లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన 63వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా జరుపుకున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీఎస్పీ చీఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్ వైభవంగా జరిపడంతో పాటు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఐతే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోరాలో జరిగిన వేడుకల్లో పార్టీ నిర్వాహకులకు ఊహించని ఘటన ఎదురైంది. (కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠమే: మాయావతి)
ఒక్క కేక్ ముక్క కోసం జనాలు ఎగబడ్డారు. తొక్కిసలాట జరుగుతుందా? అన్నట్లుగా తోసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు తీసుకోవాలంటూ.. నిర్వాహకులు ఎంత అరిచినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఎవరికి వారు చేతులు పెట్టి కేక్ లాక్కోవడంతో.. అది చితికిపోయింది. క్షణాల్లోనే కేక్‌ని లూటీ చేసి... ఆదరబాదరగా లాగించేశారు. అనంతరం అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా ఏఎన్‌ఐ ట్వీట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. (ఎస్‌పీ, బీఎస్‌పీ.. చెరో 38)
#WATCH: People loot cake during an event in Amroha, on Bahujan Samaj Party (BSP) chief Mayawati's 63rd birthday today. pic.twitter.com/8Q4bDWdr66
— ANI UP (@ANINewsUP) 15 January 2019
Comments
Please login to add a commentAdd a comment