కువైట్‌లో ఘనంగా నివాళి అర్పించిన వైఎస్సార్‌సీపీ సభ్యులు | Kuwait NRIs Pays Tribute To YS Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 3 2018 11:35 PM | Last Updated on Mon, Sep 3 2018 11:35 PM

Kuwait NRIs Pays Tribute To YS Rajasekhara Reddy - Sakshi

కువైట్ : మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కువైట్‌ వాసులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్‌సీపీ  కువైట్ కన్వీనర్  ముమ్మడి బాలిరెడ్డి గారి ఆధ్వర్యంలో  మహానేత  9వ వర్ధంతి సందర్భముగా కమిటీ సభ్యులు ఘన నివాళిలు అర్పించారు. ఈ సందర్భముగా ఇలియాస్, బాలిరెడ్డి గారు మాట్లాడుతూ.. మహానుభావులు వై.యస్. రాజశేఖరరెడ్డి లేని లోటు రాష్ట్రంలో స్వష్టంగా కనబడుతోందని వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం స‌శ్యామ‌లంగా ఉండేదని ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు  కుల, మత, వర్గాలకు, ప్రాంతాలకు, పార్టీలకు, పేద, ధనిక  అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి ఎదో ఒక సంక్షేమ పథకం అందాయని.. ముఖ్యముగా రైతులు, బడుగు, బలహీన, మైనారిటీల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు  అమలు చేశారని.. మరల రాజన్న రాజ్యం రావాలంటే జననేత జగన్ మోహన్రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని తెలిపారు. 

కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం. వి. నరసారెడ్డి, మాట్లాడుతూ.. ఆరోగ్య ప్రదాత మా దేవుడు రాజన్న ఎన్నికల సమయములో ఇచ్చిన హామీ రైతులకు రుణ మాఫీ చేస్తామని ప్రమాణ స్వీకారం రోజున మొదటి సంతకం చేసిన మాట తప్పని మడమ తిప్పని మహానాయకుడు మా రాజన్న అని తెలుపుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 6 వందల హామీల్లో ఒక హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇప్పుడున్న రాక్షస పాలనను అంతమోందించాలంటే జననేత జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. 

గవర్నింగ్  కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, ప్రధాన  కోశాధికారి నాయని మహేష్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి తెలుగు వాడి గుండెల్లో సజీవంగా ఉన్నారని.. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ప్రవేశ పెట్టనటువంటి సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టిన మహా నాయకులు రాజన్న అని కొనియాడారు. ముఖ్యంగా మైనారిటీ ముస్లిం సోదరులకు కొరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి 4% శాతం రిజర్వేషన్ ఇచ్చి పేద ముస్లిం సోదరుల జీవితాల్లో వెలుగు నింపిన మహా నాయకులు వైఎస్సార్‌ అని తెలుపుతూ రాష్ట్ర ముఖమంత్రి చంద్రబాబు  పాలన నాలుగేళ్లు అయినా తన మంత్రివర్గంలో ఒక ముస్లింకు  స్ధానం కల్పించకుండా ఇప్పుడు మైనారిటీ ముస్లిం సోదరులపై కపట ప్రేమ చూపిస్తున్నరని ఎద్దేవా చేస్తూ.. మైనారిటీ ముస్లింల ప్రధాన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబే అని తెలుపుతూ గత నెల 27న గుంటూరు జరిగిన తెలుగుదేశం మైనారిటీ సభలో నారా హామారా అని తెలుగుదేశం ముస్లిం నాయకులు చెప్పడం విడ్డురంగా ఉందని ‘నారా దుష్మన్ హామారా‘  ‘హర్ దిల్ మే హై జగన్ హమారా‘ అనే నినాదాలు చేశారు. 

కువైట్ కమిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, తెట్టు రఫీ, మీడియా ఇంచార్చ్ ఆకుల ప్రభాకర్ రెడ్డి, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అన్నాజీ శేఖర్,గల్ఫ్  ప్రతినిధి షేక్ నాసిర్ బి.సి. విభాగం ఇంచార్చ్ కె. రమణ యాదవ్, యూత్ ఇంచార్చ్ మర్రి కళ్యాణ్, సోషల్ మీడియా ఇంచార్చ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి,  మైనారిటీ ఇంచార్చ్ షేక్ గఫార్, ఎస్సి.ఎస్టీ. ఇంచార్చ్ బి. ఎన్. సింహా, సాంసృతిక విభాగం ఇంచార్చ్ కె. వాసుదేవరెడ్డి, రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షుడు చింతల చంద్రశేఖర్ రెడ్డి, జగన్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు షేక్ జబీవుల్లా, జగన్ యూత్ ఫోర్స్  అధ్యక్షులు మరియు  వ్యవస్ధాపకులు లక్షి ప్రసాద్  పోలి మనోహర్ రెడ్డి, మహానేత గురించి కొనియాడుతూ జోహార్ రాజన్న నినాదాలతో హోరోత్తించారు. కమిటీ సభ్యులు పులపుత్తూరు  సురేష్ రెడ్డి, యు. రమణ రెడ్డి, వై. లాజారస్, రావూరి రమణ, పిడుగు సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, సయ్యద్ సజ్జాద్,రేవూరి సుబ్బారాయుడు, కె .సూర్యనారాయణ,   షేక్ సబ్దర్, హారిప్రసాద్ నాయుడు, ముఖేష్ నాయుడు, రవి శంకర్,  పోలూరుప్రభాకర్  ఇంక ప్రజాసంకల్పయాత్రలో జననేత వై.యస్. జగన్ గారికి వస్తున్నా ఆదరణ చూసి మరియు నవరత్నాలకు ఆకర్షితులై కువైట్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు యదోటి బాల చౌదరి, శంకర్ యాదవ్, సుండుపల్లి యల్లయ్య,  జనసేన అభిమానులు షేక్ ఖాదర్ బాషా, దూదేకుల ముస్కిన్ బాషా, హరి, యం. శివ, వై.యస్.ఆర్. కమిటీలో చేరారు. ఈ కార్యక్రమములో కువైట్ కమిటీ సభ్యులు మరియు వై.యస్.ఆర్. అభిమానులు భారీగా పాల్గోన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement