కువైట్ : వైఎస్సార్‌సీపీ కువైట్ యువజన విభాగం, ఎస్సీ ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో 'జగనోత్సవం' పేరుతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 50 మందికి పైగా రక్తదానం చేశారు. భారీ కేక్ కట్ చేసి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ శాసనమండలి సభ్యులు బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ డి.సి. గోవింద్ రెడ్డి, బద్వేల్ సమన్వయకర్త డా. వెంకట సుబ్బయ్య, పోరుమామిళ్ల మండల అధక్షులు సి. విజయప్రతాప్ రెడ్డి, అట్లూరు మండల అధ్యక్షులు ఆర్.మల్లికార్జునరెడ్డి, బద్వేల్ బూత్ కన్వీనర్ ఇంచార్జ్ కె. వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు.
ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కువైట్‌లోని ప్రవాసాంధ్రులు భారీగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి, వైఎస్సార్‌సీపీ కువైట్ కార్యవర్గ సభ్యుల సహాయసహకారంతో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా చేస్తున్న సామాజిక సేవల గురించి వివరించారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలో రావడం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని ముఖ్య అతిథులకు విజ్ఞప్తి చేశారు.
డి.సి. గోవింద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దుష్ట పాలన నుండి ప్రజలను రక్షించాలంటే జగన్‌ని ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అసలు తాను ఈ రోజు కువైట్‌లో ఉన్నట్లు లేదని, బద్వేల్‌లో ఉన్నట్లు ఉందన్నారు. డా. వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో ప్రజా సంక్షేమ పథకాలన్నీ మరుగున పడిపోయాయని, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ లాంటి మహోన్నతమైన పథకాన్ని పూర్తిగా పేద ప్రజలనుండి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి పాలనను అంతమోందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సి. విజయప్రతాప్ రెడ్డి, మల్లికార్జునరెడ్డి, కె. వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ కువైట్ లో ఉన్న మన వారు చూపిస్తున్న అభిమానం విలువ కట్టలేనిదని, 2019లో ఎన్నికల సమయంలో మీరందరు మీ మీ స్వస్దలాలకు వచ్చి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలనీ అభ్యర్థించారు. కార్య నిర్వాహుకులు మర్రి కళ్యాణ్, బి.ఎన్. సింహా మాట్లాడుతూ తమ తమ నియోజకవర్గాలలో ఎన్నో పనులున్నా తమ ఆహ్వానం మన్నించి జగనోత్సవం కార్యక్రానికి వచ్చిన అతిథులకు, ఈ కార్యక్రమము నిర్వహించేందుకు సహాకారించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.
ఈ కార్యక్రమములో కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం. వి. నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, తెట్టు రఫీ, అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్, ప్రతినిధి పి. సురేష్ రెడ్డి, సలహాదారుడు అన్నాజీ శేఖర్ బిసిసెల్ ఇంచార్జ్ రమణయాదవ్ రావూరి రమణ, మైనారిటీ ఇంచార్జ్ షేక్ గఫార్, సభ్యులు షా హుస్సేన్, , సోషల్ మీడియా ఇంచార్జ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సేవాదళ్ ఇంచార్జ్ గోవిందు రాజు, సుబ్బారావు, సాంస్కృతిక విభాగం ఇంచార్జ్ వాసు, గౌస్ బాషా, రహమతుల్లా, యు. రమణ రెడ్డి, లలితరాజ్, మహబూబ్ బాషా, బద్వేల్ నియోజకవర్గ ప్రవాసులు, వైఎస్‌ఆర్ కుటుంబ అభిమానులు భారీగా పాల్గోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment