kuwait YSRCP
-
కువైట్‌లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
కువైట్‌లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ అవినాష్ యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. జననేత వైఎస్ జగన్ పేరుతో ప్రత్యేకంగా కేక్‌ను తయారు చేయించారు. ఏపీలో వైఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల జిలన్ బాషా, మాజ్, సురేష్, శ్యామల, సుబహన్ డేగ ఫిలిం, రైజ్ వన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
కువైట్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు
యువనేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మిథున్ రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో కువైట్, ఆంధ్రప్రదేశ్‌లలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మిథున్ రెడ్డి సేవా సమితి, కువైట్ అధ్యక్షులు గోవిందు నాగరాజు, కో కన్వీనర్ షేక్ రహంతుల్లా ఇతర సభ్యులు యస్ లక్ష్మిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ జాబ్రీయాలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వివిధ కమిటీల ఇన్ఛార్జీలు, నాయకులు , కార్యకర్తలు, అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. - వైఎస్సార్ కడప జిల్లా పెనగలూరు మండలం చక్రంపేట ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు జామెట్రీ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, షేక్ ఇంతియాజ్, చక్రంపేట మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. - పుల్లంపేట పార్టీ ఆఫీసు నందు కేక్ కటింగ్ చేయడం జరిగింది... ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యూత్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. - తిరుపతిలోని మనో వికాస్ ఆశ్రమంలో అన్నదానం చేశారు. చదవండి : టీప్యాడ్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో రక్తదాన శిబిరం -
కువైట్‌లో మహానేత వైఎస్ఆర్కు ఘన నివాళి
కువైట్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కువైట్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కువైట్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిపైనా క్రియేటివ్ మాస్ మస్తాన్ గారి డైరెక్షన్ లో వై.యస్.ఆర్ జిల్లా పెనగలూరు మండలంకు చెందిన పెడమల్లి మోహన్ రెడ్డి రచించి గానం చేసిన తొలి తెలుగు పాటను కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలి రెడ్డి, సీనియర్ నాయకులు దుర్గ రెడ్డి గార్ల చేతుల మీదుగా ఈ పాటను విడుదుల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిపైనా ఇంతటి మంచి పాట చేసినందుకు మస్తాన్, మోహన్ రెడ్డిని అభినందించారు. కో-కన్వీనర్లు గోవిందు నాగరాజు యం.వి నరసా రెడ్డి మాట్లాడుతూ.. సూర్య చంద్రలు ఉన్నంత వరకు భూమి ఆకాశం ఉన్నంత వరకు మహా నాయకులు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రతి తెలుగు వారి గుండెల్లో శాశ్వతముగా ఉంటారని ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి కుల, మత, పేద, ధనిక, పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. ఆ జనహృదయ నేతకు గల్ఫ్ ప్రవాసాంధ్రుల తరపున నివాళిలు అర్పించారు. తదుపరి కోకన్వీనర్ యం.వి నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్న దానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటి ప్రధాన కోశాధికారి నాయిని మహేశ్వర రెడ్డి, పులపుత్తూరు సురేష్ రెడ్డి, యువజన విభాగం లీడర్ మర్రి కల్యాణ్, బీసీ సంఘం లీడర్ రమణ యాదవ్, మైనారిటీ విభాగం సభ్యులు రహంతుల్లా, యువజన విభాగం సభ్యులు షేక్ సబ్దర్, హరినాథ్ చౌదరి, జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షలు లక్ష్మి ప్రసాద్ పాల్గొన్నారు. -
