Bahujan Samajwadi Party
-
పొత్తుల విషయంలో మాయావతి కీలక వ్యాఖ్యలు
లక్నో: బహుజన్ సమాజ్‌వాది పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేతో గాని విపక్షాల ఇండియా కూటమితో గాని కలవబోవడంలేదని స్పష్టం చేశారు. వారితోనే కాదు మారె ఇతర పార్టీతోనూ పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పేశారు. ఆదివారం బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యనేతలు, ఇతర కార్యవర్గంతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ యూపీలోనూ ఉత్తరాఖండ్‌లోనూ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మన సొంత బలాన్ని నమ్ముకుని ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి, ఎన్డీయే కూటమికి దూరంగా ఉంటూనే కార్యవర్గమంతా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. పార్టీ సభ్యులు అందరూ చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని ఫేక్ మెసేజులతో మన ప్రత్యర్ధులు రాజకీయ కుట్రలకు పాల్పడే అవకాశముందన్నారు. బీఎస్పీ వ్యతిరేక శక్తులు మన గెలుపును అడ్డుకునేందుకు ఏమి చేయడానికైనా వెనకాడవని ప్రతి దశలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, దీని కారణంగా మన ఎన్నికల ప్రణాళిక దెబ్బ తినకూడదని అన్నారు. అధికార బీజేపీ పార్టీ పరిపాలనపై స్పందిస్తూ.. వారి పాలనలో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని.. ద్రవ్యోల్బణం,పేదరికం, నిరుద్యోగం, శాంతిభద్రతల లోపం, విద్య, వైద్యం వంటి సమస్యలతో సహా ఏదీ సరిగ్గా లేదని చెబుతూనే ప్రజా సంక్షేమం, ప్రజా ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ పార్టీల తీరు ఒకేలా ఉంటుందని పూర్తిగా ప్రజా వ్యతిరేక ధోరణిలో వారి వ్యవహారం ఉంటుందని అన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి రిజర్వేషన్‌ను ప్రతిపాదికగా తీసుకోకూడదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న బుల్డోజర్ యాక్షన్లపై ఆమె స్పందిస్తూ ఒక వ్యక్తి దోషి అని నిరూపితం కాక ముందే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. పైగా ఆ వ్యక్తి చేసిన తప్పుకు ఆ కుటుంబాన్ని శిక్షిస్తున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదించదగినది కాదని పూర్తి ప్రజా వ్యతిరేక విధానమని అన్నారు. 01-10-2023-BSP PRESS NOTE-UP MEETING pic.twitter.com/PVgb7KdhiA — Mayawati (@Mayawati) October 1, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ సమరశంఖం.. పసుపు బోర్డుపై మోదీ కీలక ప్రకటన -
కాంగ్రెస్ కొత్త ఖాతా తెరుస్తుందా?
లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీ సహా 14 స్థానాలకు మే 6న పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ గెలిచిన అమేఠీ, రాయ్‌బరేలీ మినహా మిగిలిన పన్నెండు స్థానాలను కిందటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో రాజకీయంగా కీలకమైన అవధ్ ప్రాంతంలోని అనేక నియోజకవర్గాలున్న ఈ దశ ఎన్నికల్లో ఈసారి కూడా అత్యధిక సీట్లు గెలుచుకోవడం బీజేపీకి అత్యవసరం. దళితులు, బీసీలు, ముస్లింల మద్దతు అధికంగా ఉన్న బహుజన్ సమాజ్‌వాదీపార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కూటమికి కూడా ఈ ప్రాంతంలో గట్టి పునాదులున్నాయి. అగ్రనేతలు మళ్లీ పోటీచేస్తున్న రెండు సీట్లతోపాటు మరో మూడు స్థానాలైనా సంపాదించాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. రాష్ట్ర రాజధాని పరిధిలోని లక్నో నియోజకవర్గం నుంచి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఫతేపూర్ నుంచి కేంద్ర ఆహార పరిశ్రమల శాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి పోటీ చేస్తున్నారు. మందిర్–మసీదు వివాదానికి కేంద్ర బిందువు అయిన అయోధ్య ఉన్న ఫైజాబాద్ స్థానానికి కూడా గట్టి పోటీ ఉంది. బీజేపీ తర్వాత బలమైన కూటమి మహాగuŠ‡బంధన్ 2014 ఎన్నికల్లో ఈ 14 యూపీ సీట్లలో పది చోట్ల ఎస్పీ, బీఎస్పీలు రెండో స్థానంలో నిలిచాయి. అనేక నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే అవి బీజేపీకి పడిన ఓట్లను మించిపోతాయి. ధౌరహ్రా, బారాబంకీ, ఫైజాబాద్, సీతాపూర్ స్థానాల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 14 సీట్లలో ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో తల్లీ కొడుకుల స్థానాలే కాంగ్రెస్ పరువు నిలబెట్టాయి. లక్నోలో రాజ్‌నాథ్‌పై పోటీచేస్తున్నవారిలో శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హా(ఎస్పీ) ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా హిందూ మతాచార్యుడు ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ పోటీచేస్తున్నారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై బహారాయిచ్(ఎస్సీ రిజర్వ్డ్) స్థానం నుంచి గెలిచిన సావిత్రీబాయి ఫూలే ఈసారి కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ పాలనలో దళితులకు న్యాయం చేయడం లేదంటూ సావిత్రీబాయి బీజేపీ నాయకత్వాన్ని విమర్శించాక పార్టీకి దూరమయ్యారు. లక్నోలో రాజ్‌నాథ్‌కు పోటీయే లేదా? తొలి ప్రధాని నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మీ పండిత్, కేంద్ర మాజీ మంత్రి షీలా కౌల్, బీజేపీ తొలి ప్రధాని ఏబీ వాజ్‌పేయి అనేకసార్లు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం లక్నో. యూపీ మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రెండోసారి ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ తరఫున హిందూ పీఠాధిపతి(సంభల్ కల్కి మఠం) ప్రమోద్ కృష్ణం, ఎస్పీ–బీఎస్పీ కూటమి తరఫున పూనమ్ సిన్హా పోటీచేస్తున్నారు. అయితే, ఎస్పీ, కాంగ్రెస్ చివరి నిమిషంలో బయటి నుంచి అభ్యర్థులను ‘దిగుమతి’ చేసుకోవడాన్ని బట్టి చూస్తే రాజ్‌నాథ్‌కు సునాయాసంగా గెలిచే అవకాశం ఇస్తున్నట్టు భావించాలని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఠాకూర్ వర్గానికి చెందిన రాజ్‌నాథ్‌కు అన్ని వర్గాల మద్దతు ఉంది. నియోజకవర్గంలోని 19.6 లక్షల మంది ఓటర్లలో 4 లక్షల మంది కాయస్థులు, లక్ష మంది సింధీలు, నాలుగు లక్షల మంది బ్రాహ్మణులు, మూడు లక్షల మంది ఠాకూర్లు, నాలుగు లక్షల మంది ముస్లింలు ఉన్నారు. పూనమ్ సింధీ కావడం, ఆమె భర్త శత్రుఘ్న కాయస్థ కుటుంబంలో పుట్టిన కారణంగా ఈ వర్గాల ఓట్లన్నీ తమ అభ్యర్థికి పడతాయనే ఆశతో ఎస్పీ నేతలు ఉన్నారు. అమేఠీలో రాహుల్ అమేఠీ అవతరించినప్పటి నుంచీ జరిగిన 15 ఎన్నికల్లో 13 సార్లు కాంగ్రెస్ గెలిచింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇద్దరు కొడుకులు, కోడలు, మనవడు విజయం సాధించిన కాంగ్రెస్ కంచుకోట ఇది. ఇందిర చిన్న కొడుకు సంజయ్‌గాంధీ 1977లో మొదటిసారి పోటీచేసి ఓడిపోయారు. 1980 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మళ్లీ 1998లో బీజేపీ టికెట్‌పై పోటీచేసి అమేఠీ మాజీ సంస్థానాధీశుని కొడుకు సంజయ్‌సింగ్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సతీష్‌శర్మను ఓడించారు. 2004 నుంచీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మూడుసార్లు అమేఠీ నుంచి ఎన్నికయ్యారు. 2014లో రాహుల్ చేతిలో ఓడిన బీజేపీ ప్రత్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ పోటీకి దిగారు. పాత ప్రత్యర్థుల మధ్యే 2019లో ఎన్నికల పోరు జరుగుతోంది. రాహుల్‌పై స్మృతి తొలిసారి పోటీచేసి ఓడినా ఆయన మెజారిటీని 3 లక్షల 70 వేల నుంచి లక్షా ఏడు వేలకు తగ్గించగలిగారు. రాజ్యసభ సభ్యురాలైన స్మృతి మళ్లీ అమేఠీ బరిలోకి దిగడంతో రాహుల్ ఎందుకైనా మంచిదని కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీచేస్తున్నారు. అమేఠీలో ఓటమి భయంతోనే రాహుల్ కాంగ్రెస్‌కు సురక్షితమైన రెండో సీటు నుంచి పోటీకి దిగారని ఆమె వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ కారణంగానే సంజయ్ ఓడిపోయారుగాని గాంధీ–నెహ్రూ కుటుంబ సభ్యులెవరూ నేడు అమేఠీలో ఓడిపోయే అవకాశం లేదని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి తరఫున బీజేపీ అగ్రనేతలందరూ ప్రచారానికి వస్తున్నారు. బిహార్‌కు చెందిన ఎల్జేపీ నేత, కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాస్వాన్ సైతం అమేఠీలో స్మృతికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ చెల్లెలు ప్రియాంకా గాంధీ కూడా ఇక్కడ విస్తృతంగా పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటూ, గెలుపుపై తన అన్నకు అనుమానమే లేదనీ, వయనాడ్ ప్రజల కోరిక మేరకే అక్కడ నుంచి పోటీచేస్తున్నారని ధీమాగా చెప్పారు. రాయ్‌బరేలీలో సోనియా నాలుగోసారి పోటీ మామ ఫిరోజ్ గాంధీ, అత్త ఇందిర, ఇందిర మేనత్త షీలాకౌల్ వంటి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఆరోసారి పోటీచేస్తున్నారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్‌సింగ్ పోటీకి దిగారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి ఆయన బీజేపీలోకి ఫిరాయించారు. అమేథీతోపాటు రాయ్‌బరేలీలో కూడా ఎస్పీ–బీఎస్పీ కూటమి అభ్యర్థిని నిలబెట్టలేదు. సోనియా తొలిసారి 1999లో అమేఠీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2004 నుంచి ఆమె రాయ్‌బరేలీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓ సాంకేతిక సమస్య కారణంగా సోనియా 2006లో రాజీనామా చేశాక మళ్లీ ఇక్కడ నుంచి పోటీచేసి గెలిచారు. కిందటి ఎన్నికల్లో ఆమె తన బీజేపీ ప్రత్యర్థి అజయ్ అగర్వాల్‌పై మూడున్నర లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2004లో దాదాపు రెండున్నర లక్షలు, 2006 ఉప ఎన్నికలో 4 లక్షల 17 వేలు, 2009లో 3 లక్షల 72 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో సోనియా తన ప్రత్యర్థులపై విజ యం సాధించారు. ప్రస్తుత బీజేపీ అభ్యర్థి దినేష్ప్రతాప్ సింగ్ 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా తరఫున సహాయకునిగా పనిచేసి 2016లో ఎమ్మెల్సీ అయ్యారు. కిందటేడాది కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. సోనియా గెలుపుపై అనుమానాలు లేకున్నా ఈసారి గట్టి పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. కూతు రు ప్రియాంక కూడా తల్లి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ధౌరహ్రాలో జితిన్ ప్రసాద మరో ప్రయత్నం! కాంగ్రెస్ దివంగత నేత జితేంద్ర ప్రసాద కొడుకు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద(కాంగ్రెస్) రెండోసారి పోటీచేస్తున్న స్థానం ధౌరహ్రా. జితిన్ తండ్రి జితేంద్ర గతంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా, మాజీ ప్రధానులు రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహావులకు రాజకీయ సలహాదారుగా పనిచేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియాగాంధీపై పోటీచేసి ఆయన ఓడిపోయారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన జితిన్ తొలిసారి 2004లో షాజహాన్‌పూర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి ఎన్నికయ్యారు. 2008లో అవతరించిన ధౌరహ్రా నుంచి 2009లో గెలిచి 2011 నుంచి 2014 వరకూ మన్మోహన్సింగ్ కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేశారు. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన రెండోసారి ఇదే సీటు నుంచి పోటీచేసి నాలుగో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి రేఖా వర్మ తన సమీప బీఎస్పీ ప్రత్యర్థి దావూద్ అహ్మద్‌ను లక్షా పాతిక వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఎస్పీ అభ్యర్థి కొన్ని వందల ఓట్ల తేడాతో మూడో స్థానంలో నిలిచారు. బీసీ కులమైన కుర్మీలు ఈ స్థానంలో అధిక సంఖ్యలో ఉన్నారు. ఈసారి ఎస్పీ, బీఎస్పీ కూటమి తరఫున అర్షద్ సిద్దిఖీ(బీఎస్పీ) పోటీచేస్తున్నారు. ఆయన తండ్రి ఇలియాస్ సిద్దిఖీ గతంలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఫైజాబాద్‌లో త్రిముఖ పోటీ ప్రాచీన నగరం అయోధ్య అంతర్భాగంగా ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో మరోసారి ప్రతిష్టాత్మక పోటీ జరుగుతోంది. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు లల్లూ సింగ్, కాంగ్రెస్ మాజీ ఎంపీ నిర్మల్ ఖత్రీ, ఎస్పీ, బీఎస్పీ కూటమి అభ్యర్థి ఆనంద్‌సేన్ యాదవ్(ఎస్పీ) పోటీలో ఉన్నారు. 2014లో లల్లూ సింగ్ తన సమీప ప్రత్యర్థి మిత్రసేన్ యాదవ్‌ను 2 రెండు లక్షల 82 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఎస్పీ అభ్యర్థి ఆనంద్‌సేన్ తండ్రి మిత్రసేన్ మొదటిసారి 1989లో సీపీఐ టికెట్‌పైన, 1998లో ఎస్పీ తరఫున, 2004లో బీఎస్పీ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నికయ్యారు. తండ్రీకొడుకులిద్దరికీ నేరమయ రాజకీయాలతో సంబంధాలున్నాయి. తండ్రి మాదిరిగానే ఆనంద్‌సేన్ కూడా బీఎస్పీలో ఉన్నారు. అసెంబ్లీకి ఎన్నికయ్యాక మాయావతి కేబినెట్లో మంత్రిగా కొన్ని రోజులు పనిచేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ ఖత్రీ కూడా గతంలో రెండుసార్లు కాంగ్రెస్ తరఫున ఫైజాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయోధ్య ప్రాంతంలో నిరుద్యోగం, పరిశ్రమల స్థాపన జరగకపోవడం ఈ ఎన్నికల్లో చర్చనీయాంశాలయ్యాయి. ప్రధాని పదవి చేపట్టాక నరేంద్రమోదీ తొలిసారి ఆయోధ్య ఎన్నిక ప్రచారానికి వచ్చినా రామజన్మభూమి వివాదంపై మాట్లాడలేదు. మహా కూటమి నేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ కూడా ఆయోధ్యకు 70 కిలో మీటర్ల దూరంలో ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మోదీపై నియోజకవర్గ ప్రజలకు అభిమానం తగ్గలేదనీ, ఎంపీగా లల్లూ సింగ్ పనితీరును పట్టించుకోకుండా ప్రధానిపై మోజుతోనే బీజేపీకి ఓట్లేస్తారని ఫైజాబాద్ రాజకీయ విశ్లేషకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. బహరాయిచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత సావిత్రీబాయి ఫూలే పోటీచేయడంతో బహరాయిచ్ నియోజకవర్గం ఎన్నికపై ఆసక్తి పెరిగింది. షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్‌చేసిన ఈ స్థానం నుంచి 2014లో సాధ్వీ సావిత్రీబాయి ఫూలే బీజేపీ టికెట్‌పై పోటీచేసి తన సమీప ఎస్పీ ప్రత్యర్థి షబ్బీర్ అహ్మద్ వాల్మికీపై 95 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. యూపీ బీజేపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హనుమంతుడి కులం గురించి మాట్లాడి సమాజాన్ని చీల్చివేస్తున్నారంటూ సావిత్రీబాయి కిందటి డిసెంబర్లో బీజేపీ నుంచి వైదొలిగారు. ఇటీవల ఆమె కాంగ్రెస్‌లో చేరగానే బహరాయిచ్ టికెట్ ఇచ్చారు. ఆమె స్థానంలో బీజేపీ టికెట్ అక్షర్‌వర్ లాల్‌కు లభించింది. మొదట బీఎస్పీలో ఉన్న సావిత్రీబాయి బౌద్ధమతాన్ని అనుసరిస్తూ ప్రజా సేవ ద్వారా గుర్తింపు పొందారు. తర్వాత బీజేపీలో చేరి 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై భారీ మెజారిటీతో గెలిచారు. అప్పటికే పేరు సంపాదించిన ఆమెకు కిందటి ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఎలాంటి ప్రయత్నం లేకుండానే దక్కింది. ఎస్సీ అభ్యర్థి షబ్బీర్ అహ్మద్ వాల్మీకీ రెండోసారి పోటీచేస్తున్నారు. ఎస్పీ కులమైన వాల్మికీ వర్గానికి చెందిన ఆయన పేరులోని మొదటి రెండు పదాల కారణంగా ఆయన హిందూ దళితుడు కాదనీ, ముస్లిం అని కొందరు కోర్టు కెక్కగా నడిచిన కేసులో ఆయన తాను హిందువునని నిరూపించుకున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ కొత్త అభ్యర్థి తరఫున ప్రధాని మోదీ ఇప్పటికే ప్రచారం చేసి వెళ్లారు. త్రిముఖ పోటీలో బీజేపీ అభ్యర్థికి మొగ్గు ఉన్నట్టు కనిపిస్తోంది. పూనమ్ సిన్హా, దినేష్ ప్రతాప్‌సింగ్, అర్షద్ సిద్దిఖీ -
24 ఏళ్లకు ఒకే వేదికపై..
మైన్‌పురి / న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. గత 24 ఏళ్లుగా ఉప్పు–నిప్పుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఒకే వేదికను పంచుకున్నారు. ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. యూపీలోని మైన్‌పురిలో క్రిస్టియన్ కాలేజీ గ్రౌండ్ ఇందుకు వేదికైంది. ఎస్పీ కంచుకోట అయిన మైన్‌పురిలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, ములాయం, బీఎస్పీ చీఫ్ మాయావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు, మద్దతుదారులను ఉద్దేశించి ములాయం మాట్లాడుతూ.. ‘చాన్నాళ్లకు మేమిద్దరం ఒకే వేదికపై మాట్లాడుతున్నాం. మాయావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు మద్దతివ్వాలని ఆమెను కోరుతున్నా’ అని అన్నారు. ప్రధాని మోదీ నకిలీ బీసీ: మాయావతి ములాయం అనంతరం మాయావతి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘గెస్ట్ హౌస్ ఘటన తర్వాత కూడా నేను ములాయం జీ తరఫున ప్రచారం కోసం ఇక్కడికి ఎందుకు వచ్చానని చాలామంది ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. కొన్నికొన్ని సార్లు ప్రజా, దేశ, పార్టీ ప్రయోజనాల రీత్యా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ములాయం జీ సమాజంలోని అన్నివర్గాలను కలుపుకుని ముందుకు తీసుకెళ్లారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకున్న మోదీ, తన అగ్రకులాన్ని బీసీల్లో చేర్చుకున్నారు. కానీ ప్రధాని మోదీలా ములాయం నకిలీ వ్యక్తి, అబద్ధాలకోరు కాదు. ఆయన వెనుకబడ్డ కులంలోనే జన్మించారు. ములాయం నిజమైన నేత’ అని ప్రశంసించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా యూపీలోని 80 లోక్‌సభ సీట్లకు గానూ ఎస్పీ 37, బీఎస్పీ 38, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో కలిసి పోటీచేస్తున్నాయి. రాయ్‌బరేలీ(సోనియాగాంధీ), అమేథీ(రాహుల్ గాంధీ) స్థానాల్లో మాత్రం ఈ ఎస్పీ–బీఎస్పీ కూటమి అభ్యర్థులను నిలబెట్టలేదు. ఉనికి కోసమే ఎస్పీ–బీఎస్పీ పొత్తు: బీజేపీ ములాయం–మాయావతి కలిసి మైన్‌పురి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై బీజేపీ మండిపడింది. ఈ విషయమై బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ, తుపాను లాంటి మోదీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని ఎద్దేవా చేశారు. యూపీలో ఉనికి కోసమే ఎస్పీ–బీఎస్పీలు చేతులు కలిపాయని దుయ్యబట్టారు. ఇందుకోసం తన జీవితంలో జరిగిన అతిపెద్ద అవమానాన్ని(గెస్ట్‌హౌస్ ఘటన) మాయావతి దిగమింగారన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావగా తయారైందని చతుర్వేదినుద్దేశించి అన్నారు. పాతికేళ్లనాటి పంచాయితీ! ములాయం, మాయావతి బద్ధ విరోధులుగా మారడానికి కారణమైన గెస్ట్‌హౌస్ ఘటన 1995 జూన్‌లో జరిగింది. ములాయం నేతృత్వంలోని ఎస్పీ–బీఎస్పీ సంకీర్ణ ప్రభుత్వం యూపీలో కొనసాగుతోంది. కొత్త సర్కార్ కొలువుదీని అప్పటికి ఏడాదిన్నర. అంతలోనే బీఎస్పీ అధినేత కాన్షీరాం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తారని ములాయంకు జూన్ 1న సమాచారం అందింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే బీఎస్పీని చీల్చాలనీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయాలని కొంతమంది ఎస్పీ నేతలు