
అట్లాంటా : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి(సెప్టెంబర్ 2) సందర్భంగా అట్లాంటాలోని ఆయన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. మహానేత చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మహానేత సేవలను, ఆయన తెచ్చిన పథకాలను కొనియాడారు. రాజన్నతో తమకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.
వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మరలా రాజన్న రాజ్యం సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున వైఎస్సార్ అభిమానులు ప్రతి నెల సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఏపీలోని తమ తమ నియోజక వర్గ ప్రజలతో, సన్నిహితులతో, పార్టీ ఇంచార్జ్‌లతో తరచూ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి సహకరించాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు ఏపీకి వెళ్లి పార్టీ తరపున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.