కువైట్‌లో ఘనంగా వైఎస్సార్సీపీ 9వ ఆవిర్భావ వేడుకలు
కువైట్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిగాయి. ఏనిమిది వసంతాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మాలియా ప్రాంతములో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి, అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డిలు మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీడీపీతో చేతులు కలిపి వైఎస్ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైలుకు పంపినా అధైర్యపడకుండా ప్రజా సంక్షేమం కొరకు పోరాడుతున్నారని ప్రశంసించారు. 2014 ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను, లోక్ సభ సభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేసినా అదరకుండా, బెదరకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారన్నారు. కార్యనిర్వాహకులు మహేష్, ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన నుంచి ప్రజలను కాపాడాలంటే వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసే బాధ్యత ప్రవాసాంధ్రుల అందరిపై ఉందన్నారు. గల్ఫ్‌లో ఉన్న ప్రతి వైఎస్సార్ అభిమాని తమ నియోజకవర్గాలకు వెళ్లి పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీలు కాని వాళ్లు ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యలకు చెప్పి ఓట్లు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమములో కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి. నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, లాలితరాజ్, సలహా దారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బీసీ ఇంచార్జ్ రమణ యాదవ్, మైనారిటీ ఇంచార్జ్ షేక్ గఫార్, ఎస్సీ, ఎస్టీ ఇంచార్జ్ బీఎన్ సింహా, మైనారిటీ సభ్యులు షా హుస్సేన్, మహాబూబ్ బాషా,సేవాదళ్ వైస్ ఇంచార్జ్ సుబ్బారెడ్డి, యువజన సభ్యులు రవిశంకర్, హరినాధ్ చౌదరి, జగన్ సైన్యం అధ్యక్షులు బాషా, కమిటీ సభ్యులు ఖాదురున్, ప్రభాకర్, సుధాకర్ నాయుడు, నూక శ్రీనువాసులు రెడ్డి, గజ్జల నరసారెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రసారెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కువైట్‌లో ఘనంగా 'హర్ దిల్ మే వైఎస్సార్'
కువైట్ : వైఎస్సార్సీపీ కువైట్ మైనారిటీ విభాగం ఇంచార్జ్ షేక్ గఫార్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 'హర్ దిల్ మే వైఎస్సార్' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప శాసన సభ్యులు అంజాద్ బాషా, జాతీయ ప్రధాన కోశాధికారి రెహామన్, విజయవాడ పార్లమెంట్ ఇంచార్జ్ మహమ్మద్ ఇక్బాల్, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, నూర్ బాబా పాల్గొన్నారని ఒక ప్రకటనలో గల్ఫ్ కువైట్ కన్వీనర్లు తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ప్రతి ముస్లిం గుండెల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారనేది ఎంత నిజమో ముస్లిం సోదరులు అంటే జగన్‌కి ఎంతో అభిమనం ఉన్నదనేది కూడా అంతే నిజమని తెలిపారు. వైఎస్సార్ ఆశయ సాధన కొరకు పనిచేస్తున్న వైఎస్ జగన్ తన తండ్రి మైనారిటీ ముస్లిం సోదరులకు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలనేకాకుండా, ఇంకా ఎన్నో సంక్షేమ పధకాలు ముస్లిం సోదరుల కొరకు ప్రవేశ పెడతారన్నారు. గల్ఫ్ లో సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేకంగా అధినేత దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో గల్ఫ్, కువైట్‌లో ఉన్న ముస్లిం సోదరులు ఓట్ల ద్వారా తమ ఆశీర్వాదాలు ఇవ్వాలని అభ్యర్థించారు. మైనారిటీ ఇంచార్జ్ షేక్ గఫార్ మాట్లాడుతూ 2019 లో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత మన అందరిపైనా ఉందని, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో కృషిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్యవర్గ సభ్యులు, మైనారిటీ సోదరులు వైఎస్సార్ కుటుంబ అభిమానులు భారీగా పాల్గొన్నారు. -
