
అట్లాంటా: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్థంతి సందర్భంగా అట్లాంటా వైఎస్సార్ సీపీ విభాగం సెప్టెంబర్ 8వ తేదీన ఆయనకు ఘన నివాళులు ఆర్పించారు. వైఎస్సార్ సీపీ అట్లాంటా ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మహానేత సేవలను గుర్తుచేసుకున్నారు. అనంతరం ఉపేంద్ర రాచుపల్లి, బాలరామిరెడ్డి వల్లూరి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ధనుంజయరెడ్డి గడ్డం డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించారు. ఈ ట్రస్ట్ ఉద్దేశాన్ని అక్కడివారికి వివరించారు. దీనిపట్ల ఉత్సాహంగా స్పందించిన వైఎస్సార్ అభిమానులు ఆ ట్రస్ట్‌కు తమ మద్దతు తెలిపారు. 6 వేల డాలర్ల విరాళాలను అందజేస్తామన్నారు. ధనుంజయరెడ్డి గడ్డం, కిరణ్ కందుల, కృష్ణ నరసింపల్లె, జయచంద్రరెడ్డి, రాంభూపాల్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉపేంద్ర రాచుపల్లి, శ్రీని వంగిమల్ల, రాజ్, ప్రభాకర్ రెడ్డి, వేణురెడ్డి పంట, సురేశ్ సురువిల్ల, డా. కిశోర్ రెడ్డి, నవీన్ కొనారెడ్డి, రాజ్ ముప్పాల, డా. కామేశ్‌లతో పాటు పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment