంభించింది. త్వరలో ఎయిమ్స్వైద్య కళాశాల, పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. అపరసంజీవని.. 108 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 108 వాహనం అపరసంజీవనిగా మారింది. 108వాహన సేవలతో మంది క్షతగాత్రులకు ప్రాణాలు కాపాడుతున్నారు. 2005లో కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు వాహనాలను మాత్రమే కేటాయించి నిర్వాహణ బాధ్యతలను జేవీకే సంస్థకు అప్పగించారు. రెండేళ్ల కాలంలో మంచి ఫలితాలను రావడంతో 2007లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 34 వాహనాలను కేటాయించారు. నిత్యం వందలాది రోడ్డు ప్రమాద బాధితులతో పాటు పాముకాటు, ప్రసవ వేదనలతో బాధపడుతున్న వారిని, ఇతర అత్యవసర వైద్య సేవల కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులకు 108 సిబ్బంది తరలించి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. కేవలం 108 నంబర్‌కు ఫోన్ చేసిన పది నిమిషాల్లోనే కుయ్.కుయ్ మంటూ సంఘటన స్థనానికి చేరుకుని బాధితులను సకాలంలో సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వారిని కాపాడడంలో 108 నిజంగా అపరసంజీవనిగా నిలుస్తోంది. జిల్లాఓ 108 సేవలకు ప్రారంభించిన నాటి నుంచి అంటే 2005 నుంచి 2009 సంవత్సరం నాటికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెడికల్ ఎమర్జెన్సీ కేసులు 28,999 , ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కేసులు 6,659, రోడ్డు ప్రమాదాల కేసులు 5,322 మందిని సకాలంలో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి వారి ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్రను పోషించింది. 108 సేవలను మరింత బలోపేతం చేసి ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రస్తుత ప్రభుత్వం కృషి చేయాలని, వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. వెలుగులు నింపిన ‘ రాజీవ్ ఆరోగ్యశ్రీ’ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపింది. కారొఇ్పరేట్ స్థాయి వైద్యాన్ని పొందలేక ఎంతోమంది నిరుపేదల ప్రాణాలను వదిలిన సంఘటనలు చూసిన వైఎస్సార్ ఒక డాక్టర్‌గా నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలను అందించాలని నిర్ణయించి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2007లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఉమ్మడి జిల్లాలో 2009 నాటికి 18,101 మంది ప్రాణాలను కాపాడింది. తెల్లరేషన్ కార్డును తీసుకుని వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల విలువ చేసే వైద్యాన్ని పొంది ప్రాణాలను దక్కించుకున్న వారంతా నేడు వైఎస్ రాజశేఖరరెడ్డిని దేవునితో సమానంగా చేతులెత్తి మొక్కుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, యువకులు, మహిళలు అనే బేధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ రకాల జబ్బులకు చికిత్సలు పొందడంతో పాటు శస్త్ర చికిత్సలను చేయించుకున్నారు. ముఖ్యంగా ఖరీదైన గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల, అత్యవసర చికిత్సలు, కీళ్ల, మెదడు, కేన్సర్, ప్లాస్టిక్ సర్జరీ, మూత్రకోశ వ్యాధుల వంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్య సేవలను పొందారు. ఇందుకుగాను సుమారు రూ.53 కోట్ల 22లక్షల 44 వేల 316 రూపాయలు ఖర్చు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే తాము ఏమైపోయే వారమో అని జిల్లాలోని నిరుపేదలు పేర్కొంటున్నారు. తమకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణభిక్ష పెట్టారని.. తాము బతికున్నంతకాలం వైఎస్సార్‌ను మరిచిపోలేమని అంటున్నారు. గోదావరి జలాలు అందించిన అపరభగీరథుడు 50ఏళ్లుగా కరువుకాటకాలు.. దర్భిక్ష పరిస్థితులతో ఉండే తుంగతుర్తి ప్రాంతానికి శ్రీరాంసాగర్ కాల్వ ద్వారా గోదావరిజలాలను తీసుకొచ్చిన అపరభగీరథుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశఖరరెడ్డి. ఎస్సారెస్పీ రెండోదశ పనులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 1996 మార్చి 6న తిరుమలగిరి మండలం ప్రగతినగర్ వద్ద అప్పటి సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. అయితే వైఎస్సార్ ప్రతిపక్షనేతగా 2003లో ప్రగతినగర్ వద్ద టీడీపీ ప్రభుత్వం వేసిన శిలాపలకం వద్ద మొక్కలు నాటి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సారెస్పీ రెండోదశ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్పారెస్పీ రెండోదశ పనులకు జలయజ్ఞం కింద నిధులు రూ.550 కోట్లు కేటాయించి 80శాతం పనులను పూర్తి చేశారు. 2009 ఫిబ్రవరి 19న వెలిశాలలో ట్రయల్‌రన్‌లో భాగాంగ నీటిని విడుదల చేశారు. ఈ జలాలతో నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపి రైతన్న గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వైఎస్సార్. ఈ కాల్వ ద్వారా ప్రస్తుతం నియోజకవర్గంలో సుమారు 70వేల ఎకరాలకు, జిల్లాలో 2లక్షల 57వేల ఎకరాలకు నీరందుతున్నది. తాగునీటి ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. పేద విద్యార్థులకు వరంలాంటిది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఫీజురీయిబర్స్మెంటు పథకం పేద, మధ్యతరగతి విద్యార్ధులకు వరంలాంటిది. ఈ పథకంతోనే నేను ఇంజనీరింగ్ వరకు చదువుకోగలిగాను. ఈ ఫీజురీయంబర్స్‌మెంటు రాకముందు చాలామంది ఆడపిల్లలు ఇంటర్మీడియేట్లోనే చదువులను మానివేసేవారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌తో అనేక మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి స్థిరపడ్డారు. ఇప్పుడు నా స్నేహితురాళ్లు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు. – కె. ప్రియాంక, ఇంజనీరింగ్ విద్యార్థిని, మిర్యాలగూడ -
జలయజ్ఞ ప్రదాత.. వైఎస్సార్
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి.. వేలాది మందికి లబ్ధిచేకూర్చిన మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. రెతేరాజు అని నమ్మి శ్రీశైలం మిగులు కృష్ణా నీటిని ఎత్తిపోసేందుకు మహాత్మాగాంధీ కేఎల్ఐ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలను జలయజ్ఞం పేరుతో చేపట్టిన సాగునీటిని తీసుకువచ్చారు. ఆయన తీసుకువచ్చిన పథకాలు నేటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆరోగ్యశ్రీ, 108, 104 ఆరోగ్య సేవలతో పాటు వృద్ధులు, వితంతువుల సామాజిక భద్రతకోసం పెన్షన్లు అందించారు. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, అభయహస్తం, జలయజ్ఞం, ఫీజురీయింబర్స్‌మెంట్, భూపంపిణీ, మహిళలకు పావళా వడ్డీకే రుణాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు పేదలపాలిట వరంలా మారాయి. ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరికీ ఆయన తీసుకువచ్చిన పథకాలు లబ్ధిని చేకూర్చాయి. నేడు ఆయన ప్రజల మద్యలో లేకపోయినా వారి మదిలో చిరస్థాయిగా నిలిచేలా పథకాలను రూపొందించారాయన. జిల్లా ప్రజలు ఎన్నటికీ మరువరు.. జిల్లా వాసులు ఆయనను ఎన్నటికీ మరువలేరు. జలయజ్ఞంలో భాగంగా రూ.2.813కోట్లుతో నల్లగొండ జిల్లాకు 3లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ఎస్ఎల్బీసి టన్నెల్ బోరింగ్ మిషన్ ప్రారంభించి ఈప్రాంత వాసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మరో భారీనీటిపారుదల పథకం కల్వకుర్తి ఎత్తిపోతల. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2005లో జలయజ్ఞంలో భాగంగా కొల్లాపూర్ మండలం ఎల్లూర్ గ్రామ పంచాయతీ రేగుమాన్ గడ్డ ప్రాంతంలో శ్రీశైలం మిగులు కృష్ణా నీటిని 3.40లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 25టీఎంసీల నీటి కేటాయింపు చేస్తూ రూ.2.990కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారు. ల్లాపూర్ నియోజకవర్గానికి వైఎస్.రాజశేఖరరెడ్డి పలుమార్లు వచ్చారు. 2004 నియోజకవర్గానికి వచ్చి ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2,995కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. సింగోటం శ్రీవారిసముద్రాన్ని మినీ రిజర్వాయర్‌గా మారుస్తామని ప్రకటించారు. అక్కడే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరును మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంగా మారుస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదోసారి కొల్లాపూర్‌లో పర్యటించి రూ.110కోట్ల వ్యయంతో సోమశిల–సిద్దేశ్వరం వంతెనకు, రూ.85కోట్ల వ్యయంతో కల్వకుర్తినుంచి నంద్యాల వరకు డబుల్‌లైన్ రహదారి పనులకోసం పైలాన్లను ఆవిష్కరించారు. ఆరోగ్యశ్రీ ఆదుకుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1,88,896మంది రోగులు లబ్ధి ఆరోగ్య శ్రీ పేదలకు సంజీవని..ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎంతో మంది పేదలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన చికిత్సలు పొందారు. విలువైన వైద్యం చేయించుకోలేని సామాన్యులకు సైతం ఆరోగ్య శ్రీ ద్వారా కార్పోరేట్ స్థాయిలో వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. పేద ప్రజల కోసం అమలు చేసిన ఆరోగ్య శ్రీ పథకం వల్ల ఎంతో మంది వైద్యం చేయించుకోవడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఆరోగ్య శ్రీ పథకం 2007లో ఐదు ఆస్పత్రుల్లో ప్రారంభం చేయడం జరిగింది. ఆరోగ్య శ్రీ పథకం కింద 948రకాల చికిత్సలు చేసుకోవడానికి వీలు కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 2007 నుంచి 2017వరకు 1,88,896మంది రోగులు ఆరోగ్య శ్రీ కింద వివిధ రకాల చికిత్సలు చేసుకోవడం జరిగింది. దీనికోసం ప్రభుత్వాలు ఆయా ఆస్పత్రులకు ఈ 11ఏళ్ల కాలంలో రూ.49కోట్ల 74లక్షలు చెల్లించడం జరిగింది. 108వాహనాలతో వైద్య సేవలు కుయ్..కుయ్ మంటూ గ్రామాల్లోకి వచ్చి బాధితులను ఆస్పత్రికి చేర్చడంలో కీలక బాధ్యత వహిస్తున్నాయి 108 అంబులెన్స్‌లు. ఈ సేవలను ప్రారంభించింది.. అభివృద్ధి చేసింది.. వైఎస్సార్యే. ప్రమాదం.. ఆకస్మిక ఆనారోగ్యం.. ఏదైనా కావొచ్చు లేదా అపస్మారకస్థితికి చేరుకున్న వారినైనా సరే క్షణాల్లో ఆస్పత్రికి తీసుకొచ్చి వారికి మెరుగైన వైద్యం అందించేలా చేసింది. ఈ 108 అంబులెన్స్‌ల వల్ల ఇప్పటికే కొన్ని వేల మంది ప్రాణాలు నిలిచాయి. పీయూ అభివృద్ధికి పునాది పాలమూరు: వెనుకబడిన పాలమూరు జిల్లాకు ఉన్నత చదువుల కోసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రత్యేక చొరవ చూపించి జిల్లాకు యూనివర్శిటీని మంజూరు చేయడం జరిగింది. ఉస్మానియా పీజీ సెంటర్‌ను స్థాయి పెంచుతూ 2008లో జిల్లాకు పాలమూరు యూనివర్శిటీ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత బండమీదిపల్లి శివారు ప్రాంతంలో దాదాపు 175ఏకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా 2008 ఆగష్టు 28న అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా పీయూ ప్రారంభానికి శిలఫలాకం వేశారు. తర్వాత భవన నిర్మాణ పనులు, హాస్టల్ నిర్మాణులు ప్రారంభం చేసి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం పీయూను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తర్వత పీయూకు వీసీ గోపాల్‌రెడ్డిని నియామించి త్వరగా అభివృద్ది పనులు చేయాలని వీసీని ఆయన ప్రోత్సహించారు. మొదట్లో 5కోర్సులతో 8మంది ఆచార్యులతో ప్రారంభించిన పీయూ ప్రస్తుతం 19కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పీయూ పరిధిలో 3పీజీ కళాశాలలు, 94డిగ్రీ కళాశాలలు పని చేస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం పీయూలో అన్ని కోర్సులలో కలిపి 1800మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు 9బ్యాచ్‌లు ఇక్కడి నుంచి వెళ్లాయి. అంటే దాదాపుగా 17వేల మంది విద్యార్థులు పీయూలో ఉన్నత విద్యను అభ్యసించి వెళ్లారు. యూనివర్సిటీ ప్రారంభం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీ ఇంతటి అభివృద్ధి చెందడానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డియేనని స్థానిక విద్యార్థులు చెబుతున్నారు. నెట్టెంపాడుతో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు ధరూరు (గద్వాల): రెండు దశాబ్దాల నడిగడ్డ ప్రజల ఆకాంక్ష అయిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలు సస్యశ్యామలయ్యాయి. 2006లో రూ.1448 కోట్ల అంచనా వ్యయంతో మండలంలోని గుడ్డెందొడ్డిలో నెట్టెంపాడు ఎత్తిపోతలకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీజం పడింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 1.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. గద్వాల నియోజకవర్గంలోని గద్వాల, ధరూరు, మల్దకల్, గట్టు, కేటీదొడ్డి మండలాలతో పాటు అలంపూర్‌లోని ఇటిక్యాల తదితర మండలాలకు ఈ జలాలు అందుతున్నాయి. కరువు నేలలు సాగులోకి వచ్చాయి. ఆ ఘనత వైఎస్‌కే దక్కింది. ఏడు రిజర్వాయర్లను నిర్మించారు. అలాగే, ప్రయదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న 234 మెగావాట్ల సామర్థ్యంతో జెన్కో జల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల వైఎస్ చలవే దేవరకద్ర: కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పునాది పడింది. వైఎస్ తలపెట్టిన జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో నాలుగు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందులో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. జూరాల బ్యాక్ వాటర్ నుంచి నీటిని కొయిల్‌సాగర్‌కు తరలించడానికి సాంకేతికంగా రూపకల్పన చేశారు. కృష్ణట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కోయిల్‌సాగర్‌కు 3.90 టీఎంసీల నీటిని వినియోగించు కోడానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేశారు. 50,250 ఎకరాలకు సాగు నీరు అందించడానికి ఆయకట్టును నిర్దేశించి రూ.359 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడానికి ప్రభుత్వ పరంగా పరిపాలన అనుమతులను మంజూరు చేశారు. 2006లో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి వైఎస్ శంఖుస్థాపన చేశారు. ఆర్డీఎస్ ఆధునీకరణకు కృషి అలంపూర్: 87వేల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన ఆర్డీఎస్ నిరాదరణకు గురికాగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దాని ఆధునీకరణకు ముందుకు వచ్చారు. కాలువల లైనింగ్, హెడ్‌వర్క్స్ వద్ద పూడికతీత, డిస్టిబ్యూటరీల నిర్మాణాలు చేపట్టడానికి అప్పట్లో రూ.112 కోట్లు కేటాయించారు. అంతేగాక, అలంపూర్, ర్యాలంపాడు గ్రామాలను కలుపుతూ తుంగభద్ర నదిపై వంతెన నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరు కావడంతో వాటి శంకుస్థాపనతో పాటు పనుల్లో పాల్గొన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే చల్లావెంకట్రామిరెడ్డికి వైఎస్ఆర్తో ఉన్న అనుబంధంతో ఆయన అలంపూర్ నియోజకవర్గాన్ని మూడు సార్లు రావడం జరిగింది. వైఎస్సార్ పాలన సువర్ణయుగంగా ప్రజల గుండెల్లో గుర్తుండిపోయింది. వైఎస్ దయ వల్లే ఎంటెక్ చేశా నాపేరు అనిల్ సాగర్ మాది కొత్తకోట పట్టణం. పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబం. ఉన్నత చదువులు చదువుకునే స్తోమత లేదు. ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ రావడంతో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం రాజశేఖర్‌రెడ్డికి ఇష్టమైనటువంటి ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా. రాజశేఖర్‌రెడ్డి పుట్టిన రోజు నాడే నా పుట్టినరోజు కావడంతో అదృష్టంగా భావిస్తున్నాను. – పి.అనిల్‌కుమార్ సాగర్, కొత్తకోట ‘ఆరోగ్యశ్రీ’తో ఆపరేషన్ చేయించుకున్నా నా పేరు సంగ నర్సింహులు, మాది నారాయణపేట పట్టణం. 2007వ గుండెకు సంబంధిత వ్యాధి లక్షణాలు కనిపించాయి. వైద్యులు అపరరేషన్ చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో అపరేషన్ చేయించుకున్నా. అప్పట్లో ఆపరేషన్‌కు ఖర్చు రూ. 1.50 లక్షలు అయింది. నేను బతికి ఉన్నా అంటే వైఎస్సార్ పుణ్యమే. ఆయన మా గుండెలో చిరస్మరణీయులుగా ఉంటారు. – సంగ నర్సింహులు, నారాయణపేట -
అట్లాంటాలో మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి
అట్లాంటా : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి(సెప్టెంబర్ 2) సందర్భంగా అట్లాంటాలోని ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. మహానేత చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మహానేత సేవలను, ఆయన తెచ్చిన పథకాలను కొనియాడారు. రాజన్నతో తమకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మరలా రాజన్న రాజ్యం సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున వైఎస్సార్ అభిమానులు ప్రతి నెల సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఏపీలోని తమ తమ నియోజక వర్గ ప్రజలతో, సన్నిహితులతో, పార్టీ ఇంచార్జ్‌లతో తరచూ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి సహకరించాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు ఏపీకి వెళ్లి పార్టీ తరపున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. -
కువైట్‌లో ఘనంగా నివాళి అర్పించిన వైఎస్సార్సీపీ సభ్యులు
కువైట్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కువైట్ వాసులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మహానేత 9వ వర్ధంతి సందర్భముగా కమిటీ సభ్యులు ఘన నివాళిలు అర్పించారు. ఈ సందర్భముగా ఇలియాస్, బాలిరెడ్డి గారు మాట్లాడుతూ.. మహానుభావులు వై.యస్. రాజశేఖరరెడ్డి లేని లోటు రాష్ట్రంలో స్వష్టంగా కనబడుతోందని వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం సశ్యామలంగా ఉండేదని ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కుల, మత, వర్గాలకు, ప్రాంతాలకు, పార్టీలకు, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి ఎదో ఒక సంక్షేమ పథకం అందాయని.. ముఖ్యముగా రైతులు, బడుగు, బలహీన, మైనారిటీల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని.. మరల రాజన్న రాజ్యం రావాలంటే జననేత జగన్ మోహన్‌రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని తెలిపారు. కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం. వి. నరసారెడ్డి, మాట్లాడుతూ.. ఆరోగ్య ప్రదాత మా దేవుడు రాజన్న ఎన్నికల సమయములో ఇచ్చిన హామీ రైతులకు రుణ మాఫీ చేస్తామని ప్రమాణ స్వీకారం రోజున మొదటి సంతకం చేసిన మాట తప్పని మడమ తిప్పని మహానాయకుడు మా రాజన్న అని తెలుపుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 6 వందల హామీల్లో ఒక హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇప్పుడున్న రాక్షస పాలనను అంతమోందించాలంటే జననేత జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేష్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి తెలుగు వాడి గుండెల్లో సజీవంగా ఉన్నారని.. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ప్రవేశ పెట్టనటువంటి సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టిన మహా నాయకులు రాజన్న అని కొనియాడారు. ముఖ్యంగా మైనారిటీ ముస్లిం సోదరులకు కొరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి 4% శాతం రిజర్వేషన్ ఇచ్చి పేద ముస్లిం సోదరుల జీవితాల్లో వెలుగు నింపిన మహా నాయకులు వైఎస్సార్ అని తెలుపుతూ రాష్ట్ర ముఖమంత్రి చంద్రబాబు పాలన నాలుగేళ్లు అయినా తన మంత్రివర్గంలో ఒక ముస్లింకు స్ధానం కల్పించకుండా ఇప్పుడు మైనారిటీ ముస్లిం సోదరులపై కపట ప్రేమ చూపిస్తున్నరని ఎద్దేవా చేస్తూ.. మైనారిటీ ముస్లింల ప్రధాన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబే అని తెలుపుతూ గత నెల 27న గుంటూరు జరిగిన తెలుగుదేశం మైనారిటీ సభలో నారా హామారా అని తెలుగుదేశం ముస్లిం నాయకులు చెప్పడం విడ్డురంగా ఉందని ‘నారా దుష్మన్ హామారా‘ ‘హర్ దిల్ మే హై జగన్ హమారా‘ అనే నినాదాలు చేశారు. కువైట్ కమిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, తెట్టు రఫీ, మీడియా ఇంచార్చ్ ఆకుల ప్రభాకర్ రెడ్డి, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అన్నాజీ శేఖర్,గల్ఫ్ ప్రతినిధి షేక్ నాసిర్ బి.సి. విభాగం ఇంచార్చ్ కె. రమణ యాదవ్, యూత్ ఇంచార్చ్ మర్రి కళ్యాణ్, సోషల్ మీడియా ఇంచార్చ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మైనారిటీ ఇంచార్చ్ షేక్ గఫార్, ఎస్సి.ఎస్టీ. ఇంచార్చ్ బి. ఎన్. సింహా, సాంసృతిక విభాగం ఇంచార్చ్ కె. వాసుదేవరెడ్డి, రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షుడు చింతల చంద్రశేఖర్ రెడ్డి, జగన్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు షేక్ జబీవుల్లా, జగన్ యూత్ ఫోర్స్ అధ్యక్షులు మరియు వ్యవస్ధాపకులు లక్షి ప్రసాద్ పోలి మనోహర్ రెడ్డి, మహానేత గురించి కొనియాడుతూ జోహార్ రాజన్న నినాదాలతో హోరోత్తించారు. కమిటీ సభ్యులు పులపుత్తూరు సురేష్ రెడ్డి, యు. రమణ రెడ్డి, వై. లాజారస్, రావూరి రమణ, పిడుగు సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, సయ్యద్ సజ్జాద్,రేవూరి సుబ్బారాయుడు, కె .సూర్యనారాయణ, షేక్ సబ్దర్, హారిప్రసాద్ నాయుడు, ముఖేష్ నాయుడు, రవి శంకర్, పోలూరుప్రభాకర్ ఇంక ప్రజాసంకల్పయాత్రలో జననేత వై.యస్. జగన్ గారికి వస్తున్నా ఆదరణ చూసి మరియు నవరత్నాలకు ఆకర్షితులై కువైట్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు యదోటి బాల చౌదరి, శంకర్ యాదవ్, సుండుపల్లి యల్లయ్య, జనసేన అభిమానులు షేక్ ఖాదర్ బాషా, దూదేకుల ముస్కిన్ బాషా, హరి, యం. శివ, వై.యస్.ఆర్. కమిటీలో చేరారు. ఈ కార్యక్రమములో కువైట్ కమిటీ సభ్యులు మరియు వై.యస్.ఆర్. అభిమానులు భారీగా పాల్గోన్నారు. -
మహానేత స్మరణలో..
శ్రీకాకుళం: వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు ప్రజలు కూడా మహా నేతను మనసారా స్మరించుకున్నారు. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలిలో వైఎస్సార్ తొమ్మిదో వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతా రాం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రెడ్‌క్రాస్ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆమదాలవలసలో తమ్మినేని సీతారాం అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, పొందూరు ఎంపీపీ ఎస్.దివ్య, బూర్జ నాయకులు కె.గోవిందరావు, సరుబుజ్జిలి మండల ఎం పీపీ కేవీజీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేటలోని 3 మండలాల్లోనూ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి పాల్గొన్నారు. ఎల్ఎన్ పేట మండలంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పాలకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.విక్రాం త్ నేతృత్వంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలోరక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులుతో పాటు నియోజకవర్గ నాయకులంతా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజాం సీహెచ్‌సీలో రోగులకు రొట్లు, పండ్లు పంపిణీ చేశారు. టెక్కలిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం టెక్కలి ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పలాసలో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, కౌన్సిలర్లు బస్టాండు కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. కవిటిలో పిరియా సాయిరాజ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నర్తు రామారావులు వేర్వేరుగా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఎచ్చెర్లలో సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో రణస్థలంలో వర్ధంతి కార్యక్రమాలు జరిపారు. -
రాజన్నకు ఘన నివాళి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి జిల్లా వాసులు ఘననివాళులర్పించారు. తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేయడంతో పాటు అనేక చోట్ల క్షీరాభిషేకాలు చేశారు. రక్తదాన శిబిరాలు, రోగులు, వృద్ధులకు పండ్లు, దుస్తులు పంచిపెట్టారు. అన్నదానం చేశారు. కేరళ వరద బాధితుల కోసం సాయం అందజేశారు. ఆనాడు వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను స్మరించుకుంటూ ఆయనే గనుక ఉండి ఉంటే రాష్ట్రం ఇంతటి దుస్థితిలో ఉండేది కాదని ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ పాలనను గుర్తు చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలే కాకుండా వైఎస్సార్, ఆయన తనయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం పట్టణంలోని వెంకటలక్ష్మీ జంక్షన్ వద్ద వై.ఎస్.ఆర్. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేరళ వరద బాధితులకు నియోజకవర్గం తరఫున రూ.4లక్షలు ఆర్థిక సాయం, పట్టణంలో పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న దేవాలయాలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి కూడలి వద్ద వై.ఎస్.ఆర్. విభజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కోలగట్ల ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ యువజన నాయకులు అవనాపు సోదరులు విక్రమ్, విజయ్ ఆధ్వర్యంలో వెంకటలక్ష్మి జంక్షన్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుచ్చలవీధిలో అవనాపు సోదరుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. సాలూరు పట్టణం బోసుబొమ్మ జంక్షన్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజన్న దొర క్షీరాభిషేకం చేశారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు అందజేశారు. కురుపాంలో ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజుల ఆధ్వర్యంలో రావాడ రోడ్డు కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నసమారాధన చేశారు. నెల్లిమర్ల నియోజక వర్గ సమన్వయకర్త పెనుమత్స సాంబశివరాజు ఆధ్వర్యంలో స్థానిక మొయిద, రామతీర్థం జంక్షన్లో ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆస్పత్రి, మారుతి హాస్పటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండల కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, వైఎస్సార్ సీపీ జిల్లా కోశాధికారి కందుల రఘుబాబు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీచేశారు. గజపతినగరంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గరివిడి మండల కేంద్రంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మెరకముడిదాం మండల కేంద్రం వద్ద జరిగిన వేడుకల్లో డీసీఎం ఎస్ చైర్మన్ ఎస్.వి.రమణరాజు పాల్గొన్నారు. ఎస్.కోట పట్టణంలో ఎస్.కోట నియోజకవర్గ కన్వీనర్ ఎ.కె.వి.జోగినాయుడు, రాష్ట్ర కార్యదర్శులు రొంగలి జగన్నాథం, నెక్కల నాయుడు బాబు, గుడివాడ రాజేశ్వరరావు, షేక్ రహేమాన్ తదితరుల నేతృత్వంలో స్థానిక దేవీ జంక్షన్‌లోనూ, శ్రీనివాస థియేటర్ వద్ద ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పార్వతీపురం పట్టణంలో వైఎస్సార్ విగ్రహాని కి వైఎస్సార్సీపీ సమన్వయకర్త అలజంగి జోగారా వు, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మొక్కలు పంపిణీ చేశారు. సీతానగరం మండలంలో అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, సమన్వయకర్త జోగారావులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వెయ్యి మందికి అన్నదానం చేశారు. బొబ్బిలిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కర్త శంబంగి వెంకట చినప్పలనాయుడు వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీహెచ్‌సీలో రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పోల అరుణ్‌కుమార్, తారకరామ కాలనీలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమ్మిగారు కోనేటి గట్టు వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల రామసుధీర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆయన మేలు మరచిపోలేం వైఎస్సార్ పాలన స్వర్ణయుగం. ప్రజలకు ఆయన చేసిన మేలు ఎన్నటికీ మరచిపోరు. రైతులకు ఉచిత విద్యుత్, రుణాల మాఫీ, విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్, పేదలకు ఆరోగ్యశ్రీ వైద్యసేవలు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు 108 సేవలు అందించిన ఘనత వైఎస్సార్‌దే. జలయజ్ఞం చేపట్టి బీడు భూములను సస్యశ్యామలం చేశారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత వైఎస్సార్‌ది.– పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే -
మహానేత ఆశయాల కోసం పాటుపడదాం
పట్నంబజారు(గుంటూరు): మహానేత వైఎస్ ఆశయాల కోసం పాటుపడదామని వైఎస్సార్ సీపీ నేతలు పిలుపునిచ్చారు. వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని పట్టాభీపురం రెడ్డి జనసేవా సమితి కార్యదర్శి, వైఎస్సార్ అభిమాన సంఘం కానాల అంజనీ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి థియేటర్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంటరీ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య హాజరయ్యారు. ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి వైఎస్సార్ చేయూతనిచ్చారన్నారు. ఆయన ఆశయాల కోసం పేదలకు సాయం అందించటం సంతోషకరమైన విషయమన్నారు. పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ వైద్యశిబిరాన్ని నిర్వహించిన వైఎస్సార్ అభిమాన సంఘం సభ్యుల్ని అభినందించారు. కిలారి రోశయ్య మాట్లాడుతూ మహానేతను గుర్తు చేసుకుంటూ, పేదలకు అండగా నిలిస్తూ, గొప్ప మనసును చాటుకున్నారన్నారు. వైఎస్సార్ అభిమానం సంఘం సభ్యులు కానాల అంజనీ శ్రీకాంత్‌రెడ్డి, ఇన్నారెడ్డి, సీతారామిరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లుగా మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరు వేల మందికి ఉచితంగా మందులు పంపిణీ చేయటంతో పాటు పదివేల మందికి అన్నదానం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శిబిరానికి హాజరైన రోగులకు ఆసుపత్రికి వెళ్లిన తరువాత కూడా 50శాతం రాయితీ కల్పిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతంరం వైద్య శిబిరానికి హాజరైన వారికి పండ్లు, బ్రెడ్‌ను కూడా అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లాలుపురం రాము, వైఎస్సార్ అభిమాన సంఘం సభ్యులు మస్తాన్‌వలి, రాము, ప్రభు పాల్గొన్నారు. -
రాజన్నకు నీరాజనం
విజయవాడ సిటీ: మరపురాని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆదివారం గ్రామగ్రామాన నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. వైఎస్సార్ నాటి స్వర్ణయుగాన్ని తలచుకుని సంతోషించారు. మళ్లీ ఆనాటి పాలన రావాలని కోరుకున్నారు. పెనమలూరులో... పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్థంతి ఘనంగా జరిగింది. యనమలకుదురు, కానూరు, పోరంకి, పెనమలూరు, గోసాల, వణుకూరు, ఈడుపుగల్లు, కంకిపాడు, గొడవర్రు, పునాదిపాడు, నెప్పల్లి, చలివేంద్రపాలెం, కుందేరు గ్రామాల్లో కార్యక్రమాలకు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. అవనిగడ్డలో అవనిగడ్డ నియోజకవర్గంలో లో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఆర్ఐ వికాస్ హైస్కూల్లో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మైలవరంలో.... మైలవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. మచిలీపట్నం, పామర్రులో... మచిలీపట్నంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య (నాని), నివాళులర్పించి, జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పామర్రులో నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో.... గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్సార్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గన్నవరం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలో ప్రసాదంపాడులో మహానేతకు ఘననివాళులర్పించడంతో పాటు ఏడు వేల మందికి అన్నదానం, ఇతర గ్రామాల్లో ఆల్పహారం పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పండ్ల వ్యాపారులకు ఆయన తోపుడు బండ్లు పంపిణీ చేశారు. నూజివీడులో... నూజివీడు పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటర్లో నిర్వహించిన వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపఠానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తిరువూరులో.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమాన్ని ఆదివారం తిరువూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మునుకుళ్ళలో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. కైకలూరులో.... కైకలూరు నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి వర్ధంతి కార్యక్రమం ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కైకలూరు, కైకలూరు సంతమార్కెట్ వద్ద 23 అడుగుల భారీ వైఎస్ విగ్రహం వద్ద డీఎన్నార్ ఆధ్వర్యంలో పూలమాలు వేసి నివాళి అర్పించారు. పెడనలో... పెడనలో పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ తూర్పు, పశ్చిమం, సెంట్రల్లో... విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త యలమంచిలి రవి ఆధ్వర్యంలో మహానేతకు నివాళి అర్పించడం తో పాటు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాస్ ఆ«ధ్వర్యంలో వైఎస్సార్ వర్థంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సెంట్రల్ నియోజవవర్గంలో వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. సింగ్‌నగర్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. నందిగామలో.... నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 9 వ వర్ధంతి కార్యక్రమాలు సమన్వయకర్త ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రతి గ్రామంలోను మహానేత విగ్రహాలు, చిత్ర పటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నందిగామ, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ నాయకుడు సామినేని వెంకట కృష్ణప్రసాద్ నియోజకవర్గంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. మహావ్యక్తి డాక్టర్ వైఎస్సార్ పార్టీలు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ బాగుచేయాలనే కలలుగన్న ఏకైక మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజÔóఖర్‌రెడ్డి వర్థంతిని పురస్కరించుకొని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేర్‌రెడ్డి విగ్రహానికి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగు నాగార్జున, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సెంట్రల్ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ నగర పార్టీ అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు, రాష్ట్ర అధికార ప్రతినిధి పైలా సోమినాయుడు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అ«ధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి పూలమాలలు వేసి రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. వైఎస్సార్ చిరస్మరణీయుడు... ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగు నాగార్జన మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిరస్మరణీయులన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమాన్ని, అభివృద్థిని రెండు కళ్లతో నడిపిన వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీలు, రైతులు, విద్యార్థులు, యువకులు, వృద్థులు, వికలాంగులు, ఉన్నత కులాల్లో పేదవారి అభివృద్దే, రాష్ట్ర అభివృద్థి అని తలచి పరిపాలించిన మహావ్యక్తి డాక్టర్ వైఎస్సార్ అన్నారు. డాక్టర్ అనే పదానికి సార్థకత... కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని ప్రతి పేదవాడు వారి ఇంటిలో తండ్రిగానో, సోదరునిగానో భావిస్తూ జరుపుకుంటున్నారంటే ఆయన వారి గుండెల్లో ఎంతగా నిలిచి ఉన్నారో అర్ధమవుతోందన్నారు. డాక్టర్ అనే పదానికి సార్థకత చేకూర్చిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేర్‌రెడ్డి అని అన్నారు. సమాజంలో పేద వర్గాలవారు ఎదుర్కొంటున్న అసమానతలు,, సమస్యలు గట్టెక్కాలంటే విద్య, వైద్యం అందించడం ఒక్కటే మార్గం అని గుర్తించిన రాజశేర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. సంక్షేమ రాజ్యం స్థాపించినమహనీయుడు.... నగర మర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఒక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబంలో ఓ పెద్ద కొడుకుగా చూపించిన ఔదార్యం ఎన్నడూ మరచిపోలేమని అన్నారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అ«ధ్యక్షుడు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ వర్థంతిని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. పేదప్రజలకు వైఎస్ తన పరిపాలన ద్వారా చేరువయ్యారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొప్పన భవకుమార్, సంయుక్త కార్యదర్శులు అడపాశేషు, చందన సురేష్, మైలవరపు దుర్గారావు, కాలే పుల్లారావు, ఎంవీఆర్ చౌదరి, అదనపు కార్యదర్శులు తోట శ్రీనివాస్, ప్రొఫెసర్ ఎం.పద్మారావు, విజయవాడ పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కట్లా మల్లేశ్వరరావు, ఎస్సీ సెల్ తోకల శ్యామ్, రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రమేష్ , డాక్టర్ సెల్ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ బండి నాగపుణ్యశీల, కార్పొరేటర్లు చోడిశెట్టి సుజాత, కావటి దామోదర్, ప్రచార విభాగం నగర అ«ధ్యక్షుడు పోతిరెడ్డి సుబ్బారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), తంగిరాల రామిరెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నగర సేవాదళ్ అ«ధ్యక్షుడు అక్కిపెద్ది శ్రీనివాస్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరాల ప్రభాకర్, నగర అధికార ప్రతినిధి మనోజ్ కొఠారి పాల్గొన్నారు. దివిసీమలో మెగా రక్తదాన శిబిరం అవనిగడ్డ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని దివిసీమలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో స్థానిక ఎన్ఆర్ఐ వికాస్ హైస్కూల్లో మెగా రక్తదానం, ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా, మచిలీపట్నం నియోజకవర్గ కన్వీనర్, రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. మోపిదేవి, పేర్ని, పామర్రు నియోజకవర్గ కన్వీనర్ కైలే అనిల్‌కుమార్, అవనిగడ్డ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు తదితరులు మహానేత వైఎస్సార్ చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు. 315 మంది రక్తదానం చేయగా, 2500 మందికి ఉచిత వైద్యసేవలు అందించినట్టు సింహాద్రి చెప్పారు. మహానేత స్ఫూర్తితో ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు . -
జననేతకు ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లా ప్రజలు ఆదివారం ఆయనకు ఘన నివాళి అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాడవాడలా వైఎస్సార్ వర్ధంతికార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, వైద్యశిబిరాలు, అన్నదానాలు తదితర సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశారు. ఒంగోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలులో మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు కుప్పం ప్రసాద్ తదితరులు పాల్గొని మహానేతకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బాలినేని ⇔ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పేదల గుండె చప్పుడు అన్నారు. ఆయనే జీవించి ఉంటే నేడు ప్రకాశం జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్లేదనే భావన ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. వైఎస్సార్ స్వర్ణయుగం సాధన కోసం ప్రతి ఒక్కరూ చేయిచేయి కలిపి 2019 ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేద్దామని కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. అనంతరం ఒంగోలు నగరంతోపాటు కొత్తపట్నం మండలంలోను అన్నదాన కార్యక్రమాలు, సామాజిక సేవ కార్యక్రమాల్లో బాలినేని పాల్గొన్నారు. ఒంగోలు మండలంలోను వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి వైఎస్సార్‌కు నివాళి అర్పించారు. ⇔ కనిగిరిలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి చేశారు. మెగా రక్తదాన శిబిరం, అన్నదాన, వృద్దాశ్రమాలు, ప్రభుత్వ వైద్యశాలలో పండ్లు పంపిణీ చేశారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ⇔ యర్రగొండపాలెం నియోజకవర్గంలో సమన్వయకర్త, సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. వై.పాలెం, పెద్దారవీడు మండలాల్లోని కార్యక్రమాల్లో ఆదిమూలపు సురేష్ స్వయంగా పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళి అర్పించారు. యర్రగొండపాలెంలో అన్నదానం చేశారు. పుల్లలచెరువు మండలంలోని ఉమ్మడిచెరువులోను భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ⇔ దర్శి నియోజకవర్గంలో పార్టీ ముఖ్యనేతల ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాల వద్ద నివాళులర్పించడంతోపాటు అన్నదానం, పులిహోర పంపిణీ, పండ్లు పంపిణీ చేశారు. తాళ్లూరులో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సాయంత్రం ముండ్లమూరు మండలం నాయుడుపాలెంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి పాల్గొని వైఎస్సార్‌కు నివాళి అర్పించారు. రాజంపల్లిలో అన్నదానం చేశారు. ⇔ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐవి.రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేటు వద్ద వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అన్నదానంతోపాటు మానసిక వికలాంగుల పాఠశాలకు బియ్యం పంపిణీ చేశారు. బేస్తవారిపేటలో రక్తదాన శిబిరంతోపాటు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ⇔ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి ఆ«ధ్వర్యంలో నియోజకవర్గంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. మార్కాపురం పట్టణంలోని పాతబస్టాండు సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, వెన్నా హనుమారెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కంభం రోడ్డులో అన్నదానం చేశారు. వైఎస్సార్ జీవించి ఉంటే పశ్చిమ ప్రాంతంలోని ప్రజల కష్టాలు తొలగిపోయేవని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి నేడు ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా మారి ఉండేదన్నారు. ⇔ కొండపి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మాదాసు వెంకయ్య ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. మాదాసు వెంకయ్య భారీగా కార్యకర్తలు, నేతలతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని వైఎస్సార్‌కు నివాళి అర్పించారు. పలుచోట్ల అన్నదానం చేశారు. ⇔ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించడంతోపాటు పలు చోట్ల అన్నదానం చేశారు. అన్ని మండలాల్లో జరిగిన కార్యక్రమాలకు స్వయంగా మహీధరరెడ్డి హాజరై వైఎస్సార్‌కు నివాళి అర్పించారు. పండ్లు పంపిణీ చేపట్టారు. రాష్ట్ర కార్యదర్శి తూమాటి మాధవరావు నగరంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించారు. ⇔ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, యువనేత కృష్ణప్రసాద్‌ల నేతృత్వంలో అద్దంకి భవానీ సెంటర్‌తోపాటు అన్ని మండలాల్లో అన్నదాన కార్యక్రమాలు భారీగా నిర్వహించారు. పలుచోట్ల పులిహోర పొట్లాలు, అల్పాహారం పంపిణీ చేశారు. వైఎస్సార్ విగ్రహాలతోపాటు పలుచోట్ల వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ⇔ చీరాల నియోజకవర్గం సమన్వయకర్త యడం బాలాజీ నేతృత్వంలో వర్ధంతి కార్యక్రమాలు మిక్కిలిగా జరిగాయి. రక్తదానం, అన్నదానంతోపాటు రోగులకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాణి వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ⇔ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త రావిరామనాథంబాబు ఆ«ధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. పలుచోట్ల అన్నదానం చేశారు. చినగంజాంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ⇔ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త టీజేఆర్ సుధాకర్‌బాబు నేతృత్వంలో వర్ధంతి కార్యక్రమాలు జరగ్గా ముఖ్యఅతిథులుగా ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. చీమకుర్తిలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో టీజేఆర్ సుధాకర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి తదితరులు హాజరయ్యారు. మద్దిపాడు, నాగులుప్పలపాడులలో కూడా పార్టీ ముఖ్యనేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. -
సరికొత్త చరిత్రను సృష్టించిన మహానీయుడు వైఎస్సార్
తూర్పు గోదావరి, మధురపూడి (రాజానగరం): రాజకీయాల్లో దివంగత మహానీయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సరికొత్త చరిత్రను సృష్టించి, రాజనీతిజ్ఞుడుగా నిలిచారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా కోరుకొండ మండలం బుచ్చెంపేటలో జరిగిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీస్తు పూర్వం, క్రీస్తుశకం తరహాలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి పూర్వం, తర్వాత అనిమాట్లాడుకొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్‌ను ప్రతిఒక్కరూ వారి గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తున్నారన్నారు. తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా మార్చడంలో ఆయన కృషి ఎనలేనిదన్నారు. నూతన రాజకీయాలకు రాజన్న దిక్చూచిగా నిలిచిపోతారన్నారు. రాజన్నబాటలోనే జగన్ నడుస్తున్నారన్నారు. అంతకు ముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాపవరం పార్టీ కార్యాలయంలో, మండలంలోని ప లు ప్రాంతాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. కార్య క్రమంలో పార్టీ మండల కన్వీనర్ వుల్లి బుజ్జిబాబు, పార్టీ నాయకులు నక్కా రాంబాబు, అడబాల సీతారామకృష్ణ, చింతపల్లి చంద్రం, అయిల రామకృష్ణ, బొరుసు బధ్రి, సలాది వెంకటేశ్వరరావు, తాడి హరిశ్చంద్రప్రసాద్ రెడ్డి, కాలచర్ల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ముందుచూపున్న మహానేత డాక్టర్ వైఎస్సార్ రామచంద్రపురం: రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఉండాలని ప్రజల కష్టాలను ముందుగానే తెలుసుకునే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల మహానేత విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ నేతృత్వంలో వైఎస్సార్ తొమ్మిదో వర్ధంతిని నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఎమ్మెల్సీ బోస్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఆయన చేసిన సేవ మరువలేనిదన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఆయన పరిపాలన సాగించి రాష్ట్ర ప్రజల గుండెల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్ అని ఆయన కొనియాడారు. రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి మాగాపు అమ్మిరాజు, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి సత్తిశంకర్‌రెడ్డి, పార్టీ నాయకులు చింతారామ్మోహన్రెడ్డి, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. -
సంక్షేమ ప్రదాతా.. సదా స్మరామి
జోహార్ వైఎస్సార్ నినాదం మార్మోగింది. పేదల గుండెల్లో దాగిఉన్న అభిమానం ఉప్పెనలా ఎగసి పడింది. సంక్షేమ ప్రదాత, జనహృదయ విజేతకు ప్రతి గుండె జేజేలు పలికింది. రాజన్నా.. మళ్లీరావా అంటూ నినదించింది. ఆదివారం దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతిని ప్రజలు జిల్లావ్యాప్తంగా జరుపుకున్నారు. సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి,ఏలూరు: పేదలు, బలహీనవర్గాల గుండెల్లో గూడు కట్టుకున్న దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ని ప్రజలు మనసారా స్మరించుకున్నారు. ఆయన అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకుని నివాళులర్పించారు. గ్రామగ్రామాన వైఎస్సార్ సీపీ శ్రేణులు,ప్రజలు మహానేత వర్ధంతి సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భారీగా అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పేదలు, వృద్ధులు, మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు. ఏలూరులో ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఆధ్వర్యంలో మహానేత వర్ధంతి నిర్వహించారు. తొలుత ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి, నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్‌తో కలిసి ఆళ్లనాని క్షీరాభిషేకం చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం నిర్వహించారు. నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో నరసాపురం స్టీమర్‌రోడ్డు జంక్షన్లో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పేదలకు పులిహోర పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంచారు. గర్భిణులకు చీరలు పంపిణీ చేశారు. వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ ఐలాండ్ సెంటర్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గుండుమోగుల సాంబయ్య, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ కర్రి భాస్కరరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కర్రి సుధాకర్‌రెడ్డి ఉన్నారు. గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో మహానేత వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. చిన్నాయగూడెం రూరల్ బ్యాంకు మాజీ ఛైర్మన్ ఆరేటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిమ్మకాయల మార్కెట్ వద్ద రైతు భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నిడదవోలు శాంతినగర్‌లో వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జి. శ్రీనివాసనాయుడు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కొవ్వూరు ఆస్పత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పార్టీ మండల అధ్యక్షులు అయినీడి పల్లారావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో సత్యసాయి నిత్యాన్నదాన పథకంలో అన్నసమారాధన నిర్వహించారు. తణుకు నియోజకవర్గ కో–ఆర్డినేటర్, పార్టీ రాష్ట్ర రాజకీయ సలహా మండలి సభ్యులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు నాయకత్వంలో వైఎస్ వర్ధంతి నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పాలకొల్లు సమన్వయకర్త గుణ్ణం నాగబాబు స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 200 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మున్సిపాలిటీ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ యడ్ల తాతాజీ పాల్గొన్నారు. ఆచంట సమన్వయకర్త చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమాలను భారీగా నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో సుమారు 2వేల మందికి అన్నదానం, 50 మంది వికలాంగులకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 30 మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆ«ధ్వర్యంలో వైఎస్ వర్థంతి నిర్వహించారు. దుప్పట్లు పంపిణీ చేశారు. చింతలపూడి సమన్వయకర్త ఉన్నమట్ల ఎలీజా ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి నిర్వహించారు. ధర్మాజీగూడెంలో వైఎస్సార్సీపీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని కోటగిరి శ్రీధర్, ఎలీజా ప్రారంభించారు. సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తదానం చేశారు. దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు ఆధ్వర్యంలో దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. గ్రామాల్లో అన్నదానం, రక్తదానం చేశారు. పండ్లు పంపిణీ చేశారు. ఉండి సమన్వయకర్త పీవీఎల్ నర్శింహరాజు ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. గ్రామాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అన్నదా నం చేశారు. పేదలకు, వృద్ధులకు వస్త్రదానం చేశారు. భీమవరం సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వర్థంతి కార్యక్రమాలు జరిగాయి. సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. -
డల్లాస్‌లో మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి
డల్లాస్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా డల్లాస్‌లో పార్టీ శ్రేణులు ఘననివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్సీపీ కమిటీ సభ్యులు, వైఎస్సార్ ఫౌండేషన్ సంయుక్తంగా రెడ్ క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ఎలెమెంట్స్ హోటల్ లో జరిగిన రక్తదాన శిబిరానికి వైఎస్సార్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్బంగా రెడ్ క్రాస్ ప్రతినిధులు మాట్లాడుతూ ఒక నాయకుడుకి నివాళిగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలు నిర్వహించటం చాలా గొప్ప విషయమన్నారు. రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు దీనిని ఆదర్శంగా తీసుకొని పేదలకి సహాయపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న డాక్టర్ బూచిపూడి రామిరెడ్డి మాట్లాడుతూ .. వైఎస్సార్ అంటేనే సేవకి అర్థమని, అభిమానులు కూడా అదేబాటలో నడుస్తూ ప్రతి సంవత్సరం వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయటం చాలా గొప్పవిషయమని తెలిపారు. కార్యక్రమంలో దాదాపుగా 150 మంది వరకూ రక్తదానం చేశారని వారందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వైఎస్సార్ ఫౌండేషన్, డల్లాస్ వైఎస్సార్సీపీ కమిటీకి వైఎస్సార్ అభిమానులకి, రెడ్ క్రాస్ సంస్థకి డాక్టర్ బూచిపూడి రామిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వాలెంటీర్లుగా పనిచేసిన స్కూల్ విద్యార్ధులకి నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు. -
మహానేతకు ‘అనంత’ నివాళి
సాక్షి ప్రతినిధి, అనంతపురం :వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆదివారం వైఎస్సార్ సీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు, క్షీరాభిషేకాలు చేసి ఘన నివాళులర్పించారు. పలుచోట్ల రక్త, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నేతలే స్వయంగా రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వైఎస్సార్ భౌతికంగా దూరమై తొమ్మిదేళ్లవుతున్నా..జనం మాత్రం ఆయన్ను తమ గుండెల్లో పెట్టుకుని నిత్యం పూజిస్తున్నారు. అందుకే ఆయన వర్ధంతి రోజున ఎవరిని కదిలించినా రాజన్న రాజ్యం గురించే చెప్పారు. ఈ దగాకోరు పాలనకు అంతం చెబుతామంటూ ప్రతినబూనారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని ఆపార్టీ నేతలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్షీరాభిషేకాలు నిర్వహించారు. రక్తదానం, అన్నదానాలతో పాటు ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ‘అనంత’లో మాజీ ఎంపీ అనంత స్వయంగా రక్తదానం చేశారు. ఉరవకొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మడకశిరలో హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీమ్ అహ్మద్, తాడిపత్రి, అనంతపురంలో ‘అనంత’ పార్లమెంట్ సమన్వయకర్త పీడీ రంగయ్య పాల్గొన్నారు. ♦ ఉరవకొండలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కూడేరు మండలం అంతరగంగలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అన్నదానం చేశారు. జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణాజలాలు వచ్చాయంటే అది వైఎస్ ఘనతే అని కొనియాడారు. ♦ పెనుకొండలో హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకర్‌నారాయణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆపై ర్యాలీగా వెళ్లి దర్గా సర్కిల్లో రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఆ మహానేత జిల్లాకు చేసిన సేవలను కొనియాడారు. ♦ రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటాలనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్అండ్బీ అతిథి గృభహంలోని ఆ మహానేత విగ్రహానికి పూలమాల వేశారు. మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తర్వాత అన్నదానం చేశారు. ఉపేంద్రరెడ్డి, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి సిద్దప్ప పాల్గొన్నారు. ♦ శింగనమల నియోజకవర్గం పుట్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పీడీ రంగయ్య వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అన్నదానం చేశారు. శింగనమలలో సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. వైఎస్ విగ్రహం సమీపంలో అన్నదానం నిర్వహించారు. ♦ మడకశిరలో హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీమ్ అహ్మద్, మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్సార్ సర్కిల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మాజీ మంత్రి నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ♦ గుంతకల్లులో సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. గుత్తిలో కూడా వైఎస్సార్ విగ్రహానికి వెంకట్రామిరెడ్డి పాలాభిషేకం చేశారు. ఆటో కార్మికులు స్వచ్ఛందంగా గుత్తిలోని దారి వెంబడి భోజనం పంపిణీ చేశారు. ♦ పుట్టపర్తి నియోజకవర్గంలో బ్రాహ్మణపల్లి, బుక్కపట్నంలోని వైఎస్సార్ విగ్రహాలకు సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. మారాలలో మండల కన్వీనర్ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ♦ తాడిపత్రిలో అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త పీడీ రంగయ్య, తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడే ఏర్పాటు చేసిన రక్తదానశిబిరాన్ని ప్రారంభించారు. ♦ రాప్తాడులో సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తలుపూరులో తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి(చందు) వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కనగానపల్లి మండలం బద్దలాపురం, వేపకుంటలో పార్టీ నేతలు అన్నదానం నిర్వహించారు. రామగిరి మండలం పేరూరులో కూడా వైఎస్ వర్ధంతిని నిర్వహించారు. ♦ కళ్యాణదుర్గంలో సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పాల్వాయిలో స్థానిక నేతలతో కలిసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తక్కిన మండల కేంద్రాల్లో మండల కన్వీనర్లు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ♦ ధర్మవరం పట్టణంలో వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాలుగు వార్డుల్లో అన్నదానం నిర్వహించారు. తాడిమర్రిలో రక్తదానం నిర్వహించారు. పలు గ్రామాల్లో స్థానిక వైఎస్సార్సీపీ నేతలు అన్నదానం నిర్వహించారు. ♦ హిందూపురంలో వైఎస్సార్సీపీ నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. వైఎస్సార్సీపీ నేత కొండూరు వేణుగోపాల్‌రెడ్డి తన కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. మిట్టమీదపల్లి వద్ద మండల నాయకులు వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు. చిలమత్తూరు, లేపాక్షిలో కూడా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ♦ కదిరిలో సమన్వయకర్త సిద్ధారెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి పట్టణంలో ర్యాలీగా వైఎస్సార్ విగ్రహానికి చేరుకుని పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. వైఎస్సార్‌కు ‘లింగాల’ దంపతుల నివాళి అనంతపురం అగ్రికల్చర్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుడు లింగాల శివశంకరరెడ్డి, ఆయన సతీమణి లింగాల నీరజారెడ్డి నివాళుర్పించారు. స్థానిక డీసీసీబీ కార్యాలయ ఆవరణలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి మహానేత చేసిన సేవలు స్మరించుకున్నారు. కార్యక్రమంలో పలువురు డైరెక్టర్లు, పీఏసీఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు. -
జోహార్ వైఎస్సార్...
మంకమ్మతోట(కరీంనగర్): దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతిని జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని గీతాభవన్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేష్ ముఖ్యతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభు త్వ ప్రధానాస్పత్రి పిల్లలవార్డులో, బాలసదన్‌లోని పిల్లలకు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమ వసతి గృహంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పేద ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ఆలోచించేవారని కొనియాడారు. పేదలందరికీ కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదల ప్రాణాలకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. అందరికీ ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేశారన్నారు. మహిళలకు పావలవడ్డీ, వృద్ధులు, వికలాంగులకు పింఛన్ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, జిల్లా అధికార ప్రతినిధి ఎండీ. షాహెంషా, నగర అధ్యక్షుడు ఇంజినీర్ సాన రాజన్న, యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.సలీం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గండి శ్యామ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, జిల్లా కార్యదర్శి దీటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన నేత : పొన్నం ఇచ్చిన మాటకు కట్టుబడిన నేత వైఎస్సార్ అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన కార్యాలయంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంత కష్టమైనా అనుకున్నది సాధించడం, నమ్ముకున్న వారికి న్యాయం చేయడం వైఎస్సార్ నైజామని పేర్కొన్నారు. తాను ప్రారంభించిన ప్రతి పథకానికీ ఇందిర, రాజీవ్ పేర్లను పెట్టి విశ్వసనీయతను చాటుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కర్ర రాజశేఖర్, మున్పిపల్ ఫ్లోర్‌లీడర్ ఆకుల ప్రకాష్, సరిళ్ల ప్రసాద్, బుచ్చిరెడ్డి, చెన్నాడి అజిత్‌రావు, మునిగంటి అనిల్, పడిశెట్టి భూమయ్య, వొంటెల రత్నాకర్, పొన్నం సత్యం, కటకం వెంకటరమణ, పొన్నం శ్రీనివాస్, బోనాల శ్రీనివాస్, మూల రవీందర్‌రెడ్డి, పిల్లి మహేష్, మడుపు మోహన్, తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, కె.సదానందచారి, తాజ్, లింగంపెల్లి బాబు, ఎండీ నదీమ్, గడప శ్రీనివాస్, పచ్చిమట్ల రాజశేఖర్, మర్రి శ్రీనివాస్, సుంకరి గణపతి తదితరులు పాల్గొన్నారు. రామడుగులో.. రామడుగు(చొప్పదండి): రామడుగులో వైఎస్సార్ వర్ధంతిని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పులి ఆం జనేయులుగౌడ్ అధ్వర్యంలో నిర్వహించారు. పో చమ్మ చౌరస్తాలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు. కార్యక్రమానికి యు వజన కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ హాజరై మాట్లాడుతూ.. పేదల కోసం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోల రమేష్, నాయకులు పంజాల శ్రీనివాస్‌గౌడ్, కాడె శంకర్, గోనెపల్లి బాలాగౌడ్, దేవకిషన్, బొమ్మరవేని తిరుపతి, బాపురాజు, నారాయణ, పిండి శ్రీని వాస్‌రె డ్డి, వెంకటేష్, రాజశేఖర్, సముద్రాల సత్యం, అజయ్, సుంకె ఆశాలు, శ్రీనివాస్ పాల్గొన్నారు. వైఎస్సార్ సేవలు మరువలేనివి వైఎస్సార్సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సందమల్ల నరేష్ హుజూరాబాద్: వైఎస్సార్ సేవలు మరువలేనివని వైఎస్సార్సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సందమల్ల నరేష్ అన్నారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతులకు ఉచిత విద్యుత్, ప్రాంతాలకతీతంగా నిరుపేద విద్యార్థులకు సాంకేతిక విద్య, ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మేడ్దుల అర్జున్ యాదవ్, మునిగంటి రాకేష్‌రెడ్డి, అపరాధ మహేందర్, బరిగే తిరందాస్, పెద్ది చంద్రకాంత్, ముక్క అన్వేష్, కాతం రణదీర్, నాగవెల్లి మధుసూదన్, శ్రీకాంత్, విష్ణు, పవన్, మహేష్, ప్రవీన్ పాల్గొన్నారు. -
మహానేతా.. మరువలేం
దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఆయన విగ్రహాలను పూలమాలలతో ముంచెత్తారు. పలుచోట్ల పాలాభిషేకం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దయెత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. రాజన్న అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. సాక్షి, తిరుపతి :మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదవ వర్ధంతిని ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, వీధులు, వార్డులు తేడా లేకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘనంగా నివాళులు అర్పించి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పుంగనూరు పరిధిలోని చౌడేపల్లె, సోమలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిం చారు. తిరుపతిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో యువనాయకుడు భూమన అభినయరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నగరి నియోజక వర్గం పుత్తూరులో ఎమ్మెల్యే ఆర్కే రోజా అంబేడ్కర్ కూడలిలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభు త్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. గంగాధరనెల్లూరు పరిధిలోని శ్రీరంగరాజపురంలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే నారాయణస్వామి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్ని మండలాల్లో ఘనంగా నివా ళులర్పించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గం దామినేడు వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మదనపల్లెలో ఎమ్మెల్యే దేశాయితిప్పారెడ్డి తొట్టివారిపల్లెలో వైఎస్సార్ విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రెడ్డివారిపల్లెలో సంతాప సభ నిర్వహించి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చౌడేశ్వరి కూడలిలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నివాళులు అర్పించారు. పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురంలో ఎమ్మెల్యే చిం తల రామచంద్రారెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం గుండ్లపల్లె, తవణంపల్లెలో వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే సునీల్‌కుమార్ పూలమాలులు వేసి నివా ళులు అర్పించారు. గోవిందపల్లెలో అన్నదానం చేశారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో చిత్తూరు పార్లమెం టరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్, జెడ్పీ, డీసీసీ బ్యాంక్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనుప్పల్లె్లలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు పార్లమెంటరీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి డీసీసీ బ్యాంక్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లక్ష్మీనగర్ కాలనీలోని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, వైఎస్సా ర్ కాలనీలో స్టీలు ప్లేట్లు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సత్యవేడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివా ళులర్పించారు. తంబళ్లపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి కురబలకోటలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కుప్పంలో పార్టీ నియోజకవర్గ సమన్వయర్త చంద్రమౌళి ఆధ్వర్యంలో రామకుప్పం, గుడుపల్లె, శాంతిపురం, కుప్పం పట్టణంలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సా ర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పార్టీ కన్వీనర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, రాష్ట్ర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ట్రేడ్‌యూనియన్, విద్యార్థి విభాగం నాయకులు, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్‌లు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. -
మహానేతకు సేవా నివాళి
విశాఖసిటీ: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ శ్రేణులు ఊరూ వాడా సేవా కార్యక్రమాలతో ఘనంగా నివాళులర్పించారు. మహానేత భౌతికంగా దూరమై తొమ్మిదేళ్లైనా తమ గుండెల్లో కొలువై ఉన్నాడంటూ జిల్లా వాసులు కొనియాడారు. పేదలకు వస్త్రాలు, అన్నదానాలు, రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. పలుచోట్ల రక్తదానం చేశారు. తూర్పు నియోజకవర్గంలో... తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో 9వ వార్డులో పేదల పండ్లు అందజేశారు. శ్రీకృష్ణాపురంలో పేదలకు నోట్ పుస్తకాల పంపిణీ చేశారు. సంజయ్‌గాంధీ కాలనీలో వార్డు ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దుర్గాబజార్ వద్ద యువ చైతన్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పేద వృద్ధులకు బియ్యం, పళ్లు అందజేశారు. 10వ వార్డులో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆరో వార్డులో వైఎస్సార్ సీపీ భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, భీమిలి నియోజకవర్గ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి గుడ్ల పోలిరెడ్డి ఆధ్వర్యంలో వుడాకాలనీ బీచ్ రోడ్డు ఆర్చ్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు దసపల్లా లేఅవుట్ ప్రాంతాలోని అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గంలో.. 32వ వార్డు ముస్లింతాటిచెట్లపాలెంలో నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు చేతుల మీదుగా వృద్ధులకు చీరలు పంపిణీ చే ఊ్ఛరు. విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయ్‌కుమార్, పార్లమెంట్ మహిళాధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ప్రియదర్శిని హోంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి లలితానగర్‌లో గల కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. జగ్గారావు బ్రిడ్జి వద్ద విశాఖ జిల్లాభవన నిర్మాణ కార్మిక సంఘం అధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. 38వ వార్డు పట్టాభిరెడ్డితోటలోని వానప్రస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులకు సమన్వయకర్త కేకే రాజు, ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి షబ్నం అష్రాఫ్ వృద్థులకు పండ్లు పంపిణీ చేశారు. దక్షిణ నియోజకవర్గంలో... నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, పార్టీ నాయకుడు జాన్‌వెస్లీ ప్రేమసమాజంలో అనాథ వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పార్టీ మహిళ విభాగం నగర అధ్యక్షురాలు గరికిన గౌరీ ఆధ్వర్యంలో వార్డు పరిధి అచ్చెయ్యమ్మపేట జంక్షన్లో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 29వ వార్డు అధ్యక్షురాలు తోట పద్మావతి వార్డులోని పేదలకు బియ్యం అందజేశారు. వార్డులోని జెండా చెట్టు వీధి(అచ్చెయ్యమ్మపేట)లో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన ఇద్దరు చిన్నారుల(సీహెచ్ వాసంతి, సాయిసుధా)కు ఆర్థిక సాయం చేశారు. విద్యా దానం కింద ఓ పాపను దత్తత తీసుకున్నారు. దొంపర్తిలో కోలా గురువులు, జాన్‌వెస్లీ, నగర మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ మహ్మద్ షరిఫ్ చేతుల మీదుగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు. జగదాంబలోని వైస్ విగ్రహం వద్ద పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అమెరికన్ ఆసుపత్రి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అల్పాహారం అందజేశారు. 21వ వార్డులో పేదలకు పండ్లు, చిన్నారులకు పుస్తకాలు, 22వ వార్డులో విద్యార్థులకు పలకలు, సున్నపు వీధిలో పేదలకు పండ్లు పంపిణీ చేశారు. చిలకపేటలో విద్యార్థులకు పలకలు, పుస్తకాలు పంపిణీ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో.. ఎన్ఏడీ జంక్షన్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మహిళలకు కుట్టుమిషన్లు, చీరలు పంపిణీ చేశారు. పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్ర కార్యదర్శి సనపల చంద్రమౌళి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 95 మంది రక్తందానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె.కె.రాజు, అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. 45 నుంచి 49వ వార్డు పరిధిలో గల పేద కుటుంబాలకు చెందిన వితంతువులు సుమారు 20 మందికి కుట్టు మిషన్లు అందించారు. అనంతరం సుమారు 5 వందల పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మాధవధారలో వివిధ అనాథాశ్రమాల్లోని అనాథలకు పళ్లు పంచిపెట్టారు. గాజువాక నియోజకవర్గంలో.. రాజీవ్‌నగర్ జంక్షన్లో సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డ్రైవర్స్ కాలనీలో నాగిరెడ్డి చేతుల మీదుగా వృద్ధులకు పళ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. 500 మంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. 61వ వార్డు అధ్యక్షుడు రాజాన రామారావు వైఎస్ వర్ధంతిని అనాథ పిల్లల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు, అనాథ పిల్లలకు పళ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. 63వ వార్డులో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్‌కు నివాళులర్పించారు. భెల్ (హెచ్‌పీవీపీ)లో వైఎస్ వర్ధంతిని సంస్థ గుర్తింపు యూనియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అగనంపూడి వైఎస్సార్ కూడలి నిరుపేద విద్యార్థి జెర్రిపోతుల రమ్య చదువు కోసం పార్టీ నాయకులు పూర్ణ, ఇల్లపు ప్రసాద్ రూ.5500 నగదును ఆర్థిక సహాయంగా అందించారు. భీమిలి నియోజకవర్గంలో.. మధురవాడ, స్వతంత్రనగర్‌లో నియోజకవర్గ ఇన్చార్జి అక్కరమాని విజయనిర్మల వైఎస్ విగ్రహం, చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చంద్రంపాలెం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాపూజీ కళామందిరం వద్ద గల వైఎస్ విగ్రహానికి పూల మాలలు నివాళులర్పించారు. సాయిరాం కాలనీలో పార్టీ నాయకులు వృద్ధులకు పండ్లను అందజేశారు. పద్మనాభం, పీఎంపాలెంలో విజయనిర్మల చేతుల మీదుగా దివ్యాం గుల పాఠశాల విద్యార్థులకు యాపిల్ బత్తాయి ఫలాలు పంపిణీ చేశారు. స్కూలుకు నిత్యావసర సరకులు ఆమె అందజేశారు. ఆనందపురం మండలంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. పెందుర్తి నియోజకవర్గంలో... పెందుర్తి పార్టీ కార్యాలయంలో అదీప్‌రాజ్ వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సబ్బవరం మండలంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో తన మనమడు,షర్మిల తనయుడు అర్జున రెడ్డి పాల్గొన్నారు. ప్రహ్లాదపురంలో పేదలకు పండ్లు, రొట్టెలు పంచారు. నాయుడుతోట జంక్షన్లో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అప్పలనరసింహంకాలనీలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. పరవాడ గ్రామంలో సీఈసీ సభ్యుడు పైల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశపాత్రునిపాలెంలో పేదలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. మనసున్న మారాజు వైఎస్సార్ బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): బీచ్‌రోడ్డులోని వైఎస్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. మనసున్న మారాజు వైఎస్సార్ అని కొనియాడారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త ఎం.వి.వి. సత్యనారాయణ, సమన్వయకర్తలు వంశీకృష్ట శ్రీనివాస్, కోలా గురువులు, కె.కె. రాజు, నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శిలు ఫరూఖీ, భర్కత్ ఆలీ, ఉషాకిరణ్, రవిరెడ్డి, పక్కి దివాకర్, వెంకటలక్ష్మి, మహిళ అధ్యక్షురాలు గరికిన గౌరీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, మైనార్టీ సెల్ ఎండీ షరీఫ్, మాజీ కార్పొరేటర్లు పోతిన హనుమంత్, విజయచంద్ర, జాన్ వెస్లీ, పీలా ఉమారాణి, నగర ప్రధాన కార్యదర్శి అచ్చితిరావు, పైలా జ్యోతి, రాధ పాల్గొన్నారు. -
మహానేత వైఎస్సార్‌కు నివాళి అర్పించిన ఎన్నారైలు
జొహన్నెస్ బర్గ్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఎన్నారైలు ఘన నివాళి అర్పించారు. జొహన్నెస్ బర్గ్‌లోని ఎన్నారైలు కల్లా నరసింహ రెడ్డి, కొత్త రామకృష్ణా, సూర్యారామి రెడ్డి, అరుణ్, కిరణ్, వంశీ ఓబులశెట్టి, మురళి సోమిశెట్టి, రాంబాబు, మోహన్, కుమార్ ఎద్దుల పల్లి ,సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మహా నేత వైఎస్సార్‌కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఫాన్స్ సౌత్ ఆఫ్రికా తరుపున కల్లా నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ పేద ప్రజలకు ఎంతో మేలు చేశారని.. ఆరోగ్య శ్రీ , ఫీజు రీయింబర్స్మెంట్ ,108, పక్కా ఇల్లు ఇలా చాలా పథకాలతో ఆయన ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారని అన్నారు. రామకృష్ణ కొత్త మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపిందని కొనియాడారు. కుమార్, మోహన్ మాట్లాడుతూ.. రైతులకు రాజన్న చేసిన మేలు రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయలేదని అన్నారు. సభ్యులు అందరూ మహానేత కు నివాళులు అర్పించిన తరువాత జోహానసబర్గ్ లోని ఓల్డేజ్ హోమ్ లో 300 మంది వృద్దులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేసి మహానేత వైఎస్సార్ ఆశయాలు ఆలోచనలు కొనసాగిస్తామన్నారు. -
చరితలో చెరగని గురుతు నీవు..
అడగకుండానే అన్నీ ఇచ్చిన దయాగుణం.. నిరుపేదలకు అది స్వర్ణయుగం.. జలయజ్ఞంతో కరువు నేల సస్యశ్యామలం.. రేపటి భవిష్యత్‌కు ఫీజు రీయింబర్స్మెంట్ వరం.. ఆగుతున్న గుండెలకు ఆరోగ్యశ్రీ మహాభాగ్యం.. పథకాలతో ఊరూరా సంక్షేమ సంతకం.. జనహృదయాల్లో నిలిచిన దైవం.. చరితలో నీ జ్ఞాపకం శాశ్వతం.. ప్రజా నాడి పట్టిన డాక్టర్ కర్నూలు(హాస్పిటల్): ఆరోగ్య పథకాలంటే దేశంలో వెంటనే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలేనంటే అతిశయోక్తి కాదు. కార్పొరేట్ కాదు కదా ప్రైవేటు ఆసుపత్రుల మెట్లు ఎక్కడానికి కూడా భయపడే పేదవాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా చేయించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించారు. అత్యవసర వైద్యం అందించేందుకు గాను 108 అంబులెన్స్‌లు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించేందుకు 104 సేవలు ఆయన హయాంలో వచ్చిన పథకాలే. స్వయంగా ఆయన డాక్టర్ అయినందున పేదల కష్టాలేంటో ఆయన గుర్తెరిగి ఈ పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెలో దేవుడయ్యాడు. జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం 2008లో ప్రారంభమైంది. అప్పట్లో 20 దాకా ప్రైవేటు ఆసుపత్రులతో పాటు కర్నూలు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఈ పథకం వర్తింపజేశారు. పెద్దాసుపత్రిలో గుండెకు ఊపిరి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 2006లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆసుపత్రికి వచ్చారు. గుండె జబ్బుల విభాగంలో కేథలాబ్ యూనిట్ అవసరం అవుతుందని వైద్యులు చెప్పగానే అంగీకరించి ఏర్పాటు చేశారు. ఇది 2008లో ప్రారంభమై ఇప్పటికీ నిరంత రాయంగా హృద్రోగులకు సేవలు అందిస్తోంది. ఈ యంత్రం ద్వారా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టెంట్లు వేయడం వంటి సేవలు అందిస్తున్నారు. గతంలో ఈ సేవలు పొందాలంటే రోగులు హైదరాబాద్ వెళ్లేవారు. 8మాతాశిశు భవనం వైఎస్ చలువే ప్రస్తుతం పెద్దాసుపత్రిలోని మాతాశిశు భవనాలు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతోనే నిర్మించారు. 2006లో ఈ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. 2007లో దీని నిర్మాణం ప్రారంభమైంది. మొదట ఇప్పుడున్న చిన్నపిల్లల విభాగం భవన నిర్మాణం పూర్తయ్యింది. అప్పట్లో పాత భవనంలో ఉన్న చిన్నపిల్లల విభాగంలో సౌకర్యాలు లేక చిన్నపిల్లలు చనిపోతుండటంతో స్పందించిన అధికారులు ఉన్నఫలంగా కొత్త భవనంలోకి వార్డును మార్చారు. గైనిక్ కోసం నిర్మించిన ఈ విభాగంలో పిల్లల వార్డు చేరడంతో మళ్లీ గైనిక్ విభాగానికి టెండర్లు పిలిచారు. ఆరేళ్లకు పైగా ఈ భవనం నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసుకుని ఇటీవలే ప్రారంభమై ఉత్తమ సేవలు అందిస్తోంది. చికిత్సకు ఎంత ఖర్చయినా వైఎస్ఆర్ ఇచ్చేవారు నా కుమారుడు అశోక్‌కుమార్ నాయక్‌కు పుట్టుకతో గుండెజబ్బు, బుద్ధిమాంధ్యం ఉంది. హైదరాబాద్ ఇన్నోవా హాస్పిటల్లో 2010లో ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స చేయించాము. అయితే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చికిత్సకు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరించేది. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రూ.1. 25 లక్షలు మాత్రమే ఇచ్చారు. మాకు మాత్రం రూ.6.80 లక్షలు ఖర్చు అయింది. దాతల ద్వారా సహాయం పొంది వైద్యం అందించాము. ఇప్పుడు బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. – చంద్రపాల్ నాయక్, జమ్మినగర్తండా, వెలుగోడు చేనేతకు ఆ‘ధార’మై.. వైఎస్ఆర్ హయాంలో రూ.7.90 కోట్ల రుణాలు మాఫీ కర్నూలు(అర్బన్): చేనేత రంగానికి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేయూత అందించారు. చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక కార్యాక్రమాలను చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న నలుగురు చేనేత కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల ప్రకారం మంజూరు చేశారు. వైఎస్ మృతి అనంతరం జిల్లాలో ఆరుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా ఇప్పటికీ నయాపైసా విడుదల చేయలేదు. రైతుల రుణమాఫీతో పాటు చేనేతల రుణాలు కూడా మాఫీ అయి న నేపథ్యంలో జిల్లాలో సహకార, వ్యక్తిగత రుణాలు రూ.7,90,54,288 మాఫీ అయ్యాయి. జిల్లాలోని 18 సహకార సంఘాల్లోని సభ్యులకు సంబంధించి రూ.4,53,17,935 మాఫీ అయ్యాయి. అలాగే 1942 మంది చేనేత కార్మికులకు వివిధ బ్యాంకుల్లో ఉన్న వ్యక్తిగత రుణాలు రూ.3,37,36,353 మాఫీ అయ్యాయి. ముఖ్యమంత్రిగా డా.వైఎస్ఆర్ ఉన్న సమయంలో 50 ఏళ్లకే చేనేత కార్మికులకు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 4,417 మంది నేత కార్మికులకు పెన్షన్ అందుతోంది. అలాగే నిరుపేద చేనేత కార్మికులను గుర్తించి వారికి అంత్యోదయ అన్నయోజన (ఏఏవై) పథకం కింద నెలకు 35 కేజీల బియ్యాన్ని అందించేందుకు ప్రత్యేకంగా వీవర్స్ కార్డులు అందించారు. ఇప్పటికి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో 115 మంది ఈ కార్డుల ద్వారా బియ్యం తీసుకుంటున్నారు. గృహ నిర్మాణానికి విడుదల చేసే మొత్తానికి చేనేతలకు అదనంగా రూ.20 వేలను విడుదల చేశారు. పేదోడి సొంతింటి కల.. నెరవేరిన వేళ కర్నూలు(అర్బన్): ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మదిలో పురుడు పోసుకున్న ‘ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం’ ద్వారా జిల్లాలో లక్షల మంది నిరుపేదలు ఇంటి యజమానులయ్యారు. జిల్లాలో మూడు విడతలుగా జరిగిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో 3.28 లక్షల గృహాలు మంజూరు చేసి రూ.1013 కోట్లు ఖర్చు చేశారు. పార్టీలకతీతంగా అడిగిన వారందరికీ గృహాలు మంజూరు కావడంతో గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి పేదవాడు సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం మొదటి విడతలో జిల్లాకు 1,22,225 గృహాలు మంజూరు కాగా, ఈ గృహాల నిర్మాణాలకు రూ.36009.37 లక్షలు వెచ్చించారు. రెండవ విడతలో 1,21,039 గృహాలు మంజూరు కాగా, ఈ నిర్మాణాలకు రూ.40446.74 లక్షలు ఖర్చు చేశారు. అలాగే మూడవ విడతలో 61,143 గృహాలు మంజూరు కాగా, ఈ నిర్మాణాలకు రూ.24909.76 లక్షలను వెచ్చించారు. అలాగే 2004–05 ఆర్థిక సంవత్సరం నుంచి 2009–10వ ఆర్థిక సంవత్సరం వరకు ఇందిరా ఆవాజ్ యోజన పథకం ద్వారా 23,396 ఇళ్లను మంజూరు చేసి ఈ ఇళ్ల నిర్మాణాలకు రూ.63 కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాలుగు న్నరేళ్లలో ఇప్పటి వరకు జిల్లాకు కేవలం 74,121 గృహాలను మాత్రమే మంజూరు చేయగా, ఇప్పటి వరకు 31,135 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన గృహాలు వేర్వేరు దశల్లో కొనసాగుతున్నాయి. 30 ఏళ్ల కల నెరవేరింది ఇళ్లులేక 30 ఏళ్లుగా పూరి గుడిసెలోనే జీవనం సాగిస్తూ వచ్చాం. మహానేత రాజశేఖర్‌రెడ్డి వచ్చిన వెంటనే నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. అప్పట్లో రూ.35 వేలు రుణం వచ్చింది. సొంత స్థలం ఉండడంతో దానిలో ఇల్లు నిర్మించుకున్నాను. నా ఇల్లు ఆయన పుణ్యమే. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. – మగ్బుల్, శిరివెళ్ల -
జనహృదయ నేత.. ప్రగతి ప్రదాత
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : పాలకులు ఎందరో ఉంటారు. కానీ ‘ప్రజా పాలకులు’ కొందరే ఉంటారు. జనం మనసెరిగి పాలించడమే కాదు..వారి కష్టసుఖాల్లోనూ తోడూ నీడగా ఉండడం ఉత్తమ పాలకుని విధి, బాధ్యత. అలాంటి వారు జనం హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తరాలు మారినా చరిత్రలో వారి స్థానం మాత్రం పదిలంగా ఉంటుంది. ఇలాంటి కోవకే చెందుతారు మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రగతికి బాటలు వేయడమే కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం కడదాకా తపించిన రాజన్న జిల్లా ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు.ఆయన మరణించి తొమ్మిదేళ్లవుతున్నా నేటికీ ఆయన జ్ఞాపకాలు ప్రజల మదిలో నిలిచే ఉన్నాయి. సంక్షేమ సారథి పండుటాకులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతలు..ఇలా అన్ని రకాల పింఛన్లు 3.50 లక్షల మందికి మంజూరు చేసి బాసటగా నిలిచారు. చేనేతకు ఆ‘ధార’మై ఆదుకున్నారు. వారికి సంబంధించిన రూ.7.90 కోట్ల రుణాలు మాఫీ చేశారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లు ఇచ్చారు. నేడు జిల్లాలో 4,417 మంది నేతన్నలకు పింఛన్ అందుతోందంటే వైఎస్సార్ చలువే. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జిల్లాలో ఎంతోమందికి ప్రాణాలు నిలిపారు. అత్యవసర వైద్యసేవల కోసం 108 అంబులెన్స్‌లు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించేందుకు 104 సేవలు ప్రవేశపెట్టారు. పేదల ఇంటి కలను సాకారం చేశారు. జిల్లాలో మూడు విడతలుగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద 3.28 లక్షల గృహాలు మంజూరు చేసి.. రూ.1,013 కోట్లు ఖర్చు పెట్టారు. పార్టీలకతీతంగా అడిగిన వారందరికీ పక్కాగృహాలు మంజూరు చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం, స్కాలర్‌షిప్పుల ద్వారా పేదల జీవితాల్లో విద్యావెలుగులు నింపారు. ఎందరో పేదపిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌తో చదువుకుని ఎంతో మంది పేదపిల్లలు ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, ఎంసీఏ పట్టభద్రులయ్యారు. కడు పేదరికంలో మగ్గుతున్న ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లు వారి అభ్యున్నతికి తోడ్పడ్డాయి. జిల్లాతో ప్రత్యేక అనుబంధం వైఎస్సార్‌కు కర్నూలు జిల్లాతో ప్రత్యేకానుబంధం ఉంది. 2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకు ఆయన ముఖ్యమంత్రి హోదాలో 29 సార్లు జిల్లాలో పర్యటించారు. వచ్చిన ప్రతిసారీ అభివృద్ధి లేదా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు, ముచ్చుమర్రితో కృష్ణా, తుంగభద్ర నదుల అనుసంధానం కోసం కృషి చేశారు. రాయలసీమ జిల్లాల కల్పతరువైన హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించడమే కాకుండా పనులు కూడా చాలావరకు పూర్తి చేయించారు. ఆయన చలువ వల్లే నేడు హంద్రీ–నీవా ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాలకు కృష్ణా జలాలు అందుతున్నాయి. అలాగే జిల్లాలోని వెలుగోడు రిజర్వాయర్, కేసీ కెనాల్, తెలుగు గంగ కాలువల లైనింగ్ పనులను చేపట్టారు. అప్పుల్లో కూరుకుపోయిన రైతన్నలను ఆదుకునేందుకు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మాఫీ చేయించారు. అలాగే ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టడంతో నేటికీ లక్షలాది మంది రైతులు లబ్ధిపొందుతున్నారు.మరీ ముఖ్యంగా 2004, 2009 ఎన్నికల ప్రచారాన్ని నందికొట్కూరు, ఆలూరులో ముగించి..జిల్లాతో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. వైఎస్సార్ ఆత్మకూరు సమీపంలోని నల్లకాలువలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జిల్లా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆర్‌యూకు అంకురార్పణ జిల్లాను విద్యాపరంగా అభివృద్ధిలోకి తెచ్చేందుకు వైఎస్ అనేక చర్యలు తీసుకున్నారు. ఇక్కడ బీటెక్, బీఈడీ, డీఈడీ కళాశాలల ఏర్పాటుతో పాటు రాయలసీమ యూనివర్సిటీ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. అప్పటి వరకు ఎస్కేయూ స్టడీ సెంటర్‌గా ఉన్నదాన్ని రాయలసీమ యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తూ రూ.100 కోట్లు కేటాయించారు. యూనివర్సిటీకి అనుబంధంగా ప్రభుత్వ ఇంజినీరింగ్, న్యాయ కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు తయారు చేయించారు. అయితే.. ఆ తరువాత వచ్చిన పాలకులు వీటిని నెరవేర్చలేకపోయారు. ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి కార్యక్రమాలను ప్రతి నియోజకవర్గంలో పెద్దఎత్తున నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రతిచోటా వైఎస్ఆర్ చిత్రపటాలకు ఘన నివాళి అర్పించి.. సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. కర్నూలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం పది గంటలకు నిర్వహించే వర్ధంతి కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో హాజరు కావాలని కోరారు. పేర్లు మార్చి..నిర్వీర్యం చేస్తూ.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు విశేష జనాదరణ చూరగొనడంతో నేటి చంద్రబాబు ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. దీంతో వాటి పేర్లు మార్చి అమలు చేస్తోంది. నిధుల కొరతను కూడా సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకానికి తగినన్ని నిధులు ఇవ్వడంలేదు. 108, 104 వాహనాలకు డీజిల్ పోయించడంలేదు. పొదుపు మహిళలు, రైతులకు పావలావడ్డీకే రుణాలు ఇవ్వకుండా వేధిస్తోంది. ఇలా వైఎస్ఆర్ పేరును మరచిపోయేలా చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రజల్లో మాత్రం ఆయనపై అభిమానం మరింత రెట్టింపవుతోంది. 4 శాతం రిజర్వేషన్‌తోనే డాక్టరయ్యా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌దే. పేదలైన మాలాంటి వారు వైద్య విద్య గురించి ఆలోచించారు. రిజర్వేషన్‌తో ఫ్రీ సీటు రావడంతో కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో డీఎన్బీ విద్యను పూర్తి చేశాను. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్‌లో వైద్యుడిగా పని చేస్తున్నాను. ముస్లిం మైనార్టీలను ఆదుకునేందుకు రిజర్వేషన్లు కల్పించడంతో మాలాంటి వారికి ఎంతగానో ఉపయోగపడింది. – మహమ్మద్‌రఫీ, చాబోలు -
ఆరోజు ఏం జరిగింది..
ఆకాశానికి రంధ్రం పడ్డదా అన్నంతగా వర్షం.. కాలు బయటకు పెట్టలేనంత జడివాన.. 2009 సెప్టెంబర్ 2న వాతావరణ పరిస్థితి. ఆత్మకూరు మండలంలో పొంగని వాగు లేదు. తెగని రోడ్డు లేదు. సుమారు 24 సెం.మీ. వర్షపాతం నమోదు. దాదాపు కుంభవృష్టే. రాయలసీమలో వర్షమెప్పుడూ హర్షదాయకమే.. అయితే నాటి వర్షం యావత్ దేశానికే విషాదాన్ని పంచింది. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ నల్లమల అడవుల్లో కూలిపోయి ఆయనతో పాటు వ్యక్తిగత, చాపర్ సిబ్బంది దారుణ మరణాన్ని పొందారు. – ఆత్మకూరు రూరల్ ► రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్లో ఉద యం 8.38 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చిత్తూరుకు బయలు దేరారు. ఆరోజు హెలికాప్ట్టర్ ప్రయాణించేందుకు వాతావరణం ఏమాత్రం సరిగా లేదు. ఆకాశమంతా దట్టమైన క్యుములో నింబస్ మేఘాలు ఆవరించి ఉన్నాయి. ► 35 నిమిషాల ప్రయాణం అనంతరం హైదరాబాద్‌కు 150 కి.మీ. దూరంలో హెలికాఫ్టర్ ప్రయాణిస్తూ ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. ► సరిగ్గా కొత్తపల్లె మండలంలోని సంగమేశ్వరం వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్‌పై వెళ్తున్న ఈ ప్రదేశంలోనే çశంషాబాద్ ఏటీసీ నుంచి సిగ్నల్ వ్యవస్థ చెన్నై ఏటీసీ పరిధిలోకి మారుతుంది. ఈ సందర్భంలో సిగ్నల్స్ కాస్త వీక్‌గా కూడా ఉంటాయి. ► గంటకు 250 కి.మీ. వేగంతో వెళుతున్న చాపర్ రెండు నిమిషాల్లో తూర్పు వైపునకు తిరిగి నేరుగా నల్లమల కొండల్లోకి వెళ్లింది. ఒక సిరిమాను చెట్టు కొమ్మలను తాకుతూ చిరుత గుండం తిప్పను ఢీకొంది. ► ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్ ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సంబంధాలు తెగిపోయే సరికి అందులో ప్రయాణించిన వారి సెల్ ఫోన్లకు చివరిగా ఇస్కాలలోని టవర్ నుంచే సిగ్నల్స్ అందినట్లు తెలుసుకుని ముఖ్యమంత్రి పేషీ నుంచి ఇక్కడి అధికారులను అప్రమత్తం చేశారు. ► సాయంత్రానికే ప్రముఖులంతా ఆత్మకూరు చేరుకున్నారు. బానుముక్కల టర్నింగ్ వద్ద నుంచి పాము లపాడు మండలమంతా జోరు వర్షంలోనే జల్లెడ పట్టారు. హెలికాప్టర్ నల్లమలలో దిగి ఉండవచ్చనే అనుమానంతో నల్లమలలో నలుమూలలకు జనం పరుగులు తీశారు. ► అడవి గురించి తెలిసిన పశువుల కాపర్ల సహకారం తీసుకున్నారు. చీకటి పడే సరికి కూడా జాడ తెలియ లేదు. ► భారత వైమానిక దళంలోని సుఖోయ్ యుద్ధ విమానాలు రాత్రి రంగంలోకి దిగాయి. వాటికి అమర్చిన అత్యంత శక్తివంతమైన సెన్సర్ల సహాయంతో రుద్రకోడు శివక్షేత్రానికి ఎడమవైపు ఉన్న పసురుట్ల బీట్‌లో చిరుత గుండం తిప్పపై హెలికాప్ట్టర్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించాయి. ► చాపర్‌లో ప్రయాణించిన ఏ ఒక్కరు ప్రాణాలతో లేని విషయం సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం అధికారులు ప్రకటించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మృతదేహం తాను కూర్చున్న సీట్‌కు బెల్ట్‌తో బిగించి కనబడింది. ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుబ్రమణ్యం. చీఫ్ సెక్యూరిటీ అధికారి వెస్లీ, చాపర్ పైలట్ భాటియా, కో– పైలట్ ఎంఎస్ రెడ్డి శరీర భాగాలు చెల్లా చెదరై కనిపించాయి. -
వైఎస్ఆర్కు వైఎస్సార్సీపీ నేతల ఘన నివాళి
-
మది గెలిచిన పెద్దాయన
రాజన్న పాలనలో జిల్లా దశ మారిపోయింది. అభివృద్ధి అంటే ఇది అనే రీతిలో సింహపురి ప్రగతి పథంలో దూసుకుపోయింది. సంక్షేమ పథకాలతో ప్రజారంజక పాలనకు నిర్వచనంగా నిలిచి ప్రజల మనస్సుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. పారిశ్రామికంగా జిల్లాకు కొత్త ఊపు తెచ్చారు. కృష్ణపట్నం పోర్టు, మేనకూరు, మాంబట్టు, శ్రీసిటీ సెజ్‌ల ఏర్పాటుకు బీజం వేసి పారిశ్రామిక కారిడార్‌గా మార్చేశారు. 2004 నుంచి 2009 సంవత్సరం ఒక స్వర్ణయుగంగా నిలిచింది. ఐదేళ్ల కాలంలో 22 సార్లు రాజన్న జిల్లాలో పర్యటించారు. వచ్చిన ప్రతిసారీ వరాల జల్లు కురిపించారు. అంతే కాదు అమలు చేసిన ఘనత కూడా మహానేతదే. జలయజ్ఞంతో జిల్లాలో అనేక కొత్త ప్రాజెక్ట్‌లు నిర్మాణంలోకి రావడం, కొన్ని ప్రాజెక్ట్‌లు పూర్తయి సాగు విస్తీర్ణం పెరగడం జలప్రదాతతోనే సాధ్యమైంది. రాజకీయంగా జిల్లాలోని అనేక మంది నేతలకు మార్గదర్శకుడిగా నిలిచి ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా మలిచారు. ప్రజల మనస్సులు గెలుచుకున్న దివంగత ముఖ్యమంత్రి మనకు దూరమై ఆదివారానికి తొమ్మిదేళ్లు గడుస్తోంది. ఈ క్రమంలో జిల్లాతో మహానేత అనుబంధం, జరిగిన మేలును ఒకసారి పరిశీలిస్తే.. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జన హృదయనేత ౖవైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో నెల్లూరు మున్సిపాలిటీ కార్పోరేషన్‌గా హోదా పొందింది. 2000కు ముందు వరకు మున్సిపాలిటీగా ఉన్న నెల్లూరును ప్రజాప్రతినిధుల వినతి మేరకు నగరపాలక సంస్థగా మార్చారు వైఎస్సార్. నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. 1884 నుంచి మున్సిపాలిటీగా ఉన్న నెల్లూరుకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ క్రమంలో 2004లో ప్రజాప్రతినిధులు అడిగిందే తడువుగా కార్పొరేషన్‌గా స్థాయిని పెంచారు. ఆయన మరణానంతరం నెల్లూరు కార్పొరేషన్ భవనానికి ఆయన పేరే పెట్టి నేతలు మహానేతపై అభిమానం చాటుకున్నారు. వీఎస్యూతో విద్యా వెలుగులు జిల్లాలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా విద్యా వెలుగులు తీసుకొచ్చారు. 2008 జూలై 14న వెంకటాచలం మండలం కాకుటూరులో 83 ఎకరాల విస్తీర్ణంలో వర్సిటీని ఏర్పాటు చేశారు. జూలై 28న కొత్తగా వర్సిటీకి వీసీని నియమించారు. ఆగస్టులో ఆరు కోర్సులతో నూతనంగా విక్రమ సింహపురి వర్సిటీని ప్రారంభించారు. వర్సిటీకి రూ.25 కోట్లు నిధులను విడుదల చేశారు. 2009 ఫిబ్రవరి 21న 42 టీచింగ్ పోస్టులు, 33 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేశారు. ప్రస్తుతం కాకుటూరులో నిర్మించిన నూతన భవనంలో 17 కోర్సులతో వర్సిటీని నిర్వహిస్తున్నారు. మాంబట్టు నుంచి శ్రీసిటీ వరకు జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు తీయించి భూముల ధరలకు రెక్కలు తెప్పించిన ఘనత మహానేత వైఎస్సార్‌కే చెందుతుంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తడ మండలం మాంబట్టు సెజ్‌ను వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 2006లో భూకేటాయింపులు పూర్తయి, వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదగానే శంకుస్థాపన జరుపుకొంది. ఏడాది పూర్తి కాగానే 2007లో పరిశ్రమల ప్రారంభోత్సవాలు జరిగాయి. ప్రస్తుతం పదిహేను కంపెనీల్లో 14 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. నాయుడుపేట మండలం మేనకూరు సెజ్‌కు 2007లో శంకుస్థాపన చేసి 2008లో ప్రారంభించారు. ఈ సెజ్‌లోని పది కంపెనీల్లో ప్రస్తుతం 7 వేల మంది వరకు పనిచేస్తున్నారు. చివరగా తడ మండలం, చిత్తూరు జిల్లా సరిహద్దులో శ్రీసిటీని ఏర్పాటు చేశారు. 2008లో శ్రీసిటీ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. అయితే దురదృష్టవశాత్తు మహానేత వారం రోజుల ముందే మరణించారు. తదానంతర క్రమంలో శ్రీసిటీ ప్రారంభమైంది. 12వేల ఎకరాల్లో శ్రీసిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలి దశలో 7,500 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 100కు పైగా కంపెనీలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. 60 నుంచి 70 వేల మంది పనిచేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా ప్రగతి జిల్లాలో కృష్ణపట్నం పోర్టు మొదలు సెజ్ నిర్మాణం వరకు అన్ని వైఎస్సార్ హయాంలో జరిగినవే. ప్రైవేటు రంగంలో అభివృద్ధి చేయాలన్న తలంపుతో నాటి సీఎం చంద్రబాబు 1996లో ఈ పోర్టును నాట్కో సంస్థకు అప్పగించారు. ఆయన పాలనలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత ఈ పోర్టును నవయుగ సంస్థకు అప్పగించి పనులు వేగంగా చేసేలా చర్యలు తీసుకుని ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయించారు. 2008 జూలై 17న నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో కలిసి వైఎస్సార్ పోర్టును ప్రారంభించారు. పోర్టు ద్వారా పారిశ్రామికాభివృద్ధిలో జిల్లా కేంద్ర బిందువు అయింది. సోమశిల, సర్వముఖి, సంగం బ్యారేజ్‌ల అభివృద్ధి జలయజ్ఞం ప్రాజెక్ట్‌లో భాగంగా సర్వముఖిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు. సోమశిల రిజర్వాయర్ నీటి సామర్థ్యాన్ని 78 టీఎంసీలకు పెంచారు. పెన్నా డెల్టా ఆధునీకరణకు సంగం, నెల్లూరు బ్యారేజీలకు శంకుస్థాపన చేశారు. మెట్ట ప్రాంతాలకు పంపింగ్ స్కీం ద్వారా తాగు, సాగునీరు అందించే హైలెవల్ కెనాల్‌కు రూ.1000 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది వైఎస్సార్ హయంలోనే. జగనన్న రాకతో బాగు పడ్డాం ముత్తుకూరు: దొరువులపాళెం పంచాయతీలోని రొయ్యలపాళేనికి చెందిన నెల్లిపూడి వెంకటయ్య వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు. రాజన్న తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్రలో భాగంగా 2010 నవంబరు 2న దొరువులపాళెంలో పర్యటించారు. ఈ సందర్భంగా కుటుంబ పెద్దను పొగొట్టుకుని తీవ్ర విచారంలో ఉన్న వెంకటయ్య భార్య మస్తానమ్మ, కూతురు విజయను జగన్ ఓదార్చారు. నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఆర్థిక సాయం చేశారు. జగనన్న సాయంతో బాగుపడ్డామని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూ నెల్లిపూడి మస్తానమ్మ చెప్పింది. అంగడి నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పింది. -
వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ మైదానం..
కడప నగరంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మైదానం ఏర్పాటయ్యేందుకు వైఎస్ఆర్ చూపిన చొరవ అనిర్వచనీయం. స్వయానా రూ.50 లక్షల సొంత నిధులను వెచ్చించారు. దీంతో కడపలో మైదానం ఏర్పాటు చేసేందుకు ఏసీఏ ముందుకు రావడంతో పాటు వైఎస్ఆర్ తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరు మీదుగా వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ మైదానం ఏర్పాటైంది. -
చెరగని ముద్ర
సాక్షి ప్రతినిధి కడప: ‘బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను...బంగారు పంటలే పండుతాయి. ముత్యాల మురిపాలు దొరలుతాయి’...ఇది శంకరంబాడి సుందరాచార్యులు రాసిన గేయం. ఇది ఒకనాటికి నిజమవుతుందని జిల్లా ప్రజలెవరూ ఊహించలేదు. మెట్ట ప్రాంతంలో కృష్ణా జలాలు పారిస్తే నాజన్మ ధన్యమని రాజోలి రిజర్వాయర్ శంకుస్థాపన సందర్భంగా ఆనాడే స్పష్టీకరించారు వైఎస్ఆర్. ఆయన నిర్వహించిన జలయజ్ఞం ఫలితం సాకారమైంది. నీళ్లులేక నోళ్లు తెరచిన పులివెందుల నియోజకవర్గ బీడు భూములు పులకిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసిన వైఎస్... 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు వైఎస్ఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం ఐదేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం జిల్లాలో దాదాపు రూ.12వేల కోట్లు వెచ్చించారు. మొదటిదశలో భాగమైన అవుకు నుంచి గండికోటకు వరదకాలువ, గండికోట రిజర్వాయర్, టన్నెల్, వామికొండ, సర్వరాయసాగర్ పనులు సుమారు 85 శాతం పూర్తి చేశారు. అవుకు రిజర్వాయర్ కాంప్లెక్స్ సామర్థ్యాన్ని 4.8 టీఎంసీలకు పెంపు, గోరకల్లు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేశారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు విస్తరింపజేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంపులో తెలంగాణ ప్రాంతం తెలుగుదేశం, టిఆర్ఎస్, కోస్తా ప్రాంతం టీడీపీ నాయకులు సంయుక్తంగా జతకట్టి ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుత భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఆనాడు స్వయంగా ప్రకాశం బ్యారేజీపై నిరశన చేపట్టారు. జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణపు పనులు దృష్టిలో ఉంచుకొని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి, ఆరోపణలు గుప్పించిన నాయకుల అందరి నోర్లు మూపించి, ఒప్పించి, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంచారని చరిత్రకారులు వివరిస్తున్నారు. జిఎన్ఎస్ఎస్ పథకంలో తొలుత గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల నియోజకవర్గానికి తాగు, సాగునీరు ఇవ్వాలన్న ఉద్ధేశ్యంతో ఈ పధకానికి రూపకల్పన చేశారు. పైడిపాలెం వద్ద 6టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ ఏర్పాటు చేయడం ద్వారా తొండూరు, సింహాద్రిపురం, కొండాపురం మండలాల్లోని చెరువులను నింపి 47,500 ఎకరాలకు కొత్తగా సాగునీరుతోపాటు, పిబిసీ కింద 41,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణతో పాటు, పలు గ్రామాలకు తాగునీరు అందించాలనే సంకల్పం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో పైడిపాళెం ప్రాజెక్టు అంచనా విలువ రూ.727కోట్లు కాగా, వైఎస్ హయాంలోరూ.667కోట్లు వెచ్చించారు. తుంగభద్ర హైలెవెల్ కెనాల్లో అంతర్భాగంగా గతంలో పులివెందుల బ్రాంచ్‌కెనాల్ నిర్మించారు.టీబీ డ్యాంలో పూడికపేరుకపోవడం, ఎగువప్రాంతాల నీటి అక్రమ వినియోగం వంటి కారణాల వల్ల పిబిసీ ఏనాడు పూర్తి సామర్థ్యంతో సాగునీరు అందలేదు. రైతులు అనేక ఇక్కట్లు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీంతో ఆయకట్టు స్థిరీకరణకోసం సిబిఆర్‌ను నిర్మించారు. అయినా ఆశించిన ఫలితం కన్పించలేదు. ఈనేపధ్యంలో సిబిఆర్‌కు గండికోట నుంచి 8.3టీఎంసీల నీటిని 5లిఫ్ట్‌లు ద్వారా తీసుకెళ్లే బృహత్తర పథకానికి కూడా వైఎస్ శ్రీకారం చుట్టారు. రూ.1343కోట్లు అంచనా వ్యయంతో చేపట్టగా, అందులో రూ.1090కోట్లు వైఎస్ హయాంలో ఖర్చు చేశారు. తదుపరి రోశయ్య, కిరణ్ సర్కార్లతోపాటు చంద్రబాబు సర్కార్‌తో కలిపి వెచ్చించిన మొత్తం కేవలం రూ.72కోట్లు అన్న వాస్తవిక విషయాన్ని గ్రహించాల్సి ఉంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే పెండింగ్ పథకాలను పూర్తి చేయాల్సిన టీడీపీ సర్కార్ ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని పలువురు వివరిస్తున్నారు. -
మరుపురాని జ్ఞాపకం!
చెరగని చిరునవ్వు...తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు.. నడకలో రాజసం.. నమ్ముకున్న వారిని ఆదరించే గుణం... మాట తప్పని మడమ తిప్పని నైజం...కార్మికులు, కర్షకుల కోసం పరితపించే గుణం...ఈ లక్షణాలన్నీ కలగలిపిన మహోన్నత వ్యక్తి.. ఆయనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అందుకే చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా, అనంతపురం నుంచి అదిలాబాద్ వరకూ వైఎస్ఆర్ పేరు వినబడితే చాలు మనస్సు పులకిస్తుంది. నేడు మహానేత వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి కడప: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఎంతటి కష్టాన్నైనా భరించారు. ఎలాంటి పన్నులు విధించకుండా ఐదేళ్లు సంక్షేమ పాలన అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చిన నాయకుడాయన. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజానీకంతోపాటు ప్రపంచ తెలుగు పజలకు ఆప్తుడయ్యాడు. చెప్పిన మాట ఆచరించేందుకు రచ్చబండ నిర్వహణ కోసం బయలుదేరిన ఆయన 2009 సెప్టెంబరు 2న హెలికాఫ్టర్ దుర్ఘటనలో మృత్యువాతపడ్డారు. నేటికీ సరిగ్గా తొమ్మిదేళ్లు పూర్తయినా ప్రజల మదిలో మరుపురాని జ్ఞాపకంగా నిలిచిపోయారు. ఓటమి ఎరుగని ధీరుడు... దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఓటమి ఎరుగని ధీరుడుగా చరిత్రకెక్కాడు. వైఎస్ రాజారెడ్డి, జయమ్మ దంపతుల రెండవ కుమారుడైన ఆయన, విశ్వసనీయతే ప్రామాణికంగా రాజకీయాలు కొనసాగించారు. మాట ఇస్తే ఎంత కష్టమైన నెరవేర్చాలని తపించేవారని విమర్శకులు సైతం కొనియాడుతుంటారు. మెడిసిన్ పూర్తి కాగానే జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో వైద్యునిగా ఏడాది కాలం సేవలందించారు. ఆ తర్వాత పులివెందులలో తన తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరున 30 పడకల ఆస్పత్రిని నిర్మించి పేదలకు వైద్య సేవలు అందించారు. అతనికాలంలోనే పేదల డాక్టర్‌గా, రూ.2 వైద్యునిగా గుర్తింపు పొందారు. తండ్రి కోరిక మేరకు 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి జనతా పార్టీ అభ్యర్థి నారాయణరెడ్డిపై 20,496 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆనాటి నుంచి 2009 వరకు ప్రతీ ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నారు. ఓటమెరుగని ధీరుడిగా ఖ్యాతికెక్కారు. ప్రజాప్రస్థానంతో పెనుమార్పు... కరవు బారిన పడిన రాష్ట్ర ప్రజల దరికి చేరేందుకు సీఎల్పీ నేతగా 2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను పెంచారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం పదవి వైఎస్‌ను వరిం చింది. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉచిత విద్యుత్, పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలు రద్దుపై తొలి, మలి సంతకాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ ఒకటేమిటి, అన్ని వర్గాల ప్రజలకు అనువైన సంక్షేమ పథకాలను రూపొందించారు. వాటి అమలులో పార్టీలకతీతంగా అమలయ్యేలా చిత్తశుద్ధితో కృషి చేశారని ప్రత్యర్థులు సైతం కొనియాడారు. 2009 ఎన్నికల్లో విశ్వసనీయత పేరుతో బరిలో దిగి 156 అసెంబ్లీ స్థానాలను, 33 పార్లమెంటు స్థానాలను గెలిపించడం ఆయన పాలన తీరుకు అద్దం పట్టింది. జిల్లా అభివృద్ధిలో ప్రత్యేక ముద్ర వైఎస్ఆర్ అధికారంలోకి రాకముందు కడప జిల్లా పాలకుల నిర్లక్ష్యం నీడలో మగ్గుతుండేది. 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధిని జిల్లా నలుమూలల పరుగులు పెట్టించా రు. మునిసిపాలిటీగా ఉన్న కడపను కార్పొరేషన్‌గా, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా రూపొందించారు. జిల్లాలో వైవీ యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, పశువైద్య విద్య కళాశాలను నెలకొల్పా రు. జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్య కళాశాల, 750 పడకల రిమ్స్ ఆస్పత్రి, దంత వైద్యశాల నిర్మించారు. అలాగే ట్రిపుల్ ఐటీ, ఐజీ కార్ల్ పశు పరిశోధన కేంద్రంతో పాటు ఎన్నో పరిశ్రమలను నెలకొల్పారు. బ్రహ్మణీ స్టీల్స్ కర్మాగారంతోపాటు పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పరుగులు పెట్టించారు. ఎన్నికల సమయంలో మాత్రమే శంకుస్థాపనలు చేసే టీడీపీ నాయకులకు కనువిప్పు కలిగించారు. జలయజ్ఞంలో భాగంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు వందల కోట్లు ఖర్చు చేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్, టన్నెల్, గండికోట వరద కాల్వ, గండికోట ఎత్తిపోతల పథకాలను వైఎస్సార్ హయాంలో రూపొందిం చినవే. మైలవరం ఆధునికీకరణ, సర్వరాయసాగర్, వామి కొండ ప్రాజెక్టు, సీబీఆర్, పీబీసీ, పైడిపాళెం, వెలిగల్లు, తెలుగుగంగ ప్రాజెక్టు పనులు చకచకా సాగించారు. జిల్లాకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ జిల్లా వాసులు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యా రు. రక్తదానం, అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సమాయత్తమయ్యారు. కొనసాగుతున్న ‘చంద్ర’ గ్రహణం శరవేగంగా సాగిన జిల్లా అభివృద్ధి తుదిదశకు చేరే సమయంలో వైఎస్ఆర్ మరణంతో కుంటుబడింది. తొమ్మిదేళ్లు గడిచినా ఇంకా పెండింగ్ పథకాలుగా దర్శనమిస్తున్నాయి. సోమశిల వెను క జలాలను యోగి వేమన యూనివర్శిటీ, ఏపీఐఐసీ పార్కుకు ఇప్పించే యత్నాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. రూ. 430 కోట్లతో చేపట్టన ఆ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయా యి. రాజకీయ కారణాలతో బ్రహ్మణీ స్టీల్స్‌ను ఏకంగా రద్దు చేశారు. అంతర్జాతీయ పశు పరిశోధనలు కలగానే మిగిలాయి. జిల్లాకు చంద్రగ్రహణం ఆవహించి పట్టి పీడిస్తోంది. రాష్ట్ర విభజన నేప«థ్యంలో వైఎస్సార్ జిల్లాను పూర్తిగా విస్మరిస్తున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మౌళిక వసతులున్నప్పటికీ పారిశ్రామిక వృద్ధి సాధించకుండా జిల్లాపై వివక్షత చూపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఆప్యాయతకు రారాజు 'విలువలకు చక్రవర్తి'
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి... ఈ పేరు వినగానే కోట్లాది హృదయాలు ఆనందంతో పులకిస్తాయి. మల్లెపువ్వును మరిపించే చిరునవ్వు, ఆప్యాయతలు మదిమదిలో ముప్పిరిగొంటాయి. ఆ మహానేత మహాభినిష్క్రమణం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. అయినా ఆయన జ్ఞాపకాలు శాశ్వతం, సజీవం. ఇది ఆయన మిత్రులు, కోట్లాది అభిమానులు చెప్పే మాట. నేడు ఆదివారం డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కన్నడనాడు, బళ్లారితో ఆయనకు ఉన్న అనుబంధం, స్నేహితుల మనసులోని మాటలు తెలుసుకుందాం. సాక్షి, బళ్లారి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన అపారమైన ప్రజాకర్షక బలంతో, ప్రజా సంక్షేమ పథకాలతో రెండుసార్లు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులు ఎలా ఉన్నారో, కన్నడనాట కూడా ప్రజలపై వైఎస్సార్ చెరగని ముద్ర ఉంది. ముఖ్యంగా బళ్లారి జిల్లాతో వైఎస్సార్‌కు విడదీయలేనంత అనుబంధం ఉంది. ఆయన 7వ తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సీతో పాటు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే బళ్లారిలో ఆరు సంవత్సరాలు పాటు విద్యాభ్యాసం చేశారు. డిగ్రీ బళ్లారి నగరంలోని వీరశైవ కాలేజీలో చదువుతుండగానే గుల్బర్గా కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఎంబీబీఎస్ కూడా కర్ణాటకలో పూర్తి చేయడంతో ఆయన విద్యాభ్యాసం దాదాపు కర్ణాటకలోనే అధికభాగం కొనసాగింది. బాల్యం, కాలేజీ రోజులను ఎవరూ మరువలేరు, ఆ స్నేహితులను కూడా మరచిపోలేరు. మహానేత వైఎస్సార్ కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి మిత్రులను, చదివిన పాఠశాలను ఎప్పుడు నెమరవేసుకునేవారట. నూనూగుమీసాల వయసులోనే శాసనసభ్యునిగా గెలిచి స్వశక్తితో ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సంక్షేమ పథకాలు చేపట్టి, సంక్షేమ పథకాలు రథసారథిగా పేరు తెచ్చుకున్నారని బళ్లారిలోని ఆయన మిత్రులు నిరంతరం గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో బళ్లారిలోని వైఎస్సార్ క్లాస్‌మీట్స్, స్నేహితులు సాక్షితో తన అపురూప స్నేహాన్ని మననం చేసుకున్నారు. మంచికి నిదర్శనం వైఎస్సార్ ► మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మా స్నేహితుడు, క్లాస్‌మీట్ కావడమే తమ అదృష్టంగా భావిస్తున్నాం.ఆయన ఆరవ తరగతి నుంచి తాము కలిసి, మెలసి ఉండేవాళ్లం. బళ్లారి నగరంలోని ఆయన ఆరవ తరగతి చేరినప్పుడు నగరంలో సెయింట్‌జాన్స్ హాస్టల్లో ఉండేవారు. బళ్లారిలో వైఎస్సార్ తండ్రిగారు రాజారెడ్డి కాంట్రాక్టు పనులు నిర్వహించేవారు. రాజారెడ్డి వైఎస్సార్‌తో పాటు వైఎస్ తోబుట్టువులు వైఎస్ జార్జిరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, సోదరి విమలను కూడా బళ్లారిలోనే చదివించారు. ► బళ్లారిలో రాజారెడ్డి ఇల్లు తీసుకోకముందు సెయింట్‌జాన్స్ హాస్టల్స్‌లో చేర్పించారు. మేము, వైఎస్సార్‌తో పాటు హాస్టల్లో ఒకే గదిలో ఉంటూ తరగతిలో పక్కన, పక్కనే ఉంటూ చదువుకున్నాం. హాస్టల్లో 50 మంది విద్యార్థులు ఉండేవాళ్లం. వైఎస్సార్ అందరితోనే కలిసి, మెలసి ఉండేవారు. ప్రతి ఒక్కరిని పేరుతో పలకరిస్తూ, పెద్దవారిని అన్నా అంటూ మాట్లాడేవారు. ► పుస్తకాలు విషయం వస్తే ఆయన ఎంతో నీట్‌గా పెట్టుకునేవారు. ఒక్క కాగితం కూడా చినిగిపోకుండా చూసేవారు. తను ఏడాది పాటు చదివిన తర్వాత వాటిని జూనియర్స్‌కు ఇచ్చే మంచి మనసు ఆయనది. ఏడాది పుస్తకాలను చదివినా ఆ పుస్తకాలు ఈరోజువే అన్నంత కొత్తగా ఉండేవి. ► హాస్టల్లోకు అప్పట్లోనే ఆయన అన్నదమ్ములతో కలిసి జీపులో వచ్చేవారు. అప్పట్లో వాహనాలు చాలా తక్కువగా ఉంవడటంతో తమను కూడా జీపులో రమ్మని పిలిచేవారు. హాస్టల్లో రెండు సంవత్సరాలు ఉన్న తర్వాత వైఎస్సార్ తండ్రి పిల్లలు చదువుకోసం బళ్లారిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు.దీంతో హాస్టల్లో నుంచి ఇంటికి మారారు. సెయింట్‌జాన్స్ పాఠశాల దగ్గర్లోనే ఇల్లు తీయడంతో అక్కడ నుంచి కాలినడకన, లేదా జీపులో పాఠశాలకు చేరుకునేవారు. ► సెయింట్‌జాన్స్ పాఠశాలలో అప్పట్లో రాజశేఖరరెడ్డి అంత మృదుస్వభావి, మితభాషి, హుషారుగా ఉండేవారు. వైఎస్సార్ అంటే తరగతిలో అందరూ ఇష్టపడేవాళ్లం. ఎస్ఎస్ఎల్సీలో మంచి పార్కులతో పాసైనారు. బళ్లారి తరువాత విజయవాడ, గుల్బర్గాలలో విద్యాభాస్యం పూర్తి చేశారు. అనంతరం ఆయన చిన్ననాటి స్నేహితుడు , మా అందరికి మిత్రుడు దివంగత లెనార్డ్ గోంజాల్వేజ్ వైఎస్సార్‌ను కలిసి వస్తుండేవారు. ► వైఎస్సార్ రాజకీయాల్లోకి చేరిన తర్వాత అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకోగారు. మేం కలవడానికి వెళ్తే ఆయన మాట్లాడిన తీరు ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. 40 సంవత్సరాలు తర్వాత వైఎస్సార్‌ను కలిస్తే ఆయన ఒక్కసారిగా తమ వద్దకు వచ్చి పేర్లు పెట్టి ఫలానా అంటూ మాట్లాడంతో మాకు ఆనంద భాష్పాలు వచ్చాయి. క్యాంపు ఆఫీసులో మరచిపోలేని ఘటన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్‌ను హైదరా బాద్‌లో క్యాంప్ ఆఫీస్‌లో కలిసేందుకు వెళ్లాం. సార్ బిజీగా ఉ న్నారు. కలవడం ఇబ్బందిగా ఉంటుందని, అక్కడ ఉన్న పెద్ద పెద్ద వ్యక్తు లు మాతో చెప్పారు. అయితే ఎంతో కష్టంతో మా పేర్లను వైఎస్సార్ వద్దకు పంపించాం. ఐదు నిమిషాల్లోనే ఆయన మా వద్దకే గబగబా వచ్చి ఆప్యాయంగాపలకరించి ఆఫీసు లోపలకి తీసుకెళ్లడంతో మేమే కాదు, అక్కడున్న వారి ఆశ్చర్యానికి పట్టపగ్గాల్లేవు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో కూర్చొన్న తర్వాత ప్రతి ఒక్క క్లాస్‌మీట్ పేరు, పేరును గుర్తు చేసుకుంటూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. సీఎం అయిన తర్వాత ఎప్పుడు హైదరాబాద్ లేక ఆయన ఎక్కడ ఉన్న తాము అక్కడికి వెళ్లితే ముందుగా మాకు అపాయింట్మెంట్ ఇచ్చేవారు. స్నేహితులు అంటే ఆయనకు పంచప్రాణాలు.అపారమైన జ్ఞాపకశక్తి ఉండటంతోనే ప్రతి ఒక్కరిని పేరు పేరును పలకరించేవారు. స్కూల్లో స్నేహితులకు ఏ కష్టమెచ్చినా తనకు చెప్పాలనేవారన్నారు. సీఎం అయిన తర్వాత కూడా అవే మాటలు మాట్లాడడం చూసి మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. పువ్వుపుట్టగానే పరమళిస్తుందని విధంగా మహానేత వైఎస్సార్ చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు, పదిమందికి సేవచేసే గుణంగా, స్నేహానికి విలువ, నమ్మినవారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దపడే ధీరత్వం ఉండేవి. ఆయన మరణంతో మా కుటుంబంలో ఆత్మీయుణ్ని కోల్పోయామన్న ఆవేదన బాధిస్తోంది. ఆయన భౌతికంగా లేకపోయినా మా మదిలో నిలిచిపోయారని మిత్రులు పేర్కొన్నారు. కలిస్తే.. చిన్ననాటి జ్ఞాపకాలే వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు డిగ్రీలో పరిచయం అయ్యా రు. బళ్లారి వీరశైవ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే రోజుల్లో వైఎస్సార్ నాతో ఎంతో స్నేహం గా మెలిగేవారు. వారి ఇంటికి వెళ్లేవాళ్లం. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి కూడా మమ్మల్ని ఎంతో అప్యాయం గా పలకరించేవారు. హెచ్ఎల్సీ క్వార్టర్స్‌లో ఎప్పుడు కలుసునేవాళ్లం.డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఎంబీబీఎస్ చదవడానికి ఆయన గుల్బర్గాకు వెళ్లారు. సీఎం అయిన తర్వాత కలిస్తే చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. వైఎ స్సార్కు ఎంతో జ్ఞాపకశక్తి ఉండేది. అర్ధరాత్రి 1 గంట వరకు పుస్తక పఠనంలో మునిగిపోయేవారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్‌లో మంచి పట్టు ఆయన సొంతం. -
సంక్షేమానికి సర్వనామం వైఎస్సార్
సాక్షి, వరంగల్ రూరల్: ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు వైఎస్సార్.. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తపోదీక్షలా అహర్నిశలు శ్రమించిన రుషి ఆయన.. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన కృషీవలుడు ఆయన. పల్లె కన్నీరు తుడిచిన మనసున్న మారాజు రాజన్న.. ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు పెద్దపీట వేసిన పెద్దాయన పాలన రైతులకు నిజంగా స్వర్ణ యుగమే. రూపాయి చేతిలో లేకున్నా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని వెళ్తే పేదోడికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించారు. వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి.. లక్షలాది మంది రైతులకు చేయూతనందించారు.. ఓరుగల్లుతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 9వ వర్ధంతి నేడు. ఆయన దూరమై తొమ్మిదేళ్లవుతున్నా వరంగల్ ప్రజలు వైఎస్సార్‌ను ఇంకా గుర్తు చేసుకుంటున్నారు. ప్రేమ, ఆప్యాయతలకు నిలువెత్తు రూపంగా మారిన పెద్దాయన వర్ధంతిని పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపట్టడానికి వైఎస్సార్ అభిమానులు సన్నాహాలు చేసుకుంటున్నారు. మహానేత జిల్లాకు అందించిన సేవలపై ప్రత్యేక కథనం.. ఉచిత విద్యుత్.. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్‌పై చేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించి వారికి భరో సానిచ్చారు. అంతకుముందు విద్యుత్ బిల్లులు చెల్లించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. చంద్రబాబు హయాంలో కరెంట్ బిల్లులు చెల్లించలేదని రైతులను జైలుకు పంపిన సంఘటనలు సైతం ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించి అన్నదాతలకు అండగా ఉన్నారు. ఒకేసారి రూ.లక్షలోపు రు ణమాఫీ ద్వారా రైతుల హృదయాల్లో నిలిచారు. దేవాదుల.. ప్రజల ఆశీర్వాదంతో 2004 నుంచి 2009 వరకు దివంగత మహానేత ముఖ్యమంత్రిగా సుపరిపాలన సాగించారు. ఆయన పరిపాలన కాలంలో జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణంపై దృష్టి సారించారు. జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మొదటి దశలో రూ.844 కోట్లు, రెండో దశలో రూ.1,887 కోట్లు, మూడో దశలో రూ.5,410 కోట్లను కేటాయించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా 1,78,562 ఎకరాలకు సాగు నీరందిస్తున్నారు. మొదటి ఫేజ్‌లో 77,770 ఎకరాలకు, సెకండ్ ఫేజ్‌లో 1,00,762 ఎకరాలకు నీరందిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఎనిమిది జిల్లాల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. కేటీపీపీ.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చెల్పూర్లో కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంను జూన్ 1, 2006న మొదటి దశ 500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను రూ.3 వేల కోట్ల వ్యవయంతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఇందులో ఫిబ్రవరి 19, 2009న విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. అదేరోజు రెండోదశ 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. స్థానికంగా ఉత్పత్తి అయ్యే బొగ్గును ఇతర ప్రాంతాలకు తరలించకుండా అక్కడే విద్యుత్ తయారీ కేంద్రంను ఏర్పాటు చేయాలని ఆలోచనతో డాక్టర్ వైఎస్సార్ కేటీపీపీని నిర్మించారు. అది తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతోంది. రాజన్నలాంటి పాలనను ప్రజలు కోరుకుంటున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ము ఖ్యమంత్రి, పేదల పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజ శేఖర్రెడ్డిలాంటి పాలనను ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలు విస్తుపోతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, పావలావడ్డీ రుణాలు, ఆపద్బంధులాంటి అనేక సంక్షేమ పథకాలే నేటికి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. – సంగాల ఈర్మియా, వైఎస్సార్సీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే నా చదువు.. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదవిద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నాకు ఒక వరం. ఈ పథకంతో నేను ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. – జి.రణధీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, వరంగల్ ఆరోగ్యశ్రీతో గుండె ఆపరేషన్ అయింది మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నేను గుండె ఆపరేషన్ చేసుకున్నాను. కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేపించుకునే ఆర్థిక పరిస్థితి లేకుండె. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌కు రూ.1.70 లక్షలు మంజూరయ్యాయి. 2013లో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. –నర్మెట బుచ్చివీరు, కడిపికొండ నారుమడిలో దివంగత నేతకు పుష్పాంజలి ఘటిస్తున్న రైతన్నలు ఇందిరమ్మ ఇళ్లు.. ఇంటి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ఇందిరమ్మ పథకం పేరుతో గృహ నిర్మాణాలకు ఆర్థిక సాయం చేశారు. అలాగే బ్యాంక్ నుంచి కూడా రుణం వచ్చేలా కృషి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షలాది మంది గృహాలు నిర్మించుకున్నారు. వైఎస్సార్ మరణం తర్వాత వారి ఇళ్లలో వైఎస్సార్ చిత్ర పటాలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. -
హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటులో వైఎస్ఆర్ కృషి
-
తెలంగాణ ప్రజల గుండెల్లోనూ మహానేత వైఎస్ఆర్
-
గుండె గుడిలో రాజన్న
సంక్షేమ పథకాలతో జనం రాత మార్చిన విధాతా.. పేదలకూ ఉన్నత చదువులిచ్చిన విద్యాప్రదాతా.. జలయజ్ఞంతో కరువును తరిమిన భగీరథుడా.. అన్నదాతను ఆదుకున్న రైతుబాంధవుడా.. ఆడపడుచులకు ఆర్థిక భరోసా నిచ్చిన రాజన్నా.. అందుకే నీ పాలనలో జన్మ ధన్యమన్నా.. పాలకులు అనేకమంది ఉన్నా.. నీపై ప్రజల ప్రేమ ‘అనంత’మన్నా.. నువ్వు దూరమై తొమ్మిదేళ్లవుతున్నా.. ప్రతి గుండెలో నీ స్థానం పదిలమన్నా... దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో ‘అనంత’ది రెండో స్థానం. ఇక్కడ తాగునీళ్లు దొరకని పరిస్థితి. కరువు దెబ్బకు ఏటా రైతులు పంటలు నష్టపోయి ఆత్మహత్యలకు తెగించేవారు. ఈ కష్టాలన్నింటినీ చూసిన వైఎస్సార్.. తన హయాంలో తాగు, సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూనే జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. సాక్షి ప్రతినిధి. అనంతపురం: ‘అనంత’ తాగు, సాగునీటి కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్ అహరహం శ్రమించారు. తుంగభద్ర జలాల్లో ఏటా కేసీ కెనాల్‌కు అందే 10టీఎంసీ నీటిని రివర్స్ డైవర్షన్ పద్ధతిలో పీఏబీఆర్‌కు కేటాయిస్తూ 2005 ఆగస్టు 14న వైఎస్సార్ ఉత్తర్వులు జారీచేశారు. ఆ క్రమంలో తన సొంత జిల్లా రాజకీయ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టారు. వైఎస్సార్ తీసుకున్న నిర్ణయంతో ‘అనంత’ ప్రజల దాహార్తి శాశ్వతంగా తీరింది. ఈ నీటిపై ఆధారపడే హిందూపురం, మడకశిర, కల్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ నియోజకర్గాల ప్రజలకు శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా మంచినీరు అందుతోంది. అనంతపురం కార్పొరేషన్ దాహార్తిని తీర్చేందుకు రూ.67 కోట్లతో ముద్దలాపురం వద్ద అనంత తాగునీటి పథకాన్ని రూపొందించారు. దీంతో ‘అనంత’లో చాలా గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీరాయి. హంద్రీ–నీవాతో సాగునీటి పరిష్కారం కరవురక్కసిని తరిమికొట్టే లక్ష్యంతో వైఎస్సార్ రూ.6,850 కోట్లతో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. తొలిదశలో 1.98 లక్షలు.. రెండోదశలో రూ.4.04 లక్షలు...మొత్తంగా 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు... 310 గ్రామాల్లోని 33 లక్షల మందికి తాగునీరందించమే ఈ పథకం ఉద్దేశం. ఇందుకోసం వైఎస్సార్ రూ.4,054 కోట్లను ఖర్చుచేశారు. అందువల్లే 2012లోనే కృష్జాజలాలు జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరాయి. ఈ నీటితో అప్పటి ప్రజాప్రతినిధులు వైఎస్సార్ విగ్రహానికి జలాభిషేకం చేశారు. ఇప్పుడు ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ పూర్తి చేస్తే తక్షణమే జిల్లాలో ఆయకట్టుకు సాగునీళ్లు అందుతాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ చర్యలకు ఉపక్రమించలేదు. అలాగే హెచ్చెల్సీ కెనాల్ పూడిక వల్ల కేటాయింపుల మేరకు నీరు ఆయకట్టుకు అందడం లేదని హెచ్చెల్సీ ఆధునికీకరణకు నిధులు కేటాయించారు. దీన్ని కూడా పూర్తి చేయలేని పరిస్థితి. పారిశ్రామిక ప్రగతే లక్ష్యంగా వ్యవసాయరంగానికి దీటుగా పారిశ్రామికరంగాన్ని అభివృద్ధి చేస్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యం అవుతుందని రాజశేఖరరెడ్డి భావించారు. ఈ క్రమంలోనే రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టే ఒడిస్సీ సంస్థతో సైన్సు సిటీ స్థాపనకు ఒప్పందం చేసుకున్నారు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ను ఏర్పాటుచేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో సైన్సు సిటీ ఏర్పాటు ఒప్పందాన్ని ఒడిస్సీ సంస్థ రద్దుచేసుకుంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌లో బీడీఎల్(భారత్ దైనిక్స్ లిమిటెడ్), హెచ్ఏఎల్(హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్), ఈసీఐఎల్(ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), బీహెచ్ఈఎల్(భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) వంటి ప్రభుత్వరంగ సంస్థలతోపాటూ పలు బహుళజాతి సంస్థలు పరిశ్రమలను ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చాయి. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌లో పరిశ్రమలకు నీరు అందించేందుకు సోమశిల బ్యాక్‌వాటర్ నుంచి పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టారు. 25 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. అయితే తర్వాతి ప్రభుత్వాలు లేపాక్షి నాలెడ్జ్‌హబ్ భూముల ఒప్పందాలనే రద్దు చేశారు. పంటలబీమాతో రైతుకు దన్ను ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణంలో వేరుశనగ పంటను చేసే అనంత రైతన్నలు.. ఏటా నష్టాలు చవిచూస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు తెగిస్తున్నారు. దీన్ని గుర్తించిన వైఎస్సార్.. వేరుశనగ పండినా.. ఎండినా రైతులు నష్టపోకూడదనే లక్ష్యంతో 2008లో గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకాన్ని వర్తింపజేశారు. దీని వల్ల ఆ ఏడాది వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు రూ.600 కోట్ల పరిహారం దక్కింది. వైఎస్సార్ మరణానంతరం ఆ పథకానికి తూట్లు పొడిచారు. అయినా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిసి ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు జీఓ 420 విడుదల చేశారు. రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించి జారీ చేసిన జీఓ ఇది. అప్పులబాధ తాళలేక రైతు, చేనేత కుటుంబంలో జరిగిన ఎలాంటి ఆత్మహత్యనైనా రైతు, చేనేత ఆత్మహత్యగా గుర్తించాలని రూ.1.50 లక్షలు పరిహారం ఇవ్వాలని జీఓలో స్పష్టం చేశారు. ఇవే కాదు రైతుల శ్రేయస్సుతో పాటు ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, ఉచిత విద్యుత్...ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో శాశ్వత ముద్ర వేసిన వైఎస్సార్ భౌతికంగా దూరమై నేటికి తొమ్మిదేళ్లవుతోంది. అయినప్పటికీ అనంత గుండె గుడిలో మాత్రం ఆయన స్థానం పదిలంగానే ఉంది. -
నాన్న ఆశయ సాధనకు నా జీవితం అంకితం: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆ మహానేతను ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్మరించుకున్నారు. ‘వర్ధంతి సందర్భంగా నాన్నను గుర్తుచేసుకుంటున్నాను. నాన్న ఆశయాలే నాకు మార్గదర్శనం. ఆయన ఆశయ సాధన కోసం నా జీవితాన్ని అంకితమిస్తాను’అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా అంతకుముందు వైఎస్ జగన్ నివాళులర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నవరం శివారులోని పాదయాత్ర శిబిరం వద్ద ఆదివారం ఉదయం మహానేత విగ్రహానికి పూలమాల అర్పించి.. వైఎస్ జగన్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వెంట ఉన్న నేతలు, పార్టీ కార్యకర్తలు ‘జోహార్ వైఎస్సార్’ అంటూ నినాదాలు ఇచ్చారు. అనంతరం జననేత వైఎస్ జగన్ 252వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. Remembering nanna on his vardanthi. His ideals have been a guiding light and have carved a path for me, that I promise to dedicate my life to pursue. #YSRVardhanthi pic.twitter.com/RAuhjFjlmm — YS Jagan Mohan Reddy (@ysjagan) 2 September 2018 -
పారదర్శక పాలనకు వైఎస్ఆర్ నిలువెత్తు నిదర్శనం
-
ద లెజెండ్
-
జ్ఞాపకాల తడి
సాక్షి, కామారెడ్డి: మహానేత మనల్ని వదిలి తొమ్మిదేళ్లు గడిచాయి. కానీ ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ అందరి హృదయాల్లో పదిలంగా ఉన్నాయి. వైఎస్సార్ అన్న పేరు వినిపిస్తే చాలు ఆయన అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఒక్కసారిగా కళ్ల ముందు కదలాడుతాయి. ప్రతిపక్ష నేతగా జిల్లాలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను కళ్లారా చూసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపి అందరి హృదయాలను చూరగొన్నారు. అంతేకాదు ఈ ప్రాంత ప్రజల సాగునీటి కష్టాలను తీర్చేందుకు ప్రాణహిత–చేవెళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజు మొదలైన పనులు ఇప్పుడిప్పుడూ ఓ కొలిక్కి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో పనులు పూర్తయి రైతుల కష్టాలు తీరనున్నాయి. నేడు వైఎస్ వర్ధంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కామారెడ్డి జిల్లా అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది దుబాయ్ వలసలు, రైతుల ఆత్మహత్యలు. సాగునీటి కోసం బోర్లు తవ్వించి అప్పుల పాలై ఆత్మహత్యల బాట పట్టిన రైతుల కుటుంబాలను.. పాదయాత్ర సందర్భంగా పరామర్శించిన వైఎస్సార్ రైతు కుటుంబాలను చూసి చలించి పోయారు. ఆత్మహత్యలకు సాగునీటి సమస్యే కారణమని గుర్తించారు. ఆ కుటుంబాల కన్నీళ్లు తుడవాలంటే సాగునీరు అందించాలని ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సర్వేలు చేయించి ప్రాణహిత–చేవెళ్ల పథకానికి జీవం పోసిన ఆయన.. ఈ పథకానికి శంకుస్థాపన కూడా చేశారు. 22వ ప్యాకేజీలో కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ల తో పాటు మెదక్ జిల్లాలోని కొన్ని మండలాల్లో కలిపి 1.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు గాను రూ.1446 కోట్లు మంజూరు చేశారు. దీంతో అప్పట్లోనే భూంపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టారు. కాలువల తవ్వకం పనులు కూడా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రాజెక్టులను రీడిజైన్ పేరుతో పనులు ఆపేశారు. దీంతో కొన్నాళ్లపాటు పనులు ఆగిపోయాయి. అన్ని రకాల పరిశీలన అనంతరం 22వ ప్యాకేజీని అలాగే కొనసాగించాలని నిర్ణయించా రు. అదనంగా 44 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం భూంపల్లి రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయి. కాలువల తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. భూంపల్లి రిజర్వాయర్ ద్వారా రైట్ కెనాల్, లెఫ్ట్‌కెనాల్, రిడ్జ్ కెనాల్స్ ద్వారా ఆయా ప్రాంతాలకు సాగునీటిని అందిస్తారు. కామారెడ్డి ప్రజల దాహార్తి తీర్చిన భగీరథుడు గుక్కెడు తాగునీటికి అనేక కష్టాలు పడ్డ కామారెడ్డి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చిన అపర భగీరథుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ప్రజలు గుర్తుకు చేసుకుంటారు. కామారెడ్డి పట్టణంతో పాటు వందకు పైగా గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని వైఎస్ మంత్రివర్గం లో పని చేసిన ప్రస్తుత శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ కోరిన వెంటనే రూ.140 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని కామారెడ్డి ప్రాంతానికి అందించేందుకు పనులు చేపట్టారు. తరువాత మరో రూ.66 కోట్లు మంజూరు చేసి పనులు నిర్వహించారు. ఈ పథకం ద్వారానే ప్రస్తుతం కామారెడ్డి పట్టణంలో ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. గోదావరి నీరు ఇప్పుడు ప్రతీ ఇంటికి అందుతున్నాయి. అభివృద్ధిలో ప్రత్యేక ముద్ర.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా కామారెడ్డి జిల్లాకు పలుమార్లు వచ్చారు. కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల్లో పలుమార్లు పర్యటించారు. ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు అందించగానే పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధికి కృషి చేశారు. జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణకు భారీగా నిధులు మంజూరు చేశారు. సాగు నీటి రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అలాగే రోడ్ల అభివృద్దికి కృషి చేశారు. రాజన్నను మరువని జిల్లా ప్రజలు.. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఫించన్లు, 108 అంబులెన్సులు వంటి పథకాలను అందించిన దివంగత సీఎం వైఎస్సార్‌ను ప్రజలు మరిచిపోరు. వైఎస్సార్ అందించిన పథకాలను ఇప్పటికీ చాలా మంది నెమరువేసుకుంటున్నారు. అలాగే లబ్దిపొందిన ఎంతో మంది నిత్యం వైఎస్సార్‌ను తలచుకుంటారు. ప్రధానంగాయ ఆరోగ్యశ్రీతో ఆపరేషన్లు చేయించుకుని పునర్జన్మ పొందిన ఎంతో మంది వైఎస్సార్‌కు తమ గుండెలో గుడికట్టుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుతో తమ బిడ్డలు ఉన్నత చదువులు చదివారంటూ చాలా మంది తల్లిదండ్రులు వైఎస్సార్‌ను గుర్తు చేసుకుని ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. -
నువ్వున్నప్పుడే బాగుంది రాజన్నా..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ పేరు చెబితే చాలు.. అచ్చ తెలుగుకు ప్రతిరూపమైన పంచెకట్టు, చెరగని చిరునవ్వు, మడమ తిప్పని పోరాట పటిమ, పేదవాడి గుండె చప్పుడుకి నిలువెత్తు విగ్రహం అంటూ కొనియాడని తెలుగువారుండరు. పేదల సంక్షేమంలో చెరగని సంతకంలా నిలిచిపోయారంటూ నేటికీ ప్రతి ఒక్కరూ గుర్తు చేసు కుంటూనే ఉన్నారు. ఆయనది వర్ణించలేని సువర్ణ పాలన. సంక్షేమం, అన్ని రంగాల్లో అభివృద్ధి ఫలాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి సైతం అందాలని, ప్రతిఒక్కరు చిరునవ్వుతో జీవితం గడపాలని వైఎస్సార్ పరితపించే వారు. విశాఖను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఆయన సొంతం. ఆయన దూరమై.. తొమ్మిదేళ్లు గడిచినా.. అందించిన సంక్షేమంలోనూ.. చేసిన అభివృద్ధిలోనూ రాజన్నే.. కనిపిస్తున్నారు. విశాఖసిటీ : రాజన్న దూరమై నేటికి సరిగ్గా తొమ్మిదేళ్లు. రాష్ట్రానికి, విశాఖ జిల్లాకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటూ పరితపిస్తున్నారు. 2005లో గాజువాకతో పాటు 32 పంచాయతీలను కలిపి మొత్తం 72 వార్డులతో విశాఖకు గ్రేటర్ హోదా కల్పించి.. నగరానికి నూతన శకం ప్రారంభించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద విశాఖ నగరానికి రూ.2వేల కోట్లు తీసుకొచ్చి పేదలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు కృషి చేశారు. రూ.1500 కోట్లతో భూగర్భ డ్రైనేజీ చిన్న చినుకొస్తే విశాఖ నగరం పరువు బంగాళా ఖాతంలో కలిసిపోయేది. అలాంటి సమయంలో వైఎస్సార్.. రూ.1500 కోట్లతో భూగర్భ మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైఎస్సార్ హయాంలో నగరంలో కొన్ని ప్రాంతాలకు ఈ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మిగిలిన ప్రాంతాలకు ఈ ఫలాలు అందించడంలో పాలకులు విఫలమయ్యారు. తాజాగా.. కేంద్రం చేపట్టిన అమృత్ పథకంలో భాగంగా మిగిలిన ప్రాంతాలకు ఈ వ్యవస్థ ఏర్పాటవుతోంది. రాజన్న హయాంలో రూ.456కోట్లతో ప్రారంభమైన బీఆర్టీఎస్ పనులు.. అప్పట్లో 70 శాతం వరకూ పూర్తయ్యాయి. ఆయన మరణం తర్వాత.. పనులు మందగించి ఇప్పటికీ పూర్తి చెయ్యలేదు. దాహార్తి తీర్చేందుకు..: నగరంలో 15వేల మంది పేదలకు గూడు కల్పించేందుకు రూ.450 కోట్లు, ఎండాడ ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.23 కోట్లు.. విశాఖ నగర దాహార్తిని తీర్చేందుకు తాటిపూడి నుంచి నగరానికి రూ.95కోట్లతో పైపులైన్ ఏర్పాటు చేశారు. విశాఖ ఉక్కు విస్తరణ, అచ్యుతాపురంలో ఇండస్ట్రియల్ కారిడార్, భీమిలో ఐటీ కారిడార్, పరవాడలో ఫార్మస్యూటికల్ కారిడార్, దువ్వాడలో ఐటీ సెజ్లతో విశాఖ దశాదిశను మార్చేశావు. మధురవాడ, రుషికొండ ఐటీ సెజ్‌ల ఏర్పాటుతో విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దావ్, 1130 పడకలు, 21 సూపర్ సెషాలటీ బ్లాకులతో రూ.250కోట్లతో విమ్స్ ఆస్పత్రిని నిర్మించారు. ఆసీల్మెట్ట నుంచి రైల్వేస్టేషన్ వరకు రూ.87కోట్లతో నగరంలో తొలి ఫ్లైఓవర్ నిర్మించారు. ఐటీలో ప్రగతి పరుగులు విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధికి బాటలు వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సారే అన్నది ప్రతి ఒక్క ఐటీ ఉద్యోగి మననం చేసుకుంటున్నారు. సీఎం అయిన తొలి నాళ్లలోనే యుద్ధ ప్రాతిపదికన సత్యం కంప్యూటర్స్, విప్రో వంటి దిగ్గజ సంస్థల్ని నగరం నడిబొడ్డున పది ఎకరాలు చొప్పున కేటాయించి 1500 ఉద్యోగాలతో ప్రారంభించిన ఘనత రాజన్నదే. విశాఖపై ప్రత్యేక దృష్టి సారించి 300 ఎకరాల్లో ఐటీ పార్కుని రుషికొండలో సెజ్ ఏర్పాటు చేసి ఇన్ఫోటెక్, మిరాకిల్, కెనెక్సా, ఐల్యాబ్స్, మహతి మొదలైన చాలా కంపెనీలు వైఎస్ హయాంలోనే ప్రారంభమయ్యాయి. వైఎస్ పాలన ముందు.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం నుంచి కేవలం రూ.4 కోట్ల ఐటీ ఎగుమతులు మాత్రమే జరగగా.. వైఎస్సార్ హయాంలో తొలి ఏడాదిలోనే రూ.500 కోట్లకు పైగా ఎగుమతులు చేపట్టి రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ హోదా నీ ఘనతే.. హైదరాబాద్‌కే పరిమితమైన అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీసులను విశాఖ ప్రజలకూ పరిచయం చెయ్యాలని వైఎస్సార్ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా రూ.100 కోట్లు వెచ్చించి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా తీసుకొచ్చారు. జలయజ్ఞం ద్వారా అపర భగీరథుడై.. విశాఖ సాగు, తాగునీటి కష్టాలు తీర్చేందుకు ఎన్నో పథకాలు అమలు చేశారు. రైవాడ, కోనాం,పెద్దేరు కళ్యాణలోవ రిజర్వాయర్లను రూ.42కోట్లతో ఆధునికీకరణ పనులు పూర్తి చేసి కృషీవలుడి కళ్లల్లో ఆనందం నింపారు. రూ.55కోట్లతో తాండవ రిజర్వాయర్ ఆధునికీకరించడమే కాదు.. తాండవ నదిపై మినీ ఆనకట్ట నిర్మాణానికి, రావణాపల్లి ప్రాజెక్టుకు రూ.18కోట్లతో జిల్లాలోని 50వేల ఆయకట్టును స్థిరీకరించి సాగునీటికి ఢోకా లేకుండా చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని అత్యంత ప్రధాన ప్రాజెక్టుల జాబితాలో చేర్చారు. మరో మానస పుత్రికైన ఇందిరమ్మ గృహ నిర్మాణం ద్వారా జిల్లాలో 3.56 లక్షల ఇళ్లు నిర్మించారు. 3.20 లక్షల మందికి పింఛన్లు అందించారు. 25వేల మంది రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. మన్యంలో పోడు భూములకు పట్టాలిచ్చి వారి పాలిట దైవంలా మారారు. ఇలా.. నగరం నలుచెరగులా.. జిల్లాలో అణువణువునా.. ఆయన మార్కు సంక్షేమమే కనిపిస్తోంది. -
చీకటి చీల్చి.. వెలుగు పంచి
మంచి చేసిన నాయకులను జనం ఎప్పటికీ మరిచిపోరు. ప్రజాసంక్షేమం కోసం దేనికీ రాజీపడని నేతలను ప్రజలు గుండెల్లో ఉంచుకుంటారు.ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత మహానేత ముఖ్యమంత్రి వైఎస్‌ను జనం గుండెల్లో దాచుకున్నారు. అంతటి మహానుభావుడి అకాల మరణం తట్టుకోలేక అతని వెంటే తనువు చాలించిన ఆత్మబంధువుల కుటుంబీకులను ఓదార్చేందుకు రాజన్న ముద్దుబిడ్డ ప్రజల ఆశాజ్యోతి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేనున్నానంటూ అప్పటిలో భరోసా కల్పించి ఆర్థికంగా అండగా నిలిచారు. అలా సాయం పొందిన వారంతా వైఎస్ కుటుంబం చల్లగా ఉండాలని, విజయమ్మ తనయుడు ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఓదార్పు మరువలేనిది మునగపాక: ఓదార్పుయాత్రలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అందించిన సాయం మరువలేనిదని మునగపాక మండలం నాగవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి నరసింగరావు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వైఎస్ మరణవార్త వినిన నరసింగరావు టీవీ చూస్తూ తొమ్మిదేళ్లక్రితం కుప్పకూలిపోయాడు. ఓదార్పు యాత్రలో భాగంగా 2010లో జగన్మోహన్రెడ్డి నాగవరం విచ్చేసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పిల్లల చదువుతోపాటు కుటుంబాన్ని ఆదుకుంటామని అప్పటిలో భరోసా తోపాటు ఆర్థికసాయం అందించారు. నేటికీ జగనన్న అందించిన తోడ్పాటును కుటుంబ సభ్యులు మరువలేకున్నారు. మహానేత బతికి ఉంటే ఎన్నో కుటుంబాలకు మేలు జరిగేదని అయితే జగనన్న సీఎం కావాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం నరసింగరావు కుమారుడు వెంకటప్పారావుపైనే కుటుంబం ఆధారపడి ఉంది. వెంకటప్పారావు సమీపంలోని అచ్యుతాపురం బ్రాండెక్స్లో ఉద్యోగం చేసుకుంటూ తద్వారా వచ్చే ఆదాయంపై కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. జగన్‌బాబు మనసున్న మారాజు ఎస్.రాయవరం: మహానేత వైఎస్ మరణం తట్టుకోలేక ఎస్.రాయవరం మండలం వాకపాడు గ్రామానికి చెందిన తారుతూరు అప్పారావు మృతి చెందాడు. ఓదార్పు యాత్రలో భాగంగా జగన్‌బాబు పరామర్శించి, అందించిన ఆర్థిక తోడ్పా టు మరువలేనదని అప్పారావు భార్య తారుతూరు సూర్యకాంత తెలిపింది. నా కు నలుగురు సంతానం. భర్త మృతితో వారికి భారం అయ్యానని బాధపడుతున్న తరుణంలో జగన్‌బాబు ధైర్యం చెప్పా రు. ఆయన అందించిన సాయం కుటుంబానికి చేయూతనిచ్చింది. ఆయన మనసున్న మారాజు అని సూర్యకాంత తెలిపింది. సాయం, భరోసా మరువలేనిది ఎస్.రాయవరం: ఇంటి పెద్దదిక్కుకోల్పోయిన సమయంలో జగనన్న ఇచ్చిన భరోసా, ఆర్థిక తోడ్పాటు ధైర్యాన్ని ఇచ్చిందని వెంకటాపురం గ్రామానికి చెందిన వెదుళ్ల రవికుమార్ భార్య వెంకటలక్ష్మి తెలిపింది. వైఎస్ మరణ వార్తను తట్టుకోలేక మనస్తాపంతో రవికుమార్ మృతిచెందాడు. ఓదార్పు యాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. భరోసాతోపాటు ఆర్థిక తోడ్పాటు అందిచడంతో సమస్యలు అధిగమించగలిగామని ఆమె పేర్కొంది. కుమారుడు ఆటో కొనుక్కొని ఉపాధి పొందుతున్నాడు. నాకుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని అప్పటిలో జగన్‌బాబు చెప్పారు. సంకల్పయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన ఆయనను కలిసేందుకు అవకాశం లేకపోయింది. అయినప్పటికీ ఆయన అందించిన సాయం, భరోసా ఎన్నటికీ మరిచిపోం. ఆయన వెంటే ఉంటాం. తోడ్పాటు మరువలేనిది అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన ఆడారి రాజేశ్వరి మహానేత రాజన్న మరణం తట్టుకోలేక తొమ్మిదేళ్ల క్రితం చనిపోయింది. జగ్గన్నపేట గ్రామానికి చెందిన ఆడారి సూర్యనారాయణ, నాగభూషణానికి ముగ్గురు కుమార్తెలు, సూర్యనారాయణ గతంలో సర్పంచ్‌గానూ, పాలసంఘ అధ్యక్షునిగానూ పనిచేశారు. అయితే 15సంవత్సరాల క్రితం సూర్యనారాయణ చనిపోయారు. ఆయన బతికున్న సమయంలో ఇద్దరు ఆడపిల్లలకు వివాహం చేశారు. చిన్నకుమార్తె రాజేశ్వరికి కాంగ్రెస్ పార్టీ అంతే ఎనలేని అభిమానం. అంతకన్నా దివంగత నేత రాజన్న అంటే ప్రాణం. 2009లో రాజన్న మృతి వార్త తెలుసుకున్న రాజేశ్వరి గుండెపోటుకు గురై మృతిచెందింది. 2010లో జగన్మోహన్రెడ్డి ఓదార్పుయాత్రలో భాగంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాజేశ్వరి కుటుంబానికి అండగా ఉంటానంటూ జగనన్న హామీ ఇచ్చారు. ఆయన అప్పటిలో అందించిన ఆర్థిక తోడ్పాటు ఇప్పటికీ మరువలేకపోతున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. జగనన్నతోనే బడుగులకు న్యాయం మాడుగుల: మండలంలోని కింతలి వల్లాపురం గ్రామానికి చెందిన మల్లవరపు కొండబాబు దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి అభిమాని. పాదయాత్రలో భాగంగా ఆయన వైఎస్ జిల్లాకు వచ్చినప్పుడు ఆయనతోపాటు జిల్లా దాటే వరకు నడిచాడు. 2009లో వైఎస్ మరణవార్త వినిన అతను మనస్తాపానికి గురై మృతి చెందాడు. పోషించే దిక్కులేకపోవడంతో అతని కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. ఓదార్పుయాత్రలో భాగంగా అప్పటిలో జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన అందించిన ఆర్థికసాయం కొన్నాళ్లపాటు కుటుంబ పోషణకు ఉపయోగపడిందని కొండబాబు భార్య మల్లవరపు చిన్నారి తెలిపింది. జగనన్న చెప్పిన ధైర్యంతోనే కూలీనాలిచేసి కుటుంబాన్ని నెట్టికొస్తున్నానని ఆమె వివరించింది. శ్లాబ్ వేసుకున్న ఇంటికి డబ్బుల్లేక మిగతా పనులు చేపట్టలేదు. కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు కార్పొరేషన్ రుణానికి 2015లో దరఖాస్తు చేసినా ప్రయోజనం లేకపోయింది. జగనన్న సీఎం అయితేనే మాలాంటి బడుగు జీవులకు న్యాయం జరుగుతుందని చిన్నారి ఆశిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డా పాయకరావుపేట: రాజన్న తనయుడు అందించిన భరోసా ఆర్థిక తోడ్పాటు వల్ ల మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడిందని సత్యవరం గ్రామానికి చెందిన నారాయణ లక్ష్మి పేర్కొంది. ఈమె భర్త ఎగదాసు ఉమామహేశ్వరరావు వైఎస్ అభిమాని. ఆయన మరణంతో మనస్తాపానికి గురయ్యారు. వైఎస్ ప్రథమ వర్థంతినాడు గ్రామంలో ఆయన చిత్రపటం వద్ద కొబ్బరికాయ కొడుతూ కుప్పకూలిపోయాడు. యజమాని కోల్పోవడంతో కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. ఓదార్పుయాత్రలో భాగంగా జగన్మోహన్రెడ్డి సత్యవరం వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. భరోసా ఇవ్వడమే కాకుండా, అందించిన ఆర్థిక సాయం వల్ల ఇబ్బందులు తొలగిపోయాయని నారాయణ లక్ష్మి తెలిపింది. పేదల సమస్యలు గుర్తించేది రాజన్న తనయుడు జగనన్న మాత్రమేనని, ఆయనతో ప్రజాసంక్షేమం సాధ్యమని ఆమె పేర్కొంది. ఆర్థిక తోడ్పాటు ధైర్యాన్నిచ్చింది ఎస్.రాయవరం: చిన్నపిల్లలలో కూలి చేసుకుని జీవించే సమయంలో మా అభిమాని నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆకాల మరనాన్ని నా భర్త తట్టుకోలేక పోయారు. టీవీ చూస్తూ తుది శ్వాస విడిచారు.ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలియక ఆలస్యంగా నాయకులకు సమాచారం ఇచ్చాను. అయితే నీ భర్త పేరు చనిపోయిన వెంటనే చెప్పలేదని కారణం చూపుతూ నాయకులు చేతులెత్తేశారు. నాభర్త శ్వాస ఎలా పోయినదని మాగ్రామం మీదుగా వెళ్తున్న జగన్‌బాబుకు చెప్పుకున్నా. ఆయన ఓదార్పు, ఆర్థికసాయం నా కుటుంబాన్నే మార్చేసిందని మండలంలోని జంగులూరు గ్రామానికి చెందిన మర్తుర్తి సత్యవతి తెలిపింది. భర్త మృతి చెందేసరికి 12 ఏళ్ల బాబు, పదేళ్ల పాప ఉన్నారు. పెంకుటిల్లు మాత్రమే ఉంది. కూలి పనిచేయడం కూడా రాదు. ఈ సమయంలో అందించిన ఆర్థికసాయం నాలో ధైర్యం నింపింది. పాపను టెన్త్, కొడుకును ఐటీఐ చదివించాం. కుమార్తెకు వివాహం చేశా. జగన్‌బాబు తోడ్పాటు అందించకుంటే ఇలా ఉండేవాళ్లం కాదు. సాయం, భరోసా మరువలేనిది ఎస్.రాయవరం: ఇంటి పెద్దదిక్కుకోల్పోయిన సమయంలో జగనన్న ఇచ్చిన భరోసా, ఆర్థిక తోడ్పాటు ధైర్యాన్ని ఇచ్చిందని వెంకటాపురం గ్రామానికి చెందిన వెదుళ్ల రవికుమార్ భార్య వెంకటలక్ష్మి తెలిపింది. వైఎస్ మరణ వార్తను తట్టుకోలేక మనస్తాపంతో రవికుమార్ మృతిచెందాడు. ఓదార్పు యాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. భరోసాతోపాటు ఆర్థిక తోడ్పాటు అందిచడంతో సమస్యలు అధిగమించగలిగామని ఆమె పేర్కొంది. కుమారుడు ఆటో కొనుక్కొని ఉపాధి పొందుతున్నాడు. నాకుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని అప్పటిలో జగన్‌బాబు చెప్పారు. సంకల్పయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చిన ఆయనను కలిసేందుకు అవకాశం లేకపోయింది. అయినప్పటికీ ఆయన అందించిన సాయం, భరోసా ఎన్నటికీ మరిచిపోం. ఆయన వెంటే ఉంటాం. వైఎస్ ఆశయ సాధన జగన్‌తోనే సాధ్యం భీమునిపట్నం: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు, ఆయన ప్రజలకు చేసిన మేలు తిరిగి ప్రజలందరికి జరగాలంటే ఆయన తనయుడు ప్రతిపక్షనేత వైఎస్. జగన్హన్రెడ్డితోనే సాధ్యమవుతుందని జగన్‌ద్వారా ఓదార్పు పొందిన కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. వైఎస్ హఠాత్తుగా మరణించడాన్ని ఇక్కడ పెద్ద బజారు ప్రాంతానికి చెందిన పలుపులేటి వెంకటరమణ జీర్ణించుకోలేక చనిపోయారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా విషయంల తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్రలో భాగంగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. తోడ్పాటు అందించారు. ప్రస్తుతం వెంకటరమణ కొడుకులు ముగ్గురు ఉద్యోగాలు చేసుకుంటూ భీమిలిలో ఉంటున్నారు. వీరివద్దనే తల్లి పార్వతమ్మఉంటోంది, ఇద్దరు కుమార్తెలు విశాఖలో ఉన్నారు. జనం గుండెల్లో వైఎస్ పదిలం వైఎస్ రాజశేఖరెడ్డి ఎవరు ఊహించని విధంగా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల గుండెల్లో దేవుడిలా ఉండిపోయారు. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజల కోసం చేపట్టాలనుకునే సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉన్నాయి. ఆయన సీఎం అయితే ప్రజలకు మేలు జరుగుతుంది. – పలుపులేటి పార్వతమ్మ, వెంకటరమణ భార్య ఆత్మవిశ్వాసం నింపిన జగనన్న సబ్బవరం: మా తండ్రి దొడ్డి కోటేశ్వరరావు వైఎస్ అభిమాని. ఆయన అకాల మరణం తట్టుకోలేక చనిపోయారు. నాకు తమ్ముడు నాగ అప్పారావు, చెల్లి లక్ష్మి ఉన్నారు. చిన్నతనంలోనే అమ్మ చనిపోవడంతో మమ్మల్ని నాన్న అల్లారుముద్దుగా చూసుకునేవారు. ఆయన చనిపోవడంతో కుటుంబభారం నాపై పడింది. జగనన్న ఓదార్పుయాత్రలో భాగంగా మా కుటుంబాన్ని పరామర్శించారు. ధైర్యం చెప్పి, ఆర్థికసాయం అందజేశారు. మాలో ఆత్మవిశ్వాసం నింపారు. గ్రామంలో మాకున్న రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని బంగారమ్మపాలేనికి చెందిన దొడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించే సత్తా ఆయనకు మాత్రమే ఉందన్నారు. -
శోకం నడిచిన దారి
-
మహానేత జ్ఞాపకాలు పదిలం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అభివృద్ధి పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలు.. పేదవాడికి మెరుగైన ఆరోగ్యం.. పేదింటి బిడ్డకు ఉన్నత చదవులు.. తడారిన గొంతులకు తాగునీరు.. బీడువారిన పొలాలకు సాగునీరు.. ఇలా.. ఒక్కటేమిటి సీఎంగా తన హయాంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ఆదివారం ఆ మహానేత 9వ వర్ధంతి సందర్భంగా జిల్లా ప్రజలు ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. దశాబ్దాలపాటు మూలకు పడిన ఫైలు దుమ్ముదులిపి రూ.2153 కోట్లతో శ్రీశైలం సొరంగ మార్గం పనులు పరుగులు పెట్టించారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తికాగా చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తయితే నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని ఫ్లోరిన్ పీడిత ప్రాంతాలకు తాగునీటితో పాటు అప్పుడు నిర్దేశించిన ఆయకట్టు లక్ష్యం 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. బ్రాహ్మణ Ðð వెల్లెంల ప్రాజెక్టును అడగ్గానే రూ.700 కోట్లతో మొదలు పెట్టారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల పనులకు 2007 సెప్టెంబర్ 4న వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. ఆయన చేతుల మీదుగా పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు గత ప్రభుత్వాల హయాంలో నత్తనడకన సాగాయి. లక్ష ఎకరాలకు సాగునీరు అందే ఈ ప్రాజెక్టు నేడు పూర్తికావొచ్చింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన 463 కోట్ల రూపాయలతో టెయిల్‌పాండ్ నిర్మించడానికి నిధులు మంజూరు చేశారు. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణ చేపట్టడానికి 4444 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు మొదలు పెట్టిం చారు. నల్లగొండ పట్టణంలో రూ.200 కోట్లతో సీసీ రోడ్లు మంజూరు చేశారు. నల్లగొండలో రూ.20 కోట్లతో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మంజూరు చేశారు. ఉమ్మడి ఏపీలో, ప్రస్తుతం తెలంగాణలో ఏ జిల్లాలో లేని విధంగా రూ.300 కోట్లతో మహాత్మాగాంధీ యూనివర్సిటీ కట్టించిన ఘనత ఆ మహా నాయకుడిదేనని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. బీబీనగర్ దగ్గర రూ.200 కోట్లతో నిమ్స్‌ను ఏర్పాటు చేసి బిల్డింగులు కట్టించారు. ఏఎమ్మార్పీకి కింద 1.40 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరందించేందుకుగాను రూ. 450 కోట్లతో డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టడంతో 80శాతం ఆయకట్టు ఏఎమ్మార్పీ పరిధిలోకి వచ్చింది. 2007లో డిండి ఎత్తిపోతల పథకానికి పరిపాలనా అనుమతులు ఇచ్చి సర్వే పనులు చేయడం వల్లే పాత ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకుని నేడు ప్రాజెక్టును చేపట్టడానికి అవకాశం లభించింది. 2008 సెప్టెంబర్‌లో దేవరకొండలో జరిగిన సభలో డిండి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూ రు చేస్తామని వైఎస్సార్ ప్రకటించారు. తీరిన దాహం గ్రామీణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పెద్దవూర, అనుముల, పీఏపల్లి మండలాలకు చెందిన 77 గ్రామాలకు ఫ్లోరిన్ రహిత శుద్ధ జలాలు అందించేందుకు 2005 జనవరిలో రూ.21.75 కోట్ల నిధులతో పెద్దవూర మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ పథకంతో పెద్దవూర మండలంలోని 46 గ్రామాలకు, అనుముల మండలంలోని 23, పెద్దఅడిశర్లపల్లి మండలంలోని 8 గ్రామాలకు శుద్ధి చేసిన కృష్ణా జలాలు ప్రస్తుతం అందుతున్నాయి. ఆలేరు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు రక్షిత తాగునీటిని అందించేందుకు ఆయన కృషి చేశారు. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు కృష్ణా జలాలు అందించేందుకు ఏ ముఖ్యమంత్రీ చేయని కృషి ఆయన చేశారు. అదే స్థాయిలో నిధులు కూడా మంజూరు చేశారు. ప్రస్తుతం మెజారిటీ గ్రామాలకు అందుతున్న కృష్ణా జలాలు వైఎస్ హయాంలో పూర్తయినవే కావడం గమనార్హం. -
వైఎస్సార్‌కు జననేత శ్రద్ధాంజలి
సాక్షి, విశాఖ పట్నం : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘననివాళులు అర్పించారు. వైఎస్సార్ తొమ్మిదో వర్ధంతిసందర్భంగా మహానేత విగ్రహానికి పూలమాల అర్పించి.. శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నవరం శివారులోని పాదయాత్ర శిబిరం వద్ద ఆదివారం ఉదయం వైఎస్ జగన్ ఈ మేరకు మహానేతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వెంట ఉన్న నేతలు, పార్టీ కార్యకర్తలు ‘జోహార్ వైఎస్సార్’ అంటూ నినాదాలు ఇచ్చారు. వైఎస్సార్‌కు నివాళులర్పించిన అనంతరం జననేత252వ రోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అన్నవరం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి చోడవరం నియోజకవర్గం రేవళ్లు, ఖండేపల్లి క్రాస్, లక్కవరం క్రాస్, గవరవరం,జి.జగన్నాథపురం మీదుగా మడుగుల నియోజక వర్గం వేచలం క్రాస్, ములకలపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. వైఎస్ జగన్‌ను కలిసి 108 ఉద్యోగులు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను 108 ఉద్యోలు కలిశారు. తమ సమస్యలను వివరించి ఆదుకోవాలని విన్నవించుకున్నారు. వారిని నేనున్నా అని భరోస ఇస్తూ అధికారంలోకి రాగానే ఆదుకుంటానని హమీ ఇచ్చారు. అలాగే జననేత వైఎస్ జగన్‌ను చోడవరం వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుగ్గిరాల రవికుమార్, సాక్షారభారత్ ప్రతినిధులు తమ సమస్యలు చెప్పుకుంటూ ఆదుకోవాలని వినతిపత్రాలు అందజేశారు. వారందరికి భరోసానిస్తూ జననేత జగన్ పాదయాత్రలో అడుగులు ముందు వేస్తున్నారు. -
రాజన్నా మళ్లీ రా అన్నా
ఎక్కడ ఏ ప్రమాదం చోటుచేసుకున్నా నేనున్నానంటూ ఆపద్బాంధవునిలా కుయ్,కుయ్ రాగాలు తీస్తూ పరుగులు తీసే 108 ఏదన్నా! పదివేల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ నిధులతో ఊపిరి పోసుకున్న నాలుగు లక్షల మంది ప్రాధేయపడుతున్నారు రాజన్నా మళ్లీ రా అన్నా అని... మెట్ట ప్రాంతంలో నలభై వేల కనెక్షన్లతో రూ. 21 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చి ప్రజా ప్రస్థానంలో ఇచ్చిన మాటకు తొలి సంతకంతోనే వెలుగులిచ్చిన రాజన్నా మళ్లీ రా అన్నా... ప్రతి ఏటా వచ్చే వరదలకు అడ్డుకట్టేసి రూ.600 కోట్లతో ఏటిగట్లను పటిష్టం చేసి 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా మీకేమీ భయం లేదంటూ ధైర్యాన్నిచ్చిన రైతుబిడ్డా రావయ్యా మళ్లీ... కాటన్ మహాశయుడి ఆశయం నీది అందుకే వేశావు ప్రాజెక్టులకు పునాది పైరుకు ప్రాణంపోసే బాధ్యత నాదంటూ జిల్లా అంతటా జలసిరికి శ్రీకారం చుట్టిన జలదాతా ... నీదేనయ్యా ఆ కీర్తి ఆ ఆశయాల బాటలో జగనన్న సంకల్పం ఆ అడుగులో అడుగేస్తోంది జన ప్రవాహం కుట్రదారుల గుండెల్లో భయ ప్రకంపం రానున్న కాలంలో రానున్నది రాజన్న రాజ్యం అందుకు కావాలి నీ ఆశీర్వాదం. రాజన్న రాజ్యం కచ్చితంగా సంక్షేమ రాజ్యమే. రాష్ట్రం అభివృద్ధి సూచీని వైఎస్ ముందు వైఎస్ తరువాత అని చెప్పేంతగా సాగింది ఆ మహానేత పాలన. ప్రత్యేకించి జిల్లాకు ఆయన అభయ ప్రదాతగా.. అపర భగీరథుడిగా.. మరో కాటన్ మహాశయుడిగా ఖ్యాతి గడించారు. రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో అప్పటి వరకూ ఉన్న రైతు సమస్యల పరిష్కారానికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కాలువల ఆధునికీకరణ, గ్రోయిన్లు, కరకట్టల నిర్మాణం, కాలువ గట్ల పటిష్టానికి ఎంతో కృషి చేశారు. పంట పండినా పండకపోయినా ముక్కు పిండి బిల్లులు వసూలు చేసే విద్యుత్ అధికారులకు చెక్ పెడుతూ ఉచిత విద్యుత్ అందజేశారు. కోట్లాది రూపాయలు నష్టం వచ్చినా సరే వెనకడుగు వేయలేదు. అలాగే చిన్న వారికి పెద్ద జబ్బులు వచ్చిన సందర్భాల్లో ప్రాణాలపై ఆశలు వదులుకునే పరిస్థితి నుంచి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పునర్జన్మ ప్రసాదించారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. నేడు ఆ మహానేత తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆ శ్రేయోరాజ్యాన్ని స్మరించుకునే చిరు యత్నం. అమలాపురం: గోదావరి డెల్టా.. రాష్ట్రానికి అక్షయపాత్ర. ఉభయ గోదావరి జిల్లాలకు రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పేరొచ్చిందంటే అందుకు గోదావరి డెల్టానే కారణం. ఈ జిల్లాల్లో ఏకంగా 10.30 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు జరుగుతోంది. దీనిలో 8.96 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుంది. సర్ ఆర్థర్ కాటన్ హయాంలో పురుడుపోసుకున్న డెల్టా తరువాత కాలంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అనంతరం చాలా కాలానికి డెల్టాతో పాటు జిల్లాలో కీలకమైన ఏలేరు, తాండవ, పంపా ప్రాజెక్టుల ఆధుకీకరణకు, ఏజెన్సీ రైతులకు మేలు చేసే భూపతిపాలెం, ముసురుమిల్లికి శంకుస్థాపన చేసింది కూడా వైఎస్సారే. రాష్ట్రానికి జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టుకు సైతం పునాది వేసింది వైఎస్సార్. ఆయన మృతి చెంది తొమ్మిదేళ్లు కావస్తున్నా.. జలయజ్ఞం పేరుతో ఆయన చేసిన పనులను ప్రతీ రైతు నేటికీ గుర్తుంచుకుంటూనే ఉన్నారు. ధవళేశ్వరంలో సర్ ఆర్థర్ కాటన్హయాంలో డెల్టా వ్యవస్థ రూపొందిన తరువాత పెద్ద ఎత్తున ఆధునికీకరణకు నిధులు కేటాయించింది వైఎస్సార్ ఒక్కరే. ఆ మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి 2008లో ఆధునీకరణ పనులకు ఆమోదముద్ర వేశారు. డెల్టా కాలువల ఆధునికీకరణ పెద్ద ఎత్తున సాగడం అనేది వైఎస్సార్ హయాంలో మాత్రమే జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న కాలువ ఆధునికీకరణకు ఆయన రూ.3,361 కోట్లు కేటాయించారు. ఇందుకు సంబంధించి 2007 నవంబరు 27న జీవోనెం.258ని విడుదలైంది. దీనితో తూర్పుగోదావరి జిల్లాకు రూ.1,679.24 కోట్లు కేటాయించారు. జిల్లాలో తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని పంట కాలువలకు 1,170.21 కోట్లు, మురుగునీటి కాలవలకు రూ.485.65 కోట్లు కేటాయించారు. డెల్టాలో భాగంగా ఉన్న అన్నంపల్లి నూతన అక్విడెక్టుకు సైతం శంకుస్థాపన పడింది వైఎస్సార్ హయాంలోనే రూ.13 కోట్ల అంచనాతో దీనికి ఆయనే 2008లో శంకుస్థాపన చేశారు. ఆయన మృతితో నత్తనడకనసాగిన పనులు రూ.54 కోట్లతో పూర్తిచేశారు. వైఎస్సార్ ఉండగా రూ.639.92 కోట్ల విలువైన ఐదు ప్యాకేజీలకు టెండర్లు ఖరారయ్యాయి. టెండర్లు ఖరారుకాని చోట కాలువలు అధ్వానంగా ఉన్నాయని రూ.9.01 కోట్లతో పూడికతీత పనులు చేపట్టారు. దీనితో శివారు ఆయకట్టుకు కొంత వరకు నీరందింది. ఆయన మృతి తరువాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయాంలో కొంత వరకు పనులు జరిగాయంటే వైఎస్సార్ హయాంలో నిధులు కేటాయించడమే కారణం. బాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో డెల్టా ఆధునీకరణపై శీతకన్ను వేశారు. ఈ నాలుగేళ్లలో బడ్జెట్ కేటాయింపులు రూ.350 కోట్లు కాగా, దీనిలో 70 శాతం మాత్రమే అంటే రూ.245 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ∙మెట్టలో కీలకమైన ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు దివంగత నేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో రూ.138 కోట్ల అంచనాతో 2008 జూన్ 24న జీవో 569 విడదల చేశారు. మూడు ప్యాకేజీలుగా దీనిని విడదీశారు. కాలువల ఆధునికీకరణ, గట్ల పటిష్టం పనులున్నాయి. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో శంకుస్థాపన చేశారు. అయితే పనులు మాత్రం ఆరంభం కాలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏలేరు పనులు ఆరంభమయ్యాయి. రెండవ దశ పనులకు కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.168.24 కోట్లు మంజూరు చేశారు. మెట్టలోని సీతానగరం నుంచి తుని వరకు ఏడు మండలాలల్లో సుమారు 1.87 లక్షల ఎకరాలకు సాగునీరందించే పుష్కర ఎత్తిపోతల పథకానికి పునాది పడింది. చంద్రబాబు హాయాంలో ప్రతిపాదనలకు మాత్రమే పరిమితం కాగా, వైఎస్సార్ జలయజ్ఞంలో సుమారు రూ.600 కోట్లతో పూర్తిచేయించారు. ఎన్నికల ముందు 2008లో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో ప్రారంభింప చేశారు. దీని వల్ల సాగుకు యోగ్యంకాని 1.87 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది. ఏజెన్సీలో కీలకమైన భూపతిపాలెం ప్రాజెక్టు దివంగత నేత వైఎస్సార్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా 2007లో ఆరంభమైంది. దీని తొలి అంచనా వ్యయం రూ.47.23 కోట్లు కాగా, పూర్తయ్యేనాటికి రూ.160.63 కోట్లకు చేరింది. అదే విధంగా ముసురుమిల్లి ప్రాజెక్టుకు సైతం 2007లో దివంగత నేత వైఎస్సార్ నిధులు కేటాయించారు. దీని తొలి అంచనా రూ.207 కోట్లు. ఇప్పటివరకు రూ.54 కోట్లు ఖర్చుపెట్టారు. దీనిలో 50 కోట్లు వైఎస్సార్ హాయాంలోనే ఖర్చుపెట్టారు. నాలుగేళ్లలో చంద్రబాబు రూ.4 కోట్లు మంజూరు చేశారు. ఇంకా 15 శాతం పనులు చేయాల్సి ఉంది. ఇప్పటికే పోలవరం పూర్తయ్యేది దివంగత మహానేత ఉండి ఉంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తయ్యేది. ఆయన హయాంలో జలయజ్ఞం పేరుతో జిల్లాలో కొత్త ఆయకట్టుకు నీరిచ్చారు. ఉన్న ఆయకట్టును స్థిరీకరించారు. ఆయన తరువాత ఎవరి హయాంలోను కొత్తగా ప్రాజెక్టు అనేది లేకుండా పోయింది. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తను తలపిస్తుంటే.. ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. వైఎస్సార్ లాంటి నాయకుడు మళ్లీ రావాలని రైతులు కోరుకుంటున్నారు. – జున్నూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, నంగవరం, ఉప్పలగుప్తం మండలం. ఉచిత విద్యుత్‌తో ఉపశమనం రైతు పక్షపాత సీఎంగా వైఎస్సార్ తొలి సంతకం జిల్లాలోని మొట్ట ప్రాంత రైతులకు వరం 39,801 వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సాక్షి, రాజమహేంద్రవరం: అప్పటి వరకు తీవ్రమైన కరువు, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు, పంటలు లేవు, అప్పులు.. మరో వైపు విద్యుత్ బిల్లులు కట్టాలంటూ అధికారుల ఒత్తిళ్లు, బకాయిల వసూళ్లకు వాహనాలపై గ్రామాల్లో తిరుగుతూ హల్చల్. విద్యుత్ బకాయిలు కట్టే ఆర్థిక స్థోమతలేక, అందరి ముందు తలదించుకునే రైతన్నకు ఆశాదీపంలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం నిలిచింది. 2003లో ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో మండుటెండలో తాను చేసిన పాదయాత్రలో కళ్లకు కట్టిన రైతన్నల కష్టాలు, నష్టాలను దృష్టిలో పెట్టుకుని దేశానికి అన్నం పెట్టే రైతన్నకు చేయూతగా వైఎస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే వ్యవసాయానికి ‘ఉచిత విద్యుత్’ ఇస్తూ ‘తొలి సంతకం’ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉచిత్ విద్యుత్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల ప్రస్తుత సర్కారు జిల్లాలోని నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నా.. రైతుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. గోదావరి డెల్టా మినహా మెట్ట ప్రాంతంలో బోర్ల ద్వారానే వ్యవసాయం సాగుతోంది. జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, పెద్దాపురం, పిఠాపురం, అనపర్తి, రాజానగరం తదితర నియోజకవర్గాల్లోని దాదాపు 18 మండలాల్లో బోర్ల ఆధారంగానే వ్యవసాయం సాగవుతోంది. ఉచిత విద్యుత్ వల్ల ఆయా మండలాల్లోని రైతులు లబ్ధి పొందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 39,801 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి నెలకు 41.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉపయోగిస్తున్నారు. ఫలితంగా నెలకు దాదాపు రూ.21 కోట్లు బిల్లు వస్తోంది. ఉచిత విద్యుత్ వల్ల ఈ మొత్తం భారం రైతులపై పడకపోవడంతో వారికి ఎంతగానో మేలు జరుగుతోంది. పంట పండినా, ఎండినా 2003కు ముందు విద్యుత్ బిల్లు కట్టాల్సిందే. ఉచిత విద్యుత్ పథకం వచ్చిన తర్వాత రైతులకు ఆ ఆందోళన నుంచి విముక్తి కలిగింది. -
జన హృదిలో.. ప్రతి మదిలో వైఎస్సార్
అభివృద్ధిపై ఆయనది చెరగని సంతకం. పేదల బతుకుల్లో వెలుగుల చిరుదివ్వె. అనారోగ్య పీడితులకు ఓ భరోసా. విద్యార్థుల ఉన్నత చదువులకు ఓ నమ్మకం. ప్రతి మదిలోను, ప్రతి ఎదలోనూ ఒకే నామస్మరణ అదే వైఎస్సార్. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రతి కుటుంబం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఏదో విధంగా లబ్ధి పొందింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, సొంత ఇల్లు ఇలా అన్నిరకాలుగా లబ్ధి పొందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. డెల్టా, మెట్ట, ఏజెన్సీ ఏ ప్రాంతం అయినా ఆయన వల్ల వరాలు పొందని కుటుంబాలు లేవంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆ మహానేత మరణించి నేటికి తొమ్మిదేళ్లు అయినా ఆయన తమ గుండెల నిండా ఉన్నాడని అయన వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు నేటికీ గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నాయి. వైఎస్సార్ పశ్చిమ గోదావరి జిల్లాపై వల్లమాలిన ప్రేమ చూపించేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి పర్యటన పశ్చిమ నుంచే ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చారు. జిల్లాలో పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం, తాడిపూడి ఎత్తిపోతల, డెల్టా ఆధునికీకరణ, ఏటిగట్ల పటిష్టత ఇలా ఆయన చేపట్టని ప్రాజెక్టు లేదు. ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లిన పథకాలు కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడిలోని ఒక పేద కుటుంబంలో పుట్టిన సోమరాజు వైఎస్ తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా త్రిపుల్ ఐటీ ద్వారా ఉన్నత చదువులు చదివి టెక్‌మహేంద్రా వంటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇలా ఉన్నత చదువులు అందని ద్రాక్షలా ఉన్న కుటుంబాల నుంచి వేల సంఖ్యలో యువతీయువకులు ఉన్నతస్థానాలకు ఎదగడానికి వైఎస్ చేపట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ దోహదం చేసింది. అర్హులైన ప్రతి పేద విద్యార్థికీ ఉన్నత విద్యను ఉచితంగా అందించేందుకు సమున్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చింది. వైఎస్ మరణానంతరం పేదలకు ఫీజు కష్టాలు మొదలయ్యాయి. అందరి బంధువయ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు జబ్బుచేస్తే డబ్బులెలా అనేది వారి ఆలోచన. గుండె జబ్బు సోకి అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉండే గిరిజన కుటుంబాలకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అపర సంజీవనిగా మారింది. ఇది ఏజెన్సీ ప్రాంతంలో వందల సంఖ్యలో గిరిజనుల ప్రాణాలు కాపాడింది. ఇలా ఏ గుండెను కదిపినా వైఎస్ నామస్మరణే. వైఎస్ తన హయాంలో ఏ వర్గానికి చెందిన ప్రజలను కూడా విస్మరించకుండా అందరికీ అవసరమయ్యే పథకాలతో వారి గుండెల్లో నిలిచిపోయారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నేడు ఆరోగ్యశ్రీ పేరు మార్చినా సకాలంలో అనుమతులు ఇవ్వకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 104 పథకం మూలనపడింది. జలయజ్ఞ ప్రదాత జలయజ్ఞంలో భాగంగా అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఆయన హయాంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమాలు ఒకదానితో ఒకటి పోటీపడి పరుగులు తీశాయి. నిత్యం పోలవరం కోసం తపించారు. డెల్టాను ఆధునికీకరించడం ద్వారా ఆయకట్టు స్థిరీకరణ జరగాలని భావించారు. రైతన్నకు భరోసా అందించారు. గుండె గుండెలో గూడు కట్టుకున్నారు. మెట్ట ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. పోలవరం కాల్వలు ఆయన సమయంలోనే పూర్తికాగా, ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని అనుమతులను ఆయనే తీసుకువచ్చారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లలో ప్రాజెక్టు నత్తనడకన సాగుతున్న సంగతి తెలిసిందే. పోలవరం గ్రామానికి వరద ప్రమాదం లేకుండా రూ.6 కోట్లతో నెక్లెస్ బండ్, పోలవరం నియోజకవర్గంలోని ముంపు జలాలను గోదావరి నదిలోకి మళ్ళించడానికి రూ. 57 కోట్లతో కొవ్వాడ అవుట్ ఫాల్ స్లూయిజ్, పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి వద్ద గోదావరి ఏటిగట్టుకు రూ. 20 కోట్లతో రివిట్మెంట్ కోసం వైఎస్ తీసుకున్న చొరవ కారణంగా ఆ ప్రాంత ప్రజలు ముంపు బారి నుంచి బయట పడగలిగారు. ఏలూరు ప్రజలకు దుఖఃదాయినిగా ఉన్న తమ్మిలేరు వరదల నుంచి జిల్లా కేంద్ర ప్రజలకు విముక్తి కల్పించారు. 2005లో వరదలు వచ్చినప్పుడు స్వయంగా వచ్చి పరిశీలించిన వైఎస్ ఇక్కడి నుంచి వెళ్లకముందే మొదటి దశ పనులకు రూ.17 కోట్లు మంజూరు చేశారు. సుమారు రూ.90కోట్ల నిధులు మంజూరు చేసి ఆయా ప్రాంతాల్లో ఏటిగట్లను పటిష్టం చేసి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపించారు. ఇటీవల వచ్చిన భారీ వరదలకు కూడా ఏలూరు తట్టుకుని నిలబడటం కూడా వైఎస్ చొరవే. రైతుల మోములో చిరునవ్వు చూడాలన్న సంకల్పంతో ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా ఒకే దఫాలో రైతులకు రుణ మాఫీ చేసిన రైతు బాంధవుడిగా అందరూ వైఎస్‌ను గుర్తు చేసుకుంటున్నారు. పేదల సాధికారిత కోసం పేదరిక నిర్మూలనే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్తశుద్ధితో ఎనలేని కృషి చేశారు. అయితే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి వైఎస్సార్ చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. కూలీలుగా ఉన్న వారికి భూములు ఇచ్చి ఆ భూముల్లో మోటార్లు వేయించడంతో పాటు వాటికి విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసి, వాటికి ఉచిత కరెంట్ ఇచ్చి కూలీలను రైతులుగా మార్చిన ఘనత వైస్సార్దే. జిల్లాలో అర్హులైన నిరుపేదలకు 30 వేల ఎకరాల భూపంపిణీ చేయడంతో ఆ నిరుపేద రైతులు రాజశేఖరరెడ్డిని నేటికీ దేవుడిగా కొలుచుకుంటున్నారు. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా యువతకు విద్యావకాశాలు కల్పించి తద్వారా ఉద్యోగావకాశాలు పొందేలా వైఎస్ తీసుకున్న చొరవ ఇప్పటికీ ఆయన తీపిగురుతుగా నిలిచి ఉంది. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందించి వారి కుటుంబాల్లో వెలుగు నింపారు. ఇప్పటి ప్రభుత్వం రుణాల మాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను డిఫాల్టర్లుగా మార్చింది. అందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు తపన పడ్డారు కాబట్టే వైఎస్సార్ అందరి గుండెల్లొ గూడుకట్టుకున్నారు. -
ప్రతి మదిలోనూ నీ జ్ఞాపకాలే ...
రుణమాఫీతో రైతులను అప్పుల నుంచి గట్టెక్కించావు.. జలయజ్ఞంతో బీడు భూములకు సాగునీటి ఆదరవు కల్పించావు.. అపర భగీరథుడిగా పేరు సంపాదించావు.. 108, 104, ఆరోగ్యశ్రీ పథకాలతో ఆరోగ్య భరోసా కల్పించావు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువులకు సాయం చేశావు.. సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచావు.. బతుకుపై ఆసరా కల్పించావు.. నీవు మా నుంచి దూరమైనా నీ జ్ఞాపకాలు ప్రతి మదిలోనే పదిలంగానే ఉన్నాయి. నీవు నిర్మించిన ప్రాజెక్టులు మా పంటలకు సమృద్ధిగా సాగునీటిని అందిస్తున్నాయి. నిను ఎప్పటికీ మరచిపోలేం రాజన్నా... మా గుండెల్లో నీ గుడికట్టుకున్నాం అంటూ జిల్లావాసులు పేర్కొంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి(ఆదివారం)ని పురస్కరించుకుని ఆయన మేలును గుర్తుచేసుకుంటున్నారు. జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. అలాంటి పాలన కావాలని ఆకాంక్షిస్తున్నారు. విజయనగరం గంటస్తంభం/సాలూరురూరల్/కొమరాడ/గరుగుబిల్లి: రైతు బాగుంటే దేశం బాగుంటుందని నమ్మిన గొప్పనేత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి. పాడిపంటలు విలసిల్లిన చోట ప్రజలు సంతోషంగా ఉంటారన్నది ఆయన నమ్మకం. అందుకే ఆయన పాలనలో రైతు సంక్షేమం కోసం పెద్దపీట వేశారు. పంటలు సాగుకు శాశ్వతంగా సాగునీరందించేందుకు జలయజ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణానికి పెద్దపీట వేశారు. జిల్లాలో కీలక సాగునీటి ప్రాజెక్టులు ఆయన హయాంలో నిర్మించినవే. జిల్లాలో సుమారు 1.6 లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టులను నిర్మించారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జలయజ్ఞ ఫలాలు గురించి ఓ సారి గుర్తు చేసుకుంటే.. పెద్దగెడ్డతో సస్యశ్యామలం వై.ఎస్.ఆర్ పెద్దపీట వేసి పూర్తి చేసిన మరో ప్రాజెక్టు పెద్దగెడ్డ. పాచిపెంట మండలంలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుకు ఇప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి పనులు చేయకుండా వదిలేశారు. వైఎస్సార్ సీఎం కాగానే ఈ ప్రాజెక్టుపై దృష్టిసారించి అవసరమైన నిధులు మం జూరు చేస్తూ 2004 లో పరిపాలన అనుమతులు ఇచ్చారు. వెంటనే పనులు ప్రారంభించడమే కాకుండా రూ.100 కోట్లతో ఏడాదిన్నరలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయించారు. 2006 సెప్టెంబర్‌లో ప్రాజెక్టు ప్రారంభోత్సం చేసి జాతికి అంకితం చేశారు. జలయజ్ఞం కింద రాష్ట్రంలో మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. జలాశయం నుంచి వైఎస్సార్ నీరు విడుదల చేశారు. దీంతో పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లో 12వేల ఎకరాలకు సాగునీటి సమస్య తీరింది. ఫలితంగా ఆప్రాంతం పులకిరించింది. ఇప్పుడు రైతులు పంటలకు భరోషా కల్పించి గొప్పనేతగా ముద్ర వేయించికున్నారు. విద్యార్థులకు లబ్ధి విజయనగరం పూల్‌బాగ్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల జిల్లా వ్యాప్తంగా ఈ నాలుగేళ్ల కాలంలో 2 లక్షల 40 వేల మంది విద్యార్థులు లబ్ధిపొందారు. కార్పొరేట్ విద్యను అందుకోగలిగారు. లక్షా 91 వేలు మంది బీసీ విద్యార్థులు, 30 వేలమంది ఎస్సీ విద్యార్థులు, 18 వేల మంది ఎస్టీ విద్యార్థులకు లబ్ధిచేకూరింది. జంఝావతికి ఒక పరిష్కారం నాగావళి ఉపనది జంఝావతిలో ఏడాదికి 12టీఎంసీలు నీరు ప్రవహిస్తోంది. ఇందులో 8 టీఎంసీలు నికర జలాలు ఉన్నాయి. అందులో ఒడిశాకు 4, ఆంధ్రప్రదేశ్‌కు 4టీఎంసీలు కేటాయిస్తూ కేంద్ర జలమండలి స్పష్టం చేసింది. అయితే ఆనికర జలాలను వాడుకునే పరిస్థితి లేదు. కొమరాడ మండలంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి జిల్లాలో 24,640 ఎకరాలకు నీరు ఇవ్వాలని 1976లో పనులు ప్రారంభించారు. కానీ ఒడిశాతో ఉన్న అంతరరాష్ట్ర వివాదంతో ఈ పనులు ముందుకెళ్లక నీరు సముద్రంలో వృథాగా కలిసిపోతుంది. 2004 వరకు దీనికి ఏ ప్రభుత్వం పరిష్కారం చూపలేదు. అప్పుడు అధికారంలో వచ్చిన వైఎస్ ఏదో ఒక ఆలోచన చేసి నీరు వాడుకోవాలన్న ఉద్దేశంతో ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో రబ్బరుడ్యాం నిర్మించాలని తలపెట్టి విజయవంతమయ్యారు. ఆయన చొరవతో 2006లో రబ్బరు డ్యాంను ఏర్పాటు చేసి లోతట్టు కాలువు ద్వారా నీరందించే ప్రయత్నం చేశారు. ఫలితంగా జంఝావతి ప్రాజెక్టు ఇంకా వివాదంలోనే ఉన్నా ఆయన ఏర్పాటు చేసిన రబ్బరు డ్యాం వల్ల ప్రస్తుతం 8 వేల ఎకరాలకు సాగునీరందే అవకాశం కలిగింది. ఫలితంగా అక్కడ రైతుల్లో ఆయన దేవుడుగా మిగిలిపోయాడు. పరుగులు తీసిన తోటపల్లి జిల్లాలో ఉన్న భారీతరహా సాగునీటి ప్రాజెక్టు తోటపల్లి. ఈ ప్రాజెక్టుకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేయకపోయినా పనులు మాత్రం ఆయన కాలంలోనే ప్రారంభయ్యాయి. పాత ఆయకట్టు 24వేల ఎకరాలతోపాటు కొత్తగా 1.20లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన హయాంలో రూ.450.24 కోట్లతో 2008 జులై 31న జీవో నంబర్ 114 జారీ చేశారు. తర్వాత అంచనాలు పెరిగి ప్రస్తుతం అంచనా వ్యయం రూ.750 కోట్లు అయింది. 90శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, ఇందులో రూ.400 కోట్లు నిధులు ఆయన హయాంలో విడుదల చేసి 57శాతం పనులు పూర్తి చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం 20 శాతానికిపైగా పనులు చేసింది. చివర్లో ఈ ప్రభుత్వం 10 శాతం పనులు పూర్తి చేసి నీరు విడుదల చేశారు. ప్రస్తుతం తోటపల్లి కింద వేలాది ఎకరాలకు నీరందుతుందంటే ఆ మహానేత పుణ్యమేనని అక్కడ రైతులు చెప్పుకోవడం వెనుక వైఎస్సార్ కృషిని మనమంతా గుర్తించాల్సిందే. తారకరామ తీర్థసాగర్ జిల్లాలో మరో కీలకమైన ప్రాజెక్టు తారకరామ ప్రాజెక్టు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈప్రాజెక్టు నిర్మాణం వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభం కావడం విశేషం. చంపావతి నదిలో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపెట్టి మూడు మండలాల రైతులకు సాగునీరు, విజయనగరం పట్టణానికి తాగునీరు ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టును 2006 వైఎస్సార్ ప్రారంభించారు. ఇందుకు 2005లో రూ.220 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చారు. 2009 సెప్టెంబర్‌లో ఆయన మృతి చెందేనాటికి సుమారు రూ.100 కోట్లు కేటాయించి పనులు వేగంగా జరిగేందుకు కృషి చేశారు. దీంతో 20శాతం వరకు పనులు ఆయన కాలంలోనే పూర్తయినా ఆయన ఆకాల మరణంతో ప్రాజెక్టు గతి తప్పింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 10శాతం పనులు చేయగా, ఇప్పుడున్న ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో కేవలం 10 శాతం పనులు చేయడంతో రైతులకు సాగునీరు ఇంకా అందలేదు. నిజంగా ఆయన బతికుంటే గత ఎన్నికలకు ముందే రైతులకు నీరందేదనడంలో అతిశయోక్తి లేదు. అక్కడ రైతులు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక విద్యకు పెద్దపీట జిల్లాలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, ఏయూ క్యాంపస్ ఏర్పాటు విజయనగరంఅర్బన్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను తీర్చడంలో ప్రాధాన్యమిచ్చారు. ప్రధానంగా పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి అవసరమైన ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంలో చొరవ చూపారు. సాంకేతిక విద్యను జిల్లా వాసులకు అందుబాటులో తీవాలనే ప్రయత్నంలో భాగంగా పట్టణ శివారుల్లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను 2007లో స్థాపించారు. రాష్ట్రంలో మూడు కళాశాలలకు అప్పట్లో అనుమతి ఇస్తే వాటిలో మన జిల్లాకి ఒకటి ఇచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. కళాశాల స్థాపించడం వల్ల బోధన, బోధనేతర సిబ్బంది 260 మందికి ఉపాధి కల్పించారు. ఏడాదికి 360 మంది చొప్పున సుమారు 3 వేల మందికి ప్రభుత్వ కళాశాలల్లో ఇంజనీరింగ్ విద్యను అందించించారు. ఏ.యూ.క్యాంపస్ స్థాపన ఆర్ట్సు ఉన్నత విద్యను జిల్లా వాసులకు అందించాలనే లక్ష్యంతో పట్టణ శివారులో ఆంధ్రాయూనివర్సిటీ ఎక్స్టెన్షన్ క్యాంపస్‌ను 2005లో ప్రారంభించారు. ఉన్నత చదువులకు పెద్దపీట వేశారు. -
ప్రగతి ప్రదాత... భాగ్య విధాత
ఎవరి పాలనలో అన్ని వర్గాలవారికీ సమాన న్యాయం జరిగిందో... ఎవరి చల్లని చూపుతో జిల్లాలో ప్రగతి రథం పరుగులు తీసిందో... ఎవరి పట్టుదలతో జలయజ్ఞం విజయవంతమైందో... ఎవరి చిత్తశుద్ధితో నిరుపేదల్లో విద్యాకుసుమాలు విరబూశాయో... ఎవరి ఆశయంతో జిల్లాలో ప్రజారోగ్యం పరిఢవిల్లిందో... ఎవరి ప్రభావంతో విద్యారంగం విలసిల్లిందో... ఆ మహానేత నేడు మన మధ్య లేకున్నా.. ఆయన జ్ఞాపకాలు మన మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయి. వైఎస్ఆర్.. ఆ మూడక్షరాలు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ ఓ మధురానుభూతిని కలిగిస్తూనే ఉంటాయి. ఆయన చేపట్టిన అభివృద్ధి ఫలాలు నేటి తరానికి వెలుగులు విరజిమ్ముతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే అది ఒక్క వైఎస్ హయాంలోనే అని ఎవరినడిగినా చెబుతారు. విద్యాసంస్థలు, సాగునీటి ప్రాజెక్టులు, ఆస్పత్రులు ఒకటేమిటి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే ఎన్నో పథకాలను ఆయన జిల్లాలో అమలు చేశారు. నాడు ఆయన వేసిన బాటలు నేడు ప్రగతి పథంలో పయనించేందుకు దోహదపడుతున్నాయి. ఆదివారం వైఎస్ఆర్ వర్థంతి. ఆయన గతించి తొమ్మిదేళ్లయినా ఆయన మనందరిలోనూ చెరగని ముద్ర వేశారంటే ఆయన పాలనాదక్షత ఎంతటితో వేరే చెప్పనవసరం లేదు. ఆ మహానేత మరణాన్ని జీర్ణించుకోలేని 17 మంది జిల్లాలో తనువు చాలించారంటే ఆయనపై ఎంతగా అభిమానం పెంచుకున్నారో అర్థమవుతుంది. ఆనాడు ఉబికిన కన్నీటి ఉప్పెన తడి నేటికీ ఆరలేదు. తన తండ్రిపై అంతటి ప్రేమాభిమానాలను పెంచుకున్న కుటుంబాలను వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2011, మార్చి, మే నెలాఖరులో స్వయంగా కలిశారు. వారిని ఓదార్చారు. వారికి పెద్దకొడుకునవుతానని భరోసానిచ్చారు. వాడవాడలా నాడు అభివృద్ధి జాడలు... వైఎస్సార్ హయాంలో వాడవాడలా అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. తరతమ భేదం లేకుండా ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకం అందింది. అందుకే అంతా ఆయన్ను దేవునిలాకొలిచారు. ఏ నియోజకవర్గం చూసినా ఆయన అభివృద్ధి జాడలు మనకు కనిపిస్తాయి. కానీ ఆయన మరణానంతరం అర్ధంతరంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేసిన దాఖలాలు కానరాకపోవడంతో జనం అవస్థలు మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్టులు పూర్తి చేసినా.. కాలువల నిర్మా ణం ఊపందుకోలేదు. విద్యాసంస్థలు మంజూరు చేసినా కాలానుగుణంగా అభివృద్ధి చేయలేదు. ఇవన్నీ జనం మనసులను ఇప్పటికీ కలచివేస్తున్న అంశాలే. ► బొబ్బిలి నియోజకవర్గంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాలను కలుపుకుంటూ ఏర్పాటైన తోటపల్లి సాగునీటి కాలువ ఏర్పాటైంది. కానీ ఆయన మరణానంతరం అర్ధంతరంగా నిలిచిపోయింది. ► శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలంలో విజయరామసాగర్‌ను మినీ రిజర్వాయర్‌గా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టడమే గాకుండా నిధులు కూడా కొంతమేర సమకూర్చారు. ఖాయిలా పడ్డ భీమసింగి చక్కెర కర్మాగారాన్ని తెరిపించి చెరకురైతులకు తీపి జీవితాన్ని పంచారు. ► చీపురుపల్లి నియోజకవర్గంలో ఆయన హయాంలో రూ. 84 కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ, సుజలధార తాగునీటి పథకాన్ని అమలు చేశారు. చీపురుపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల, టీటీడీ కల్యాణ మండపాలు నిర్మించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యాలు కల్పించి, తోటపల్లి కాలువ పనులకు కూడా అంకురార్పణ చేశారు. ఇప్పుడది కుంటినడక నడుస్తోంది. ► సాలూరు నియోజకవర్గంలోని సాలూరు, మెంటాడ, పాచిపెంట మండలాల్లో విరివిగా రహదారుల నిర్మాణం జరిగింది. మక్కువ మండలంలో సురాపాడు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ► కురుపాం నియోజకవర్గంలోని తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం 90శాతం రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగింది. దీంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. కొమరాడ మండలంలో జంఝావతి రబ్బర్ డ్యామ్ నిర్మాణానికి నాంది పలికారు. దేశంలోనే మొట్టమొదటి రబ్బర్‌డ్యామ్‌గా అది పేరుగాంచింది. కాని దాని కాలువల నిర్మాణంలోనే ఇంకా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ► పార్వతీపురం నియోజకవర్గంలో పార్వతీపురం మండలం అడారిగెడ్డ నిర్మాణానికి రాజశేఖరరెడ్డి హయాంలోనే నిధుల కేటాయింపు జరిగింది. కానీ ఇప్పుడు పనులు పడకేశాయి. ► గజపతినగరం నియోజకవర్గంలో మహానేత హయాంలోనే తోటపల్లి చానల్ ద్వారా సుమారు 3వేల ఎకరాలకు సాగునీరందించాలని పైలాన్ ప్రారంభించారు. ఆయన మరణంతో అది అలానే ఉండిపోయింది. పర్యాటక కేంద్రమైన తాటిపూడి ఆయన హయాంలోనే అభివృద్ధి చెందింది. ► విజయనగరంలో జిల్లా యువజనులకు వివిధ పథకాలపై శిక్షణలు, అవగాహనల కోసం భవనం లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కలెక్టరేట్ దగ్గరలోని కనపాకలో యూత్ హాస్టల్ భవనాన్ని నిర్మించారు. అలాగే పట్టణానికి తాగునీటి కోసం నిర్మించతలపెట్టిన తారకరామతీర్థసాగర్‌కు బడ్జెట్ కేటాయించారు. ► నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గల పంట పొలాలకు సాగునీటిని అందించేందుకు తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. దీని కోసం 2007లోనే సుమా రు రూ. 187 కోట్లు విడుదల చేశారు. నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాలకు చెందిన 16వేల మంది అర్హులకు సామాజిక పింఛన్లు, సొంతగూడు లేని 15వేల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, డ్రై యిన్లకు నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయి. నెల్లిమర్ల పట్ట ణంతో పాటు గుర్ల, గరివిడి మండలాలకు తాగునీటిని అందించేందుకు రామతీర్థం మంచినీటి పథకాన్ని వైఎస్ ప్రారంభించారు. -
అభివృద్ధికి అచ్చమైన రూపకర్త.. మహానేత!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అభివృద్ధి అంటే? కాగితాలపై ప్రతిపాదనలు కాదు. అమలుకాని మ్యానిఫెస్టో హామీలు కాదు. ప్రజలకు చెప్పీచెప్పీ అరిగిపోయిన రికార్డులు కాదు. అభివృద్ధి అంటే.. అన్నదాతకు అక్కరకొచ్చేలా సాగునీరు. రోగమేదైనా అందుబాటులోని ఆధునిక వైద్యం. ప్రతి విద్యార్థీ చదువుకునేలా ఉన్నత విద్య. ఒక కుటుంబానికి ఈ మూడూ అందితే ఎన్నికల తాయిలాలు అక్కర్లేదు. ఆ కుటుంబమే ఆర్థికంగా నిలబడుతుంది. అలా కుటుంబాలన్నీ బాగుంటే సమాజమే బాగుంటుంది. అలా సమాజం బాగుంటే అభివృద్ధి దానికదే అడుగులేసుకుంటూ వస్తుంది. ఇదీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆచరించి చూపించిన సిద్ధాంతం. ఎక్కడో దూరాన ఉందని వదిలేసే నాయకులకు భిన్నంగా ప్రతి సంక్షేమ పథకంలోనూ సిక్కోలుకు పెద్దపీట వేసి ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత. ఆయన తొమ్మిదో వర్ధంతి నేడు. జిల్లాలో విద్య, వైద్యం, సాగునీరు, సంక్షే మం.. ఇలా ఏ రంగంలో చూసినా వైఎస్సార్ ముద్ర కనిపిస్తుంది. 2009 సెప్టెంబరు 2న ఆయన అకాల మరణం రాష్ట్రానికే కాదు వెనుకబడిన సిక్కోలు జిల్లాకు పెద్ద లోటు. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాల హయాంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలా నీరుగారిపోతున్నాయో అందరికీ తెలిసిందే. ఆదివారం ఆయన తొమ్మిదో వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ అడుగుజాడలను మరోసారి స్మరించుకుందాం. అన్నదాతలకు ఆపద్బాంధవుడిగా... బ్యాంకు రుణం అంటేనే సవాలక్ష ఆంక్షలమయంగా మారిపోతున్న ఈ రోజుల్లో రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అసలు వాయిదా పద్ధతే లేకుండా ఏకమొత్తంలో రైతన్నల బ్యాంకు రుణాలన్నీ మాఫీ చేసి తాను రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు వైఎస్సార్. జిల్లాలో దాదాపు 2.50 లక్షలకు పైగా రైతులు రాజన్న చలువతో రుణవిముక్తులయ్యారు. అప్పో సప్పో చేసి అప్పటికే రుణాలు చెల్లించేసినవారికీ రూ.5 వేల చొ ప్పున ప్రోత్సాహం అందించిందీ ఆయనే. రైతుల రుణాలమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మాత్రం. రుణమాఫీ హామీ అమలుకు నానా అగచాట్లూ పడుతోంది. గ్రామీణ విద్యార్థులకు కొండంత అండ ఆర్థిక ఇబ్బందులతో ఏ ఒక్క విద్యార్థీ అర్ధంతరంగా చదువు మానేయకూడదనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెరపైకి తెచ్చారు వైఎస్. అభివృద్ధిలో అట్టడుగున, వలసల్లో ప్రథమ స్థానంలో ఉంటోన్న ఈ జిల్లాలో కొన్ని వేల మంది విద్యాభ్యాసానికి కొండంత అండగా ఆయన నిలిచారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన వారిలో బీసీ విద్యార్థులే 72 వేల పైచిలుకు ఉన్నారు. 2008 జూన్ 25న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాల యం ప్రారంభమైందీ వైఎస్ హయాంలోనే అని ప్రతి సిక్కోలు విద్యార్థీ చెబుతారు. ఆదర్శంగా ‘ఆరోగ్యశ్రీ’ నిరుపేదలకు సైతం కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో వైఎస్సార్ 2007లో ప్రారంభించిన పథకమే ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’. 938 రకాల వ్యాధులకు ఉచిత చికిత్స అందేది. అలాగే ఏ ప్రమాద బాధితులనైనా సరే అత్యవసర సమ యం (గోల్డెన్ పీరియడ్)లో ఆస్పత్రికి చేర్చితే ప్రాణం నిలబెట్టవచ్చని ఒక వైద్యుడిగా తెలిసిన వైఎస్ 108 పేరుతో అంబులెన్స్‌లు ప్రారంభించా రు. గ్రామీణులకు ప్రతినెలా వైద్యం అందించడానికి 104 వాహనాలు అందుబాటులోకి తెచ్చారు. కానీ ఇప్పుడు వాటి పేర్లను, చిత్రాలను మార్చేసిన టీడీపీ ప్రభుత్వం పథకం అమలునూ నీరుగార్చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్షేమ పథకాల పక్కా అమలు.. ఇక సంక్షేమ పథకాల విషయానికొస్తే ఇందిరమ్మ పథకం మూడు విడతల్లో అన్ని గ్రామాలను సర్వే చేసి జిల్లాలో 2.92 లక్షల మందికి పింఛన్లు, 2.74 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేసి తాను పెద్ద కొడుకునని వైఎస్సార్ చెప్పకనే చెప్పారు. ఏదిఏమైనా సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ అందించిన ఏకైక ముఖ్యమంత్రి రాజన్నే అనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అలాంటి రాజన్న రాజ్యం మళ్లీ తీసుకురావాలనే సంకల్పంతోనే ఆయన కుమారుడు రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ప్రస్తుతం ఉత్తరాంధ్రలో అశేష జనవాహిని మధ్య సాగుతోంది. మరో కొద్దిరోజుల్లో సిక్కోలు గడ్డపై జననేత అడుగుపెడతారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. డాక్టర్ రాజన్న వరమే రిమ్స్... పేదలకు ఆధునిక వైద్యాన్ని, సిక్కోలు విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడానికి శ్రీకాకుళంలో రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ (రిమ్స్)ను ఏర్పాటు చేసింది వైఎస్సారే. 2008, అక్టోబరు 26వ తేదీన దీన్ని ప్రారంభించారు. అంతేకాదు కొత్త భవనాల నిర్మాణానికి రూ.133 కోట్లు మంజూరు చేశారు. మొత్తం 13 బ్లాకుల ఈ ప్రాజెక్టులో ఆరు ఆయన హయాంలోనే పూర్తి అయ్యాయి. సాగునీటి పథకాలకు పెద్దపీట... తోటపల్లి ఫేజ్–2 ప్రాజెక్టుకు, వంశధార నదిపై తలపెట్టిన రెండో దఫా ప్రాజెక్టుకు, టెక్కలి నియోజకవర్గంలోని ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు జీవం పోసింది నాటి ముఖ్యమంత్రిగా వైఎస్సారే. దాదాపు రూ.970 కోట్ల వ్యయంతో వంశధార స్టేజ్–2 ఫేజ్–2 ప్రాజెక్టును పూర్తిచేస్తే జిల్లాలోని 20 మండలాల్లో 2.55 లక్షల ఎకరాల్లో రెండు పంటలకూ పుష్కలంగా సాగునీరు అందుతుందనే ఉద్దేశంతో 2005లోనే ఈ మహాకార్యానికి సంకల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒడిశాలో వర్షాలు పడితే నాగావళి, వంశధార నదుల్లో కనిపించే వరద ఉద్ధృతికి తట్టుకునేలా రూ.300 కోట్లతో కరకట్టల నిర్మాణానికి బీజం వేసిందీ ఆయనే. మడ్డువలస విస్తరణ ప్రాజెక్టుతో పాటు మహేంద్ర తనయ నదిపై ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకూ సంకల్పించింది వైఎస్ రాజశేఖరరెడ్డే. తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు అలాంటి విజన్ లోపించడంతో ఇప్పటికీ అవి తుది దశకు చేరుకోలేదంటేనే వాటి చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది. -
వైఎస్ అనే నేను..
వైఎస్ రాజశేఖరరెడ్డి అనే నేను.. అంటూ లక్షలాది మంది ప్రజల సాక్షిగా ఉచిత విద్యుత్ ఫైల్‌పై నువ్వు చేసిన తొలి సంతకం నేటికీ ప్రతి ఇంటా వెలుగు రేఖలు పంచుతూనే ఉందయ్యా.. పేదోళ్ల శరీరానికి జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ అంటూ పెద్ద వైద్యం చేయించిన మనసున్న వైద్యుడా.. నువ్వు నిలిపిన ప్రతి ప్రాణం నీ కోసం ఎదురు చూస్తోందయ్యా.. కడలి పాలవుతున్న నదీ జలాలను జలయజ్ఞంతో కట్టేసి.. బీడు భూముల్లో రతనాల పంటలు పండించిన రైతు బిడ్డా.. కర్షకలోకం నీ కోసం కన్నీళ్లు కారుస్తోందయ్యా.. ప్రతి ఇంటి బిడ్డకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో అక్షర భిక్ష పెట్టిన మార్గదర్శకుడా.. నీ కోసం విద్యార్థి లోకం రెండు చేతులు జోడిస్తోందయ్యా.. రైతు మెడపై వేలాడుతున్న అప్పుల ఉరికొయ్యను రుణాల రద్దుతో తెగనరికిన పేదల పక్షపాతీ.. నీ ఔదార్యానికి ప్రతి ఇల్లూ రుణపడి ఉంటానంటోందయ్యా.. విధి నిన్ను దూరం చేసినా.. వైఎస్ అనే నేను అంటూ ప్రతి గడపలో నువ్వు చేసిన అభివృద్ధి సంతకం.. ఐదు కోట్ల ప్రజానీకం గుండెల్లో పదిలంగా పచ్చబొట్టై నిలిచి ఉంది రాజన్నా.. ఇల్లు కట్టించిన మహానుభావుడు నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలంలో విప్పర్ల స్వగ్రామం. నా పేరు షేక్ సైదా. చిన్న వాన కురిసినా మా గుడిసెలోకి నీళ్లు చేరేవి. తెలుగుదేశం పాలనలో తొమ్మిదేళ్లు ఇల్లు కట్టించండి మహా ప్రభో అని తిరిగినా పట్టించుకోలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇంటికి వచ్చి మరీ పేర్లు రాసుకున్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో ఇల్లు కడతామని చెప్పారు. నేను నమ్మకలేకపోయాను. కొద్ది రోజుల్లోనే అనుమతులిచ్చేసి ఇల్లు కట్టి చూపించారు. నాకు ఇద్దరు కొడుకులు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పెద్ద కుమారుడు బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. నా కుటుంబాన్ని కష్టాల నావ నుంచి ఒడ్డున చేర్చిన నావికుడు వైఎస్. మేము తినే ప్రతి అన్నం ముద్దలో ఆయన పేరు ఉంటుంది. మా ఇంట్లో రూ.6 లక్షల లబ్ధి పొందాం నా పేరు దామర్ల వెంకటరావు. మండలంలోని యాజలి స్వగ్రామం. 2012లో మా అబ్బాయి మన్మథరావుకు బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. నాకు పెద్దగా ఆస్తులు లేవు. ఆపరేషన్ చేయించేంత స్థోమత కాదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెప్పారుగానీ.. పెద్దాస్పత్రుల్లో పట్టించుకుంటారని నమ్మకం కలగలేదు. అయినా ఒక్కసారి వెళదామని ఆస్పత్రిలో అడుగుపెట్టాం. అంతే రూ.3 లక్షలు విలువైన ఆపరేషన్‌ను ఉచితంగా చేసేశారు. నా బిడ్డకు ప్రాణం పోశారు. 2013లో నాకు మూడు వాల్స్ బలహీన పడటంతో ఆరోగ్యశ్రీ కార్డుపైనే గుండెకు ఆపరేషన్ చేయించుకున్నాను. నా ఆపరేషన్‌కు కూడా రూ.3 లక్షల ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఇలా మా ఇంట్లోనే రూ.6 లక్షల వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి దయతో లబ్ధి పొందాం. ఆయన పేదల మనిషి. ఇదిగో మా గుండె నిత్యం ఆయన పేరునే తలుచుకుంటుంది అంటూ వెంకటరావు గుండెలపై చేతులు వేసుకుని చెప్పారు. – కర్లపాలెం పెద్ద కొడుకులా ఓదార్చాడు రొంపిచర్ల: మాది మండలంలో ఎడ్వర్డ్‌పేట. నా పేరు భారతమ్మ. నా భర్త వెన్నపూస పిచ్చిరెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమాని. ఆయన మరణవార్త విని తట్టుకోలేక చనిపోయాడు. అప్పుడు పిల్లవాడు బడికి వెళుతున్నాడు. నా భర్త మృతితో చాలా ఇబ్బందులు పడ్డాం. పిల్లవాని చదువుపై భయం పట్టుకుంది. అప్పుడు ఇంటి పెద్ద కొడుకులా వైఎస్ జగన్మోహన్రెడ్డి మా ఇంటికి వచ్చారు. నేనున్నానంటూ ఓదార్చి భరోసా కల్పించారు. ఇప్పుడు నా బిడ్డ చదువు పూర్తయింది. ఉద్యోగం వచ్చింది. మా కుటుంబం సంతోషంగా ఉంది. అలాంటి మంచి హృదయం గల నాయకుడు పదికాలాలపాటు సంతోషంగా ఉండాలి. ఆరోగ్యశ్రీయే నన్ను బతికించింది ఎస్వీఎన్ కాలనీ: మాది గుంటూరు రూరల్ మండలంలోని అడవి తక్కెళ్లపాడు. నా పేరు శివమ్మ. 2008లో గుండె జబ్బు చేసింది. ఆస్పత్రికి వెళితే గుండెకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఇంట్లో రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. ఇలాంటప్పుడు లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ అంటే మాటలు కాదు. ఇక జీవితంపై ఆశలు వదులుకున్నాను. అప్పుడు చెప్పారు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ మీకు అండగా ఉంటుందని. తొలుత నమ్మలేదు. ఆస్పత్రికి వెళితే అతిథిగా చూశారు. ఆపరేషన్ పూర్తి విజయవంతంగా ముగించారు. మొత్తం రూ.1.20 లక్షల వరకు ఖర్చైంది. అంతా ఆ మహానుభావుడి చలవే. నాకు మాదిరిగా ఎంతో మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీతో ప్రాణాలు పోసిన దేవుడు. అందుకే ఇప్పటికీ గుర్తుండిపోతున్నారు. క్యాన్సర్ నుంచి కాపాడారు అయ్యా మాది మండలంలోని పెదకొండూరు. నా పేరు సుద్దపల్లి కటాక్షం. నేను ప్రాణాంతకమైన గర్భసంచి క్యాన్సర్ బారిన పడ్డాను. నన్ను చూసేందుకు వచ్చిన వారందరూ ఇంక కొద్ది రోజులేనని అంటుంటే బతికుండగానే చచ్చిపోయేదాన్ని. అప్పుడు మా పిల్లలను చూసుకుని భోరున విలపించాను. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2007లో నాకు ఆపరేషన్ చేశారు. ఇది కలో.. నిజమో తెలియలేదు. బతకననుకుంటే పునర్జన్మ ప్రసాదించాడు వైఎస్ రాజశేఖరెడ్డి. ఎంత చెప్పుకున్నా ఆయన రుణం తీర్చుకోలేదు. ఆపరేషన్ అనంతరం మీకు చికిత్స సరిగా అందిందా.. లేదా ? మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరుతో లేఖలు వచ్చాయి. – దుగ్గిరాల అండగా నిలిచారు నా పేరు పర్వతనేని వెంకాయమ్మ. మండలంలోని పెదనందిపాడు మా స్వగ్రామం. వైఎస్ రాజశేఖరుని మరణాన్ని జీర్ణించుకోలేక నా భర్త పర్వతనేని నాగేశ్వరరావు తనువు చాలించాడు. ఏం చేయాలో దిక్కుతోచ లేదు. ఆ సమయంలో ఇంటింటికీ వచ్చి పరామర్శిస్తానని వైఎస్ కొడుకు జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఇదంతా వట్టిమాటలే అనుకున్నా.. కానీ పెద్ద కొడుకులా ఇంటికి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం చెప్పారు. ఆర్థిక సాయం చేసి నన్ను ఆదుకున్నారు. ఆ బిడ్డ చలవతోనే నా కుమార్తె వివాహం చేశాను. కుమారుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కుటుంబాన్ని మేము మరువలేం. రాజన్నను ఎన్నటికీ మరువలేం నా పేరు బుల్లా నీలమ్మ. మండలంలోని కుంచనపల్లి స్వగ్రామం. రాజశేఖరరెడ్డి కనిపించడం లేదని తెలియడంతో నా భర్త లక్ష్మయ్య కూడూ నీళ్లు మానుకొని టీవీకి అతుక్కుపోయారు. తెల్లవారాక ఆయన మరణ వార్త విని గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు అనారోగ్యంతో మృతి చెందారు. వైఎస్ మరణించాక 108 అంబులెన్సు కూతలు వినిపించడం లేదు. ఉచిత ఆపరేషన్లు కనిపించడం లేదు. రాజన్న బిడ్డ మా ఇంటికి వచ్చినప్పుడు సొంత బిడ్డలా అనిపించింది. లక్ష రూపాయలు ఇచ్చి ‘అమ్మా మీకు నేనున్నానంటూ తల మీద చెయ్యిపెట్టి చెప్పాడు’. అంటూ కొంగు చాటున కన్నీళ్లను దాచుకుంటూ చెప్పింది. కొండంత ధైర్యమిచ్చారు కాట్రపాడు(దాచేపల్లి): ‘మాది కాట్రపాడు గ్రామం. నా పేరు రెడ్డిచర్ల రమణ. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నా భర్త రెడ్డిచర్ల కృష్ణంరాజు వీరాభిమాని. ఆయన మరణవార్త విని హఠాత్తుగా మృతి చెందాడు. వైఎస్ మరణంతోనే పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాం. వెంటనే భర్త గుండె ఆగడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాం. 2012లో వైఎస్ జగన్ మా ఇంటికి వచ్చారు. నాకు మనోధైర్యాన్ని చెప్పి పిల్లలను బాగా చదివించాలని, అండగా ఉంటానని అభయమిచ్చారు. జగనన్న ఇచ్చిన ధైర్యంతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది. సొంతిల్లు కూడా లేదు. జగనన్న సీఎం అయితే ఇల్లు కట్టిస్తాడనే నమ్మకంతో ఉన్నాన’ంటూ పక్కపక్కనే ఉన్న భర్త కృష్ణంరాజు, వైఎస్సార్ ఫొటోలవైపు చూస్తూ ఉబి కివస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ వివరించారు. వైఎస్.. మనసున్న డాక్టర్ నా పేరు సయ్యద్ మొబీన్ అప్సర్. మాచర్ల పట్టణం సొంతూరు. తల్లిదండ్రులు ముస్తఫా, సమీమున్నీసా పేద కుటుంబం. నన్ను ఇంటర్ వరకు చదివించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 2007 నుంచి 2013 వరకు హైదరాబాద్‌లోని ఓవైసీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివాను. పైసా ఖర్చు లేకుండా డాక్టర్‌నయ్యా. ప్రస్తుతం కెనడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. నా వైద్య సాయం పొందిన వారు తెలిపే ప్రతి కృతజ్ఞతా వైఎస్‌కే దక్కుతుంది. నా మెడలో స్టెతస్కోప్ చూసుకున్నప్పుడల్లా ఆయన చలువే గుర్తుకొస్తుంది. జీవితాంతం ఆ మహానేతకు రుణపడి ఉంటాను. చిల్లిగవ్వ లేకపోయినా గుండె చిల్లు పూడ్చారు నా పేరు బత్తిన వేణు. పట్టణంలోని 17వ వార్డులో నివాసం ఉంటాను. ఒకరోజు గుండెల్లో కొంచెం నొప్పిగా ఉందని డాక్టర్ వద్దకు వెళ్లాను. గుండెకు చిల్లు పడిందని వాళ్లు బాంబు పేల్చారు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆపరేషన్ చేయించుకోవడానికి చిల్లి గవ్వ లేవు. దేవుడిచ్చిన వరంలా ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది. విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. గుండెకు పడిన చిల్లు పూడింది. నాకు ఆయుష్షు పోసింది. ఎప్పుడైనా వంట్లో నలతగా అనిపిస్తే చాలు.. ఆ మహానుభావుడే కళ్ల ముందు ధైర్యమై కనిపిస్తాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని అడ్రస్ లేకుండా చేశారు. మళ్లీ జగన్మోహన్రెడ్డి వస్తేనే పేదోడికి అండ. – మాచర్ల నా బిడ్డలకు అక్షర భిక్ష పెట్టారు నా పేరు షేక్ అన్సార్. మండలంలోని కర్లపాలెంలో రీవైండింగ్ ఎలక్ట్రికల్ మేస్త్రిగా పని చేస్తున్నాను. నా పెద్ద కుమారుడు నిసార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుకున్నాడు. క్యాంపస్‌లో ఉద్యోగం సంపాదించి నార్త్ అమెరికా వెళ్లాడు. ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోతే నా బిడ్డ చదువుకు రూ.1.40 లక్షల ఖర్చయ్యేది. మా రెండో అబ్బాయి సమీర్ కూడా ఏజీ ఎంఎస్సీ పూర్తి చేశాడు. ఐటీసీ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. చిన్న కొడుకుకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంటే అక్షర భిక్ష పెట్టింది. రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్ల వలనే నా బిడ్డలు ఉద్యోగస్తులయ్యారు. ఇదంతా ఆ మహానేత పుణ్యమే. – కర్లపాలెం -
ప్రతి మదిలో నీ జ్ఞాపకాలే రాజన్నా
ఆయన రాజకీయ నాయకుడు కాదు.. ప్రజల్లో నుంచి పుట్టిన మహానేత.. పార్టీలను, కులమతాలను పక్కనపెట్టి అందరికీ సంక్షేమ పథకాలను చేరువచేసి ప్రజల కన్నీరు తుడిచిన మనసున్న మారాజు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందించిన మహనీయుడు.. పెద్ద జబ్బులతో అనారోగ్యం బారిన పడి కార్పొరేట్ వైద్యం చేయించుకునే స్థోమత లేక భారంగా రోజులీడుస్తున్న పేదలను ఆరోగ్య శ్రీతో ఆదుకుని వారి మోముపై మళ్లీ చిరునవ్వుల పూలు పూయించిన నిజమైన ప్రజా వైద్యుడు.. కరువుకాటకాలతో అల్లాడుతున్న జిల్లా రైతులకు సాగునీటి ప్రాజెక్టులతో వ్యవసాయంపై భరోసా నింపిన నిత్య కృషీవలుడు.. ఆయనే ప్రజలు రాజన్నా అంటూ ప్రేమగా పిలుచుకునే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఆయన పాలన కాలం ఓ సువర్ణయుగం.. అందుకే ఆయన దూరమై తొమ్మిదేళ్లు గడిచినా మదిమదినా ఆయన జ్ఞాపకాలు నిండి ఉన్నాయి. రాజన్నా.. అంటూ ప్రేమగా పలవరిస్తున్నాయి.. సాక్షి, అమరావతి బ్యూరో: సంక్షేమ పాలనతో జిల్లాపై దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ముఖ్యమంత్రిగా ఆయనకు ఈ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. పథకాన్ని ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు పేదలకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని చేరువచేసి, ఎన్నో ప్రాణాలను నిలిపి అపర సంజీవనిగా పేరుపొందిన ఆరోగ్య శ్రీని ప్రారంభించింది ఈ జిల్లాలోనే. 2004 ఎన్నికల్లో టీడీపీ కంచుకోట లాంటి ఈ జిల్లా నుంచి మొత్తం 19 నియోజకవర్గాలకు 18 మందిని ఎమ్మెల్యేలుగా ఒంటిచేత్తో గెలిపించి సత్తాచాటారు. భారీ విజయాన్ని కట్టబెట్టిన ఈ జిల్లాపై ఆయన ఎంతో మక్కువ. కృష్ణాడెల్టాను సస్యశ్యామలం చేసేందుకు పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడు. అందుకే ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు పాలన అందించారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసి ప్రజల కన్నీరు తుడిచారు. ఆయన పాలన అన్ని వర్గాల ప్రజలకు ఓ సువర్ణయుగం. పేదలు తలెత్తుకుని కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునేలా ఆరోగ్య శ్రీని తీర్చిదిద్దారు. రైతుల బతకు చిత్రాన్ని మార్చే క్రమంలో లక్షా 50 వేల కోట్ల రూపాయల అంచనాతో జలయజ్ఞం కింద రాష్ట్రంలో 86 ప్రాజెక్టులు చేపట్టారు. వాటిలో మొట్టమొదటి ప్రాజెక్టుగా జిల్లా రైతుల స్థితిగతులను మార్చే పులిచింతలను ప్రారంభించారు. వైఎస్సార్ చివరి సంతకం చేసిన ఫైల్ కూడా జిల్లాలో మిర్చి రైతులకు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రయోజనం చేకూర్చినదే. ఈ బీమాతో జిల్లాలో రూ.17 కోట్లకుపైగా లబ్ధిపొందారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మిర్చిపంటకు ప్రయోగాత్మకంగా బీమా అమలు చేసి రైతుల పక్షపాతిగా నిలిచారు. ఆయన దూరమై తొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటికీ ఆయన మరణం ఓ కలగానే ఉందని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతిని శనివారం జిల్లా వ్యప్తంగా నిర్వహించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోపాటు వైఎస్సార్ అభిమానులు సైతం ఆ మహానేతకు నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానేత ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టేది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ మరణాంతరం వచ్చిన ప్రభుత్వాలు అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేసి రైతుల ఆశలను నిలువునా ముంచాయి. జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా, రాజకీయంగా గుంటూరుకు వైఎస్ అధిక ప్రాధాన్యాన్ని కల్పించారు. జిల్లాకు నాలుగు మంత్రి పదవులను కేటాయించటంతోపాటు పథకాల అమలులో పెద్దపీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన రూ.12 వేల కోట్ల రుణ మాఫీలో జిల్లా రైతులకు రూ.560 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. ఇందిర ప్రభను జిల్లాలో ప్రారంభించి రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. గ్రామాలకు తాగునీరు అందించి పల్లెవాసుల మనసులో చెరగని ముద్రవేశారు. గుంటూరు దాహార్తి తీర్చేందుకు రూ.6.50 కోట్లతో తక్కెళ్లపాడు రావాటర్ ప్లాంటు నుంచి తక్కెళ్లపాటు నీటిశుద్ధి ప్లాంటు వరకు రెండో పైప్‌లైన్ నిర్మాణం చేపట్టారు. తమ నీటికష్టాలు తీర్చిన మహానేతను నగరవాసులు నేటికీ గుర్తు చేసుకుంటున్నారు. రూ.460 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన తాగునీటి పథకానికి ఆయనే అంకురార్పణ చేశారు. నీటిపారుదల రంగం అభివృద్ధి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గుంటూరు జిల్లాలో జలయజ్ఞం పథకం కింద పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం, నాగార్జున సాగర్, జవహర్ కాలువలు, కృష్ణా, పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులను చేపట్టారు. మొత్తం మీద నీటిపారుదల రంగానికి దాదాపు రూ.6 వేల కోట్లు ఖర్చుచేసి జిల్లా రూపు రేఖలనే మార్చారు. డెల్టాకు గుండె.. పులిచింతల గుంటూరు, కృష్ణా జిల్లాలకు పులిచింతల ప్రాజెక్టు గుండె వంటిది. ప్రధానంగా విజయవాడ, గుంటూరు నగరాల తాగునీటి అవసరాలు తీర్చడంతోపాటు, కృష్ణా పశ్చిమ డెల్టాకు ఆయువుపట్టు లాంటిది పులిచింతల. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 15వ తేదీన ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.682 కోట్లతో పనులు చేపట్టారు. ప్రాజెక్టు సామర్థ్యం 47.45 టీఎంసీలు. ఆ తరువాత ఈ ప్రాజెక్టు అంచనాలు పెరిగాయి. ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తికావచ్చిన దశలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. పులిచింతల నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వచేయలేని దుస్థితి దాపురించింది. దాహార్తి తీర్చేందుకు.. గుంటూరు నగరంలో తాగునీటి కష్టాలు తీర్చేం దుకు రూ.480 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో తాగునీటి పథకానికి తొలుత దివంగత మహా నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంకురార్పణ చేశారు. తెనాలిలో నగరబాటలో భాగంగా 2008 జనవరిలో రూ.97 కోటతో రక్షిత మంచి నీటి పథకానికి ఆయనే శంకుస్థాపన చేశారు. ఐదేళ్లలో 57సార్లు పర్యటన గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రీ తిరగని రీతిలో డాక్టర్ రాజశేఖరరెడ్డి 57 సార్లు గుంటూరు జిల్లాలో పర్యటించారు. దీనిని బట్టే ఆయనకు జిల్లా ప్రజలపై ఎంతటి మమకారం ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా ప్రజ లకు చిరకాల స్వప్నంగా నిలిచిపోయిన పులిచింతల ప్రాజెక్టును 2004 అక్టోబర్ 15వ తేదీన రూ.682 కోట్లతో శంకుస్థాపన చేశారు. నిరుపేదల పాలిట అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో గుంటూరు నుంచే ఆయన అంకురార్పణ చేశారు. ఇందిరప్రభ ద్వారా 13 వేల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచారు. రాజీవ్ పల్లెబాట కార్యక్రమానికి ఇక్కడే శ్రీకారం చుట్టారు. దుర్గి మార్కెట్ యార్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. సాగర్ కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులు నాగార్జున సాగర్‌ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో 2008లో రూ.4444 కోట్లతో చేపట్టారు. ఈ పనుల్లో భాగంగానే గుంటూరు జిల్లా పరిధిలోని ప్రధాన కాలువ, బ్రాంచ్ కాలువ ఆధునికీకరణ పనులు, డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టారు. కుడికాలువ పరిధిలో లైనింగ్ పనులను చేపట్టారు. ఈ పనులను 2018 జూలై నాటికి పూర్తి చేయాలని నిర్ధేశించారు. అయితే ఇప్పటి వరకు రూ.2,832.69 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇందులో ప్రపంచ బ్యాంకు వాటా 48 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 52 శాతం. అయితే అప్పటి డాలర్ మారకం విలువకు, ప్రస్తుతం డాలర్ మారకం విలువకు తేడా ఉన్నందున అదనంగా రూ.900 కోట్లతో పనులు చేసుకోవచ్చని ఇటీవల ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఈ నిధులు మురిగిపోయాయి. జిల్లాలో కృష్ణా పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనుల కోసం 2008లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.835.33 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో కేవలం రూ.390.83 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ జీవితం రాజన్న చలవే నేను వ్యవసాయ కూలీని. రెక్కల కష్టం తోనే జీవనం. 2012లో గుండె జబ్బు వచ్చింది. డాక్టర్లు అర్జంటుగా ఆపరేషను చేయాలన్నారు. డబ్బులెట్టారా బగమంతుడా..? అనుకుని మథనపడుతుంటే, వైఎస్ రాజశేఖరరెడ్డి గారిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డును గుర్తుచేశారు మావోళ్లు. హమ్మయ్య అనుకుని నిబ్బరంగా కూర్చుండిపోయా. విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో గుండె ఆపరేషను చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుతోనే రెండున్నర లక్షల రూపాయల ఆపరేషన్‌ను ఊరికే చేశారు. మాది రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఆ మహానుభావుడు రాజన్న వల్ల నాకు పునర్జన్మ కలి గింది. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నానంటే అది ఆయన చలవే. ఆరోగ్యంగా జీవిస్తూ పొలం పనులకూ వెళ్తున్నా. వైఎస్ చేసిన మేలును మా కుటుంబం జీవితంలో మరువదు. – దేశబోయిన పోతురాజు, గుడివాడ, తెనాలి మండలం, గుంటూరు జిల్లా వైఎస్‌ను మరువలేం మాది పేద కుటుంబం. నాన్న పూర్ణశేఖర్ రాడ్ బెండింగ్ వర్కర్. నాన్న సంపాదనతో కుటుంబం గడవటం, ఇద్దరు ఆడపిల్లల్ని చదివించడమంటే కష్టం. ఉన్నత చదువులు చదవాలనేది నా ఆశయం. ఇంటర్ పూర్తయ్యాక ఫార్మసీ కోర్సు చేయాలని నా కోరిక. ప్రొఫెషనల్ కోర్సు ఫీజులను తట్టుకోలేని ఆర్థికశక్తి నాన్నది. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి అమల్లోకి తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ వరంలా కని పించింది. వైఎస్‌పై భారం వేసి ఎంసెట్ రాశా. అనుకున్నట్టే సీటొచ్చింది. తెనాలి ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో బీఫార్మసీ (నాలుగేళ్లు), ఆ తర్వాత ఎంఫార్మసీ (రెండేళ్లు) ఉచితంగా పూర్తిచేశా. బీఫార్మసీలో ఏఎంఎన్ ప్రొఫెషనల్స్ నుంచి ‘బెస్ట్ స్టూడెంట్ అవార్డు’, ఎంఫార్మసీలో ‘టాప్ యాగ్రిగేడ్’, పదికి పది సీజీపీఏ సాధించా. నా ప్రతిభను మెచ్చిన కాలేజీ యాజమాన్యం నన్ను టీచింగ్ ఫ్యాకల్టీగా తీసుకోవటంతో చదువవగానే ఉద్యోగం వచ్చింది. పీహెచ్డీ చేయబోతున్నా. వైఎస్ లాంటి ఆలోచనలున్న నాయకుడు అధికారంలో ఉంటే నాలాంటి పేదలు ఎందరో ఉన్నత చదువులతో తమ జీవితాల్లో వెలుగులు నింపుకొంటారు. నాతోపాటు ఎంతో మందికి ఉచితంగా ఉన్నతవిద్య అందించి, జీవితంలో స్థిరపడేందుకు దారిచూపిన వైఎస్‌ను మరువలేం. – ఇల్లా ప్రజ్ఞ, టీచింగ్ ఫ్యాకల్టీ, ఏఎస్ఎన్ ఫార్మజీ కాలేజీ, తెనాలి వైఎస్సార్ చలువతోనే మా బిడ్డకు మాటలు పండంటి బాబు పుట్టాడని సంబరపడ్డాం. బాబుకు హేమవెంకట శివన్నారాయణగా నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటూ వచ్చాం. బాబు ఎదుగుదల బాగున్నా పిలిస్తే పలికేవాడు కాదు. నోట ఒక్క మాటా రాలేదు. వైద్యులను సంప్రదిస్తే బాబుకు పుట్టుకతోనే వినికిడి శక్తి లేదని ఆపరేషన్ చేసి, ఏవో యంత్రాలు పెడితే వినగలుగుతాడని తేల్చిచెప్పారు. లక్షల రూపాయల ఖర్చవుతుందన్నారు. మా ఆయన దేవరకొండ కిషోర్‌బాబు చిన్నపాటి టిఫెన్ సెంటర్ నిర్వహిస్తారు. అంత ఖర్చు భరించే శక్తి మా కుటుంబానికి లేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తెచ్చాక మా కష్టాలు తీరాయి. 2010లో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో బాబుకు రూ.7లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ను ఉచితంగా చేశారు. ప్రస్తుతం మా బాబు అన్నీ వినగల్గుతున్నాడు. మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. ఇది వైఎస్సార్ చలవే. – దేవరకొండ సౌజన్య, చిలకలూరిపేట -
వైఎస్ రాజశేఖర రెడ్డి 'చరిత్రకే ఒక్కడు'
వైఎస్సార్... ఈ పేరు వింటేనే మదిమదిలో మరపురాని జ్ఞాపకాలు మెదులుతుంటాయి. చరిత్రలో కనీవిని ఎరుగనిరీతిలో ప్రజలకు సుపరిపాలన అందించిన మహనీయుడు ఆయన. జనానికి మెరుగైన జీవనాన్ని కల్పించేందుకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు సువర్ణాక్షరాలతో లిఖించదగినవిగా నిలిచిపోయాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పునర్జన్మ పొందిన వేలాది మంది ఇంట ఆయన దేవుడయ్యాడు. ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడిన పేద విద్యార్థుల గుండెల్లో చిరస్మరణీయుడిగా మిగిలారు. మళ్లీ ఆయన పాలన కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లా ప్రజల గుండె చప్పుడు మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి. జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్నో అభివృద్ధి పనులకు వైఎస్సార్ బీజం వేశారు. దుర్భిక్ష పరిస్థితులు అనుభవిస్తున్న డెల్టా రైతుల కడగండ్లు తుడిచారు. జిల్లాలో వరదలు వచ్చి రైతులు విలవిల్లాడుతున్నప్పుడు నేనున్నానంటూ భరోసా ఇచ్చి కర్షక పక్షపాతిగా నిలిచారు. బందరు పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రైతుల సుదీర్ఘ స్వప్నంగా మారిన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ పనులను ఉరకలెత్తించారు. వేలాదిమంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు నూజివీడులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుచేశారు. లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో తోడ్పాటునందించిన మహోన్నత వ్యక్తి వైఎస్సార్. లక్షలాది మందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించి ప్రాణదాతగా మారారు. జన హృదయనేతగా పేరుగాంచారు. ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంటు తదితర పథకాలతో అందరి మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. పేదలు అడగకుండానే ఆయన అనేక మేళ్లు చేశారు. తెల్లరేషన్ కార్డులు, ఇళ్లు, పింఛన్లు.. ఇలా ఏది కావాలన్నా ఆచరణలో అమలుచేసి చూపించారు. రైతన్నకు అండగా కృష్ణా డెల్టా ఆధునికీకరణ.. కృష్ణా డెల్టాకు వరదలు వచ్చినప్పుడు జిల్లా రైతులు పడుతున్న కష్టాలను చూసి వైఎస్ చలించిపోయారు. అన్నపూర్ణగా పేరుగాంచిన కృష్ణా డెల్టా ముంపునకు గురవుతోందని భావించి 2008 జూన్ 6న మోపిదేవి వార్పు సర్ అర్ధర్ కాటన్ విగ్రహం వద్ద డెల్టా ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. కృష్ణా డెల్టా పరిధిలో 13.06 లక్షల ఎకరాలున్నాయి. రూ. 4,573 కోట్లతో డెల్టా ఆధునికీకరణ పనులకు ఆయన పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. ఇందులో 40 శాతం ఆయన హయాంలోనే పూర్తయ్యాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 25 శాతం మాత్రమే పూర్తయినట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారంటే పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. వేలాది మంది విద్యార్థులకు చేయూత.. జిల్లాలో 2008లో నూజివీడులో త్రిపుల్ ఐటీని ఏర్పాటు చేసి జిల్లా ఖ్యాతిని పెంచేశారు. ఇప్పటి వరకు 6వేల మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డ వేలాది మంది విద్యార్థుల గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచారు. అలాగే పేద కుటుంబాలకు అండగా నిలబడ్డారు. పెరిగిన పింఛన్లు.... 2004కు పూర్వం చంద్రబాబు పాలనలో జిల్లాలో 53 వేల మందికి మాత్రమే పింఛన్లు అందేవి. వైఎస్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో పింఛన్లు పొందేవారి సంఖ్య 2.34 లక్షలకు పెరిగింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కూడా ప్రతి ఏటా దాదాపు 25 వేల మంది వరకు వైద్య సాయం పొందారు. వైఎస్ హయాంలోనే జిల్లాలో 5 లక్షలు ఉన్న తెల్లరేషన్ కార్డుల సంఖ్య 11 లక్షలకు పెరిగింది. అందరికీ బియ్యం, పామాయిల్, పంచదార కచ్చితంగా అందేవి. గన్నవరం ఐటీపార్కు ఆయన పుణ్యమే.. వ్యవసాయ ఆధారితమైన కోస్తా ప్రాంతంలో ఐటీ పార్కు ఏర్పాటు ద్వారా వైఎస్సార్ అభివృద్ధికి బాటలు వేశారు. గన్నవరం మండలంలోని కేసరపల్లిలో ఏపీఐఐసీ, ఎల్అండ్టీ సౌజన్యంతో నిర్మించిన ఐటీపార్కు మొదటి టవర్‌లో 12 కంపెనీలు పూర్తిస్థాయిలో తమ కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం 2,500 మంది ఐటీ విద్యార్థులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇంటి ఆడపడుచు కోసం రూ. 100 కోట్లు.. విజయవాడ నగరపాలక సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చివరకు సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ స్థితిలో నాటి మేయర్ రత్నబిందు కాంగ్రెస్ కార్పొరేటర్లను తీసుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ను కలిసి పరిస్థితి వివరించారు. అక్కడున్న కార్పొరేటర్ శిష్టా రామలింగమూర్తి శ్రావణమాసంలో శుక్రవారం మేయర రత్నబిందు మీ వద్దకు వచ్చిందని చెప్పగానే.. వైఎస్ పెద్ద నవ్వుతూ ఇంటి ఆడపడచువు వచ్చావు... కార్పొరేషన్‌ను అప్పుల ఊబిలోంచి బయట పడవేస్తానంటూ అప్పటికప్పుడు రూ. 100 కోట్లు మంజూరు చేసిన ఘనుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. పులిచింతలకు శ్రీకారం.. కృష్ణా డెల్టా రైతుల చిరకాల వాంఛ పులిచింతల ప్రాజెక్టుకు 2004లో వైఎస్ శంకుస్థాపన చేశారు. ఆయన హయాంలో 90 శాతం పనులు పూర్తి కాగా.. ఆ తర్వాత వచ్చిన పాలకులు మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎనిమిదేళ్ల సమయం తీసుకున్నారు. అయితే ఇప్పటికీ ఈ ప్రాజెక్టు వినియోగంలోకి రాకపోవడం గమనార్హం. ఈ ప్రాజెక్టులో 45.77 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. కృష్ణా డెల్టాను స్థిరీకరించవచ్చు. ఇక శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చేయాలనే మహా సంకల్పంతో జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. కుడి ప్రధాన కాలువ పనుల్ని 80 శాతం ఆయన హయాంలోనే పూర్తి చేశారు. ఇప్పుడు జరిగిన కృష్ణా–గోదావరి సంగమానికి అప్పుడు ఆయన శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ హయాంలోనే బందరు పోర్టుకు శంకుస్థాపన 1994 నుంచి బందరు పోర్టు డిమాండ్ జాతీయస్థాయిలో వినిపించినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. బందరు చారిత్రక నేపథ్యం కలిగిన పట్టణం. బందరు పోర్టు నుంచి 1604వ సంవత్సరం నుంచే ఫ్రెంచ్, డచ్, దేశస్తులు సరుకుల ఎగుమతులు, దిగుమతులు చేయడం ప్రారంభించారు. గత 30 ఏళ్లుగా ఈ పోర్టు నుంచి సరుకులు ఎగుమతులు, దిగుమతులు స్తంభించాయి. ఈ నేపథ్యంలో 2003 నుంచి బందరు పోర్టును నిర్మించాలని కోరుతూ ఉద్యమాలు ఉధృతమయ్యాయి. 2007లో బందరు పోర్టును నిర్మించాలని కోరుతూ 100 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టారు. 10 రోజుల పాటు ఆమరణ దీక్షలు జరిగాయి.దీంతో స్పందించిన దివంగత ముఖ్యంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బందరు పోర్టు నిర్మాణానికి నడుం బిగించారు. ఈ నేపథ్యంలో పోర్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సాధ్యాసాధ్యాలను పరిశీలించి బందరు పోర్టు నిర్మించాలని నిర్ణయించారు. 2008 ఏప్రిల్ 23న రూ. 1,500 కోట్లతో పోర్టు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్సార్ మరణించడంతో మళ్లీ బందరు పోర్టు వ్యవహారం మరుగునపడింది. బందరు ప్రజల ఆందోళన ఫలితంగా మళ్లీ 2012 మే 12న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు 5,324 ఎకరాల భూమిని సేకరించేందుకు జీవో ఇచ్చింది. కానీ ఉత్తర్వులు అమలు కాలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు బందరు పోర్టును నిర్మిస్తామని గొప్పగా ప్రకటించారు. అయితే పోర్టు పేరుతో 1.05 లక్షల ఎకరాల రైతులు భూములు తీసుకొని కార్పొరేట్, విదేశీ కంపెనీలకు ధారదత్తం చేయడానికి ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో బందరు పోర్టు కోసం 28 గ్రామాల్లో 33 వేల ఎకరాల భూమిని తీసుకోవడానికి నోటీఫికేషన్ జారీ చేశారు. వాస్తవానికి పోర్టు నిర్మాణానికి 4,800 వేల ఎకరాలు సరిపోతుంది. కానీ వేల ఎకరాల భూమిని తీసుకోవడానికి యత్నిస్తూ రైతుల జీవితాలతో టీడీపీ సర్కారు చెలగాటమాడటంపై రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రీయింబర్సుమెంటుతోనే చేయూత నేను 2008లో భాస్కరరావుపేట హైస్కూల్లో చదివి బాసర ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యాభ్యాసం చేశాను. ఇప్పుడు కానిస్టేబుల్‌గా ఎంపికై మచిలీపట్నంలో ఉద్యోగం చేస్తున్నాను. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం వల్లే నేను ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం సాధించగలిగాను. నా పై ఆధారపడిన కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. వైఎస్సార్ మరణం తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సక్రమంగా అమలుకావడం లేదు. – మామిడిశెట్టి హనుమంతరావు, కానిస్టేబుల్, మూలలంక, కలిదిండి మండలం నిత్యం పూజలు చేస్తున్నాం మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందటాన్ని టీవీలో చూస్తూ నాభర్త చింతయ్య గుండె ఆగి మరణించాడు. మా కుటుంబాన్ని పరామర్శించటానికి వైఎస్ జగన్‌బాబు మా ఇంటికి రావటాన్ని మా కుటుంబ సభ్యులం జీవితంలో మరచిపోలేము. నాభర్త మృతి చెందే నాటికి కుమార్తెకు పెళ్లి చేయగా, తరువాత కూలీ పనులు చేసుకుంటూ పెద్ద కుమారుడికి పెళ్లి చేశాను. చిన్న కుమారుడు చదువు కుంటున్నాడు. నాభర్త ఫొటో పక్కన రాజన్న ఫొటోను పెట్టుకొని నిత్యం పూజలు చేస్తున్నాం. జగన్‌బాబు ఈసారి తప్పక గెలుస్తాడు – కె. సోమమ్మ, పెనుగంచిప్రోలు -
పారిశ్రామికీకరణ పరుగులు
సాక్షి, అమరావతి : వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ విస్తరించాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగారు. పెట్టుబడులు రావడంలో సగటున 54 శాతం వృద్ధి నమోదు కావడమే కాకుండా.. పెట్టుబడుల ఆకర్షణలో ఏడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. 2007–08లో ఆర్బీఐ గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ స్థాయి వృద్ధి రేటును అంతకు ముందు ముఖ్యమంత్రులుగానీ.. ఆయన మరణించాకగానీ ఎవ్వరూ అందుకోలేకపోయారు. ఐటీ, ఇన్ఫ్రా, ఫార్మా, తయారీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్.. ఇలా అన్ని రంగాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. శంషాబాద్ ఎయిపోర్టు, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే, బయోటెక్నాలజీ పార్క్, కృష్ణపట్నం పోర్టు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, కైజెన్ టెక్నాలజీస్ వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్ హయాంలోనే ప్రారంభమయ్యాయి. ఓడరేవు, నిజాంపట్నం, బందరు పోర్టు, విశాఖ–కాకినాడ పెట్రో కారిడార్, ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్, బ్రాహ్మణీ స్టీల్స్ వంటి అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసినా ఆయన మరణం తర్వాత వీటిలో కొన్ని ప్రాజెక్టులు ఒక అడుగు కూడా ముందుకు పడకపోగా.. కొన్ని అటకెక్కాయి. వైఎస్ శంకుస్థాపన చేసిన బందరు పోర్టు పనులను ఇప్పటికీ ప్రారంభించలేదు. ఎన్టీపీపీసీ–బీహెచ్ఈఎల్ ప్రాజెక్టు మూసివేత దిశగా సాగుతోంది. పెట్టుబడుల వరద.. వైఎస్ హయాంలో అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల విలువలో 269 శాతం వృద్ధి నమోదైంది. చంద్రబాబుసీఎంగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రానికి రూ.11,659 కోట్ల విలువైన పెట్టుబడులొస్తే.. వైఎస్ ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.43,117 కోట్ల విలువైన పెట్టుబడులొచ్చాయి. -
ఏపీకి వైఎస్సార్ లాంటి నాయకుడి అవసరం ఉంది
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ప్రజలతో మమేకమైన నాయకుడికి బలం ప్రజలే అని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిరూపించారని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చెప్పారు. వైఎస్సార్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇంటర్వ్యూ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. జనం నుంచి ఎదిగిన నేతగా రాజశేఖరరెడ్డిని అభివర్ణించారు. 2004 ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు లేకపోయినా.. గెలిపించి చూపించిన సాహసోపేత నేతగా పేర్కొన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రాజశేఖరరెడ్డి గురించి ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘‘2003లో అనుకుంటా.. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలవడం అంత సులభం కాదనే అభిప్రాయంతో వారంతా ఉన్నారు. కేంద్రం (వాజ్‌పేయి నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం) అండదండలు పుష్కలంగా ఉండటంతో భారీగా నిధులు కూడా ఆంధ్రప్రదేశ్‌కు అందుతున్నాయని చెప్పడం విన్నాను. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాను. మీ పార్టీ అధిష్టానం పెద్దలకే గెలుపు పట్ల పెద్దగా నమ్మకం లేదు కదా! మీ నమ్మకం ఏమిటి? మీ పాదయాత్ర వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారా? అని అడిగాను. ‘నాకు నా రాష్ట్ర ప్రజల పట్ల విశ్వాసం ఉంది. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాను. ప్రజలు నాతో ఉంటే నన్ను, పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరు’ అని ఆయన సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పింది నిజమయింది. 2004–2014 వరకు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉందంటే.. అది రాజశేఖరరెడ్డి చలువే. ఆయనకు పార్టీ రుణపడి ఉండాలి. ఆయన లేకుంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం అందేది కాదు. -
ఐటీ అదరహో
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం పరుగులు పెట్టింది. ఏటా ఐటీ ఎగుమతులు రెట్టింపు అవుతుండటమే కాకుండా.. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడప, వరంగల్ వంటి పట్టణాలకు సైతం విస్తరించారు. ఈ సమయంలో కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతో పాటు మైక్రోసాఫ్ట్ మూడో దశ, విప్రో రెండో దశ పనులు మొదలయ్యాయి. అంతేకాదు ఆయన హయాంలో యూఎస్ కాన్సిలేట్ ఏర్పాటు కావడంతో అమెరికాకు వెళ్లే ఐటీ విద్యార్థులు, ఉద్యోగులకు కలిసొచ్చింది. వైఎస్ హయాంలోనే 50 వేల ఎకరాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఆర్) ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. వైజాగ్, కాకినాడ, తిరుపతి, కడప, వరంగల్ పట్టణాలకు ఐటీ విస్తరణ వైఎస్ హయాంలో రూ.5,025కోట్లనుంచి రూ. 33,482కోట్లకుచేరిన ఎగుమతులు వైఎస్ హయాంలో 85,000నుంచి 2,85,000 దాటిన ఉద్యోగుల సంఖ్య సాక్షి, అమరావతి : వైఎస్ హయాంలో ఐటీ ఎగుమతుల్లో 566 శాతం వృద్ధి నమోదైంది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన నాటికి ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.5,025 కోట్లు మాత్రమే.. వైఎస్ అధికారం చేపట్టాక ఐటీ ఎగుమతులు వేగం పుంజుకున్నాయి. ఏటా సుమారు రెట్టింపు వృద్ధిని నమోదు చేస్తూ 2009–10 నాటికి రూ.33,482 కోట్లకు చేరాయి. అలాగే బాబు తొమ్మిదేళ్ల పాలనలో 900 ఐటీ కంపెనీలొస్తే.. వైఎస్ ఐదేళ్ల పాలనాకాలంలో ఏకంగా 1,400కు పైగా కంపెనీలు రావడం గమనార్హం. ఇదే సమయంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. బాబు హయాంలో ఐటీ రంగం ద్వారా 85,000 మందికి ఉపాధి లభిస్తే.. వైఎస్ శకం ముగిసే నాటికి 2,85,000 మందికి మించి ఉపాధి లభించింది. వైఎస్ చనిపోవడానికి రెండేళ్ల ముందు నుంచి ఐటీ ఉద్యోగుల కల్పనలో ఏకంగా 50 శాతానికి పైగా వృద్ధి నమోదయ్యేది. ఈ స్థాయి వృద్ధిని ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందిపుచ్చుకోలేదు. -
మెరుపు వేగం.. వైఎస్ సొంతం
వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఆ పేరు వింటేనే ప్రజల్లో అదో జోష్. ఆయన పనితీరూ అంతే! వేగం..ప్రజాహితం అనుకుంటే చాలు మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవడం ఆయనకే సొంతం.ఈ క్షణం చేజారితే ఈ సందర్భం మళ్లీ రాదేమో.. అన్నంత శీఘ్రంగా ఆయన పాలనలో ఫైళ్లు పరుగెత్తేవి. ఒక్కసారి మదిలోకి వస్తే చాలు ఆ పనికి ఎంత ఖర్చవుతుంది? ఎలాంటి క్లిష్టమైన అడ్డంకులున్నాయి? అనుమతులున్నాయా లేదా..? అని కూడా చూడరు.ప్రజలకు మేలు జరిగేదేదైనా వెంటనే అమలుచేయాలన్న లక్ష్యమే ఆయనకు కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల మూడు నెలల కాలంలో జనహితం కోసం తీసుకున్న నిర్ణయాలవల్ల అనేక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు అమలులోకి వచ్చాయి. వాటిలో మచ్చుకు కొన్ని.. –సాక్షి, అమరావతి సంతృప్త స్థాయిలో అందరికీ అన్నీ.. ఎన్నికలపుడే రాజకీయాలు.. ఆ తర్వాత అందరూ ఒకటే.. సంక్షేమ పథకాలు లబ్ధిపొందడానికి అర్హత ఉండాలి కానీ రాజకీయాలు కావని ఎప్పుడూ చెప్పే వైఎస్ సంతృప్త స్థాయిలో (అర్హులైన వారందరికీ) పథకాల లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో వైఎస్‌తో కలిసి అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ కార్యక్రమంలో పాల్గొని కారులో తిరిగి వస్తూ.. ‘ఎక్కడకు వెళ్లినా సంచుల కొద్దీ దరఖాస్తులు వస్తున్నాయి? ఏం చేద్దాం అన్నా..’ అని ప్రశ్నించారట. ‘రేషన్‌కార్డులు, ఇళ్లు, పింఛన్లు అర్షులందరికీ ఇచ్చేస్తే ఈ అర్జీలకు ముగింపు పలకొచ్చు’ అన్నారట. వెనువెంటనే ఆ మేరకు సంతృప్త స్థాయిలో అందరికీ పథకాలు ఇవ్వాలనే విధానానికి వైఎస్ రూపకల్పన చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఓ సారి అప్పటి భారీ సాగునీటి పారుదల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య , వైఎస్ వద్దకు వెళ్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మిస్తే దానివల్ల కలిగే ఉపయోగాన్ని వివరించారు. వెనుకా ముందు చూడకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు శంకుస్థాపనకు తేదీని ఖరారు చేయండి.. డీపీఆర్ సంగతి తర్వాత చూసుకుందామని వైఎస్ జవాబిచ్చారు. అంతేకాదు, ప్రాజెక్టు శంకుస్థాపనకు వెళ్లినపుడు నీటి స్టోరేజి కోసం మరో ఐదారడుగులు డ్యాం ఎత్తు పెంచితే బాగుంటుందని ఇంజినీర్లు చెప్పడంతో అక్కడికక్కడే ఒక నిర్ణయం తీసుకుని పెంపునకు ఆదేశాలిచ్చారు. ఈ రెండు నిర్ణయాలూ జలయజ్ఞంలో మైలు రాళ్లుగా మిగులుతాయి. భూపాలపల్లి విద్యుత్ ప్రాజెక్టు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు నీళ్లు, బొగ్గు తరలించుకుపోతున్నారని, తెలంగాణలోనే విద్యుత్ ఉత్పాదన ప్లాంటును నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని నాటి మంత్రి పొన్నాల, వైఎస్ దృష్టికి మరో సందర్భంలో తీసుకువెళ్లారు. వెంటనే 500 మెగావాట్ల ప్రాజెక్టును నిర్మించడానికి వైఎస్ అంగీకారం తెలిపి శంకుస్థాపనకు సిద్ధమయ్యారు. అందుకు వైఎస్‌తో పాటుగా పొన్నాల వెళ్తుండగా.. హెలికాప్టర్ నుంచి కిందికి చూపుతూ.. బొగ్గు, నీటి లభ్యత ఉంది కాబట్టి మరో 600 మెగావాట్ల ప్రాజెక్టు కూడా ఏర్పాటుచేస్తే బావుంటుందని సూచించారు. సభలోకి వైఎస్ వెళ్లగానే ఈ మేరకు ప్రకటన చేశారు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చిన్నారులకు ప్రభుత్వ నిధులతోనే గుండె ఆపరేషన్లు చేయించాలన్నది వైఎస్ తీసుకున్న నిర్ణయాల్లో అమోఘమైనది. రెండేళ్లలోపు చిన్నారుల గుండెలకు రంధ్రాలు పడి మరణిస్తున్నారని, ఆ పిల్లల తల్లిదండ్రులకు చికిత్స చేయించుకునే స్తోమత లేకపోవడమే ప్రధాన కారణమని వైఎస్ దృష్టికి వచ్చినప్పుడు అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుని ఉచితంగా ఆపరేషన్లు చేయించే పథకాన్ని అమలులోకి తెచ్చారు. కిలో రూ.2కే బియ్యం పథకం కిలో బియ్యం రూ.2కే అందజేయాలనే నిర్ణయం కూడా అప్పటికప్పుడు తీసుకున్నదే. ఈ అంశంపై అధికారుల సమీక్షా సమావేశంలో వారు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. మరో రెండు రోజులు ఆగి క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుందామని అన్నారు. ‘రెండు రోజులాగితే నా మనసు మార్చవచ్చని మీరనుకుంటున్నట్లుంది’ అని వైఎస్ అధికారులను తోసి రాజని అప్పటికపుడు టీవీలకు, పత్రికలకు ఈ నిర్ణయం వెల్లడించాల్సిందిగా ఆదేశించారు. రూ.50 గ్యాస్ సబ్సిడీ గుంటూరు పర్యటనలో వైఎస్ ఉండగా ఓసారి కేంద్రం వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచినట్లు వార్త వెలువడింది. ఈ భారం సబబు కాదని గృహిణులకు వెసులుబాటును ఇవ్వాలనే ఉద్దేశంతో, ఏ మేరకు భారం పడుతుందో.. అప్పటికపుడు లెక్కలను రూపొందించాలని అధికారులను కోరారు. గంట వ్యవధిలో సమాచారాన్ని తెప్పించుకుని రూ.50 సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అక్కడే బహిరంగ సభలో ప్రకటించి వెనుదిరిగారు. మన్నవరం ప్రాజెక్టుపై ఏకంగా ప్రధానితోనే.. చిత్తూరు జిల్లా మన్నవరం విద్యుత్ పరికరాల ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో మూడు రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడింది. దీనిపై వైఎస్ రాజశేఖరరెడ్డి అసాధారణ రీతిలో నేరుగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ఫోన్లో మాట్లాడి మన రాష్ట్రానికి వచ్చేలా చేశారు. వైఎస్ మన్నవరం కోసం ప్రధానితో నేరుగా ప్రాజెక్టు కావాలంటూ వాదనకు దిగి సాధించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలానీ.. బిట్స్ పిలానీ క్యాంపస్ హైదరాబాద్‌కు వచ్చిందంటే అది కేవలం వైఎస్ తీసుకున్న మెరుపు నిర్ణయమేనన్నది నిర్వివాదాంశం. బిట్స్ (పిలానీ), బిట్స్ (గోవా) క్యాంపస్‌లతో పాటు దక్షిణాదిలో కూడా విస్తరించాలని బిట్స్ పాలకవర్గం భావిస్తున్న విషయాన్ని తెలుసుకున్న వైఎస్.. వెంటనే వారికి లేఖ రాసి ‘మీకు ఏం కావాలంటే అది ఇస్తాం. ఎలాంటి రాయితీకైనా సిద్ధం’ అని తెలిపారు. దీంతో వారు అందుకు సమ్మతించి హైదరాబాద్ క్యాంపస్‌ను మంజూరు చేశారు. శామీర్‌పేట్ వద్ద వైఎస్ 250 ఎకరాల స్థలాన్ని కేటాయించడమేకాక, రోడ్డు, విద్యుత్, మంచినీరు వంటి సౌకర్యాలను యుద్ధప్రాతిపదికన కల్పించేలా శ్రద్ధ తీసుకున్నారు. ప్రారంభోత్సవానికి వైఎస్ వెళ్లినపుడు అక్కడికక్కడే ల్యాండ్ కన్వర్షన్ చార్జీలను కూడా రద్దుచేశారు. అమెరికన్ కాన్సులేట్ నడిచొచ్చింది దక్షిణాదిలో చెన్నైకు తోడు మరోచోట అమెరికన్ కాన్సులేట్‌ను ఏర్పాటుచేయాలని అమెరికా సంకల్పించి అందుకు బెంగళూరు నగరాన్ని ఎంపిక చేసుకుంది. ఇక ప్రారంభించడమే తరువాయి అనుకున్న తరుణంలో.. హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ హాష్మీ, అంతర్జాతీయ వ్యాపారవేత్త లుత్వీ హసన్, వైఎస్‌ను కలిసి తమకో అవకాశం ఇస్తే బెంగళూరుకు బదులుగా హైదరాబాద్‌కు కాన్సులేట్‌ను తేగలమన్నారు. ఇదివరకే నిర్ణయం అయిన దాన్ని మీరెలా మార్చగలుగుతారు? అందులోనూ అమెరికా తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన జరుగుతుందా? అని వైఎస్ అనుమానం వ్యక్తంచేస్తూనే.. ‘అయినా ప్రయత్నించండి, వారికి (యూఎస్‌కు) ఏం కావాలంటే మనం ఆ సౌకర్యాలను కల్పిద్దాం’ అని వారితో అన్నారు. వారు రంగంలోకి దిగి బెంగళూరుకు ఖరారైందనుకున్న కాన్సులేట్‌ను హైదరాబాద్‌కు తెచ్చారు. యూఎస్ అధికారులు ఎంపిక చేసుకున్న ‘పైగా’ ప్యాలెస్‌లోని హుడా కార్యాలయాన్ని ఖాళీ చేయించి వారికిచ్చారు. తొలి సంతకానికి తోడు బకాయిలూ రద్దు 2004లో అధికారం చేపట్టిన వైఎస్.. తన తొలి సంతకంతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అమలులోకి తెచ్చారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, అప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలో రైతులు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు రూ.1,250 కోట్ల వరకూ ఉన్నాయి. ముఖ్యమంత్రి కాగానే ఏర్పాటైన తొలి విలేకరుల సమావేశంలో ఎవరూ ఊహించని రీతిలో రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇవ్వడమే కాదు, ఈ రోజు వరకూ ఉన్న వారి విద్యుత్ బకాయీలన్నింటినీ కూడా మాఫీ చేస్తున్నానని ప్రకటించారు. దీంతో అప్పటివరకూ బకాయిల కారణంగా తొలగించిన లక్షలాది వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్లను పునరుద్ధరించారు. గెయిల్‌ను ఒప్పించి.. గ్యాస్‌ను రప్పించి.. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) గ్యాస్ ఇస్తుందని చెప్పి 2,700 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ఉత్పాదనా ప్రాజెక్టులకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం 2004కు ముందు అనుమతిచ్చింది. తీరా గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు పూర్తయిన తరువాత, గెయిల్ గ్యాస్ సరఫరా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. తమ ప్రాజెక్టులకు గ్యాస్ సరఫరా చేయలేకపోయినా ప్రైవేటు ఉత్పత్తిదారులకు ఏటా రూ.1,200కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ప్రజలపై పెనుభారంగా పరిణమించినపుడు వైఎస్ తాను అధికారంలోకి వచ్చాక గెయిల్‌తో చర్చలు జరిపి గ్యాస్ కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎరువుల ఫ్యాక్టరీలకు తాము తొలి ప్రాధాన్యంగా గ్యాస్ సరఫరా చేస్తున్నాం కనుక విద్యుత్ ప్రాజెక్టులకు ఇవ్వలేమని గెయిల్ అధికారులు చెప్పారు. అయితే, ఎరువుల ఫ్యాక్టరీలు ఓవర్ హాలింగ్ కోసం ఏడాదిలో ఒక నెల రోజులపాటు ఉత్పత్తిని నిలిపివేస్తాయి కనుక ఆ సమయంలో వారికి సరఫరా చేయని గ్యాస్‌ను తమ రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టులకు ఇవ్వాల్సిందిగా వైఎస్ కోరారు. రూ.1,200 కోట్ల భారాన్ని ప్రజలపై పడకుండా చేశారు. కార్మిక సంక్షేమం కోసం.. వైఎస్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలనే ప్రతిపాదన వచ్చినపుడు ఉన్నతాధికారులు ఈ అంశంపై ఓ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇదంతా ఎందుకు? ‘మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచడానికి ఇన్ని లెక్కలా! వచ్చే నెల నుంచి వారి జీతాలు పెంచండి! అంతే’ అని నిర్ణయాన్ని ప్రకటించి నిష్క్రమించారు. హైదరాబాద్ శివారులో పేదలకు గృహాలు నగరంలో నివసించే పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదని, అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇద్దరూ కలిసి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వారికి అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రశాంతంగా ఆలకించిన వైఎస్ పెద్దగా స్పందించలేదు. కానీ ఆ మరుసటి రోజే రాజీవ్ గృహకల్ప కాలనీలకు అంకురార్పణ చేశారు. వైఎస్ వల్లే ఐసీఐసీఐ హబ్ సాకారం ఐసీఐసీఐ ప్రతినిధులు ప్రాంతీయ హబ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశం కోసం వెతుకుతున్నట్లు వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి రాగానే ఆయన వెంటనే స్పందించి.. ‘వాళ్లను రాష్ట్రానికి ఆహ్వానించండి.. మన దగ్గర హబ్ పెట్టేలా చూడండి. వారికేం సౌకర్యాలు, రాయితీలు కావాలో మనమిద్దాం’ అని అధికారులను ఆదేశించారు. దాని ఫలితంగానే నేడు అక్కడ 22వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేసేంత నలభై లక్షల చదరపు అడుగుల సామర్ధ్యంగల అతిభారీ ఆవరణ ఏర్పడింది. ఐసీఐసీఐ ఇక్కడి నుంచే తన వ్యాపార లావాదేవీలన్నీ పర్యవేక్షిస్తోంది. సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు తరచూ జరుగుతున్న తరుణంలోనే.. రైతులు,డ్వాక్రా మహిళలకు ఇస్తున్న తరహాలో చేనేత కుటుంబాలకు కూడా పావలా వడ్డీ వర్తింపజేయడంతో పాటు, రూ.5 లక్షల చొప్పున రుణాలను ఇస్తే బాగుంటుందన్న ఓ మంత్రి సూచనపై మరుసటి రోజే ప్రతిపాదనలు తెప్పించుకున్నారు. -
పేదల పెన్నిధి.. సంక్షేమ సారథి
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి జీవితాలు ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండేలా బాటలు వేసిన మహనీయుడు. ఆ మహానేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకమునుపు రాష్ట్ర ప్రజలు కనీస సదుపాయాల్లేక బతుకు భారమై బలవంతంగా తనువు చాలించాల్సిన పరిస్థితులు. ఆ సమయంలో రాష్ట్రానికి ఒక వేగుచుక్కలా.. ఒక దిక్సూచిగా వైఎస్ వచ్చారు. అంతకు ముందే కాదు.. ఆ తర్వాత కూడా ఎన్నడూ ఎవ్వరూ కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి సంక్షేమ పథకాలను వైఎస్ చేపట్టారు. కులమత రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ ఆ ఫలాలు అందేలా అమలుచేయించిన మహనీయుడు వైఎస్. నిధులతో సంబంధం లేకుండా పేదలకు మేలు జరుగుతుందనుకుంటే ఎంత ఖర్చయినా ఆ సంక్షేమ కార్యక్రమాలను వైఎస్ ముందుండి అమలుచేయించారు. అందుకే వైఎస్ మరణించి ఇన్నేళ్లయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి చెరగని ముద్రవేశారు. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, రుణమాఫీ, ఫీజు రీయంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, 108, 104, అభయహస్తం, ఇందిరా క్రాంతిపథం ఇలా ఎన్నో.. ఎన్నెన్నో. తొలి సంతకం నుంచే సంక్షేమానికి పెద్దపీట ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 మే 14న చేసిన తొలి సంతకం నుంచే సంక్షేమానికి బాటలు వేశారు. ఆరుగాలం కష్టపడి పంటలు సాగుచేసే రైతన్నల వెతలు తీర్చేలా ఉచిత విద్యుత్‌పై ఆయన చేసిన తొలి సంతకం చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అంతేకాక.. రూ.1,200కోట్ల వారి విద్యుత్ బకాయిలను కూడా ఒక్క సంతకంతో మాఫీ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జలయజ్ఞాన్ని చేపట్టి అన్ని సాగునీటి ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారు. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయించడానికి విశేష కృషి చేశారు. గతంలో ఎవరి ఊహకు రాని, తెలంగాణలోని ప్రాణహిత–చేవెళ్ల పథకానికి శ్రీకారం చుట్టించారు. ఇంకుడు గుంతల పేరిట అంతకు ముందు వేల కోట్ల నిధులను దోపిడీ చేసిన గత ప్రభుత్వాల వైఖరికి భిన్నంగా రైతుల పొలాల్లోకి సాగునీరు పారేలా ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. మహిళలకు అగ్రతాంబూలం మహిళలకు వైఎస్ పెద్దదిక్కుగా నిలిచారు. సంక్షేమ పథకాల్లో వారికి పెద్దపీట వేశారు. లక్షలాది ఇందిరమ్మ ఇళ్లను వారి పేరు మీదనే కట్టించారు. రాష్ట్రంలోని ఏ ఒక్కరూ సొంత ఇల్లు లేనివారు ఉండకూడదన్న సంకల్పంతో ప్రతి గ్రామంలోనూ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ప్రతినెల కొంత నగదు సమకూరేలా ఇందిరా క్రాంతిపథం, అభయహస్తం వంటి పథకాలతో మహిళలను ఆదుకున్నారు. రోజుకు ఒక్క రూపాయి చొప్పున నెలకు రూ.30 చెల్లిస్తే ఇలా చివరి వరకు ఆ మహిళ ఎంతమొత్తం కడితే అంతే మొత్తాన్ని ప్రభుత్వం అదనంగా జమచేసి ఆమె పేరున డిపాజిట్ చేస్తుంది. ఆ మహిళలకు 60 ఏళ్ల తరువాత ఈ మొత్తం ఆదుకునేలా ఏర్పాట్లు చేయించారు వైఎస్. దాదాపు 1.50 కోట్ల మంది మహిళలకు ఈ పథకం లబ్ధిచేకూర్చింది. స్వయం సంఘాల్లో దాదాపు 90 శాతం మంది మహిళలు చేరి రూ.1,755 కోట్లు కట్టగా ప్రభుత్వం దానికి కొంత మొత్తాన్ని కలిపి రూ.3,951 కోట్లు జమ చేయించింది. వీరికి బ్యాంకులు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం వైఎస్ హయాంలోనే ప్రారంభమైంది. అలాగే, 5061 కుటుంబాలు 4495.53 ఎకరాలు కొనుగోలు చేసుకుని వ్యవసాయం చేపట్టాయి. అంతేకాదు.. 30 లక్షల పంపుసెట్లకు ఐదేళ్లపాటు ఉచిత విద్యుత్.. రూ.32వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం.. అదనంగా 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయడంతో అప్పటివరకూ కరువు కాటకాలతో అల్లాడిన రాష్ట్రం వైఎస్ హయాంలో పుష్కలంగా వర్షాలు పడి ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. 199 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడితో దేశంలోనే అప్పటి ఉమ్మడి రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. అన్నదాతలకు అండగా.. వైఎస్ హయాంలో 90 లక్షల మందికి పైగా రైతులకు రుణాలు అందడమే కాకుండా వారందరికీ గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకం అమలుచేశారు. రుణమాఫీ కింద 69 లక్షల మంది రైతులకు చెందిన రూ.12వేల కోట్ల అప్పులు మాఫీ చేయించారు. రుణమాఫీ పరిధిలోకి రాని 32 లక్షల మంది రైతులకు రూ.5వేల చొప్పున రూ.1,600 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అమలుచేయించారు. పేదలకు 6.04 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయించడమే కాకుండా దాని అభివృద్ధికి రూ.500 కోట్లు ఇచ్చారు. గిరిజనులకు 13 లక్షల ఎకరాలను పంపిణీ చేయించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి రూ.1800 చొప్పున ఇచ్చారు. పశుక్రాంతి పథకం కింద లక్షలాది మంది రైతులకు పాడి గేదెలు, ఆవులు, గొర్రెలను పంపిణీ చేయించారు. రైతుల పంట దిగుబడులకు కనీవినీ రీతిలో గిట్టుబాటు ధరలు కల్పించారు. పింఛన్ పెంపు వైఎస్ హయాంలో వృద్ధులు, మహిళలకు ఇచ్చే పింఛన్‌ను రూ.70 నుంచి రూ.200లకు పెంచారు. వికలాంగులు, 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని మరింత పెంచారు. చంద్రబాబు కాలంలో పింఛనుదారుల సంఖ్య 16 లక్షలే. వైఎస్ ఆ సంఖ్యను 70 లక్షలకు చేర్చారు. మైనార్టీలకు విద్య ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయించడమే కాకుండా వారి స్కాలర్షిప్ బడ్జెట్‌ను రూ.127 కోట్లకు పెంచారు. విద్యుత్, బస్‌ఛార్జీలు పెంచకపోవడమే కాకుండా ఆ తరువాత కూడా మరో ఐదేళ్లు పెంచబోమని హామీ ఇచ్చిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. ఆరోగ్య ప్రదాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా పేద, మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.2 లక్షల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించారు. 942 వ్యాధులను అందులో చేర్చి రోగులకు అండగా నిలిచారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిని, గ్రామాలు.. పట్టణాల్లో అనారోగ్యానికి గురైన వారిని క్షణాల్లో ఆసుపత్రులకు చేర్చేందుకు 108 అంబులెన్స్‌లను వైఎస్ ప్రవేశపెట్టారు. గ్రామాల్లోని రోగులకు మందులు అందజేసేందుకు 104 సేవలు ప్రారంభించారు. నిరుద్యోగులకు సువర్ణయుగం చంద్రబాబునాయుడి తొమ్మిదేళ్ల పాలనలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకాక.. ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి లేక నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడారు. వైఎస్ పాలనలో ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 50 వేలకు పైగా టీచర్ పోస్టులు, 17వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీచేయించారు. మరో 53వేల టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇప్పించడమే కాకుండా ఎంపికైన వారికి హామీపత్రాల ద్వారా పోస్టులు ఇప్పించిన ఘనత వైఎస్‌ది. ప్రైవేట్ రంగంలో సెజ్‌ల ద్వారా దాదాపు 25 లక్షల ఉద్యోగాల కల్పనకు బాటలు వేయించారు. యువత కోసం రాజీవ్ ఉద్యోగశ్రీ, రాజీవ్ యువశక్తి పథకాలను అమలుచేయించారు. జలయజ్ఞంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కలిగేలా చేశారు. అలాగే.. ♦ చౌకధరల దుకాణాల ద్వారా రూ.105కే బియ్యం, పప్పు, ఉప్పు, ఆయిల్, చింతపండు, కారం తదితర తొమ్మిది సరుకులు పంపిణీ చేయించారు. ♦ పేదల పిల్లలు తమకు నచ్చిన ఉన్నత విద్యను అభ్యసించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఫీజు రీయంబర్స్మెంటును ప్రవేశపెట్టారు. అంతేకాక, వారికి స్కాలర్‌షిప్పులను భారీగా వైఎస్ పెంచారు. గ్రామీణ నిరుపేదలకు ఉన్నత సాంకేతిక విద్య అందించేందుకు ఐఐఐటీలను నెలకొల్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమమే ఉండడంతో పేదలకు అన్యాయం జరుగుతోందని భావించిన వైఎస్.. ఆరు వేల సక్సెస్ స్కూళ్లకు శ్రీకారం చుట్టించారు. ♦ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల ఇళ్లను నిర్మించారు. రాజీవ్ గృహకల్ప కింద 1.75 కోట్ల మందికి 20వేల కోట్లతో ఇళ్లు సమకూర్చారు. ♦ జలయజ్ఞం ద్వారా రూ.1.33లక్షల కోట్లతో 86 ప్రాజెక్టులు చేపట్టారు. ఇందులో దాదాపు సగానికి పైగా పూర్తిచేయడమే కాకుండా మిగిలిన వాటిని చివరి దశ వరకూ తీసుకువచ్చారు. ♦ చంద్రబాబు హయాంలో రూ.2 కిలో బియ్యాన్ని ఎత్తివేసి దాన్ని రూ.9కి పెంచేయగా వైఎస్ రాగానే మళ్లీ రూ.2కే కిలో బియ్యం పథకాన్ని చేపట్టడమే కాక.. అప్పటివరకు కుటుంబానికి 16 కిలోలుగా ఉన్న దాన్ని 20 కిలోలకు పెంచారు. ♦ వైఎస్‌కు ముందు చంద్రబాబు జమానాలో ప్రభుత్వోద్యోగులు నానా అవస్థలు పడగా.. వైఎస్ వారికి అన్ని మేళ్లు సకాలంలో చేకూర్చారు. పీఆర్సీ అమలు, డీఏలు వంటివి సకాలంలో అందించారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ♦ ఫీజు రీయంబర్స్మెంటు కింద ఒక్క 2009–10 ఏడాదిలోనే ఏకంగా రూ.2,300 కోట్లు విద్యార్థుల కోసం వెచ్చించారు. ♦ నేతన్నలకు, 60 ఏళ్లు పైబడ్డ మహిళలకు పింఛన్‌ను రూ.500 నుంచి రూ.2,200కు పెరిగేలా చేశారు. ♦ వైఎస్ హయాంలో రూ.6,500 కోట్లను విద్యుత్‌పై ఖర్చుచేసి వ్యవసాయ, పరిశ్రమ, సేవా రంగాలకు నిరంతర సరఫరా చేశారు. ♦ ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకో స్పెషలైజ్డ్ యూనివర్సిటీలతో పాటు 17 కొత్త యూనివర్సిటీల ఏర్పాటుచేయించారు. ఐఐటీ, ట్రిపుల్ ఐటీలు, బిట్స్ పిలానీ వంటి కొత్త సంస్థలను నెలకొల్పించారు. -
వైఎస్ తొమ్మిదో వర్ధంతి నేడు
సాక్షి, అమరావతి/వేంపల్లె : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి నిర్వహించి ఘనంగా నివాళులర్పించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు దేశ, విదేశాల్లోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. 2009 సెప్టెంబర్ 2న ‘రచ్చబండ’ కార్యక్రమానికి వెళుతూ ఆయన హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం విదితమే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అమలు చేసిన ప్రజాసంక్షేమ పథకాల వల్ల ఇప్పటికీ తెలుగు ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలను గుర్తుచేసుకుంటూ అన్ని చోట్లా కార్యక్రమాలు చేయబోతున్నారు. వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు వైఎస్‌కు నివాళులర్పించిన తరువాత సేవా కార్యక్రమాలు జరుగుతాయి. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో కూడా వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇడుపులపాయలో ఏర్పాట్లు పూర్తి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిలమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డిలతో పాటు ఇతర కుటుంబసభ్యులు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించనున్నారు. -
మహానేతా.. మళ్లీ రావా..
ఆయన మన మధ్య నుంచి దూరమై నేటికి తొమ్మిదేళ్లు.. కానీ ఇంకా మనందరి కళ్ల ముందే మెదులుతున్నారు.. ఆ రూపం, ఆ చిరునవ్వు అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.. పేదలను ఆదుకోవడానికి మనసుంటే చాలని నిరూపించారు.. లీడర్ అంటే ఇలా ఉండాలని ప్రతి రాజకీయ నాయకుడూ అనుకునేలా ఖ్యాతినార్జించారు.. ఆయన పథకాల పట్ల సర్వత్రా ప్రశంసలే.. ఎంతగా అంటే ఖండాంతరాలు దాటేంతగా.. అందుకే ఆయన ఇక లేరన్న వార్త వినగానే ఎన్నో గుండెలు ఆగిపోయాయి.. మరెన్నో గుండెలు తమ ఇంట్లో వ్యక్తిని కోల్పోయినంతగా తల్లడిల్లాయి.. తొమ్మిదేళ్లుగా ఆయన సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతీ గుండె ఆ మహానేత మళ్లీ రావాలని ఆకాంక్షిస్తోంది... నాయకుడంటే ఎలా ఉండాలి అనేదానిపై ప్రపంచంలో పలువురు ప్రముఖులు అనేక నిర్వచనాలు ఇచ్చారు..అనేక సూత్రీకరణలు చేశారు.. తెలుగునేలపై ఈ నిర్వచనాలన్నిటికీ ఒక లీడర్ అచ్చుగుద్దినట్లు సరిపోయాడు..లీడర్‌షిప్‌కే రోల్ మోడల్‌గా నిలిచాడు.. ఆయన మాట ఇస్తే అది శిలాశాసనమే.. హరిహరాదులు ఏకమైనా అది నెరవేరితీరాల్సిందే.. జీవితకాలంలో మాటతప్పడం కానీ.. మడమ తిప్పడం కానీ లేనేలేవు.. అన్నార్తులకు, అభాగ్యులకు మేలు చేయడానికి అహరహం తపించాడు... ఎన్ని ఆటంకాలు, పరిమితులు ఎదురైనా అనుకున్నది చేసిచూపించాడు..పేదలను ఆదుకోవడానికి ఏ నిబంధనా అడ్డురాకూడదని పరితపించాడు. అందుకే ఆయన మహానాయకుడయ్యాడు..ఆయనకు జనమే తమ గుండెల్లో గుడికట్టి పూజిస్తున్నారు..ఆయన జ్ఞాపకాలను మదిలో పదిలంగా పొదువుకున్నారు..ఆయన మరెవరో కాదు దివంగత ముఖ్యమంత్రి ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి.. జనం గుండెలోతుల్లో కొలువైన మహానేత వైఎస్ఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్ పాలించింది ఐదేళ్ల మూడునెలలు... కానీ వందేళ్లకు సరిపడనన్ని విజయాలు సాధించారు. అన్ని రంగాలలోనూ తనదైన ముద్ర వేశారు. విజన్లు ప్రకటించకపోయినా అనేక తరాలపాటు రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు అవసరమైన అనేక చర్యలు చేపట్టారు.. విజనరీగా నిరూపించుకున్నారు.. విధి వక్రించకుండా ఉండి ఉంటే.. ఆయనే ఉండి ఉంటే.. ఈ పరిణామం ఇలా చోటుచేసుకునేది కాదు అని ఇప్పటికీ అందరూ పదేపదే గుర్తుచేసుకోవడం వైఎస్ఆర్ ఎంతటి మహానాయకుడో తెలియజేస్తుంది. హృదయాంతరాల్లోంచి వచ్చిన మాటే ‘మహానేత’ వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక వందలాదిమంది తనువులు చాలిస్తుంటే.. కోట్లాదిమంది శోకతప్త హృదయాలతో తల్లడిల్లిపోయారు.. తమకు, తమ కుటుంబాలకు ఆయన చేసిన మేళ్లను తలుచుకుని కుమిలిపోయారు. ఆ ‘మహానాయకుడి’ మరణాన్ని తట్టుకోలేక గుండెలవిసేలా రోధించారు... అలా రోధించే హృదయాలే ఆయనను ‘మహానేత’ అని పిలిచాయి. వారి హృదయాంతరాళాల్లోంచి స్పాంటేనియస్‌గా పుట్టుకొచ్చిన మాటే ‘మహానేత’. మహానాయకుడి అడుగుజాడలు.. ఎంతకాలం బతికామన్నది కాదు ఎలా బతికామన్నదే ముఖ్యమని వైఎస్ తరచూ అనేవారు. ప్రతి పేదవాడి మోములో చిరునవ్వు చూడాలన్న తపన, అన్ని వర్గాలకూ మేలు చేయాలన్న ఆకాంక్ష, పేదరికాన్ని సమూలంగా అంతరింపజేయాలన్న కసి, అనితర సాధ్యమైన దార్శనికత, మంచిని తలపెట్టిన తర్వాత ఇక దేనికీ తలవంచని తత్వం, స్వపర బేధాలకు తావివ్వని సౌజన్యశీలత, అసాధ్యమని అందరూ ఆక్షేపించిన ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి చూపడం, సాహసోపేత నిర్ణయాలను కూడా శరవేగంగా తీసుకోవడం, అద్భుతమైన అభివృద్ధి గణాంకాలు.. విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం.. ఇవీ వైఎస్ఆర్ను మిగిలిన నాయకులకు భిన్నమైనవాడిగా.. మహానాయకుడిగా నిలిపాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సాహసి.. కుల, మత, ప్రాంత, జాతి పరభేదాలు పట్టించుకోకుండా, పార్టీలకతీతంగా సంతృప్త స్థాయిలో అందరికీ అందేలా సంక్షేమ పథకాలను అమలు చేసిన తీరు ప్రజలందరికీ వైఎస్‌ను దగ్గర చేసింది. వైఎస్ పాలనలో లబ్ధి పొందని వృత్తిగానీ, వ్యక్తిగానీ, వర్గంగానీ ఏదీ లేదు. అట్టడుగు వర్గాలను ఆయన పట్టించుకున్నట్టుగా మరో ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ఆరోగ్యశ్రీ వంటి బృహత్తర పథకాన్ని అంతకుముందు ఏ ముఖ్యమంత్రీ ఆలోచించి అమలుచేయలేకపోయారు. రైతుల జీవితాలలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఉచిత విద్యుత్ వంటి పథకం అసాధ్యమనే అందరూ చెప్పినా సుసాధ్యం చేసిన ఘనత వైఎస్ సొంతం. పేద విద్యార్థులకు పెద్ద చదువులు అంతకుముందు కలలోనైనా ఊహించని విషయం. ‘చదువుకోవడమే మీ బాధ్యత.. ఫీజులు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత’ అనే కొత్త నిర్వచనం చెప్పారు.. పెన్షన్ల పెంపుదల, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహకల్ప, కిలో రెండు రూపాయల బియ్యం, పావలావడ్డీకి రుణాలు , 108, 104... ఇలాంటి పథకాలను సాహసోపేతంగా అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. వైఎస్ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు వ్యవసాయాన్ని పండగ చేశాయి. మొత్తం బడ్జెట్ లక్షకోట్లు లేని సమయంలో కూడా లక్షకోట్లతో 87 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలన్న ఆలోచన చేయడం మరెవరికైనా సాధ్యమేనా?.. రైతాంగం పట్ల ఆయనకున్న తపన ఆయనను అలా పురికొల్పిందేమో.. కోటి ఎకరాలను సాగునీరందించాలన్న పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఎంత గుండె కావాలి? ఎంత పెద్దమనసుండాలి? అందుకే ఆయన మహానేతగా మన్ననలందుకున్నారు. ప్రతి అడుగులోనూ పేదలపై మమకారం.. వైఎస్ఆర్ అత్యంత విలక్షణమైన, విశిష్టమైన, అరుదైన రాజకీయవేత్త అని ఆయనను దగ్గరగా గమనించిన నాయకులంటుంటారు. ప్రతిపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజలతో సంబంధాలు కొనసాగించడం ద్వారా సమకాలీన రాజకీయనాయకులకంటే భిన్నంగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను రూపొందించిన పథకాలు, ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తాను తీసుకున్న కార్యాచరణ ఆయన్ని ప్రజలకు మరింత చేరువ చేసింది. ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకునే ప్రత్యేక ధోరణి మిగిలిన నాయకులకు వైఎస్‌ను భిన్నంగా నిలిపింది. ప్రతి పంచాయతీలోనూ వైఎస్ పేరుపెట్టి పిలిచే నాయకులుండేవారు. వేలాదిమందిని పేరు పెట్టి పిలవగలిగేవారంటే ప్రజల పట్ల ఆయనకున్న మమకారం అర్ధం చేసుకోవచ్చు. స్వభావరీత్యా వచ్చిన లక్షణం కాకుంటే అదెలా సాధ్యమౌతుంది? అది ఒక్క వైఎస్ఆర్కే సాధ్యం. ముఖ్యమంత్రి అంటే ఏసీ రూములకే పరిమితమని, ఎపుడోగానీ జిల్లా పర్యటించరని అనుకునే రోజుల్లో సీఎం ఆఫీసును గ్రామ సచివాలయంలా మార్చేశారు. సామాన్యులు కూడా సీఎంను కలుసుకుని తమ బాధలు చెప్పుకునే వేదికలా మార్చారు.. ప్రతినిత్యం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వందలాదిమందిని తెల్లవారు ఝామునుంచే కలిసిన తర్వాతే దినచర్య మొదలుపెట్టడం మరెవరికైనా సాధ్యమయ్యే పనేనా? అందుకే ఆయన మహానేత అయ్యారు. సీఎం సహాయనిధి నుంచి ఆరుగంటల్లోనే సాయం అందాలని, తాను ఎక్కడ ఉన్నా ఆ సాయం అందడంలో జాప్యం జరగరాదని వైఎస్ తీసుకున్న నిర్ణయం పేదల పట్ల ఆయన ఎంత నిబద్దతతో ఉండేవారో తెలుసుకునేందుకు అద్దం పడుతుంది. ఇలాంటివే ఆయనను మహానేతను చేశాయి. ఐదేళ్ల పదవీ కాలంలోనే ఒక నాయకుడు పేద బడుగు బలహీన వర్గాల జనజీవితంలో విప్లవాత్మకమైన, సమూలమైన మార్పులు తీసుకురాగలడా.. అది సాధ్యమేనా.. వంటి అనేక సందేహాలను పటాపంచలు చేసినందునే వైఎస్ మహానాయకుడయ్యాడు. -
కోట్లాది ప్రజల గుండెల్లో వైఎస్సార్
రైతుల సంక్షేమానికి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు రాజశేఖరరెడ్డి పేరు చెప్పగానే గుర్తుకొస్తాయి. రైతన్నలు, సాగునీటి ప్రాజెక్టులతో వైఎస్‌కు అవినాభావ సంబంధం ఉంది. లక్షలాది ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి ప్రారంభించిన పోలవరం, పులిచింతల, పోతిరెడ్డిపాడు, కాళేశ్వరం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్ పేరు శాశ్వతంగా జనంలో నిలిచిపోవడానికి కారణమయ్యాయి. ఈ ప్రాజెక్టుల్లో కొన్ని ఆయన జీవితకాలంలోనే పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం కొన్ని ప్రాజెక్టుల విషయంలో కొందరు పాలకులు నామమాత్రపు మార్పులు, చేర్పులు చేసి పేర్లు మార్చినాగాని పెద్దాయనే వీటికి రూపుదిద్దారనే వాస్తవం ప్రజలకు తెలుసు. పేదలు, ప్రభుత్వ సాయం అవసరమైన బడుగువర్గాల సంక్షేమానికి వైఎస్ ఎంతగా అంకితమయ్యారో చెప్పడానికి ఆదివాసీలకు 8 లక్షల ఎకరాల భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక్కటే సరిపోతుంది. ఇలా సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. 2003 వేసవిలో పాదయాత్ర ముగిసే సమయం వరకూ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోని ఇతర సీని యర్ నాయకుల్లో ఒకరేగాని కాంగ్రెస్ పార్టీలో రాజీ పడని యోధునిగా జనాదరణ సంపాదించారు. పాద యాత్రలో పేద ప్రజల కష్టాలు ఆయన కళ్లారా చూశారు. వివిధ వర్గాల జనం అవసరాలపై పూర్తి అవగాహన కలిగింది. పాదయాత్ర పూర్తయ్యేనాటికి వైఎస్సార్ పూర్తిగా మారిన మనిషి అయ్యారు. ప్రజా జీవితంలో రాజకీయ నాయకుని పాత్రపై ఆయన అవగాహనలో సంపూర్ణ మార్పు వచ్చింది. ఆయనే స్వయంగా చెప్పినట్టు కోపం నరం పూర్తిగా తెగి పోయింది. ముఖంపై చెరగని చిరునవ్వే ఆయన వ్యక్తిత్వానికి చిహ్నంగా మారింది. తొమ్మిదేళ్ల క్రితం ఈ లోకం విడిచి వెళ్లాక కూడా ఆయన చిరునవ్వే ప్రజలను నిత్యం పలకరిస్తోంది. ముఖ్యమంత్రి పద విని అధికార పీఠంగా ఆయన ఎన్నడూ అనుకోలేదు. బాధ్యతకు, జవాబుదారీతనానికి, ఆత్మవిశ్వాసానికి సాధనంగానే ఆయన చూశారు. పేదల రక్షకునిగా ఆయన వ్యవహరించారు. సీఎంగా ప్రమాణం చేశాక ప్రజా సంక్షేమమే ఆయన లక్ష్యం అయింది. అందుకే ఆయనను పెద్దాయనగా పేదలు ఇప్పటికీ పిలుచు కుంటున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసి దాదాపు దశాబ్దం కావస్తున్నా తెలుగు రాష్ట్రాల్లోనేగాక దేశవ్యాప్తంగా వైఎస్సార్ అత్యంత ప్రజాదరణ కలి గిన నేతగా నిలబడిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో అధి కారం చేపట్టాక వైఎస్సార్ ఎన్నెన్నో సంక్షేమ కార్య క్రమాలు రూపొందించి ప్రవేశపెట్టారు. వాటి ప్రయో జనాలు గరిష్ట లేదా సంతృప్త స్థాయిలో ఉంటేనే పేద రికాన్ని నిర్మూలించడం సాధ్యమౌతుందని ఆయన నమ్మారు. ప్రజాసమస్యలు, కార్యక్రమాల రూపక ల్పన, అమలు, వాటి తీరు పరిశీలన వంటి విష యాల్లో వైఎస్సార్ ఎవరికి లేనంత శక్తి, ఉత్సాహం, ఓర్పుతో పనిచేశారు. చేతికందిన సమాచారాన్ని జల్లె డపట్టి సత్యాసత్యాలు గ్రహించి ప్రజల కోసం ఆయన పనిచేసిన పద్ధతి అనితర సాధ్యం. అద్భుతమైన జ్ఞాప కశక్తి కూడా ఆయన పాలన జనరంజకంగా సాగడా నికి కారణమైంది. ప్రజా సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల విషయంలో నిబంధనలేవైనా అడ్డంకిగా మారితే, ‘జనహితం తర్వాతే నిబంధనలు, నియ మాలు’ అని ఆయన బాహాటంగా చెప్పడమేగాక ఆచ రణలో చేసి చూపించేవారు. ఈ కారణంగానే వైఎస్ జనాదరణ సంపాదించి, 2009 ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి అధికారంలోకి రాగలి గారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాతాలో 33 లోక్‌సభ స్థానాలు పడేలా చూసి, కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు బలోపేతం కావడానికి ఆయన కారకుల య్యారు. మరే రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఇన్ని సీట్లు రాకపోవడం విశేషం. వైఎస్‌కు అనూహ్యమైన రీతిలో పెరుగుతున్న జనాదరణ ప్రతిపక్షంలోని, కాంగ్రెస్‌లోని కొన్ని అసం తృప్త శక్తులకు మింగుడు పడలేదు. అసూయతో ఇలాంటి నేతలు రగిలిపోయారు. అయితే, ఆయ నకు, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా ఏమీ చేసే ధైర్యం ఆయన బతికున్నంత వరకూ ఈ శక్తులకు లేకుండాపోయింది. వైఎస్ మరణించాక ఈ దుష్ట శక్తులు తమ అసలు రూపం ప్రదర్శించాయి. వైఎస్ బాటనే ఎంచుకున్న ఆయన కుటుంబ సభ్యులకు ఎన్నో ఇబ్బందులు సృష్టించాయి. అయితే జననేత మార్గంలోనే పయనం ప్రారంభించిన ఆయన కుమా రుడు జగన్మోహన్రెడ్డి తండ్రి మాదిరిగానే తిరుగు లేని ధైర్యసాహసాలతో ప్రజల కోసం పోరాటం కొన సాగించారు. ఈ క్రమంలో బలమైన నేతగా ఎది గారు. ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ జాతు లకు కేటాయించిన అన్ని అసెంబ్లీ స్థానాలను (పశ్చిమ గోదా వరి జిల్లాలోని ఒక స్థానం మినహా) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే వైఎస్‌పై ఆదివాసీలకున్న అభిమానానికి ఇది అద్దం పడు తోంది. వైఎస్ హయాంలో మొదలై, అమలైన సంక్షేమ కార్యక్రమాల కారణంగా ఆదివాసీలకు ఆయన దేవుడయ్యారు. ఏపీలో ప్రస్తుత ప్రభు త్వం గిరిజన ప్రాంతాల్లో సిమెంటు రోడ్లు నిర్మిస్తూ అధునాతన కమ్యూనికేషన్ సౌకర్యాలు, పింఛన్లు, రేషన్లు కల్పిస్తోంది. అయినా, పాలకపక్షా నికి వారు దగ్గరవలేదు. వైఎస్‌పై ఉన్న ప్రేమాభిమానాలు శాశ్వ తంగా నిలిచిపోయాయి. పోడు సాగుచేసే ఆదివాసీ లకు రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పట్టాలు ఇవ్వడంతో వారు తాము దున్నే భూములకు యజమానుల య్యారు. సీఎంగా ప్రమాణం చేశాక ఆదివాసీలకు తాము సాగుచేసే భూముల పట్టాలు లేవనే విషయం వైఎస్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులకు గిరిజను లకు భూమి పట్టాలు ఇవ్వాల్సిన అవసరం గురించి అర్థమయ్యేలా చేశారు. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఆదివాసీ చట్టానికి భారత ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చేలా ఆయన ఒత్తిడి తీసుకొచ్చి ఫైలు కది లేలా చేశారు. ఫలితంగా పోడు భూములు సాగు చేసే ఆదివాసీలకు పట్టాలు ఇవ్వడం వైఎస్ ప్రభుత్వా నికి సాధ్యమైంది. పట్టాలు ఇవ్వడానికి మొదట ఆది వాసీల సాగులో ఉన్న భూములు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 12 లక్షల ఎకరాలని గుర్తించారు. 2009 సెప్టెంబర్‌లో మరణించే వరకూ దాదాపు 8 లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి ఆదివాసీ రైతులకు పట్టాలు ఇప్పించారు. అందుకే ఆదివాసీల ఆదరాభిమానాలు రాజశేఖరరెడ్డికి ఏ ముఖ్యమంత్రికీ లేనంతగా లభించాయి. కాని, పెద్దాయన కన్నుమూ శాక ఈ పోడు భూముల పట్టాల కార్యక్రమం కింద ఒక్క ఎకరా భూమికి కూడా గిరిజనులకు పట్టాలు ఇవ్వకపోవడం నిజంగా బాధాకరం. పేదలు, బడు గువర్గాల సంక్షే మానికి వైఎస్ ఎంతగా అంకితమ య్యారో చెప్పడానికి ఆదివాసీలకు భూమి పట్టాల కార్యక్రమం ఒక్కటే సరిపోతుంది. రైతుల సంక్షేమానికి చేపట్టిన సాగునీటి ప్రాజె క్టులు రాజశేఖరరెడ్డి పేరు చెప్పగానే గుర్తుకొస్తాయి. లక్షలాది ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి ప్రారంభించిన పోలవరం, పులిచింతల, పోతిరెడ్డి పాడు, కాళేశ్వరం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్ పేరు శాశ్వతంగా జనంలో నిలిచిపోవడానికి కారణ మయ్యాయి. ఈ ప్రాజెక్టుల్లో కొన్ని ఆయన జీవితకా లంలోనే పూర్తయ్యాయి. ఆయన మరణానంతరం కొన్ని ప్రాజెక్టుల విషయంలో కొందరు పాలకులు నామమాత్రపు మార్పులు, చేర్పులు చేసి పేర్లు మార్చినాగాని పెద్దాయనే వీటికి రూపుదిద్దారనే వాస్తవం ప్రజలకు తెలుసు. ఇలా సంక్షేమ కార్యక్ర మాలతో వైఎస్ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. కరుణాకర్ -
రాజకీయాలకు కొత్త భాష్యం వైఎస్సార్
జనం మెరుగైన జీవితాన్ని సాగించడానికి అవసరమైన పరిస్థితులను సృష్టించగలిగిన వాడే రాజకీయ నాయ కుడు. ఆ విధంగా పరిస్థి తుల్ని, వ్యక్తుల్ని, సమాజాన్ని పురోగమనం వైపు మార్చడంపై ఆలోచించి, ఆచరించిన దార్శనికుడు, ఉదారవాది, జనరంజక పాలకుడు, జనాకర్షక నాయకుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచి పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆయనొక ధృవతార. దిశానిర్దేశం చేసిన తార. జన ఆకాంక్షలకు ఆయనొక ప్రతీక. జనం గుండెల్లో ఎన్నటికీ చెరపలేని ముద్ర ఆయనది. నమ్మకం ఆయన ఇంటిపేరయింది. సంక్షేమం ఆయన నిరంతరం ఆలోచించే ‘నిరుపేదల పేరు’ అయింది. ఆయన అనుకుంటే కాంగ్రెస్ మరణశయ్య నుంచి ఏపీలో లేచి కూచుంటుంది. ఆయన నవ్వుతూ చేయి ఊపితే గెలువలేని నేత కూడా గెలిచి కూర్చుంటాడు. ఆయన కృషితో కేంద్రంలోనే పార్టీ అధికారంలో కూర్చుంటుంది. ఆయన ఆదేశిస్తే జనం కోసం రిలయన్స్ వంటి బడాబాబులూ, మోన్శాంటో వంటి విత్తనాధిపతులూ మెడలు దించాల్సిందే. ఒక్క బిడ్డయినా చదువుకోలేదంటే ఆయన కంట్లో కన్నీళ్లు కారతాయి. ఒక్క మనిషైనా వైద్యం పొందలేకుంటే ఆయన గుండె తరుక్కుపోతుంది. ఒక నోట్లో ముద్ద పడకున్నా ఆయన çహృదయం అల్లాడి పోతుంది. ఒక్క రైతు అప్పులతో సతమతమవుతున్నా ఆయన మనస్సు గిలగిలా కొట్టుకుంటుంది. ఒక్క రైతుకు సాగునీరు లేకున్నా, కరెంటు లేకున్నా, గిట్టుబాటుధర, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లేకున్నా ఆయన కుదురుగా కూర్చోలేడు. ఒక్క పేద మహిళకు పావలా వడ్డీకి రుణం అందకున్నా ఆయన ఆవేదన ఆపలేనిద వుతుంది. పార్టీలకు అతీతంగా, ప్రభుత్వ పథకాల మేళ్లు ఓ ఒక్కరికి అందకున్నా ఆయన అధికారులను పరుగెత్తిస్తాడు. అది విద్యా సమస్యా, వైద్య సమస్యా, రైతు సంక్షేమమా, మహిళాభివృద్ధా, యువతకు ఉద్యోగ, ఉపాధులా, వృద్ధులు, దివ్యాం గులు, వితంతు పింఛన్లు వంటి అవసరాలా ఇంకేదైనానా అనే దాంట్లో తేడా ఉండదు. ఇక ఆయన ముస్లిం రిజర్వేషన్లు ఒక సంచలనం. ఆయన ప్రవేశ పెట్టిన ఎస్సీ, ఎస్టీ పథకాలు ఊహకందనివి. బీసీ సంక్షేమ కార్యక్రమాలు నిత్యనూతనాలు. అసలు ఆయన మేనిఫెస్టోనే తప్పనిసరిగా ‘చేసితీరే పట్టిక’. అది అన్నివర్గాల ప్రజలకూ మేలు చేసే రాజన్న శాసనం. అందుకే ఆయన్ని తప్పుగా ఒక్క మాటన్నా జనం చేతులు పైకి లేస్తాయి. ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమాల్ని చెరపాలనుకునేవాళ్లకు జనం రాజకీ యంగా బుద్ధి చెబుతారు. ఆయనంటేనే జనం పడి చస్తారు. అందుకే ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక వందలాది జనం కన్నుమూశారు. ఇది, ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన ఒకే ఒక్క అరుదైన సంఘటన. అందుకే, ఆయన పథకాల్ని నీరుగార్చి, ఆయన ప్రతిష్టను తగ్గించాలనుకొనే సీఎంలు కూడా వాటిని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రద్దు చేయలేకున్నారు. ఇంతటి మహానేత కావుననే జనం ఆయన్ను రాజన్న అని ముద్దుగా... వైఎస్సార్ అని గౌరవంగా పిలుచుకొంటున్నారు. అసలు, జనం దృష్టిలో ఆయనొక ‘విరాట్ స్వరూపం, జగన్ ఆయన అంశం. ఇందుకు కారణం, భారతీయ సంస్కృతిలో ‘పదిమందికి మంచిపనులు చేసి, మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో, జనాన్ని నడిపిన వ్యక్తి ‘దేవుడు’గా పరిగణిస్తారు. ‘పదిమందికి’ చెడుపనులు చేసి, చెడు మాటలు చెప్పి చెడు మార్గంలో జనాల్ని నడిపిన వ్యక్తిని రాక్షసుడుగా పరిగణిస్తారు. అంటే మానవుల్లోని ఉన్నతమైన గుణాలకు ప్రాచీన మానవులు దైవస్థానం ఇచ్చారు. అలాంటి గుణాలు గల వారిని దైవం అన్నారు. అందుకే జనం గుండెల్లో ఇప్పటికీ వైఎస్సార్ దైవంగా నిలిచిపోయి ఉన్నాడు. ఆయన ‘ఆత్మ’ జగన్ రూపంలో, విజయ పథంలో నడిపిస్తోన్న పార్టీగా జనం ‘వైఎస్సార్సీపీ’ని భావిస్తున్నారు. అందుకే, ‘ఆత్మ’ లేని పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోయింది. ‘సంక’కెత్తుకొన్న అన్ని పార్టీలనూ ‘చిదిమేసిన’ బాబు టీడీపీ కోసం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అర్రులు చాస్తోంది. అంతో ఇంతో మిగిలివున్న కాంగ్రెస్ ఓటర్లేమో ఇందిరమ్మ ‘ఆత్మప్రబోధం’ బాటలో పయనించి వైఎస్సార్ ఆత్మ ఉన్న జగన్ పార్టీకే ఓటు వేయడానికి సిద్ధపడుతున్నారు. (సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి) వ్యాసకర్త : డా‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, విశ్రాంత ఆచార్యులు, చరిత్రశాఖ, ఎస్వీ యూనివర్సిటీ ‘ 98495 84324 -
చదువుకు భరోసా
-
రాజన్న మాట
-
నాటా వేడుకల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
-
సంక్షేమానికి మారుపేరు వైఎస్సార్
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే సంక్షేమానికి మారుపేరుగా పేరొందిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వైఎస్ 69వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. అప్పట్లో రాష్ట్రంలో ఏదైనా పథకం ప్రారంభిస్తే అది చిరస్థాయిగా నిలిచే విధంగా వైఎస్సార్ ఆలోచనా విధానం ఉండేదన్నారు. మహానేత హయాంలో చేపట్టిన పథకాలు ఆయన మరణించాక కూడా పాలక ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని ఉదహరించారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతుల కళ్లలో సంతోషం చూసిన ఏకైక సీఎం ఒక్క వైఎస్సార్ మాత్రమేనని కొనియాడారు. పేదవాడు కష్టాలు మర్చిపోయి హాయిగా నిద్రపోయే రోజులు మళ్లీ రావాలంటే అది వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌తోనే సాధ్యమని బొత్స అన్నారు. వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లుగా యావన్మంది ప్రజలు వైఎస్సార్‌ను తలచుకుంటున్నారన్నారు. వైఎస్సార్ మొదలు పెట్టిన యజ్ఞాన్ని ఆయన వారసుడు జగన్ త్వరలో పూర్తిచేస్తారని చెప్పారు. ఆయన పాదయాత్రతో ఏపీకి మళ్లీ మంచిరోజులు వస్తాయన్న విశ్వాసం ప్రజల్లో పెరుగుతోందన్నారు. 2019లో రాజన్న పాలన వస్తుందన్నారు. వైఎస్సార్సీపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మహానేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. రాజన్న రాజ్యం వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు. అంతకుముందు పార్టీ నేతలు వైఎస్ విగ్రహానికి నివాళులర్పించి భారీ కేక్ కట్ చేశారు. పార్టీ నేత డాక్టర్ ప్రఫుల్లారెడ్డి ఏర్పాటుచేసిన చీరలను మహిళలకు, అంధులకు స్టిక్స్, బ్యాగులు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జాతీ య కార్యదర్శి రెహమాన్, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, విజయచందర్, ప్రపుల్లారెడ్డి, ఎన్ఆర్ఐ వెంకట్ మేడపాటి, బొడ్డు సాయినాథ్ రెడ్డి, నాగదేశి రవికుమార్, బి. మోహన్‌కుమార్, వెల్లాల రామ్మోహన్, బండారు వెంకటరమణ, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, కె. ప్రభాకర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్ కారణజన్ముడు!
సాక్షి ప్రతినిధి, కడప/విజయవాడ సిటీ/ : ‘వైఎస్ రాజశేఖరరెడ్డి కారణజన్ముడు. దేవుడు అప్పగించిన పనిని సక్రమంగా నెరవేర్చి దేవుని సన్నిధికి చేరుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ రాజకీయాల్లో ఆయన రోల్‌మోడల్‌గా నిలిచారు. ఒక మంచి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏమి చేయగలరో చేసి చూపించిన వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దివంగత నేత సతీమణి వైఎస్ విజయమ్మ రచించిన ‘నేను కాను.. క్రీస్తే’అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్ ఘాట్‌లో వైఎస్ విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పటికీ ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. రాజకీయాల్లో రోల్‌మోడల్‌గా నిలిచారని, మంచి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏమి చేయాలో ప్రజలకు ఎలాంటి పాలన అందించాలో చేసి చూపించారని కొనియాడారు. తండ్రిలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రజలకు మంచి చేయాలని పాదయాత్ర చేస్తున్నారని ఆమె వివరించారు. తండ్రికి ఉన్న ఉద్దేశాలు ప్రతీదీ నెరవేర్చాలని జగన్ కోరుకుంటున్నారని ఆమె వివరించారు. సంక్షేమ పథకాలు సంపూర్ణంగా ప్రజల మధ్యలో ఉండాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశిస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా రాజన్న ప్రభుత్వం మళ్లీ రావాలని కోరుకుంటున్నారని, దేవుడు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నానని వైఎస్ విజయమ్మ విశ్వాసం వ్యక్తంచేశారు. వైఎస్‌ను మంచి భర్తగా, మంచి రాజుగా, మంచి సీఎంగా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది హృదయాల్లో నిలిపినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. కాగా, ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరితో పాటుగా వివిధ జిల్లాల్లో రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. -
‘వైఎస్ పథకాలు దేశానికే స్ఫూర్తిదాయకం’
సాక్షి, అనంతపురం : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప దార్శనికుడని, ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే స్ఫూర్తిదాయకమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. నేడు వైఎస్ జయంతి సందర్భంగా మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్‌దేనని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితే మళ్లీ రాజన్నయుగం వస్తుందని చెప్పారు. వైఎస్సార్ ఆశయాలు సాధించేందుకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
ప్రాణదాత
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 69వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలు ఆ మహానేత నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇడుపులపాయలో జరిగిన జయంతి వేడుకల్లో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి వైఎస్ షర్మిల, ఈసీ గంగిరెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు బొత్స సత్యనారాయణ, వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, వాసిరెడ్డి పద్మతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్బంగా సంక్షేమానికి వైఎస్ జగన్ మారు పేరని బొత్స కొనియాడారు. అనంతరం భారీ కేకును కట్ చేశారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ క్యార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్యయ్య, షబ్బిర్ అలీ, కేవీపీ రామచంద్రరావులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కళ్లూరు మండలం షరిన్ నగర్లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు బైక్ ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తేర్నకల్ సురేందర్ రెడ్డి, రాజా విష్ణు వర్ధన్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. పలు సేవా కార్యక్రమాలు చిత్తూరులో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సిఎస్ఐ చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు భారీ కేక్‌ను కట్ చేశారు. గుంటూరు, సత్తెనపల్లిలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదానం, రైల్వేస్టేషన్ వద్ద మహిళకు చీరల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. వినుకొండలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ను కట్ చేశారు. వైఎస్సార్ అనేది పేరు కాదు.. బ్రాండ్ విజయవాడ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా సమక్షంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ అనేది పేరు కాదని.. ఓ బ్రాండ్ అని రోజా పేర్కొన్నారు. విశ్వసనీయత, నమ్మకానికి మారు పేరు వైఎస్సార్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వెల్లంపల్లి, మల్లాది విష్ణు, తోట శ్రీనివాస్, బొప్పన భవకుమార్, యలమంచిలి రవిలు హాజరయ్యారు. అనంతరం వన్ టౌన్ పంజా సెంటర్లోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరులో నియోజకవర్గ కన్వీనర్ తానేటి వనిత ఆధ్వర్యంలో వైఎస్సార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. అనంతపురం జిల్లా, చెన్నేకొత్తపల్లిలో వైఎస్ఆర్ జయంతిని ఆయన అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ను కట్ చేశారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో పార్టీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. రక్తదానం కార్యక్రమంలో పాటు రోగులకు పండ్లు అందజేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం, చీమకుర్తిలో వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ఆ మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మానసిక వికలాంగుల స్కూల్లో పండ్లు పంపిణీ చేశారు. శ్రీకాకుళం, వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో నియోజకవర్గ కన్వీనర్ వి.ఆర్. ఎలిజా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆసుపత్రిలోని రోగులకు పాలు, పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వి.ఆర్. ఎలిజాతో పాటు జానకి రెడ్డి, బొడ్డు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలోని పట్టాణ మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నాయకులు ఆధ్యర్యంలో మహానేత జయంతి వేడుకలు జరిగాయి. మండల కేంద్రాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కృష్ణా జిల్లా నందిగామ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతిని పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. నందిగామ సమన్వయ కర్త డాక్టర్ జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ అరుణ్‌కుమార్, తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూజివీడు ఎమ్మెల్యే మేకాప్రతాప్ అప్పారావు ద్వారకా సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బసవా భాస్కరరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు పగడాల సత్యనారాయణ, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. విశాఖ పట్నంలోని ఏయూలో వైఎస్సార్సీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కాంతారావు ఆధ్యర్యంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్సీ అభ్యర్థులకు కరెంట్ అపైర్స్, జనరల్ స్టడీస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశాక పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైలాల విజయ్ కుమార్, విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు ఎంవీవీ సత్యనారయణతో పాటు ప్రొఫెసర్ ప్రేమనందం, ప్రొఫెసర్ భైరాగి రెడ్డి, విద్యార్థి సంఘం నేతలు పాల్గొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ ఇంచార్జీ సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ 69వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీకార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గవర్నమెంట్ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకోల్లు నరసింహరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి ఆధ్యర్యంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విసన్న పేటలోని లేఖన స్వచ్ఛంద సంస్థలోని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు ఎంపీపీ బి. రాణి, మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి దుర్గారావు, ఎస్ ప్రకాష్, కుటుంబరావు, దస్తగిరి, శివ, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో.. ఖమ్మం జిల్లా వైఎస్సార్సీసీ నాయకులు ఆధ్వర్యంలో మహానేత వైఎస్సార్ 69వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 180 విగ్రహాలకు పాలాభిషేకం మరియు అనేక చోట్ల కేక్ కటింగ్, ప్రసూతి ఆస్పత్రిలో బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లక్కినేని సుదీర్, రాష్ట్ర కార్యదర్శులు ఆలస్యం సుధాకర్ వెంకటరామిరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు, టౌన్ ప్రెసిడెంట్ అప్పి రెడ్డి, జిల్లా సేవాదళ్ సభ్యుడు రోసి రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కర్రి గంగాధర్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్సార్ 69వ జంయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ప్రభుత్వం ఆసుపత్రిలోని రోగులకు పండ్ల పంపిణీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు జెట్టీ రాజశేఖర్, తదితర నాయకులు వెఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పథకాలు అందించలేదు నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రహ్మణవేలెంలో వైఎస్సార్ విగ్రహానికి మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్‌ది. రాష్ట్రం విడిపోయినప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో మహానేత ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ అందించిన సంక్షేమ పథకాలను నేతలు కొనియాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం అరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమంలో వైయస్ఆర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ నేతలు వృద్ధులకు బ్రెడ్, పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలోని వైఎస్సార్సీపీ నాయకులు మానసిక వికలాంగుల కేంద్రంలో పండ్లు పంపిణీ చేశారు. నిజామాబాద్ పెద్ద బజార్లో జిల్లా నేతలు భారీ వైఎస్సార్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి పూల మాలలతో నివాళులు అర్పించారు. అనంతరం అల్పాహారం పంపిణీ చేశారు. -
ప్రతి ఇంటా వైఎ‘స్మరామి’
మట్టిని ప్రేమించిన వాడు మనిషిని ప్రేమిస్తాడు. జాతిహితం కోరేవాడు జననేత అవుతాడు. మహానేతగా నీరాజనాలందుకుంటాడు. జనం గుండెల్లో ఎప్పటికీ వెలిగిపోతుంటాడు. అలాంటి నాయకుడే వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రజల గుండెల్లో ఆయనది చెరపలేని సంతకం. గుండె చిల్లును పూడ్చి పు#నర్జన్మ ప్రసాదించిన ఆత్మీయ నేతకు ప్రతి హృదయం నీరాజనాలు పలుకుతుంది. బడుగు ఇంటి తలుపు తడితే గూడునిచ్చిన జననేతకు నివాళులర్పిస్తుంది. పింఛనుతోæ క్షుద్బాధ తీర్చుకుంటున్న పండుటాకు ప్రతి అన్నం మెతుకులోనూ ఆయన్నే చూస్తోంది. ఫీజు రాయితీతో ఎదిగిన సరస్వతీ పుత్రులు నీ రుణం తీర్చుకోలేమంటూ వైఎస్‌ను కీర్తిస్తున్నారు. మహానేత జయంతి సందర్భంగా ఆయన పాలనను జిల్లా ప్రజానీకం మననం చేసుకుంటోంది. చిత్తూరు, సాక్షి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్ని ఆదివారం నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు ఆయన అభిమానులు ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయిదేళ్ల పాలనలో మహానేత జిల్లాకు ఒనగూర్చిన ప్రయోజనాలను జనం గుర్తు చేసుకుంటున్నారు. ఆయనే ఉండిఉంటే హంద్రీనీవా పూర్తయి జిల్లాభూముల్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కేవని చర్చించుకుంటున్నారు. వైఎస్∙చిత్తూరు జిల్లాపై ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించేవారు.. ఆయన అడుగు జాడలు, చేపట్టిన పథకాల ఫలాలు జిల్లా ప్రజల మదిలో చెరిగిపోని తీపి గుర్తులుగా ఉన్నాయి. శ్రీసిటీకి శ్రీకారం.. చిత్తూరు జిల్లా పారిశ్రామికీకరణకు అనుగుణంగా ఉంటుందని రాజశేఖర రెడ్డి ఎప్పుడూ చెబుతుండేవారు. పక్క జిల్లానే కావడంతో ముఖ్యమంత్రి కాక ముందు 30 సంవత్సరాల నుంచే చిత్తూరు ప్రజలతో పరిచయాలుండేవి. దీంతో ఇక్కడి ప్రజలకు ఏం కావాలో క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఆయనకు దొరికింది. జిల్లాకు నీటి కష్టాలు ఉన్నాయని తెలిసి ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి తెలుగుగంగకు నీటి కొరత లేకుండా చేశారాయన. తెలుగుగంగ రావడంతో జిల్లా పారిశ్రామికంగా పరుగులు తీస్తోంది. వైఎస్ హయాంలోనే దేశానికే తలమానికమైన శ్రీసిటీ సెజ్ జిల్లాలో ఏర్పడింది. ఈ సెజ్ వల్ల సుమారు 50వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రపంచంలోనే పేరెన్నికగల కంపెనీలన్నీ ఇందులో కొలువుదీరుతున్నాయి. మన్నవరంలో భెల్‌కు అంకురార్పణ పడింది వైఎస్ హయామే. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించారు.. జిల్లా చెరకుకు పెట్టింది పేరు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్టరీ మూతపడింది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రూ.50 కోట్లు కేటాయించి ఫ్యాక్టరీని తెరిపించారు. ఆయన మరణం తర్వాత టీడీపీ పాలనలో అది మళ్లీ మూతపడింది. దీంతో జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణమే తగ్గిపోయింది. ఎవరైనా ఆయన దగ్గరకు సహాయం కోసం వెళితే కాదనే ప్రసక్తే లేదని ఆయన స్నేహితులు చెబుతున్నారు. ఎస్వీ యూని వర్సిటీలో వైద్య విద్యనభ్యసించారు. జిల్లాలో స్నేహితులకు కూడా కొదవలేదు. తిరుపతిలో స్కూటర్లో చెక్కర్లు కొట్టేవారమని ఆయన స్నేహితుడు జొన్నకురుకుల ప్రతాప్‌రెడ్డి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎస్వీయూలో హౌస్‌సర్జన్ చేసేటప్పుడు ఆ కళాశాలలో ఈశ్వర్‌రెడ్డి అనే ఉద్యోగి పనిచేసేవారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈశ్వర్‌రెడ్డి ఏదో పని నిమిత్తం తటపటాయిస్తూనే వెళ్లారు. ఎలాంటి సహాయ మూ అడగకుండా వెనక్కి వస్తుంటే.. ‘ఈశ్వరన్నా నాతో ఏదైనా పనుందా.. అడగకుండా ఎందుకు వెళుతున్నావ్’ అని అడిగి పనిచేసిపెట్టారని ఈశ్వర్‌రెడ్డి కళ్ల నుంచి రాలుతున్న నీళ్లను తుడుచుకుంటూ చెప్పారు. విద్యార్థి దశలో కూడా ఎంతో మందికి సహాయం చేసేవారని స్నేహితులు చెబుతున్నారు. చిత్తూరు నుంచి రాయచోటి మీదుగా పులివెందులకు బైక్‌లో వెళ్లేవారమని రాజశేఖర రెడ్డి స్నేహితులు గుర్తుచేసుకున్నారు. జిల్లాకు వస్తుండగా.. రాజశేఖర్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ప్రజలకు మరింత చేరువకావాలనే ఉద్దేశంతో రచ్చబండ కార్యక్రమాన్ని రూపొందించారు. దీన్ని చిత్తూరు రూరల్ మండలం అనుంపల్లిలోనే ప్రారంభించాలని సంకల్పిం చారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే అనుకోని విషాదం జరిగింది. ఆయన వస్తున్న హెలికాఫ్టర్ కూలిపోవడంతో రాష్ట్ర ప్రజలకు కోలుకోలేని దెబ్బతగిలింది. పేదల అపద్బాంధవుడు మరలిరాని లోకాలకేగిపోయాడు. ఆయనుంటే గాలేరు–నగరి పూర్తయ్యేది పుత్తూరు: గాలేరు–నగరి సాధనే లక్ష్యంగా మాజీ మంత్రి చెంగారెడ్డి 2003లో పాదయాత్ర చేశారు. అప్పటి ప్రతి పక్ష నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పుత్తూరులో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పుడు పుత్తూరు సర్పంచ్‌గా ఉన్నాను. మధ్యాహ్న భోజనం మా ఇంట్లో ఏర్పాటు చేశాను. గాలేరు–నగరి ఆవశ్యకత, దానివల్ల మా ప్రాంతా నికి కలిగే ప్రయోజనాన్ని వివరించారు. పుత్తూరు అప్పుడే పట్టణంగా ఎదుగుతోంది. పట్టణ వాసులకు తాగునీటి అవసరాలకు కూడా గాలేరు–నగరి ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైంది. తప్పకుండా నెరవేరుస్తామని వైఎస్ మాకు హామీ ఇచ్చారు. 2004లో అధికారంలోకి రాగానే వైఎస్ ప్రారంభించిన జలయజ్ఞంలో గాలేరు–నగరి ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగాయి. భూసేకరణ జరిగి నిర్వాసితులకు నష్టం పరిహా రం కూడా అందింది. కాలువలు పూర్తయ్యాయి. వైఎస్ మరో ఐదేళ్లు బతికి ఉంటే గాలేరు–నగరి పూర్తయ్యేది. మా దురదృష్టం ఆయన లేరు. తర్వాత వచ్చిన సీఎంలు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే గాలేరు–నగరి ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆశిస్తున్నాను. – డీఎన్ ఏలుమలై, వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుత్తూరు వైఎస్సార్ నాకు పునర్జన్మ ఇచ్చారు కుప్పం రూరల్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు పునర్జన్మ ఇచ్చారు. గుండె జబ్బు రావడంతో చికిత్స కోసం తిరుపతి, బెంగళూరు నగరాల్లో ఆసుపత్రులకు వెళ్లాను. ఎక్కడికి వెళ్లినా మూడునెలల్లో ఆపరేషన్ చేయకపోతే కష్టమని వైద్యులు చెప్పారు. నాకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ ఉన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుం బం మాది. ఆపరేషన్ చేసుకోవాలంటే రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఏమి చేయాలో తెలియక మదనపడుతున్న నాకు ఆరోగ్య శ్రీ గురించి చెప్పారు. వెంటనే ఆరోగ్య శ్రీ పథకంలో నమోదు చేసుకున్నాను. నెల రోజుల్లో నెల్లూరు నారాయణలో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్, మందులు, బస్సు చార్జీలతో ఉచితంగా భోజన వసతి కల్పించారు. ఆపరేషన్ చేయించుకుని తొమ్మిదేళ్లయింది. ఆరో గ్యంగా ఉన్నాను. వ్యవసాయ పనులు, కూరలు అమ్ముకుని కుటుంబ పోషణ చేసుకుంటున్నాను. నా జీవితం మహానేత పెట్టిన భిక్ష. – సేటు, గుల్లేపల్లి, కుప్పం మండలం -
సిటీసెంటర్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
-
కరువు నేలకు జల ప్రదాత
సాక్షి, జనగామ: కరువుకు కేరాఫ్‌గా మారిన జనగామ ప్రాంతంలో జలసిరులను అందించి చెదిరిపోసి సంతకం చేశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. భౌతికంగా లేకపోయినా ముఖ్యమంత్రిగా ఈ పోరుగడ్డకు చేసిన అభివృద్ధి రూపంలో నేటికి కళ్ల ముందే కదలాడుతోంది. సాగు, తాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి కరువు నేలకు జల ప్రదాతగా మారారు. సముద్రమట్టానికి 540 మీటర్ల ఎత్తులో ఉన్న జనగామ ప్రాంతానికి అపర భగీరథుడిగా మారి గోదావరి జలాలను తీసుకువచ్చారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి రైతు బాంధువుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. కరువు ప్రాంతంలో ఆయన చేసి అభివృద్ధి ప్రాజెక్టుల రూపంలో, 108 వాహనం కుయ్ కుయ్ శబ్దం వినగానే ఆపద్బాంధవుడిగా, ఆరోగ్యశ్రీ రూపంలో పేదల దైవంగా, ఉచిత విద్యుత్, రుణమాఫీతో రైతుల పక్షపాతిగా, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు భరోసా ఇచ్చి కుటుంబానికి పెద్ద కొడుకుగా దివంగత మహానేత వైఎస్సార్ వ్యవహరించారు. అందుకే ఆయన పాలన ఓ స్వర్ణయుగంగా మారి, ప్రజల మనస్సుల్లో రారాజుగా వెలుగొందుతున్నారు. ఆదివారం ఆయన జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను చేపట్టడానికి వైఎస్సార్ అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. రిజర్వాయర్ల నిర్మాణంలో వైఎస్సార్ కృషి.. కృష్ణా, గోదావరి నదులకు మధ్యలో జనగామ ప్రాంతం ఉంది. దీనితో ప్రతి ఏటా తక్కువ వర్షపాతం నమోదు అయ్యేది. రైతులు వేసిన పంటలు నీరు లేక ఎండిపోయే దుస్థితి ఉండేది. సాగునీటికే కాదు కనీసం తాగడానికి నీటి చుక్క దొరకనటువంటి పరిస్థితి. అలాంటి కరువు ప్రాంతానికి గో దావరి జలాలను తీసుకురావడంతో అపర భగీరథుడిగా కృషి చేశారు. మండుటెండలో మహాప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన చారిత్రక పాదయాత్రతో వైఎస్సార్ ప్రజల కష్టాలను దగ్గరుండి చూసి, విన్నారు. ప్రజల కష్టాలను తీర్చడానికి మహానేత ముందుకు వచ్చారు. కరువు ప్రాంతంలో జలసిరులను నింపడానికి తీవ్రంగా ప్రయత్నించారు. బడ్జెట్లో అధిక నిధులు కేటాయించిన ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేవాదుల నీటితో సస్యశ్యామలం.. ప్రజల ఆశీర్వాదంతో 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా వైఎస్ సుపరిపాలన సాగించా రు. ఆయన పరిపాలన కాలంలో జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణంపై దృష్టి సారించారు. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మొదటి దశలో రూ.844 కోట్లు, రెండోదశలో రూ.1887 కోట్లు, మూడో దశలో రూ.5410 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో చిల్పూర్ మండలంలోని రాజవరం, స్టేషన్ ఘన్‌పూర్‌లో ఘన్పూర్ రిజర్వాయర్లను నిర్మించారు. నర్మెట మండలంలో గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, చీటకోడూరు రిజర్వాయర్లను నిర్మించారు. 2007 ఏప్రిల్ 15వ తేదీన రఘునాథపల్లి మండలంలోని అశ్వరావుపల్లి రిజర్వాయర్‌ను వైఎస్సార్ స్వయంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అంతేకాకుండా దేవాదుల పైపులైన్‌కు అనుసంధానంగానే కన్నెబోయినగూడెం, నవాబుపేట రిజర్వాయర్లు సైతం నీటితో నేడు కళకళలాడుతున్నాయి. జనగామ మునిసిపాలిటీ పరిధిలోని ప్రజలకు తాగునీటిని అందించడానికి చీటకోడూరు రిజర్వాయర్‌ను నిర్మించారు. ఇటు సాగు అటు తాగునీటిని అందించడంలో వైఎస్సార్ ఎనలేని సేవలను అందించారు. నీటితో కళకళలాడుతున్న నర్మెటలోని గండిరామారం రిజర్వాయర్ -
బళ్లారికి ఆత్మీయ నేస్తం
ఆ వర్ఛస్సు, ఆత్మీయత చూసినవారు ఎన్నటికీ మరచిపోలేదు. పొరుగువారిని కూడా నీ వలె ప్రేమించు అన్న సూక్తిని అక్షరాలా ఆచరించారు కాబట్టే రాష్ట్రం, దేశం సరిహద్దులతో సంబంధం లేకుండా కోట్లాది మంది డాక్టర్ వైఎస్సార్‌ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. బళ్లారి, కన్నడనాడు కూడా అందుకు మినహాయింపు కాదు. నేడు ఆదివారం ఆ దివంగత మహానేత జయంతి. సాక్షి, బళ్లారి: మేరునగ ధీరుడు ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవన ప్రస్థానం కన్నడనాడుతో ఎంతగానో ముడిపడి ఉంది. చిన్ననాటి నుంచి ఆయన విలక్షణమైన వ్యక్తి. వైఎస్ దివంగతులు కాగా ఆ బాధను గుండెల్లో దిగమింగుకుని, ఆయన జయంత్యుత్సవాలను కర్ణాటకలో కూడా అపారమైన ఆదరాభిమానాలతో నిర్వహిస్తుండడం విశేషం. వైఎస్సార్‌కు చిన్ననాటి నుంచే బళ్లారితో బంధం విడదీయలేనిదిగా కొనసాగింది. ఆయన బాల్యంతో పాటు సగం విద్యాభ్యాసం కూడా బళ్లారితో పాటు కర్ణాటకలో కొనసాగడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే కర్ణాటకలో చెరగని ముద్ర ఉంది. వైఎస్ తండ్రి వైఎస్ రాజారెడ్డి ఇక్కడి మంచి విద్యాలయాలపై విశ్వాసంతో తన కుమారులను బళ్లారిలో విద్యాభ్యాసం చేయించారు. బళ్లారిలో డిగ్రీ, గుల్బర్గాలో ఎంబీబీఎస్ వైఎస్ రాజశేఖరరెడ్డి బళ్లారిలో 1958లో 7వ తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకు ఐదు సంవత్సరాల పాటు చదివి అనంతరం ఇంటర్మీడియట్ విద్యను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లయోల కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం 1964లో బళ్లారిలోని వీరశైవ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరారు. ఏడాది పాటు డిగ్రీ విద్య పూర్తి చేసుకున్న తర్వాత గుల్బర్గాలో ఎంబీబీఎస్‌లో చేరారు. ఇలా బళ్లారితో పాటు కర్ణాటకలో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. స్నేహితుల కష్టాలే తనవిగా... ఆయన చిన్నప్పుడు బళ్లారిలో చదువుకునే రోజుల్లో స్నేహితుల కష్టాలను పంచుకుని తనవిగా భావించి తీర్చేవారని నేటికి ఆయన స్నేహితులు వైఎస్‌తో జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంటారు. వైఎస్సార్ చిన్ననాటి నుంచే పేదల పట్ల సేవాభావంతో పని చేసే గుణం అలవరుచుకోవడం వల్ల ఆయన రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్లి ఎన్నో మంచి పనులు చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యాభ్యాసం బళ్లారిలో కొనసాగేటప్పుడు ఆయన ప్రతి నిత్యం ఇంటి నుంచి కాలి నడకన లేదా స్నేహితులతో కలిసి సైకిల్‌పై వెళ్లేవారని స్నేహితులు గుర్తుచేసుకుంటారు. భోజనం క్యారియర్ తీసుకుని వస్తే సగం స్నేహితులకు పంచి కొంచెం మాత్రం ఆరగించేవారని ఓ స్నేహితుడు తెలిపారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన బాల్యం, విద్యాభ్యాసం రెండూ బళ్లారిలో కొనసాగడంతో వైఎస్ఆర్కు కర్ణాటకతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఆయన మిత్రులు, అభిమానులు సోమవారం ఘనంగా జయంత్యుత్సవాలు నిర్వహించనున్నారు. -
వైఎస్సార్ ఆశయాలతో ముందుకెళ్తాం
సాక్షి, హైదరాబాద్ : నేడు దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ వద్ద మహానేత వైఎస్సార్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క మల్లు, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు అనిల్ యాదవ్, ఇందిరా శోభన్, తదితరులు పూలమాల వేసి వైఎస్సార్‌కు ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా దివంగత నేత సేవల్ని గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసిన నేతలు అనంతరం రక్త దానం కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ వైఎస్సార్ ఆశయాలతో ముందుకు సాగుతామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పలు సాగు, తాగు నీటి ప్రాజెక్టులు మొదలు పెట్టిన ఘనత వైఎస్సార్ దేనని చెప్పారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును మొదలు పెట్టిన ఘనత ఆయనదేనని భట్టి అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్లో దివంగత నేత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి భట్టి నివాళులు అర్పించారు. ఇందిరా భవన్లో ఈ కార్యక్రమంలో పేదలకు కేవీపీ రామచంద్రరావు దుప్పట్ల పంపిణీ చేశారు. తులసి రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల పాల్గొన్నారు. వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన్నారని, ఆయన ఆశయాలను నెరవేరుస్తామని షబ్బీర్ అన్నారు. వైఎస్సార్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయడంతో పాటు హైదరాబాద్‌లో మెట్రోరైలు ఘనత వైఎస్సార్‌దేనని అంజన్‌కుమార్ కొనియాడారు. ఆరోగ్య శ్రీ, 108 కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేదలకు ఉచితంగా వైద్యం అందించారని వైఎస్సార్ సేవల్ని స్మరించుకున్నారు. -
విజయవాడలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
-
ఏఎన్‌యూపై మహానేత చెరగని ముద్ర
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీపై మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న ఏఎన్‌యూకు ఆయన చూపిన ప్రేమ ప్రత్యేకమైనది. మూడు దశాబ్దాలుగా అందని ద్రాక్షగా మిగిలిన ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటులో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమని అప్పటి యూనివర్సిటీ ఉన్నతాధికారులు పలు వేదికలపై పలుమార్లు కొనియాడారు. ముఖ్యమంత్రిగా గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్‌ను అప్పటి వైస్ చాన్సలర్ కలిసి ఏఎన్‌యూలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరగా, ఏఎన్‌యూకు ఇంజినీరింగ్ కళాశాల లేదా ఇదేం పరిస్థితి అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన వెంటనే ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ సిద్ధం చేసుకుని తనను కలవాలని వీసీకి సూచించారు. గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల ఎంతో అవసరమని వైఎస్సార్ స్పష్టం చేశారు. తదనంతరం ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అన్ని అనుమతులు ఇప్పించిన వైఎస్సార్ 2009లో ఏఎన్‌యూలో ఇంజినీరింగ్‌తోపాటు ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలలను తన చేతుల మీదుగా ప్రారంభించారు. అదే వేదికపై ఓసీ(ఓపెన్ కేటగిరీ)లోని పేద విద్యార్థులకు కూడా ఈబీసీ కింద ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని వైఎస్సార్ ప్రకటించారు. తర్వాత కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేశారు. అంతేకాదు దశాబ్దాకాలంపైగా పెండింగ్‌లో ఉన్న యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల మంజూరులోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏఎన్‌యూకు రెండు విడతలు రెగ్యులర్ అధ్యాపక పోస్టులు మంజూరు చేసి, వాటి నియామకాలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. యూనివర్సిటీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంపొందింపజేస్తూ అప్పటి వరకు నాగార్జున యూనివర్సిటీగా ఉన్న యూనివర్సిటీ పేరును ఆచార్య నాగార్జున యూనివర్సిటీగా మార్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేయించారు. ముఖ్యమంత్రులు ఏఎన్‌యూలో అడుగుపెడితే వారికి అరిష్టమనే నానుడిని తిప్పికొడుతూ ముఖ్యమంత్రిగా ఏఎన్‌యూలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఏఎన్‌యూపై చెరగని ముద్ర వేశారు. -
మదిలో పదిలం
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారు. ఆయన హయాంలోనే పాత జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు అనేకమంది అభాగ్యులకు వెలుగు లునిచ్చాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జనం గుండెల్లో దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి పదిలంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ఆయన హయాంలోనే బాటలు పడ్డాయి. పాత కరీంనగర్ జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేసిన ఆయన జ్ఞాపకాలు ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయి. జిల్లా అభివృద్ధికి నిరంతరం తపించిన ఆయన సుమారు 18 పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. గతంలో ఏ ముఖ్యమంత్రికీ ఇది సాధ్యం కాలేదు. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్.. మొదటిసారిగా రాజీవ్ పల్లెబాటలో భాగంగా 2004 డిసెంబర్లో జిల్లాకు వచ్చారు. అప్పటినుంచి 2009 జనవరి 30 వరకు 18 సార్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. జలయజ్ఞంలో భాగంగా ఎల్లంపల్లి శ్రీపాదసాగర్, మిడ్‌మానేరు, ఇందిరమ్మ వరదకాల్వ, శ్రీరాంసాగర్ రెండోదశ, ఎస్సారెస్పీ, కాకతీయ కాల్వల ఆ«ధునీకరణకు కోట్లాది రూపాయలు వెచ్చించారు. ఎల్లంపల్లి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి జాతికి అంకితం చేసిన మహానుభావుడు దివంగత నేత వైఎస్సార్. ఆరోగ్యశ్రీ, 104, 108, ఫీజు రీయంబర్స్ మెంట్ తదితర పథకాలు ప్రజలు నేటికి నెమరు వేసుకుంటున్నారు. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వ్యవసాయానికి పెట్టింది పేరుగా ఉన్న కరీంనగర్ జిల్లాను ‘సీడ్ బౌల్ స్టేట్’గా మార్చేందుకు కృషి చేసింది వైఎస్సారే. అలాగే వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టుల కోసం పెద్దపీట వేశారు. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, ఎల్ఎండీ ప్రాజెక్టు ఆయకట్టును స్థిరీకరించాలనే లక్ష్యంతో ప్రధాన కాలువల ఆధునీకరణ పనులకు రూ.549.60 కోట్లు మంజూరు చేశారు. తెలంగాణ వరప్రదాయినిగా పేరున్న ‘ప్రాణహిత – చేవెళ్ల’ పథకానికి శ్రీకారం చుట్టారు. రూ.3,484 కోట్లతో భారీ వ్యయంతో మూడు ప్యాకేజీల పనులకు పన్నెండేళ్ల క్రితం ధర్మారం, చొప్పదండి ప్రాంతాలలో శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం పూర్తయితే జిల్లాలో 3.05 లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి రావాలనేది ఆయన ఉద్దేశం. జలయజ్ఞంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నేడు పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల రైతులకు కల్పతరువుగా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయన హయాంలో పురుడుపోసుకున్న ప్రాణహిత చేవెళ్ల, మిడ్‌మానేరు, వరదకాల్వలు కీలకంగా మారుతున్నాయి. ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ చేసిన వైఎస్సార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 4,98,785 రైతు కుటుంబాల్లో వెలుగులు నింపారు. విద్యా, వైద్యరంగాలకూ భారీ నిధులు.. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి జిల్లాలో విద్యా, వైద్యరంగాలకు వైఎస్ కృషి మరవలేనిది. కరీంనగర్‌కు తలమానికంలా రెండు వేల ఎకరాల్లో శాతవాహన యూనివర్సిటీని మంజూరు చేసిన మహనేత. ఉన్నత విద్యను జిల్లా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాగలిగారు. కరీంనగర్ శివారులో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీలో వందలాది మంది విద్యార్థులకు ఉన్నత చదువులకు అవకాశం దక్కింది. నేదునూర్‌లో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపన చేయగా.. ఆయన మరణంతో పెండింగ్‌లో పడింది. కరీంనగర్ నగరాన్ని కార్పొరేషన్‌గా మార్చారు. రాజీవ్‌రహదారిని నాలుగు లైన్లతో అభివృద్ధి చేశారు. రూ.5 వేలకే రాజీవ్ గృహకల్పలో ఇల్లు.. రూ.5వేలకే రాజీవ్ గృహకల్పతో 1700 ఇళ్ల మంజూరు చేసి రూ.లక్ష రుణ సౌకర్యం కల్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 3.52 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. కరీంనగర్లో రూ.120 కోట్ల హడ్కో నిధులతో 6 రిజర్వాయర్లు, 2 ఫిల్టర్బెడ్లు మంజూరు చేశారు. కరీంనగర్ నగరంలో రూ.63 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. రూ.6 కోట్లతో చింతకుంటలో ఎస్సీ గరŠల్స్ రెసిరెన్సియల్ పాఠశాల ఏర్పాటు చేశారు. ఎల్ఎండీ డ్యామ్ సమీపంలో బాల మేధావుల కోసం స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్సీ మంజూరు చేశారు. రైతులకు విద్యుత్ రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకం, ఎల్ఎండీ నుండి వేములవాడతోపాటు కరీంనగర్ మండలంలోని గ్రామాలకు మంచినీరు అందించిన ప్రదాత వైఎస్సార్. మంథని, కొండగట్టులో జేఎన్టీయూ ఏర్పాటు చేయించి.. పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు అండగా నిలిచారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా భావించిన వెఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేసిన మేలును అన్నివర్గాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. -
మళ్లీరావా.. రాజన్నా
సాక్షి, అమరావతి బ్యూరో: రాజకీయ రాజధాని గుంటూరు జిల్లాపై దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర సుస్పష్టం. జిల్లాకు రాజన్న రాజకీయ ఉన్నతి కల్పించారు. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఆ పార్టీకి అడ్రస్సే గల్లంతయ్యేలా చేశారు. 2004లో దివంగత వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లాలో విజదుందుభి మోగించింది. కర్త, కర్మ, క్రియ అన్ని తానై వ్యవహరించి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో 18 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందేలా చేయడంతోపాటు, తదనంతరం క్యాబినెట్ కూర్పులోనూ నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. 2009 ఎన్నికల్లోనూ అదే ప్రభంజనం కొనసాగించారు. ఆయన మరణానంతరం రాజకీయ పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. అప్పటి వరకు వెన్నంటే నిలిచి అనేక పదవులు పొందిన నేతలు విశ్వాస హీనులుగా మారితే.. ప్రజలు మాత్రం ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. మహానేత బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తూ జిల్లా ప్రజలతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణకు శ్రీకారం 120 ఏళ్ల కృష్ణా డెల్టా చరిత్రలో ఏ ప్రభుత్వం ఆధునికీకరణ పనులు చేసే ఆలోచన కూడా చేయలేదు. కేవలం నిర్వహణ, మరమ్మతులకే పరిమితమయ్యాయి. కృష్ణానదికి వచ్చిన వరద ముంపునకు జిల్లా అతులాకుతలం కావడంతో చలించిపోయిన వైఎస్ 2008 జూన్ 6న సర్ ఆర్దర్ కాటన్ విగ్రహం వద్ద రూ.4,573 కోట్ల వ్యయంతో డెల్టా ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. ఇందులో 40 శాతం పనులు ఆయన హయంలోనే పూర్తయ్యాయి. ఆ తరువాత ఇప్పటి వరకు మూడు ప్రభుత్వాలు మారినా కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులు మరో 10 శాతం కంటే ఎక్కువగా జరగలేదు. జిల్లాకు అగ్ర తాంబూలం ఐదేళ్ల పదవీ కాలంలో దివంగత మహానేత జిల్లాకు 57 పర్యాయాలు వచ్చారు. రాజీవ్ పల్లెబాట, ఇందిర ప్రభ, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. ఏడాదికి సగటున పది సార్లు మహా నేత జిల్లాలో పర్యటించారు. జలయజ్ఞం, నాగార్జున సాగర్ కుడికాలువ అధునికీకరణ పనులు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇలా అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరుపేదలకు అసరాగా నిలిచాయి. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందిన వారు.. ఆయన తనయుడి ప్రజా సంకల్పయాత్రలో పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు. ఇందిర ప్రభ ద్వారా గిరిపుత్రులకు జిల్లాలో 6 వేల ఎకరాల భూమికి, భూ హక్కు పత్రాలు మంజూరు చేశారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకాల ద్వారా భరోసా కల్పించారు. పులిచింతల’.. ఆయన పుణ్యమే కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల స్థిరీకరణకు పులిచింతల ప్రాజెక్టు ఎంతో అవసరం. దీని కోసం అర్ద శతాబ్దంపైగా కృష్ణా డెల్టా రైతులు ఎదురు చూశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 45.77 టీఎంసీల నీరు నిల్వ ఉండే విధంగా పులిచింతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా ఏ మాత్రం లెక్క చేయకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ప్రాజెక్టులో 80 శాతం పనులు పూర్తి ఆయన హయాంలోనే జరిగాయి. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసే ప్రయత్నాలు చేయడం లేదు. వైఎస్ లేక.. అభివృద్ధి కానరాక పల్నాడు రైతాంగానికి అనువుగా ఉండేందుకు దుర్గిలో మిర్చి మార్కెట్ యార్డును నిర్మించాలని యోచించి నిధులు మంజూరు చేశారు. అది ఇప్పటికి ప్రారంభానికి నోచుకొలేదు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో మొత్తం 2.26 లక్షల ఇళ్లు మంజూరు కాగా 1.49 లక్షల ఇళ్లు వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. మిగిలినవి నేటికీ నిర్మాణ దశల్లోనే ఉండగా.. కొత్త ఇళ్లు ఒక్కటీ మంజూరైన దాఖలాలు లేవు. ఎందరివో ప్రాణాలు నిలిపిన ఆరోగ్యశ్రీ పథకాన్ని సైతం 2008లో గుంటూరులోని సాయిభాస్కర్ ఆసుపత్రిలో ప్రారంభించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 2010 చివరి వరకు 14 లక్షలకుపై చిలుకు ఆపరేషన్లు జరగ్గా ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేశారు. కొల్లేరు ప్రజలకు ప్రత్యేక వరం కైకలూరు: చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా విడుదలైన జీవో నంబరు 120తో నష్టపోయిన కొల్లేటి వాసులకు న్యాయం చేయాలనే దూరదృష్టితో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో రూ.350 కోట్ల ప్రత్యేక పునరావాస ప్యాకేజీని వైఎస్ అందించారు. కొల్లేరు సరస్సును + 5 కాంటూరు నుంచి +3 కాంటూరు వరకు కుదిస్తూ అసెంబ్లీలో సాహసోపేతంగా తీర్మానం చేసి కేంద్రానికి నివేదించారు. అప్పటి వరకు కొల్లేరులో ధ్వంసం చేసిన సొసైటీ చెరువుల్లో సంప్రదాయబద్ధమైన వ్యవసాయం చేసుకోడానికి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సర్కారు కాల్వ కర్రల వంతెన స్థానంలో పెద్దింట్లమ్మ వారధి నిర్మాణానికి రూ. 12 కోట్ల నిధులను కేటాయించి కొల్లేరు ప్రజలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. సాంకేతిక పునాది గన్నవరం: ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ కార్యకలాపాలను కోస్తా జిల్లాలకు నడిపించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. కేవలం వ్యవసాయ ఆధారితమైన ఈ ప్రాంతంలో ఐటీ పార్కు ఏర్పాటు ద్వారా అభివృద్ధికి బాటలు వేసి భవిష్యత్ మార్గనిర్దేశికుడిగా ఆయన ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. మండలంలోని కేసరపల్లిలో ఏపీఐఐసీ, ఎల్అండ్టీ సంయుక్త సౌజన్యంతో నిర్మించిన ఐటీ పార్కు ప్రస్తుతం వందలాది మంది ఐటీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. తొలుత ఐటీ పార్కు నిర్మించిన స్థలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 2004లో సెంట్రల్ జైలు నిర్మాణం చేపట్టింది. జైలు ఏర్పాటు కోసం సుమారు 30 ఎకరాల స్థలం చుట్టూ ప్రహరీ, భవన నిర్మాణ పనులు చేపట్టారు. జైలు ఏర్పాటుతో ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడడంతోపాటు భూముల ధరలు కూడా గణనీయంగా పడిపోతాయని ప్రజాప్రతినిధులు, నాయకులు 2006లో జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన జైలు నిర్మాణ పనులు నిలిపివేసి ఆ స్థలంలో ఐటీ పార్కు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. అదే ఏడాది రూ. 95 కోట్లతో ఐటీ పార్కులోని మొదటి టవర్ నిర్మాణ పనులకు పునాది రాళ్లు వేశారు. 2009లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ పార్కులోని మేథ టవర్‌ను వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య చేతులమీదుగా ప్రారంభించారు. మొదటి టవర్‌లో 14 ఐటీ కంపెనీలు పూర్తిస్థాయిలో ఏర్పాటు కావడంతో రెండో టవర్ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. ప్రస్తుతం 1,500 ఉద్యోగులు పని చేస్తుండగా, ఆగస్టు నుంచి మరో వెయ్యి మంది ఉద్యోగులు రానున్నారు. వైఎస్ ముందుచూపు ఫలితంగానే ఈ ప్రాంతం ఐటీ హబ్‌గా గుర్తింపుతోపాటు ఒకప్పుడు లక్షల్లో ఉన్న భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయి. రాజశేఖరుని చొరవతోనే.. వైఎస్సార్ దయ వల్లే ఇక్కడ ఐటీ పార్కు ఏర్పాటైంది. ఎయిర్‌పోర్టులో ఆయనను కలిసిన అప్పటి ఎమ్మెల్యే, నాయకులం జైలు నిర్మాణం వల్ల ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుందని విన్నవించాం. ఒక నిమిషం కూడా అలోచించకుండా అప్పటి ఐటీ మంత్రికి ఫోన్ చేసి జైలు నిర్మాణ స్ధలంలో ఐటీ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను పెరుగుపరిచారు. మల్లంపాటి బాబూరావు, కేసరపల్లి. కృష్ణా యూనివర్సిటీ ఏర్పాటు మచిలీపట్నం: ఆనాటి బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని), ఎంపీ బాడిగ రామకృష్ణ, వైఎస్ఆర్ వద్దకు వెళ్లి మచిలీపట్నంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో వైఎస్ 2008 ఏప్రిల్ 23వ తేదీ బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన రోజునే యూనివర్సిటీని ప్రారంభించారు. ఆంధ్రా జాతీయ కళాశాలలో తాత్కాలికంగా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ ఈ కళాశాల ఆవరణలోనే కొనసాగుతోంది. ఇటీవల మూడు ప్రాంతాల్లో 182 ఎకరాలను అధికారులు కేటాయించగా దీనిలో ప్రస్తుతం నూతన భవన నిర్మాణం సాగుతోంది. దటీజ్ వైఎస్సార్.. లయోలా కాలేజీలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి చదువుకున్న అనుభవం మరువలేనిది.. చనిపోయే వరకు ప్రాణమిత్రులుగా మెలిగాం. మంత్రిగా ఉన్న సమయంలోనూ సమస్య చెబితే ఇట్టే పరిష్కరించేవారు. నేను వైఎస్సార్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు, వారు వేటకు వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులు పడుతున్న ఆందోళన గురించి ప్రస్తావించాను. ఏం చేద్దాం కృష్ణ అన్నారు. మత్స్యకారులకు ఇల్లు కట్టించి, చేపల వేటకు వెళ్లేందుకు వీలుగా బోట్లు, సామగ్రిని అందించాలని కోరాను. వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మత్స్యకారులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. గ్రామాల్లో పని చేసే విద్యుత్ లైన్మెన్ల కొరత ఎక్కువగా ఉన్న విషయంపై వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లాను. మూడు, నాలుగు గ్రామాలకు ఒక లైన్మెన్ ఉండటం వల్ల స్తంభాలు ఎక్కే హడావుడిలో కిందపడిపోవడం, విద్యుత్ షాక్‌లతో మరణించిన ఘటనలను ఆయనకు వివరించాను. దీంతో చలించిపోయిన వైఎస్ 7 వేల లైన్మెన్ పోస్టులను మంజూరు చేశారు. సిబ్బంది కొరతతో చాలీచాలని జీతాలతో కానిస్టేబుళ్లు పడుతున్న ఇబ్బందులను రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే వివరాలు తెప్పించుకుని 36 వేల కానిస్టేబుల్, ఎస్సైల పోస్టులను మంజూరు చేశారు. దటీజ్ వైఎస్సార్. ఎన్నేళ్లు గడిచినా రాజశేఖరరెడ్డితో మా కుటుంబానికి ఉన్న అనుబంధం మరువలేనిది. – కాసు వెంకటకృష్ణారెడ్డి, మాజీ మంత్రి ట్రిపుల్ ఐటీలో చదివే భాగ్యం కల్పించారు ట్రిపుల్ ఐటీ అంటే మన రాష్ట్రంలో ఎక్కడా లేవు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కొన్నాళ్లకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు చోట్ల ట్రిపుల్ ఐటీలు నెలకొల్పారు. ఆయన చలవతోనే నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉచితంగా చదువుకొని ప్రస్తుతం చెన్నైలో పీహెచ్డీ చేస్తున్నాను. నెలకు స్టైఫండ్ రూ.30 వేలకుపైగా వస్తుంది. నాలాంటి మధ్య తరగతి విద్యార్థులెందరో జీవితాలకు వైఎస్ మార్గదర్శకులు. – చావపాటి గౌస్ సంధాని, పీహెచ్డీ విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ ఆదుకుంది ఇంజినీరింగ్‌లో సీటు వచ్చినా ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోతే చదువుకునే వాడిని కాదేమో. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇచ్చిన వరం రీయింబర్స్మెంట్. ఇంజినీరింగ్‌లో ఫీజు కట్టే పని లేకుండా చదువుకున్నాను. ఆయన దయతో ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా చెన్నైలో స్థిరపడ్డాను. ఇలాంటి నేతలు ఉంటే విద్యార్థుల భవిష్యత్‌కు కొండంత భరోసా వస్తుంది. – షేక్ కాలేషా మస్తాన్ షరీఫ్, సాఫ్ట్వేర్ ఉద్యోగి. అడిగిన వెంటనే వరమిచ్చారు 2004లో రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక మొదటిసారి వినుకొండ వచ్చారు. అప్పుడు కృష్ణారెడ్డి సర్పంచ్‌గా ఉన్నాను. ఎత్తిపోతల పథకాన్ని గుండ్లకమ్మ నదిపై ఏర్పాటు చేస్తే గ్రామానికి సాగు, తాగునీరు అందుతుందని వైఎస్‌కు వినతి పత్రం ఇచ్చాం. వినతి పత్రం చూసిన వెంటనే బహిరంగ సభలోనే ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తామని మహానేత హామీ ఇచ్చారు. వెంటనే రూ.4.83 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యలోగా మృతి చెందారు. పథకానికి దివంగత నేత పేరు పెట్టారు. ప్రస్తుతం రాజశేఖర ఎత్తిపోతల పథకం ద్వారా 1050 ఎకరాలు సాగులోకి వచ్చాయి. గ్రామంలో వైఎస్ భారీ విగ్రహం ఏర్పాటు చేసి ప్రతి ఏటా అన్నదానం చేస్తున్నాం. – కొత్త కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్, ఉప్పలపాడు డ్వాక్రా చెల్లెమ్మలను ఆదుకున్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో డ్వాక్రా మహిళల రుణాలు చిటికెలో అందించే వారు. బ్యాంక్ అధికారులు, యానిమేటర్లు గ్రూపు సభ్యులకు తగిన ప్రాధాన్యమిచ్చే వారు. డ్వాక్రా చెల్లెమ్మలకు అన్నయ్యగా అండగా నిలిచారు. చంద్రబాబు మాత్రం డ్వాక్రా మహిళలకు రుణాలను మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇచ్చిన కొద్దీగొప్పా రుణాలు వడ్డీలకే కట్టించుకున్నారు. డ్వాక్రా మహిళల అభ్యున్నతి చెందాలంటే వైఎస్. జగనన్నతోనే సాధ్యం.... – ఈమని మాధవి, సరోజిని డ్వాక్రా గ్రూప్ లీడర్, గుళ్ళపల్లి. వైఎస్ దయతోనే బతికున్నా.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే నేను బతికున్నాను. గుంటూరు శ్రీనగర్‌లో ఇస్త్రీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాకు 2011లో గుండెపోటు వచ్చింది. తొలుత ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే యాంజియోగ్రామ్ చేయాలని, స్టంట్ వేయాలని, వైద్య సౌకర్యం తమ వద్ద లేదని చెప్పారు. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న నాకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకునే స్థోమత లేదు. అలాంటి తరుణంలో డాక్టర్ వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేటు ఆస్పత్రిలో ఉచితంగా కార్పొరేట్ వైద్యం చేసి ప్రాణాలు కాపాడారు. వైఎస్ నాకు నూతన జీవితాన్ని ఇచ్చిన దేవుడు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. – బాసాటి వీరబ్రహ్మం పొలం డాక్యుమెంట్లు విడిపించుకున్నా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు రుణమాఫీ పూర్తిగా జరిగింది. బ్యాంక్‌లో తీసుకున్న రుణం అంతా మాఫీ అవ్వడంతో పొలాల డాక్యుమెంట్స్ తిరిగి తెచ్చుకున్నాం. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారు. బ్యాంక్‌లో తీసుకున్న రుణాలకు వడ్డీలు పెరిగిపోవడంతో భారంగా మారింది. బ్యాంక్‌ల నుంచి నోటీసులు రావడంతో రుణాలను దశల వారీగా చెల్లిస్తున్నాం. వైఎస్ పాలన స్వర్ణయుగం. – నిజాంపట్నం రామకృష్ణ, రైతు భట్టువారిపాలెం. మూగ గొంతులో మాటల గలగల చల్లని చేయి, ఆత్మీయ పలకరింపు ఒక మూగ చిన్నారికి మాటలు తెప్పించాయి. ఐదేళ్ల వయసు వచ్చినప్పటికీ మాట, పలుకులేక ఆవేదన చెందిన చిన్నారి నేడు వైస్ తాత.. జగనన్న .. అంటూ ముచ్చటగా మాటలు చెబుతోంది. ఇది దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే. నరసరావుపేట మండలం చినతురకపాలెం గ్రామానికి చెందిన షేక్ నాయబ్ సైదావలి, కౌసర్ దంపతులకు నలుగురు సంతానం. చిన్న కుమార్తె ఇస్రత్ జహ పుట్టిన దగ్గర నుంచి మాట, పలుకు లేదు. నరసరావుపేటకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ సభకు జడివానలో చిన్నారితో కలసి ఆమె తల్లి కౌసర్ వెళ్లింది. సభ వేదిక పక్కనే బిడ్డతో ఉన్న కౌసర్‌ను వైఎస్ ఆత్మీయంగా పలకరించారు. తండ్రిలా వైఎస్ పలకరింపు ఆ తల్లి హృదయాన్ని కదిలించాయి. కళ్ల వెంట కారుతున్న నీటితో తన బిడ్డ లోపాన్ని వైఎస్‌కు వివరించింది. చలించిపోయిన వైఎస్ ఆమె కొండంత ధైర్యం చెప్పారు. మరో పది రోజులకే చిన్నారి ఇంటికి పిలుపు వచ్చింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాలపై ఆ చిన్నారికి ఆరోగ్యశ్రీ ద్వారా కాక్లియర్ ఇన్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించింది. దీంతో చిన్నారి మాటల గలగలలు ఆ ఇంట నవ్వులు విరబూయిస్తున్నాయి. ప్రస్తుతం పాప యల్లమంద ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. నిత్యం ప్రజల వెంటే ఉండాలన్నారు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కనిపించిన వెంటనే ‘బీసీ నాయకా.. జంగా’ అని ఆప్యాయంగా పిలుస్తారు. రెండు పర్యాయాలు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యేను చేశారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల వెన్నంటే ఉండాలని భుజం తట్టి ధైర్యం చెప్పేవారు. దండివాగు ఎత్తిపోతల పథకం 24 గంటల విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు కోటి రూపాయలతో శ్రీనగర్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. తంగెడ, దాచేపల్లి, నడికుడి, శ్రీనగర్, గామాలపాడు, పొందుగల గ్రామాలకు కృష్ణానది నీటిని అందించారు. పిడుగురాళ్ల, గురజాల, మాచవరం మండలాల్లో నిరుపేదలకు ఇళ్లు కట్టించాం. అర్హులైన వారికి పింఛన్లు ఇచ్చాం. నియోజకవర్గంలో జరిగిన వందల కోట్ల అభివృద్ధిలో వైఎస్సార్‌ది చెరగని ముద్ర ఉంది. బీసీలంటే వైఎస్సార్‌కు అమితమైన ప్రేమ. ఆయన మరణం రాష్ట్ర ప్రజలకు తీరని లోటు. జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రైతు బిడ్డ వైఎస్ నేను దాచేపల్లి ఎంపీపీగా ఉన్నప్పుడు 2008లో అధికంగా వర్షాలు కురిశాయి. మండలంలోని కల్లాల్లో ఆరబోసిన మిరపకాయలు కొట్టుకుపోయాయి. ఆదుకోవాలని విన్నవించేందుకు అప్పటి మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జంగా కృష్ణమూర్తి, పిన్నెల్లి లక్ష్మారెడ్డిలతో కలిసి 30 మంది రైతులం వైఎస్సార్‌ను కలవటం కోసం సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లాం. సమస్య విన్న వైఎస్ నెల రోజులు తిరగకుండానే నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పించారు. మేము కలిసిన రోజు రైతుల కష్టాల గురించి ఆయనే స్వయంగా మాకు చెప్పారు. వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పండించిన మిరపకాయలు డాబాపైన ఆరబెడితే వర్షానికి కొట్టుకుపోకుండా తాను కంది కట్టెను అడ్డుపెట్టి ఆపిన సంఘటనను వైఎస్సార్ గుర్తు చేశారు. అంబటి శేషగిరిరావు, మాజీ ఎంపీపీ -
ప్రాణహిత మహానేత.. రాజన్న..!
జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు ప్రజాప్రస్థానం సాగించాడు. సాగునీటి కోసం బోరుబావులను తవ్వించి అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను చూసి చలించిపోయాడు. ఆ కుటుంబాల కన్నీళ్లు తుడవాలంటే సాగునీరు అందించాలని నిర్ణయించుకున్నాడు. అధికారంలోకి వచ్చాక ‘ప్రాణహిత –చేవెళ్ల’కు రూపకల్పన చేశాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి మహానేత కలల సాకారం దిశగా.. ఆదివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కథనం.. సాక్షి, కామారెడ్డి: 2000 ప్రాంతంలో వరుస కరువు కాటకాలతో భూములు బీడుగా మారాయి. సాగు నీటి కోసం రైతులు భగీరథ ప్రయత్నం చేశారు. వందల అడుగుల లోతువరకు బోరుబావులు త వ్వించినా ప్రయోజనం లేకపోయింది. ఒక్కో రైతు ఐదారు బోర్లు తవ్వించి అప్పులపాలయ్యాడు. కరువుతో పంటలు పండక.. అప్పుతీర్చే మార్గం కనిపించక పలువురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆశలన్నీ మోడులైన దశలో నేనున్నానంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టారు. 2003లో ఆయన చేసిన పాదయాత్ర కా మారెడ్డి ప్రాంతం మీదుగా సాగింది. ఆయన పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. సాగునీటి వెతలను విని చలించిపోయారు. అధికారంలోకి రాగానే అన్నదాత సంక్షేమానికి చర్యలు చేపట్టారు. సర్వేలు చేయించి, ప్రాణహిత–చేవెళ్ల పథకానికి జీవం పోశారు. కామారెడ్డి పట్టణంలో ఈ పథకానికి శంకుస్థాపన కూడా చేశారు. 22వ ప్యాకేజీలో కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లా రెడ్డి రెవెన్యూ డివిజన్లతో పాటు మెదక్ జిల్లాలోని కొన్ని మండలాలను కలిపి 1.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకుగాను రూ.1,446 కోట్లు మంజూరు చేశారు. అప్పట్లోనే భూంపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టారు. కాలువల తవ్వ కం పనులు కూడా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ‘ప్రాణహిత’ పనులు ఆపేశా రు. దీంతో కొన్నాళ్లపాటు పనులు ఆగిపోయాయి. అన్ని రకాల పరిశీలనల అనంతరం 22వ ప్యాకేజీని అలాగే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా 44 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం భూంపల్లి రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయి. కాలువల తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. భూంపల్లి రిజర్వాయర్ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్, రిడ్జ్ కెనాల్స్ ద్వారా మూడు వైపులా నీటిని పంపించి సాగునీరు అందించనున్నారు. జిల్లా మీదుగా సాగిన ‘ప్రజాప్రస్థానం’ వైఎస్సార్ 2003లో చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మెదక్ జిల్లా నుంచి నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామం వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి, కామారెడ్డి, మాచారెడ్డి మీదుగా సిరిసిల్ల జిల్లాలోకి వెళ్లింది. ఉమ్మడి జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర మొత్తం కామారెడ్డి జిల్లాలోనే కొనసాగింది. అంతేగాక కామారెడ్డి జిల్లాలో సగానికిపైగా ప్రాంతాల మీదుగా పాదయాత్ర చేసిన రాజశేఖరరెడ్డి.. ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. ముఖ్యం గా కామారెడ్డి ప్రాంతంలో బోర్ల తవ్వకంతో అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల పరిస్థితిని చూసి చలించిపోయారు. అన్నదాతల బలవన్మర ణాలకు అప్పులు, సాగునీరే అసలు సమస్య అని నిర్ధారించుకున్నారు. సీఎం అయిన తరువాత కామారెడ్డి ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించడమే కాకుండా వాటికి అవసరమైన నిధులు మంజూరు చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ప్రాణహితకు ఇక్కడే బీజం.... సాగునీటి కష్టాలకు కేరాఫ్ అయిన కామారెడ్డి ప్రాంతంలో ఆయా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ చర్యలు తీసుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి పథకాన్ని రూపొందించి దానికి కామారెడ్డి పట్టణంలోనే శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 3.05 లక్షల ఎకరాలకు నీటినందించాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అందులో భాగంగా 20, 21, 22 ప్యాకేజీలు రూపొందించారు. మొదటి విడతలో 20, 21 ప్యాకేజీల పనులు ప్రారం భం కాగా, 22వ ప్యాకేజీ పనులు మొదలయ్యేలోపే వైఎస్సార్ మరణించారు. ప్రభుత్వాలు మారడంతో దాని పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్టుల రీడిజైన్ తరువాత తిరిగి 22వ ప్యాకేజీని ఉన్నది ఉన్నట్టుగా కొనసాగిస్తూనే అదనపు ఆయకట్టు చేర్చా రు. పాత డిజైన్ ప్రకారం పనులను వేగవం తం చేశారు. ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తీరుతాయి. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను చూసిన రైతులు దివంగత సీఎంను గుర్తు చేసుకుంటున్నారు. యాచారం వద్ద కొనసాగుతున్న టన్నెల్ తవ్వకం పనులు -
సంక్షేమానికి మారు పేరు వైఎస్ఆర్
హైదరాబాద్: సంక్షేమానికి మారు పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ కొనియాడారు. ఆదివారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69వ జయంతి వేడుకలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బొత్స సత్యనారాయణ, వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వాలు తీసేసే పరిస్థితి లేదని, కొనసాగించక తప్పని పరిస్థితి తర్వాత ప్రభుత్వాలదని వ్యాఖ్యానించారు. దేశంలోని ఏ రాష్ట్రమూ ఉచిత విద్యుత్ ఇవ్వలేదని, కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఉచిత విద్యుత్ తొలిసారిగా ఇచ్చారని గుర్తు చేశారు. పేదలకు ఏ కష్టం వచ్చినా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీరుస్తాడనే నమ్మకం ఉండేదని, ప్రజలు హాయిగా నిద్రపోయేవారని అన్నారు. అదే స్ఫూర్తితో నేడు వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతోందని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే మళ్లీ వైఎస్ ఆశయాలు నెరవేరుతాయని, అందుకే కార్యకర్తలు కష్టపడాలని కోరారు. ఈ ఐదేండ్ల కష్టాలు కొద్ది రోజుల్లోనే పోతాయని, ప్రజలు కొద్ది నెలలు ఓపికగా ఉండాలన్నారు. సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ..వైఎస్ చేసిన పనులు, కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ స్ఫూర్తి పొందుతున్నామని అన్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వస్తాయని, ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ మొదలు పెట్టిన యజ్ఞాన్ని వైఎస్ జగన్ పూర్తి చేస్తారని అన్నారు. దౌర్జన్యం, దుష్ట పాలన ఎలా ఉంటుందో ప్రజలు ఇప్పుడు టీడీపీ పాలనలో చూస్తున్నారని చెప్పారు. రానున్న 5,6 నెలలు కార్యకర్తలు జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. -
వైఎస్సార్ బర్త్‌డే : వైఎస్ జగన్ ఉద్వేగభరిత ట్వీట్
-
విజయ భగీరథుడు వైఎస్
నేల ఉన్నా నీరు లేక.. భూమున్నా దున్నుకోలేక.. సొంత పొలమున్నా పంటలు కలిసిరాక బతుకుతెరువు కోసం పరాయి పంచన కూలీలై కష్టాలు పడుతున్న విజయనగం జిల్లా రైతుల పాలిట మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అపర భగీరథుడయ్యాడు. ఆసియాలోనే తొలి రబ్బరు డ్యామ్‌ను జంఝావతి నదిపై నిర్మించి చరిత్ర కెక్కారు. పెద్దగెడ్డ నుంచి పంట చేలకు సాగునీరందేలా రిజర్వాయర్ కట్టించారు. తోటపల్లి ప్రాజెక్టును తొంబైశాతం పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా సాగు, తాగునీరు ఇబ్బందుల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు అహర్నిశలు శ్రమించారు. అన్నదాతలకు దేవుడయ్యారు. ఆ మహనీయుని 69వ జయంతి(జూలై 8) సందర్భంగా ఆయన సేవలను తలచుకుంటూ జిల్లా వాసులు అంజలి ఘటిస్తున్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తలపెట్టిన జలయజ్ఞం పథకంలో విజయనగరం జిల్లాకు అధిక ప్రాధాన్యమిచ్చారు. జిల్లా రైతుల సాగునీటి కష్టాల తీర్చాలన్న ధ్యేయంతో పనిచేశారు. ప్రాజెక్టులు నిర్మించి పంటల సాగుకు ఊతమిచ్చారు. ఆయన హయాంలో జిల్లాలో జరిగిన అభివృద్ధిని ఓ సారి పరికిస్తే... బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాలను కలుపతూ తోటపల్లి సాగునీటి కాలువను నిర్మించారు. రూ.84 కోట్లతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ, సుజలధార తాగునీటి పథకాన్ని చీపురుపల్లి నియోజకవర్గానికి మంజూరు చేశారు. వేపాడ మండలంలో విజయరామసాగర్‌ను మినీరిజర్వాయర్‌గా తీర్చిదిద్దాలని నిధులు మంజూరు చేశారు. మక్కువ మండలంలో సూరాపాడు ప్రాజెక్టు నిర్మించారు. వెంగళరాయ సాగర్ రిజర్వాయర్ కాలువలు బాగు చేశారు. రబ్బరు డ్యామ్‌తో తీరిన సాగునీటి కష్టాలు... కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 1976 లో జంఝావతి డ్యామ్‌కు శ్రీకారం చుట్టారు. కానీ పూర్తిస్థాయిలో భూ సమీకరణ చేపట్టకపోవడంతో ఒడిశాతో వివాదం ఏర్పడింది. ఈ వివాదాన్ని తొ లగించేందుకు అటు ఒడిశా, ఇటు ఏప్రీ ప్రభుత్వాలు పలు మార్లు చర్చలు జరిపినా ఒడిశా ప్రభుత్వం ముంపు గ్రామాలను వదులు కోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో జంఝావతి డ్యాం రివర్ గ్యాప్ మూసివేయకుండా వదిలేశారు. దీంతో జంఝావతి నది గుండా ప్రవహించే నీరు వృథాగా పోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను గమనించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో ఆస్ట్రియా టెక్నాలజీతో రూ.5 కోట్లతో ఆసియాలోనే మొట్ట మొదట సారిగా రబ్బరు డ్యామ్‌ను నిర్మించారు. రబ్బరు డ్యామ్ ద్వారా నీటిని నిల్వచేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పొలాలకు సాగునీటిని అందించే అవకాశం కలిగింది. రబ్బరు డ్యామ్ లోపల భాగంలో 0.03 టీఎంసీలు నీరు నిల్వ ఉండి లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుకూలంగా ఉంటుంది. దీని ద్వారా 12 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ రిజర్వాయర్ పేరు చెప్పగానే ఇక్కడ ప్రజలకు గుర్తుకువచ్చేది ముందుగా వైఎస్సార్. జలయజ్ఞంలో భాగంగా సుమారు రూ.100 కోట్లతో పాచిపెంట పెద్దగెడ్డ రిజర్వాయర్‌ను నిర్మించారు. ఇక్కడ ప్రజలకు తాగు నీరు, రైతులకు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ రిజర్వాయర్‌ను 2006లో రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సమయంలోనే సమీపంలోని అరకు –పాచిపెంట ప్రాంతాల్లో హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇక్కడ అందాలను చూసి అబ్బురపోయారు. పర్యాటకప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమాలోచనలు చేశారు. అప్పుడే సుమారు 2 ఎకరాల పార్క్ ఏర్పాటు జరిగింది. రిజర్వాయర్‌లో ఉండే నాటు పడవల స్థానంలో విశాఖపట్నం నుంచి మిషన్బోట్లను తీసుకువచ్చారు. రాజశేఖరరెడ్డి హయాంలోనే... గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి ప్రాజెక్టుకు రాజశేఖరరెడ్డి హయాంలోనే శంకుస్థాపన జరిగింది. సింహభాగం పనులు టీడీపీ అధికారం చేపట్టకముందే జరిగాయి. తోటపల్లి చానల్ ద్వారా సుమారు 3వేల ఎకరాలకు నీరందించేందుకు పైలాన్ ప్రారంభోత్సవాన్ని వై.ఎస్ అప్పట్లో చేశారు. పార్వతీపురం మండలం అడారిగెడ్డ నిర్మాణానికి కూడా రాజశేఖరరెడ్డి హయాంలోనే నిధుల కేటాయింపులు జరిగాయి. విజయనగరం పట్టణానికి తాగునీటి కోసం నిర్మించతలపెట్టిన తారకరామతీర్థసాగర్‌కు బడ్జెట్ కేటాయించడంలో వైఎస్ చొరవ తీసుకున్నారు. 2007లో సుమారు రూ.187 కోట్లను విడుదల చేశారు. నెల్లిమర్ల పట్టణంతో పాటు గుర్ల, గరివిడి మండలాలకు తాగునీటిని అందించేందుకు రామతీర్థంమంచినీటి పథకాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. -
ఇడుపులపాయలో మహానేతకు ఘన నివాళి
-
ప్రజల మనిషి 'వైఎస్'
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రజల గుండెల్లో కొలువై ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను ఆకట్టుకోలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల హృదయాలను దోచుకున్న నిజమైన నాయకుడు రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రాజశేఖరరెడ్డి 69వ జయంతిని జిల్లాలో అన్ని గ్రామాల్లో ప్రజలందరూ పండగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ జంక్షన్ (ఏడురోడ్లు కూడలి) వద్ద ఉన్న దివంగత నేత విగ్రహం వద్దకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తెల్లదుస్తులతో హాజరు కావాలని సూచించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడ నుంచి పార్టీ జిల్లా కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి 4.30 గంటలకు పార్టీ జిల్లా నూతన కార్యనిర్వాహక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. వైఎస్ జయంతి కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా కో–ఆర్డినేటర్ మడ్డు రాజారావు అధ్యక్షత వహిస్తారన్నారు. గొప్పలకు పోతున్న సర్కార్ తెలుగుదేశం ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో ఏటా 5 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి నాలుగేళ్లలో మూడు లక్షల ఇళ్లే అరకొరగా నిర్మించిందని తమ్మినేని సీతారాం అన్నారు. దీన్ని కూడా పెద్ద ఆర్బాటం చేయడం సిగ్గుచేటన్నారు. అన్ని వర్గాల వారికీ వివిధ సంక్షేమ పథకాలను అందించిన ఘనం కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మాత్రమే దక్కిందన్నారు. 9న విద్యార్థుల సమస్యలపై డీఈవోకి వినతి వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరచుకున్నప్పటికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్కాలర్షిప్లు అందక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సీతారాం చెప్పారు. అలాగే కార్పొరేట్ విద్యా విధానంలో టీడీపీకి చెందిన కీలక మంత్రులు ఇద్దరు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసేలా చట్టాలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్యలపై ఈ నెల 9వ తేదీన జిల్లా విద్యాశాఖాధికారి ఎం.సాయిరాంకు వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్ర ఆధ్యర్యంలో వినతిపత్రం అందజేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్ర, అధికార ప్రతినిధి శిమ్మ రాజశేఖర్, నాయకులు మామిడి శ్రీకాంత్, కోరాడ రమేష్, తంగుడు నాగేశ్వరరావు, సుగుణారెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్ జయంతి
-
సంక్షేమానికి సాక్ష్యం
‘ఎన్నికల ముందు నేను చేసిన వాగ్ధానం ప్రకారం రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించే కార్యక్రమానికి చెందిన ఫైలుపై తొలి సంతకం చేస్తున్నాను’. అంటూ తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఒకే ఒక్క నిమిషంలో... ఒకే మాటతో.. ఒక్క సంతకంతోనే తానేమిటో, విశ్వశనీయత, చేసిన వాగ్ధానాల పట్ల నిబద్ధత, ప్రజా సమస్యల పట చిత్తశుద్ధి ఏమిటో రుజువు చేశారాయన. ఒక్కమాటలో చెప్పాలంటే సంక్షేమం, అభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యంగా దివంగత నేత వైఎస్ పాలన సాగింది. వెనుకబడిన జిల్లాలోనూ అభివృద్ధి ప్రకాశించింది. నేడు వైఎస్ జయంతి సందర్భంగా ఆయన హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో 2004కు ముందు తెలుగుదేశం హయాంలో కరువు కాటకాలు విలయతాండవం చేశాయి. తాగునీరు అందని దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకొని భరోసా కల్పించేందుకు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 1475 కి.మీ. సుదీర్ఘ పాదయాత్ర చేశారు. రాజకీయరంగంలో ఇది సరికొత్త చరిత్ర. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి వైఎస్ సీఎం అయ్యారు. 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ ప్రజారంజకపాలనను సాగించారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఇందిరాక్రాంతి పథకం, రూ.2 కిలో బియ్యం, ఇందిర ప్రభ, రాజీవ్‌గృహకల్ప, రాజీవ్ యువశక్తి, ఫీజురీఎంబర్స్మెంట్ తదితర పథకాలను ప్రవేశపెట్టారు. ’75 మాత్రమే ఉన్న పింఛన్‌ను ’200 పెంచారు. 45,600 కోట్లతో జలయజ్ఞం ద్వారా 26 నీటి ప్రాజెక్టులు ప్రారంభించి వాటిలో కొన్నింటిని పూర్తి చేసి లక్షలాది ఎకరాలు సాగు, తాగు నీటినిఅందించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనకే దక్కింది. మొత్తంగా వైఎస్ ఐదేళ్ళ పాలన జనరంజకంగా సాగింది. 2009 శాసనసభ ఎన్నికల్లో 156 స్థానాలు గెలుచుకొని రెండోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు వైఎస్. 2009, సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ మృతి చెంది తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. వైఎస్ ఐదేళ్ల పాలనాకాలంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగింది. జలయజ్ఞంలో భాగంగా జిల్లా పరిధిలో వెలిగొండ, రామతీర్థం, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టులకు పెద్ద నిధులిచ్చి పనులు చేయించిన ఘనత వైఎస్‌కే దక్కింది. గుండ్లకమ్మ ప్రాజెక్టు దాదాపు రూ.600 కోట్లు నిధులిచ్చి 95 శాతం పనులను పూర్తి చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన నిధుల్లో 80 శాతం నిధులు వైఎస్ హయాంలో కేటాయించినవే. వందల కోట్లు వెచ్చించి అన్ని నియోజకవర్గాల్లో తారు, సిమెంటు రోడ్లను నిర్మించారు. ప్రధానంగా రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్, మెడికల్ కాలేజీని నిర్మించారు. ఆరోగ్యశ్రీ ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి పేదల ప్రాణాలను నిలబెట్టారు. వేలాది మంది రైతులకు రుణవిముక్తి కలిగించారు. మహిళలను ఆదుకున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించారు. వృద్ధులకు ఫించన్లు ఇచ్చి ఆదుకున్నారు. ప్రతి పేదవాడికి ఇంటిని నిర్మించి ఇచ్చాడు. అందుకే వైఎస్ జనం గుండెల్లో దేవుడయ్యాడు. ఒంగోలు నియోజకవర్గంలో రూ.250 కోట్లతో వెయ్యి పడకల రిమ్స్ ఆస్పత్రిని వైఎస్ హాయంలోనే నిర్మించారు. ఒంగోలు నగరానికి తాగునీటిని అందించేందుకు రామతీర్థం నుంచి పైప్‌లైన్‌ను నిర్మించారు. నగరంలో ఏడు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించి ప్రజలకు నీటిని అందించారు. మినీస్టేడియం మంజూరు చేశారు. కొత్తపట్నం–ఒంగోలు ప్లైఓవర్‌ను మంజూరు చేశారు. పోతురాజు కాలువ ఆధునీకరణకు నిధులిచ్చారు. వేలాది మందికి ఇంటి స్థలాలిచ్చి పక్కా గృహాలు నిర్మించారు. జిల్లా జైలును నిర్మించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వెలిగొండ ప్రాజెక్టులో రూ.2 వేల కోట్లకుపైగా నిధులిచ్చి పనులను ప్రారంభించటమే గాక వేగవంతం చేశారు. యర్రగొండపాలెంలో మోడల్ డిగ్రీ కాలేజీని నిర్మించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో చీమకుర్తి మండలంలో రామతీర్థం జలాశయాన్ని నిర్మించారు. దీని ద్వారా 70 వేల ఎకరాలకు సాగు నీటితో పాటు ఈ ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించారు. మద్దిపాడు మండలంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించి 80 వేల ఎకరాలకు సాగునీరు, 84 గ్రామాలకు తాగునీరు అందించారు. గుండ్లాపల్లిలో పరిశ్రమల కేంద్రాన్ని నెలకొల్పారు. పర్చూరు నియోజకవర్గంలో రూ.400 కోట్లతో నాగార్జున సాగర్ కాలువ ఆధునీకరణ పనులు చేపట్టి ఆయకట్టుకు నీరందించిన ఘనత వైఎస్‌కే దక్కింది. మార్కాపురం నియోజకవర్గంలో రూ.35 కోట్లతో సాగర్ జలాలను తీసుకువచ్చారు. మార్కాపురంలో రైల్వేబ్రిడ్జిని నిర్మించారు. ఈ నియోజకవర్గ పరిధిలో వెలిగొండ ప్రాజెక్టులు పనులను వేగవంతం చేశారు. కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలం చెన్నుపాడు వద్ద రూ.50 కోట్లతో సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. పొన్నలూరు, జరుగుమల్లి, కొండపి, మర్రిపూడి మండలాల పరిధిలో 9,500 ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు పలు గ్రామాలకు తాగునీటిని సైతం వైఎస్ అందించారు. దర్శి నియోజకవర్గంలో రూ.120 కోట్లతో రక్షిత మంచినీటి పథకం నిర్మించారు. మరో రూ.120 కోట్లతో సాగర్ కాలువల ఆధునీకరణ పనులు చేపట్టారు. రూ.2 కోట్లతో మార్కెట్ కమిటీ భవనాలను నిర్మించారు. 133 కె.వి. విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. కనిగిరి నియోజకవర్గంలో రూ.175 కోట్లతో కనిగిరికి సాగర్ జలాలతో కనిగిరి రక్షిత మంచినీటి పథకాన్ని వైఎస్ 2008 ఆగస్టులో ప్రారంభించారు. కందుకూరు నియోజకవర్గంలో పట్టణ వాసులకు రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మించి తాగునీటిని అందించారు. రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువను వైఎస్ ప్రారంభించారు. గిద్దలూరు నియోజకవర్గంలో రూ.12 కోట్లతో బైరేనిగుండాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. గిద్దలూరు నగర పరిధిలోని 6 గ్రామాలకు పరిసరాల్లోని 14 గ్రామాలకు దీని ద్వారా తాగునీటిని అందించారు. రాచర్ల మండలంలో రూ.22 కోట్లు వెచ్చించి రామన్నకతువ ప్రాజెక్టును నిర్మించారు. దీని ద్వారా 20 గ్రామాలకు తాగునీటిని అందించారు. గుండ్లమోటు ప్రాజెక్టుకు వైఎస్ రూ.11 కోట్లు నిధులిచ్చారు. చీరాల నియోజకవర్గంలో కృష్ణా డెల్టా ఆధునీకరణ పనులకు రూ.2 వేల కోట్లు కేటాయించారు. చేనేతలకు 50 సంవత్సరాల వయస్సుకే పింఛన్‌ను ఇప్పించారు. చిలపనూరుపై ఉన్న 22 శాతం ఎక్సైజ్ సుంకాన్ని వైఎస్ రద్దు చేశారు. రంగు, రసాయనాలు, నూలుపు 10 శాతం సబ్సిడీ ఇచ్చారు. = అద్దంకి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో నార్కెట్‌పల్లి, అద్దంకి, మేదరమెట్ల రాష్ట్రీయ రహదారిని నిర్మించారు. జలయజ్ఞంలో భాగంగా బల్లికురవ మండలంలో భవనాశి రిజర్వాయర్‌ను నీరిచ్చి రూ.5 వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. కొరిశపాడులో యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి 5 వేల ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత వైఎస్‌కే దక్కింది. వైఎస్ హయాంలో అభివృద్ధి పరుగులు వెలిగొండ పనులు వేగవంతం గుండ్లకమ్మ, రామతీర్థం రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి రూ.400 కోట్లతో సాగర్ కాలువల ఆధునికీకరణ రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్ ఆస్పత్రి అద్దంకిలో రూ.200 కోట్లతో రాష్ట్రీయ రహదారి కందుకూరులో రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ కనిగిరిలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం కొండపిలో రూ.50 కోట్లతో సంగమేశ్వరం ప్రాజెక్టు -
వైఎస్సార్ ఆలోచన విధానమే నా అజెండా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాజశేఖరరెడ్డి మహానుభావుడు.. వందల మందితో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకునే వరకు సాగింది. 1978లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. నేను 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించాను. 1985లో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను గెలుపొందిన క్రమంలో ఆయన సీఎల్పీ లీడర్‌గా ఉన్నారు. వైఎస్సార్‌తో 1982 నుంచి పరిచయం ఉన్నా 1985 నుంచి మంచి పరిచయం ఏర్పడి మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం కొనసాగింది. ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నేను 1985లో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాను. అప్పటికే ఆయన సభలో సీనియర్. 1978, 82 ,85లో వరుసగా మూడుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా, సభలో సీఎల్పీ లీడర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆయనతో నాకున్న మంచి పరిచయాల వల్ల అనేక అంశాలపై సభలో పార్టీ తరుఫున మాట్లాడేవాడిని. నియోజకవర్గ సమస్యలపై ఎక్కువగా మాట్లాడాలని, నీటిపారుదల రంగం, ఇతర అంశాలపై సభలో మాట్లాడాలని ప్రోత్సహించేవారు. ఆయనతో అలా మొదలైన అనుబంధం ఢిల్లీలో మరింత బలపడటంతోపాటు మరింత సాన్నిహిత్యం కలిగేలా చేసింది. 1989లో ఇద్దం ఒకేసారి పార్లమెంట్ సభ్యులమయ్యాం. నేను ఒంగోలు పార్లమెంట్ నుంచి మొదటిసారే 97,370 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఆయన మొదటిసారి కడప పార్లమెంట్ నుంచి 1,66,752 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక అప్పట్నుంచి వీలు చిక్కినప్పుడల్లా, ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు నిత్యం కలవడంతోపాటు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో గంటల సేపు మాట్లాడుకునేవాళ్లం. ఇద్దరివి పక్కపక్క జిల్లాలు కావడంతో రాజకీయాలు మొదలుకొని అన్ని అంశాలపై చర్చలు సాగేవి. ఆ తర్వాత 2004లో ఆయనే నాకు నరసరావుపేట పార్లమెంట్ సీటు ఇచ్చారు. ఆ తర్వాత 2009లో నెల్లూరు సీటు ఇచ్చారు. ఆయన సీఎం అయిన తర్వాత కూడా మా అనుబంధం కొనసాగింది. 2004 ఎన్నికలప్పుడు అన్నా మీరు నరసరావుపేట పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ఆయనే స్వయంగా చెప్పారు. మీ ఇష్టం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని చెప్పాను. దానికి అనుగుణంగానే పోటీ చేశాను. ఆయన నరసరావుపేట పార్లమెంట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ కూడా మంచి మెజార్టీతో ఎంపీగా గెలుపొందాను. నా ఎంపీ నిధులతోపాటు కొన్ని పనులు, జిల్లా అవసరాల గురించి ఆయనను కలిసిందే తడువుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత 2009లో నెల్లూరు పార్లమెంట్ జనరల్ సీటు కావటంతో అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందాను. ఆయన మరణానంతం ఆయనపై ఉన్న అభిమానం, వైఎస్ జగన్ నాయకత్వంపై భరోసాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి కొనసాగుతున్నాను. 2009 తర్వాత 2011 ఉపఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో వరుసగా నెల్లూరు నుంచి గెలుపొందాను. దివంగత వైఎస్సార్ రాష్ట్రానికి తండ్రి లాంటి వారు. -
ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారు
-
హ్యాపీ బర్త్‌డే నాన్న : వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, రామచంద్రాపురం : నేడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజన్న తనయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ట్విటర్లో స్పందించారు. తండ్రి వైఎస్సార్ జయంతి రోజే నేను చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 2500 కిలోమీటర్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండటం కేవలం యాధృచ్ఛికమే కాదు, ఏపీ ప్రజలతో పాటు వైఎస్సార్ ఆశీస్సులు కూడా నాకు ప్రతిబింబించేలా ఉంది. స్వర్గం నుంచి నాన్న వైఎస్సార్ ఆశీర్వదించారు. హ్యాపీ బర్త్‌డే నాన్న. ఎల్లప్పుడూ మాకు అండగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు’ అని వైఎస్ జగన్ ఉద్వేగభరితంగా ట్వీట్ చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేడు 208వ రోజు ప్రారంభమైంది. అశేష జనవాహిని తరలిరాగా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య వైఎస్ జగన్ తన పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. The 2500KM milestone falling on YSR garu's birthday is not a mere coincidence. It shows that this #PrajaSankalpaYatra is blessed not only by the people of AP, but also YSR himself from the heaven above! Happy birthday, nanna. Thank you for always being with us. — YS Jagan Mohan Reddy (@ysjagan) 8 July 2018 -
సింహపురి గుండెల్లో వైఎస్సార్
జనం అవసరాలు గుర్తించి సంక్షేమ పథకాలతో భరోసానిచ్చి 108, ఆరోగ్యశ్రీలతో ప్రాణం పోసి ఇందిరమ్మ ఇళ్లతో గూడు కల్పించి ప్రాజెక్టులతో జల సిరులు పారించి అన్నదాతల కన్నుల్లో వెలుగై మెరిసి ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో విద్యనందించి సింహపురి జనం గుండె చప్పుడై నిలిచినావు ఓ రాజన్నా.. సింహపురి గడ్డపై చెరగని ముద్ర ఆయనది. పాలనను పరుగు తీయించిన, రాజకీయంగా అనేక మందికి మార్గదర్శకుడిగా, గురువుగా నిలిచిన చరిత్ర ఆయనది. దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యానికి గురై అసంపూర్ణంగా, అరకొరగా ఉన్న ప్రాజెక్ట్‌లను గాడిలో పెట్టి సాగునీరు అందించారు. సింహపురి సీమను సస్యశ్యామల ప్రాంతంగా అభివృద్ధి చేశారు. సాగునీటి సమస్యలు తీర్చి జిల్లాను ఆంధ్రరాష్ట్రానికి అన్నపూర్ణగా తయారు చేయడం వెనుక ఆయన చేసిన కృషి చరిత్రాత్మకం. కేవలం ఐదేళ్ల పదవీ కాలంలో సింహపురి రూపురేఖలు మార్చారు. రాజకీయంగా ఉద్దండులకు నెలవైన జిల్లాలో అనేక మంది కొత్త వారిని నేతలుగా తీర్చిదిద్ది ప్రజాప్రతినిధులను చేసి చట్టసభల్లో తన పక్కనే వారికి స్థానం కల్పించిన మహనీయ వ్యక్తిత్వం ఆయనది. అందుకే నెల్లూరు జిల్లా ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్థానం సుస్థిరం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యమంత్రిగా 2004 నుంచి 2009 వరకు జిల్లాలో అభివృద్ధి పరుగు తీసిందనేది అందరూ అంగీకరించే బహిరంగ సత్యం. రాష్ట్ర వ్యాప్త కీలక ఘట్టాలకు కూడా జిల్లానే ఆయన వేదికగా మలిచారు. కోట్లాది మంది ప్రాణాలను నిలిపిన ఆరోగ్యశ్రీని ప్రారంభించింది ఈ జిల్లాలోని ఉదయగిరిలోనే. దేశంలోనే అగ్రగామి పోర్టులో ఒకటైన కృష్ణపట్నం పోర్టుకు ఆయనే బీజం వేసి పనులు పరుగు తీయించి ప్రారంభించిన ఘనత కూడా ఆయనదే. జిల్లాలో పుష్కలంగా ఉన్న ల్యాండ్ బ్యాంక్‌ను సద్వినియోగం చేసుకుని సెజ్‌ల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఎన్నో పరిశ్రమల ఏర్పాటుకు ఆయనే బీజాలు వేశారు. రాజకీయ గురువు ఆయనే జిల్లాలో అనేక మంది రాజకీయ నేతలకు మార్గదర్శిగా మారి గురువుగా ఉన్న ఖ్యాతి దివంగత మహానేతకే దక్కింది. రాజకీయ ఉద్దండులే జిల్లాలను దశాబ్దాలుగా శాసిస్తున్న తరుణంలో రాజకీయాల్లోకి కొత్తవారిని తీసుకు వచ్చి వారి వెన్నంటే నిలిచి ప్రజాప్రతినిధులుగా తయారు చేసి సరికొత్త రాజకీయలకు నాంది పలికారు. జిల్లాలో కేంద్ర మంత్రులు మొదలుకుని జెడ్పీ చైర్మన్ వరకు అనేక మంది దివంగత వైఎస్సార్ చలవతోనే పదవులు అలంకరించారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మార్చిన వైనం నెల్లూరు గ్రేడ్–1 మున్సిపాలిటీ వైఎస్సార్ హయాంలోనే నగరపాలక సంస్థగా అవతరించింది. నూతన భవనం నిర్మాణానికి ఆయనే నిధులు మంజూరు చేశారు. 1884 నుంచి మున్సిపాలిటీ ఉన్న నెల్లూరుకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ క్రమంలో 2004లో ప్రజాప్రతినిధులు అడిగిందే తడవుగా 2004లో కార్పొరేషన్‌గా స్థాయిని పెంచారు. ఈ క్రమంలో ఆయన మరణానంతరం నెల్లూరు కార్పొరేషన్ భవనానికి ఆయన పేరే పెట్టి నేతలు మహానేతపై అభిమానం చాటుకున్నారు. విద్యార్థుల భవితకు విక్రమ సింహపురి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఏర్పడింది. 2008 జులై 14న కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 28న కొత్తగా వర్సిటీకి వైస్ ఛాన్సలర్‌ను నియమించారు. ఆగస్టులో 6 కోర్సులతో నూతనంగా విక్రమ సింహపురి యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ యూనివర్సిటీకి వెంకటాచలం మండలం కాకుటూరులో 83 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీకి రూ.25 కోట్లు నిధులను విడుదల చేశారు. 2009 ఫిబ్రవరి 21న 42 టీచింగ్ పోస్టులు, 33 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేశారు. ప్రస్తుతం కాకుటూరులో నిర్మించిన నూతన భవనంలో 23 కోర్సులతో యూనివర్సిటీని నిర్వహిస్తున్నారు. పోర్టు నుంచి సెజ్‌ల వరకు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు మొదలుకుని సెజ్ నిర్మాణం వరకు అన్ని వైఎస్సార్ హయాంలో జరిగినవే. ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేయాలన్న తలంపుతో నాటి సీఎం చంద్రబాబు 1996లో ఈ పోర్టును నాట్కో సంస్థకు అప్పగించారు. అయితే చంద్రబాబు 9 ఏళ్ల పాలనతో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత ఈ పోర్టును నవయుగ సంస్థకు అప్పగించి పనులు వేగంగా చేసేలా చర్యలు తీసుకుని ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయించారు. 2008 జూలై 17న నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో కలిసి వైఎస్సార్ ఈ పోర్టును ప్రారంభించారు. పోర్టు ద్వారా పారిశ్రామికాభివృద్ధిలో నెల్లూరు జిల్లాకు కేంద్ర బిందువు అయింది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో మూడు సెజ్‌లు ఏర్పాటు చేశారు. తడ మండలం మాంబట్టులో ఏర్పాటు చేసిన సెజ్‌లో సుమారు 20 కంపెనీలు దాకా వచ్చాయి. ఇందులో సుమారు 15 వేల మందికి ఉపా«ధి లభిస్తుంది. నాయుడుపేట మండలం మేనకూరులో ఏర్పాటు చేసిన సెజ్‌లో సుమారు 15 కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా సుమారుగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి. నెల్లూరు–చిత్తూరు జిల్లా సరిహద్దులోని సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన శ్రీసిటీ సెజ్‌లో సుమారు 50 కంపెనీలు వరకు ఏర్పాటు చేశారు. సంగం, నెల్లూరు బ్యారేజీలు సోమశిల రిజర్వాయర్ నీటి సామర్థ్యాన్ని 78 టీఎంసీలకు పెంచి జిల్లాలోని రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పెన్నా డెల్లా ఆధునికీకరణ, సంగం, నెల్లూరు బ్యారేజీలకు శంకుస్థాపన, ప్రధానంగా స్వర్ణముఖి బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు. మెట్ట ప్రాంతాలకు పంపింగ్ స్కీం ద్వారా తాగు, సాగునీరు అందించే హైలెవల్ కెనాల్‌కు రూ.1000 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది ఆయన హయాంలోనే కావటం విశేషం -
బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్సార్
అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేశారు. ఆదివారం వైఎస్ జయంతిని పురస్కరించుకుని శనివారం బీసీ సెల్ నగర కమిటీ ఎం. శ్రీనివాసులు, పార్టీ 48వ డివిజన్ కన్వీనర్ ఎం.వెంకటేష్ ఆధ్వర్యంలో స్థానిక 48వ డివిజన్లో వివేకానంద నగర పాలక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ముందుగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు అనంత చంద్రారెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులను అందజేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వై.వి.శివారెడ్డి, మీసాల రంగన్న, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, డివిజన్ నాయకులు భారతమ్మ, రవికుమార్‌రెడ్డి, రామచంద్రయ్యస్వామి, ఎర్రిస్వామి, మురళీ, రామకృష్ణ, ఆదినారాయణరెడ్డి, రామయ్య, డివిజన్ల కన్వీనర్లు వడ్డే రామచంద్ర, ఈడిగ భాస్కర్, నిజాం, సైఫుల్లాబేగ్, డిస్ శీనా, ఖాజా పాల్గొన్నారు. అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో... నాయకులు అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక 50వ డివిజన్లోని స్పందన మానసిక వికలాంగుల పాఠశాలలో వైఎస్ జయంతిని జరుపుకొన్నారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన నాయకులు అనంత చంద్రారెడ్డి, కోగటం విజయభాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పలకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ పాలన అభివృద్ధే మంత్రంగా సాగిందన్నారు. అన్ని వర్గాల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, మహిళా కమిటీ నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకులు కసనూరు రఘునాథరెడ్డి, రిలాక్స్ నాగరాజు, రాధాకృష్ణ, సురేష్, , జిలాన్, గైబు, బాషా, సుజాతరెడ్డి, భారతి, లావణ్య పాల్గొన్నారు. -
‘పుర’ భగీరథుడు వైఎస్సార్
హిందూపురం అర్బన్: హిందూపురం ప్రాంత ప్రజల పాలిట అపర భగీరథుడుగా కీర్తింపబడుతున్నారు మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఈ ప్రాంత ప్రజల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. దశాబ్దాల నుంచి దాహార్తితో తల్లడిల్లుతున్న హిందూపురం ప్రజలకు దాదాపు రూ.650 కోట్ల వ్యయంతో శ్రీరామరెడ్డి నీటిపథకం ద్వారా తాగునీరు అందించి వైఎస్సార్ ఇక్కడి ప్రజల ఇలవేల్పు అయ్యారు. నియోజకవర్గంలోని 220 గ్రామాలకు తాగునీరు హిందూపురంలో 2008 సంవత్సరం వరకు ఇక్కడ ప్రతి కుటుంబం అటు తాగడానికి, ఇటు వినియోగానికి పూర్తిగా ప్రైవేటు ట్యాంకర్లపైనే ఆధారపడేది. బిందె రూ.4 నుంచి రూ.5 వరకు కొనేవారు. ప్రతి కుటుంబం నెలకు నీటికోసమే రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇలా దశాబ్దాలుగా పట్టణ ప్రజలు నీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. మాజీ సీఎం ఎన్టీ రామారావు నుంచి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక అభిమానం అని చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వాలు ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చలేకపోయారు. ఇంత నీటి ఎద్దడి ఉన్న ప్రాంతానికి ప్రచారానికి విచ్చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్థానికుల వినతి మేరకు తాగునీటి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఊహించని రీతిలో పీఏబీఆర్ నుంచి పైపులైన్ల ద్వారా నీటిని తరలింపజేసి రూ. 650 కోట్ల వ్యయంతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని చేపట్టారు. దాదాపు 14 వందల కిలోమీటర్ల మేరకు పైపులైన్లు వేయించి 2008 డిసెంబరు 30న వైఎస్సార్ తన స్వహస్తాలతో నీటి పథకాన్ని ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం హిందూపురం ప్రజల దాహార్తిని తీర్చారు. వైఎస్సార్ పుణ్యమా అని పట్టణ ప్రజల దాహార్తి తీరడమే కాకుండా పక్కనున్న పరిగి మండలంతోపాటు హిందూపురం నియోజకవర్గం పరిధిలోని మొత్తం 220 గ్రామాలకూ తాగునీరు అందుతున్నాయి. అయితే ఆయన తర్వాత గద్దెనెక్కిన పాలకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు పథకాన్ని నిర్వీర్యం చేయడానికి యత్నాలు చేయడంతో పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిలో నీరు అందకుండా పోతోంది. గొల్లపల్లి నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నీటిని తీసుకువచ్చి గత వేసవికాలంలో అందిస్తానని బాలకృష్ణ చెప్పినా నేటి వరకు పనులు పూర్తి చేయలేకపోయారు. జలయజ్ఞంలో హిందూపురం ప్రజలకు భాగస్వామ్యం జలయజ్ఞంలోనూ హిందూపురం ని యో జకవర్గ ప్రజలను వైఎస్సార్ భాగస్వామ్యం చేశారు. అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కింద మడకశిర ఉప కాలువ ద్వారా ఈ ప్రాంతంలో ని చెరువులకు నీరందించే బృహత్తర కార్యక్రమానికి మహానేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. మడకశిర ఉపకాలువ కింద 55వ ప్యాకేజీ లో 64 కిలోమీటర్ల మేర కాలువను త వ్వేందుకు చొరవ తీసుకొన్నారు. మొదటిసారి రూ.48 కోట్లతో ఈ పనులను చేపట్టారు. ఈ ప్యాకేజీ కింద హిందూపురం, పరిగి, లేపాక్షి, చిలమత్తూరు మండలాల పరిధిలో ఉన్న 99 చెరువులకు నీరందించడానికి అవకాశం కలిగింది. ఈ పనులను దాదాపు 90 శాతం మేరకు పూర్తి చేశారు. ఆయన తర్వాత గద్దెనెక్కిన పాలకులు ఈ పనులను నత్తనడకన చేపడుతూ వచ్చారు. గొల్లపల్లి నుంచి లేపాక్షి వరకు హంద్రీ–నీవా నీటిని తీసుకొచ్చేందుకు కాల్వలు పూర్తి చేశారు. కాని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కొన్ని అడ్డంకులు తొలగింపజేసి తాత్కలిక పనులు చేసిందేగాని పూర్తి స్థాయిలో చేపట్టి చిలమత్తూరు వరకు హంద్రీ–నీవా కాలువ నీటిని తీసుకురావడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. వైఎస్సార్ వల్లే సొంతింటి కల నెరవేరింది లేపాక్షి: నేను 18 ఏళ్ల క్రితం కర్ణాటక నుంచి వలస కూలీగా లేపాక్షి గ్రామానికి వచ్చాను. నాకు స్వంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. కనీసం భజంత్రి పనికి కూలీగా పోతే తప్ప పూటగడవని పరిస్థితి ఉండేది, చివరకు ఇంటి అద్దె చెల్లించలేకపోయాను. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు గృహనిర్మాణ పథకంను అమలు చేశారు. ఈ ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి అప్పటి ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి ఇల్లులేని నిరుపేదలను గుర్తించి ఇంటి పట్టాలు ఇచ్చి ఇల్లును కూడా మంజూరు చేసింది. దీంతో నా సొంతింటి కల నెరవేరింది. ప్రస్తుతం కుటుంబసభ్యులతో సొంతింటిలో హాయిగా ఉన్నాను. ఎవరైనా ఇంటిని నిర్మించుకోలేక అసంపూర్తిగా ఉన్న ఇంటికి కూడా ప్రత్యేక నిధులు మంజూరు చేసిన మహానేత వైఎస్సార్. ఆయన రుణం ఎన్నిటికి తీర్చుకోలేను. శ్రీనివాసులు పిల్లిగుండ్ల కాలని, లేపాక్షి నాకు ప్రాణం పోసిన దేవుడు రాజన్న హిందూపురం టౌన్: నా పేరు పూల ముద్దమ్మ, ఏదో కూలీనాలి చేసుకొని బతుకుతున్నాను. 2012లో కూలి పని చేస్తుండగా ఉన్న పళంగా గుండె నొప్పితో పడిపోయాను. నా భర్త వెంటనే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించాడు. ఆస్పత్రిలో గుండెకు బైపాస్ సర్జరీ చేయాలన్నారు. ఆపరేషన్‌కు డబ్బులు లేక మందులు వాడి మిన్నుకుండిపోయాను. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం గురించి గ్రామంలోని పలువురు వివరించారు. వెంటనే వైద్యులను సంప్రదించగా, వారు గుంటూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి పంపించి, దాదాపు రూ.4 లక్షలు అయ్యే బైపాస్ సర్జరీని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేయించారు. ఆ మహానేత రాజన్న ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీనే నన్ను కాపాడింది. నాకు ప్రాణం పోసిన దేవుడు రాజన్న. నేటిక ఆయన ఫొటోను దేవున్ని పూజించే గదిలో ఉంచి పూజిస్తున్నాము. పూలముద్దమ్మ, మోతుకపల్లి. -
అభివృద్ధే వైఎస్సార్ పంథా
పోలవరం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మంజూరైన వివిధ పథకాలు జిల్లాలో ఒక్కొక్కటిగా నేడు అక్కరకు వస్తున్నాయి. ఆ పథకాలే ఇప్పుడు ప్రజలకు ప్రధానమైన సాగునీటి అవసరాలను తీర్చటంతో పాటు, అనేక గ్రామాలకు, పంటచేలకు రక్షణగా నిలిచాయి. ప్రధానంగా దశాబ్దాల కాలంగా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని పశ్చిమ ఏజెన్సీలో కూడా అభివృద్ధిని పరిచయం చేసిన ఘనత వైఎస్సార్‌దే. ఒక్క ఏజెన్సీ ప్రాంతంలోనే కాక, దేశంలోనే పెద్ద సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయటంతో పాటు, అవసరమైన అనుమతులు కూడా తీసుకువచ్చారు. సాహసోపేతంగా పనులు ప్రారంభించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2004లో అప్పటి రూ.10,151 కోట్ల అంచనాతో శంకుస్థాపన చేశారు. నిర్వాసితుల ఆందోళనల మధ్య హెడ్‌వర్క్స్ పనులు ప్రారంభించారు. అలాగే కుడి, ఎడమ ప్రధాన కాలువల తవ్వకాలను ప్యాకేజ్‌లుగా విభజించి తవ్వకాలు వేగవంతం చేశారు. ఆయన హయాంలోనే కాలువల పనులు దాదాపు 40 నుంచి 70 శాతం వరకు పూర్తయ్యాయి. వేగంగా జరిగే పోలవరం పనులు వైఎస్సార్ మరణానంతరం ఒక్కసారిగా పడకేశాయి. కొవ్వాడ కాలువకు అడ్డుకట్ట అలాగే పోలవరం మండలంలోని పట్టిసీమ వద్ద కొవ్వాడ కాలువ ఉద్ధృతికి ఆ ప్రాంత రైతాంగం జీవన స్థితిగతులు దిగజారిపోయాయి. ఏటా వర్షాకాలంలో దాదాపు 10 వేల ఎకరాల్లోని పంట ముంపునకు గురయ్యేది. ఈ పొలాలతో పాటు పరిసర గ్రామాలు మంపునకు గురయ్యేవి. వైఎస్సార్ పాదయాత్రలో ఉన్న సందర్భంలో రైతులు కలసి తమ సమస్యలు వివరించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మర్చిపోకుండా 2008లో రూ.58 కోట్ల అంచనాలతో కొవ్వాడ కాలువపై అవుట్‌ఫాల్ స్లూయిస్ నిర్మాణాన్ని మంజూరు చేశారు. ఈ పథకం పూర్తికావటంతో కొవ్వాడ ముంపు ముప్పు రైతులకు తప్పింది. పంటలు, గ్రామాలకు రక్షణ ఏర్పడింది. రైతుల జీవన స్థితిగతులు పూర్తిగా మెరుగుపడ్డాయి. అలాగే ఏటా గోదావరి వరదల కారణంగా పోలవరం గ్రామం ముంపునకు గురయ్యేది. వేలాది కుటుంబాలు నిరాశ్రయులవ్వటంతో పాటు, రూ.కోట్ల విలువైన సంపద కోల్పోయేవారు. దీంతో ప్రజల విజ్ఞప్తి మేరకు పోలవరంలోని యడ్లగూడెం నుంచి పాత పోలవరం వరకు 3.1 కి.మీ. లంక పొడవునా నెక్లెస్‌బండ్ నిర్మాణాన్ని రూ.3.75 కోట్లతో వైఎస్సార్ 2008లో మంజూరు చేశారు. ప్రస్తుతం బండ్ నిర్మాణం పూర్తికావొచ్చింది. ప్రజలకు, ఆస్తులకు రక్షణ కలిగింది. పోగొండతో జలకళ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన, గిరిజనేతరుల భూములకు సాగునీటి వసతి కల్పించిన ఘనత కూడా వైఎస్సార్‌దే. బుట్టాయిగూడెం మండలంలోని పోగొండ రిజర్వాయర్‌ను 2008లో రూ.26 కోట్ల అంచనాలతో వైఎస్సార్ మంజూరు చేశారు. 4 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈపథకం మంజూరు చేశారు. ఇప్పుడది పూర్తయ్యింది. కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాల్లోని దాదాపు 7.5 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. -
ఏలూరుపై 'పెద్దాయన' చెరగని ముద్ర
జిల్లాకు కష్టమంటే క్షణం ఆలస్యం చేసేవారు కాదు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. వెంటనే నిధులు మంజూరు చేసి ఆదుకునేవారు. అంతేకాదు దేశానికే గర్వకారణంగా నిలిచిన పోలవరం ప్రాజెక్టును జిల్లాకు వరంగా ఇచ్చారు. కొవ్వాడ కాలువ వద్ద స్లూయిస్ నిర్మించి ఆ ప్రాంతాల్లోని పంటలకు ముంపు తప్పించారు. ఏలూరులో తమ్మిలేరు గట్లు పటిష్ట పరచి ఏలూరు నగరానికి రక్షణగా నిలిచారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో లబ్ధిపొందిన వారు నేటికీ ఆయన్నే స్మరిస్తూ గుండెల్లో గుడి కట్టి పూజిస్తున్నారు. నేడు ఆ మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఊరూవాడా ఘన నివాళి అర్పించేందుకు సిద్ధమయ్యారు. ఏలూరు టౌన్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైనది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరం. ఇక్కడ ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే వచ్చి స్వయంగా పరిశీలించేవారు. ఏలూరు నగరానికి భారీ తాగునీటి జలాశయాన్ని నిర్మించేందుకు నిధులిచ్చారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ వేల ఇళ్లను కట్టించారు. ఏలూరు దుఃఖదాయనిగా పేరుగాంచిన తమ్మిలేరు వరదల నుంచి శాశ్వత పరిష్కారం చూపించారు. వైఎస్సార్ అనుంగు శిష్యుడిగా పేరున్న అప్పటి ఎమ్మెల్యే, నేటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్లనాని) ప్రజల కోసం ఏది అడిగానా లేదు అనకుండా ప్రతి పనిని చేసి చూపెట్టిన ప్రజా నాయకుడు వైఎస్సార్. తాగునీటి కష్టాలకు చెక్ ఏలూరు నగరపాలక సంస్థగా ఆవిర్భావానికి ముందు ప్రజల తాగునీటి కష్టాలు చెప్పనలవి కావు. ఏలూరులోని 18 మురికివాడల్లోని ప్రజలైతే గుక్కెడు నీటికోసం రోజుల తరబడి వేచి చూసేవారు. ప్రధాన ప్రాంతాల్లో భూగర్భనీటిపైనే ఆధారపడి బోర్లు ద్వారా తాగునీటిని సరఫరా చేసేవారు. ఇక వేసవి కాలం వస్తుందంటే జనాల గొంతు తడారేది. ఇలాంటి గడ్డు పరిస్థితికి పరిష్కారం చూపించారు డాక్టర్ వైఎస్సార్. ఏలూరు శివారులో భారీస్థాయిలో సుమారు రూ.120 కోట్లు వెచ్చించి, 118 ఎకరాల మంచినీటి జలాశయాన్ని నిర్మించేందుకు వైఎస్ నిధులు మంజూరు చేశారు. ఆళ్లనాని ఎమ్మెల్యేగా స్థలాన్ని సేకరించి, చెరువు ఏర్పాటు చేసి రెండు, మూడు దశాబ్దాల వరకూ నగర ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేశారు. దుఃఖదాయనికి అడ్డుకట్ట వేశారు ఏలూరు దుఃఖదాయనిగా పేరుగాంచిన తమ్మిలేరు వరదలు ప్రజలను వణికించేవి. ఏలూరు నగరాన్ని రెండుగా విడిపోయి చుట్టేసే తమ్మిలేరు ఎప్పుడు ముంచేస్తుందో అని భయంతో జీవించేవారు. దివంగత మహానేత వైఎస్సార్ రెండు, మూడు సార్లు తమ్మిలేరు వరదలను స్వయంగా వచ్చి పరిశీలించారు కూడా. అప్పటి ఎమ్మెల్యే ఆళ్లనాని పరిస్థితిని వైఎస్సార్‌కు వివరించారు. ఈ వరదలకు అడ్డుకట్ట వేయాలంటే తమ్మిలేరు ఏటిగట్లను పటిష్టం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తమ్మిలేరు ఏటిగట్లను పటిష్టం చేసేందుకు, రివిట్మెంట్ చేసేందుకు వైఎస్ భారీగా నిధులు మంజూరు చేశారు. సుమారు రూ.90 కోట్లతో ఏటిగట్లను పటిష్టం చేసి వరద ముంపు తొలగించారు. పేదోడి సొంతింటి కల సాకారం ఏలూరు నియోజకవర్గంలో పేదల సొంతింటి కలను నిజం చేశారు వైఎస్సార్. ఇందిరమ్మ కాలనీలో 9 వేల కటుంబాలకు పక్కా ఇళ్లు కట్టించారు. మరో 10 వేలకు పైగా పేద కుటుంబాలకు స్థలాలు మంజూరు చేశారు. పోణంగిలో వైఎస్సార్ కాలనీ పేరుతో 1800 ఇళ్లను కట్టించారు. ఏలూరు నగరంలో స్థలాన్ని సేకరించి పేదలకు భారీ సంఖ్యలో ఇళ్లు కట్టించిన రికార్డు ఎమ్మెల్యే ఆళ్లనానిదే! ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి కూడా వైఎస్ నిధులు కేటాయించారు. ఆయన మరణానంతరం ఆ పనులు జరగలేదు. ఆయనతో స్నేహం ఎప్పటికీ మరువలేను : వట్టి భీమడోలు: దివంగత సీఎం వైఎస్సార్ తొలిసారిగా జిల్లాలోని నా ఉంగుటూరు నియోజకవర్గంలోనే 2004లో పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన చేశారని, ఆ మధుర క్షణాలు మరచిపోలేనని రాష్ట్ర మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ తెలిపారు. వైఎస్సార్‌తో ఉన్న అనుబంధం ఆయన మాటల్లోనే.. నేను విద్యార్థి నాయకునిగా విశాఖపట్నం నుంచి వైఎస్‌కు పరిచయమయ్యాను. ఆ పరిచయం స్నేహంగా మారింది. అలాగే కేవీపీ రామచంద్రరావు కాకినాడ నుంచి స్నేహితుడయ్యాడు. అప్పట్లో శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు పర్యటించిన ప్రతిసారి నా కారులోనే వైఎస్‌ను తిప్పేవాణ్ణి. ఆ సమయంలో నేనే కారు నడుపుతూ ఆయనకు సేవ చేసే భాగ్యం కలగడం మరపురాని అనుభూతి. ఆయన సాన్నిహిత్యంతో నేను నేర్చుకున్న ప్రతీది నేటికీ నేను నా జీవితంలో పాటిస్తున్నాను. ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయాను. అధ్యక్షా.. ఏమిటి విశేషాలు అనేవారు : జీఎస్ రావు నిడదవోలు : ‘వయస్సులో నా కన్నా చిన్నవారైనా దివంగత మహనేత వైఎస్ రాజశేఖరరెడ్డి నన్ను ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. మేము ఎప్పుడు కలిసినా ‘అధ్యక్షా ఏమిటి విశేషాలు’ అనేవారు.. అని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు మహానేతతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ సమక్షంలో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాను. 2008లో వైఎస్ సీఎంగా ఉండగా పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైఎస్ సాయం చేసేవారు. 1999లో జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నాకు టిక్కెట్ ఇచ్చారు. జిల్లాలో కాంగ్రెస్ తరఫున 16 నియోజకవర్గాల్లో 15 నియోజకవర్గాలు ఓటమి పాలయ్యాయి. ఒకే ఒక చోట కొవ్వూరు నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఒక్కడినే గెలుపొందాను. ఈ విజయంతో వైఎస్సార్ ఎంతో అభినందించారు. అప్పటి నుంచి ఎప్పుడు కలిసినా వెస్ట్ గోదావరి చాంపియన్ అంటూ పిలిచేవారు. వెఎస్సార్ స్వర్ణయుగం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపంలో అతి త్వరలో రానుంది. చెక్కు చెదరని అభిమానం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) /కొవ్వూరురూరల్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానాన్ని కళాకారులు తమ రీతిలో చాటుకున్నారు. ఏలూరుకు చెందిన సూక్ష్మరూప కళాకారుడు మేతర సురేష్ మహానేత నిలువెత్తు విగ్రహాన్ని అగ్గిపుల్లపై చెక్కి అబ్బుర పరిచారు. అలాగే కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన పెన్సిల్ ఆర్ట్ చిత్రకారుడు అడ్డాల నాని మహానేతతో పాటు ఆయన కుమారుడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపాలను చిత్రీకరించారు. పెన్సిల్‌తో గీసిన ఈ చిత్రం ఆకట్టుకుంది. మా పాలిట దేవుడు ఆరేళ్ల క్రితం నాకు గుండెపోటు వస్తే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆరోగ్యశ్రీలో స్టంట్ వేశారు. మొదట ఆసుపత్రికి వెళ్లినప్పుడు రూ.5 వేలు కట్టించుకున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించిన ఐదురోజులకు నా సొమ్ములు నాకు ఇచ్చేశారు. కేవలం తెల్లరేషన్‌కార్డు పట్టుకువెళ్తే రూ.70 వేల విలువైన ఆపరేషన్ ఉచితంగా చేశారు. ఇదంతా ఆ మహానుభావుడు రాజశేఖరరెడ్డి దయే! –బోనాల వెంకట సత్యసాయి శర్మ, పురోహితులు, కొవ్వూరు నా కాలు చక్కబడింది మా ఇంటి గోడ 2008లో కూలిపోయిన ఘటనలో ప్రమాదవశాత్తు నా కాలు విరిగింది. వైద్యం చేయించుకునే స్తోమత లేదు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఉందని సన్నిహితులు తెలపడంతో వైద్యం చేయించుకున్నాను. ఇటీవల నా భర్త మృతి చెందడంతో కొంత అనారోగ్యానికి గురయ్యాను. –ఇంటి రత్నం, గృహిణి, పాలకొల్లు ప్రాణం నిలిపిన మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వల్ల నా ప్రాణం నిలబడింది. 2009లో అనారోగ్యంగా ఉంటే హార్ట్‌బీట్ తక్కువగా ఉందని వైద్యులు చెప్పారు. భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజులు ఉన్నాను. గుండెకు స్టంట్ వేయాలన్నారు. ఖర్చు కోసం భయపడ్డాం. కానీ ఆరోగ్యశ్రీ ఉండటంతో నా గుండెకు రక్షణ ఏర్పడింది. ఆపరేషన్ ఉచితంగా చేయడంతో పాటు ఏడాది పాటు మందులు కూడా ఇచ్చారు. అందుకే రాజశేఖరరెడ్డిని మా గుండెల్లో నిలుపుకున్నాం. –మరడాన రాంబాబు, ఆర్ఎంపీ, పాలకొల్లు వైఎస్ మరణాన్ని తట్టుకోలేక నా భర్త చనిపోయారు నా భర్త వెంకట సత్యనారాయణ వ్యవసాయ కూలీ. వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో ప్రాణంగా ఉండేవారు. వైఎస్ మరణ వార్త విని ఆవేదనకు గురై ప్రాణాలు విడిచారు. మాకు నలుగురు పిల్లలు. దీంతో మా కుటుంబం దిక్కుతోచనిస్థితిలో ఉంది. ఆయన కుమారుడు జగనన్న మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆదుకుని కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. –కుక్కల పద్మ, గృహిణి, పాలకొల్లు గుండె ఆపరేషన్ చేయించుకున్నా.. నేను వ్యవసాయ పనిచేస్తుంటాను. 2008లో అనారోగ్యానికి గురైతే గుండెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఆరోగ్యశ్రీలో చేయించుకున్నాను. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నాడు వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీయే. –అంబటి వెంకటేశ్వరరావు, రైతు, పాలకొల్లు మా కుటుంబమంతా రుణపడ్డాం వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుకున్న కుటుంబాల్లో మాది ఒకటి. 2009లో ఆరోగ్యశ్రీ ద్వారా నేను ఆపరేషన్ చేయించుకున్నాను. మా అబ్బాయి జయ రామకృష్ణ, అమ్మాయి శ్రీదేవి ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఇంజినీరింగ్ చేశారు. రూ.4 లక్షల వ్యవసాయ రుణమాఫీ పొందాం. వైఎస్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు మాకు ఉపయోగపడ్డాయి. ఆయన్ని ఎప్పటికీ మరువం. –పాలా కనకరాజు, రైతు, పాలకొల్లు నన్ను బతికించారు నా పేరు ఉర్దల సన్యాసమ్మ. ఈ రోజు బతికి ఉన్నాను అంటే మహానుభావుడు వైఎస్సార్ వల్లే.. 15 ఏళ్లుగా కడుపులో కణితితో బాధపడేదాన్ని. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల 2008లో భీమవరం ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాను. నా కడుపులోంచి వైద్యులు 28 కిలోల కణితిని తొలగించారు. వైఎస్ వల్లే నేను ఆరోగ్యంగా ఉండి ప్రస్తుతం కూలి పనులకు వెళ్తున్నాను. –ఉర్దల సన్యాసమ్మ, భీమవరం రాజన్న వల్లే సాఫ్ట్వేర్ ఇంజినీరయ్యా.. నేను పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివా. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత కార్పొరేట్ విద్య పథకం వల్ల ఇంటర్మీడియట్ అనంతరం బీటెక్ పూర్తి చేయగలిగాను. మంచి మార్కులతో ఇంజినీరింగ్ పాసయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్పీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. వైఎస్ రాజశేఖరరెడ్డి చలవ వల్ల మా కుటుంబానికి ఆర్థికంగా ఆసరా లభించింది. –మోటుపల్లి విజయ్‌కుమార్, నరసాపురం -
ఇడుపులపాయలో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి, వేంపల్లె / పులివెందుల : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి కార్యక్రమం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి వైఎస్ షర్మిల, ఈసీ గంగిరెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు శనివారమే ఇడుపులపాయకు చేరుకున్నారు. ఆదివారం ఉదయాన్నే వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్న కుటుంబసభ్యులు, వైఎస్సార్ సన్నిహితులు ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజాద్ బాషా, పార్టీ నేతలు సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి, రాఘవరెడ్డి, తదితరులు పాల్గొని వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారు : అనంతరం వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ప్రజలు రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా, వైఎస్ జగన్ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారని, ప్రజల మద్దతు ఆయనకు ఉందని చెప్పారు. అనంతరం ఆమె రచించిన 'అనుదిన జ్ఞానావళి' పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
మది మది.. రాజన్నతో నిండి..