కువైట్‌లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
కువైట్ : వైఎస్సార్సీపీ కువైట్ యువజన విభాగం, ఎస్సీ ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో 'జగనోత్సవం' పేరుతో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 50 మందికి పైగా రక్తదానం చేశారు. భారీ కేక్ కట్ చేసి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ శాసనమండలి సభ్యులు బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ డి.సి. గోవింద్ రెడ్డి, బద్వేల్ సమన్వయకర్త డా. వెంకట సుబ్బయ్య, పోరుమామిళ్ల మండల అధక్షులు సి. విజయప్రతాప్ రెడ్డి, అట్లూరు మండల అధ్యక్షులు ఆర్.మల్లికార్జునరెడ్డి, బద్వేల్ బూత్ కన్వీనర్ ఇంచార్జ్ కె. వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కువైట్‌లోని ప్రవాసాంధ్రులు భారీగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి, వైఎస్సార్సీపీ కువైట్ కార్యవర్గ సభ్యుల సహాయసహకారంతో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా చేస్తున్న సామాజిక సేవల గురించి వివరించారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలో రావడం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని ముఖ్య అతిథులకు విజ్ఞప్తి చేశారు. డి.సి. గోవింద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దుష్ట పాలన నుండి ప్రజలను రక్షించాలంటే జగన్‌ని ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అసలు తాను ఈ రోజు కువైట్‌లో ఉన్నట్లు లేదని, బద్వేల్లో ఉన్నట్లు ఉందన్నారు. డా. వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో ప్రజా సంక్షేమ పథకాలన్నీ మరుగున పడిపోయాయని, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ లాంటి మహోన్నతమైన పథకాన్ని పూర్తిగా పేద ప్రజలనుండి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి పాలనను అంతమోందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సి. విజయప్రతాప్ రెడ్డి, మల్లికార్జునరెడ్డి, కె. వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ కువైట్ లో ఉన్న మన వారు చూపిస్తున్న అభిమానం విలువ కట్టలేనిదని, 2019లో ఎన్నికల సమయంలో మీరందరు మీ మీ స్వస్దలాలకు వచ్చి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలనీ అభ్యర్థించారు. కార్య నిర్వాహుకులు మర్రి కళ్యాణ్, బి.ఎన్. సింహా మాట్లాడుతూ తమ తమ నియోజకవర్గాలలో ఎన్నో పనులున్నా తమ ఆహ్వానం మన్నించి జగనోత్సవం కార్యక్రానికి వచ్చిన అతిథులకు, ఈ కార్యక్రమము నిర్వహించేందుకు సహాకారించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమములో కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం. వి. నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, తెట్టు రఫీ, అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్, ప్రతినిధి పి. సురేష్ రెడ్డి, సలహాదారుడు అన్నాజీ శేఖర్ బిసిసెల్ ఇంచార్జ్ రమణయాదవ్ రావూరి రమణ, మైనారిటీ ఇంచార్జ్ షేక్ గఫార్, సభ్యులు షా హుస్సేన్, , సోషల్ మీడియా ఇంచార్జ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సేవాదళ్ ఇంచార్జ్ గోవిందు రాజు, సుబ్బారావు, సాంస్కృతిక విభాగం ఇంచార్జ్ వాసు, గౌస్ బాషా, రహమతుల్లా, యు. రమణ రెడ్డి, లలితరాజ్, మహబూబ్ బాషా, బద్వేల్ నియోజకవర్గ ప్రవాసులు, వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు భారీగా పాల్గోన్నారు. -
జగన్‌పై దాడిని ఖండించిన కువైట్ ప్రవాసాంధ్రులు
