birth day celebrations
-
ప్రధాని మోదీ పుట్టినరోజు.. శుభాకాంక్షల వెల్లువ
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (మంగళవారం) 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌మీడియాలో పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.Warm birthday wishes to the visionary leader & great son of Maa Bharati, Hon'ble Prime Minister Shri @narendramodi Ji. Your vision for a stronger, prosperous India resonates in every heart.May your dynamic leadership & unwavering dedication continue to transform India and… pic.twitter.com/PlzFdoIoGY— Prof.(Dr.) Manik Saha (@DrManikSaha2) September 16, 2024మోదీకి త్రిపుర సీఎం మాణిక్ సాహా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తన జన్మదినం సందర్భంగా ఒడిశాలో 26 లక్షల పీఎం ఆవాస్ ఇళ్లను ప్రారంభించన్నారు.On the occasion of Hon’ble PM @narendramodi ji's birthday, my SandArt with installation of 2500 Diyas in New Delhi. Jai Jagannath! 🙏 pic.twitter.com/Rs0y3BPeah— Sudarsan Pattnaik (@sudarsansand) September 17, 2024 On the occasion of PM Modi's birthday, Maharashtra CM Eknath Shinde says, "My birthday wishes to Prime Minister Narendra Modi. I wish him good health and long life. Under the leadership of Prime Minister Modi, India is moving towards becoming an economic superpower, I wish him… pic.twitter.com/rXPBgTjrXX— ANI (@ANI) September 16, 2024మోదీకి ఉత్తరాఖండ్ సీఎం జన్మదిన శుభాకాంక్షలుఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్స్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.‘ రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది నివాసితుల తరపున, మీ ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, విజయవంతమైన జీవితం కోసం నేను మహాదేవ్‌ను ప్రార్థిస్తున్నాను. మీ నాయకత్వంలో దేశ అభివృద్ధి కొనసాగించాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.Uttarakhand CM Pushkar Singh Dhami extends birthday greetings to Prime Minister Narendra Modi."...On behalf of 1.25 crore residents of the state, I pray to the Lord Mahadev for your healthy, prosperous and successful life. I pray to the Lord that under your leadership, the… pic.twitter.com/a6BRUb1RnO— ANI (@ANI) September 17, 2024మోదీకి ఒడిశా సీఎం జన్మదిన శుభాకాంక్షలుమోదీకి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ అసమానమైన నాయకత్వంలో, దేశం విక్షిత్ భారత్ వైపు అధిక వృద్ధి పథంలో పయనిస్తోంది. మీరు దేశ సేవలో దీర్ఘకాలం, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.Odisha CM Mohan Charan Majhi extends birthday greetings to Prime Minister Narendra Modi. "...Under your unparalleled leadership, the Nation is moving on a high growth trajectory towards a Viksit Bharat. I wish you a long and healthy life in the service of the Nation..," his… pic.twitter.com/PHgcItiF9r— ANI (@ANI) September 17, 2024చదవండి: ఏడుపదుల వయసులోనూ కుర్రాడిలా ప్రధాని మోదీ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! -
సింగపూర్ లో ఘనంగా సీఎం వైయస్ జగన్ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు సింగపూర్ లోని ఎన్.ఆర్.ఐ లు మరియు వైస్సార్సీపీ సింగపూర్ టీం, సింగపూర్ వైస్సార్సీపీ అడ్వైసర్ కోటి రెడ్డి మరియు సింగపూర్ వైస్సార్సీపీ కన్వీనర్ మురళి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోటిరెడ్డి మరియు మురళి కృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని సమంగా పరుగులు తీయిస్తున్నారు. అలానే 99 శాతం హామీలు నెరవేర్చి సుపరిపాలన చేస్తున్నారు అని చెప్పినారు. విద్య, వైద్య రంగాలలో దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది. 38000 స్కూల్స్ అధునాతనంగా తీర్చిదిద్దారు. 15000 గ్రామసచివాలయాలు, 10000 రైతు భరోసా కేంద్రాలు, 10000 గ్రామ ఆరోగ్య కేంద్రాలు, 10 ఫిషింగ్ హర్బోర్స్ , 4 పోర్ట్స్, 9000 కోట్లతో రోడ్ల అభివృద్ధి, 17 కొత్త మెడికల్ కాలేజీలు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరిగింది కేవలం ఈ నాలుగు సంవత్సరాలలో. ఆరోగ్యశ్రీ ని 25 లక్షల వరకు పెంచటం, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్లి అన్ని 9 రకాల పరీక్షలు నిర్వహించటం అనేవి విదేశాలలో కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు అని గుర్తుచేశారు.ఇవన్నీ ఇలా కొనసాగాలి అంటే మరల జగన్ గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవటం మన అందరి అవసరం మరియు బాధ్యత. కావున మన అందరం వచ్చే మూడు నెలలు ఒక సైనికుడిలా పని చెయ్యాలి అని చెప్పినారు. ఈ జన్మదిన వేడుకలలో భాస్కర్, శ్రీనివాసులు, గుండు కృష్ణ, సందీప్ రెడ్డి, కృష్ణ రెడ్డి, చంద్ర, అఖి రెడ్డి, సుధీర్, ప్రసాద్, మధు, రాంమోహన్, రంగా రెడ్డి, విష్ణు, దొర బాబు, లీల, చిట్టి బాబు, శ్రీనాధ్, సుహాస్, నాగ సత్యనారాయన రెడ్డి, పవన్ పాల్గొన్నారు. -
షార్జాలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు షార్జాలోని కింగ్ ఫైసల్ పార్కులో సంఘ సేవకులు రిజవాన్గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనేక మంది అభిమానుల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ గారి పుట్టిన రోజుని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూఏఈ వైస్సార్సీపీ కన్వీనర్ సయ్యద్ అక్రమ్, ఇర్షాద్, అబ్దుల్లా, చక్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రామాలని వివరిస్తూ మరోసారి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా శక్తి వంచన లేకుండా కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వం చేస్తున్న మంచిని విస్తృతంగా తీసుకువెళ్లాలి అని ఈ సందర్భంగా వారు పార్టీ శ్రేణుల్ని కోరారు. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీసీ ప్రెసిడెంట్ శ్రీ మేడపాటి వెంకట్ గారు, బీహెచ్ ఇలియాస్ గారు ప్రవాసాంధ్రలు అభివృద్ధి కొరకు ప్రభుత్వంతో సమన్వయము చేసుకుంటూ అన్ని విధాలుగా ప్రవాసాంధ్రుల అభ్యున్నతి కొరకు చేస్తున్న కృషిని వారు కొనియాడారు. (చదవండి: లండన్‌లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు!) -
Seva Pakhwara: ప్రజాసేవలో నిమగ్నమవుదాం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జన్మది నాన్ని పురస్కరించుకుని ’సేవా పఖ్వారా’ పేరుతో దేశవ్యాప్తంగా 15 రోజులపాటు ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా ప్రజాసేవా కార్యాక్రమాలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల పారీ్టల శాఖలను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన భేటీలో అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సేవా కార్యక్రమాల్లో భాగంగా పార్టీ ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, నేతలు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా డ్రైవ్‌లు నిర్వహించాలని జేపీ నడ్డా బీజేపీ శ్రేణులను ఆదేశించారు. ఆయుష్మాన్ కార్డులు లేని వారికి వాటిని అందించడంలో సహకరించాలని చెప్పారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎన్నికలు జరుగున్న తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మోదీ జన్మదిన వేడుకలకు నిర్వహించాలని చెప్పారు. ప్రధానిగా తొమ్మిదేళ్ల వ్యవధిలో సాధించిన విజయాలు, ప్రజాహిత కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని çకోరారు -
కేక్ కట్ చేశాడు! దెబ్బకు జైలుకెళ్లాడు
దొడ్డబళ్లాపురం: పుట్టినరోజునాడు పెద్ద కత్తితో కేక్‌ను కట్ చేసిన ముగ్గురిని ఉడుపి జిల్లా పడుబిద్రి పోలీసులు అరెస్టు చేసారు. జితేంద్రశెట్టి, గణేశ్ పూజారి, శరత్శెట్టి అరెస్టయిన యువకులు. మే 30న పడుబిద్రెలో జితేంద్రశెట్టి ఇంట్లో బర్త్‌డే సందర్భంగా తల్వార్‌తో కేక్‌ను కోశారు. ఈ వీడియోను వైరల్ చేయగా, పోలీసులు కేసు నమోదు పై ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. పెద్ద కత్తిని కలిగి ఉండడం, దానిని ప్రదర్శించడం చట్టరీత్యా నేరమవుతుంది. సినిమాలో నష్టపోయి రియాల్టీలో మోసాల యశవంతపుర: స్థలాల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైన కేసులో సినీ నిర్మాత మంజునాథ్‌తో పాటు కేకే శివకుమార్, చంద్రశేఖర్, సీ శివకుమార్ అనేవారిని రాజాజీనగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాత మంజునాథ్ నటుడు కోమల్‌తో లొడ్డె అనే సినిమాను నిర్మించారు. ఇంకా విడుదల కాలేదు. కానీ సినిమా ద్వారా అతనికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో రియల్ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి తక్కువ ధరలకు స్థలాలను ఇప్పిస్తామని ప్రకటన ఇవ్వటంతో అనేక మంది క్యూ కట్టారు. పలువురి నుంచి డబ్బులు కూడా కట్టించుకుని ఆఫీసుకు తాళం వేశారు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయడంతో మంజునాథ్‌ను, అనుచరులను అరెస్టు చేశారు. (చదవండి: బాల్యం బడికి దూరం) -
ఎలిజబెత్ బార్బీ రాణి!
చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా ఆడుకునే బొమ్మల్లో బార్బీ చాలా ముఖ్యమైనది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టపడేటట్టుగా ఉంటుంది బార్బీ. ఏడాదికేడాది సరికొత్త మెరుగులు దిద్దుకుంటూ వస్తోన్న బార్బీ ఇప్పుడు మహారాణి అయ్యింది. బొమ్మేంటీ మహారాణి అవడమేంటీ అనుకుంటున్నారా? ఎప్పుడూ అందంగా కనిపించే బార్బీ ఇప్పుడు మహారాణి డ్రెస్‌లో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మహారాణులందరిలోకి బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ఎంత ప్రత్యేకంగా ఉంటారో అందరికీ తెలిసిందే! అయితే ‘ఆమెకు నేనేమి తీసుకుపోను’ అన్నట్టుగా ఎలిజబెత్ రాణి గెటప్‌తో రెడీ అయ్యింది మన చిట్టి బార్బీ. మామూలు బార్బీ బొమ్మగా కంటే క్వీన్ ఎలిజబెత్ రూపంలో ధగధగా మెరిసిపోతూ దర్పం వెలిబుచ్చుతోంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 ఇటీవల 96వ పుట్టిన రోజు జరుపుకున్నారు. క్వీన్ ఎలిజబెత్–2 బ్రిటన్ రాజవంశంలో డెబ్బైఏళ్లుగా విజయవంతంగా పాలన కొనసాగిస్తూ ప్లాటినం జూబ్లి జరుపుకోబోతున్న మొదటి వ్యక్తిగా నిలవడంతో ఆమె రూపంతో బార్బీని రూపొందించారు. ఈ పుట్టినరోజుకు బార్బీ బొమ్మను ఎలిజబెత్ రాణిలా రూపొందించి విడుదల చేసింది బార్బీ బొమ్మల కంపెనీ. గత డెభ్బై సంవత్సరాలుగా ఏడాదికో థీమ్, ప్రత్యేకతలతో బార్బీ సంస్థ మ్యాటెల్ సందర్భానుసారం బార్బీ బొమ్మలను విడుదల చేస్తోంది. ఈ ఏడాది ఎలిజబెత్ రాణి–2 పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆమె రూపాన్ని బార్బీలో ప్రతిబింబించేలా చేసింది. చూబడానికి ఈ బార్బీ నిజమైన క్వీన్‌లాగే కనిపిస్తుంది జూన్ 2–5 వరకు నాలుగురోజుల పాటు ప్లాటినం జూబ్లి సెలబ్రేషన్స్‌ను నిర్వహించబోతున్నారు. బ్రిటన్ మహారాణిగా డెబ్బై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లి వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు ఉన్నందున ఏప్రిల్ 21న మహారాణి పుట్టిన రోజు వేడుకలు ప్రైవేటు ప్లేసులో కొంతమందితో మాత్రమే నిర్వహించారు. ఈ వేడుకల్లో క్వీన్ బార్బీని విడుదల చేశారు. మ్యాటెల్ విడుదల చేసిన క్వీన్ బార్బీ బొమ్మ ఐవరీ తెలుపు గౌన్ వేసుకుని నీలం రంగురిబ్బన్, తల మీద మిరుమిట్లు గొలిపే అంచున్న తలపాగ ధరించడం విశేషం. అచ్చం రాయల్ కుటుంబ సభ్యులు ధరించే గౌను, రిబ్బన్‌తో బార్బీ ఎలిజబెత్ రాణిగా మెరిసిపోతుంది. ఈ గౌనుకు సరిగ్గా నప్పే యాక్సెసరీస్‌తోపాటు ఎలిజబెత్–2 కు తన తండ్రి జార్జ్–4 ఇచ్చిన పింక్ రిబ్బన్, తలకు అలంకరించిన కిరీటంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ‘‘మహారాణి ఏ ఈవెంట్లో కనిపించినా ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆమె మార్క్ కనిపించేలా ఈ డిజైన్‌ను రూపొందించాము. భవిష్యత్ ప్రపంచం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహిళామణులకి గుర్తుగా ఈ సీరిస్‌ను మొదలుపెట్టాం. ఈ క్రమంలోనే క్వీన్ బార్బీని కూడా రూపొందించాం’’ అని బార్బీ సీనియర్ డిజైన్ డైరెక్టర్ రాబర్ట్ బెస్ట్ చెప్పారు. -
పెంపుడు కుక్కకు బర్త్‌డే పార్టీ... లాకప్‌లో యజమానులు
అహ్మదాబాద్: ముచ్చట పడి పెంచుకున్న కుక్కకు ఘనంగా పుట్టినరోజు చేయాలనుకున్నారు. బంధుమిత్రులను పిలిచి కేక్ కట్ చేసి హంగామా చేశారు. అదే వారిని చిక్కుల్లో పడేసింది. అహ్మదాబాద్‌కు చెందిన చిరాగ్ పటేల్, ఉర్విష్ పటేల్‌లు సోదరులు. క్రిష్ణానగర్ ప్రాంత వాసులు. శుక్రవారం రాత్రి తమ ఫ్లాట్‌లో అబ్బీ (కుక్క పేరు... ఇండియన్ స్పిట్జ్ జాతికి చెందినది)కి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. జానపద గాయకుడితో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. పెద్దసంఖ్యలో అతిథులు హాజరుకావడంతో కోవిడ్–19 ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన వీరిపై పోలీసులు కన్నెర్ర చేశారు. నిబంధనలు ఉల్లంఘించారని విపత్తు నిర్వహణ చట్టాన్ని అనుసరించి చిరాగ్, ఉర్విష్లపై కేసు కట్టి అరెస్టు చేశారు. దగ్గరుండి పార్టీ ఏర్పాట్లు చూసిన వీరి మిత్రుడు దివ్వేశ్ మెహారియాను జైల్లో వేశారు. -
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
గుంటూరు ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బ్రాడీపేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, మొక్కలు నాటారు. ►రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇచ్చిన ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాల గిరిధర్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విశాఖపట్నం విశాఖ నగర పార్టీ కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి అవంతి శ్రీనివాస్.. ఎమ్మెల్సీలు వంశీ, కల్యాణి, మేయర్,జడ్పీ చైర్మన్‌తో కలిసి కేక్ కట్ చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కృష్ణా జిల్లా విజయవాడ సత్యనారాణయపురంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు,.. కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం రోడ్లపై నిద్రిస్తున్న యాచకులకు, వృద్ధులకు.. దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి శంకర నారాయణ పెనుకొండ బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ►పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయి గూడెం మండలం ముప్పిన వారి గూడెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ►సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ►మొక్కలు నాటి, శివాలయంలో పత్యేక పూజలు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం ప్రధానంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పార్టీ నిర్ణయించిందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పుట్టినరోజు పార్టీ శ్రేణులకే కాకుండా ప్రజలందరికీ పర్వదినం వంటిదన్నారు. అందుకే ఆ రోజు సేవా కార్యక్రమాలతోపాటు ప్రత్యేకంగా ప్రజల్లో అవగాహన పెంచే విధంగా ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో గతేడాది కరోనా నేపథ్యంలో రక్త నిల్వల కొరతను నివారించడానికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తద్వారా ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం మొక్కలు నాటడం, రక్తదానం, పేదలకు దుస్తులు, దుప్పట్లు, నిత్యావసరాల పంపిణీ, అన్నదానం తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సీఎం జగన్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారన్నారు. -
20 రోజులపాటు వేడుకలు
న్యూఢిల్లీ: ఈ నెల 17న ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని బీజేపీ భారీ కార్యక్రమాలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ‘సేవ సమర్పణ అభియాన్’ పేరుతో 20 రోజుల వేడుకలకు కార్యాచరణ రూపొందించింది. ప్రధాని మోదీ ప్రజా సేవలో అడుగు పెట్టి 20 ఏళ్లు అయిన సందర్భంగా 20 రోజుల పాటు వేడుకలు సాగించనున్నట్లు తెలిపింది. 5 కోట్ల పోస్టు కార్డులు.. 20 రోజుల వేడుకల్లో భాగంగా దేశ వ్యాప్తంగా భారీగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో పాటు పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రాష్ట్ర విభాగాలు అన్నింటికీ సూచనలు పంపించారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ బూత్‌ల నుంచి అయిదు కోట్ల పోస్ట్ కార్డులను ప్రధాని మోదీకి పంపనున్నారు. ప్రజాజీవితానికి అంకిత మైన మోదీలా పార్టీ సభ్యులు కూడా అంకితమవుతామంటూ ఆ కార్డుల్లో రాసి మోదీకి పంపనున్నారు. ఉచితంగా పప్పుధాన్యాలు, వ్యాక్సిన్లు అందిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ హోర్డింగ్‌లు నిర్మించనున్నారు. ఎగ్జిబిషన్ కూడా.. ప్రధాని మోదీ జీవితాన్ని సూచించే ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను తయారు చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. వర్చువల్‌గా రూపొందించనున్న ఈ ఎగ్జిబిషన్‌ను ప్రజలు నమో యాప్ ద్వారా వీక్షించవచ్చని వెల్లడించింది. గంగా నది శుద్ధి.. వచ్చే ఏడాది మొదట్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ కార్యక్రమా లను చేపట్టనుంది. వేడుకల్లో భాగంగా గంగానదిని 71 ప్రదేశాల్లో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించను న్నారు. మోదీ జీవితం, ఆయన విజయాలపై నిర్వహించనున్న ప్రత్యేక ఈవెంట్లకు çవివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించ నున్నారు. 2001 అక్టోబర్ 7న మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అందుకే అక్టోబర్ వరకు 20 రోజుల పాటు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపింది. -
కేటీఆర్ జన్మదినానికి సర్ప్రైజ్: దివ్యాంగులకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుక (జూలై 24) మంచి పనికి శ్రీకారం కానుంది. గతేడాది మాదిరి ఈ సంవత్సరం కూడా కేటీఆర్ జన్మదినాన్ని సమాజ సేవ కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నారు. గతేడాది ‘గిఫ్ట్ ఏ స్మైల్’ అనే కార్యక్రమంతో ప్రభుత్వ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు విరాళంగా అందించారు. ఆ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు వచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు కేటీఆర్ జన్మదినం సందర్భంగా అందించారు. ఈ ఏడాది తన జన్మదినాన్ని దివ్యాంగుల కోసం వినియోగించనున్నారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పేరుతో తాను వంద త్రిచక్ర వాహనాలను దివ్యాంగులకు అందించినున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అభిమానులు కూడా ఆ విధంగా చేయాలని పిలుపునిచ్చారు. బొకేలు, శాలువాలు, జ్ఞాపికలు, భారీ కేకులు వద్దంటూ మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే కేటీఆర్ పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే పలువురు త్రిచక్ర వాహనాలు సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఇప్పటివరకు అందిన సమాచారం వరకు ఎమ్మెల్సీలు నవీన్ రావు వంద వాహనాలు, శంభీపూర్ రాజు 60 వాహనాలు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 60 వాహనాలు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 50 వాహనాలు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్ 50 వాహనాలు, గువ్వల బాలరాజు 20, గాదరి కిశోర్ 10 వాహనాలు అందించనున్నట్లు ప్రకటించారు. ఒక్కరోజే ఇంత పెద్ద స్థాయిలో స్పందన లభించింది. 24వ తేదీ వరకు భారీ స్థాయిలో స్పందన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. సంగీత దర్వకుడు ఎస్ఎస్ తమన్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామిని అవుతానని ప్రకటించారు. తోచినంత సహాయం చేస్తానని ట్విటర్లో తెలిపారు. Last year on the eve of my birthday, I had personally donated 6 ambulances & our TRS MLAs & MPs joined in taking the total No. to 90! This year too, decided that the best way to celebrate is to #GiftASmile in personal capacity to 100 differently abled with custom made vehicles pic.twitter.com/9YcgpHgY7S — KTR (@KTRTRS) July 22, 2021 -
గుర్రం అంటే ఆయనకు ప్రాణం.. అందుకే..
పాట్నా : ఓ గుర్రం పుట్టిన రోజు వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించాడు దాని యజమాని. రుచికరమైన పేద్ద కేకుతో.. నోరూరించే విందు భోజనంతో లక్షలు ఖర్చుపెట్టి మరీ చేశాడు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సహర్షా జిల్లాలోని పాంచ్‌వతిచౌక్‌కు చెందిన రజ్నీష్ కుమార్ అలియాస్ గోలు యాదవ్‌కు చేతక్ అనే తెల్ల గుర్రం ఉంది. దాన్ని చిన్నప్పటినుంచి కన్న బిడ్డలాగా పెంచుతున్నాడు. ఇంట్లో వాళ్లు దాన్ని ఇంటి సభ్యుడిలాగే చూసేవారు. అదో జంతువు అని అంటే ఒప్పుకునేవారు కాదు. తన పుట్టినరోజు వేడుకలకు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వని గోలు యాదవ్.. చేతక్ పుట్టిన రోజును ఓ పండుగలా జరిపేవాడు. కేక్ కట్ చేస్తున్న గోలు యాదవ్ ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగే పెద్ద ఎత్తున జరిపాడు. చేతక్‌కు స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగించాడు. తనే దగ్గరుండి ఓ పెద్ద కేకు కట్ చేశాడు. ఊరందరికీ వెజ్, నాన్ వెజ్ భోజనాలు పెట్టించాడు. ఈ పుట్టిన రోజు వేడుకల్లో పెద్ద ఎత్తున జనాలు పాల్గొన్నారు. ప్రస్తుతం చేతక్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై గోలు యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ నేను నా బిడ్డలాగా చేతక్‌ని పెంచాను. నా పిల్లలకంటే ఎక్కువ ప్రేమ దానికి పంచాను’’ అని అన్నాడు. చదవండి : వైరల్ : నీ టైం బాగుంది ఇంపాల -
తిరిగిచ్చే సమయం వచ్చింది
‘దిల్’ రాజు 50వ పుట్టినరోజు వేడుకకు పలువురు ప్రముఖ సినిమా తారలు కదిలి వచ్చారు. శుక్రవారం (డిసెంబర్ 18) ఆయన బర్త్‌డే. గురువారం ‘దిల్’ రాజు స్వగృహంలో జరిగిన వేడుకలో చిరంజీవి, పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్, నాగచైతన్య, నితిన్, వరుణ్‌తేజ్, విజయ్ దేవరకొండ, సాయి శ్రీనివాస్, ప్రకాశ్‌రాజ్, కన్నడ స్టార్ యశ్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ‘దిల్’ రాజు మీడియాతో మాట్లాడుతూ– ‘‘సినిమా పరిశ్రమకు వచ్చి 25 ఏళ్లవుతోంది. ఈ పాతికేళ్లలో ఇండస్ట్రీ నాకెంతో పేరుతో పాటు డబ్బును కూడా ఇచ్చింది. ఇన్నేళ్ల కెరీర్లో జయాపజయాలు ఉన్నాయి. అన్నింటినీ దాటి ఇక్కడిదాకా వచ్చాను. ఈ ప్రయాణంలో నాకెంతోమంది సాయం చేసి, ఈ స్థాయిలో నిలబడటానికి కారణం అయ్యారు. ఇప్పుడు తిరిగిచ్చే సమయం వచ్చింది. ముఖ్యంగా సాయం కోరి రోజూ ఎంతోమంది వస్తుంటారు. అలా వచ్చేవారిలో ఎంతమంది నిజం చెబుతున్నారో మాకు తెలియదు. అందుకే ఒక కమిటీని ఏర్పాటు చేసి, వారికి కావాల్సిన విద్య, వైద్య సౌకర్యాలు సమకూర్చాలనుకుంటున్నా. దానికి మీడియా ప్రతినిధుల సాయం కూడా ఉంటే నిజంగా అవసరాల్లో ఉన్నవారికి సాయం అందుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. భార్య వైగా, కుమార్తె హన్షితలతో ‘దిల్’ రాజు శిరీష్, విజయ్, రామ్, రామ్‌చరణ్, ‘దిల్’ రాజు, మహేశ్‌బాబు, ప్రభాస్, నాగచైతన్య -
ప్రేమకు నిర్వచనం నా తమ్ముడు
‘‘నా తమ్ముడు మంచి మనిషి. ప్రేమకు నిర్వచనం’’ అన్నారు రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ. జనవరిలో కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన రజనీకాంత్ ఈ సందర్భంగా తన అన్నయ్య సత్యనారాయణ ఆశీస్సులు తీసుకోవడానికి బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. శనివారం (డిసెంబర్, 12) రజనీ పుట్టినరోజు. చెన్నైలో ఆయన బర్త్‌డే వేడుకలు జరిగాయి. తమ్ముడికి ఏం బహుమతి ఇచ్చారు? అసలు పుట్టినరోజులకు ఏమైనా ఇచ్చి పుచ్చుకుంటారా? అని సత్యనారాయణను ‘సాక్షి’ అడిగితే – ‘‘అలాంటివి ఏమీ లేదు. మా తమ్ముడు చూపించే ప్రేమను నేను పెద్ద బహుమతిలా భావిస్తాను. నా ప్రేమను ఆయన అలానే అనుకుంటారు. కుటుంబ సభ్యులంటే ఆయనకు చాలా ప్రేమ. కుటుంబం అనే కాదు.. మనుషులందరినీ ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి’’ అన్నారు. మీ తమ్ముడి రాజకీయ భవిష్యత్తు గురించి ఏమంటారు? అంటే, ‘‘ఇన్నేళ్లుగా సినిమా హీరోగా ఉన్నారు. ఆయనకు అన్ని విషయాలూ తెలుసు. బాగా రాణిస్తారు’’ అన్నారాయన. ‘‘నా ఆరోగ్యం బాగుంది. తమ్ముడి ఆరోగ్యం కూడా చాలా బాగుంది. తను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. తమ్ముడు ఎంత బిజీగా ఉన్నా నా క్షేమసమాచారాలు తెలుసుకుంటారు’’ అన్నారు సత్యనారాయణ. ఇదిలా ఉంటే ఈ 15 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న ‘అన్నాత్తే’ షూటింగ్లో పాల్గొననున్నారు రజనీకాంత్. అందరికీ ధన్యవాదాలు ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులకు, ప్రపంచవ్యాప్తంగా నా పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న అభిమాన దేవుళ్లకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్. -
నా బర్త్‌డే కేక్ నేనే తయారు చేసుకున్నా
‘ఎక్స్‌ప్రెస్ రాజా’ (2016), ‘జెంటిల్‌మేన్’ (2016), ‘ఒక్కక్షణం’ (2017) చిత్రాల్లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల చేత మంచి మార్కులు వేయించుకున్నారు హీరోయిన్ సురభి. ఆ తర్వాత కెరీర్లో కాస్త నెమ్మదించినా ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడలో సినిమాలకు సైన్ చేసి, ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు. నేడు సురభి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో సురభి చెప్పిన విశేషాలు. ► గత ఏడాది నా బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గానే జరిగాయి. కానీ ఈ ఏడాది లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లలేం. ముంబైలో వర్షాలు కూడా పడుతున్నాయి. సో... ఈ ఏడాది నా బర్త్‌డే వేడుకలు ముంబైలోని మా ఇంట్లో మా తల్లిదండ్రుల సమక్షంలో జరుగుతాయి. ప్రతి ఏడాది నా బర్త్‌డే వేడుకల్లో నా స్నేహితులు పాల్గొనేవారు. ఈసారి వారిని బాగా మిస్ అవుతున్నాను. ► లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్నాం. చాలా సమయం కూడా దొరికినట్లయింది. దీంతో కొత్త వంటకాలు నేర్చుకున్నాను. వంటలు చేయడానికి మా అమ్మగారు హెల్ప్ చేస్తున్నారు. పానీపూరి, చాట్, వడపావ్.. ఇలా చాలా ఐటమ్స్ చేశాను. విశేషం ఏంటంటే... నా బర్త్‌డేకి నా కేక్‌ను నేనే తయారు చేసుకున్నాను. కుకింగ్ కాకుండా ఇంకా పెయింటింగ్స్ వేశాను. గార్డెనింగ్ పనులు చూసుకుంటున్నాను. సమ్మర్ హాలీడేస్‌లా అనిపిస్తోంది. కుటుంబంతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నాను. నా గురించి కూడా నేను ఆలోచించుకునే వీలు దొరికింది. ► ‘ఒక్కక్షణం’ తర్వాత నాకు తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ కథలు నచ్చలేదు. అయితే వేరే భాషల్లో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా చేస్తోన్న ‘శశి’ చిత్రంలో నటిస్తున్నాను. ‘శశి’ మంచి ప్రేమకథా చిత్రం. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. లాక్డౌన్ తర్వాత వాటిని పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇంకా తమిళంలో జీవీ ప్రకాష్‌కుమార్, కన్నడలో గణేశ్ హీరోలుగా చేస్తోన్న సినిమాల్లో నటిస్తున్నాను. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. లాక్డౌన్ తర్వాత వాటిపై స్పష్టత వస్తుంది. ► ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించాలని ఉంది. ఇటీవలే ఓ కథ విన్నాను. ఇంకా ఫైనలైజ్ కాలేదు. పోలీసాఫీసర్ పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలని ఉంది. ఈ విషయంలో నాకు విజయశాంతిగారు స్ఫూర్తి. యాక్షన్ సినిమాల్లో ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. ఆమె చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేశారు. తెలుగులో నా ఫేవరెట్ యాక్టర్స్ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాని, శర్వానంద్... ఇలా చాలామంది ఉన్నారు. ► వెబ్ సిరీస్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాను. కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను. అలాంటివి వస్తే వెబ్ సిరీస్ కూడా చేస్తాను. -
వివాదంగా మారిన ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకలు
సాక్షి, సంగారెడ్డి : లాక్డౌన్ సమయంలో సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం వివాదంగా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు సురేష్ షెట్కార్, సంజీవరెడ్డిలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా, పోలీస్టేషన్‌ను పార్టీ కార్యాలయంగా మార్చారని మండిపడుతున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నారాయణ్ ఖేడ్‌లో భూపాల్‌రెడ్డి ఘనంగా పుట్టిన రోజు వేడుకులను జరిపారని ఆరోపిస్తున్నారు. దీనికి వందల మంది అతిథులు హాజరయ్యారని, బర్త్ డేకు వచ్చిన వారంతా ఎలాంటి సామాజిక దూరం పాటించకుండా పక్కపక్కనే కూర్చున్నారని విమర్శించారు. దీనిపై వారు హైకోర్టును సైతం ఆశ్రయించారు. (దశల వారీగా షూటింగ్స్‌కు అనుమతి) మరోవైపు భూపాల్‌రెడ్డి పుట్టినరోజుకు సంబంధించి స్థానిక ఓ విలేఖరి వార్తను ప్రచురించినందుకు ఎమ్మెల్యే అనుచరులు అతనిపై దాడికి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని వార్తను రాసినందుకు ఆ విలేఖరి ఇళ్లును కూల్చివేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ఓ జాతీయ మీడియా సంస్థ వార్తను ప్రచురించడం గమనార్హం. నిర్మాణంలో ఉన్న ఇంటిని అక్రమ కట్టడంగా భావించి జర్నలిస్ట్‌పై కక్షపూరితంగా వ్యవహరించి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆదేశాలతో ఇంటిని కూల్చి వేశారని ఆ పత్రిక పేర్కొంది. ఇక తాజా వివాదంపై నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి స్పందించారు. తన పుట్టిన రోజు నాడు అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు వక్రీకరించారని తెలిపారు. కరోనా ఉధృతంగా ఉన్నందున జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నానని చెప్పారు. ‘ఆరోజు నా శ్రేయోభిలాషులు నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ , రక్త దానం చేశారు. అందులోనూ భౌతిక దూరం పాటించారు. కావాలనే కొన్ని ఛానళ్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వాస్తవాలు తెలుసుకొని ప్రసారం చేయాలి. కాంగ్రెస్ నేతలు హైకోర్టులో వేసిన కేసు నిలువదు’ అని చెప్పుకొచ్చారు. -
దూరంగా ఉంటునే ఆశీర్వదించారు
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో సినిమా సెలబ్రిటీలు స్వీయ నిర్భందానికి పరిమితయ్యారు. ఇక పలువురు సినీ ప్రముఖులు ప్రజలకు కరోనాపై సూచనలు, సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లు తమ బర్త్‌డే పార్టీని స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఖరీదైన రెస్టారెంట్లలో చాలా స్పెషల్‌గా జరుపుకుంటారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ బర్త్ డే(ఏప్రిల్ 9) అందుకు భిన్నంగా జరిగింది. ప్రస్తుతం స్వరభాస్కర్ 32వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ సమయంలో స్వయంగా వెళ్లి విష్ చేసే పరిస్థితి లేకపోవటంతో స్నేహితులు, అభిమానులు స్వర భాస్కర్‌కు ఎవరి ఇంట్లో వారు ఉంటూనే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మరికొంత మంది స్నేహితులు గ్రూప్ వీడియో కాలింగ్ చేసి ఆమెకు వర్చువల్ బర్త్‌డే పార్టీని సెలబ్రేట్ చేశారు. స్వర వర్చువల్ బర్త్‌డే పార్టీ నాలుగు గంటలపాటు ఆటా, పాటలతో చాలా ఉల్లాసంగా కొనసాగింది. SO blessed to have so many kind friends & well wishers in the world, such a loving family & such a thoughtful & giving bunch of close friends who made my #lockdownBirthday so special & wonderful! SO much gratitude, counting my blessings everyday! Thank u all ♥️ I feel so loved! — Swara Bhasker (@ReallySwara) April 10, 2020 దీనిపై స్పందించిన స్వర ‘లాక్డౌన్ సమయంలో వచ్చిన నా బర్త్ డేకు విష్ చేసిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఇటువంటి అద్భుతమైన సన్నిహితుల బృందం ఆశీర్వాదానికి చాలా కృతజ్ఞతలు, అందరికీ ధన్యవాదాలు. ఏమాత్రం ఊహించని వర్చువల్ పార్టీని సెలబ్రేట్ చేయటం చాలా సరదా ఉంది. మీరు కుటుంబసభ్యుల వంటి స్నేహితులని చెప్పడానికి నాకు మాటలు చాలడం లేదు’ అని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు. ఇక 2018లో వచ్చిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమాలో స్వరభాస్కర్ నటించిన విషయం తెలిసిందే. Had the most unbelievably fun virtual birthday party, with across countries & continents. FOUR HOURS complete with games & performances! U guys r literally THE BEST people ever! I have no words to tell you’ll how lucky I am that you’ll are my friends like family. 😍😘 THANK YOU pic.twitter.com/IT71Wnn5Tj — Swara Bhasker (@ReallySwara) April 10, 2020 -
అందరూ బాగుండాలని...
ప్రతి ఏడాది ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు బర్త్‌డే వేడుకలు మార్చి 19న తిరుపతిలో ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది ఆ వేడుకలకు అంతరాయం ఏర్పడింది. కరోనా కారణంగా వేడుక వాయిదా వేశానని మోహన్‌బాబు చెబుతూ – ‘‘1992లో శ్రీవిద్యానికేతన్ విద్యాలయం ప్రారంభించాను. అప్పటి నుండి 27 ఏళ్లుగా మార్చి19న నా పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో ఘనంగా జరుగుతున్నాయి. విజ్ఞానులు, శాస్త్రవేత్తలు, మేధావులు, కళాకారులు ఈ వేడుకలకు అతిథులుగా హాజరవుతుంటారు. ఎన్నో వేల మంది విద్యార్థులతో పాటు వారి తల్లితండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటారు. ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా జరిగే ఈ వేడుకలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాను. కారణం మనందరికీ తెలిసిందే. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం నుండి మరో దేశానికి గాలి కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రజలు గుంపులు, గుంపులుగా ఉన్నప్పుడు ఒకరినుంచి మరొకరికి ఈ వ్యాది సోకే ప్రమాదం ఉంది. అందరూ బావుంటేనే మనం బావుంటాం అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. అందుకే ఈ ఏడాది శ్రీవిద్యానికేతన్ పాఠశాల అండ్ కళాశాలల వార్షికోత్సవాన్ని అదే రోజున జరిగే నా పుట్టినరోజు వేడుకను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను. కరోనా వైరస్ ఈ భూభాగం నుండి వెళ్లిపోయేవరకు జాగ్రత్తగా ఉండండి’’ అన్నారు. -
అభిమానం ‘ఆకృతి’ ఐతే..
గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలో రెండ్రోజుల ముందే ఆయన జన్మదిన వేడుకల సందడి నెలకొంది. ఈనెల 17న కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు తమ అభిమాన నేతకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పారు. శనివారం పట్టణంలోని మైదానంలో 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2.600 మంది తమ అభిమాన నేత కేసీఆర్ ఆకారంలో నిలబడ్డారు. ఈ దృశ్యాన్ని 120 మీటర్ల ఎత్తు నుంచి డ్రోన్ కెమెరాలో బంధించారు. అనంతరం మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి పాల్గొన్నారు. -
కృష్ణంరాజు @ 80
సోమవారంతో 80వ వసంతంలోకి అడుగుపెట్టారు రెబల్‌స్టార్ కృష్ణంరాజు. ఈ బర్త్‌డేను కుటుంబ సభ్యులు, సినిమా పరిశ్రమలో ఉన్న ఆప్తుల మధ్య జరుపుకున్నారాయన. ఈ వేడుక హైదరాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగింది. ఈ వేడుకకు మోహన్‌బాబు, చిరంజీవి, విçష్ణు, లక్ష్మీ హాజరయ్యారు. పెదనాన్న పుట్టినరోజు వేడుకలో ప్రభాస్ సందడి చేశారు. ప్రభాస్, చిరంజీవి కృష్ణంరాజు, ప్రభాస్ కృష్ణంరాజు, మోహన్‌బాబు, ప్రభాస్ ప్రభాస్, విష్ణు మంచు -
ఓటమి అనేది నా జీవితంలోనే లేదు
‘‘గురువును మించిన శిష్యుడు.. తండ్రిని మించిన తనయుడు అంటుంటారు. ప్రభాస్ కూడా అలాంటివాడే. నేను హీరోగా తెలుగు, తమిళ, కన్నడ మలయాళ పరిశ్రమల్లో గుర్తింపు సంపాదిస్తే, ప్రభాస్ ఏకంగా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు’’ అన్నారు కృష్ణంరాజు. రేపు (జనవరి 20) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు కృష్ణంరాజు. సతీసమేతంగా కేక్ కట్ చేసిన అనంతరం కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘అందరికీ ఏదో ఓ వ్యసనం ఉంటుంది. నాకు స్నేహితుల్ని చేసుకోవడం వ్యసనం. ఫ్రెండ్స్‌ని చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. మా నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌కు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. ‘బొబ్బిలి బ్రహ్మన్న, కృష్ణవేణి, అమరదీపం, మనవూరి పాండవులు’ వంటి సినిమాలు చేశా. ‘తాండ్రపాపారాయుడు’ సమయంలో 5వేల మందితో యుద్ధ సన్నివేశాలు తీశాం. అంతమందితో చిత్రీకరించడంతో నా బలం, నాలోని శక్తి తెలిసింది. ఇప్పుడు మా బ్యానర్లో ప్రభాస్ కొత్త చిత్రం వస్తుంది. 3 నెలలపాటు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. నేను ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ప్రతి తండ్రి తన కొడుకు ఎదగాలనుకుంటాడు తప్ప తనయుడి చేతిలో ఓడిపోవాలని కోరుకోడు. నేను కూడా అంతే. ఈ కృష్ణంరాజు ఓటమిని ఎప్పుడూ అంగీకరించడు (నవ్వుతూ). ఎందుకంటే ఓటమి అనేది నా జీవితంలోనే లేదు’’ అన్నారు. అనంతరం తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కష్ణంరాజుని సత్కరించింది. -
నవిష్క..వేడుక
చిరంజీవి కుటుంబంలో డిసెంబర్ 25న రెండు పండగలు జరిగాయి. ఒకటి క్రిస్మస్ సెలబ్రేషన్ కాగా మరోటి చిరంజీవి మనవరాలు నవిష్క పుట్టినరోజు వేడుక. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్ల కూతురు నవిష్క. ఈ చిన్నారికి మొదటి పుట్టినరోజు ఇది. ఈ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది చిరంజీవి ఫ్యామిలీ. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఉపాసన. ‘‘హ్యాపీ బర్త్‌డే డార్లింగ్ నవిష్క. మీ అత్తామామ (ఉపాసన, రామ్‌చరణ్)కు నువ్వంటే చాలా ప్రేమ’’ అని ఈ ఫొటోలను షేర్ చేశారు. కల్యాణ్ దేవ్, నవిష్క, శ్రీజ, రామ్‌చరణ్, ఉపాసన -
ఈసారి ముంబైలోనే తైమూర్ బర్త్‌డే: కరీనా
ముంబై: బాలీవుడ్ స్టార్ కిడ్స్‌లో అందరికంటే పాపులర్, బాల్యం నుంచే సినీ నటులను మించి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన తైమూర్అలీఖాన్ త్వరలోనే డిసెంబరు 20న తన 3వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు. తన పుట్టినరోజుకు రెండు కేకులు కావలని డిమాండ్ చేశాడని తల్లి, బాలీవుడ్ నటీ కరీనా కపూర్ ఖాన్ ఒక ఈవెంట్లో చెప్పుకొచ్చారు. అందులోను ఒకటి 'శాంతా' మరోకటి 'హల్క్' కావాలని ప్రత్యేకంగా కోరడంతో కేకును ఆర్డర్ ఇచ్చామన్నారు. ఎంతయినా 'కపూర్' కదా.. కాసింత ఎక్కువే కావాలని అడుగుతాడని హాస్యం జోడించారు. టిమ్.. బర్త్‌డేను ఈ సంవత్సరం ముంబైలోనే.. అత్యంత కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరుపుకుంటామని తెలిపారు. కాగా తైమూర్ తన రెండవ బర్త్‌డేను మీడియాకు దూరంగా.. తల్లిదండ్రుల సమక్షంలో సౌత్ ఆఫ్రికాలో ఘనంగా జరుపుకొన్నాడు. తైమూర్ కనిపిస్తే చాలు.. టిమ్..టిమ్ అని హడావిడి చేస్తూ.. కెమెరాలో బంధించే మీడియావారు ఈసారి ఏమి చేస్తారో చూడాల్సిందే. ఇక కరీనా కపూర్ తాను నటించిన 'గుడ్‌న్యూస్' చిత్రం డిసెంబరు 27న విడుదల కానుండడంతో.. సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో కరీనాతో పాటు నటులు కియారా అద్వానీ, అక్షయ్ కుమార్, దిల్జీత్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. -
థాయ్‌లాండ్‌లో యువీ బర్త్‌డే వేడుకలు
-
పుట్టినరోజు నాడే గ్యాంగ్‌రేప్
కోయంబత్తూర్: పుట్టిన రోజును జరుపుకోవడానికి మిత్రుడితో కలసి పార్కుకు వెళ్లిన టీనేజర్‌పై దారుణం చోటు చేసుకుంది. రాత్రి 9 గంటలకు తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఆరుగురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూర్ జిల్లా సీరనాయకన్పలాయమ్ గ్రామంలో గత నెల 26న ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఇంటర్ తొలిఏడాది చదువుతున్న 17 ఏళ్ల బాలిక తన పుట్టినరోజును మిత్రుడితో కలసి జరుపుకున్న తర్వాత పార్కు నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా ఆరుమంది మృగాళ్లు వారిని అడ్డగించారు. బాలిక వెంట వచ్చిన మిత్రుడిని చితకబాదుతూ, బట్టలు విప్పించి పారిపోయేలా చేశారు. అనంతరం బాలికను బట్టలు విప్పాల్సిందిగా బలవంతం చేశారు. బాలిక అందుకు నిరాకరించడంతో కింద పడవేసి బలవంతం చేశారు. అప్పుడు కూడా ఆమె తిరస్కరించడంతో ఇద్దరు కలసి అత్యాచారం చేశారు. మరో నలుగురు ఈ తతంగాన్ని వీడియో తీశారు. తర్వాత బాలిక అక్కడి నుంచి తప్పించుకొని, తన బంధువు ఇంటికి చేరుకొని 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న రాహుల్, ప్రకాశ్, కార్తికేయన్, నారాయణమూర్తిలను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడితోపాటు మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితులంతా 22 నుంచి 25 ఏళ్ల లోపు వారే. వీరిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
కమల్ @ 65
గురువారం కమల్‌హాసన్ బర్త్‌డే. ఈ ఏడాదితో 65వ సంవత్సరంలో అడుగుపెట్టారు కమల్. అంతే కాదు నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. 5 ఏళ్ల వయసులోనే బాల నటుడిగా పరిచయం అయ్యారు కమల్. ఈ బర్త్‌డేను కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు కమల్‌హాసన్. కుటుంబ సమేతంగా (సోదరుడు చారుహాసన్, కుమార్తెలు శ్రుతీహాసన్, అక్షరాహాసన్) తమ స్వగ్రామం పరమకుడికి ప్రయాణం అయ్యారు. గురువారం నుంచి మూడురోజుల పాటు పుట్టినరోజు వేడుకలను ప్లాన్ చేశారు కమల్ కుటుంబ సభ్యులు. గురువారం తన తండ్రి (డి.శ్రీనివాసన్) విగ్రహాన్ని ఆవిష్కరించారు కమల్. శుక్రవారం దర్శకుడు బాలచందర్ విగ్రహావిష్కరణను ప్లాన్ చేశారు. కమల్ నటించిన ‘హే రామ్’ చిత్రం ప్రత్యేక ప్రదర్శన శనివారం చెన్నైలో జరగనుంది. ఇక పుట్టినరోజు సందర్భంగా కమల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. -
హార్ట్ బీట్‌ని ఆపగలరు!
‘‘చిన్న చూపుతో మన హార్ట్ బీట్‌ని ఒక్క క్షణం ఆపేయగలరు. టాలెంట్‌తో ఎవ్వరినైనా ముగ్ధుల్ని చేయగలరు టబు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలకు కలసి పని చేయాలనుకుంటున్నాం’’ అని టబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది ‘అల వైకుంఠపురములో..’ టీమ్. అంతేకాదు.. ఈ సినిమాలో టబు లుక్‌ను విడుదల చేశారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. పదకొండేళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో తెలుగు తెరపై కనిపించబోతున్నారు టబు. 2008లో వచ్చిన ‘పాండురంగడు’ టబు నటించిన చివరి తెలుగు చిత్రం. -
ఓ మై డాగ్!
ఇదేదో పిల్లల వేడుకలా కాకుండా పెద్దవాళ్లు సైతం పెద్ద సంఖ్యలోనే పాల్గొంటున్నారు. అతిథులు కూడా తమ ఫ్యామిలీ ఫ్రెండ్ కోసం కానుకలు సైతం బహుకరిస్తున్నారు. బంధు మిత్రులు సపరివార సమేతంగా, తమ పెట్స్‌తో సహా అటెండ్ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో వేడుకల్లో భాగంగా పెట్స్ ర్యాంప్‌వాక్ వంటివి కూడా జోడిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మన హృదయపు సింహాసశనమున శునకము తిష్ట వేసుకుని కూర్చుంది. ఒకప్పుడు కాపలా కాసే విశ్వసనీయ జంతువుగానే ఉన్నా తర్వాత నేస్తంగా మారి.. ఇప్పుడు సమస్తమైపోయింది. అందుకే దాని పుట్టిన రోజు మనకి పండుగ రోజులా చేస్తున్నారు. అందుతగ్గట్టే సిటీలో పెట్ బర్త్‌డే ఈవెంట్స్ సందడిగా జరుగుతున్నాయి. పెట్ ఫుడ్ తయారీకి పేరొందిన ‘లిలీస్ కిచెన్’ వెల్లడించిన సర్వేలో పెట్ డాగ్స్ బర్త్‌డేల పట్ల పెట్ ఓనర్స్‌లో ఆసక్తి బాగా పెరిగిందని తేలింది. దేశవ్యాప్తంగా తాజాగా నిర్వహించిన ఈ సర్వేలో 75 శాతం మంది పెట్స్ యజమానులు వాటి పుట్టినరోజు తప్పనిసరిగా జరుపుతున్నారని తేలింది. ఇందులో 58 శాతం మంది ‘హ్యాపీ బర్త్‌డే’ పాట కూడా పాడుతున్నామంటున్నారు. తమ కుటుంబంలో పెట్ కూడా ఒక భాగమని 41 శాతం మంది చెప్పగా, 14 శాతం మంద్రి మరింత ముందుకు వెళ్లి కన్నబిడ్డలతో సమానమని చెప్పారు. అంతా ఎంతో ప్రత్యేకం కేక్స్ నుంచి డ్రింక్స్ దాకా నగరంలో సిటీజనుల బర్త్‌డే వేడుకలు విలాసవంతంగా జరుగుతాయి. అయితే, తాము పెంచుకుంటున్న పెట్స్ కోసం కూడా భారీ స్థాయిలో ఖర్చు పెడుతుండడం విశేషం. అచ్చం తమ చిన్నారుల కోసం చేసినట్టే కేక్ కటింగ్, బెలూన్ డెకరేషన్, ప్రత్యేక థీమ్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు.. ప్రత్యేకంగా రెస్టారెంట్స్, కాఫీషాప్స్ వంటి పార్టీ ప్లేస్‌లను ఈ ఈవెంట్స్ కోసం ఎంచుకుంటున్నారు. తమ పెట్‌కి ఆ రోజు డిఫరెంట్‌గా, వెరైటీగా వస్త్రధారణ చేస్తున్నారు. మొత్తమ్మీద ఒక పూర్తి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్‌గా పెట్స్ బర్త్‌డే పార్టీస్ మారాయంటున్నారు గచ్చిబౌలిలో పెట్స్ కేఫ్ నిర్వహిస్తున్న రుచిర. కేక్స్ స్పెషల్ కూడా.. గతంలో పెట్‌కు పుట్టిన రోజు వేడుక చేయడం చాలా అరుదుగా ఉండేది. ఇప్పుడు బాగా పెరిగాయి. మా కేఫ్‌లోనే వారాని ఒకటైనా ఆ తరహా పార్టీ జరుగుతుంది. వీటిని పెట్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ లేకుండా పూర్తిగా ఆర్గానిక్ శైలిలో తయారయ్యే కేక్స్ వీటికి స్పెషల్. ఇక అతిథులుగా వచ్చే పెట్స్ కోసం చికెన్, మటన్, ఫిష్ వంటి ప్రత్యేక మెనూ ఉంటుంది. అలాగే డ్యాన్స్ ఫ్లోర్ కూడా రెడీ.– రుచిర, కేఫ్ డె లొకొ, పెట్స్ కేఫ్ -
నేను దారి తప్పకుండా అన్నయ్య కాపాడారు
‘‘ఈ రోజు ప్రత్యేకించి మీలో (అభిమానులు) ఒకడిగా నేనూ ఇక్కడికి వచ్చాను. నాకు స్ఫూర్తి ప్రదాత అయిన మా అన్నయ్య చిరంజీవిగారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. ఇది చాలా ప్రత్యేకమైన సంవత్సరం. ఓ అభిమానిగా అన్నయ్యను ఎలాంటి సినిమాలో చూడాలని ఉవ్విళ్లూరానో అలాంటి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’’ అన్నారు పవన్ కల్యాణ్ . నేడు చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బుధవారం జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘సైరా’ లో నటించినవారిలో నాకిష్టమైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు అన్నయ్యగారు, మరొకరు అబితాబ్ బచ్చన్‌గారు. వీళ్లిద్దరూ నాకు జీవితంలో చాలా బలమైన స్ఫూర్తి ప్రదాతలు. అమితాబ్‌గారిని కలిసే అరుదైన అవకాశం నాకు ‘సైరా’ షూటింగ్లో కలిగింది. అన్నయ్య నాకు స్ఫూర్తి ప్రదాత అని ఎందుకు అన్నానంటే.. ఆ మధ్య తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పదుల సంఖ్యలో చనిపోయినప్పుడు చాలా బాధ కలిగింది. జీవితంలో నేనూ అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు అన్నయ్యగారు నన్ను మూడు సార్లు దారి తప్పకుండా కాపాడారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పుడు నాకూ నిరాశ, నిస్పృహ కలిగింది. అన్నయ్య వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్‌తో కాల్చుకుందామనుకున్నా. ఆ డిప్రెషన్లో నేను ఏం చేసుకుంటానో అని మా వదిన, నాగబాబు అన్నయ్య కలిసి పెద్దన్నయ్య వద్దకు తీసుకెళ్లారు. ‘ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిలైనా మనిషిగా నువ్వు ఉండాలి. ఇలా చదువుకోకపోతే ఇంకోలా చదువుకో, అంతే కానీ డిప్రెషన్‌కి గురికావొద్దు’ అంటూ అన్నయ్య ఆరోజు చెప్పిన మాటలు నాకు కొండంత ఊపిరినిచ్చాయి. మొన్న చనిపోయిన విద్యార్థుల ఇళ్లల్లో అన్నయ్యలాంటి పెద్దవారు ఉండుంటే ఆ బిడ్డలు అలా అయ్యుండేవారు కాదేమో అనిపించింది. టీనేజ్‌లో ఉన్నప్పుడు భారతదేశాన్ని ఎవరైనా ఏదైనా అంటే కోపంతో ఊగిపోయేవాణ్ణి. నా కోపాన్ని చూసిన అన్నయ్య వీడు ఉద్యమకారుడు అయిపోతాడేమో అనుకుని, ‘కులం, మతం అనేవాటిని దాటి మానవత్వం అనేది ఒకటుంటుంది. దాన్ని నీ ఉద్యమంలో, ఆలోచనలో మరచిపోకు’ అన్నారు. హద్దులు దాటకుండా నన్ను ఆపేసిన మాట అది. జీవితంలో అనుకున్నవి ఏవీ సాధించలేకపోయానని 22 ఏళ్లప్పుడు తిరుపతిలో నిర్మాత తిరుపతి ప్రసాద్‌గారు యోగాశ్రమం పెడితే నేను వెళ్లిపోయి ఐదారు నెలలు మా అన్నయ్యకి కనిపించకుండా ధ్యానం, యోగాసనాలు చేసుకుంటూ ఉన్నా. ఆ తర్వాత మా అన్నయ్యతో ‘నాకేమీ అవసరం లేదు. నేను ఇలా వెళ్లిపోతాను’ అంటే, ఆయనన్న గొప్ప మాటలు నన్ను ఎంత మార్చేశాయంటే... ‘నువ్వు భగవంతుడివై వెళ్లిపోతే ఎలా? సమాజానికి ఎందుకు ఉపయోగపడలేవ్.. ఇంట్లో బాధ్యతలు అనేవి ఉంటే ఇలా మాట్లాడవు’ అన్నారు. దెబ్బలు తిన్నానో, కింద పడ్డానో, పైన పడ్డానో ఆ మాటలు ఈ రోజు నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాయి. అందుకే నాకు ఆయన చాలా స్ఫూర్తి ప్రదాత. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ‘సైరా’కి నేను గొంతు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మా అన్నయ్యకి ఇలాంటి ఓ సినిమా ఉండాలని కలలు కన్నాను కానీ, ఇలాంటి గొప్ప సినిమా తీసే శక్తి, సమర్థత నాకు లేకపోయాయి. కానీ, నా తమ్ముడులాంటి రామ్‌చరణ్.. ఎవరైనా కొడుకును తండ్రి లాంచ్ చేస్తాడు. కానీ, తండ్రి తిరిగి సినిమాల్లోకి రావాలనుకుంటే ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో లాంచ్ చేశాడు. చరిత్ర మరచిపోయిన నరసింహారెడ్డి జీవిత కథని ఎంతోమంది ఎన్నోసార్లు దశాబ్దాలుగా, చిత్ర పరిశ్రమ మద్రాసులో ఉన్నప్పటి నుంచి ఈ మాట వింటున్నా.. ఎవరికీ ధైర్యం సరిపోలేదు.. ఒక్క రామ్‌చరణ్‌కి తప్ప. ఇలాంటి సినిమా తీస్తే ఆ పాత్ర చిరంజీవిగారే చేయాలి, ఇలాంటి సినిమాని రామ్‌చరణే తీయాలి. అందుకనే సినిమాకి ఎన్ని వందల కోట్లైనా, ఆ డబ్బులు వస్తాయో రావో కానీ, మంచి బలమైన సినిమా తీయాలనుకున్నారు. ‘సైరా’ తో తన కలని సురేందర్‌రెడ్డిగారు నెరవేర్చుకున్నారు. మన దేశం, చరిత్ర గురించి ఎవరో రాసినదాని గురించి మనం మాట్లాడుతాం. సింహంలాటి వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చరిత్ర, భారతదేశ చరిత్ర ఆయన్ని మరచిపోయిందేమో కానీ, తెలుగునేల, మన కర్నూలు, రేనాడు, మన కొణిదెల మాత్రం మరచిపోలేదు. అలాంటి గొప్ప నేలలో పుట్టిన వీరుడి చరిత్రను సగర్వంగా తీశారు. మనందరికీ ఈ కథ చాలా స్ఫూర్తిదాయకం. కొణిదెల ప్రొడక్షన్ నుంచి ఇలాంటి సినిమా రావడం మాకు నిజంగా గర్వకారణం. కొణిదెల నామధేయాన్ని సార్థకత చేసుకున్నారు. ఇలాంటి గొప్ప సినిమాలో చిన్న పాత్రలో అయినా నేను నటించలేకపోయాను. కానీ, గొంతుతో ‘సైరా నరసింహారెడ్డి’ అనగలిగానంటే నా గుండె లోతుల్లోంచి, ఓ అభిమాని నుంచి వచ్చిన పిలుపది. అన్నా నువ్వు బద్దలుగొట్టగలవు, అన్నా నువ్వు చరిత్ర తిరగరాయగలవు. అన్నా మేము మీకు బానిసలం, దాసోహం.. అందుకే నేను అరిచానన్నా. చరిత్ర మరచిపోయిన వీరుణ్ణి వెలికి తీసిన అన్నయ్య చిరంజీవిగారికి, కథా రచయితలకు, సురేందర్‌రెడ్డి, రామ్‌చరణ్‌గార్లకు, నా తల్లితర్వాత తల్లిలాంటి మా వదినగారికి(సురేఖ), నటీనటులందరికీ, ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్‌గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘చిరంజీవిగారు చాలా కాలం జీవించాలి.. జై ‘సైరా నరసింహారెడ్డి’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘హ్యాపీ బర్త్ డే పెద్దమావయ్య. ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి సినిమాలు మీరు ఇంకా ఎన్నో చేస్తూ ఉండాలి’’ అన్నారు సాయిధరమ్ తేజ్. నిర్మాత వెంకటేశ్వరరావు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, చిరంజీవి చిన్న అల్లుడు, హీరో కళ్యాణ్‌దేవ్, ఐపీఎస్ అధికారి టి. మురళీ కృష్ణ, నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిజ్ఞాపకం ‘పార్టీ’ నే
సాక్షి సిటీబ్యూరో: ఎవరైనా విందు చేసుకుంటున్నారంటే అది వారికి ప్రత్యేకమైన రోజై ఉంటుంది.. పుట్టినరోజో..పెళ్లిరోజో.. అయి ఉండవచ్చు. అందుకే ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడానికి పార్టీ చేసుకోవడం సరదా. అయితే ఇపుడు పరిస్థితి మారిపోయింది. ప్రతి సంతోషా న్ని విందు రూపంలో నలుగురితో పంచుకోవడం అలవాటుగా మారిపోయింది. పరీక్షల్లో ఉత్తీర్ణులైనా, వీసా వచ్చినా, విదేశీ ప్రయాణం అయినా ఏదైనా పార్టీ చేయాల్సిందే. అది కూడా మాములుగా కాదు..హంగామా ఉండాల్సిందే. ఇదీ ఇప్పటి కల్చర్. గతంలో కూడా పార్టీలు జరిగేవి కానీ ఈ స్థాయిలో కాదు. నేడు ప్రతి చిన్నా జ్ఞాపకాన్ని నగర ప్రజల డిఫరెంట్‌గా పార్టీ చేసుకుంటు న్నారు. ఇటీవల నగరంలో పార్టీ కల్చర్ విపరీతం గా పెరిగింది. పాతబస్తీలోని డబీర్పూర్లో నివా సం ఉండే ఓ కుటుంబ సభ్యులకు తమ అమ్మా నాన్నల పెళ్లిరోజు... పాతికేళ్ల వివాహ ఉత్సవాన్ని ఘనంగా చేయాలనే ఆలోచన వచ్చింది. తాము ఎక్కడో దూరంగా ఉన్నా.. దగ్గరగా ఉన్న అను భూతి కలగాలనేది .. ఆ అన్నాచెల్లెళ్ల అంతరంగం. వారం ముందుగానే బంధువులు.. స్నేహితులకు సమాచారం చేరవేశారు. ఆ రోజు.. ఎవరెవరు ఏమి చేయాలో నిర్ణయించుకున్నారు. ఉదయాన్నే.. గులాబీపూలతో తల్లిదండ్రులకు అభినందనలు పంపారు. మరో గంటలో కొత్త వస్త్రాలు వచ్చాయి. రాత్రి 10 గంటలకు.. ఇంటి వాతావర ణం పూర్తిగా మారిపోయింది. రుచికరమైన వంటకాలు.. ఆప్యాయతను పంచే ఆత్మీయుల మధ్య.. కేక్ కోసి... మరచిపోలేని జ్ఞాపకంగా ఉత్సవాన్ని ఆస్వాదించారు. ఇదంతా.. తమ పిల్లలు ఏర్పాటని తెలుసుకుని సంతోషించారా పెద్దలు. జీవిత బాగస్వామి కోసం పెళ్లయిన నాటి నుంచి తన మ్యారేజ్ డేను ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాడు చిక్కడ్పల్లి నివాసి. తన జీవిత భాగస్వామితో మ్యారేజ్ డే వినూత్నంగా చేయాలనుకున్నాడు. అ రోజు రాగానే లవ్‌సింబల్ బెలూన్లూ... వీనులవిందైన సంగీతం.. ఇలా.. ఆమెకు.. తొలి బహుమతిని ఇచ్చి ఆశ్చర్య పరిచాడు. మధ్యాహ్నం హెలికాప్టర్లో విహరిస్తూ.. నగరాన్ని చుట్టొచ్చారు.. ‘ఇది.. అతిగా అనిపించినా.. మా మధ్యన మరిం త స్నేహాన్ని.. ప్రేమను పెంచేందుకు ఉపయోగపడుతుంది’ అంటూ ఆనందంగా తన అనుభవాన్ని పంచుకున్నాడు... . తన భార్య కళ్లలో ఆ క్షణం కనిపించిన మెరుపు తనకు గొప్ప బహు మతి అంటూ తన అనుభూతిని వివరించాడు. జ్ఞాపకం ఎదైనా మారుతున్న కార్పొరేట్ సంస్కృ తికి తగినట్లుగా.. వేడుకలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. అందించే కానుకలూ సరికొత్తగా కనిపిస్తున్నాయి. కొత్తదనాన్ని ఎప్పుడూ స్వాగతించే నగరవాసులు.. ఇప్పుడు పార్టీలు.. వేడుకల్లోనూ అదే ధోరణిని అనుసరిస్తున్నారు. మారిన అభిరుచికి తగినట్లు ఉత్సవాలను కోరినట్టుగా చేసేందుకు పలు ఈవెంట్ సంస్థలు ముందుకువచ్చాయి. భావోద్వేగ బహుమతులు భార్యాభర్తలు.. అన్నదమ్ములు.. అక్కచెల్లెళ్లు.. స్నేహితులు.. సహోద్యోగులు.. ఇలా ప్రతిచోటా ఒకర్నొకరు ప్రేమ, ఆప్యాయతలను పంచుకుంటూ ముందుకు వెళుతుంటారు. సరదాలు.. సంబరాలు.. ఉత్సవాలు.. వంటి సమయాలో తమ అభిమానం వ్యక్తీకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. ‘పెద్దల సమ్మతితో కుదిరిన పెళ్లి.. ఎంగేజ్మెంట్ వేళ కాబోయే భార్యకు బహుమతి ఇవ్వాలనుకున్నా.. అది ఆమె పనిచేసే ఆఫీసులో ఇచ్చి ఆశ్చర్యపరచాలనుకున్నా. పెళ్లికి ముందుగానే నా ప్రేమను చెప్పేందుకు తనకు ఇష్టమైన బహుమతిని ఇచ్చి మా ఇద్దరి ఆలోచన ఒక్కటే అనే విషయాన్ని తనతో పంచుకున్నా’నంటూ వివరించాడు కార్పొరేట్ ఉద్యోగి. గతంలో పోలిస్తే గతంతో పోలిస్తే చాలా మార్పు కనిపిస్తుంది. అవతలి వారి మెప్పుపొందాలనే ఉద్దేశంతో కాకుండా తమ ప్రేమను వ్యక్తీకరించాలనే ఆలోచన పెరుగుతుందంటున్నారు ఈవెంట్ నిర్వాహకులు. ఉద్యోగ, వ్యాపార నిర్వహణలో తలమునకలవుతున్న వారంతా ఏడాదికోసారి వచ్చే వేడుకలను గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావిస్తున్నారు. సామాజిక హోదాను ప్రతిబింబించేలా కాకుండా.. తన వారితో ఆప్యాయతను పంచుకునేలా మలచుకుంటున్నారు. ఇప్పటి యువతీ, యువకులు తాము జీవితంలో స్థిరపడ్డాక.. అమ్మానాన్నలకు తాము గొప్ప బహుమతులు ఇవ్వాలని ఉత్సాహం చూపటం.. తమకూ ఆనందంగా అనిపిస్తుందని తెలిపారు. బహుమతి ఇవ్వాల్సిందే భార్యాభర్తల మధ్య చిలిపి తగాదా.. మాటలు దూరం చేసిన వైరాన్ని ‘సారీ’తో భర్తీ చేయాలి. తనకు ఇష్టమైన కెరీర్లో ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్న భర్తకు ‘థ్యాంక్స్’ చెప్పాలి. కొత్త కంపెనీలో రేయింబవళ్లు పని చేసిన ఉద్యోగులకు అభినందలు పంచాలి. ఇలా.. ఆలుమగల నుంచి కార్పొరేట్ సంస్థల వరకూ...‘బహుమతి’ ఇవ్వటం ద్వారా తమ ప్రేమ, కృతజ్ఞతలను తెలుపుతున్నారు. బెలూన్లు, గులాబీపువ్వులు, గాల్లో చక్కర్లు, సంగీతకచేరి, ఖరీదైన కార్లు, బైక్‌లపై షికార్లు, ఎదుటివారిని ఆశ్చర్యంలో ముంచెత్తేలా... ఎన్నో అంశాలతో సృజనాత్మకతగా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. పండుగలు.. వేడుకలు.. వాలెంటైన్స్ డే.. ఫ్రెండ్‌షిప్‌డే.. మదర్స్‌డే.. ఫాదర్స్‌డే ఇలా ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన థీమ్స్‌తో అవతలి వారికి ప్రేమతో షాక్‌లిస్తూ సంతోషాన్ని పంచటం కొత్త అనుభూతిని మిగుల్చుతుందంటున్నారు నిర్వాహకులు. -
హీరో బర్త్‌డే.. బంగారు ఉంగరాలను పంచిన ఫ్యాన్స్
పళ్లిపట్టు: నటుడు విజయ్ 45వ పుట్టినరోజు సందర్భంగా శనివారం అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. పళ్లిపట్టు రాధానగర్ విజయ్ ప్రజా సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు హరి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు లింగన్ పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. ఇందులో రామదాసు, రాజ, శశి, స్టాలిన్, సుదీష్, దురై సహా అనేక మంది పాల్గొన్నారు. అలాగే కరింబేడు విజయ్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక షిర్డీ సాయి మందిర్‌లో బాబాకు ప్రత్యేక పాలాభిషేకం, పూజలు చేశారు. విజయ్ పేటి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. ఇందులో చారుకుమార్, ధరణి, చెంచయ్య, తిరుమలయ్య, గణేశ్, పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. వేలూరులో సినీ నటుడు విజయ్ 45వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. విజయ్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్మురుగన్ అధ్యక్షతన అభిమానులు వేలూరు శిశుభవన్‌లోని కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వేలూరు పెట్లాండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం జన్మించిన చిన్నారులకు బంగారు ఉంగరాలను వేశారు. వేల్మురుగన్ మాట్లాడుతూ రానున్న సూపర్ స్టార్ విజయ్ జన్మదినోత్సవ వేడుకలను అభిమానుల ఆధ్వర్యంలో శిశు భవనంలో అన్నదానం చేయడం ఆత్మ సంతప్తినిస్తుందన్నారు. త్వరలో తమ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. శిశు భవన్‌లోని పిల్లలకు అన్నదానం చేసి దుస్తులను దానంగా చేస్తున్నామన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన చిన్నారులకు ఉంగరాలు వేశామన్నారు. కార్యక్రమంలో విజయ్ అభిమానుల సంఘం కార్పోరేషన్ అధ్యక్షుడు శంకరన్, కార్యదర్శి సురేష్, భరత్, డివిజన్ కార్యదర్శి రాజేష్, జాయింట్ కార్యదర్శి వివేక్, విజయ్ మండ్ర అధ్యక్షుడు శరవణన్, రేణు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో అభిమానులు విజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. -
భార్గవ రామ్ @ 1
చిన్న తనయుడు భార్గవ రామ్ పుట్టినరోజున (శుక్రవారం) హీరో ఎన్టీఆర్ రెట్టింపు ఆనందంతో సమయాన్ని గడిపారు. ఆ మధుర జ్ఞాపకాలను ఫొటోలుగా మలిచి అభిమానులతో షేర్ చేసుకున్నారు ఎన్టీఆర్. ‘‘భార్గవ రామ్ ఏడాది పూర్తి చేసుకున్నాడు’’ అన్నారు ఎన్టీఆర్. 2011లో లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2014లో ఈ దంపతులకు అభయ్ రామ్ జన్మించాడు. రెండో కొడుకు భార్గవ రామ్‌కు ఈ శుక్రవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అన్నదమ్ములిద్దర్నీ ఫొటో తీసి, దాన్ని కూడా షేర్ చేశారు ఎన్టీఆర్. ఇక సినిమాల విషయానికి వస్తే... రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ మరో హీరో. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించే పేర్లలో ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్, తమిళ దర్శకుడు అట్లీ పేర్లు వినిపిస్తున్నాయి. -
ప్రాణం తీసిన బర్త్‌డే బంప్స్
-
ఈ తరహా బర్త్‌డే బంప్‌లు వద్దురా నాయనా!
సాక్షి, హైదరాబాద్ : బర్త్‌డేను స్నేహితుల మధ్య కేకు కట్ చేసి సెలెబ్రేట్ చేసుకుంటాం. ఇంకాస్త పెద్దగా అంటే ఓ పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి విందిస్తాం. కానీ ఈ తరం యువత వినూత్న పోకడలతో బర్త్‌డే సంబరాలు చేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. కేకు కట్ చేసిన అనంతరం ఆ కేకును బర్త్‌డే బాయ్‌కి పూయడం, అతని ముఖానికి కొట్టడం వంటివి ఇప్పటి వరకు చూశాం. కానీ ఈ మధ్య బర్త్‌డే బాయ్‌ను చితక్కొట్టె నూతన సంప్రదాయనికి తెరలేపారు. కేకు కట్ చేసిన అనంతరం కిందపడేసి మరి చితకబాదుతున్నారు. ఇలానే రెండు నెలల క్రితం ఐఎమ్ఎమ్ విద్యార్థి తీవ్రంగా గాయపడి తుదిశ్వాస విడిచాడు. బర్త్‌డే సందర్భంగా అతడు స్నేహితులకు పార్టీ ఇవ్వగా.. ఆ పార్టీలో అతని స్నేహితుల పిచ్చి పీక్స్‌కు చేరి.. అతన్ని చితక్కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ బర్త్‌డే బాయ్ మరుసటి రోజు తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరి మృతి చెందాడు. స్నేహితుల దాడిలో అతని క్లోమం పూర్తిగా దెబ్బతినడంతోనే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు పేర్కొన్నారు. ఇక ఈ ఘటన రెండు నెలల క్రితమే జరిగినా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. భారత మాజీ క్రికెటర్ ఈ తరహా బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకోవద్దని కోరుతూ ఈ వీడియోను షేర్ చేశాడు. ‘ ఇది చాలా బాధకరం. ఓ విద్యార్థి బర్త్‌డే సంబరాల కారణంగా చనిపోయాడు. ఇది అమానుషమైన దాడి.. ఈ విధంగా ఎవరూ సెలబ్రేట్ చేసుకోవద్దు. దయచేసి బాధ్యతాయుతంగా ఉండండి. ఈ తరహా బర్త్‌డే బంప్స్ వద్దు. ఇది ఎవరికి ఫన్నీ కాదు.’ అని పేర్కొన్నాడు. ఇక టాలీవుడ్ డైరెక్టర్ హరీశంకర్ సైతం ఈ తరహా బర్త్‌డే సంబరాలను నిషేదించాలని ట్వీట్ చేశాడు. నెటిజన్లు సైతం ఇదెక్కడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌రా నాయనా అంటూ కామెంట్ చేస్తున్నారు. This is so sad. A student who was given birthday bumps passed away. This is an assault and no way to celebrate. Please be responsible and no birthday bumps ,it isn't funny for anyone. pic.twitter.com/RoOY7hVe9Y — Virender Sehwag (@virendersehwag) May 2, 2019 This is ridiculous one should make a strict rule to ban this kind of celebrations ..... https://t.co/ZVUELvMOnH — Harish Shankar .S (@harish2you) May 1, 2019 -
ఘనంగా వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలను శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. విశాఖ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కొయ్యా ప్రసాద్ రెడ్డి, రొంగలి జగన్నాథం, పీలా ఉమారాణి, గరికిన గౌరీ, పీలా వెంకటలక్ష్మీ, మాజీ కార్పొరేటర్లు రమణి, మొల్లి అప్పారావు, హేమలతతో పాటు పెద్దు ఎత్తున వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి తన నివాసంలో విజయమ్మ పుట్టిన రోజు వేడుకులను ఘనంగా జరిపారు. కేకు కట్ చేసిన అనంతరం 500 మందికి చీరలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే కేక్‌ను కట్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో డాక్టర్ వైఎస్ విజయమ్మ సేవా సమితి అధ్యక్షుడు సంపత్ కుమార్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నేతలు రమేష్ రెడ్డి, పైలా నరహింహయ్యలు హాజరయ్యారు. ఒంగోలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గంగడ సుజాత ఆధ్వర్యంలో వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యకర్తలు కేక్ కోసి విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
సేవ చేస్తుంటే కామెంట్లు చేస్తున్నారు!