ఆరోగ్యశ్రీతో ఉన్నత వైద్యం అందించి..ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుల విప్లవం సృష్టించి..జలయజ్ఞంతో బీడులను సస్యశ్యామలం చేసి..పింఛన్‌తో పండుటాకులకు భరోసా ఇచ్చి.. రుణాలతో మహిళా సాధికారత సాధించి..నీడలేని పేదలకు గృహయోగం కల్పించి..పచ్చని పశ్చిమకు పోల‘వరం’ ప్రసాదించి..ఉద్యాన సిరులు పండించేలా విద్యాలయం స్థాపించి..చెదరని జ్ఞాపకంలా.. చెరగని సంతకంలా..జన హృదయ నేతగా.. అభివృద్ధి ప్రదాతగా..ఇలా అందరిలోనూ కొలువైన నువ్వు..మాతో లేవని ఎవరనగలరు రాజన్నా.. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆ మహానేత పాద స్పర్శతో పశ్చిమగోదావరి జిల్లా పులకించిపోయింది. ఆయన ఎక్కడ అడుగువేస్తే అక్కడ ప్రకృతి పచ్చని పంటల తివాచీ వేసి స్వాగతించింది. జిల్లా ప్రజల నుంచి ఆయన పొందిన ప్రేమాభిమానాలకు వెలకట్టలేక జిల్లాను అభివృద్ధి పథంలో నడపడమే ప్రజల రుణం తీర్చుకోవడానికి ఏకైక మార్గమని మహానేత భావించారు. అనుకున్నదే తడవుగా జిల్లా ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి పర్యటన పశ్చిమ నుంచే ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముం దుకు వచ్చారు. ఏలూరు దుఃఖదాయినికి అడ్డుకట్ట ఏలూరు ప్రజలకు దుఖఃదాయినిగా ఉన్న తమ్మిలేరు వరదల నుంచి జిల్లా కేంద్ర ప్రజలకు విముక్తి కల్పించారు మహానేత వైఎస్సార్. ఏలూరు నగరాన్ని రెండుగా విడిపోయి చుట్టేసే తమ్మిలేరు ఎప్పుడు ముంచేస్తుందోననే భయంతో నగరవాసులు జీవించేవారు. 2005లో వరదలు వచ్చినప్పుడు స్వయంగా వచ్చి పరిశీలించిన వైఎస్సార్ ఇక్కడి నుంచి వెళ్లకముందే మొదటి దశ పనులకు రూ.17 కోట్లు మంజూరు చేశారు. సుమారు రూ.90 కోట్ల నిధులు విడుదల చేసి ఆయా ప్రాంతాల్లో ఏటిగట్లను పటిష్టం చేసి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపించారు. వైఎస్సార్ స్వయంగా రూపొందించి అమలు చేసిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వందలాది కుటుంబాల పాలిట అపర సంజీవనిగా మారింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులకు ఉన్నత చదువుల భాగ్యాన్ని కల్పించి ఎందరో విద్యార్థుల జీవితాలకు వైఎస్సార్ అండగా నిలిచా రు. ఇలా ఏ గుండెను కదిపినా వైఎస్ నామ జప మే.. వైఎస్సార్ తన హయాంలో ఏ వర్గ ప్రజ లనూ విస్మరించకుండా అందరికీ అవసరమయ్యే పథకాలతో వారి గుండెల్లో నిలిచిపోయారు. జిల్లాలోని ఏజెన్సీలోని నిరుపేదలు ఆయన పథకాల ద్వారా ఎక్కువగా లబ్ధి పొందారు. భూదాత.. అభివృద్ధి ప్రదాత జిల్లాలో అర్హులైన పేదలకు 30 వేల ఎకరాలు భూపంపిణీ చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. రైతుల మోములో చిరునవ్వు చూడాలన్న సంకల్పంతో ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేసిన రైతు బాంధవుడిగా అన్నదాతల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఎస్సీ, ఎస్టీ నిరుపేద రైతుల భూముల్లో ఇందిర ప్రభ పథకం ద్వారా బోర్లు వేయించడంతో పాటు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. పోలవరం.. ఉద్యాన విశ్వవిద్యాలయం జిల్లాలోని మెట్ట ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేయాలనే తలంపుతో జిల్లా ప్రజల చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి పూ నుకున్న ఏకైక నాయకుడిగా జిల్లా ప్రజల మనసుల్లో సుస్థిరస్థానం పొందిన నేత కూడా వైఎస్సార్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా యువతకు విద్యావకాశాలు కల్పించి తద్వారా ఉద్యోగావకాశాలు పొందేలా వైఎస్ తీసుకున్న చొరవ ఇప్పటికీ ఆయన తీపిగురుతుగా నిలిచిపోయింది. గూడెం గుండెల్లో కొలువై.. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి మహా నేత రూ.600 కోట్లు మంజూరు చేసి చరిత్ర సృష్టించారు. ప్రజల ఆరోగ్యానికి ఆయన ఎంతగా తపించేవారో ఆయన ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకమే చెబుతుంది. అటువంటిది మెట్ట ప్రాంతంలో ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ జంగారెడ్డిగూడెంలో సుమారు రూ.7.54 కోట్ల నిధులతో 100 పడకల ఆసుపత్రి నిర్మించడం ఆయనకు తప్ప మరొకరికి సాధ్యం కాదని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. అన్నింటి కన్నా ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు రూ.10,151 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి జిల్లాలోని మెట్ట ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో లక్షల ఎకరాల భూములకు సాగునీరందించడానికి ఏర్పాటుచేశారు. సస్యశ్యామలమే లక్ష్యంగా.. పోలవరం గ్రామానికి వరద ప్రమాదం లేకుండా రూ.6 కోట్లతో నెక్లెస్ బండ్, పోలవరం నియోజకవర్గంలోని ముంపు జలాలను గోదావరి నదిలోకి మళ్లించడానికి రూ.57 కోట్లతో కొవ్వాడ ఔట్ ఫాల్‌స్లూయిజ్ నిర్మించడానికి మహానేత వైఎ స్సార్ చర్యలు తీసుకున్నారు. చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోటలో రూ.17.01 కోట్ల నిధులతో మెట్ట ప్రాంతంలోని 230 గ్రామాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. నరసాపురంలో పేదలకు గూడు కల్పించడానికి రూ.10 కోట్లతో సుమారు 600 మందికి ఇళ్లు నిర్మించారు. నరసాపురం వద్ద వశిష్ట వంతెన నిర్మాణానికి రూ.194 కోట్ల నిధులను మహానేత మంజూరు చేశారు. అయితే ఆయన మరణాంతరం వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రాం త ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముంపు ముప్పును తొలగించారు జిల్లాకు అంతర్జాతీయంగా కీర్తిప్రతిష్టలు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చి లేసుపార్కును అభివృద్ధి చేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి వద్ద గోదావరి ఏటిగట్టుకు రూ.20 కోట్లతో రివిట్మెంట్ నిర్మించడానికి వైఎస్ తీసుకున్న చొరవ కారణంగా ఆ ప్రాంత ప్రజలు ముంపు బారి నుంచి బయట పడగలి గారు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో వేసవిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించడానికి సుమారు 100 ఎకరాల సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి వైఎస్ కోట్లాది నిధులు మంజూరు చేశారు. ఏలూరు నియోజకవర్గంలో 10 వేలకు పైగా పేద కుటుంబాలకు స్థలాలు మంజూరు చేయడమే కాకుండా వారికి పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఇవి కేవలం మచ్చుతునకలు మాత్రమే. జిల్లాలో ఏ ప్రాంతంలో అడుగు వేసినా వైఎస్ తాలూకు అభివృద్ధి మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే జిల్లాను ఆయన మానసపుత్రిగా అభివర్ణించడంలో సందేహించాల్సిన పనే లేదు. -
ప్రతి ఒక్కరు వైఎస్సార్‌ను స్మరించుకుంటున్నారు
-
ఖమ్మంలో రాజన్న ‘సంక్షేమం’
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకాలంలో సంక్షేమ వైభవం పరిఢవిల్లింది. విద్యార్థి నుంచి వృద్ధుల వరకు, రైతు నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరికీ లబ్ధి చేకూరింది. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఉచిత విద్యుత్, రుణమాఫీలతో రైతులను ఆదుకుని.. ఒక విప్లవాత్మక మార్పునకు నాందిపలికారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగించారు. ఆయన హయాంలో ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది లబ్ధిపొందారు. వైఎస్సార్ అందించిన ఆసరాతో విద్య, ఉద్యోగ రంగాల్లో ఉన్నతస్థాయికి ఎదిగారు. ఆరోగ్యశ్రీ పథకంతో ప్రాణాలు నిలబెట్టుకున్నారు. నేడు( జూలై 8) వైఎస్ జయంతి. ఈ సందర్భంగా మహానేత అమలు చేసిన సంక్షేమ ఫలాలను గుర్తుచేసుకుందాం. 4.52 లక్షల మందికి రుణమాఫీ ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4.52 లక్షల మంది రైతులకు రూ.2,150 కోట్ల పంట రుణాలు మాఫీ చేశారు. ఎటువంటి షరతులు లేకుండా వ్యవసాయానికి, పంటల సాగుకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించి ఆ దిశగా 2008లో ఒకేసారి రుణమాఫీని చేసి తిరిగి రైతులకు రుణాలు ఇచ్చారు. రుణాలను క్రమం తప్పకుండా చెల్లించి బ్యాంకుల్లో బకాయిలు లేని రైతులకు కూడా... ప్రయోజనం ఉండాలనే లక్ష్యం తో దాదాపు 70 వేల మంది రైతులకు రూ.5 వేల చొప్పున ప్రోత్సాహకాలను అందించారు. రుణమాఫీ, ప్రోత్సాహకాలు రైతుల్లో ఎంతో మనో ధైర్యాన్ని నింపాయి. వ్యవసాయం పండగలా మారింది. ‘సీతారామ’కు అప్పుడే బీజం అశ్వాపురం: 9 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణానికి వైఎస్ హయాంలోనే బీజం పడింది. జలయజ్ఞంలో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్ట ఆధారంగా రాజీవ్‌సాగర్‌కు రూపకల్పన చేశారు. దివంగత నేత కుమ్మరిగూడెంలో దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ పనులు కూడా కొంత వరకు జరిగాయి. వైఎస్ఆర్ మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాజెక్ట్‌ల రీడిజైన్‌లో భాగంగా రాజీవ్‌సాగర్‌ను రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్‌గా నామకరణం చేశారు. 31,961 మందికి పోడు హక్కులు భద్రాచలం: ఏళ్ల తరబడి పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులకు అటవీ శాఖ అధికారుల వేధింపులు నిత్యకృత్యంగా ఉండేవి. వాటì నుంచి అడవి బిడ్డలకు విముక్తి కల్పించేందుకు ఉమ్మడి జిల్లాలో 31,961 మంది గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. 2008 నుంచి 2010 వరకు 38 ఏజెన్సీ మండలాల్లో డీఎల్సీ ఆమోదం పొందిన 2.10 లక్షల ఎకరాలను పంపిణీ చేశారు. ఆ భూములపై ప్రస్తుతం రూ. 31.67 కోట్ల మేర రైతుబంధు సాయం కూడా పొందారు. హక్కు పత్రాలను అందిస్తున్న వైఎస్(ఫైల్) నాకు పునర్జన్మ ప్రసాదించారు సత్తుపల్లిటౌన్: మాది నిరుపేద కుటుంబం. చికెన్షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. నాకు 2013లో గుండెనొప్పి వచ్చింది. విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్తే గుండెలో వాల్వ్ సమస్య ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్‌కు రూ.5 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఆరోగ్యశ్రీకార్డు ఉంటే ఉచితంగా ఆపరేషన్ చేస్తామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డుతో ఒక్క రూపాయి కూడా కట్టకుండా గుండె ఆపరేషన్ చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకమే నాకు పునర్జన్మనిచ్చింది. ఇప్పుడు బతికి ఉన్నానంటే రాజన్న పుణ్యమే. ప్రతీ ఏటా మహానేత జయంతిని ఇంటిల్లిపాది కలిసి వైఎస్ఆర్ విగ్రహం వద్ద జరుపుకుంటాం. –రాగం సత్యనారాయణ, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం ఇళ్ల స్థలాలపై హక్కులు కల్పించారు.. సూపర్‌బజార్(కొత్తగూడెం): వైఎస్ చలవతో కొత్తగూడెం మున్సిపాలిటీలోని ప్రజలు తమ ఇళ్ల స్థలాలపై హక్కులు పొందారు. సింగరేణి లీజు స్థలాలు అని, ఎవరికీ స్థలాలపై హక్కులేదని, క్రయవిక్రయాలు జరుపుకునే అవకాశం లేదని ప్రచారాలు వెళ్లువెత్తుతున్న తరుణంలో స్థానికులు ఆందోళన చెందారు. వైఎస్ ఇక్కడ పర్యటించినపుడు ఈ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. క్రమబద్ధీకరించేందుకు 373 జీఓను విడుదల చేశారు. 100 గజాలలోపు ఉన్న వారికి ఉచితంగా, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి కొం త రుసుంతో ఇంటి స్థలాలు క్రమబద్ధీ కరించాలని ఆదేశించారు. దీంతో సుమారు 4 వేల మంది లబ్ధిపొందారు. ఆ తర్వాత పక్కా భవనాలు నిర్మించుకున్నారు. రుణాలూ పొందారు. గిరిపుత్రికలకు వరం.. దమ్మపేట: అంకంపాలెంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉమ్మ డి జిల్లా నుంచి గిరిజన విద్యార్థినులు 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకునేవారు. టెన్త్ కాగానే ఇంటర్ విద్యకోసం పిల్లలను దూర ప్రాంతాలకు పంపి చదివించే ఆర్థిక స్థోమత లేక తల్లిదండ్రులు చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. స్థానికులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే ద్వారా వైఎస్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అంకంపాలేనికి గిరిజన బాలికల జూనియర్ కళాశాలను మంజూరు చేశారు. 2006లో కళాశాలను ప్రారంబించారు. రూ. 3.30 కోట్లతో 2007 జనవరి 27న కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ శంకుస్థాపన చేశారు. 2013లో భవనం పూరై్త ప్రారంభమైంది. ఇప్పటివరకు దాదాపు 2500 మంది విద్యార్థినులు ఇక్కడ ఇంటర్ పూర్తి చేశారు. ఇల్లెందులో సంక్షేమం ఇలా.. ఇల్లెందు: ఇల్లెందు మండలం, పట్టణంలోనే వైఎస్ హయాంలో సంక్షేమ పాలన తీరు ఇలా ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం ఇల్లెందు పట్టణ, మండలంలో 104343 మంది జనాభా ఉంది. ఇల్లెందు మండలంలో 5292మందికి నెలకు రూ. 200 పింఛన్, 470 మందికి నెలకు రూ. 500 పింఛన్ అందించారు. మున్సిపాలిటీలో 2174 మందికి నెలకు రూ. 200 పింఛన్, 268 మందికి నెలకు రూ. 500 పింఛన్ చెల్లించారు. ఇందిరమ్మ గృహాలు 9088 పూర్తి కాగా, 7342 నిర్మాణంలో ఉన్నాయి. పావలావడ్డీ పథకం కింద 1327 గ్రూపులకు 1893.77 లక్షలు బ్యాంకు లింకేజీ, 37.97 లక్షలు పావలావడ్డీ లభించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 19,736మ మందికి కార్డులు జారీ చేయగా 105 మంది, రూ.33.61లతో శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. ఫీజురీయింబర్స్ మెంట్ పథకంలో 6966 మంది విద్యార్థులు రూ.148.1 లక్షలు పొందారు. పశుక్రాంతి పథకంలో 98 మంది రైతులకు రూ. 43.40 లక్షల సబ్సిడీతో 124 పశువులను అందజేశారు. పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు.. అశ్వారావుపేట: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు ఆయిల్‌ఫాం గెలలను ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు తరలించాల్సి వచ్చేది. దీంతో రవాణా వ్యయం అధికంగా ఉండేది. అప్పటి సత్తుపల్లి ఎమ్మెల్యే జలగం వెంకటరావు ద్వారా సమస్యను వైఎస్ దృష్టికి తీసుకెళ్లడంతో.. 2005లో అశ్వారావుపేటలో ఆయిల్ పామ్ పరిశ్రమను స్థాపించారు. దీంతో ఆయిల్ పామ్ సాగు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే 30వేల ఎకరాల్లో సాగవుతోంది. ఈ క్రమంలోనే దమ్మపేట మండలం అప్పారావుపేటలో మరో ఫ్యాక్టరీ నిర్మించారు. బతికున్నానంటే ఆయన పుణ్యమే సూపర్‌బజార్(కొత్తగూడెం): ఈరోజు బతికున్నానంటే వైఎస్ పుణ్యమే. పోయిన ఏడాది సంక్రాంతికి ముందురోజు గుండెనొప్పి వచ్చింది. డాక్టర్ నాగరాజు వద్దకు వెళ్లగా పరీక్షలు నిర్వహించి వెంటనే హైదరాబాద్ యశోద ఆస్పత్రికి వెళ్లమన్నారు. బట్టలషాపులో గుమస్తాగా పనిచేసే నాకు హైదరాబాద్‌కు వెళ్లి వైద్యం చేయించుకునే స్థోమతలేదని చెప్పాను. అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు లేదా అని అడిగారు. ఉందని చెప్పాను. ఆ కార్డు ఉంటే ఉచితంగా వైద్య సేవలందుతాయని డాక్టర్ చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవులలో విన్పిస్తూనే ఉన్నాయి. వెంటనే యశోద ఆస్పత్రికి వెళ్లాను. డాక్టర్ ఆపరేషన్ చేసి స్టంట్ చేశారు. వైఎస్సార్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డే నా ప్రాణాన్ని నిలబెట్టింది. ఆపద్భాంధవుడైన వైఎస్ఆర్ను దేవుడు ఇంత తొందరగా తీసుకువెళ్తాడని ఉహించలేదని చెమర్చిన కళ్లతో కొమరయ్య పేర్కొన్నాడు. –బేరి కొమరయ్య, కూలీలైన్, కొత్తగూడెం ఎన్నటికీ మరువలేం ఎర్రుపాలెం: నాకు 62 ఏళ్లు. పేదరికంతో బతుకుతున్నాను. ఏడాది క్రితం గుండె జబ్బు వచ్చింది. ఆస్పత్రికి పోతే మూడు వాల్వులు దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఆరోగ్య శ్రీ కార్డుతో హైదరాబాద్‌లోని కామినేని హాస్పిటల్లో గుండెకు వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. లక్షా 11 వేల 346 మంజూరు చేసింది. నాకు రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఈ పథకం లేకపోతే అప్పులు చేసి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. ఆరోగ్య శ్రీ పథకం పేదలకు గొప్ప వరం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎన్నటీకీ మరవలేం. –షేక్ జానీమియా, పెద్ద గోపవరం, ఎర్రుపాలెం మండలం -
మహానేతను స్మరించుకుందాం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేడు. ఈకార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. ఉదయం 8.00 గంటలకు బళ్లారి చౌరస్తాలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం బళ్లారి చౌరస్తా నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. టీజే షాపింగ్ మాల్లోని పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు, ఆతర్వాత వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో అలంకరిచి నివాళి అర్పిస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు శనివారం ఓ ప్రకటనలో విజ్ఙప్తి చేశారు. కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో.. కర్నూలు (ఓల్డ్‌సిటీ): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఆదివారం కళావెంకట్రావ్ భవనంలో ఘనంగా నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి తెలిపారు. ఉదయం 10.00 గంటలకు పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి, 10.30 గంటలకు ఎస్బీఐ సర్కిల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలతో అలంకరిస్తామన్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని శనివారం ఓ ప్రకటనలో కోరారు. సేవ కార్యక్రమాలకు ఏర్పాట్లు కర్నూలు(కొండారెడ్డిఫోర్టు): వైఎస్.రాజశేఖర్‌రెడ్డిని జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ కర్నూలు నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం నగర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9 గంటలకు ఎస్బీఐ కూడలిలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం టీజే షాపింగ్‌మాల్‌లోని పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు బీక్యాంపు బస్టాండ్‌లో వికలాంగులకు బెడ్షీట్ల పంపిణీ, 11 గంటలకు జనరల్ హాస్పిటల్ టీబీ వార్డులో రోగులకు బ్రెడ్లు పంపిణీ, 11.15 గంటలకు చిన్న పిల్లల వార్డులోని చిన్నారులకు బ్రెడ్డు, పాలు, పండ్లు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం కీర్తన అనాథ శరణాలయంలో అన్నదానం చేస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాలను పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
వైఎస్సార్ వల్లే ముస్లిం రుణాలు మాఫీ అయ్యాయి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో ముస్లింలకు సంబంధించిన రుణాలు మాఫీ చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు పలువురు ముస్లింలు వివరించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా చింతలపాలెంలో సాగుతున్న పాదయాత్రలో వైఎస్ జగన్‌ను ముస్లింలు శనివారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ అమీరుద్దీన్, రెహిన్మున్నీసా, ఎస్కే బేగంలు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలు ఇల్లు నిర్మించుకునేందుకు ఘర్ ఔర్ మకాన్ రుణాలు మంజూరు చేసిందని, నిరుపేద కుటుంబాల వారు తిరిగి రుణాలు కట్టలేక ఇబ్బందులు పడేవారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఘర్ ఔర్ మకాన్ రుణాలు మాఫీ చేశారన్నారు. పేద ముస్లింలకు ఇంత మేలు చేసిన వైఎస్‌ను ఎన్నటికీ మరువలేమన్నారు. తండ్రి వైఎస్ లాంటి సువర్ణ పాలన అందించాలని జగన్‌ను కోరామన్నారు. జగన్ సీఎం అయితే నిరుపేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. -
నేడు వైఎస్సార్ 69వ జయంతి
-
మరుపురాని మహానేత
సంతకమే వసంతమైతే అది వస్తూనే ఉంటుంది చిరునవ్వే ఆభరణమైతే అది మెరుస్తూనే ఉంటుంది ఆశయాలే చినుకులైతే అవి కురుస్తూనే ఉంటాయి విలువలే విత్తులైతే అవి మొలకెత్తుతూనే ఉంటాయి ప్రేమే జ్ఞాపకమైతే .. ఆ మనిషి ఎప్పటికీప్రజల వ్యాపకం నుంచి జరిగిపోడు.. చెరిగిపోడు. పుట్టి 69 ఏళ్లయింది. ప్రజల పిలుపుకి దూరమై తొమ్మిదేళ్లు గడిచిపోయింది. కానీ... ప్రతి మదిలో ఆ రూపం పదిలం. ప్రతి ఊరు ఆయన స్మృతిలోఒక సువర్ణయుగాన్ని మననం చేసుకుంటూనే ఉంది. మనిషిగా ఆయన పంచిన మంచి, నాయకుడిగా చేసిన పోరాటం, పాలకుడిగా పంచిన సంక్షేమం ఎప్పటికీ గీటురాళ్లే. ఆయనే దివంగత ముఖ్యమంత్రి, మహానేత, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. మేలు పొందిన ప్రజలు వైఎస్ ఔదార్యాన్ని.. కలిసి పనిచేసిన అధికారులు ఆయన వ్యక్తిత్వాన్ని.. సన్నిహితులు ఆ రాజన్న మాటను మమతను.. నేటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అలాంటి పాలన మళ్లీ వస్తే బాగుండు అని ఆకాంక్షిస్తున్నారు. ప్రజల మనిషి పుట్టిన రోజును ఊరూవాడా పండుగలా జరుపుకుంటున్నారు. పోలవరం వైఎస్సార్ ఘనతే దశాబ్దాల తరబడి పునాది రాళ్లకే పరిమితమైన పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు పనులు చేపట్టిన ఘనత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఒక్క రాజశేఖరరెడ్డికే దక్కుతుంది.ఎంతో ముందుచూపుతో కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని ఏకంగా 17,500 క్యూసెక్కులతో డిజైన్ చేయించి కాలువల పనులను దాదాపు ఆయన హయాంలోనే పూర్తి చేశారు. కుడి, ఎడమ కాలువలతో పాటు పోలవరం హెడ్‌వర్క్ పనులను వైఎస్సార్ చేపట్టారు. అన్ని అనుమతులు తేవడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించగలిగారు. వైఎస్సార్ ఉండి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. రాయలసీమలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల పనులను వైఎస్సార్ చేపట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైఎస్సార్‌దే. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టిందీ వైఎస్సారే. పేదలకు సాయం చేసేందుకు తపన.. సహాయం కోసం వచ్చిన వారిని ఆదుకునే విషయంలో వైఎస్ వెనుకాముందూ చూడరు. అప్పట్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీలో సీహెచ్ అనూరాధ అనే విద్యార్థిని చదువుతుండేది. ఆకతాయిలు యాసిడ్ దాడి చేయడంతో ఆమె ముఖమంతా అందవికారంగా తయారైంది. దీంతో ఆమె నేరుగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని కోరింది.ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన వైఎస్ అప్పటికప్పుడు రూ.71.45 లక్షలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా.. పూర్తిగా వైద్యం చేయించుకోవడానికి ఎంత ఖర్చయినా భరిస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు. – తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి పాలకుడంటే వైఎస్‌లా ఉండాలి.. ‘అసలు ప్రజా పాలకుడంటే ఎలా ఉండాలో అన్నదానికి వైఎస్ రాజశేఖరరెడ్డిగారే నిదర్శనం.. వైఎస్ ప్రభుత్వ హయాంలో నేను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో కార్యదర్శిగా ఉన్నందున చాలా అంశాలను దగ్గర నుంచి చూసే అవకాశం కలిగింది. దీనివల్ల నేను చాలా నేర్చుకున్నా’ అని రిటైర్డు ఐఏఎస్ అధికారి కె.ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. వివిధ సందర్భాల్లో వైఎస్‌లో గమనించిన పలు అంశాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం రాజధర్మం: రాష్ట్రంలో ఉన్నా, రాష్ట్రం వెలుపల ఉన్నా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద సాయం కోసం వచ్చిన వినతులను పరిష్కరించనిదే వైఎస్ ఏనాడూ నిద్రపోయేవారు కాదు. ఒక రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశాక.. కేంద్ర మంత్రులు, ఇతరులతో సమావేశాలు ముగిసేసరికి బాగా పొద్దుపోయింది. ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ) అనుమతుల అంశం రేపు చూద్దురు.. ఇక నిద్రపోండి సర్.. అని నేను సూచించాను. ‘నో.. అవి పూర్తిచేశాకే నిద్ర.. మన నిద్ర కోసం ఎల్వోసీలు ఆగిపోకూడదు. నిధుల మంజూరు మెసేజ్‌లు ఆస్పత్రులకు వెళితేనే అక్కడి వారు ఈ పేదలకు వైద్యం ఆరంభిస్తారు. లేదంటే వైద్యం చేయరు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం రాజధర్మం’ అని చెప్పారు వైఎస్. దీంతో ఆ సలహా ఇచ్చినందుకు నేనే సిగ్గుపడ్డా. ఇదీ.. పేదల సమస్యల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి. – నాటి సీఎంవో కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి బీడు భూములకు జీవం వైఎస్సార్ చేసిన మేలు గద్వాల చరిత్రలో నిలిచిపోయింది. 2004 బడ్జెట్లో నెట్టెంపాడుకు సంబంధించిన ప్రతిపాదనలు లేవని తెలిసింది. వెంటనే వైఎస్సార్ వద్దకు వెళ్లి ప్రాజెక్టు విషయాన్ని చెప్పా. ఒక్కరోజులో నెట్టెంపాడు ప్రతిపాదనలు ఓకే చేశారు. అంతేకాదు 25 వేల ఎకరాల ఆయకట్టు నుంచి ఏకంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు పెంచారు. ఈరోజు నెట్టెంపాడు ద్వారా 1.5 లక్షల ఎకరాల బీడు భూములకు సాగునీరు అందుతుందంటే అది వైఎస్ చలువే. – డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే తక్షణ నిర్ణయాలు తక్షణం నిర్ణయాలు తీసుకోవడంలో వైఎస్‌కు సాటివచ్చేవారు లేరు. ఒక రోజు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. నియోజకవర్గానికి అవసరమైన ప్రతిపాదనలు ఏవైనా ఉన్నాయా అని అడిగారు.తాగునీటి ఎద్దడి తీర్చడానికి మంజీర నది నుంచి నీటిని అందించడానికి తాగునీటి పథకం కోసం రూ.40 కోట్లు అవసరమవుతాయని చెప్పా. ఆశ్చర్యంగా రాత్రి 11 గంటల సమయంలో సీఎం కార్యాలయం నుంచి మరో ఫోన్ వచ్చింది. తాగునీటి పథకం పనులు చేపట్టేందుకు సీఎం ఆమోదం తెలిపారని, ఉత్తర్వులు పంపుతున్నట్లు చెప్పారు. – మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నది గొప్ప మనసు.. ప్రజల కోసం పడే తపన, ఎవరు సలహాలిచ్చినా స్వీకరించే గుణం అన్నలో కనిపించేవి. ఆ రోజుల్లో సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు తరచుగా జరిగేవి. వీటిని నివారించేందుకు రైతులు, డ్వాక్రా మహిళలకు ఇస్తున్న తరహాలో చేనేత కుటుంబాలకు కూడా పావలా వడ్డీ, ఐదు లక్షల రుణాలను ఇస్తే బాగుంటుందని అన్న వైఎస్‌కు సూచించా. మరుసటి రోజు ఉదయంమే క్యాంపు ఆఫీసు నుంచి అన్న ఫోన్. ‘మీరిచ్చిన ప్రతిపాదనలు చూశానమ్మా.. చాలా బాగున్నాయి. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రకటిద్దాం’ అన్నారు. ‘పల్లెబాటకు వెళితే ప్రజల నుంచి సంచుల కొద్దీ అర్జీలొస్తున్నాయి.. సంచులతో బస్సు నిండిపోతోంది.. ఏం చేద్దాం అని ఓ నాయకుడు అనడం నా చెవిన పడింది. వెంటనే జోక్యం చేసుకుని అన్నా.. రేషన్ కార్డు, ఇల్లు, పెన్షన్ ఇస్తే సగం అర్జీలకు ఫుల్స్టాప్ పడుతుందని అనేశా. అంతే ఇందిరమ్మ ఇళ్లు, అర్హులందరికీ పెన్షన్, రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ శివారుల్లో రాజీవ్‌గృహ కల్ప కాలనీలకు అంకురార్పణ చేసి ఇళ్ల సమస్యను తీర్చారు. – మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ 1986లో తెలుగుగంగ పనులను పర్యవేక్షించేందుకు ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ వెళ్లారు. ఆ సమయంలో ఓ కూలీ గాయపడి అల్లాడుతున్నాడు. వైఎస్సార్ అతనికి ప్రాథమిక చికిత్స అందించి, మద్రాసుకు పంపి మెరుగైన వైద్యం అందించారు. అలాగే 1988లో కడప జిల్లాలో ఓ గ్రామం మీదుగా వెళ్తున్నాం. ఆ రోడ్డు పూర్తిగా కంకర తేలిపోయి ఉంది. దాన్ని గమనించిన ఆయన సీఎం అయ్యాక నాణ్యతతో రహదారులను నిర్మించడమే కాకుండా గ్రామాల్లోనే అత్యధికంగా పనులు చేయించారు. ఇంకోసారి మహబూబ్‌నగర్‌లో పార్టీకి చెందిన కార్యకర్త క్యాన్సర్‌తో బాధపడుతూ ఆర్థికంగా చితికిపోయాడు. అతన్ని స్వయంగా పరామర్శించిన వైఎస్సార్ ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా, మెరుగైన వైద్యం చేయించారు. తాను సీఎం అయ్యాక ప్రతి పేదవాడికి పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. – భూమన కరుణాకర్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ లబ్ధి పొందని కుటుంబం లేదు మహిళల సమర్థతపై వైఎస్ఆర్కు అపారమైన నమ్మకం ఉండేది. అందుకే ఆయన మంత్రివర్గంలో ఏకంగా ఐదుగురు మహిళలకు స్థానం కల్పించి వారి సమర్థతను నిరూపించుకునే అవకాశమిచ్చారు. తనకు సహచరులే తప్ప అనుచరులు లేరని చెప్పిన అరుదైన నాయకుడు వైఎస్. అందుకే ఆయన ప్రతీ ఒక్కరి మనస్సులోను చోటు సంపాదించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్సార్ పాలనలో లబ్ధిపొందని కుటుంబంలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. రైతులతోపాటు అన్ని వర్గాల వారూ వైఎస్ హయాంలో సంతోషంగా ఉండేవారు. – ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ, రాజమహేంద్రవరం మానవీయ కోణంలో పరిష్కారాలు ప్రజల సమస్యలను మానవీయ కోణంలో ఆలోచించి, వాటి పరిష్కారానికి వైఎస్సార్ చిత్తశుద్ధితో కృషి చేశారు. సర్వశిక్షా అభియాన్‌కు, శాసనసభ కమిటీకి నేను చైర్మన్‌గా ఉన్నప్పుడు పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించాను. శాసనసభా కమిటీ ప్రతిపాదన కదా అనే చులకన భావనతో అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకోలేదు. దీన్ని వైఎస్ దృష్టికి తీసుకెళ్లగానే.. ‘రేపు మధ్యాహ్నం సర్వశిక్షా అభియాన్‌పై సమీక్షా సమావేశం నిర్వహిద్దాం.. మీరు కూడా ఉండండి’ అన్నారు. దాదాపు మూడు గంటలసేపు జరిగిన చర్చల తదుపరి, రాష్ట్రంలోని 1000 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ప్రవేశపెట్టేందుకు అక్కడికక్కడే నిర్ణయం తీసుకొన్నారు. అదేవిధంగా తెనాలిలో యడ్ల లింగయ్యనగర్‌లో అగ్నిప్రమాదం సంభవించి 150కి పైగా ఇళ్లు కాలిపోయాయి. వైఎస్‌తో సమస్య చెప్పగానే ప్రభుత్వ ఖర్చుతోనే అందరికీ ఇళ్లు నిర్మిద్దామని హామీ ఇచ్చారు. అన్న మాటలను అక్షరాలా సాకారం చేసి చూపారు. – మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిరాడంబరతకు నిదర్శనం ప్రజల పక్షాన ఉండే ప్రతీ అధికారినీ గౌరవించే వ్యక్తిత్వం వైఎస్‌కే సొంతం. నేను కడప, జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేశాను. 1991–92లో ఈ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. వైఎస్ ఇలాఖాలో ఇంత స్వేచ్ఛ ఉంటుందా అన్న విషయం ఎన్నికలయ్యాక గానీ నాకు తెలీలేదు. ‘నిష్పక్షపాతంగా ఉన్నావ్.. అదే కావాలి’ అని ఆయన ప్రశంసించడం ఇప్పటికీ గుర్తుంది. ఓ అధికారిగా నా పాప పెళ్లికి రమ్మని కార్డిచ్చాను.అంతే.. రావడమే కాదు.. మా కుటుంబ సభ్యులతో అరగంట గడపడం వైఎస్ నిరాడంబరతకు నిదర్శనం. విధినిర్వహణలో భాగంగా కొన్ని విషయాల్లో ముందుకెళ్ళాలా? వద్దా? అనే సందేహాలొచ్చినప్పుడు కులం, మతం, పార్టీని చూడొద్దు. పేదవాడికి అన్యాయం జరిగితే వందశాతం వాళ్ల పక్షానే నిలబడాలని ఆయన చెప్పేవారు. – ఇక్బాల్, విశ్రాంత ఐపీఎస్ అధికారి సమయపాలనలో మార్గదర్శి సమయపాలన పాటించడంలో వైఎస్‌కు ఎవరూ సాటిలేరు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏ సమావేశానికైనా గంట కొట్టినట్లు నిర్దిష్ట సమయానికి ఠంచనుగా వచ్చేవారు. ఇచ్చిన సమయం ముగియగానే ఎక్కడా నిమిషం కూడా వృథా చేయకుండా వెళ్లిపోయేవారు. అధికారుల సమీక్షల్లో కూడా ఎక్కడా కాలాన్ని వృథా చేసేవారు కాదు. ఏ అంశమైనా సూటిగా, స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. అధికారులు చెప్పే అంశాలను నిశితంగా పరిశీలించేవారు. స్పష్టమైన అవగాహన ఉన్న అంశాల్లో చక్కటి మార్గనిర్దేశం చేసేవారు. రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేవారు.ఎక్కువమంది సందర్శకులను కలవడానికి అవకాశం ఇచ్చేవారు. ప్రాధాన్యం ఉండి వివరంగా మాట్లాడాల్సిన అంశమైతే తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చి పిలిపించి మాట్లాడేవారు. ఇంతటి టైమ్ మేనేజ్మెంట్ పాటించినందునే ఆయన ఎక్కువ మందిని కలిసేవారు. సమీక్షలు, మంత్రివర్గ సమావేశాలు కూడా సకాలంలో పూర్తిచేసేవారు. – ఐవైఆర్ కృష్ణారావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఏదడిగినా కాదనలే..! ‘దివంగత మహానేత వైఎస్ మహానీయుడు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పరితపించిన గొప్ప నేత. విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి వాటికి భారీ ఎత్తున నిధులు కేటాయించారు. సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి ఎవరేం అడిగినా కాదనకుండా ఇచ్చేవారు. నేను విశ్వవిద్యాలయం, అగ్రికల్చర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ కావాలని అడిగా. ఆయన కాదనకుండా వెంటనే వాటిని మంజూరు చేశారు. ఆయన చొరవ వల్ల జిల్లాలో వేల మంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి వెళ్లారు. – తెలంగాణ సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి వంశధార సాకారమైంది ఆరు దశాబ్దాలుగా నలుగుతున్న వంశధార జలాల సమస్య ఈ రోజు కొలిక్కి వచ్చినా, ట్రిబ్యునల్ తీర్పు అనుకూలంగా వచ్చినా దానికి కారణం.. దూరదృష్టితో నాడు వైఎస్ తీసుకున్న చొరవే. ఒడిశాకు ఇబ్బందిలేని రీతిలో భామిని మండలంలో సైడ్‌వియర్ నిర్మించి వరద కాలువ ద్వారా హిరమండలం జలాశయంలోకి నీరు తెచ్చే విధంగా ప్రఖ్యాత ఇంజనీర్ సీఆర్ఎం పట్నాయక్ ప్రత్యామ్నాయ ప్లాన్ తయారుచేశారు. దీనికి వైఎస్ వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ పనులూ చాలావరకూ పూర్తయ్యాయి. ఇది పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో రెండు పంటలకూ సాగునీరు అందుతుంది. – మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎప్పుడూ ప్రజల వెంటే.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల వెన్నంటే ఉండాలని దివంగత మహానేత వైఎస్సార్ ఎప్పుడూ చెప్పేవారు. కార్మిక నాయకుడిగా ఉన్న నన్ను ఎమ్మెల్యేను చేసిన ఘనత వైఎస్సార్‌దే. తంగెడ, దాచేపల్లి, నడికుడి, శ్రీనగర్, గామాలపాడు, పొందుగల గ్రామాలకు కృష్ణానది నీటిని అందించేందుకు నిధులు కేటాయించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిడుగురాళ్ల, గురజాల, మాచవరం మండలాల్లో నిరుపేదలకు ఇళ్లు కట్టించాం. నియోజకవర్గంలో జరిగిన వందల కోట్ల అభివృద్ధిలో వైఎస్సార్‌ది చెరగని ముద్ర. బీసీలంటే వైఎస్సార్‌కు అమిత ప్రేమ ఉంది. – వైఎస్సార్సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు కృష్ణమూర్తి అక్కడికక్కడే రూ.17 కోట్లు ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపించిన మహనీయుడు మహానేత వైఎస్. 2005లో తమ్మిలేరుకు వరదలు వచ్చి ఏలూరు సగానికిపైగా నీట మునిగి ఐదారు అడుగుల నీరు చేరింది. సీఎం వైఎస్సార్‌కు ఫోన్ చేసి పరిస్థితి వివరించగానే ఆయన వెంటనే ఏలూరు వచ్చారు. నన్ను, కలెక్టర్‌ను పిలిచి సమస్యకు శాశ్వత పరిష్కారం ఏమిటని అడిగారు. ఏలూరు చుట్టూ ఉన్న తమ్మిలేరుకు రివిటింగ్ చేయడంతోపాటు, రిటైనింగ్ వాల్ కడితే సరిపోతుందని చెప్పాను. దీంతో ఆయన అక్కడికక్కడే రూ.17 కోట్లు మంజూరు చేశారు. – వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని -
నేడు వైఎస్సార్ జయంతి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి సం దర్భంగా ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం (లోటస్‌పాండ్)లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సేవా కార్యక్రమాల్లో పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారని పేర్కొంది. -
వైఎస్ చేసిన మేలు ఎవరూ మరువలేరు
ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య ఎమ్మెల్యే, తనకు సంబంధించిన వారికి వైద్యం చేయించేందుకు ఆర్థిక సాయం కోరుతూ అర్జీని వైఎస్ చేతికి ఇచ్చారు. అదంతా చదివి వైఎస్ ఆయనతో,’’ నేను డాక్టరుగా చెబుతున్నా విను. ఈ జబ్బుకి నువ్వడిగిన యాభయ్ వేలు ఏమాత్రం సరిపోవు. రెండు లక్షలు లేనిదే వైద్యం జరగదు. అంచేత అంత డబ్బు ఇస్తాను, వైద్యం చేయించు’’ అన్నారు. ఆ ఎమ్మెల్యేకు ఆశ్చర్యంతో మాట పెగల్లేదు. బయటకు వచ్చి పేషీ అధికారులతో, ‘‘చూశారా, సీఎం అంటే ఇలా ఉండాలి, మా పార్టీ అధికారంలో ఉండగా ఎవరు వెళ్లినా, అడిగిన దానిలో సగం కత్తిరించి మంజూరు చేసేవారు. దాంతో వారు ఖర్చు రెట్టింపు చూపించి అడగాల్సి వచ్చేది’’ అని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రజలందరికీ మేలు చేసే అవకాశం పూర్తిగా లభించింది ముఖ్యమంత్రి అయ్యాకే. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న రెండేళ్ల కాలం మినహా ఆయన ఎక్కువ కాలం సచి వాలయానికి, ఆఫీసు ఫైళ్ళకు దూరంగా పార్లమెంటు సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. వైద్య విద్య పూర్తిచేశాక తొలి నాళ్లలో చేసిన డాక్టరు ప్రాక్టీసు తప్పిస్తే తదనంతర ం ఆయన ఆ పనిచేసిన దాఖలాలు లేవు. సీఎం పదవి చేపట్టాకే రాజకీయ నాయకుడిగా, వైద్యుడిగా తను అనుకున్న విధంగా చేయడానికి వెసులుబాటు లభించింది. ఈ అరుదైన అవకాశాన్ని (గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవ్వరూ ఒకే విడతలో వరుసగా అయిదేళ్ల పదవీ కాలం పూర్తిచేసుకోలేదు) వైఎస్ పూర్తిగా సద్వి నియోగం చేసుకున్నారు. వైఎస్ చనిపోయి దాదాపు తొమ్మిదేళ్లయినా ఆయన వల్ల మేలు పొందిన వారు దాన్ని ఇంకా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. వీళ్లేమీ బడా కాంట్రాక్టర్లు కాదు, గొప్ప రాజకీయ నాయకులు అంతకంటే కాదు. వారందరూ సామాన్యులు. ఇంకా చెప్పాలంటే అతి సామాన్యులు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, 108, 104 పథకాలను ప్రజలు నేటికీ ఆయన పేరిటే గుర్తుకు తెచ్చుకుంటున్నారనడం అతిశయోక్తి కాదు. రాజశేఖరరెడ్డి ఔదార్య లక్షణాన్ని ప్రస్ఫుటించే కొన్ని ఉదా హరణలను గుర్తుచేయడమే ఈ వ్యాసకర్త ఉద్దేశం. ప్రింటింగు ప్రెస్సుల్లో పేరుకుపోయే అనవసరమైన కాగి తాలను కొందరు గోనెసంచుల్లో కూరుకుని వేరే చోట అమ్ముకుని పొట్టపోసుకుంటూ ఉంటారు. అలా జీవనం సాగించే ప్రకాష్ అనే వ్యక్తికి గుండె జబ్బనీ, వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆ మాటతో అతడికి కాలూ చేయీ ఆడలేదు. ఆ ప్రెస్సు యజమాని, ఈ విషయాన్ని జర్నలిస్టుల సంఘం నాయకుడు దేవులపల్లి అమర్ చెవిన వేసి ఏదైనా సాయం జరిగేలా చూడ మన్నాడు. రోగి వివరాలు తెలిసిన అమర్ వెంటనే వైఎస్‌ని కలిసి విషయం చెప్పారు. ప్రకాష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన అర్జీని అయన చేతికి ఇచ్చారు. తక్షణ సాయం అందించాలని వైఎస్ తన పేషీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే సంబంధిత ఉత్తర్వులు వచ్చేలోగా ఆ రోగి మరణించిన సంగతి సీఎంకు తెలిసింది. సహాయ నిధి వ్యవహారాలు చూసే అధికారిని పిలిచి వెంటనే ఆ రోగి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున రెండు లక్షల ఆర్థిక సాయం అందించి రావాలని కోరారు. వైఎస్ సీఎం అయిన కొన్ని నెలలకే ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో టంగుటూరి అంజయ్య సీఎంగా ఉండగా కూడా ఇదే పరిస్థితి తలెత్తిందని అధికారులు చెప్పేవారు. దీనికి కారణం వారిద్దరి చేతికీ ఎముక లేకపోవడం. అడగని వారిదే పాపం అన్నట్టు ఎవరు అర్జీ పెట్టు కున్నా డబ్బు మంజూరు చేసేవారు. ఒకసారి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య శాసన సభ్యుడు, తనకు సంబంధించిన వారికి వైద్యం చేయించేందుకు ఆర్థిక సాయం కోరుతూ అర్జీని వైఎస్ చేతికి ఇచ్చారు. అదంతా చదివి వైఎస్ ఆయనతో ‘‘నేను డాక్టరుగా చెబుతున్నా విను. ఈ జబ్బుకి నువ్వడిగిన యాభయ్ వేలు ఏమాత్రం సరిపోవు. రెండు లక్షలు లేనిదే వైద్యం జరగదు. అంచేత అంత డబ్బు ఇస్తాను, వైద్యం చేయించు’’ అన్నారు. ఆ ఎమ్మెల్యేకు ఆశ్చర్యంతో మాట పెగల్లేదు. బయటకు వచ్చి పేషీ అధికారులతో, ‘‘చూశారా, సీఎం అంటే ఇలా ఉండాలి, మా పార్టీ అధికారంలో ఉండగా ఎవరు వెళ్లినా, అడిగిన దానిలో సగం కత్తి రించి మంజూరు చేసే వారు. దాంతో వారు ఖర్చు రెట్టింపు చూపించి అడగాల్సి వచ్చేది’’ అని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ ఆంగ్ల పత్రిక విలేకరి తన కుమార్తె పెళ్లికి పిలవడానికి భార్యను వెంట బెట్టుకుని క్యాంప్ ఆఫీసుకు వెళ్ళారు. వైఎస్ లోపలకు వస్తూనే వారిని చూసి కూర్చోబెట్టమని సిబ్బందికి చెప్పి లోపలకు వెళ్ళారు. సిబ్బంది వారిని ప్రవేశ ద్వారం వద్ద కుర్చీల్లో కూర్చో బెట్టారు. సీఎం కాసేపటికి వచ్చి బయట కూర్చున్న భార్యా భర్తలను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గబగబా విలేకరి భార్య దగ్గరికి వెళ్లి, ‘మీరు మాఇంటి ఆడపడుచు వంటి వారు, మీకు సరిగా మర్యాద జరగలేదు, మన్నించండి,’ అని ఒకటికి రెండు సార్లు అనడంతో ఆమె విస్తుపోయారు. వారిని వెంటబెట్టుకుని లోపలకు తీసుకుని వెళ్లి, ‘మీకు ఎంతమంది పిల్లలు, ఎంద రికి పెళ్లయింది’ అంటూ ఆప్యాయంగా వివరాలు కనుక్కున్నారు. అందరు జర్నలిస్టుల మాదిరిగానే వైఎస్సార్‌తో నాకూ కొన్ని అనుభవాలున్నాయి. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోకుండానే వైఎస్‌ను అయన కారులోనే సరాసరి రేడియో రికార్డింగుకు తీసుకు వెళ్ళాను. ఎవరు ముఖ్యమంత్రి అయినా ముందుగా అయన సందేశం రికార్డు చేయాల్సింది రేడియో వాళ్లే అనేది నా వాదన. నేను ఆయనని ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఎక్కువే అనిపిస్తుంది. ఇందుకు ప్రధాన ప్రత్యక్ష సాక్షి వైఎస్‌కు మొదటినుంచి చివరి వరకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన భాస్కర శర్మ. వైఎస్ అపాయింట్మెంట్లు ఖరారు చేసే బాధ్యత పూర్తిగా ఆయనది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇలా ఎంతోమంది నుంచి ఒత్తిళ్ళు వచ్చేవి. సీఎం పేషీలో పని చేసేవాళ్ళు ఎంత మర్యాదస్తులయితే అంత మంచి పేరు నేరుగా సీఎం ఖాతాలో పడిపోతుంది. నేను అనేకసార్లు శర్మను ఇబ్బంది పెట్టి ఎవరెవరి కోసమో వైఎస్ అపాయింట్మెంట్ ఫోనులోనే అడగడం, తీసుకోవడం, మళ్లీ ఫోనులోనే క్యాన్సిల్ చేయడం ఇలా అనేక సార్లు జరిగింది. ‘‘ సీఎం గారి అపాయింట్మెంట్ కోసం అందరూ క్యూలో ఉంటారు. మీరేమో ఇచ్చింది క్యాన్సిల్ చేయమంటారు. ఇదేమీ బాగా లేదండీ శ్రీనివాసరావు గారూ’’ అనే వారు శర్మ. వైఎస్ కూడా అంతే. ఈ విషయాలు తెలిసి కూడా తరువాత కలిసినప్పుడు ఏమీ తెలియనట్టే పలకరించేవారు. నోరారా నవ్వుతూ, ‘ఏవిటి విశేషాలు’ అంటూ పలకరించేవారు. ఆయన మరణించడానికి ముందు రోజే అసెంబ్లీలో కలిశాను. ఆయన లేరన్న సంగతి కూడా ఆ మరునాటికి కానీ తెలియని పరిస్థితి. మనిషిని ఆనవాలు పట్టలేని విధంగా మృత్యువు ఆయనను వెంట బెట్టుకు వెళ్లింది. అంతకు ముందు రోజు చూసిన ఆయన నగుమోమే మనస్సులో ముద్రపడిపోయింది. ఈరోజు వైఎస్ జయంతి. ఆయన్ని స్మరించుకుంటూ ఈ నాలుగు ముక్కలు. వ్యాసకర్త: భండారు శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు, మొబైల్ : 98491 30595 -
నమ్మకం పుట్టిన రోజు
అవును! ఆయనకి మనమందరం ఓ కుటుంబం. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ఆయనే ఒక కుటుంబం. కావాలంటే చూస్కోండి.. మన ఇంట్లోనే ప్రతి ఒక్కరిలో వైఎస్సార్ గుణం ఒక్కటైనా కనబడుతుంది. అమ్మలోని త్యాగం.నాన్నలోని నీడ.అన్నయ్యలోని అండ.అక్కయ్యలోని సంస్కారం.చెల్లిలోని ప్రేమ.తమ్ముడిలోని తెగువ.తాతయ్యలోని నవ్వు.అవ్వలోని ఆపేక్ష. ఇలా కుటుంబ సభ్యుల్లోనూ, బంధువుల్లోనూ, మంచి స్నేహితుల్లోనూ మనకి వైఎస్సార్ కనబడుతూనే ఉంటారు. మనలాంటి పెద్ద కుటుంబాన్ని ఒక్కటిగా కలబోస్తే ఆయనే మన వైఎస్సార్. ప్రతి గుండె పురుడుపోసుకున్న నమ్మకమే వైఎస్సార్.మనల్ని మనం ఆయనలో చూస్కోగలం.ఆయనలో మన జీవనస్ఫూర్తిని వెతుక్కోగలం. ఈ మాటలు వైఎస్ విజయమ్మ తరచూ చెబుతూ ఉంటారు.వారితో పంచుకున్న జీవితంలోని కొన్ని అనుభవాలు ఆమె మాటల్లోనే... రాష్ట్రమంతా ఇలాగే ఉండాలి కదా! ఈయన మొదటినుంచీ హైలీ ప్రాక్టికల్ మనిషి అనీ, లక్ష్యసాధన దిశగా పనిచేసే తత్వం ఆరోజు నుంచే ఉండేదనీ ఈయన స్నేహితులు చెప్తూంటారు. అంతేకాదు, ఈయనకు రాజకీయాల మీద ఆసక్తే కాదు, మంచి అవగాహన కూడా ఉండేదనీ, రాష్ట్ర – జాతీయస్థాయి రాజకీయాల గురించి తమతో కూలంకషంగా చర్చించేవారనీ, భవిష్యత్తులో మంచి నాయకుడు అవ్వాలనే ఆశయం కూడా తనకు మొదటినుంచీ ఉండేదనీ వాళ్లంటూంటారు.లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఈయన, కృష్ణా జిల్లా పంటలు చూసి, వాళ్లనడిగి వివరాలన్నీ తెలుసుకున్నారట! అంతేకాదు, గోదావరి జిల్లాల్లో పంటలు, నీళ్ళు, పచ్చదనం చూసినప్పుడు కూడా ఈయన ‘రాష్ట్రమంతా ఇలానే పచ్చగా ఉంటే ఎంత బాగుంటుంది’ అని అనుకున్నారట! ఆ విషయాలను గుర్తుచేసుకుంటూ ఈయన స్నేహితులు – ‘ఆ వయసులోనే రాజుకి అలాంటి ఆలోచనలు ఉండటం మాకిప్పటికీ ఊహకందని విషయం’ అని అంటుంటారు. రాఖీ అన్నయ్య ఆడవాళ్లను ఎవరైనా ఏడిపించినా, ఇబ్బంది పెట్టినా ఈయన అస్సలు సహించేవారు కాదు. అంతేకాదు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మగవాళ్ళదేనని ఫీలయ్యేవారు. ఓసారి సుగుణక్క (వైఎస్ ఫస్ట్ కజిన్) స్నేహితురాలిని ఒక కుర్రాడు ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు. దానికి ఆ అమ్మాయి తిరస్కరించినా, వదలకుండా ఆమెని వెంటబడి వేధించాడు. ఆ విషయం ఆ అమ్మాయి ఈయనకు చెప్పగానే, కాలేజీలో అందరిముందరా అతన్ని దండించారు. అంతే, ఆరోజు నుంచి కాలేజీలో ఎవరూ, ఏ అమ్మాయినీ కామెంట్ చేయడం గానీ, వెంబడించడం గానీ చేయలేదు! అందుకే ఆడపిల్లలందరూ ఈయనని గౌరవభావంతో చూసేవారు. రాఖీ పండుగ వస్తే సుగుణక్కతో పాటు వాళ్లు కూడా ఈయనకు రాఖీలు కట్టేవారు! కాలేజీ వాతావరణం మారిపోయింది 1963లో గుల్బర్గా ఎం.ఆర్. మెడికల్ కాలేజీని స్థాపించాక ఈయనది మూడో బ్యాచ్! అప్పట్లో ఆ కాలేజీలో కర్ణాటక – నాన్ కర్ణాటక ఫీలింగ్ బాగా ఉండేది! కాలేజీలో చేరగానే ఈయన క్లాస్ రిప్రజెంటేటివ్‌గా ఎన్నికయ్యారు. రెండో సంవత్సరంలో కాలేజ్ యూనియన్ సెక్రటరీగా కూడా పోటీ చేశారు. ఈయన కాలేజీ సెక్రటరీ అయిన తర్వాత కాలేజీ వాతావరణమే మారిపోయింది! మంచి వక్త అవడంతోపాటు, స్థానిక భాష కన్నడ మీద కూడా ఈయనకు మంచి పట్టు ఉండటంతో, విద్యార్థులను బాగా ఆకట్టుకునేవారు. అందరినీ కలుపుకొనిపోతూ, రాజీలు చేయడంతో, అప్పటివరకు వున్న కర్ణాటక – నాన్ కర్ణాటక ఫీలింగ్ బాగా తగ్గింది. కొన్నాళ్టికి ఈయన కాలేజీలో బాగా పాపులర్ అయ్యారు. మూడవ సంవత్సరంలో ప్రెసిడెంట్‌గా కూడా ఎన్నికయ్యారు! ప్రత్యర్థులు అనుకుని పోరాడినప్పుడు ఎంతటి నిష్ఠతో పోరాడతారో, ప్రత్యర్థుల్ని స్నేహితులుగా మార్చుకోవడంలో కూడా అంతటి నిష్ఠనీ, నిజాయితీని చూపిస్తారని స్నేహితులు చెబుతుంటారు. గురువు పేరు మీద స్కూలు ఈయన 7వ తరగతి వరకు పులివెందులలో చదువుకున్నాక, బళ్లారిలోని సెయింట్ జాన్స్ మిషనరీ హైస్కూల్లో 8వ తరగతిలో చేరారు. అక్కడే జార్జిబావ, వివేకం అన్న కూడా చేరారు. వీళ్లను చూసుకోవడం కోసం మామ, తన స్నేహితుడు వెంకటప్ప మాస్టారుని, ఆయన భార్య కొండమ్మని, పులివెందుల నుంచి బళ్లారి పంపించారు. పిల్లలు లేకపోవడంతో వాళ్లు కూడా వీళ్లని సొంత బిడ్డల్లా చూసుకున్నారనీ, అసలు వెంకటప్ప మాస్టారి మూలంగానే ఈయనకి క్రమశిక్షణ, నిబద్ధత, సోషలిస్టు భావాలు చిన్నతనంలోనే అలవడ్డాయనీ, పుస్తకాలు చదివే అలవాటు కూడా ఆయన వల్లే మొదలైందనీ చెప్తుంటారు. అలా ఆయన దగ్గర నుంచి ఈయన కేవలం చదువే కాదు, జీవితంలో ఉపయోగపడే ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఆ విశ్వాసం, కృతజ్ఞతతోపాటు బీదవాళ్లకు ఉచిత విద్యనందించాలన్న సంకల్పంతో వెంకటప్ప మాస్టారు పేరుమీద పులివెందులలో ఈయన ఒక స్కూలు కట్టించారు. బాగా గుర్తు... మొదట్లో ఆ పేరు వినగానే చాలామంది – ‘ఇదేం పేరు? ఎవరిది?’ అని అడిగేవారు. దానికీయన – ‘అది మా గురువుగారి పేరు’ అని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు. కొడుకు పుట్టినా తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ హౌస్‌సర్జన్సీ తర్వాత అనుభవం కోసం ఈయన జమ్మలమడుగులోని క్యాంప్‌బెల్ హాస్పిటల్లో చేరదామనుకున్న టైమ్‌లోనే నేను కూడా డెలివరీ కోసం అదే హాస్పిటల్లో చేరాను. ఈయన హౌస్‌సర్జన్సీ 1972, డిసెంబర్ 20న పూర్తయింది, జగన్ 21న పుట్టాడు. కొడుకు పుట్టాడని తెలియగానే ఈయన, సుగుణక్క, మరికొంతమందితో కలిసి జీపులో తిరుపతి నుంచి జమ్మలమడుగు వచ్చారు. తండ్రి అయ్యారన్న ఆనందంలో ఈయన దారిపొడవునా ఈలలేసుకుంటూ, పాటలు పాడుకుంటూ వచ్చారట!హాస్పిటల్ గదిలోకి వచ్చిన ఈయన ముందు నన్నే పలకరించారు. ‘ఎలా వున్నావు విజయా? నీరసంగా ఉందా?’ అని నా చేయి పట్టుకుని అడిగారు. ఆ తర్వాతే జగన్‌బాబును ఎత్తుకుని నా పక్కన మంచంమీదే కూర్చున్నారు. తను తండ్రి అయ్యాడన్న సంతోషంకన్నా, తన భార్య ఆరోగ్యం గురించి తనకున్న ఆలోచన నన్ను ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. ఇలాంటి చిన్నచిన్న విషయాలు గుర్తుచేసుకున్నప్పుడల్లా అనిపిస్తూంటుంది – ఒక నాయకుడు తన సంతోషాన్ని మించిన బాధ్యతను తెలిసినవాడయితేనే గొప్ప నాయకుడవుతాడు. చేతినిండా పనుంటే ఫ్యాక్షన్ మరకలుండవు! రాయలసీమలో మొదటినుంచీ ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువేగానీ, ఈయన మాత్రం ఎప్పుడూ దానికి వ్యతిరేకమే. ఫ్యాక్షన్ మంచిది కాదనీ, అది తరతరాలని నాశనం చేస్తుందనీ గట్టిగా నమ్మేవారు. ఈయనైతే ఫ్యాక్షన్ చేకూర్చే చేటు గురించి నిత్యం వాళ్లకు హితబోధ చేసేవారు... ‘ఈ ఫ్యాక్షన్లు పెట్టుకుని ఏం సాధిద్దామని? అవతలి వాళ్లను మనమేదైనా చేస్తే, వాళ్ళెందుకు ఊరుకుంటారు... మనల్నీ అదే చేస్తారుగా! దానివల్ల మన పిల్లలకూ, పెద్దవాళ్లకూ ద్రోహం చేసినవాళ్లమవుతాం. అదే మనం మంచి చేస్తే... మనకూ, మన పిల్లలకూ అందరికీ మంచి జరుగుతుంది’ అని!ఈయన రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో... రాయలసీమలో, ముఖ్యంగా కడపలో చాలా గ్రామాల్లో ఫ్యాక్షన్ గొడవలు ఉండేవి. అప్పుడీయన గొడవలున్న ప్రతి గ్రామానికి వెళ్లి, ఇరువైపుల వాళ్లకు రాజీ చేయడానికి ప్రయత్నించి, చాలావరకు సఫలీకృతులయ్యారు. ఆ ప్రయత్నంలో సొంత డబ్బు సైతం లెక్క చేయకుండా ఖర్చుపెట్టేవారు. ఈయన ఆధ్వర్యంలో పులివెందుల తాలూకాలో చాలావరకు పంచాయితీలు ఈయన మాట మీద పరిష్కరించబడేవి. పంచాయితీలన్నీ ఎక్కువశాతం ఇంట్లోనే జరిగేవి. జనాలందరూ వెళ్లేసరికి ఒక్కోసారి రాత్రి ఒంటిగంట, రెండు కూడా అయ్యేది. ఆ ఓర్పు, ప్రేమ, దయాగుణం, సహాయం చేసే స్వభావం చూసే జనాలు ఈయన మాటను గౌరవించేవారు.అసలు రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని రూపుమాపాలంటే అక్కడ కూడా కోస్తా మాదిరిగా రెండు పంటలు వేసే నీటి వనరులు, పరిస్థితులు కల్పించాలనీ, అప్పుడే అక్కడి ప్రజలకు గొడవల గురించి ఆలోచించే టైమ్ ఉండదనీ, ఆ దిశగా కృషిచేయాలనీ ఈయన నిత్యం తాపత్రయపడేవారు. ఫ్యాక్షనిజం అనేది మంచిది కాదని ఒక నినాదంలా చెప్పి, దాన్ని రూపుమాపడానికి అంత కృషిచేసినా... ఈయన మూలంగా పులివెందులలో, కడపలో దాదాపు అంతమైనా... కొందరు కావాలని ఈయన మీద ‘ఫ్యాక్షనిస్టు’ అని ముద్రవేశారు! దానికి మొదట్లో ఈయన బాధపడ్డా, తర్వాత్తర్వాత పట్టించుకోవడమే మానేశారు! అమ్మకే అమ్మ ఈయనకు అమ్మంటే ప్రాణం. అమ్మకి చాలా పద్ధతిగా, వారానికి ఒక ఉత్తరం రాసేవారు. 1990 ప్రాంతంలో అత్తమ్మకి తలకి దెబ్బతగిలి బ్రెయిన్ హేమరేజ్ అవడంతో ఢిల్లీకి తీసుకువెళ్లాం. అక్కడ ఆవిడ్ని 25 రోజులు హాస్పిటల్లో ఉంచారు. ఆ 25 రోజులపాటు ఈయన రాజకీయాలు, మిగతా పనులన్నీ మానుకుని, ఒక్కపూట కూడా బయటికి పోకుండా, ఆవిడ వెన్నంటే వుండి జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ టైంలో ఆవిడ ఎవ్వరినీ గుర్తుపట్టేవారు కాదు... అందుకని ఈయన మాటిమాటికీ ఆవిడ్ని పలకరించడం, నవ్వించడం, జనాలను గుర్తుపట్టేలా చేయడం, వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని తిప్పడం... లాంటివన్నీ ఎంతో ఓపిగ్గా చేశారు. అంత బిజీ టైంలో కూడా ఈయన పనులన్నీ పక్కనపెట్టేసి, ఆవిడ్ని అలా చిన్నపిల్లలా జాగ్రత్తగా చూసుకోవడం నాకే ఆశ్చర్యమేసింది! రియల్ వాల్యూ ఆఫ్ ఎ ఫాదర్! జగన్‌ను ఆయన ప్రేమగా సన్నీ అని పిలుచుకునేవారు. ఈయనకు ఎవరైనా ఏ సలహా ఇచ్చినా శ్రద్ధగా దాని గురించి ఆలోచించేవారు. అదే జగన్‌కు కూడా చెప్పేవారు. ‘సన్నీ, ఒక్క విషయం గుర్తుంచుకో – ఈ ప్రపంచంలో నీ దగ్గరి నుంచి ఏం ఆశించకుండా, నీ బాగుకోసమే తాపత్రయపడే వ్యక్తి ఎవరైనా ఉంటే, అతడి కంటే నీకు మంచి స్నేహితుడు ఇంకొకరు ఉండరు. వచ్చిన సలహా కంటే కూడా చెప్పిన వ్యక్తి ఎవరో గుర్తించు’ అని!వాళ్ల నాన్న ప్రభావం వల్ల, జగన్ చాలా పద్ధతిగా తయారయ్యాడు. యువకుడిగా ఉన్నప్పుడు కూడా ఏ రోజూ పార్టీలకు, పబ్‌లకు వెళ్లడం గానీ, సిగరెట్లు, మందు ఇతరత్రా చెడు అలవాట్లను గానీ దరిదాపులకు రానీయలేదు. అవన్నీ తల్చుకుంటూ జగన్ అంటూ ఉంటాడు – ‘దట్ వజ్ ద రియల్ వాల్యూ ఆఫ్ ఎ ఫాదర్’ అని! నాన్న మాటే జగన్ బాట జగన్‌కి ప్రజల మ«ధ్య ఉంటూ వాళ్లకు సేవ చేయాలని, అందరి మన్ననలు పొందాలని బాగా ఉండేది. అది నిశితంగా గమనించిన ఈయన, ఇక తన ఇష్టాన్ని కాదనలేక మెల్లమెల్లగా ఆ దిశగానే ప్రోత్సహించడం మొదలెట్టారు. అంతేకాదు, అప్పటినుంచి జగన్‌తో రాజకీయాల గురించి, నిబద్ధత గురించి, క్యారెక్టర్ బిల్డింగ్ గురించి మాట్లాడి తగ్గట్టుగా మలిచారు. ‘రాజకీయాల్లో ఉండాలంటే ధైర్యం, నిబ్బరం కలిగి ఉండాలి. అన్నీ పోగొట్టుకున్నా మాటిచ్చినదానికి నిలబడగలగాలి. మనల్ని నమ్ముకున్న వాళ్లకి తోడుగా ఉండగలగాలి... అప్పుడే నీకు వాళ్లు తోడుగా వుంటారు’ అని; ‘మనతో కష్టాలు పంచుకోవాలి అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. అందుకే ఎవర్నీ అశ్రద్ధ చేయవద్దు... అందర్నీ పలకరించాలి...’ లాంటివి చాలాసార్లు చెప్పడం విన్నాను!ఆ ప్రభావం వల్లేనేమో జగన్ ఎప్పుడూ అంటూండేవాడు – ‘నాన్న అన్నట్టుగా, ఎన్నాళ్లు బతికామన్నది కాదమ్మా ఎలా బతికామన్నది ముఖ్యం! చూడమ్మా, నాన్నని ఎంతమంది ఆరాధిస్తున్నారో! నాక్కూడా ఆయనలా మంచిపనులు చేస్తూ, ప్రజల మనసుల్లో ఉండాలని ఉంది’ అని! నమ్ముతారో లేదో, ఈ మాటలు చెప్పినప్పుడు జగన్‌కు గట్టిగా 18 ఏళ్లు కూడా లేవు! అందుకే, వాళ్ల నాన్న పోయిన తర్వాత తను మళ్లీ అవే మాటలు చెప్తున్నాడన్నా, ఇంత పట్టుదలతో ముందుకెళ్తున్నాడన్నా నాకేమాత్రం ఆశ్చర్యం కలగట్లేదు! జెండాకు దీక్షే ఊపిరి 1983 ఎన్నికలు... ఎన్.టి. రామారావు ప్రభంజనంలో ఎంతోమంది పెద్దపెద్ద కాంగ్రెస్ నాయకులు అపజయం పాలైన సమయంలో కూడా ఈయన, పులివెందుల నుంచి అవలీలగా గెలిచారు. ఆ సంవత్సరంలోనే ఓసారి ఈయన రాజీవ్గాంధితో పాటు ఢిల్లీ వెళ్లారు. ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈయన రాజీవ్‌గాంధీతో ఆంధ్ర రాజకీయాల గురించి కూలంకషంగా చర్చించారు. ఆయనతో అంత నిజాయితీగా, నిర్భయంగా మాట్లాడిన తొలి వ్యక్తి ఈయనే! రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో... పదేపదే ముఖ్యమంత్రుల్ని మార్చడం వల్ల వచ్చిన నష్టం ఏమిటో... కాంగ్రెస్‌లో సంస్థాగతంగా ఉన్న సమస్యలేమిటో, పార్టీని బలోపేతం చెయ్యాలంటే ఏం చెయ్యాలో... అందుకు తగ్గ వ్యూహాలేమిటో, ఎన్టీఆర్‌ని ఎదుర్కొనలేకపోవడానికి కారణాలేమిటో... రాజీవ్‌కి స్పష్టంగా వివరించారు. ఆ సమయంలోనే ఈయన, వెనుకబడిన కులాలకు చెందిన కె.ఇ. కృష్ణమూర్తిని పీసీసీ ప్రెసిడెంట్‌గా నియమిస్తే బాగుంటుందని కూడా సూచించారు. అయితే, ఆంధ్ర రాజకీయాల మీద ఈయనకున్న అవగాహన, ఈయన మాట్లాడిన తీరు చూసి ఆయన బాగా ప్రభావితం అయ్యారనుకుంటా... వారం రోజుల తర్వాత ఈయన్ని ఢిల్లీకి పిలిపించి, తననే పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉండమని అడిగారు.ఎన్టీఆర్ ప్రభంజనానికి అతలాకుతలమైన కాంగ్రెస్ పార్టీని మళ్లీ బలోపేతం చేసే సత్తా ఉన్నవాళ్లు పూర్తిగా అరుదైపోయారు. ఘోరపరాజయం చవిచూసిన పార్టీలో నిరాశే తప్ప ఎక్కడా ఉత్సాహం కనబడలేదు. మళ్లీ కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో ఉత్తేజాన్ని నింపాలంటే, ఎన్టీ రామారావు చరిష్మాను ఎదుర్కొనే నాయకుడి అవసరం ఎంతగానో ఉండింది. ఈ బాధ్యతని బరువు అనుకోకుండా, అవకాశం అనుకుని ఈయన కాంగ్రెస్‌కి పునరుజ్జీవం పోయడానికి శాయశక్తులా కృషిచేశారు. పడిపోతున్న జెండా పడకుండా ఎగరడానికి మనస్థైర్యం అన్న ఊపిరిని నింపాల్సిన అవసరం ఉంది. అలాంటి దీక్షతో ఆగస్టు 10, 1983న 34 ఏళ్ల అతి చిన్న వయసులో ఈయన మొదటిసారి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. పదవి రానప్పుడు నవ్వు వచ్చింది 1991... అప్పటివరకు అధికారంలో ఉన్న నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ మెజారిటీ కోల్పోవడంతో, కేంద్రంలో మళ్లీ మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. మళ్లీ ఈయన కడప నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈసారి దాదాపు 4.5 లక్షల భారీ మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి సి.రామచంద్రయ్యపై విజయం సాధించారు. అది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మెజార్టీ. అసలు ఈయనే స్వయంగా నియోజకవర్గంలో తిరిగి ప్రచారం చేసుకుంది... మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మాత్రమే! ఆ తర్వాత ఎప్పుడూ తిరగలేదు! ఇంట్లో వాళ్లందరికీ తలా ఒక మండలం అప్పజెప్పి, తను జిల్లాలోని మిగతా నియోజకవర్గాలు, ఇతర జిల్లాలకు తిరిగి ప్రచారం చేసేవారు. ఈయన ఎప్పుడూ ఒక్క ఎన్నికలో కూడా ఓడిపోలేదు. ఎన్నిసార్లు ప్రజల దగ్గర గెలిచినా, పార్టీ పదవుల దగ్గరకు వచ్చేటప్పటికి ఏదో ఒక ఇరకాటం సృష్టించేవారు. ఎఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఒకసారి, సీడబ్ల్యూసీ సభ్యుడిగా మరోసారి ఈయన పేరును ప్రతిపాదించినా, ఎవరో ఒకరు కుట్రచేసి అడ్డుకునేవారు. ఈయనకు అవేవీ పట్టేవి కాదు. వాళ్ల అగచాట్లు చూసి ఈయన నవ్వుకునేవారు. ‘అదేంటి? పదవి రాకపోతే ఎవరైనా బాధపడతారు కానీ, మీరు ఇలా నవ్వుకుంటారేంటి?’ అని అడిగితే, ‘పదవికోసం నేను అగచాట్లు పడితే బాగుండు... అది నేనెలాగూ చేయను. కానీ, నాకు పదవి రాకుండా వీళ్లు చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తుంటే నాకు నవ్వాగదు’ అనేవారు. తండ్రీకొడుకుల్లా కాకుండా స్నేహితుల్లా... ఆరోజుల్లో చాలావరకు పిల్లలకు తండ్రి అంటే బాగా భయముండేది. మామ డిసిప్లీన్ విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉండేవారు. ఇంట్లో ఉన్నవాళ్లందరికీ ఆయనంటే కొంచెం భయంగానే ఉండేది. కానీ ఈయనకు మాత్రం మామ అంటే అస్సలు భయం ఉండేది కాదు. పిల్లలు తప్పు చేస్తారేమోనని మామ దండించేవారు కాని, నిజానికి ఆయన మనస్సు చాలా మృదువైంది. నాకు బాగా గుర్తు... మా ఇంటికి ఒకసారి చాలామంది డాక్టర్లు భోజనానికి వచ్చారు. వాళ్లంతా మామ పెట్టించిన క్యాంపులో పేషంట్లను పరీక్షించడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇంట్లో పనివాళ్లు ఎంతమంది ఉన్నా, మామ స్వయంగా అందరికీ అన్ని సపర్యలు చేశారు. భోజనం అయ్యాక వాళ్లు చేతులు కడుక్కుంటుంటే, వాళ్లకు టవల్ కూడా అందించారు. ఇది మామ గుణం. తన ఊరి ప్రజలకు ఎవరైనా మేలు కోరితే, వారికి సేవ చేయడం ఒక గొప్ప అదృష్టంగా భావించేవారు. ఇలాంటివి ఈయనకు చాలా నచ్చేవి. వాళ్ల నాన్నను చూసి ఈయన కూడా అతిథులను చాలా ఆప్యాయతతో చూసుకునేవారు. అలా ఇంట్లో ఉన్న సంస్కారమే సమాజం పట్ల కూడా చూపించడం మొదలుపెట్టారు. నాతో ఎన్నోసార్లు మామను తలచుకుంటూ ఈయన ఎంతో గొప్పగా ఫీలయ్యేవారు. చిన్నప్పుడంతా ఈయన తండ్రిని చూసి మంచి విషయాలు నేర్చుకుంటే, పెద్దయ్యాక ఈయనను చూసి మామ క్షమాగుణం, దయాగుణం నేర్చుకున్నారు. మామ చనిపోయిన తర్వాత ఈయన ఆ స్నేహాన్ని, ప్రేమను, అనుభూతిని జగన్‌లో పొందారు.ఈయనకి మామతో మొదటినుంచీ అటాచ్మెంట్ ఎక్కువ. ఇద్దరూ తండ్రీకొడుకులుగా కన్నా స్నేహితులుగా ఎక్కువ మెలిగేవారు. కుటుంబ బాధ్యతలు, బిజినెస్ విషయాలు, రాజకీయాల గురించి మామ ఎక్కువగా ఈయనతోనే చర్చించేవారు. ఈయన కూడా ఆ పనులన్నీ చాలా బాధ్యతగా నెరవేర్చేవారు. షర్మిల అంటే ప్రేమ! ఈయన షర్మి పట్ల చూపించే ప్రేమ చాలా అసాధారణంగా అనిపించేది. తను వచ్చిందంటే చాలు ఈయనలో తెలియని ఆనందం కనబడేది. చిన్నతనంలో ఈయన షర్మితో లెక్కపెట్టి మరీ వంద ముద్దులు పెట్టించుకుంటే, పెద్దయ్యాక ఈయనే షర్మికి ముద్దు పెట్టడం మొదలెట్టారు. ఎప్పుడైనా పొరపాటున షర్మి మరచిపోయినా, ఈయనే ‘హాయ్ పాప్స్’ అని దగ్గరికెళ్లి, తన భుజాలు పట్టుకుని మరీ ముద్దు పెట్టేవారు. ఈ తండ్రీకూతుళ్ల ప్రేమను చూసి షర్మి ఫ్రెండ్స్ తరచూ అనేవారు – ‘నిన్నూ, మీ నాన్నను చూస్తే మాకు అసూయగా అనిపిస్తుంది. మా నాన్న కూడా మమ్మల్ని బాగా ముద్దు చేస్తారు కానీ, ఇంత కాదు’ అని!అంత ప్రేమ ఈయనకు ఆడపిల్ల అంటే... అంత ఆనందం ఈయనకు షర్మి పక్కనుంటే! ‘నాన్న నన్ను ప్రేమించిన తీరులో దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. ఆయన నాపై చూపించిన ప్రేమ, కురిపించిన ముద్దులు రోజూ మిస్సవుతున్నాను. దేరీజ్ నో లైఫ్ ఎనీ మోర్ ఇన్ మై లైఫ్... నా జీవితంలో ఇక జీవం లేదు’ అని షర్మి బాధపడుతుంటుంది. దేవుడు కష్టమిచ్చేదే బలపడటానికి 1996 లోక్‌సభ ఎన్నికలు... విపక్షమూ ఒక మీడియాహౌజ్ కలిసి ఈయన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడించాలని గట్టిగా ప్రయత్నించడం... అదే సమయంలో స్వపక్షంలో వాళ్లే కొందరు ఏకమై ఈయనకు వ్యతిరేకంగా పనిచేయడం... రెండూ తోడై అప్పటిదాకా ఇరవయ్యేళ్ల రాజకీయ ప్రస్థానంలో, మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా విజయభేరి మోగించిన ఈయనకు... మొదటిసారి అతితక్కువ మెజారిటీ వచ్చింది! దానికితోడు, పోలీసు యంత్రాంగమంతా పూర్తిగా రాజకీయంగా మారడం... బూత్ దగ్గర ఉన్న మనుషులను ఆడ–మగ తేడా లేకుండా కొట్టి, వాళ్లను భయభ్రాంతులకు గురి చేసి, ఓటింగ్ శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం, సరిగ్గా ఎన్నికల సమయంలో ఈయన మద్దతుదారులందర్నీ ఉన్నట్టుండి అరెస్ట్ చేయడం... గట్టిగా 23 ఏళ్లు కూడా లేని జగన్‌ను, మామను, మరికొందరు కుటుంబ సభ్యులను గృహనిర్బంధం కూడా చేయడంతో, ఆ ఎన్నికల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది! ఏదెలా ఉన్నా, కనీసం 50 వేల మెజారిటీతో గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు ఈయన! కానీ కౌంటింగ్ జరుగుతున్నకొద్దీ అందరిలోనూ గెలుస్తామన్న ఆశ సన్నగిల్లడం మొదలెట్టింది. ఒక స్టేజిలో ఓడిపోతామేమోనన్న భయం కూడా వేసింది! కానీ, ఎన్ని శక్తులు ఏకమైనా, దేవుడి ఆశీస్సులూ ప్రజల దీవెనలూ మాకు తోడుగా ఉండి, విజయాన్ని చేకూర్చాయి. విజయం లభించింది కానీ ఆ విజయం ఈయనకు సంతృప్తిని మిగల్చలేదు. కేవలం 5,445 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది.ఆ సమయంలో ఫ్యామిలీలో ఎవ్వరం భోజనాలు కూడా చేయకుండా, ప్రార్థనలు చేస్తూ కూర్చున్నాం. బాగా గుర్తు... ఎప్పుడూ ఫాస్టింగ్లకు దూరంగా ఉండే షర్మి, ఆసారి పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ప్రార్థనలు చేసింది! జగన్ కూడా... ఎక్కడ వాళ్ల నాన్న ఓడిపోతారోనని, గెలిస్తే తనకి ఇష్టమైన చికెన్ తినడం మానేస్తానని మొక్కుకున్నాడు! ఈయన పట్టుదలే జగన్‌కి వుంది. అనుకున్నట్టే, ఈరోజుకూ జగన్ చికెన్ ముట్టుకోలేదు! ప్రజల గుండెల్లోనే సింహాసనం రోజూ ఈయన క్రమం తప్పకుండా తనను కలవడానికొచ్చిన సామాన్య ప్రజలందరినీ కలిసి, వారి అర్జీలను స్వీకరించేవారు. క్యాంప్ ఆఫీసు బంగళాలో ఎంత గొప్పవాళ్లు ఎదురుచూస్తున్నా ఈయన ముందు సామాన్యులను పలకరించేవారు. ఎప్పుడో ఓసారి షర్మి ఈయనతో ‘నువ్వు ప్రజలతో ఉంటే, చాలా సంతోషంగా అనిపిస్తావు పా’ అంటే, ఈయన ‘అవును పాపా, నిజమే! ఎందుకంటే బయట వందల మందిని కలవడానికి... లోపల కొంతమందిని కలవడానికి చాలా తేడా ఉంటుంది. బయట కలిసేవాళ్లంతా సమస్యలకోసం వస్తే... లోపల కలిసే వాళ్లంతా సొంత పనుల కోసం వస్తారు... అదీ తేడా’ అని! పదవి వచ్చాక మనిషి ప్రజలకు దూరమైపోతారంటారు. కానీ ఈయన పదవి వచ్చాకే, ప్రజలకు దగ్గరయ్యారు... చాలా దగ్గరివారయ్యారు! చొక్కా రంగు ఏదైనా గుండెలు పేదవాళ్లవే కదా! ఈ పార్టీ, ఆ పార్టీ అని లేకుండా, అన్ని పార్టీల నాయకులూ ఈయనకి సిఫార్సులు పంపేవారు. పెద్ద విషయమేంటంటే, ఎక్కువ తిప్పలు పెట్టిన నాయకులే ఈయన చేత ఎక్కువ సాయం చేయించుకునేవారు. అది తెలిసి కూడా ఈయన కాంగ్రెస్ నాయకులతో సమానంగా ఇతర పార్టీ నాయకులకు అవకాశం ఇచ్చేవారు. దానితో సొంత పార్టీ నాయకులకు కోపం వచ్చి – ‘మీరు వాళ్లకు ఇలా పనులు చేస్తారు, మాట్లాడతారు... వాళ్లు అలా నేరుగా కిందకు వెళ్లి, మైకులు తీసుకుని, మిమ్మల్నే విమర్శిస్తారు. అసలు వాళ్లకి పనిచేసిపెడితే విలువ తెలియట్లేదు సార్’ అనేవారు. దానికీయన ‘పోనీలే... చేయడం మన ధర్మం. అలా మాట్లాడటం, వాళ్ల సంస్కారం! అయినా, నేను సాయం చేసేది ఆ వ్యక్తులకు కాదు... వాళ్లు సిఫార్సు చేసే పేద కుటుంబాలకి! వీళ్ల మీద కోపంతో వాళ్లకి సాయం చేయకపోవడం తప్పవుతుంది’ అనేవారు. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఈయనకు అంతటి కన్సర్న్! చెవులున్న మనసు అన్నిచోట్లా పద్ధతిగా టైమ్ పాటించే ఈయన, కొన్నికొన్నిచోట్లకి వెళ్లినప్పుడు మాత్రం అక్కడ నుంచి కదలడం ఇష్టపడేవారు కాదు! ముఖ్యంగా మూగ–చెవిటి పిల్లలు, బీద విద్యార్థులు, ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకున్న టైమ్ కంటే ఎక్కువ సమయం వాళ్లతో గడిపేవారు. గోడు ఉండకూడదు, గూడు ఉండాలి ప్రతి పథకం శాచ్యురేషన్కి రావాలంటూ, ‘‘నేను ఏదైనా గ్రామానికి పోయినప్పుడు ధైర్యంగా మైకు పట్టుకుని ‘ఈ గ్రామంలో ఇల్లు లేనివాళ్లు, నిజంగానే అర్హులై ఉండీ పెన్షన్ రానివాళ్లు, అర్హులైన వాళ్లలో ఏ ఒక్కరికైనా తెల్లకార్డు్డ లేనివాళ్లు ఎవరైనా ఉంటే చేతులెత్తండి’ అని అడగాలి. అలా అడిగినప్పుడు ఒక్క చెయ్యి కూడా లేవకూడదు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరినీ బాగుచేయాలి’’ అని అనేవారు. ప్రతిఒక్కరికీ అన్నీ ఉండాలి, అన్నీ చెందాలని తపించారు. ఇక్కడ చాడీలు చెప్పరాదు! ఈయనకు చాడీలు వినడం ఇష్టం ఉండేది కాదు. ఎవరైనా చెప్తుంటే వెంటనే టాపిక్ మార్చేసేవారు. కానీ అవతలివాళ్లింకా చెప్తూనే ఉంటే ‘పద పద, నీ పని చూసుకోరాదా? అనవసరంగా వాళ్ల గురించి నీకెందుకు?’ అనేవారు. ఎవరిమీదైనా తనదైన అభిప్రాయాన్నే ఉంచుకునేవారు! -
యాత్ర : మమ్ముట్టితో ప్రత్యేక ఇంటర్వ్యూ
స్ఫూర్తి నడిపిస్తుంది. నడత నడక నేర్పిస్తుంది. స్మృతులు పాద ముద్రలు. బాట ఒక పాఠం. నడిచిన చరిత్ర కళనీ కదిలిస్తుంది. కళ చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. స్మృతి యాత్ర అందరికీ స్ఫూర్తి యాత్ర కావాలని నటుడు మమ్ముట్టి అంటున్నారు. ‘యాత్ర’ ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది... మమ్ముట్టి : (నవ్వుతూ). నాదేం లేదు. మా టీమ్ అంతా కష్టపడుతున్నాం. అలాగే ఇది బయోపిక్ అని మక్కీకి మక్కీ దించాలనుకోవడంలేదు. వైయస్సార్‌గారిని నేను అర్థం చేసుకుని చేస్తున్నాను. ఆయన పాత్ర చేస్తున్నాను కాబట్టి, ఆయన మేనరిజమ్స్ నాలో కనిపించాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటివి ఉంటాయి. అయితే ఆయనలానే ఉంటాయని చెప్పలేను. వైయస్సార్‌గారి క్యారెక్టర్ తీసుకొని కథ చెబుతున్నాం. ఆ కథలో నేను కనిపిస్తాను. ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ మహీ, నిర్మాత విజయ్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఏమనుకున్నారు? మమ్ముట్టి: యాక్చువల్లీ మహీ నాకు బయోపిక్ అని చెప్పలేదు. నిజానికి ఇది వైయస్సార్‌గారి జీవిత చరిత్ర కాదు. ‘యాత్ర’ సినిమా ఆయన ౖలైఫ్లో జరిగిన ఒక చాప్టర్. ఆయన చేసిన పాద యాత్ర మీద ఈ సినిమా ఫోకస్ ఉంటుంది. వైయస్సార్‌గారు ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయింది, ఓ లీడర్‌గా జనాల్లోకి వెళ్లి, ఆయన ఎలా ఇంటరాక్ట్ అయ్యారన్నది ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఈ విషయాలు చెప్పినప్పుడు ఒక యాక్టర్‌గా చాలా ఎగై్జట్ అయ్యాను. దర్శకుడిగా మహీవి రెండు మూడు సినిమాలే కదా. ఆ విషయంలో ఏమైనా సెకండ్ థాట్ ఉండేదా? మమ్ముట్టి: స్క్రిప్ట్ అంత బావున్నప్పుడు ఎందుకు సంకోచిస్తాను? నో అని చెప్పడానికి వీలు లేనంత బాగుంది. మహీ చేసిన సినిమాలు ఒక్కటి కూడా చూడలేదు. నా మీద అతని కాన్ఫిడెన్స్ చూసి, అతని కాన్ఫిడెన్స్ మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మహీ: యాక్చువల్లీ డైలాగ్స్‌ని తెలుగులో చదవమన్నారు. ఫుల్ నరేషన్ కూడా తెలుగులోనే జరిగింది. ఆ డైలాగ్స్ అన్నింటినీ మలయాళంలో రాసుకున్నారు. దానికి 15 రోజులు పట్టింది. ఈ సినిమా ఒప్పుకున్నాక వైయస్సార్ గారి గురించి తెలుసుకున్నారా? మమ్ముట్టి: ఇప్పటి పొలిటీషియనే కాబట్టి నాకు ఆయన గురించి కొంచెం అవగాహన ఉంది. లుక్స్, గెటప్స్ అన్నీ టీమ్ చూసుకున్నారు. రిఫరెన్స్ కోసం రాజశేఖర్‌రెడ్డిగారి పొలిటికల్ వీడియోలు చూస్తే ఆ ప్రభావం నా మీద ఎక్కువ పడిపోతుంది. అందుకే నేను జస్ట్ ఒకట్రెండు యూట్యూబ్ క్లిప్స్ మాత్రమే చూశాను. వైయస్సార్‌లా ఎంత సిమిలర్‌గా కనపడతానో తెలియదు. ఆయన స్పీచ్‌ను కూడా ఇమిటేట్ చేయడం కాదు, వైయస్సార్‌గారు తెలియని వాళ్లు కూడా అప్రిషియేట్ చేయాలి. మా ప్రయత్నం అదే. సినిమా స్టార్ట్ చేసి కొన్ని రోజులే అయింది కాబట్టి ఎక్కువ విషయాలు బయటపెట్టకూడదని అనుకుంటున్నాను. మహీ: ఈ స్టోరీలో వైయస్సార్ గారి సోల్ అండ్ స్పిరిట్ ఉంటుంది. ఆయన జర్నీ మీద ఉంటుంది. మమ్ముట్టి సార్ చెప్పినట్టు వైయస్సార్‌గారి జీవితాన్ని మక్కీకి మక్కీ తీయడంలేదు. ఆయన లైఫ్‌లోని ఒక ఇంపార్టెంట్ చాప్టర్‌ని డిస్కస్ చేస్తున్నాం. పాదయాత్ర మీదే తీయాలనుకోవడానికి కారణం? మమ్ముట్టి: యాత్ర అంటే అందరికీ పేపర్లో న్యూసే తెలుసు. ఈరోజు ఇన్ని కిలోమీటర్లు నడిచారని చదివి తెలుసుకుంటారు. ఆ నడక వెనకాల రియల్‌గా అక్కడేం జరిగింది... ప్రతీ ఒక్కరితో వైయస్సార్‌గారు ఎలా ఇంటరాక్ట్ అయ్యారు? అన్నది కూడా ఇందులో చూపించబోతున్నాం. ఆయన లైఫ్‌లో జరిగిన కొన్ని ముఖ్యమైన ఈవెంట్స్‌ను చూపించనున్నాం. మహీ: మేం ‘యాత్ర’ను ఓ డాక్యుమెంటరీలా తీయడంలేదు. అలాగని బాగా డ్రమటైజ్ కూడా చేయడం లేదు. సినిమా చూసే ప్రతి ఒక్కరినీ హత్తుకునే ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. సినిమా స్టార్ట్ అయిన 3, 4 నిమిషాల్లోనే ఆడియన్స్ కథలోకి వెళ్లిపోయేట్లు తీస్తున్నాం. మమ్ముట్టి గారే ఈ పాత్రకు సరిపోతారని మీకెలా అనిపించింది? మహీ: ‘దళపతి’ దగ్గర నుంచి మమ్ముట్టి సార్ సినిమాలు ఫాలో అవుతున్నాను. ఒక మనిషి నిల్చున్నా, కూర్చున్నా తనతో పాటు ఒక లార్జర్ దేన్ లైఫ్ పర్సనాలిటీని క్యారీ చేయగలగాలి. వైయస్సార్‌గారికి ఆ చరిష్మా ఉంది. వైయస్సార్ గారు మామూలుగా నడిచినా అది తన సొంత ప్లేస్ అనుకొనేంత ధీమాగా నడవగలరు. చేయి అలా గాల్లో ఊపితే ఓ భరోసా కనిపిస్తుంది. వంద మందిలో ఉన్నా చుట్టూ ఉన్నవాళ్లు తనవాళ్లని, అది తన ప్లేస్ అనిపించేంత చరిష్మా ఆయనలో కనిపిస్తుంది. మమ్ముట్టి గారిలో కూడా ఆ లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్ ఉందనిపించింది. వైయస్గారిలా ఆయన్ను ఊహించుకున్నప్పుడు పర్ఫెక్ట్ అనిపించింది. విజయ్ చిల్లా: మహీ ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు నా మైండ్‌లో ఫస్ట్ తట్టిన వ్యక్తి కూడా మమ్ముట్టిగారే. వైయస్సార్ గారి మీద సినిమా తీయాలని మీకు ఎప్పుడనిపించింది? మహీ: 2011లో ఈ ఐడియా వచ్చింది. ‘ఆనందో బ్రహ్మ’ ముందు అనుకున్నాను. వైయస్‌గారి లైఫ్ హిస్టరీ అంతా కవర్ చేయాలని అనుకోలేదు. ఆయన లైఫ్‌లో జరిగిన ఒక చాప్టర్ చుట్టూ కథ రాశాను. వైయస్సార్‌గారి లైఫ్ డిఫైనింగ్ మూమెంట్ అంటే పాదయాత్రే. మనందరికీ కూడా ముందు గుర్తొచ్చేది పాదయాత్రే. అందుకే ఆ యాత్ర చుట్టూ సినిమా ప్లాన్ చేశాను. బహుశా ఇలాంటిది ఇండియాలో ఫస్ట్ అటెంప్ట్ అనుకుంటున్నాను. మమ్ముట్టి: ఆడియన్స్‌కి వైయస్సార్‌గారు ఓ లీడర్‌గానే తెలుసు. కానీ ఈ సినిమా ద్వారా ఆయన పర్సనల్‌గా ఎలా ఉంటారో అందరికీ తెలుస్తుంది. షూటింగ్లో మెమొరబుల్ మూమెంట్ ఏదైనా..? మమ్ముట్టి: షూటింగ్ స్టార్ట్ అయి టెన్ డేసే అయింది. ఈ పది రోజులు కూడా మెమొరబుల్ అని అంటాను. మీ అబ్బాయి దుల్కర్గారు బయోపిక్‌తోనే (‘మహానటి’) ఇటీవల తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. మీరు కూడా మళ్లీ బయోపిక్‌తోనే రీ–ఎంట్రీ ఇస్తున్నారు. మమ్ముట్టి: అది వేరే ఇది వేరే (నవ్వుతూ). విజయ్ చిల్లా: యాక్చువల్లీ ‘మహానటి’కన్నా ముందే ఈ సినిమా ప్లాన్ చేసేశాం. టోటల్ షూటింగ్ డేస్ ఎన్ని అనుకున్నారు? విజయ్: వైయస్‌గారు 68 రోజులు పాదయాత్ర చేశారు. మేం ఇంకో రెండు రోజులు కలిపి 70 రోజుల్లో సినిమా షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఓ నాలుగైదు రోజుల షూటింగ్ మినహా మమ్ముట్టిగారు మొత్తం ఉంటారు. మమ్ముట్టి: సినిమా మొత్తం ఒకేసారి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. వేరే సినిమాలు చేస్తే ఇందులో నుంచి బయటకు వచ్చేస్తామో అని. అలా డీవియేట్ అవకూడదని ముందే అనుకున్నాను. ఓ ఎక్స్పీరియన్డ్స్ ఆర్టిస్ట్‌గా వేరే సినిమాలు చేసుకుంటూ, ఈ సినిమా చేస్తూ మ్యానేజ్ చేయొచ్చు కానీ, ఈ లాంగ్వేజ్‌లో మాట్లాడుతూ చేస్తున్నాను కాబట్టి డిస్ట్రబెన్స్ ఎందుకని నా ఉద్దేశం. ఇప్పుడిప్పుడే తెలుగు లాంగ్వేజ్‌తో కొంచెం ఫెమీలియర్ అవుతున్నాను కదా... త్వరలోనే డబ్బింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. గతంలో ‘స్వాతి కిరణం’ అవీ చేసినప్పుడు మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా? మమ్ముట్టి: అలా కాకపోతే సినిమాలు చేయను. నా సినిమాల్లో నా గొంతే వినపడాలి. నా దృష్టిలో ఏ ఆర్టిస్ట్ అయినా తన గొంతు కూడా వినిపించినప్పుడే ‘యాక్టర్’ అనిపించుకుంటారని నా ఫీలింగ్. మహీ : అవును. ‘స్వాతి కిరణం’ వంటి సినిమాలకు మమ్ముట్టిగారే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ సినిమా డైలాగ్స్‌తో పోల్చితే ‘స్వాతి కిరణం’ కాంప్లికేటెడ్. అయినా బాగా చెప్పారు. ఈ సినిమాలో సింపుల్ లాంగ్వేజ్‌తో, క్యాజువల్ డైలాగ్స్ ఉంటాయి. పొలిటికల్ స్పీచ్‌లు కూడా ఉంటాయి. మమ్ముట్టి: తెలుగు డైలాగ్స్ అన్నీ మలయాళంలో రాసుకోవడం వల్ల ఈజీ అయింది. బాగా చదువుకుంటున్నా (నవ్వుతూ). ఈజీగా చెప్పేస్తున్నా. విజయ్: అది చాలా పెద్ద ఎఫర్ట్. ఆల్రెడీ మలయాళంలో ఓ పెద్ద సినిమా చేస్తున్నారు. అంత బిజీ షెడ్యూల్లోను రోజుకో గంట ఈ లైన్స్ ప్రాక్టీస్ చేయడం చిన్న విషయం కాదు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తెలుగుకు తిరిగి రావడం ఎలా ఉంది? మమ్ముట్టి: చాలా చేంజెస్ కనిపించాయి. ఆయినా ఫుల్‌గా ఇక్కడికి వచ్చినట్టు కాదు. నేను బయటే ఉన్నాను. వచ్చి సినిమా చేసి, వెళ్లిపోతున్నాను. మమ్ముట్టిగారి లుక్ టెస్ట్ జరిగాక దర్శక–నిర్మాతలుగా మీ ఫీలింగ్? విజయ్: మాకు ఎగై్జటింగ్‌గా అనిపించింది. మమ్ముట్టిగారు గాల్లోకి అలా చెయ్యెత్తగానే చాలా ఎగై్టట్ అయ్యాం. మనకి ఇద్దరూ (వైయస్సార్, మమ్ముట్టి) తెలుసు. వైయస్సార్‌గారిని చూశాం. నటుడిగా మమ్ముట్టిగారిని ఎన్నో పాత్రల్లో చూశాం. వైయస్సార్‌గారి పాత్రలో ఆయన్ను చూడటం ఓ స్పెషల్ ఫీలింగ్. మహీ: ఆ ఫీలింగ్‌ని మాటల్లో చెప్పడం కష్టం. వైయస్‌ని పర్సనల్‌గా ఎప్పుడైనా కలిశారా? మమ్ముట్టి: లేదు. మహీగారూ.. ఈ కథ రాసే ముందు మీరు చేసిన రిసెర్చ్ గురించి? మహీ: నేను వైయస్‌గారి ఫ్యామిలీ అందరితో మాట్లాడాను. స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి తొమ్మిది నెలలు పట్టింది. స్పెసిఫిక్‌గా ఈ టైమ్‌లో కథ రాయడం మొదలుపెట్టానని చెప్పను. ఐదారేళ్లుగా బిట్స్ బిట్స్‌గా రాసుకుంటూ వచ్చాను. నాకు ఇన్స్పైరింగ్గా అనిపించినవన్నీ రాశాను. సినిమా తీద్దాం అనుకున్నప్పుడు అన్నింటినీ కలిపి స్క్రిప్ట్‌ని ఓ స్ట్రక్చర్కి తీసుకొచ్చాం. ఫైనల్లీ సినిమా బడ్జెట్ ఎంత అనుకున్నారు? విజయ్: సుమారు 30 కోట్లు అనుకుంటున్నాం. వైయస్ లాంటి గొప్ప లీడర్ సినిమా కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాం. – డి.జి. భవాని -
అరుదైన దార్శనికుడు
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి ఈ రోజు. రాజకీయవాదులలో, అధికారులలో, జర్నలిస్టులలో, సాధారణ ప్రజలలో అనేకమందికి వైఎస్‌తో ఎవరి అను భవం వారికి ఉన్నది. ఒక్కసారి కలుసుకున్న వ్యక్తి తనకు ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్టు భావిస్తాడు. అది వైఎస్ వ్యక్తిత్వంలోని విశిష్టత. చిరుమందహాసం, స్నేహశీలత, ఆపన్నులను ఆదుకునే గుణం, పేద ప్రజలకు మేలు చేయాలన్న తపన, మాటకు కట్టుబడే మనస్తత్వం, నమ్ముకున్నవారికి అండగా నిలిచేందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడే తెగింపు, మతాలకూ, కులాలకూ అతీతంగా వ్యవ హరించే లౌకిక స్వభావం, నేలవిడిచి సాము చేయని ఆచర ణవాదం, ప్రేమనూ, ఆప్యాయతనూ పంచిపెట్టే ధోరణి వైఎస్‌ను ప్రజానాయకుడిగా నిలబెట్టిన లక్షణాలు. ఈ లక్ష ణాలలో కొన్ని కానీ, అన్నీ కానీ అనుభవంలోకి వచ్చినవారు ఎందరో ఉంటారు. వారంతా వైఎస్ జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుంటారు. ‘ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదు ఎట్లా బతికామన్నది ప్రధానం’ అని అనేవారు వైఎస్. ఆయన కంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసినవారు దేశంలో చాలామంది ఉన్నారు. కానీ వైఎస్ అంత వేగంగా, ముమ్మరంగా, ఏకాగ్రచిత్తంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్ర మాలు అమలు చేసినవారు లేరు. ఒకే ఒక్క పదవీకాలం (5 ఏళ్ళు)లో వైద్యం, విద్య, అభివృద్ధి, సంక్షేమరంగాలలో అనేక కార్యక్రమాలు రూపొందించి, అమలు చేసిన ముఖ్య మంత్రి మరొకరు కనిపించరు. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు పరిపాలనాదక్షులుగా పేరు తెచ్చుకు న్నారు. కానీ ప్రజల సంక్షేమానికి వైఎస్ ఇచ్చినంత ప్రాధా న్యం వారు ఇవ్వలేదు. వైఎస్‌లో నాయకత్వ లక్షణాలు జన్మతః వచ్చినవి. గుల్బర్గాలో వైద్యవిద్య అభ్యసిస్తున్న రోజు ల్లోనే విద్యార్థి నాయకుడుగా పేరు. కాంగ్రెస్‌లో స్వయంప్ర కాశం గల నాయకుడిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రత్య ర్థిగా పాతికేళ్లపాటు మనగలగడం సామాన్యమైన విషయం కాదు. 1978 నుంచి 2009 వరకూ 31 ఏళ్ల పాటు అన్ని ఎన్ని కలలోనూ విజయం సాధించిన నాయకుడు. కాంగ్రెస్‌లో నాయకుడిగా నిలదొక్కుకోవాలంటే సాటి నాయకులతో పోటీ పడటమే కాకుండా అధిష్ఠాన దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. అసమ్మతి నాయకులను కాచుకోవాలి. తన ఆర్థిక మూలాలను విధ్వంసం చేయడానికి ప్రయత్నించే సొంత పార్టీ ముఖ్యమంత్రులను ఎదుర్కొని నిలబడటానికి ఎంతో గుండెధైర్యం కావాలి. చాడీలు చెప్పేవారికి చెవి ఒగ్గే అధిష్ఠానం ఎప్పుడు ఆగ్రహిస్తుందో, ఎప్పుడు అనుగ్రహి స్తుందో తెలియని వాతావరణంలో మంచి రోజులకోసం, అనుకూల వాతావరణం కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూడ టానికి ఎంతో ఓర్పూ, నేర్పూ అవసరం. ‘తెలుగుదేశం’ లాగానే ప్రాంతీయపార్టీ పెట్టాలని కొందరు సన్నిహితులు సలహా చెప్పినా కాంగ్రెస్‌ని వీడటానికి వైఎస్ అంగీకరించ లేదు. ముప్పయ్ అయిదేళ్ళకే పీసీసీ అధ్యక్ష పదవి వరిస్తే పార్టీలో ప్రత్యర్థులు ఈర్ష్యపడ్డారు. చిన్నతనంలోనే ముఖ్య మంత్రి అయిపోతారేమోనని కంగారు పడ్డారు. చొక్కారావు, ద్రోణంరాజు సత్యనారాయణ వంటి సీనియర్లు వైఎస్‌కు అండగా ఉండేవారు. పీవీ, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి వారు ఆయనను ఆణచివేయడానికి ప్రయత్నం చేశారు. 2003లో పాదయాత్ర చేసినప్పుడు కూడా పార్టీలో ప్రత్య ర్థులు ఆయనతో సహకరించలేదు. ఉడుక్కున్నారు. మండు టెండను లెక్కపెట్టకుండా నడుచుకుంటూ వచ్చి తమ యోగ క్షేమాలను విచారిస్తున్న వైఎస్‌ను ప్రజలు ఆదరించారు. పశ్చిమగోదావరి నుంచి రైల్–రోడ్డు బ్రిడ్జి దాటి తూర్పు గోదావరిలో ప్రవేశించే సరికి వైఎస్‌కి అనుకూలంగా ప్రభం జనం ఆరంభమైంది. పాదయాత్ర వైఎస్‌ను పూర్తిగా మార్చి వేసింది. పేదరికాన్నీ, పేద ప్రజల కష్టాలనూ స్వయంగా చూసి తెలుసుకున్నారు. పగలకూ, పంతాలకూ స్వస్తి చెప్పి ప్రజలకు హృదయపూర్వకంగా సేవ చేసి తరించాలని తీర్మా నించుకున్నారు. తన కోపం నరం తెగిపోయిందంటూ చెప్పే వారు. 2004 ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ఎన్నో సంవత్సరాలు ఎంతో ఓపికతో వేచి చూసిన అవకాశం వచ్చిన వెంటనే విజృంభించి ఆరేళ్ళ కంటే తక్కువ వ్యవ ధిలో ఇరవై ఏళ్లలో చేయగలిగిన మేలు చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఎవరో తరుముతున్నట్టు పథకాలు ప్రక టించి అమలు చేశారు. వంట గ్యాస్‌పై సబ్సిడీ ఇచ్చారు. ప్రతి కుటుంబంలో అందరికీ ఏదో ఒక విధమైన లబ్ధి చేకూ రింది. అయిదుగురు మహిళలకు కేబినెట్లో స్థానం కల్పిం చడమే కాకుండా మంచిశాఖలు అప్పగించారు. వారు కూడా సమర్థంగా నిర్వహించారు. మహిళలు మనసు పెట్టి పని చేస్తారనీ, వారిలో నిర్వహణ సామర్థ్యం ఉంటుందనీ ఆయన నమ్మకం. రాజకీయంగా ఎంత చతురతతో వ్యవహరిం చారో పరిపాలనా ర థాన్ని అంతే వేగంగా నడిపించారు. నాయకత్వ లక్షణాలు నిజమైన ప్రజానాయకుడికి ఉండవలసిన లక్షణాలేమిటి? ‘మీకు అండగా నేనున్నాను’ అన్న భరోసా ప్రజలకివ్వడం. సహచరులూ, అనుచరులూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేనికీ వెనకాడకుండా లేకుండా ఆదుకోవడం. వాగ్దానాలను అమ లుచేయడానికి మనస్పూర్తిగా, నిజాయతీగా, నిబద్ధతతో కృషి చేయడం. ప్రజల ప్రగతి పట్ల, వారి అవసరాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండటం. దృఢమైన నిర్ణ యాలు తీసుకోవడం, వాటికి కట్టుబడి ఉండటం. ప్రజా సంక్షేమం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడటం. సంక్షేమ, ప్రగతి లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో, వాటిని సాధించడంలో క్షేత్రవాస్తవికతను దృష్టిలో పెట్టుకొని, సాహ సోపేతమైన, సృజనాత్మకమైన కార్యక్రమాలు రూపొందిం చుకొని భవిష్యత్ చిత్రపటాన్ని నిర్ణయించుకోవడం. దూర దృష్టితో అభివృద్ధికి ప్రణాళికా రచన చేసిన రాజకీయవాదే రాజనీతిజ్ఞుడిగా చరిత్రలో నిలిచిపోతారు. కొత్తబాటలో మేలు చేయాలని ప్రయత్నించిన నాయకులను చరిత్రకా రులు నిశ్చయంగా గుర్తిస్తారు. వైఎస్ ప్రభావం ఆయన కుటుంబం మొత్తంపైన ఉన్నది. ఆయన కుటుంబంలోని నలుగురు సభ్యులలో ముగ్గురు (ఆయనా, కుమార్తె షర్మిల, కుమారుడు జగన్మోహన్రెడ్డి) వేల కిలోమీటర్లు పాద యాత్ర చేయడం, ప్రజలతో మమేకం కావడం ప్రపంచం లోనే అపూర్వమైన విషయం. దళితులకూ, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేయడానికి ఇందిరాగాంధీ, ఎన్టిఆర్, పీవీ చేసిన ప్రయత్నాన్ని ఎవ్వరూ కాదనలేరు. దళితులలో ఆత్మవిశ్వాసం ప్రోదిచేయడానికి ఇందిరాగాంధీ చేసిన చట్టాలూ, చేపట్టిన కార్యక్రమాలూ చరిత్రాత్మకమైనవి. వెను కబడిన కులాలకు ఎన్‌టి రామారావు విశేషంగా రాజకీ యంగా గుర్తింపు ఇచ్చారు. భూసంస్కరణల అమలుకూ, 1972 ఎన్నికలలో బీసీలకు అత్యధికంగా కాంగ్రెస్ టిక్కెట్లు కేటాయించేందుకూ, ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు అమలు చేసేందుకూ పీవీ ప్రదర్శించిన తెగువను వర్తమాన రాజకీ యవాదులు పరిగణనలోకి తీసుకోకపోవచ్చును. కానీ చరిత్ర ఎప్పటికైనా నమోదు చేస్తుంది. అలాగే ఈ దేశంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన ఒకే ఒక రాష్ట్రప్రభుత్వంగా వైఎస్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిలుస్తుంది. సాచ్యురేషన్ విధానం అందరికీ వైద్య హామీ ఇచ్చే ఉద్దేశంతో ‘ఆరోగ్యశ్రీ’, విద్యా వకాశాలు కల్పించేందుకు ఫీజు చెల్లింపు పథకం (ఫీజు రీయింబర్స్మెంట్), పేదలకూ, దళితులకూ భూపంపిణీ వంటి కార్యక్రమాలను పార్టీలకూ, ప్రాంతాలకూ, కులా లకూ, మతాలకూ అతీతంగా అమలు చేసిన ఘనత వైఎస్‌ది. ఎవరికి సంక్షేమ పథకం వర్తింపజేయాలో, ఎవరికి చేయకూడదో నిర్ణయించే జన్మభూమి కమిటీల వంటి దుర్మా ర్గపు వ్యవస్థ వైఎస్ హయాంలో లేదు. అన్ని సంక్షేమపథకాల అమలులో ‘సాచ్యురేషన్’ (అవసరం ఉన్న అందరికీ నూటికి నూరుపాళ్ళూ అనుభవంలోకి రావాలి) అనేది వైఎస్ అమలు చేసిన విధానం. నిరుపేద ముస్లిం యువతకు విద్యా ఉద్యోగావకాశాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ దేశానికి వ్యవసాయం వెన్నెముక అనే స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు కనుకనే వ్యవసాయానికి సాగునీరు ప్రధా నమని గుర్తించి జలయజ్ఞం ఆరంభించారు. పదవీ కాలాన్ని మృత్యువు కాటేసిన కారణంగా వైఎస్ తలపెట్టిన పెద్ద ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఈ రంగంలో ఏ ప్రభుత్వం ఏమి చేసినా వైఎస్ స్వప్నం కొనసాగింపే. ఆంధ్రప్రదేశ్‌లో పోల వరం బహుళార్థసాధక ప్రాజెక్టు అయినా, తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయినా వైఎస్ సంకల్పిం చిన జలయజ్ఞంలో భాగమే. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రీఇంజనీరింగ్ ద్వారా ప్రాజెక్టు పరిణామాన్నీ, విస్తృతినీ పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పాటికి పూర్తి కావలసిన పోలవరం ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఊపిరాడక చాలా కాలం అచేతనంగా ఉంది. ఈ మధ్యనే పనులు జరుగుతున్నాయి. వైఎస్ అకాల మరణం చెందకుండా ఉంటే 2014 నాటికే జలయజ్ఞంలో సింహభాగం పూర్తి అయ్యేది. వైఎస్ మొట్టమొదట ముఖ్య మంత్రిగా ప్రమాణం స్వీకరించిన వెంటనే సంతకం చేసిన ఫైలు ఉచిత విద్యుత్ రైతులకు సంబంధించింది కావడం విశేషం. అలాగే రైతు రుణమాఫీ అమలుచేశారు. ఆహారధా న్యాలకు కేంద్రం నిర్ణయించిన సబ్సిడీకి మరికొంత జోడిం చారు. దళితులకు సబ్‌ప్లాన్ ఉండాలనే ప్రతిపాదనను మన స్ఫూర్తిగా ప్రోత్సహించారు. నేను సంపాదకుడిగా ఉండగా ‘వార్త’ లో 2001లో మల్లెపల్లి లక్ష్మయ్య సబ్‌ప్లాన్‌పై రాసిన వ్యాసాన్ని ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభలో పూర్తిగా చదివి వినిపించారు. బిట్స్ పిలానీ, ఐఐటీ వంటి ప్రతి ష్ఠాత్మకమైన విద్యా సంస్థలను తీసుకురావడంలో వైఎస్ పాత్ర అద్వితీయమైనది. వైఎస్ హయాంలో వర్షాలు దండిగా కురిసేవి. సమాచార సాంకేతిక (ఐటీ) రంగం వృద్ధితో ఆర్థిక వ్యవస్థ బలపడింది. కాంగ్రెస్‌కు తీరని లోటు వైఎస్ అస్తమయం తెలుగువారి రాజకీయాలలో పెనుమా ర్పులు సృష్టించింది. వైఎస్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలహీనమై ఉండేదని ఇప్పటికీ కొందరు వాదిస్తారు. అక్కడ కూడా అభివృద్ధికి బాటలు వేస్తే ప్రత్యేకవాదం బలహీనపడుతుందని ఆయన భావించేవారు. రాజకీయ ఎత్తుగడలతో పాటు ప్రగతి పథ కాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కోవాలని ప్రయ త్నించారు. వైఎస్ సజీవంగా ఉంటే కాంగ్రెస్ ఇంతటి దీనా వస్థలో ఉండేది కాదు. ముగ్గురు మిత్రులు–వైఎస్, రాజేశ్ పైలెట్, మాధవరావ్ సింధియా– ఈ రోజున మన మధ్య ఉంటే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాకు సైతం నోచుకోని దుస్థితి దాపురించేది కాదు. దురదృష్టవశాత్తు ముగ్గురూ ప్రమాదా లలో మృతి చెందారు. 2000 జూన్ 11న దౌసా నుంచి జైపూ ర్కు వస్తూ తాను నడుపుతున్న జీపు ఆర్టీసీ బస్సును ఢీకొ నడంతో పైలట్ మరణించారు. 2001 సెప్టెంబర్ 30న కాన్పూర్ వెడుతున్న ప్రత్యేక విమానం ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి దగ్గర కూలి సింధియా దుర్మరణం పాలైనారు. 2009 సెప్టెంబర్ రెండున హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. ముగ్గురూ జనబలం ఉన్న నేతలే. సోని యాకు అండదండలు సమకూర్చగల చేవ ఉన్న నాయకులే. అటువంటి శక్తిమంతులు ఇప్పుడు కాంగ్రెస్‌లో లేరు. దేశం అంతటా వెతికితే వారితో ఎంతోకొంత పోల్చదగిన నాయ కుడు పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్‌సింగ్ ఒక్కరే కనిపిస్తారు. కాంగ్రెస్ అధిష్ఠానం అభీష్టానికి భిన్నంగా 2009 నాటి ఎన్నికలలో టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోరాడి 33 మంది లోక్‌సభ సభ్యులను గెలిపించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన వాదనలో నిజంగానే పస ఉన్నట్టు నిరూపించారు. సమాజం, పేద ప్రజలు, రైతులు, గ్రామ సీమలు, రచ్చబండ గురించి మనసు పెట్టి ఆలోచించే పాత తరానికి చెందిన కాంగ్రెస్ నాయకుల పరంపరలో వైఎస్ చిట్టచివరి నేత. అటువంటి దార్శనికుడూ, జనరంజకుడూ, సమర్థుడెన రాజకీయ నాయకుడూ, పరిపాలనాదక్షుడూ, సిసలైన ప్రజానాయకుడూ చరిత్రలో అత్యంత అరుదుగా మాత్రమే కనిపిస్తారు. కె. రామచంద్రమూర్తి -
నిన్ను మరువలేం రాజన్న..!
సాయం సామాన్యం.. స్ఫూర్తి మహనీయం : భూమన కరుణాకర్‌రెడ్డి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి చేసే ప్రతి పనిలోనూ, ఆలోచనలోనూ ఆవిష్కృతమయ్యే వినూత్నత అందరినీ అబ్బురపరుస్తూనే ఉంటుంది. ఆయన కార్యకలాపాలకూ. ఆయన వ్యక్తిత్వాన్ని అభివ్యక్తీకరించే జ్ఞాపకాల జాబితాకి అంతుండదు. గంభీరంగా కనిపించే ఆయన హృదయం ఎంత హృద్యమైనదో తెలిసిపోతుంటుంది. దాని వైశాల్యం వెల్లడవుతుంటుంది. మా జీవన పయనంలో నేను చూసిన చాలా సంఘటనలలో ఇవి కొన్ని మాత్రమే... ఒకరోజు మంగంపేట మైన్స్ దగ్గరికి వైఎస్ వచ్చారు. అప్పుడే అక్కడ కొందరు పనివాళ్లు అప్పుడే భోజనం ముగించి లేచారు. నేల మీద చిందరవందరగా మెతుకులు. ‘‘బతికించే మెతుకులివి. పరబ్రహ్మస్వరూపం అరచేతుల్లో ఉండాలి. కాళ్ల కిందికి రాకూడదు’’ అంటూ ప్రతి మెతుకునూ వెతికిపట్టి పక్కన పడేశారు. నిజానికి ఆయన అలా చేయమని ఆ కూలీలకు ఆదేశమివ్వవచ్చు. కానీ అప్పుడే భోజనం ముగించిన ఆ తృప్తితో ఒక సంతృప్త స్థితిలో ఉన్నారు వారు. వాళ్లను బెదరనివ్వకూడదూ... ఆ స్థితిని చెదరనివ్వకూడదనుకున్నారు. అందుకే ఆ చిన్న పనికి తాను స్వయంగా పూనుకున్నారు. అప్పట్లో వైఎస్ గారు కోడూరు నుంచి చెన్నైకీ.... చైన్నై నుంచి కోడూరుకి తిరుగుతుండేవారు. ఈ రెండు ఊళ్ల మధ్య తిరువళ్లూరు అనే ఒక ఊరు ఉంది. దాని శివార్లలో ఒక చిన్న టీ–స్టాల్ ఉండేది. ఆయన ప్రతిసారీ ఆ టీ అంగడి దగ్గర ఆగి కాస్త టీ తాగి మళ్లీ ప్రయాణం కొనసాగించేవారు. మొదట్లో వైఎస్ ఎవరో ఆ టీ స్టాల్ నడిపే వ్యక్తికి తెలియదు. తెలుసుకున్న తర్వాత అతడి ఆనందానికి అవధుల్లేవు. అంతటివారు అక్కడ ఆగి టీ తాగడమే ఎంతో సంతోషంగా భావించేవాడా టీ స్టాల్ వ్యక్తి. కష్టాల్లో ఉన్నప్పుడు కొంత ఆర్థికసహాయమూ అందించారాయన. 1998లో ఒకసారి నేనూ, వైఎస్ జో«ద్‌పూర్‌కు వెళ్తున్నాం. ట్రైన్లో ఒక 14, 15 ఏళ్ల అబ్బాయి బిచ్చమెత్తుకుంటూ ఉన్నాడు. పక్కనే అతడి చెల్లెలూ ఉంది. ముక్కుపచ్చలారని పిల్లలు అలా అడుక్కోవడం వైఎస్‌ను చలించిపోయేలా చేసింది. వెంటనే వాళ్ల స్థితిగతులు, తల్లిదండ్రుల గురించి తెలుసుకున్నారు. వాళ్ల దీన స్థితిని తెలుసుకొని కదలిపోయారు. అంతే... అప్పటికప్పుడు రూ. 10,000 తీసి వాళ్లకు ఇచ్చారు. అంత పెద్దమొత్తం వాళ్ల చేతుల్లో చూస్తే వాళ్లను ఎవరైనా అనుమానించవచ్చు లేదా వాళ్ల దగ్గర కొట్టేయవచ్చు. అందుకే తన దగ్గర ఉన్న కర్చిఫ్‌లో ఆ మొత్తాన్ని జాగ్రత్తగా కట్టి ఇచ్చారు. ఇస్తూ... ‘ఇకపై అడుక్కోకండి. ఇవి పదివేలు. మీ నాన్న చేస్తున్న పనిని నువ్వు చేసుకో. లేదా నువ్వే ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టి దాన్ని చేసుకో. ఇకపై యాచించకు’’ అని చెప్పారు. పదివేలా అన్నట్టు చూస్తే... ‘‘వాడేదైనా ఉపాధి మార్గం చూసుకుంటే అదే పదివేలు’’ అన్నారాయన ఎప్పటిలాగే నవ్వుతూ. 1986లో ఒకసారి మేమిద్దరం ఒక వాహనంలో ప్రయాణం చేస్తున్నాం. ఆ సమయంలో ఒక భిక్షువును ఒక వ్యక్తి తన జీపుతో గుద్దేశాడు. వెంకటగిరి శివార్ల వద్ద జరిగిందా సంఘటన. తక్షణం ఆగమేఘాల మీద ఆ భిక్షువును ఆసుపత్రికి తరలించారు. అతడి వైద్యచికిత్సకు అయ్యే ఖర్చులన్నీ వైఎస్ భరించారు. అంతేకాదు... ఆ తర్వాత అతడికి భవిష్యత్తులో ఏ ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు నా ద్వారానే అతడికి రూ. 50,000 పంపించారు. ఆ పైకం ఆ రోజుల్లో పెద్ద మొత్తమే. ఒక వ్యక్తి తన మిగతా జీవితమంతా సాఫీగా గడిచిపోయేలా చూసుకునేందుకు వీలైనంత పెద్దమొత్తమది. యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన గొప్ప నేత : ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి ఎస్... ఈ రాష్ట్రానికి ఎంతోమంది లీడర్లను తీర్చిదిద్ది అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదే. 1983లో సినిమా గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి జవసత్వాలు నింపే బాధ్యత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అప్పగించింది అధిష్టానం. అలా పీసీసీ నాయకుడిగా నియమితుడై ఆ బాధ్యతలను ఒక సవాలుగా తీసుకున్నారు వైఎస్సార్. అప్పటికే పాత తరం నాయకులతో నిండిన కాంగ్రెస్ పార్టీలో యువతకు చోటివ్వాలని ఆయన తలపోశారు. 1985 సంవత్సరంలో నరసన్నపేట నుంచి పోటీ చేసే అవకాశం నాకు కల్పించింది ఆయనే. అప్పటికి నా వయస్సు 27 సంవత్సరాలే. నన్ను నేను నిరూపించుకొనే అవకాశం ఇచ్చారు. నాలా చాలామంది యువతను ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. భావితరాలకు దిక్సూచిగా... చేవెళ్ల నుంచి ప్రారంభమైన వైఎస్సార్ పాదయాత్ర విజయనగరం జిల్లా నుంచి రాజాం మీదుగా శ్రీకాకుళంలో అడుగుపెట్టింది. అప్పుడు నేనొక్కడినే జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేని. పాదయాత్ర ఏర్పాట్లన్నీ నాకు అప్పగించారు. ఈ కార్యక్రమం ఇచ్ఛాపురంలో ముగిసింది. దానికి గుర్తుగా అక్కడ స్తూపం ఏర్పాటు చేయించాను. వైఎస్సార్ ఆశయం ఏమిటో, ఆయన పాదయాత్ర చేపట్టడం వెనుక ఉద్దేశం ఏమిటో భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఈ స్తూపం ఉద్దేశం. బంధువులు, స్నేహితులు విడిచిపెట్టేసిన వేళ చివరకు ప్రభుత్వమూ పట్టించుకోనప్పుడు బాధితులకు ఈ స్తూపం ద్వారా ఒక ధైర్యం, ఒక భరోసా అందుతుంది. అందాలి. ఆఖరి ప్రయాణంలో నన్ను తప్పించారు... ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటిని అక్కడికక్కడే పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో తలపెట్టిన ‘రచ్చబండ’ కార్యక్రమానికి బయల్దేరిన రాజశేఖరరెడ్డికి అదే చివరి ప్రయాణమైంది. అడుగడుగునా వెన్నుతట్టి నిలబడ్డ ఆయన ఎందుకో ఆ చివరి ప్రయాణంలో నన్ను వద్దన్నారు. నిజానికి చిత్తూరు జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న నేను కూడా ఆ హెలికాప్టర్లో వెళ్లాల్సింది. కానీ టెక్కలి ఉపఎన్నికలకు గడువు తొమ్మిది రోజులే ఉండటంతో ఆ బాధ్యతలు చూడాలని చెప్పి నన్ను రావద్దన్నారు. అదే ఆయన చివరి మాట! మా ఆత్మీయ నేత దూరమయ్యాడంటే ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక ఆత్మీయుడిలా చూసుకున్న రాజశేఖరరెడ్డి కుటుంబంపై మా అభిమానం చెక్కుచెదరదు. పేదవారి కోసం వచ్చావని అందామె..! : ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ అది 1991 మార్చి ఆరు... పార్లమెంట్ సెంట్రల్ హాల్... రాజీవ్ గాంధీ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నారు. రాజీవ్‌గాంధీ ఇంటి వద్ద హర్యానా పోలీసులిద్దరిని రాజీవ్ గాంధీ సెక్యూరిటీ గుర్తించారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీలు 1991 మార్చి 6న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర స్థాయిలో ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజీవ్‌గాంధీపై నిఘా పెట్టించారా? వారు అక్కడ ఎందుకు ఉన్నారంటూ గొడవ చేశారు. వెంటనే బయటకెళ్లిన చంద్రశేఖర్... తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి ఎన్నికలు జరిగి 14 నెలలే అయింది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలందరూ పార్లమెంట్ సెంట్రల్ హాల్ (క్యాంటిన్)లో కూర్చున్నారు. ‘చంద్రశేఖర్ రాజీనామా చేశారు.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా?’ అంటూ చర్చించుకుంటున్నారు. హాల్ అంతటా గందరగోళం. ఆహారం కోసం ఓ బిహార్ ఎంపీ సర్వర్‌ను పిలిచాడు. ఆ గందరగోళం, పని హడావుడిలో అతనికి వినిపించకపోవడం లేదా గమనించకపోవడం జరిగింది. రెండోసారి పిలిచినా అదే పరిస్థితి. దీంతో బిహార్ ఎంపీకి చిర్రెత్తుకొచ్చి ఆ సర్వర్‌ను లాగి చెంపపై కొట్టారు. ఆ దెబ్బ శబ్దం సెంట్రల్ హాల్లో ప్రతిధ్వనించింది. అప్పటి వరకు ఎంపీల మధ్య చర్చోపచర్చలతో ఉన్న ఆ హాల్లో ఒక్కసారిగా పిన్‌డ్రాప్ సైలెన్స్. నాలుగు బెంచీల దూరంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల మధ్య కూర్చొని ఉన్న వైఎస్ ఒక్క ఉదుటన లేచి నాలుగు అంగల్లో సర్వర్ వద్దకు వెళ్లారు. ‘ఏయ్.. ఇధరావో, ఇధరావో’ అంటూ ఆ బిహార్ ఎంపీని పిలిచారు. ‘సే సారీ టు హిమ్’ అన్నారు. ‘వాడు ఏం చేశాడో తెలుసా’ అని బిహార్ ఎంపీ ఏదో చెప్పబోతుంటే... వైఎస్ తన చేతితో బల్లపై టాక్‌మని కొట్టి ‘డోంట్ టాక్, ఫస్ట్ ఆస్క్ హిమ్ ఫర్ అపాలజీ. యూ హావ్ నో రైట్ టు టాక్’ అన్నారు. మొత్తం హాల్ అంతా నిశ్శబ్దమయిపోయింది. అప్పుడు ఓ పెద్దావిడ వచ్చి ‘పోయిందనుకున్నాను. నమ్మకమంతా పోయిందనుకున్నాను. ఈ దేశంలో ఇక పేదవాడిని ఏం చేసినా అడిగేవారెవరూ ఉండరనుకున్నాను. నువ్వు ఒక్కడివి కనిపించావు అడిగేవాడివి’ అన్నారు. తర్వాత ఆవిడ ఎవరని నేను విచారించాను. ఆమె బిహార్‌కు చెందిన మాజీ ఎంపీ తారకేశ్వరీ సిన్హా అని తెలిసింది. ఆ తర్వాత ఎంపీలందరూ వైఎస్‌కు మద్దతుగా వచ్చారు. అప్పుడు బిహార్ ఎంపీ ‘సారీ నేను ఎదో అవుట్ ఆఫ్ మూడ్‌లో ఉన్నాను’ అని ఏదో చెప్పబోతుండగా సర్వర్ ‘నాదే తప్పు సార్’ అన్నాడు. అప్పుడు వైఎస్ కలుగజేసుకుని ‘ఇక్కడ నీ పని నువ్వు చేస్తున్నావు. మా పని మేము చేస్తున్నాము. ఇక్కడ ఎవరూ ఎవరి కన్నా తక్కువ కాదు, ఎక్కువ కాదు. పార్లమెంట్లో మేమే ఒకరిని కొట్టే పరిస్థితి వస్తే ఈ దేశంలో పరిస్థితి ఏమిటి? నువ్వేమీ ఫీల్ అవకు’ అంటూ సర్వర్‌ని సముదాయించారు. తర్వాత కొద్దిసేపటికి ఆ బిహార్ ఎంపీ వచ్చి ‘రాజశేఖరరెడ్డి.. ఆ యామ్ సారీ. ఇందాక నేను ఏదో మూడ్‌లో ఉండి అలా చేశాను’ అన్నారు. ‘‘ఓకే... అది నా ఇమిడియట్ రియాక్షన్. ఆ యామ్ ఆల్సో సారీ’’ అంటూ వైఎస్ కూడా హుందాగా బదులిచ్చారు. ప్రేమానురాగాల దేవుడు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే నల్గొండ జిల్లా అభివృద్ధి వైఎస్ హయాంలోనే జరిగింది. జిల్లాలోని ఫ్లోరోసిస్బాధితులను చూసి ఆయన చలించిపోయారు. ఈ మహమ్మారి నుంచి జిల్లా ప్రజలకు విముక్తి కల్పించాలంటే శ్రీశైలం నుంచి సొరంగం ద్వారా కృష్ణా జలాలు ఇక్కడకు తేవాలని ఆయన సంకల్పించారు. అందులో భాగంగానే ఆయన ఉన్నప్పుడే శ్రీశైలం సొరంగమార్గం తవ్వకాలకు బీజం పడింది. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండలో రైల్వే ఫై్లఓవర్ వైఎస్హయాంలోనే వచ్చాయి. లక్ష ఎకరాలకు నీరందించేందుకు బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుకు రూ.700 కోట్లు వైఎస్ కేటాయించారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని అప్పట్లో 46 డిపోలను ఎత్తివేస్తూ ఉత్వర్వులు వచ్చాయి. అందులో నార్కట్‌పల్లి డిపో కూడా ఉంది. అయితే ఈ డిపో నిజాం కాలం నాటి నుంచి ఉందని, దీన్ని మూసి వేయవద్దని.. నా వాదనను వైఎస్ ముందు వినిపించా. దీని ప్రాశస్త్యాన్ని తెలుసుకున్న ఆయన ఎత్తివేత నుంచి మినహాయింపు ఇప్పించారు. అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవంగా నిలిచిన వైఎస్ మరణం నన్ను తీవ్ర వేదనకు గురిచేసింది. ప్రజలను ప్రేమగా చూసే వైఎస్‌లాంటి మహానేత రాష్ట్రంలో ఎవ్వరూ ఉండరు. అందుకే ఆయన స్మారకంగా మా గ్రామం బ్రాహ్మణవెల్లంలలోనే .. ‘వైఎస్’ విగ్రహంతో పాటు పార్కు ఏర్పాటు చేశాం. వైఎస్‌ను ప్రజలు ఎప్పటికీ మరువరు. -
ప్రజల గుండెల్లో పదిలంగా..!
తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్. రాజశేఖర రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు. వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి స్మరిస్తూ...!తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వైఎస్సార్ పూర్తి పేరు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. 1949 జూలై 8 న వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగులో జన్మించారు. తల్లిదండ్రులు జయమ్మ, రాజా రెడ్డి. పాఠశాల విద్యాభ్యాసం బళ్లారిలో సాగగా, తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్యనభ్యసించారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు.అనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సర్జన్‌గా పట్టా పొందారు. వైద్య విద్య పూర్తైన తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేశారు. అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో కట్టించిన ఆస్పత్రిలో పనిచేశారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. జగన్ మోహన్ రెడ్డి (కుమారుడు), షర్మిల (కుమార్తె).విద్యార్థి దశ నుంచే..వైఎస్సార్ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు. గుల్బర్గాలో ఎం.ఆర్.మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడే స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లోనూ హౌస్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఇదే సమయంలో వైఎస్సార్ కుటుంబం కళాశాల నిర్మాణం, ఆసుపత్రి ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాల్ని కొనసాగించింది. ఇటు వైఎస్సార్ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండడంతో, 1975లో ఆంధ్రప్రదేశ్ యువజన కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతరం 1978 ఎన్నికల్లో ఎమ్మేల్యేగా పోటీ చేశారు. అలా ఆయన రాజకీయ జీవితంలో కీలక దశ మొదలైంది.ఓటమి ఎరుగని నేత1978లో జరిగిన ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి తొలిసారిగా కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1983, 85లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మేల్యేగా గెలిచి, హ్యాట్రిక్ సాధించారు. ఆ తర్వాత 1989లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 1991, 96, 98లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు.వరుసగా నాలుగు సార్లు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించిన ఆయన 1999లో పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా గెలిచారు. తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి ఎరుగకుండా విజయం సాధించి, అరుదైన ఘనతను దక్కించుకున్నారు.పాదయాత్ర : కీలక మలుపురాజకీయ నేతగా ఎదగాలనుకునే ఎవరికైనా ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలి. ప్రజల్లోంచి వచ్చిన నేతలకు మాత్రమే వారి కష్టాల గురించి తెలుస్తుంది. వైఎస్సార్ ప్రజల్లోంచి వచ్చిన నేత. ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలతో ఉండేందుకే ప్రయత్నించారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా ఉన్న 2003-04 సమయంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీనిలో భాగంగా రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టారు.2003 వేసవిలో పాదయాత్ర చేపట్టి, దాదాపు 1,467 కిలోమీటర్లు పర్యటించారు. ఈ యాత్రలో ప్రతి చోటా ప్రజలతో మమేకమవుతూ, వారి కష్టాల్ని తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల్ని కలిసి వారి ఇబ్బందుల్ని కళ్లారా చూసి, చలించి పోయారు. ముఖ్యంగా రైతు సమస్యల మీద ఆయనకు పూర్తి అవగాహన కలిగింది. పర్యటన ముగిసేలోపు ప్రజల సమస్యలు, పరిష్కారాలపై ఆయనకు పూర్తి అవగాహన వచ్చింది. ఈ యాత్రలో ప్రజలు, అభిమానుల నుంచి వైఎస్సార్‌కు ప్రతి చోటా మద్దతు లభించింది. ప్రజలు కూడా ఆయనలోని నిజాయతీని అర్థం చేసుకుని, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించారు.ముఖ్యమంత్రిగా ఎన్నికవైఎస్సార్ తన రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టారు. 1980లో అప్పటి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్, విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 1983-85 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లోనూ తిరిగి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1999లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉంది. ఈ సమయంలో వైఎస్సార్ శాసనసభ ప్రతి పక్ష నేతగా ఎన్నికయ్యారు.అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు విశేష కృషి చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది. దీంతో పార్టీని విజయపథం వైపు నడిపించిన వై.ఎస్.రాజశేఖర రెడ్డిని ఎమ్మేల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అలా ఆయనకు తెలుగు ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం దక్కింది. ఐదేళ్ల అనంతరం అంటే 2009లోనూ వైఎస్సార్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. ఆయన తిరిగి రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు.నిండైన వ్యక్తిత్వంవై.ఎస్.రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడే వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో వైఎస్సార్ ముందుంటారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించారు. ఎప్పుడూ తెలుగు వారి సంప్రదాయమైన పంచెకట్టులోనే కనిపించేవారు. పంచెకట్టుకి ఆయన గుర్తింపు తీసుకొచ్చారు. ఇక వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఎదురైనప్పుడు నవ్వుతూ పలకరించేవారు.ఆయన నడవడిక, మాటల్లోనూ హుందాతనం ఉండేది. నిత్యం నవ్వుతూనే కనిపించేవారు. ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఆయన 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన భౌతికంగా దూరమైనా.. తెలుగు ప్రజల గుండెల్లో మాత్రం ఎప్పటికీ జీవించే ఉంటారు. ప్రజల జ్ఞాపకాల్లో ఆయన ఎప్పుడూ పదిలంగానే ఉంటారు.సేవే పరమావధివైఎస్సార్ 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే కీలక రంగాలపై దృష్టి సారించారు. ప్రధానంగా రైతులకు లబ్ధి చేకూర్చేలా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు, పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే ఉచిత్ విద్యుత్ ఫైలుపై సంతకం చేశారు. అనంతరం ఎన్నో కీలక పథకాల్ని ప్రవేశపెట్టారు.రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకు తొలిసారిగా ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. పేద రోగులు సరైన ఆర్థిక స్తోమత లేని కారణంగా తగిన వైద్య చికిత్స పొందలేకపోయేవారు. అయితే ప్రతి పేదవాడికి కార్పొరేట్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందాలని వైఎస్సార్ భావించారు. ఇందుకోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అనారోగ్యంతో ఉన్నవారికి, వివిధ ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణ వైద్యం అందేందుకు 108 అంబులెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నిరుపేదలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు.రైతులు బావుండాలంటే పంటలు పండాలి. ప్రతి పంటకూ నీరు అందాలంటే ప్రాజెక్టులు కట్టాలి. ఈ విషయాన్ని గుర్తించిన ఆయన జలయజ్ఞాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా వివిధ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు.రేషన్ షాపుల్లో రెండు రూపాయలకే కిలో బియ్యంతోపాటు, ఇతర నిత్యావసరాల్ని కూడా తక్కువ ధరకే అందించారు. వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందించారు. ఇళ్లు లేని పేదల కోసం ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. -
మరుపురాని మహానేత