మాలియా: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్యాన్ని కువైట్‌లోని తెలుగువారు తీవ్రంగా ఖండించారు. జననేతపై జరిగిన దాడిని ఖండిస్తూ వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. వైఎస్సార్సీపీ కువైట్ ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నల్ల రిబ్బన్లు కట్టుకుని, టీడీపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్ జగన్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ములేక అనామకుడితో హత్యాయత్నం చేయించడాన్ని గర్హించారని గల్ఫ్ కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బిహెచ్, ముమ్మడి బాలిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నాయని మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకం ప్రకారం ఇదంతా చేయించారని ప్రవాసాంధ్రులు నమ్ముతున్నారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తెలుగుదేశం పార్టీకి చరమగీతం పాడి, చంద్రబాబుకు రాజకీయంగా సమాధి కట్టడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమములో కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం వి నరసారెడ్డి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు రహమాన్ ఖాన్, తెట్టు రఫీ, వైఎస్ లాజరస్, గల్ఫ్ ప్రతినిధి షేక్ నాసిర్, సలహాదారుడు నాగిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి,బి.సి. విభాగం ఇంచార్చ్ కె. రమణ యాదవ్, మీడియా ప్రతినిధి పూలపుత్తూరు సురేష్ రెడ్డి, యువజన విభాగం ఇంచార్జ్ మర్రి కళ్యాణ్, మైనారిటీ ఇంచార్చ్ షేక్ గఫార్, సాంస్కృతిక విభాగం ఇంచార్చ్ కె. వాసుదేవ రెడ్డి, బిసి సెల్ వైస్ ఇంచార్జ్ రావూరి రమణ, సయ్యద్ సజ్జాద్, గౌస్ బాషా, జిలేబి బాషా, వడ్డే రమణ, హరినాథ్ చౌదరి, రవిశంకర్ మరియు భారీగా అభిమానులు పాల్గొన్నారు. -
కువైట్‌లో ఘనంగా నివాళి అర్పించిన వైఎస్సార్సీపీ సభ్యులు
కువైట్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కువైట్ వాసులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మహానేత 9వ వర్ధంతి సందర్భముగా కమిటీ సభ్యులు ఘన నివాళిలు అర్పించారు. ఈ సందర్భముగా ఇలియాస్, బాలిరెడ్డి గారు మాట్లాడుతూ.. మహానుభావులు వై.యస్. రాజశేఖరరెడ్డి లేని లోటు రాష్ట్రంలో స్వష్టంగా కనబడుతోందని వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం సశ్యామలంగా ఉండేదని ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కుల, మత, వర్గాలకు, ప్రాంతాలకు, పార్టీలకు, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి ఎదో ఒక సంక్షేమ పథకం అందాయని.. ముఖ్యముగా రైతులు, బడుగు, బలహీన, మైనారిటీల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని.. మరల రాజన్న రాజ్యం రావాలంటే జననేత జగన్ మోహన్‌రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని తెలిపారు. కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం. వి. నరసారెడ్డి, మాట్లాడుతూ.. ఆరోగ్య ప్రదాత మా దేవుడు రాజన్న ఎన్నికల సమయములో ఇచ్చిన హామీ రైతులకు రుణ మాఫీ చేస్తామని ప్రమాణ స్వీకారం రోజున మొదటి సంతకం చేసిన మాట తప్పని మడమ తిప్పని మహానాయకుడు మా రాజన్న అని తెలుపుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 6 వందల హామీల్లో ఒక హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇప్పుడున్న రాక్షస పాలనను అంతమోందించాలంటే జననేత జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేష్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి తెలుగు వాడి గుండెల్లో సజీవంగా ఉన్నారని.. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ప్రవేశ పెట్టనటువంటి సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టిన మహా నాయకులు రాజన్న అని కొనియాడారు. ముఖ్యంగా మైనారిటీ ముస్లిం సోదరులకు కొరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి 4% శాతం రిజర్వేషన్ ఇచ్చి పేద ముస్లిం సోదరుల జీవితాల్లో వెలుగు నింపిన మహా నాయకులు వైఎస్సార్ అని తెలుపుతూ రాష్ట్ర ముఖమంత్రి చంద్రబాబు పాలన నాలుగేళ్లు అయినా తన మంత్రివర్గంలో ఒక ముస్లింకు స్ధానం కల్పించకుండా ఇప్పుడు మైనారిటీ ముస్లిం సోదరులపై కపట ప్రేమ చూపిస్తున్నరని ఎద్దేవా చేస్తూ.. మైనారిటీ ముస్లింల ప్రధాన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబే అని తెలుపుతూ గత నెల 27న గుంటూరు జరిగిన తెలుగుదేశం మైనారిటీ సభలో నారా హామారా అని తెలుగుదేశం ముస్లిం నాయకులు చెప్పడం విడ్డురంగా ఉందని ‘నారా దుష్మన్ హామారా‘ ‘హర్ దిల్ మే హై జగన్ హమారా‘ అనే నినాదాలు చేశారు. కువైట్ కమిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, తెట్టు రఫీ, మీడియా ఇంచార్చ్ ఆకుల ప్రభాకర్ రెడ్డి, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అన్నాజీ శేఖర్,గల్ఫ్ ప్రతినిధి షేక్ నాసిర్ బి.సి. విభాగం ఇంచార్చ్ కె. రమణ యాదవ్, యూత్ ఇంచార్చ్ మర్రి కళ్యాణ్, సోషల్ మీడియా ఇంచార్చ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మైనారిటీ ఇంచార్చ్ షేక్ గఫార్, ఎస్సి.ఎస్టీ. ఇంచార్చ్ బి. ఎన్. సింహా, సాంసృతిక విభాగం ఇంచార్చ్ కె. వాసుదేవరెడ్డి, రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షుడు చింతల చంద్రశేఖర్ రెడ్డి, జగన్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు షేక్ జబీవుల్లా, జగన్ యూత్ ఫోర్స్ అధ్యక్షులు మరియు వ్యవస్ధాపకులు లక్షి ప్రసాద్ పోలి మనోహర్ రెడ్డి, మహానేత గురించి కొనియాడుతూ జోహార్ రాజన్న నినాదాలతో హోరోత్తించారు. కమిటీ సభ్యులు పులపుత్తూరు సురేష్ రెడ్డి, యు. రమణ రెడ్డి, వై. లాజారస్, రావూరి రమణ, పిడుగు సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, సయ్యద్ సజ్జాద్,రేవూరి సుబ్బారాయుడు, కె .సూర్యనారాయణ, షేక్ సబ్దర్, హారిప్రసాద్ నాయుడు, ముఖేష్ నాయుడు, రవి శంకర్, పోలూరుప్రభాకర్ ఇంక ప్రజాసంకల్పయాత్రలో జననేత వై.యస్. జగన్ గారికి వస్తున్నా ఆదరణ చూసి మరియు నవరత్నాలకు ఆకర్షితులై కువైట్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు యదోటి బాల చౌదరి, శంకర్ యాదవ్, సుండుపల్లి యల్లయ్య, జనసేన అభిమానులు షేక్ ఖాదర్ బాషా, దూదేకుల ముస్కిన్ బాషా, హరి, యం. శివ, వై.యస్.ఆర్. కమిటీలో చేరారు. ఈ కార్యక్రమములో కువైట్ కమిటీ సభ్యులు మరియు వై.యస్.ఆర్. అభిమానులు భారీగా పాల్గోన్నారు. -
కువైట్‌లో ఇఫ్తార్.. హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
కువైట్ : కువైట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే పీ. రవింద్రనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. కువైట్ భారత అంబాసిడర్ అయిన హెచ్.ఇ.కే. జీవసాగర్‌ను శాసనసభ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు కువైట్‌లో తెలుగు వారి సమస్యలు గురించి మాట్లాడారు. ఈ విషయాలను అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ సభ్యులు అంబాసిడర్‌తో మాట్లాడుతూ.. కువైట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసే సేవ కార్యక్రమాల ద్వారా తెలుగువారిని ఏ విధంగా ఆదకుంటుందో వివరంగా తెలిపారు. మన ఆంధ్ర వారు కువైట్‌లో దాదాపుగా 5 లక్షల మంది ఉన్నారు. ఒక కడప జిల్లా నుంచే సుమారు ఒక లక్ష యాభైవేల మంది ఉన్నారని తెలిపారు. అంతేకాక ఇక్కడ ఎవరైనా చనిపోతే వారి పార్ధివదేహాన్ని స్వస్థలం పంపించాలంటే రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. పేదవారు ఆ ఖర్చును భరించలేరు.. కాబట్టి ఆ ఖర్చును అంబాసి భరించేటట్లు చూడాలన్నారు. ఇక్కడ ఇంట్లో పని చేయడానికి వచ్చే వారికి కొందరు స్పాన్సర్ కష్టాలు పెడుతున్నారు. అలాంటి వారిని ఆదుకుని ఎటువంటి కేసులు లేకుండా ఇండియాకు పంపాలని కోరారు. మహిళలు భారత్ నుంచి కువైట్‌కు రావాలంటే స్పాన్సర్ మన ప్రభుత్వానికి(అంబాసికి) దాదాపుగా రూ. 2 లక్షలు డిపాజిట్ కట్టాలని నిబంధన ఉంది. దాంతో స్పాన్సర్స్ ఇండియా మహిళను విజ ఇవ్వాలంటే ముందుకు రావడం లేదని ఎమ్మెల్యేలు తెలిపారు. కాబట్టి రూ. 2 లక్షల డిపాజిట్‌ను తగ్గించాలని అన్నారు. ఇంట్లో ద్రవర్ గ హౌస్ మెయిడ్ అని పిలిచి ఆ పని ఇవ్వకుండా ఎడారిలో గొర్రెలు మేపడానికి నియమిస్తున్నారు. వారు ఎడారిలో పని చేయలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాంటి వారికి రక్షణ కల్పించి తిరిగి స్వస్థలం పంపే ఏర్పాట్లు చేయాలని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ అంబాసిడర్‌ను ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషాలు కోరారు. దీనిపై అంబాసిడర్ సానుకూలంగా స్పందించి తప్పకుండా అభ్యర్థనను పరిశీలిస్తామని తెలిపారు. -
ఖతార్‌లో ఇఫ్తార్.. హాజరైన కడప ఎమ్మెల్యే
దోహా, ఖతార్ : గల్ఫ్ దేశాలైన ఖతార్, కువైట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖతార్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే అంజద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే పీ. రవింద్రనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. ఖతార్ రాజధాని దోహాలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖతార్ కో-కన్వీనర్ గోవింద నాగారాజు ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్బీ అంజద్ బాషా మాట్లాడుతూ.. మత సామారస్యనికి ప్రతీక అయిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశం కాని దేశంలో ఉంటూ కూడా పార్టీ అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున తమకు ఘన స్వాగతం పలికి భారీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమని అన్నారు. పార్టీ కోసం మీరు శ్రమిస్తున్న దానికి పార్టీ అధిష్ఠానం, తాము రుణపడి ఉంటామని తెలిపారు. అలాగే కో కన్వీనర్ నాగారాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నిలో విజయం సాధించి ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రుల సమస్యలను కో-కన్వీనర్లు, గవర్నింగ్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే వద్ద ప్రస్తావించగా పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని హామి ఇచ్చారు. కార్యక్రమానికి హాజరై, విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యేలను కువైట్, ఖతర్ వైసీపీ ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కువైట్, ఖతార్ ముఖ్యనాయకులు, పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కువైట్‌లో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు
కువైట్ : వైయస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిగాయి. ఏడు వసంతాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మాలియా ప్రాంతము పవన్ రెస్టారెంట్లో వైఎస్ఆర్సీపీ కువైట్ యూత్ సభ్యులు అద్దాలూరి బాలకృష్ణా రెడ్డి గారి ఆధ్వర్యములో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భముగా గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం నరసా రెడ్డిలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఏర్పడిన పార్టీ వైయస్ఆర్సీపీ అని పేర్కొన్నారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుల, మత, పేద, ధనిక వర్గాలు అనే భేదం ప్రభుత్వ పథకాలను అమలు చేశారని, ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో లబ్ధిపొందిన వారేనని అన్నారు. తిరిగి రాజన్న రాజ్యం రావాలంటే రాజన్న బిడ్డ, జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ నల్ల కాలువలో ప్రజలకు ఇచ్చిన మాట కోసం, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిని తృణపాయంగా వదులుకున్న గొప్ప నేత అని, వైఎస్ఆర్సీపీలో సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేష్ రెడ్డి మాట్లాడుతూ రెండు నాలుకల ధోరణితో పూటకో మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రిని బుద్ధి చెప్పడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరైన నాయకుడని అన్నారు. ప్రవాసాంధ్రులు పార్టీ అభ్యున్నతికి తమవంతు సహాయసహాకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమములో ఇతర గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు తెట్టు రఫీ, రవీంద్ర నాయుడు, అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి, సలహా దారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బీసీ ఇన్‌చార్జ్‌లు కె రమణ యాదవ్, సోషల్ మీడియా ఇన్చార్జ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, యూత్ ఇన్చార్జ్ మర్రి కళ్యాణ్, యస్సీ, ఎస్టీ ఇన్చార్జ్ బిఎన్ సింహా, మైనారిటీ విభాగం ఇన్చార్జ్ షేక్ గఫార్, సాంస్కృతిక విభాగం ఇన్చార్జ్ కె వాసుదేవరెడ్డి, సలహాదారులు అన్నాజీ, ఆబూతురాబ్, సభ్యులు షా హుస్సేన్, పిడుగు సుబ్బారెడ్డి, రావూరి రమణ, కె సుబ్బారెడ్డి, యు వెంకట రమణ రెడ్డి, షేక్ సబ్దర్, కె హారినాధ్ చౌదరి, గౌస్ బాషా, మహాబూబ్ బాషా, రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పి సురేష్ రెడ్డి, జగన్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు జబీవుల్లా, ఉపాధ్యక్షులు నాసర్, జగన్ సైన్యం అధ్యక్షులు బాషా, అభిమానులు మల్లు శ్రీనివాసులు రెడ్డి, మన్నూరు సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లికార్జున రెడ్డి, సూరి రెడ్డి, రామారావులు పాల్గొన్నారు. -
ప్రజాసంకల్ప యాత్ర కోసం సర్వమత ప్రార్థనలు
కువైట్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర విపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీన ఈ యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో కువైట్‌లో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ఈ విషయాన్ని కమిటీ కన్వీనర్లు ఇలియాస్ బిహెచ్, ముమ్డి బాలిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు సంక్షేమ పధకాలు పూర్తిగా అందడం లేదని వారు అన్నారు. అంతేకాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాక్షస పాలనను సాగిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనను అంతమొందించడానికి అన్ని వర్గాల ప్రజలు యాత్రకు స్వచ్ఛందంగా మద్దతూ ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను వారు అభ్యర్ధించారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే 2019లో జగన్‌ను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సహ కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి అభిప్రాయపడ్డారు. -
నేపాల్ బాధితులకు కువైట్ వైఎస్సార్సీపీ సాయం
సాక్షి, హైదరాబాద్: కువైట్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విభాగం ఆధ్వర్యంలో నేపాల్ భూకంప బాధితులకు ఒక మినీ లారీ ఆహార పదార్థాలు, వస్త్రాలను పంపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కువైట్‌లోని నేతలు, అభిమానులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుని తాము సేకరించిన ఈ సాయాన్ని స్థానిక నేపాల్ రాయబార కార్యాలయంలో అందజేశామని పార్టీ కువైట్ శాఖ కోఆర్డినేటర్ ఇలియాస్ బీహెచ్ హైదరాబాద్‌లో బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ సంయుక్త కోఆర్డినేటర్ ఎం.బాలిరెడ్డి, స్థానిక నేత ఎంవీ నరసారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.