‘‘మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షునిగా రెండేళ్లు పూర్తయింది. ఆర్టిస్టులంతా మరోసారి అధ్యక్షుడిగా ఉండాలని కోరారు. నేను ఉండను.. ఎవరైనా పోటీ చేయండి అని అన్నాను. కానీ ఈ ఒక్కసారికి చేయండి అంటూ ఆర్టిస్టులు అడిగారు’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో పంచుకున్న విశేషాలు... ► నాకు పుట్టినరోజులు చేసుకునే అలవాటు లేదు. 32ఏళ్ల కెరీర్లో పరిశ్రమలో ఇదే తొలిసారి. ఓసారి మిత్రుల కోసం బర్త్ డే పార్టీ ఇచ్చాను. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే జరుపుకుంటున్నా. ► ‘మా’ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ సంవత్సరం ఇది. ఏ గొడవలు లేకుండా సంతోషంగా ముందుకు సాగాలి. కష్టాల్లో ఉన్నవారికి సాయపడే తత్వం నాది. ఈ రెండేళ్లలో రకరకాల సేవలు చేసాను. దానిపై కామెంట్లు చేయడం బాధ అనిపించింది. ఈసారి తనీష్, ఖయ్యూమ్ లాంటి యువకులు మా ప్యానెల్లో పోటీ చేస్తున్నారు. భవిష్యత్ తరం బావుండాలనే ప్రయత్నమిది. ► మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికల్లో ఎవరైనా పోటీకి దిగొచ్చు. ‘మీ అబ్బాయి హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు.. హ్యాపీగా ఉండొచ్చు కదా? అంటే.. నా చుట్టూ ఉన్నవారికి మంచి చేసేందుకు ఇలా చేస్తున్నా. ► ఆర్టిస్టులకు గోల్డేజ్ హోమ్(ఓల్డేజ్ హోమ్) నిర్మాణం నా డ్రీమ్. ఈ హోమ్ నిర్మాణానికి హీరో, దర్శకుడు రంగనాథ్గారి మరణమే కారణం. ఆయన చివరి రోజుల గురించి అందరికీ తెలిసిందే. ఇందుకోసం ఓ ఎన్నారై ఆరు ఎకరాల భూమిని దానమిస్తానన్నారు. శంకర్పల్లి సమీపంలో పది ఎకరాలు ఇచ్చేందుకు వేరొక వ్యక్తి సిద్ధంగా ఉన్నారు. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఫైనల్ చేయాల్సి ఉంది. ‘గోల్డేజ్ హోమ్’ కోసం ఇప్పటికే కొన్ని విరాళాలు అందాయి. -
కేసీఆర్‌కు ‘ఫ్యామిలీ’ బర్త్‌డే గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన (ఫిబ్రవరి 17) వేడుకల సందర్భంగా ఆయన అభిమానులు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగానే ఆయన కుటుంబ సభ్యులు మొక్కలు నాటి కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రగతి భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘మా కుటుంబ సభ్యుల్లో ప్రతీ ఒక్కరు ఒక్కో మొక్క నాటాము. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండు జీవితం గడపాలని కోరుకుంటున్నాము. అరుదైన నాయకుడు, ధైర్యం, నిబద్ధత కలిగిన పోరాట యోధుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఆయన మా తండ్రి అయినందుకు ఎంతో గర్విస్తున్నా’ను అని కేటీఆర్ ట్వీట్ చేశారు. -
మాయావతి జన్మదిన వేడుకలు.. కేకు కోసం కక్కుర్తి
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన 63వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా జరుపుకున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీఎస్పీ చీఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్ వైభవంగా జరిపడంతో పాటు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఐతే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోరాలో జరిగిన వేడుకల్లో పార్టీ నిర్వాహకులకు ఊహించని ఘటన ఎదురైంది. (కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠమే: మాయావతి) ఒక్క కేక్ ముక్క కోసం జనాలు ఎగబడ్డారు. తొక్కిసలాట జరుగుతుందా? అన్నట్లుగా తోసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు తీసుకోవాలంటూ.. నిర్వాహకులు ఎంత అరిచినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఎవరికి వారు చేతులు పెట్టి కేక్ లాక్కోవడంతో.. అది చితికిపోయింది. క్షణాల్లోనే కేక్‌ని లూటీ చేసి... ఆదరబాదరగా లాగించేశారు. అనంతరం అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా ఏఎన్ఐ ట్వీట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. (ఎస్పీ, బీఎస్పీ.. చెరో 38) #WATCH: People loot cake during an event in Amroha, on Bahujan Samaj Party (BSP) chief Mayawati's 63rd birthday today. pic.twitter.com/8Q4bDWdr66 — ANI UP (@ANINewsUP) 15 January 2019 -
కేతిరెడ్డి నా బాగు కోరే ఆత్మీయుడు
‘‘కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. నేను చిత్రం మూవీస్ సంస్థను స్థాపించడానికి కారణమైనవాళ్లలో ఆయన ఒకరు. ‘జయం, నిజం’ లాంటి హిట్స్ తీసేందుకు తన వంతు కృషి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే నా బాగు కోరే ఆత్మీయుడు. తమిళనాడులో తెలుగు వారి సమస్యలపై ఆయన చేసిన ఉద్యమాలు అభినందనీయం. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు’’ అని డైరెక్టర్ తేజ అన్నారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, ‘లక్మీస్ వీరగ్రం«థం’ సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు శనివారం తేజ ఆధ్వర్యంలో జరిగాయి. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ– ‘‘తేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలను ఒక ఆత్మీయ వేడుకగా భావిస్తాను. తేజ తెరకెక్కిస్తోన్న ‘సీత’ చిత్రకథ నాకు తెలుసు. ఈ సినిమా కచ్చితంగా తేజ జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. త్వరలో ‘చిత్రం మూవీస్ సంస్థ’ ద్వారా తేజ కుమారుణ్ణి హీరోగా పరిచయం చేస్తూ, ఓ మల్టీ లాంగ్వేజ్ సినిమా నిర్మించనున్నాం. నేను తెరకెక్కిస్తోన్న ‘లక్మీస్ వీరగ్రంథం’ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు దువ్వాసి మోహన్, మహేశ్, మీసం సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ ముఖ్యం
సినిమా రిలీజ్ అయితే చాలు... బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు, స్మాల్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు టీఆర్పీలు రాకెట్లలా పైకి వెళ్తుంటాయి. ఇది బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ స్టామినా, స్టార్డమ్. కానీ ఇవేమీ తనకు పట్టవంటారు భాయ్. బాక్సాఫీస్ కోట్ల కన్నా, టీఆర్పీ అంకెల కన్నా ప్రేక్షకుల ప్రేమ, ఆదరణే ఎక్కువ అంటున్నారు ఆయన. గురువారం సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. ముంబైలోని పన్వేల్ ఫామ్‌హౌస్‌లో తన ఫ్యామిలీ, ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్‌తో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారాయన. దానికంటే ముందు బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ – ‘‘ఎంతోమంది ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు అనే విషయం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. స్టార్డ్డమ్ ముఖ్యమే, కానీ వాళ్ల ప్రేమకంటే పెద్దదిగా మాత్రం అనిపించదు. ప్రేక్షకులను అలరించడానికి ఇలానే కష్టపడుతుంటాను’’ అని పేర్కొన్నారు. ఇది సల్మాన్ 53వ పుట్టినరోజు. మరి.. భాయ్ బ్యాచిలర్హుడ్కి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. -
న్యూ ఇయర్‌కి మా అమ్మకిచ్చే గిఫ్ట్ అదే : సల్మాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురువారం 53వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పుట్టిన రోజు చేసుకునే వారికి అందరు కానుకలు ఇవ్వడం సహజం. కానీ అందుకు భిన్నంగా సల్మానే తన తల్లికి గిఫ్ట్ ఇవ్వనున్నారంట. న్యూ ఇయర్‌కి గాను తన తల్లి సుశీలా చరక్‌కు ఓ స్పేషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అన్నారు సల్మాన్. ఈ విషయం గురించి సల్మాన్ మాట్లాడుతూ.. ‘నాలుగు రోజుల క్రితం మా అమ్మ న్యూ ఇయర్‌కు ఏం తీర్మానం చేసుకుంటున్నావని అడిగింది. అందుకు నేను ఏం లేదని చెప్పాను. అప్పుడు మా అమ్మ ఇప్పుడు నీకు ఫోర్ ప్యాక్ బాడీ ఉంది. కానీ వచ్చే ఏడాదికి గాను సిక్స్ ప్యాక్ బాడీ చూడాలనుకుంటున్నాను అని చెప్పింద’న్నారు. అందుకే నేను మరింత క్రమశిక్షణగా ఉంటూ.. మా అమ్మ కోరిక నేరవేర్చాలనుకుంటున్నానని చెప్పారు. అంతేకాక ‘సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం జిమ్‌కు వెళ్తున్నాను. గంటసేపు రన్నింగ్ చేస్తున్నాను. నా ఆహారపు అలవాట్లను కూడా కంట్రోల్ చేసుకుంటున్నాన’ని చెప్పుకొచ్చారు. కాగా బుధవారం రాత్రి నుంచి సల్మాన్ ఫాం హౌస్ పాన్వెల్లో బర్త్‌డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో సల్మాన్ కుటుంబంతో పాటు సుస్మితా సేన్, కృతి సనన్, కత్రినా కైఫ్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు. పార్టీలో సుస్మిత, సల్మాన్ కలిసి డ్యాన్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. -
కువైట్‌లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
కువైట్ : వైఎస్సార్సీపీ కువైట్ యువజన విభాగం, ఎస్సీ ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో 'జగనోత్సవం' పేరుతో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 50 మందికి పైగా రక్తదానం చేశారు. భారీ కేక్ కట్ చేసి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ శాసనమండలి సభ్యులు బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ డి.సి. గోవింద్ రెడ్డి, బద్వేల్ సమన్వయకర్త డా. వెంకట సుబ్బయ్య, పోరుమామిళ్ల మండల అధక్షులు సి. విజయప్రతాప్ రెడ్డి, అట్లూరు మండల అధ్యక్షులు ఆర్.మల్లికార్జునరెడ్డి, బద్వేల్ బూత్ కన్వీనర్ ఇంచార్జ్ కె. వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కువైట్‌లోని ప్రవాసాంధ్రులు భారీగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డి, వైఎస్సార్సీపీ కువైట్ కార్యవర్గ సభ్యుల సహాయసహకారంతో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా చేస్తున్న సామాజిక సేవల గురించి వివరించారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలో రావడం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని ముఖ్య అతిథులకు విజ్ఞప్తి చేశారు. డి.సి. గోవింద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దుష్ట పాలన నుండి ప్రజలను రక్షించాలంటే జగన్‌ని ముఖ్యమంత్రి చేసుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అసలు తాను ఈ రోజు కువైట్‌లో ఉన్నట్లు లేదని, బద్వేల్లో ఉన్నట్లు ఉందన్నారు. డా. వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో ప్రజా సంక్షేమ పథకాలన్నీ మరుగున పడిపోయాయని, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ లాంటి మహోన్నతమైన పథకాన్ని పూర్తిగా పేద ప్రజలనుండి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి పాలనను అంతమోందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సి. విజయప్రతాప్ రెడ్డి, మల్లికార్జునరెడ్డి, కె. వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ కువైట్ లో ఉన్న మన వారు చూపిస్తున్న అభిమానం విలువ కట్టలేనిదని, 2019లో ఎన్నికల సమయంలో మీరందరు మీ మీ స్వస్దలాలకు వచ్చి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలనీ అభ్యర్థించారు. కార్య నిర్వాహుకులు మర్రి కళ్యాణ్, బి.ఎన్. సింహా మాట్లాడుతూ తమ తమ నియోజకవర్గాలలో ఎన్నో పనులున్నా తమ ఆహ్వానం మన్నించి జగనోత్సవం కార్యక్రానికి వచ్చిన అతిథులకు, ఈ కార్యక్రమము నిర్వహించేందుకు సహాకారించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమములో కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం. వి. నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, తెట్టు రఫీ, అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్, ప్రతినిధి పి. సురేష్ రెడ్డి, సలహాదారుడు అన్నాజీ శేఖర్ బిసిసెల్ ఇంచార్జ్ రమణయాదవ్ రావూరి రమణ, మైనారిటీ ఇంచార్జ్ షేక్ గఫార్, సభ్యులు షా హుస్సేన్, , సోషల్ మీడియా ఇంచార్జ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సేవాదళ్ ఇంచార్జ్ గోవిందు రాజు, సుబ్బారావు, సాంస్కృతిక విభాగం ఇంచార్జ్ వాసు, గౌస్ బాషా, రహమతుల్లా, యు. రమణ రెడ్డి, లలితరాజ్, మహబూబ్ బాషా, బద్వేల్ నియోజకవర్గ ప్రవాసులు, వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు భారీగా పాల్గోన్నారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. అభిమానులు కేక్ కట్ చేసి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిడ్నీ విభాగం గౌరవాధ్యక్షులు శ్రీరంగారెడ్డి, తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు గోవిందరెడ్డి, ప్రకాష్ రెడ్డి, శిరీష్, రామి రెడ్డి, తరుణ్, వెంకట్, రాకేష్, రమణ, రఘు, దామోదర్, శ్రీనివాస్, విష్ణు మహిళా సభ్యులు సుజాత, భారతి రెడ్డి, మను రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరంగ రెడ్డి మాట్లాడతూ, తెలంగాణలో వచ్చిన ఫలితాలే ఏపీలో రానున్న ఎన్నికల్లో పునావృతమవుతాయని, టీడీపీ ఓటమి ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. తిమ్మారెడ్డి మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్లుగా వైఎస్ జగన్ ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారని, ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గోవింద రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను వైఎస్ఆర్సీపీ తరఫున గెలిపించుకోని రాష్ట్రంలో మరలా రాజన్న స్వర్ణయుగ పాలన సాధించుకుందామన్నారు. ప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రి చేసేందుకు ఎన్నారైలు తమ తమ నియోజకవర్గల్లో పార్టీ కార్యక్రమాల్లో సహయ, సహకారాలు అందించాలని కోరారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్‌కే సాధ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అండగా నిలుస్తామని ఎన్ఆర్ఐలు తెలిపారు. -
వైఎస్ జగన్‌కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. 'పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ జగన్‌గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ట్వీట్ చేశారు. శుభాకాంక్షలు తెలిపినందకు ధన్యవాదాలు చంద్రబాబునాయుడుగారు అంటూ వైఎస్ జగన్ బదులిచ్చారు. వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో, నిండునూరేళ్లు జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని మంత్రి గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు. Thank you for the wishes, @ncbn garu — YS Jagan Mohan Reddy (@ysjagan) December 21, 2018 ఈ ఏడాది మీకు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిజంగా ప్రత్యేకమైందిగా ఉండబోతోందనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలనని జనతాదళ్ (యునైటెడ్) ప్రధాన కార్యదర్శి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. Thank you for the wishes @PrashantKishor — YS Jagan Mohan Reddy (@ysjagan) December 21, 2018 -
హైదరాబాద్‌లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
తైముర్ @ 2
సౌతాఫిక్రాలో సాగర తీరాన హాయిగా సేద తీరుతున్నారు సైఫ్ అలీఖాన్ అండ్ కరీనా కపూర్. వారితో పాటు ఈ దంపతుల ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్ ఉండకుండా ఉండడు కదా. పైగా తైముర్ పుట్టిన రోజు కూడా. అవును.. తైముర్ రెండో పుట్టినరోజు వేడుకలు సౌతాఫ్రికాలో జరిగాయి. కొన్ని ఫొటోలను కరీనా కపూర్ సోషల్ మీడియాలో పంచుకోగా మరికొన్ని వైరల్ అయ్యాయి. కాగా సౌత్ ఆఫ్రికాకి వెళ్లక ముందు ముంబైలో సన్నిహితులు, స్నేహితులకు ప్రీ–బర్త్‌డే పార్టీ ఇచ్చారు సైఫీనా. ఆడంబరాలకు దూరంగా కేవలం తమ సమక్షంలోనే తనయుడి బర్త్‌డే జరగాలని సౌతాఫ్రికా వెళ్లారు. ‘‘తైముర్ని అందరూ సెలబ్రిటీలా చూస్తున్నారు. తనకు నార్మల్ లైఫ్ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాం’’ అని ఓ సందర్భంలో కరీనా అన్నారు. అందుకే పుట్టిన రోజు వేడుకల్ని ఇలా ప్లాన్ చేశారేమో. ఇక సినిమాల విషయానికి వస్తే... అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ‘తానాజీ’ చిత్రంలో నటిస్తున్నారు సైఫ్. అలాగే ‘వీరే ది వెడ్డింగ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన కరీనా ‘గుడ్‌న్యూస్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. -
సౌదీ అరేబియాలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
జెడ్దా : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సౌదీ అరేబియాలోని ప్రవాసాంధ్రులు ఘనంగా జరిపారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ ప్రచార కన్వీనర్ షేక్ సలీమ్ తాను ఉద్యోగం చేస్తున్న ప్రైవేట్ కంపేనీలో సహచరులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ముందుగానే తమ అభిమాన నేత పుట్టినరోజు వేడుకలు జరపడం ఆనందంగా ఉందని సలీమ్ పేర్కొన్నారు. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా జననేతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సలీమ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రి చేసేందుకు ఎన్నారైలు తమ తమ నియోజకవర్గల్లో పార్టీ కార్యక్రమాల్లో సహయ, సహకారాలు అందించాలని కోరారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అన్నీ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్ కే సాధ్యమన్నారు. తప్పకుండా మనమందరం కలిసి రాష్ట్రంలో మైనార్టీలకు మేలుచేసిన నాయకుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ గెలుపు కొసం అల్ల్హాని దువా చేస్తూ, అలానే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రచార కార్యక్రమాలను విసృతంగా జరపాలని కొరారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను వైఎస్సార్సీపీ తరఫున గెలిపించుకోని రాష్ట్రంలో మరలా రాజన్న స్వర్ణయుగ పాలన సాధించుకుందామన్నారు. ముఖ్యంగా మైనార్టీలను నాలుగున్నరేళ్ళుగా మోసం చేసిన చంద్రబాబును మైనార్టీలోకం క్షమించదని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సంజీవనైనా ప్రత్యేకహోదా జగన్ ద్వారానే సాధ్యమని, కాబట్టి రాష్ట్ర ప్రజానికం ఆలోచించి విజ్ఞతతో ఓటేయాలని సూచించారు. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం చేస్తున్నా నక్కజిత్తుల రాజకీయాలను గ్రహించాలన్నారు. కార్యక్రమంలో షేక్ సలీంతో పాటు, అబ్దుల్ హమీద్, ఆమీర్, మహ్మద్ సిరాజ్, షేక్ ఫరీద్, సిరాజుద్దీన్, బిన్ సాద్, మథిన్, అక్రమ్, ఇమ్రాన్ తదితరులు పాల్గోన్నారు. -
లండన్‌లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
లండన్ : వైఎస్సార్సీపీ యూకే, యూరోప్ వింగ్ కన్వీనర్ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు లండన్‌లో ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ యూకే, యూరోప్ సభ్యులు తమ కుటుంబసభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టిన రోజు కాగా, లండన్‌లోని ఈస్ట్ హమ్లోని హైదరాబాద్ పారడైజ్ రెస్టారెంట్లో ముందుగానే తమ అభిమాన నేత పుట్టినరోజు వేడుకలు జరపడం ఆనందంగా ఉందని ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అండగా నిలిస్తామని ఎన్ఆర్ఐలు తెలిపారు. ఏపీలో వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనంటూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు దివంగత సీఎం రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు. -
ఆస్ట్రేలియాలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సిడ్నీ : ఆస్ట్రేలియాలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ముందస్తుగా జరుపుకున్నారు. ఆసీస్ తెలుగు అసోసియేషన్ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టిన రోజు కాగా, ముందుగానే తమ అభిమాన నేత పుట్టినరోజు వేడుకలు జరపడం ఆనందంగా ఉందని ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు. ఏపీలో వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనంటూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. -
గోవాలో సెలబ్రేషన్స్
భార్య బర్త్‌డే పెట్టుకుని ఎవరైనా షూటింగ్‌తో బిజీ బిజీగా ఉంటారా? ఉండరు కదా. స్మాల్ బ్రేక్ ఇచ్చయినా సరే భార్య ముందు వాలిపోతారు. అదే చేశారు అభిషేక్ బచ్చన్. భార్య ఐశ్వర్యారాయ్ బర్త్ డే (గురువారం) సెలబ్రేషన్స్ కోసం అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ‘లైఫ్ ఇన్ ఏ మెట్రో’ సీక్వెల్ షూట్‌కు బ్రేక్ ఇచ్చి గోవాలో వాలిపోయారు అభిషేక్. అక్కడ ఐశ్వర్యారాయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్నేహితులకు అదిరిపోయే పార్టీ కూడా ఇచ్చారట అభిషేక్. ‘‘హ్యాపీ బర్త్ డే వైఫ్. ఐలవ్యూ’’ అని ఆయన ఐశ్వర్యకు విషెశ్ చెప్పారు. తన బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఐశ్వర్య. 1994లో మిస్ వరల్డ్‌గా నిలిచిన ఐశ్వర్యారాయ్ అప్పుడు ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అంతే అందంగా ఉన్నారని నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. అన్నట్లు.. ఐశ్వర్య వయసు ఎంతో తెలుసా? 45లోకి అడుగుపెట్టారు. -
హ్యాపీ బర్త్‌డే మోదీజీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 68వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఆయనకు ప్రముఖ నేతలు, రాజకీయ ప్రత్యర్థులతో పాటు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులకు ట్విటర్లో ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక తన పుట్టిన రోజు వేడుకల్ని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు ఉన్నారు. ‘ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుస్సుతో, మరెంతో కాలం దేశ ప్రజల సేవకు ఆయన అంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని కోవింద్ ట్వీట్ చేశారు. మాల్టా పర్యటనలో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడారు. మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తన సందేశంలో రాహుల్ పేర్కొన్నారు. కొద్దిసేపు టీచర్ అవతారమెత్తిన మోదీ 68వ పుట్టినరోజు వేడుకల్ని తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ జరుపుకున్నారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించిన మోదీ దాదాపు 30 నిమిషాల పాటు పూజలు నిర్వహించారు. డెరెకా ప్రాంతంలో ఉన్న ప్రాథమిక పాఠశాల స్కూలు పిల్లలతో ముచ్చటించారు. టీచర్ అవతారమెత్తి వాళ్లకు పలు అంశాల్ని బోధించారు. ప్రశ్నించేందుకు విద్యార్థులు ఎన్నడూ భయపడవద్దని.. నేర్చుకోవడంలో అదే కీలకమని వారికి చెప్పారు. ‘విశ్వకర్మ జయంతి రోజున నేను మీ పాఠశాలకు వచ్చాను. ఈ ప్రత్యేకమైన రోజున మీ అందరికీ శుభాకాంక్షలు’ అని ప్రధాని పేర్కొన్నారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలో 568 కిలోల లడ్డూను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీలు ఢిల్లీలో ఆవిష్కరించారు. షికాగోలో 13,000 ఎత్తులో విమానం నుంచి దూకి మోదీకి శుభాకాంక్షలు చెబుతున్న స్కైడైవర్ శీతల్ మహాజన్ -
బర్త్‌డే గిఫ్ట్
అక్టోబర్ 18న జ్యోతిక బర్త్‌డే. ఆ రోజు సూర్య ఏం గిఫ్ట్ ఇస్తారో చెప్పలేం కానీ, ‘కాట్రిన్ మొళి’ టీమ్ మాత్రం ఆమెకో గిఫ్ట్ ఇవ్వనుంది. ఇటీవలే ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా యూనిట్ సభ్యులకు పట్టు చీరలు, పట్టు పంచెలు, పట్టు చొక్కాలు బహుకరించారు జ్యోతిక. ఆమె బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్ డిసైడ్ అయింది. సో.. ‘కాట్రిన్ మొళి’ అక్టోబర్ 18న రిలీజ్ కానుందన్నమాట. విద్యా బాలన్ హిందీ హిట్ మూవీ ‘తుమ్హారీ సులు’కి రీమేక్ ఇది. జ్యోతికతో పదేళ్ల క్రితం ‘మొళి’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన రాధామోహన్ ఈ రీమేక్‌కి దర్శకుడు. ఆల్రెడీ హిందీలో హిట్టయిన చిత్రం కాబట్టి రీమేక్ కూడా హిట్ కావడం గ్యారంటీ అని ఫిక్స్ అవ్వొచ్చు. సినిమా బాగా వస్తోందని యూనిట్ అంటోంది. సో.. ఈ చిత్రవిజయం జ్యోతికకు మంచి బర్త్‌డే గిఫ్ట్ అవుతుందని చెప్పొచ్చు. -
ఖరీదైన పుట్టిన రోజు వేడుకలు.. ఎక్కడంటే
ఫజియాబాద్, యూపీ : ఖైదీలనగానే వారి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని.. కనీసం వారిని మనుషులుగా కూడా చూడరనే నమ్మకం ఒకటి జనాల్లో బాగా పాతుకుపోయింది. ఫజియాబాద్‌కు చెందిన జైలు అధికారులు ఈ విషయాన్ని నిజం కాదని నిరూపించే ప్రయత్నం చేశారు. జైలులో ఉన్న ఓ ఖైదీ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటానని కోరగా అనుమతివ్వడమే కాక అందుకు తగిన ఏర్పాట్లను కూడా చేశారు అధికారులు. కానీ ఆ ఏర్పాట్ల కోసం తీసుకున్న మొత్తమే ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. శివేంద్ర అనే వ్యక్తి ఫజియాబాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నెల 23న అతని పుట్టిన రోజు. దాంతో జైల్లోనే పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలనుకున్న శివేంద్ర, అందుకు అనుమతివ్వాల్సిందిగా అధికారులను కోరాడు. అధికారులు ఒప్పుకోవడమే కాక, పుట్టిన రోజు నిర్వహించుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లును కూడా పూర్తి చేశారు. శివేంద్ర ఫోటో ప్రింట్ చేసిన కేక్ తీసుకొచ్చారు. అనంతరం జైలులోనే ఇతర ఖైదీల నడుమ శివేంద్ర పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. అయితే ఇందుకు గాను అతని దగ్గర నుంచి ఏకంగా లక్ష రూపాయలను తీసుకున్నారని సమాచారం. అయితే ఎలా లీక్ అయ్యిందో ఏమో కానీ ఈ పుట్టినరోజు వేడుకల వీడియో ఒకటి లీక్ అయ్యి, సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై అధికారులు మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం యోగి ఆదిత్యానాథ్ సర్కార్‌ను తీవ్రంగా తప్పు పడుతున్నారు. డబ్బు ఇస్తే చాలు, ఖైదీలు ఏం అడిగినా అధికారులు ఏర్పాటు చేస్తారా అని విమర్శిస్తున్నారు. కానీ కొందరు మాత్రం అధికారులు తీరు మీద సెటైర్లు వేస్తున్నారు. ‘జైలులో ఉన్నంత మాత్రానా మనుషులం కాకుండా పోతామా. పుట్టిన రోజు లాంటి వేడుకలు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సాధారణంగా మధ్యతరగతి ఇళ్లలో పుట్టిన రోజు ఖర్చు మహా అయితే ఓ పదివేల రూపాయలుంటుంది. కానీ ఇది జైలు కదా.. అందుకే ఖర్చు కాస్తా ఎక్కువయ్యింది. ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా’ అంటూ చురకలేస్తున్నారు. -
మళ్లీ కలిశారు
మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ మళ్లీ కలిశారు. రీసెంట్గా మహేశ్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం ‘భరత్ బహిరంగ సభ’ సందర్భంగా ఈ ముగ్గురు స్టార్లు కలిసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ దర్శకుడు వంశీ పైడిపల్లి బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చారు. ఇలా టాప్ హీరోలందరూ విభిన్న సందర్భాలలో ఒకే ఫ్రేమ్‌లోకి రావడం ఇండస్ట్రీలోని మంచి వాతావరణానికి సంకేతమని ఇండస్ట్రీ వాసులు అనుకుంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో ఎన్టీఆర్, ‘ఎవడు’ సినిమాలో రామ్‌చరణ్ ఇప్పుడు తాజా సినిమాలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బృందావనం, ఎవడు, ఊపిరి’ వంటి విజయాలతో దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్న వంశీ పైడిపల్లి జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకల్లో నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ పూజా హెగ్డేలతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
బర్త్‌డేకి బండొచ్చింది
ఈనెల 28న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ బర్త్ డే. 28 రాకముందే బాలీవుడ్ డైరెక్టర్ ఆకర్ష్ ఖురానా నుంచి అడ్వాన్స్ బర్త్‌డే ప్రజెంట్ అందుకున్నారట దుల్కర్. ‘కార్వానా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు ఈ మలయాళ హీరో. ఇందులో ఇర్ఫాన్ ఖాన్, మిథిలా పాల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ట్రావెల్ బేస్డ్ మూవీలో ఎక్కువ శాతం వ్యాన్ మీదే ప్రయాణిస్తారు దుల్కర్, ఇర్ఫాన్. ఇప్పుడు అదే వ్యాన్‌ను దుల్కర్‌కి గిఫ్ట్‌గా ఇవ్వదలిచారట దర్శకుడు ఆకర్ష్. ‘‘సినిమా షూటింగ్ ఎక్కువ శాతం ఈ వ్యాన్లోనే జరిగింది. దుల్కర్, నేను ఈ వ్యాన్‌తో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యాం. అలాగే ఆటోమొబైల్స్ మీద దుల్కర్‌కు ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే ఈ బహుమతి అయితే బావుంటుందని భావించాను’’ అని ఆకర్ష్ పేర్కొన్నారు. -
‘అల్లూరి’ పోరాట స్ఫూర్తి మనందరిలో ఉండాలి
రైల్వేకోడూరు : అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి మనందరిలో ఉండాలని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి , జెడ్పీటీసీ మారెళ్ల రాజేశ్వరి, పార్టీ పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్ పిలుపునిచ్చారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. సమాజం, రాష్ట్రం కోసం పోరాడాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మందల నాగేంద్ర, ఇనమాల మహేష్, సుబ్బరామరాజు, ఎంపీటీసీలు మందల శివయ్య, ఆవుల రవిశంకర్, రత్తయ్య, గంగయ్య, రాజా పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాట సమరయోధుడు అల్లూరి రైల్వేకోడూరు అర్బన్ : స్వాతంత్య్ర పోరాట సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని అల్లూరి యువజన సేవా సంఘం నాయకులు పేర్కొన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా బుధవారం సంఘం నాయకులు స్థానిక టోల్గేట్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు నాటి పోరా టాలే.. నేడు మనందరికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. బీజేపీ ఇన్చార్జి గల్లా శ్రీనివాసులు, అల్లూరి యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం చంగల్ రాజు, ఓబులవారిపల్లె ఎంపీపీ వెంకటేశ్వర రాజు, క్షత్రియ సంఘం నాయకులు బలరామరాజు, తోట శ్రీనివాసులు, జయప్రకాశ్ నారాయణ వర్మ, సుబ్బరామరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రవికుమార్‌రాజు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకోవాలి బొమ్మవరం(ఓబులవారిపల్లె): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీపీ వెంకటేశ్వరరాజు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా బుధవారం బొమ్మవరం ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా బొమ్మవరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలో వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, ప్యాడ్స్ తదితర విద్యాసామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్వతంత్య్రం సాధించడంలో బ్రిటీష్ దొరలను దేశం నుంచి తరిమికొట్టేందుకు చేసిన పోరాటాలు గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు గడ్డం చెంగల్రాజు, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన్యంవాసుల్లో ధైర్యం నింపిన వీరుడు పీవీజీపల్లె(పుల్లంపేట): మన్యంవాసుల్లో ధైర్యం నింపిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని వక్తలు పేర్కొన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా బుధవారం పీవీజీ పల్లె ఉన్నత పాఠశాలలో ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కే కృష్ణవేణి మాట్లాడుతూ తెల్లదొరలను ఎదిరించి గిరిజనులకు అండగా నిలిచిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఉపాధ్యాయురాలు భారతి ఆధ్వర్యంలో జయంతి సభను నిర్వహించారు. భారతి మాట్లాడుతూ మన్యం వాసుల కష్టాలను కడతేర్చడానికి బ్రిటీష్ వారిని ఎదిరించిన ధీరుడు అల్లూరి అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు రెడ్డి ప్రసాద్, తెలుగు పండితులు గంగనపల్లె వెంకటరమణ, పీఈటీ చంద్రకుమార్, సుబ్బరామిరెడ్డి, శివశంకర్‌రాజు, సుజిత, నవీన్‌కుమార్ ప్రసంగించారు. -
హ్యాపీ బర్త్‌డే
‘హ్యాపీ బర్త్‌డే నరేశ్’ అంటూ మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి విషెస్ చెబితే, ‘అల్లరి’ నరేశ్ బర్త్‌డే కేక్ కట్ చేశారు. నరేశ్ బర్త్‌డే డెహ్రాడూన్‌లో జరిగింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు, పూజా హెగ్డే జంటగా ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. శనివారం ‘అల్లరి’ నరేశ్ బర్త్‌డే. ఆయన బర్త్‌డే సెలబ్రేషన్ సినిమా టీమ్ సమక్షంలో జరిగింది. ‘‘మా రవికి (సినిమాలో క్యారెక్టర్ పేరు) జన్మదిన శుభాకాంక్షలు. మీతో అద్భుతమైన టైమ్ స్పెండ్ చేస్తున్నాను. రాబోయే సంవత్సరాలు కూడా మీకు బెస్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు వంశీ పైడిపల్లి పేర్కొన్నారు. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పూజా హెగ్డే, శిరీష్, కెమెరామేన్ కేయు మోహనన్ పాల్గొన్నారు. ఈ సినిమా షెడ్యూల్ విషయానికి వస్తే.. జూలై సెకండ్ వీక్ వరకూ డెహ్రాడూన్‌లో కాలేజ్ సీన్స్ షూట్ చేయనున్నారట. ఆ తర్వాత అమెరికా షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు. -
సార్.. టైం ప్లీజ్!
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ‘‘తెలంగాణలో పార్టీ బలంగా ఉంది. కానీ, నేతల మధ్య సమన్వయం లేదు. భేదాభిప్రాయాలతో కొంత నష్టం జరుగుతోంది. మీరు చొరవ తీసుకుని సమన్వయం కుదర్చాలి. అందుకు తగిన సమయం కేటాయించాలి..’’ అని కోరారు. పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర పార్టీ సీనియర్లందరితో చర్చించి తగిన కార్యాచరణ రూపొం దించాలన్నారు. బుధవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారమే రాహుల్ పుట్టినరోజు అయినా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో బుధవారం కలిశారు. ఈ బృందంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, శ్రీధర్‌బాబు, గండ్ర వెంకట రమణారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, బండ కార్తీకరెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ బృందం విజ్ఞప్తి పట్ల రాహుల్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సమయం ఇస్తానని హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఒకట్రెండు నిమిషాలపాటు విడిగా రాహుల్‌తో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ‘‘తెలంగాణలో పార్టీ వేగం తగ్గింది. సీనియర్ నేతలందరితో విడివిడిగా చర్చించి కార్యాచరణ రూపొందించాలి. నాయకత్వంపై దృష్టిపెట్టాలి..’ అని విన్నవించగా.. మళ్లీ ఓసారి సమావేశమై లోతుగా చర్చిద్దామని రాహుల్ పేర్కొన్నట్టు తెలిసింది. సీనియర్ నేతలతోనూ భేటీ.. రాహుల్‌ను కలసిన అనంతరం కోమటిరెడ్డి వెంకటరె డ్డి సోదరులు, డీకే అరుణ, రేవంత్‌రెడ్డి తదితరులు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్‌తో భేటీ అయ్యారు. ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదని, పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి కుంతియాతో మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ, రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు విడివిడిగా మంతనాలు జరిపారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని, మార్పులు చేపట్టాలని వారు పేర్కొన్నట్టు తెలుస్తోంది. పార్టీ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాతోనూ పలువురు నేతలు సమావేశమయ్యారు. మూకుమ్మడిగా పాదయాత్ర.. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసం పాదయాత్ర చేయాలని పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దల వద్ద ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు పార్టీలోని నేతలంతా మూకుమ్మడిగా పాదయాత్ర చేయాలనే అభిప్రాయం వ్యక్తమైందని తెలిసింది. దీనికి పార్టీ పెద్దల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫిర్యాదులు చేశారన్న వార్తలు అవాస్తవం: కుంతియా రాహుల్ గాంధీకి పలువురు టీ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేశారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా చెప్పారు. బుధవారం సాయంత్రం ఆయన ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర నాయకత్వంపై నేతలు రాహుల్‌కు ఫిర్యాదు చేసినట్టు కొన్ని టీవీల్లో వచ్చింది. ఎవరూ ఎవరికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయలేదు. అది కేవలం ఉత్త ప్రచారమే. నేను అక్కడే ఉన్నా.. నేతలంతా రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే వచ్చారు. నిన్న (మంగళవారం) సమయం దొరకకపోవడంతో బుధవారం కలిశారు. పలు ఇతర రాష్ట్రాల నేతలు కూడా కలసి శుభాకాంక్షలు చెప్పారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రెండు రోజుల ముందే ఢిల్లీకి వచ్చి రాహుల్‌ను కలిసి వెళ్లారు. అంతేతప్ప ఈరోజు ఎవరూ ఎవరిమీద ఫిర్యాదు చేయలేదు..’’అని తెలిపారు. ఉత్తమ్ టీపీసీసీ చీఫ్‌గా ఉంటే 15 సీట్లు కూడా గెలవలేమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారంటూ వచ్చిన వార్తలను ప్రస్తావించగా.. ‘‘ఆ విషయంపై నాకు సమాచారం లేదు. రాహుల్ వద్ద ఎలాంటి సంప్రదింపులు జరగలేదు..’’అని కుంతియా స్పష్టం చేశారు. -
ఆ వార్తలకు ఇలా చెక్ పెట్టారు..
సాక్షి, పట్నా : ఆర్జేడీ నేతలు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్‌ల మధ్య విభేదాలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 71వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లాలూ కుటుంబ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ మధ్య విభేదాలు లేవంటూ యాదవ్ సోదరులు సంకేతాలు పంపినా పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాల్లో మాత్రం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం తేజ్ ప్రతాప్ చేసిన ట్వీట్లో తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని పేర్కొనడంతో కుటుంబ సభ్యుల్లో విభేదాలపై ఊహాగానాలు చెలరేగాయి. తాను అస్త్రసన్యాసం చేసి అర్జునుడికి (తేజస్వి యాదవ్) వాటిని అందిస్తానని మహాభారతాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అయితే ఈ వార్తలను తేజ్ ప్రతాప్ తోసిపుచ్చారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కాగా, పశుగ్రాసం కేసులో లాలూ ప్రస్తుతం బిర్సాముందా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 2013 నుంచి చోటుచేసుకున్న నాలుగు పశుగ్రాస కుంభకోణం కేసుల్లో లాలూను దోషిగా నిర్ధారించారు. ఇక దుంకా ట్రెజరీ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
మద్యం మత్తులో యువకుడి దారుణ హత్య
హన్మకొండ చౌరస్తా : ‘మా అన్న కొడుకు పుట్టిన రోజు మీరంతా తప్పకుండా రావాలి రా..’ అన్న స్నేహితుడి ఆహ్వానంతో వచ్చిన ఐదుగురు మిత్రుల్లో ఒకరు విగతజీవిగా మారాడు. అప్పటి వరకు పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న వారంతా.. వేడుక అనంతరం మందు పార్టీలో మునిగిపోయారు. పుల్లుగా తాగిన స్నేహితుల్లో ఇద్దరి మధ్య రాజుకున్న చిన్న గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి క్షణికావేశానికి తోటి స్నేహితుడి నిండు ప్రాణం తీసింది. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీతో సందడిగా ఉన్న హన్మకొండ బస్టాండ్ ప్రాంతంలో అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో జరిగిన హత్యోదంతం కలకలం సృష్టించింది. హన్మకొండ ఏసీపీ రాజేంద్రప్రసాద్ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ప్రతాప్‌నగర్‌కు చెందిన శ్రీపతి అభిలాష్ అన్న కొడుకు మొదటి పుట్టిన రోజు వేడుకలను శనివారం సాయంత్రం హన్మకొండలో నిర్వహించారు. పుట్టిన రోజు ఫంక్షన్‌కు ఒకే ఊరికి చెందిన తన స్నేహితులైన ప్రతాప్ సురేష్(30), మోతె స్వామి అలియాస్ శ్యాం, కిరణ్, హరీష్‌లను ఆహ్వానించారు. వారంతా హన్మకొండకు చేరుకుని వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం రాత్రి 8.45గంటల సమయంలో నక్కలగుట్టలోని హోటల్ ల్యాండ్‌మార్క్ లో మద్యం తాగేందుకు వెళ్లారు. అక్కడ బాగా మద్యం తాగారు. కాగా ప్రతాప్ సురేష్ , మోతె స్వామి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సురేష్ పై స్వామి చేయి చేసుకున్నాడు. అక్కడ గొడవు ముదురుతున్న సమయంలో బార్లో నుంచి సెల్లార్ కు చేరుకున్నారు. అక్కడ మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఇంటికి వెళ్లేందుకు సురేష్‌ను వదిలేసి మిగిలిన నలుగురు హన్మకొండ బస్టాండ్ కు చేరుకున్నారు. మనస్థాపం చెందిన ప్రతాప్సురేష్ హన్మకొండలోనే ఉంటున్న తన పెద్దమ్మ కొడుకు మేకల సతీష్‌కు ఫోన్ చేసి తనను శ్యామ్ కొట్టాడని నువ్వు త్వరగా రావాలని మాట్లాడాడు. దీంతో సతీష్ బస్టాండ్‌కు చేరుకున్నాడు. అప్పటికే ఊరెళ్లడానికి బస్సు ఎక్కేందుకు వెళ్తున్న స్వామిని సురేష్ రెచ్చగొట్టాడు. స్వామి కోపోద్రిక్తుడై సురేష్ ఛాతి పై బలంగా గుద్దగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న హన్మకొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడు సురేష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా నిందితుడు మోతె స్వామి సెంట్రింగ్ పనిచేస్తున్నారు. కాగా నిందితుడు స్వామి , అతడి స్నేహితులు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలపారు. కాగా తెల్లవారుజామునే నిందితుడు స్వామితో పాటు స్నేహితులను అదుపులోకి తీసుకుని హత్యకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
మెదక్‌జోన్ : టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. మెదక్ ఏరియా ఆస్పత్రిలో రోగులకు, చర్చి కాంపౌండ్లోగల ఓల్డేజి హోంలో వృద్ధలకు పండ్లు పంపిపెట్టారు. అలాగే స్థానిక రాజీవ్‌భవన్, ఏరియా ఆస్పత్రిలో కేక్‌కట్ చేసి శశిధర్‌రెడ్డి లాంగ్‌లీవ్ అంటూ నినాదాలుచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మామిళ్ల ఆంజనేయులు, మేడి మధుసూదన్‌రావు, గూడూరి ఆంజనేయులు రవి, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొండ శ్రీనివాస్, జట్కా సందీప్ తదితరులు పాల్గొన్నారు. హవేళిఘణాపూర్(మెదక్) : మండల కేంద్రంలోని హవేళిఘణాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శశిధర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మామిండ్ల ఆంజనేయులు, నాయకులు ఏసురెడ్డి, సాప రవి, బచ్చు జగదీశ్వర్, నరేందర్ రెడ్డి, శ్రావణ్, కుమార్ తదితరులున్నారు. రామయంపేట(మెదక్) : మెదక్ మాజీ ఎమ్మేల్యే శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం రామయంపేట నాయకులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అహ్మద్, రొయ్యల పాచయ్య, కర్రె రమేష్, దోమకొండ వెంకటి, గౌస్ తదితరులు ఉన్నారు. చిన్నశంకరంపేట(మెదక్) : మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను చిన్నశంకరంపేట లో శుక్రవారం పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భర్త్‌డే కేక్ కట్‌చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, రమేష్ పాల్గొన్నారు. పాపన్నపేట(మెదక్) : మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి జన్మదిన వేడుకలను మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంతప్ప ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, డీసీసీ డైరెక్టర్ మల్లన్న, ఉప సర్పంచ్ కలీం, ఏడుపాయల మాజీ డైరెక్టర్ కిషన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు ఖాజా, నరేందర్‌గౌడ్, నసీరొద్దీన్, నిజాం, జకీర్, అన్నారం ఇమానియల్ పాల్గొన్నారు. ఇక ఏడుపాయల దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు శశిధర్‌రెడ్డి పేరిట పూజలు చేయించారు. -
ఘనంగా వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు
రాయచోటి రూరల్ : వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలను గురువారం రాయచోటిలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎస్ఎన్ కాలనీలోని తన కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి విజయమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురికి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు కుమార్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, సురేంద్ర, విష్ణు, జయరామిరెడ్డి, శివారెడ్డి, కొండారెడ్డి, మధుసూదన్ రాజు తదితరులు పాల్గొన్నారు. రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ విజయమ్మ జన్మదిన వేడుకల్లో భాగంగా వైఎస్ జగన్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అధ్వర్యంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అనంతరం శివాలయం, సాయిబాబా ఆలయంలో విజయమ్మ పేరుతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో శివానందరెడ్డి, సుబ్బరాయుడు, సుధాకర్ పాల్గొన్నారు. -
నేడు భూమన బర్త్ డే వేడుకలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి 60వ జన్మదిన వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. తిరుపతి లోని పద్మావతీపురం ప్రధాన రోడ్డు మొత్తం భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, మామిడి తోరణాలు, ఆహ్వాన ద్వారాలతో శోభాయమానంగా మారింది. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో సంబరాల ఏర్పాట్లు ఘనంగా పూర్తయ్యాయి. సుమారు ఐదువేల మంది అభిమానులు, శ్రేయోభిలాషులు విందు ఆరగిం చేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భూమన ఇంటిని ధగధగలాడే విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. కొబ్బరిబోండాంలు, అరటి పిలకలతో కూడిన స్వాగత తోరణాలు అడుగడుగునా ఏర్పాటు చేశా రు. బెంగళూరు, చెన్నై నుంచి రప్పిం చిన ఆర్కిటెక్టులు, డిజైనర్లతో రోడ్డంతా పందిళ్లు వేయించారు. భూమన ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో భారీ వేదిక నిర్మించారు. దీని మీదనే భూమన దంపతులకు షష్టిపూర్తి మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచే కార్యక్రమాలు గురువారం ఉదయం 7 గంటల నుంచే పుట్టిన రోజు వేడుకలు ప్రారంభం కానున్నాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చే పార్టీ అభిమానులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం అభిమానుల మధ్య కేక్ కటింగ్ ఉంటుంది. ఈ సందర్భంగా అభిమానులనుద్దేశించి భూమన మాట్లాడతారు. ఇది ముగిశాక పక్కనే ఉన్న వేదికపై షష్టిపూర్తి కార్యక్రమం మొదలవుతుంది. వేదపండితుల ఆశీర్వచనం, వేదమంత్రాల పఠనం, పెద్దల ఆశీస్సులు పూర్తయ్యాక విచ్చేసిన అభిమానులకు విందు కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమాలన్నింటినీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకలకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రముఖులతో పాటు భూమన శ్రేయోభిలాషులు, మిత్రులు, సాహిత్యాభిలాషులు హాజరవుతున్నారు. -
ఆమెది స్పందించే హృదయం..
సాక్షి, సిటీబ్యూరో: ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో ఇటీవల నిర్మించిన ‘తథాస్తు‘ షార్ట్ ఫిల్మ్ కేవలం ఒకే ఒక్కరోజులోనే లక్షకుపైగా వ్యూస్ దాటిన విషయం విదితమే. అది ఇప్పటికి 4 లక్షల వ్యూస్‌తో అందరి అభిమానం పొందుతోంది. ఇందుకు కారణం ‘ఎంతోమంది అనాథలుగా జీవనం కొనసాగిస్తున్న ఈ సమాజంలో ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారూ ఈ తరంలో ఎలా మార్పు తేవచ్చొ ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా దర్శకుడు ‘ఆర్పీ పట్నాయక్‘ అద్భుతంగా రూపొందించారు. ఇందులో ప్రధాన పాత్రను సుమ కనకాల పోషించారు. ఈ కథలో తమ పాప పుట్టిన రోజును అందరివలే సాదాసీదా పార్టీలతో కానిచ్చేయకుండా.. అనాథ పిల్లలతో కలిసి జరుపుకొని వారి కడుపు నిండటంతో పాటు ఆనందం పంచినట్టవుతుందని.. తన పాపకు సర్ప్రైజ్ ఇవ్వటమే ‘తథాస్తు’ అసలు సారాంశం. నిజంగా అలాగే.. కేవలం తాను నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ వరకే పరిమితం కాకుండా నిజజీవితంలో సైతం పుట్టిన రోజైన మార్చి 22న భర్త రాజీవ్ కనకాల, అత్త, కూతురు, బంధువులతో గురువారం సికింద్రాబాద్‌లోని ‘సర్వ్ నీడి’ అనాథాశ్రమానికి వచ్చారు సుమ. అక్కడి 30 మంది అనాథ పిల్లలతో మూడు గంటల పాటు గడిపారు. వారి ఆటాపాటలను వీక్షిస్తూ కబుర్లు చెప్పారు. పిల్లలకు మిఠాయిలు, పండ్లు పంచి పెట్టారు. కేక్ కట్ చేసి పిల్లలతో భోజనం చేశారు. సంస్థ నిర్వాహకుడు గౌతమ్‌కుమార్‌తో చర్చించారు. సంస్థ సేవలను కొనియాడారు. తన పుట్టిన రో జును అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం మరిచిపోని సంతృప్తినిచ్చిందని సుమ వివరించారు. ఆమెది స్పందించే హృదయం.. సుమ బుల్లి తెర యాంకర్ మాత్రమే కాదు. సందర్భాన్ని బట్టి ఎదుటి వారి అవసరాన్ని బట్టి స్పందించే హృదయం ఆమెది. సాటివారికి సాయం చేయాలనేది ఆమె మనస్తత్వం. ‘తథాస్తు’ షార్ట్ ఫిల్మ్‌లో నటించేందుకు రియల్ లైఫ్ జెన్యూన్ హ్యూమన్ కావాలనే ఉద్దేశంతో సుమను ఒప్పించాను. మా యూనిట్ తరపున ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు. – ఆర్పీ పట్నాయక్ -
జాన్వీ కపూర్ పుట్టినరోజు వేడుకలు
తల్లి శ్రీదేవి హఠాన్మరణం ఇచ్చిన షాక్ నుంచి జాన్వీ కపూర్ తేరుకుంటున్నట్లున్నారు. బుధవారం తన 21వ పుట్టినరోజుని జరుపుకున్నారు. ముంబైలోని ఒక ఓల్డేజ్ హోమ్‌కి వెళ్లి అక్కడ కేక్ కట్ చేశారామె. అక్కడి వాళ్లంతా ప్రేమతో జాన్వీకి బర్త్‌డే సాంగ్ పాడారట. కుటుంబసభ్యుల మధ్య కూడా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు జాన్వీ. ఈ వేడుకల్లో బోనీకపూర్, ఖుషీ కపూర్, సోనమ్ కపూర్, రేఖా కపూర్, అన్షులా కపూర్, శాన్య కపూర్, జాహన్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. -
బర్త్‌డే పార్టీలో విషాదం.. నలుగురి మృతి
-
బర్త్‌డే పార్టీలో విషాదం.. నలుగురి మృతి
లుధియాన : బర్త్‌డే పార్టీ ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. పార్టీకి వచ్చిన ఓ వ్యక్తి తాగిన మత్తులో హైటెన్షన్ వైర్ పట్టుకోవడంతో అతన్ని కాపాడేందుకు యత్నించిన మరో ముగ్గురు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. దీంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ హృదయ విచారక ఘటన పంజాబ్‌లోని లుధియానలో చోటుచేసుకుంది. మృతుల్లోని ఒకరి కూతురు బర్త్‌డే పార్టీలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం విచారకరం. ఒకరు తాగిన మైకంలో హైటెన్షన్ వైర్ పట్టుకోవడంతో మరో ముగ్గురు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ప్రమావదశాత్తు నలుగురికి విద్యుత్ షాక్ తగలడంతో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మండుటెండలో రెండు గంటలు
సాక్షి, బెంగళూరు: శాంతినగర్ ఎమ్మెల్యే ఎన్ఏ హ్యారిస్ పుట్టిన రోజు వేడుకలు విద్యార్థులకు శాపంగా మారాయి. ఎమ్మెల్యే రాక ఆలస్యంగా కావడంతో పిల్లలు రెండు గంటలపాటు మండుటెండలో ఉండాల్సి వచ్చింది. వివరాలు.. హ్యారిస్ పుట్టినరోజు వేడుకలు గురువారం శాంతినగర్ పోలీసు హాకీ మైదానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థులందరినీ తీసుకురావాల్సిందిగా ముందురోజు అన్ని పాఠశాలల యాజమాన్యాలకు నిర్వాహకులు ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులకు ఉచితంగా లంచ్ బ్యాగులు అందజేస్తామని ప్రకటించారు. వేడుకల ఆహ్వానాలను తిరస్కరించిన పాఠశాలలకు రవాణా సదుపాయాలను కల్పించి మరీ విద్యార్థులను మైదాన ప్రాంగణానికి నిర్వాహకులు చేర్చారు. అనుకున్నట్లుగానే ఉదయం 10.30కే విద్యార్థులు ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే విద్యార్థులు సమయానికి వచ్చినా ఎమ్మెల్యే మాత్రం రాలేకపోయారు. దీంతో విద్యార్థులు ఆయన కోసం మండుటెండలో రెండు గంటల వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఎమ్మెల్యే 12.30 గంటలకు తీరిగ్గా వచ్చినా వేడుకులను ముగించుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత విద్యార్థులకు ఉచిత లంచ్ బ్యాగులు బహూకరించి పంపించారు. మిట్టమధ్యాహ్నం ఎండలో చిన్నపిల్లలను అంతసేపు నిలబెట్టడంపై స్థానికులు, టీచర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
నువ్వులేక అనాథలం..
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా ఏ దైవమైన, ఏ ధర్మమైన నీలోనే చూశాము సాయి రావా బాబా.. రక్షా దక్షా నీవే కదా మా బాబా! ‘అందరినీ ప్రేమించు. ఎవరినీ ద్వేషించకు. తోటివారి బాధ నీదిగా భావించు. మానవ సేవే మాధవ సేవ’ అనే సత్యసాయి బోధన విశ్వ వ్యాప్తంగా సేవాకాంతులు ప్రజ్వలిస్తోంది. కులమతాలు.. ప్రాంతాలకు అతీతంగా ఆయన భక్తులు సేవా మార్గంలో పయనిస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యా బోధన.. మెరుగైన వైద్యం.. ప్రకృతి వైపరీత్యాల్లో సేవా కార్యక్రమాలు.. ఉన్నత వ్యక్తిత్వం పెంపొందించేందుకు సత్య బోధన.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ప్రపంచ సంతోషమే.. తమ సంతోషం’ అని చాటుతున్నారు. ఇప్పటికీ.. ఎప్పటికీ.. బాబా సేవలు అజరామరం. ఇప్పటి వరకూ ‘సత్యసాయి సెంట్రల్ ట్రస్టు’ ఇండియాలో ఏం చేసిందనేది అందరికీ తెలుసు. అయితే ప్రపంచవ్యాప్తంగా ట్రస్టు ఏం చేస్తోంది? భారత్ మినహా ఆఫ్రికా దేశానికి మాత్రమే వెళ్లిన సత్యసాయి విశ్వమానవాళిని ఎలా ప్రభావితం చేశారు? ‘ప్రపంచాన్ని సేవా మార్గం వైపు నడిపిస్తున్న ‘సాయిలీల’ ఏమిటి? అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షిప్రతినిధి, అనంతపురం: సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలపై బాబా ఉన్నన్నిరోజులు వీటి గురించి ఎక్కడా మీడియాలో కథనాలు రాలేదు. ఎందుకని ప్రశ్నిస్తే ‘నా ఇంట్లోకి పది మంది బంధువులు వచ్చి భోజనం చేసి వెళతారు. ఇది పత్రికకు వార్త కాదు కదా? అలాగే ప్రపంచమంతా నా కుటుంబం. మన ఇంట్లోవారికి చేసే సాయానికి ప్రచారమెందుకు?’ అని బాబా చెప్పిన మాటలను ట్రస్టు సభ్యులు గుర్తు చేశారు. భారత్ మినహా బాబా ఆఫ్రికాకు మాత్రమే ఒకసారి వెళ్లారు. అది మినహా మరేదేశానికీ వెళ్లలేదు. పుట్టపర్తికి వచ్చి బాబా బోధనలు విన్న విదేశీభక్తులు ‘స్ఫూర్తి’పొంది విదేశాల్లో సేవ చేయడం మొదలెట్టారు. దీన్ని అక్కడి వారు నిశితంగా గమనించారు. ‘ఉచితంగా రక్తం ఇస్తున్నారు. చికిత్స చేస్తున్నారు. భోజనం పెడుతున్నారు. చదువు చెబుతున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు.’ ఇంత మంచి కార్యక్రమాల్లో మనమూ భాగస్వాములు కావాలని భావించారు. ‘సాయిసేవ’లో సభ్యులయ్యారు. ఎంతలా అంటే అమెరికాలోని కొన్ని హెల్త్యూనివర్శిటీల డీన్లు కూడా సభ్యులుగా చేరి ‘సాయి మెడికల్ క్లినిక్’లలో సేవ చేస్తున్నారు. సత్యసాయిసేవలు విశ్వాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఈ ఘటనలతో సుస్పష్టమవుతుంది. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు స్వరూపం ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలున్నాయి. ఇందులో 123 దేశాల్లో సత్యసాయి ట్రస్టు సేవలందిస్తోంది. ప్రశాంతి సొసైటీ, వరల్డ్ ఆర్గనైజింగ్ కమిటీ, యూత్వింగ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ మొత్తం దేశాలను తొమ్మిది జోన్లుగా విభజించారు. అందులో రీజియన్లు, వాటిలో దేశాలుగా విభజించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తం రెండు వేల సెంటర్లుగా ఏర్పడిన ట్రస్టు... విద్య, వైద్యంతో పాటు పలు రకాల సేవలందిస్తోంది. ప్రశాంతి కౌన్సిల్ పేరుతో జరిగే ఈ కార్యక్రమాకు చైర్మన్‌గా లాస్ ఏంజెల్స్‌లోని ప్రముఖ వైద్యులు డాక్టర్ నరేంద్రనాథరెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వైద్య సేవ అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, సౌతాఫ్రికా, వెనుజులా, జర్మనితో పాటు చాలాదేశాల్లో ప్రపంచ ప్రసిద్ధులైన డాక్టర్లు కూడా సత్యసాయి భక్తులయ్యారు. వీరు తమ వత్తి చేసుకుంటూనే ఏడాదిలో రెండుసార్లు పుట్టపర్తికి వస్తారు. గురుపౌర్ణమి, సత్యసాయి జయంతికి ఇక్కడికి వచ్చి వారం రోజుల పాటు పేదరోగులకు ఉచితంగా వైద్యం, మందులు అందిస్తారు. దీంతోపాటు వారు నివసిస్తోన్న దేశాల్లో కూడా ‘ఫ్రీ మెడికల్ క్లినిక్’లు నిర్వహిస్తున్నారు. ‘మొబైల్ క్లినిక్’లకు కూడా శ్రీకారం చుట్టారు. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్‌తో పాటు చాలా దేశాల్లో మెబైల్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు. యువ రక్తం...సేవా మార్గం సత్యసాయి యూత్వింగ్ ఆధ్వర్యంలోనూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతేడాది పుట్టపర్తిలో వరల్డ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో 36 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూత్వింగ్ ప్రపంచాన్ని 11 జోన్లుగా విభజించి, 11 యువజన సంఘాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరు ఎక్కువగా ప్రకతి వైపరీత్యాలు జరిగే ప్రాంతాలకు హాజరవుతుంటారు. వీటితో పాటు మెడికల్ క్యాంపు, బ్లడ్ క్యాంపు, అన్నదానాలు, విద్యాబోధన చేయడంతో పాటు తోటి మనిషిపై సాటి మనిషి ఎలా ప్రేమ చూపాలి అనే కోణంలో అక్కడి ప్రజలకు చైతన్యం కల్గిస్తుంటారు. విద్యాబోధనపై ప్రత్యేక శ్రద్ధ భారత్ కాకుండా ఇతర దేశాల్లో 41 సత్యసాయి స్కూళ్లు ఉన్నాయి. 39 సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వీటిలో నాణ్యమైన, ఉన్నత విలువలతో కూడిన విద్యతో పాటు ‘సేవా మార్గాన్ని’ బోధిస్తున్నారు. బాబా సూక్తులు, వచనాలు, మనిషి పట్ల, సమాజం పట్ల సాటి మనిషికి ఉండాల్సిన బాధ్యతలపై బోధిస్తారు. సత్యసాయి విద్యాసంస్థల్లో బోధన, క్రమశిక్షణ చూసి అక్కడి పాఠశాలల యాజమన్యాలు ఇలాంటి బోధన జరిగేలా తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అడిగారు. ఆస్పత్రులలో కూడా సత్యసాయిభక్తులు రోగుల పట్ల వ్యవహరించే తీరు, చూపించే ప్రేమ తమ ఇన్స్టిట్యూట్లలో కూడా అందాలని అక్కడి ఆస్పత్రుల యాజమన్యాలు ట్రస్టులోని డాక్టర్లను తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తోంది. గతేడాది ట్రస్టు చేసిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు ♦ నైజీరియా, క్యూబాలో సాయి వాటర్ ప్రాజెక్టు నిర్మించి తాగునీరు అందించారు. ♦ కెన్యాలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ప్రత్యేక చికిత్స చేశారు. ♦ చైనాలో మొక్కలునాటే కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ రెగ్యులర్‌గా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ♦ దుబాయ్‌లో సత్యసాయి యువజన విభాగం ఆధ్వర్యంలో పేరెంట్స్ వర్క్‌షాపు నిర్వహించి, పిల్లలను ఎలాపెంచాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. స్వామి ప్రవచనాలను బోధించారు ♦ అబుదాబిలో అన్నదానం, రక్తదానం లాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ♦ బహ్రేయిన్లో స్కూలు పిల్లలతో మొక్కలు నాటించి పర్యావరణంపై వర్క్‌షాపు నిర్వహించారు. ♦ కాలిఫోర్నియాలో 400 మంది డాక్టర్లతో ఇంటర్నేషనల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ♦ సౌదీలో రంజాన్ సందర్భంగా అన్నదానం చేశారు. ♦ ఒమెన్‌లో 45 వర్క్‌షాపులు నిర్వహించారు. వీటిని మెచ్చుకుని అక్కడి విద్యాశాఖమంత్రి ట్రస్టుకు ప్రశంసాపత్రం అందజేశారు. ♦ కువైట్‌లో స్పెషల్నీడ్ చిల్డ్రన్స్‌కు పలు సేవలు చేశారు. యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమ్మర్‌క్యాంపు చేపట్టి సేవా కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు. ♦ నేపాల్ భూకంపం సమయం నుంచి అక్కడి శరణార్థులకు సేవలందిస్తున్నారు. ఖాట్మండు,, పొకారా, భరత్‌పూర్‌లో పైపులైన్లు ఏర్పాటు చేసి మంచినీళ్లు అందించారు. ♦ వెస్టిండీస్, ఇటలీలో పక్కా ఇళ్లు నిర్మించారు. ♦ 25 దేశాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిచారు. ఈ ఫొటోలో కన్పిస్తోన్న నర్సుపేరు కృష్ణలీల. ఆస్ట్రేలియా మహిళ. బాబా బోధనలకు ముగ్ధురాలై భక్తురాలైంది. కృష్ణలీల అని పేరు మార్చుకుంది. ఈమె బాబా జయంతి నవంబర్ 23 అంటే పది రోజులు ముందు వస్తుంది. మెడికల్ క్యాంపునకు కావల్సిన సౌకర్యాలను దగ్గరుండి చూస్తుంది. సొంత ఖర్చులతో మలేషియా నుంచి నర్సులను తీసుకొచ్చి ఇక్కడి సేవ చేయిస్తుంది. నెబులైజేషన్, బెడ్స్, మెడిసిన్స్ అన్నీ దగ్గరుండి చూస్తుంది. పేరు ఎందుకు మార్చుకున్నారని ప్రశ్నిస్తే ‘మతాలకు, కులాలకు అతీతమైంది మానవ సంబంధం. సాయిబోధనలో ఇది స్పష్టమైంది. ఈ విషయాలు పలు దేశాల్లో చెబితే మేమూ మీతో ఓ గంట సేవ చేస్తాం’ అని ముందుకొస్తున్నారు. పాత పేరు ఉంటే ఏంటని ప్రశ్నిస్తే...అది గతం. నాపేరు కృష్ణలీల. నేను పాటించేది ఇక్కడి సంస్కృతి అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో అన్నదానం సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులకోసం వచ్చే బంధువులకు భోజనం లభించడం కష్టమవుతోంది. దీంతో శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, ఏలూరు, భీమవరం, ఒంగోలు, నెల్లూరు, కడప, మెట్పల్లి, కరీంనగర్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, అదిలాబాద్ ఆస్పత్రులలో రోజూ 3,500 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. 20న గవర్నర్ రాక అనంతపురం అర్బన్: రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఈ నెల 20న పుట్టపర్తికి విచ్చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు శాంతి భవన్ చేరుకుంటారు. అక్కడ అల్పాహారం తీసుకుని 8.35 గంటలకు సాయి కుల్వంత్ హాల్లో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి వేద కాన్ఫరెన్స్, మల్టీ ఫెయిత్ సింపోజిమ్ ఆన్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీని ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు అక్కడి నుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళతారు. ఏటా వస్తుంటా నా వయస్సు 74 ఏళ్లు. 1984 నుంచి సేవాదల్లో పనిచేస్తున్నా! సత్యసాయి ఇంటర్నేషనల్ మెడికల్ క్యాంపునకు హాజరవుతాంటా! పేదవారికి సేవ చేసినప్పుడు కలిగే తప్తి మళ్లీ పుట్టపర్తికి వచ్చే వరకూ ఉంటుంది. సత్యసాయి భోదనలు ఒంటపడితే అందరూ ప్రేమ, సేవకు బానిసలు కావల్సిందే! అదే సాయిలీల మహత్యం. – ఉడో ఫ్రెజల్, జర్మనీ సేవలతో ప్రభావితం ఏడాదికి రెండుసార్లు ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహిస్తుంటాం. నా భార్యతో కలిసి కొద్దిరోజులు ముందుగానే వచ్చి ఏర్పాట్లు చూసుకుంటా. ఇక్కడ చికిత్స చేసే డాక్టర్ల పిల్లలతో పాటు సేవలందించే విదేశీ భక్తుల పిల్లలు మెడికల్ క్యాంపు చూసి, వారు కూడా డాక్టర్ కావాలని తల్లిదండ్రులతో చిన్నపుడే చెబుతున్నారు. పదేళ్ల వయసు నుంచే డాక్టర్ కావాలనే సంకల్పంతో చదివి డాక్టర్లు అయిన వారూ ఉన్నారు. విదేశీయుల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోంది. దీన్నిబట్టే సత్యసాయి సేవలు ఎంత ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. – డాక్టర్ బంగార్రాజు, జనరల్ మెడిసిన్, యూఎస్ఏ సత్యసాయి బోధనలే నడిపిస్తున్నాయి 123 దేశాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం. అమెరికాలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం చాలా కష్టం. అక్కడ ఉచిత వైద్యం అంటే ప్రజలు నమ్మరు. పైగా ఇన్సూరెన్స్ కంపెనీలతో సమస్య. కానీ సత్యసాయి క్యాంపులకు అక్కడి ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీలు సహకరిస్తున్నాయి. కెన్యా, నైజీరియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలోని రూరల్ ప్రాంతాలకు కూడా వెళ్లి సేవ చేస్తున్నాం. విద్య, వైద్యం చాలా గొప్పగా ఉంటోంది. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు కూడా ఇలాంటి విద్య, వైద్యం కావాలని కోరుకుంటున్నాయి. ఏడాదికేడాదికీ సత్యసాయి సేవలను మరింత మెరుగ్గా చేస్తాం. 2019లో 95 దేశాలలోని 95 కమ్యూనిటీలతో సదస్సు నిర్వహించి వారిని దత్తత తీసుకుంటాం. తాగునీరు, ఇళ్లు, వైద్యం, విద్య అన్ని రకాలుగా సేవలందిస్తాం. వచ్చే ఏడాది జూలైలో గోగ్రీన్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం. – డాక్టర్ నరేంద్రనాథరెడ్డి, ప్రశాంతి కౌన్సిల్ చైర్మన్, యూఎస్ఏ బాబా బాటలో వెళుతున్నా మా తల్లి సైక్రియాట్రిస్టు. వాళ్లు బాబా భక్తులు. ఇక్కడికి సేవ చేసేందుకు వచ్చేవారు. వారి స్ఫూర్తితో నేను ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నా. హెపాటాలజీ ప్రొఫెసర్‌గా కూడా ఉన్నా. అమెరికాలో హెపటాలజీ విభాగపు డాక్టర్లకు శిక్షణ ఇస్తుంటా. ఎయిమ్స్‌లో కూడా సేవలందిస్తున్నా. ఉన్నత పదవుల్లో ఉన్నా అంకిత భావం, ప్రేమ ఉండాలని బాబా బోధించిన బాటలోనే వెళుతున్నా! –హరి కంజీవరం, గ్యాస్ట్రో ఎంటరాలజీ ప్రొఫెసర్, యూఎస్ఏ మానవతా విలువలు పెంపొందాలంటే సేవే మార్గం 48 ఏళ్లుగా సత్యసాయి సేవలో ఉన్నా. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు విశ్వవ్యాప్తమయ్యాయి. సాయి చూపిన సేవా మార్గంలో కోట్లాదిమంది భక్తులు నడుస్తున్నారు. ఆయన ప్రేమ–సేవ మార్గాన్ని ప్రపంచదేశాలు ఆచరిస్తున్నాయి. కులమతాలకు అతీతంగా దృక్పథంలో మార్చు వచ్చి అందరూ పుట్టపర్తికి వస్తున్నారు. మానవతా విలువలు ఇంకా పెంపొందాలి. దీనికి సేవే సరైన మార్గం. – హెచ్‌జే దొర, మాజీ డీజీపీ, సత్యసాయి వరల్డ్ ఫౌండేషన్ డైరెక్టర్, హైదరాబాద్. సాయి వాక్కుతో పీడియాట్రిక్ సర్జన్ అయ్యా.. మా తల్లిదండ్రులు యూఎస్‌లో స్థిరపడ్డారు. నేను నాసాలో ఎలక్ట్రిక్ ఇంజినీర్‌గా ఉండేవాన్ని. పుట్టపర్తిలో బాబా దర్శనానికి వెళితే ‘యూ ఆర్ మై ‘పీడియాట్రిక్ సర్జన్’ అన్నారు. మొదట అర్థం కాలేదు. తర్వాత మెడికల్ ఎంట్రెన్స్ రాసి ఈ రోజు పీడియాట్రిక్ న్యూరో సర్జన్‌గా ఉన్నా. అత్యాధునిక పద్ధతుల్లో రోబోటెక్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నా. వారం కిందట కేరళలో మెదడుకు సంబంధించి అరుదైన ఆపరేషన్ చేశా. పుట్టపర్తి, బెంగళూరులో ఆస్పత్రులు నిర్మించి డాక్టర్లు ఎలా ఉండలో, వైద్యం ఎలా సేవగా భావించాలో ప్రపంచానికి చెబుతాను. – డాక్టర్ వెంకట సదానంద్, పీడియాట్రిక్, న్యూరోసర్జన్ -
ధోనితో స్నేహాన్ని ఎవరూ చెడగొట్టలేరు
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్, సహచరుడు ధోనితో తన బంధం దృఢమైందని టీమిండియా సారథి విరాట్ కోహ్లి అన్నాడు. బయటి వ్యక్తులెవరూ తమ ఇద్దరి మధ్య తలదూర్చలేరని... తమ స్నేహాన్ని చెడగొట్టలేరని స్పష్టం చేశాడు. ఓ టీవీ వెబ్ సిరీస్ కార్యక్రమంలో అతను మాట్లాడుతూ ‘చాలా మంది మా అనుబంధాన్ని దెబ్బతీసే కథనాలు రాశారు. అదృష్టవశాత్తూ అవేవీ మేం చదవలేదు. మా సాన్నిహిత్యాన్ని చూసి కూడా కొందరు ‘మీ మధ్య విభేదాలొచ్చాయటగా’ అని అడుగుతారు. అప్పడు మేం ఓ నవ్వు నవ్వేసి ఊరుకుంటాం. ఆసీస్ క్రికెటర్ హెడెన్ కూడా ధోని చాలా సరదా మనిషని చెబుతాడు. అకాడమీలో నా అండర్–17 రోజుల్లో కొత్త కుర్రాడికి బౌలింగ్ వేసేందుకు బంతినిచ్చి కహా సే (ఏ బౌలింగ్ ఎండ్ నుంచి వేస్తావు) అని అడిగా. దానికి అతను ‘భయ్యా నజాఫ్‌గఢ్ సే’ (అన్నా నజాఫ్‌గఢ్ నుంచి) అని చెప్పడం ఎక్కడ లేని నవ్వు తెప్పించింది. దీన్ని క్రికెట్ మ్యాచ్ బౌలింగ్ సమయంలో పదే పదే ధోనికి గుర్తుచేసి నవ్వుకుంటాం’ అని అన్నాడు. యేటికేడు పెరుగుతున్న వయస్సులాగే తమ స్నేహం కూడా పెరుగుతోందని కోహ్లి చెప్పాడు. క్రికెట్ సలహాలను ధోని నుంచే తీసుకుంటానని... ఆలోచనలను పంచుకున్న ప్రతీసారి ధోని సానుకూలంగా స్పందిస్తాడని అన్నాడు. ‘సారథ్యం చేపట్టిన కొత్తలో ధోని ముందుండి నడిపించేవాడు. క్లిష్టమైన పరిస్థితుల్ని చక్కగా సరిదిద్దేవాడు. అతనిలాంటి సహచరుడు ఉండటం నా అదృష్టం. ధోని సత్తాసామర్థ్యాల్ని నేను గుడ్డిగా నమ్మేస్తాను’ అని అన్నాడు. హర్దిక్ పాండ్యా జట్టులో ఓ ఎంటర్టైనర్ అని చెప్పాడు. రంజీ ట్రోఫీ సందర్భంగా శిఖర్ ధావన్‌తో ఆన్ ఫీల్డ్‌లో సరదా సంభాషణలు జరిగేవని పేర్కొన్నాడు. 29వ పడిలోకి కోహ్లి భారత బ్యాటింగ్ సంచలనం, కెప్టెన్ కోహ్లి ఆదివారం 29వ పడిలోకి ప్రవేశించాడు. టీమిండియా సహచరుల మధ్య అతని జన్మదిన వేడుక జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు సామాజిక సైట్లలో శుభాకాంక్షలతో ముంచెత్తారు. సెలెబ్రిటీలు కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ‘యువ క్రికెటర్, భారత్‌ను గెలిపిస్తున్న విజయవంతమైన సారథికి హ్యాపీ బర్త్ డే. నీ జైత్రయాత్ర, శతకాల సక్సెస్ సుదీర్ఘంగా కొనసాగాలి’ అని క్రికెట్ దిగ్గజం సచిన్ ట్వీట్ చేశారు. కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌లు కూడా ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ ఆటతో గెలిపించాలి... నాయకత్వంతో భారత్‌ను నడిపించాలని ట్వీట్ చేశారు. -
కేసీఆర్ కాపలా కుక్కలా ఉంటానన్నాడు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రాన్ని సాధించడం నుంచి ఇప్పటిదాకా దేశం కోసం గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఎన్నో త్యాగాలు చేశాయని, అదే కాంగ్రెస్‌పార్టీతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాహుల్‌గాంధీ 48వ జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కోసి, మిఠాయిలను పంచుకున్నారు. దేశ భవిశ్యత్తు కాంగ్రెస్‌తోనే.. అనంతరం పొన్నాల మాట్లాడుతూ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తండ్రి, దేశస్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీ దేశం కోసమే ప్రాణాలను త్యాగం చేశారని చెప్పారు. కొన్నిస్వార్థ రాజకీయ శక్తులు కాంగ్రెస్‌ది కుటుంబపాలన అంటూ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. దేశ ప్రధానమంత్రి పదవి కూడా అధిష్టించే అవకాశం ఉన్నా సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నాయకులకు అవకాశం ఇచ్చారని పొన్నాల లక్ష్మయ్య వివరించారు. ఇలాంటి చరిత్రను దాచిపెట్టేవిధంగా మాట్లాడటం మంచిదికాదని హెచ్చరించారు. కాపలా కుక్కలా ఉంటానన్నాడు.. 1999లో మంత్రి పదవి రానందుకే కేసీఆర్ పార్టీ పెట్టారని లక్ష్మయ్య విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెప్పి, ఎన్నికల్లో గెలవడం కోసం దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేశాడన్నారు. అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని పొన్నాల ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ కూడా పార్టీ ఉపాధ్యక్షునిగా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూస్తున్నారని చెప్పారు. దేశానికి భవిష్యత్తు నేతగా రాహుల్‌గాంధీ ఎదిగారని పొన్నాల అన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులను ఉచితంగా పంపిణీ చేశారు. -
కువైట్‌లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్దఒత్తున కమిటీ సభ్యులు, అభిమానులు రక్తదానం చేశారని వైఎస్సార్సీపీ గల్ఫ్ కువైట్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్, ఎం బాలిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కువైట్ జాబ్రియా ప్రాంతంలో ఉన్న బ్లడ్ బ్యాంకులో కమిటీ సభ్యులు మర్రి కల్యాణ్, పి.రఫీక్ ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. తమ అభిమాన నాయకుడు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కో కన్వీనర్లు గోవింది నాగరాజు, ఎం వీ నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సెల్ సభ్యులు ఎస్. మహేశ్వర్‌రెడ్డి, ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, సభ్యులు ఎం. ప్రభాకర్‌రెడ్డి, ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, అన్నాజీ శేఖర్, కె.రమణయాదవ్, పూలపుత్తూరు సిరేష్రెడ్డి, జి. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, షేక్ రఫీ, రాపూరు రమణ, ఫయాజ్, ఆకుల చలమతి, జగన్రాడు, కల్లూరు వాసుదేవరెడ్డి, కె.నాగసుబ్బారెడ్డి, సక్కిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, రవిశంకర్, లక్కిరెడ్డి రాజారెడ్డి, పిడుగు సుబ్బారెడ్డి, ప్రసాద్ అభిమానులకు ఇలియాస్, బాలిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
విహారయాత్రలో విషాదం
లక్కవరం (చింతూరు) : పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులు చేపట్టిన విహారయాత్ర చివరికి విషాదయాత్రగా దారితీసింది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం లక్కవరం గ్రామంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చింతూరు సీఐ దుర్గాప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. లక్కవరానికి చెందిన సర్పక సతీష్, నవీన్, చింతూరుకు చెందిన రవి, కార్తీక్, రమేష్‌లు స్నేహితులు. వీరిలో రవి మినహా మిగతా నలుగురూ ఆటోడ్రైవర్లు. ఆదివారం నవీన్ పుట్టిన రోజు కావడంతో స్నేహితులంతా తులసిపాక సమీపంలోని ఘాట్‌రోడ్‌లోని వాగు వద్దకు విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో వాగులో స్నానానికి దిగిన సతీష్(30) కొద్దిసేపటికి కనబడలేదు. దీంతో కంగారుపడిన స్నేహితులు వాగులోకి దిగి వెతకగా సతీష్ మృతదేహం లభ్యమైంది. దీంతో వారంతా భయపడి మోతుగూడెం పోలీస్‌స్టేషన్ కు చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. చింతూరు సీఐ దుర్గాప్రసాద్, మోతుగూడెం ఎస్సై కిషోర్‌లు వాగు వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. అప్పటికే చీకటి పడటంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సోమవారం చింతూరు ఆసుపత్రికి తరలించారు. సతీష్ మృతిపై అతడి స్నేహితులు అందించిన సమాచారం మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఆటోతో పాటు కిరాణాషాపు నడుపుకుంటున్న మృతుడికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్ట్‌మార్టం ఆలస్యంపై రాస్తారోకో సతీష్ మృతదేహాన్ని సోమవారం ఉదయం చింతూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకు రాగా సాయంత్రం వరకూ పోస్ట్‌మార్టం నిర్వహిం^è లేదు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, ఆటోడ్రైవర్లు, దళిలసంఘాల ఆధ్వర్యంలో చింతూరు ప్రధాన రహదారిపై మృతదేహంతో కలిసి రాస్తారోకో చేశారు. సకాలంలో పోస్ట్‌మార్టం చేయని డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని, మృతుడి భార్యకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో విషయం తెలుసుకున్న సీఐ దుర్గాప్రసాద్ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారితో మాట్లాడారు. పోస్ట్‌మార్టం చేసేందుకు వైద్య నిపుణుడు లేనందునే ఆలస్యమైందని, వెంటనే పోస్ట్‌మార్టం నిర్వహించేలా చూస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సీపీఎం సభ్యుడైన సతీష్ మృతదేహాన్ని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సందర్శించి నివాళులర్పించారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకులను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని తెచ్చిన 65 కిలోల కేక్‌ను అభిమానులు కట్ చేశారు. రక్తదానం, నేత్రదానం క్యాంపులను ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కాగా.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. -
దేశభక్తిగల వాగ్గేయకారుడు బాలాంత్రపు
విజయవాడ: దేశభక్తి, జాతీయభావం కలిగిన వ్యక్తి బాలాంత్రపు రజనీకాంతరావు అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. విజయవాడలో శనివారం నిర్వహించిన రజనీకాంతరావు వందో పుట్టినరోజు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తన చిన్నతనంలో రజనీ రచించిన జేజిమామాయ్య పాటలు ప్రభావితం చేశాయని చెప్పారు. సంగీత కళాకారులపై ఆయన రచించిన ‘వాగ్గేయకార చరిత్ర’ సంగీత ప్రపంచానికి ప్రామాణిక గ్రంథమని తెలిపారు. స్వాతంత్య్ర పోరాట సమయంలోను, భారత్-చైనా యుద్ధంలోను ఆయన రచించిన గీతాలు ప్రజల్లో దేశభక్తిని చాటాయని చెప్పారు. ‘నాదీ స్వతంత్ర దేశం.. నాదీ స్వతంత్ర జాతి’ ఇప్పటికీ గుర్తొస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రజనీకాంతరావు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. విశ్రాంత ప్రిన్సిపల్ సెక్రటరీ మోహన్‌కందా మాట్లాడుతూ రేడియోకి జవసత్వాలు కలిగించిన వ్వక్తి రజనీకాంతరావు అని, రజనీ లేని ఆకాశవాణిని ఊహించలేమని పేర్కొన్నారు. సంగీతం, రేడియో ఊపిరిగా బతికిన వ్యక్తి రజనీకాంతరావు అని తెలిపారు. ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రజనీ ప్రకృతి ఆరాధకుడని, ప్రపంచమే ఆయన సంగీతమని చెప్పారు. సినిమాలకు సంగీతం సమకూర్చినా ఆయన రేడియో కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. గాయని రావు బాలసరస్వతి తదితరులు ప్రసంగించారు. -
నిరాడంబరంగా జగన్ జన్మదినోత్సవం
వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిరాడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ‘జై సమైక్యాంధ్రప్రదేశ్’ నినాదంతో పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో వందలాది మంది యువకులు, విద్యార్థులు రక్తదానం చేశారు. ఐటీ విభాగం ఆధ్వర్యంలో ‘చీర్స్’ ఫౌండేషన్‌కు చెందిన 22 మంది అనాథ విద్యార్థులకు రూ.2500 చొప్పున పంపిణీ చేశారు. పిల్లలకు ఈ చెక్కులను పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి అందజేశారు. తన జన్మదినోత్సవాన్ని ఎవరూ ఆర్భాటంగా నిర్వహించవద్దని జగన్ కోరటంతో పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని మైసూరా తెలిపారు. అంతకుముందు కార్యాలయం ప్రాంగణంలో యువజన విభాగం ఆధ్వర్యంలో కేక్ కోసి అందరికీ పంచి పెట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలు గట్టు రామచంద్రరావు, బి.జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాశ్‌రావు, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కె.శివకుమార్, మేడపాటి వెంకట్, బాజిరెడ్డి గోవర్ధన్ సహా పెద్దసంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో జగన్..: వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా శనివారం ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడిపారు. జగన్‌కు మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ శుభాకాంక్షలు జగన్ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఏపీ భవన్లో జగన్ పుట్టినరోజు వేడుకలు సాక్షి, న్యూఢిల్లీ: జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఢిల్లీలోని ఏపీ భవన్లో ఘనంగా నిర్వహించారు. మన్యసీమ ఉద్యమనేత, ఖమ్మం జిల్లా వైఎస్సార్ సీపీ నాయకుడు చందా లింగయ్యదొర ఆధ్వర్యంలో తెలుగువారు కేక్ కోశారు.