భావించారు. అదేసమయంలో అప్పటి బీఎస్పీ ప్రధాన కార్యదర్శి మాయావతి రాష్ట్రప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో జూన్ 2న పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఎస్పీ ఎమ్మెల్యేలు, జిల్లాల నేతలు అనుచరులతో కలిసి ఆయుధాలతో గెస్ట్‌హౌస్‌పై దాడిచేశారు. బీఎస్పీ ఎమ్మెల్యేలను చితక్కొట్టారు. గదిలో దాక్కోవడంతో మామావతి తప్పించుకున్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం ఎస్పీ సర్కారుకు బీఎస్పీ మద్దతు ఉపసంహరించుకోవడం, బీజేపీ, జనతాదళ్ పార్టీల బయటినుంచి మద్దతు ఇవ్వడంతో మాయావతి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. -
మాయావతి జన్మదిన వేడుకలు.. కేకు కోసం కక్కుర్తి
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన 63వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా జరుపుకున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీఎస్పీ చీఫ్ బర్త్ డే సెలబ్రేషన్స్ వైభవంగా జరిపడంతో పాటు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఐతే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోరాలో జరిగిన వేడుకల్లో పార్టీ నిర్వాహకులకు ఊహించని ఘటన ఎదురైంది. (కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠమే: మాయావతి) ఒక్క కేక్ ముక్క కోసం జనాలు ఎగబడ్డారు. తొక్కిసలాట జరుగుతుందా? అన్నట్లుగా తోసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు తీసుకోవాలంటూ.. నిర్వాహకులు ఎంత అరిచినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఎవరికి వారు చేతులు పెట్టి కేక్ లాక్కోవడంతో.. అది చితికిపోయింది. క్షణాల్లోనే కేక్‌ని లూటీ చేసి... ఆదరబాదరగా లాగించేశారు. అనంతరం అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా ఏఎన్ఐ ట్వీట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. (ఎస్పీ, బీఎస్పీ.. చెరో 38) #WATCH: People loot cake during an event in Amroha, on Bahujan Samaj Party (BSP) chief Mayawati's 63rd birthday today. pic.twitter.com/8Q4bDWdr66 — ANI UP (@ANINewsUP) 15 January 2019 -
యూపీలో పొత్తుల పర్వం
ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు పొత్తుల కోసం అన్వేషించడం, వ్యూహా లకు పదును పెట్టుకోవడం సాధారణమే. దేశంలో అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)–బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)ల మధ్య శనివారం కుదిరిన ఎన్నికల పొత్తు ఇప్పుడు అనేక కారణాల వల్ల అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. చెరో 38 స్థానా లకూ పోటీ చేయాలని ఆ రెండు పార్టీలూ అంగీకారానికొచ్చాయి. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యంవహిస్తున్న అమేథీ స్థానాలను ఆ పార్టీకే విడిచిపెట్టాలని ‘పెద్ద మనసు’తో నిర్ణయించాయి. మరో రెండింటిని అజిత్‌సింగ్ పార్టీ ఆర్ఎల్డీకి ఇవ్వదల్చుకున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అక్కడ మిత్రపక్షాలతో కలిసి 73 స్థానాలు గెల్చుకుంది. అటు తర్వాత జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడక్కడ ప్రధాన రాజకీయ పక్షాలైన ఎస్పీ, బీఎస్పీలు రెండూ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం సహజంగానే బీజేపీలో వణుకు పుట్టిస్తోంది. అయితే ఆ పార్టీని జాతీయ స్థాయిలో సవాలు చేస్తున్న కాంగ్రెస్‌ను సైతం ఈ పరిణామం ఇరకాటంలో పడేయటమే విశేషం. ఒకపక్క రాహుల్‌గాంధీ భావి ప్రధాని అని డీఎంకే వంటి యూపీఏ మిత్రపక్షాలు చెబుతున్నాయి. బీజేపీపై పోరాడుతున్న యోధుడుగా పేరు తెచ్చుకోవడానికి నానా పాట్లూ పడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ఆ మాట అనకపోయినా కాంగ్రెస్‌తో పొత్తు ‘ప్రజాస్వామిక అనివార్యత’ అని అడిగినవారికీ, అడగనివారికీ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా కీలకమైన ఉత్తర ప్రదేశ్‌లో ప్రధాన ప్రాంతీయ పార్టీలు రెండూ కాంగ్రెస్‌ను పూర్తిగా విస్మరించటం ఆ పార్టీ సామ ర్థ్యంపై సంశయాలు కలగజేస్తుంది. రాజకీయంగా కీలకమైన రాష్ట్రంలో తనను అసలు కూటమి ఏర్పాటులో పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల జాతీయ స్థాయిలో తన పాత్ర కుంచించుకు పోవడం ఖాయమని కాంగ్రెస్‌కు తెలుసు. ఇది చాలదన్నట్టు ఎస్పీ–బీఎస్పీ పొత్తు కుదిరిన 24 గంటల్లో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నాయకుడు, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజశ్వి యాదవ్ యూపీకి తరలివెళ్లి ఆ కూటమికి మద్దతు ప్రకటించడం కాంగ్రెస్‌ను మరింత కలవరపరిచి ఉండాలి. బిహార్‌లో ఆర్జేడీ–కాంగ్రెస్‌లు ఇప్పటికే కూటమిగా ఉన్నాయి. అయితే బిహార్‌లో తేజశ్వి ఇలాంటి ప్రయోగం చేయడానికి అవకాశం లేదు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు చెందిన జనతాదళ్(యూ), రాంవిలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) బీజేపీకి మిత్రపక్షా లుగా ఉన్నాయి. కనుక ఎస్పీ–బీఎస్పీల తరహాలో కాంగ్రెస్‌ను దూరం పెట్టి పొత్తు పెట్టుకోవడా నికి తగిన బలమైన ప్రాంతీయ పార్టీ తేజశ్వికి బిహార్‌లో దొరక్కపోవచ్చు. ఎస్పీ–బీఎస్పీ పొత్తుతో ఖంగుతిన్న కాంగ్రెస్ తాము మొత్తం 80 స్థానాలకూ పోటీ చేస్తామని బింకంగా చెబుతున్నా ఆ రాష్ట్రంలో అంతంతమాత్రంగా ఉన్న ఆ పార్టీకి అంతమంది అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే. కాంగ్రెస్‌ను కూడా కూటమిలో చేర్చుకుంటే అది మరింత బలంగా ఉండే దని చెబుతున్నవారున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకున్న సూచనలు కనబడ్డాయని వారి వాదన. దాంతోపాటు ముస్లిం ఓట్లలో చీలిక వస్తే ఆమే రకు బీజేపీ లాభపడుతుందని వారంటున్నారు. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇటీవలి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నుంచి తనకెదురైన భంగపాటుకు ఇది మాయావతి ఇచ్చిన జవాబు అని చెప్పాలి. పొత్తు కుదిరాక జరిగిన విలేకరుల సమావేశంలో ఇది స్పష్టంగా బయటపడింది. కాంగ్రె స్పై ప్రశ్నలు ఎదురైనా ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఎలాంటి వ్యాఖ్యలూ చేయకుండా మౌనంగా ఉండిపోగా, మాయావతి మాత్రం నిప్పులు చెరిగారు. ఇదంతా ఆ రెండు పార్టీల నేతలూ ముందుగా నిర్ణయించుకున్న వ్యూహంలో భాగమే కావొచ్చు. కాంగ్రెస్‌తో రెండు భిన్న సందర్భాల్లో ఆ రెండు పార్టీలూ యూపీలో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నాయి. మాయావతి వ్యక్తి గతంగా పొత్తు లకు వ్యతిరేకం. రెండు దశాబ్దాలపాటు పొత్తుల కోసం వెంపర్లాడటం వల్లనే రాష్ట్రంలో తమ పార్టీ దెబ్బతిన్నదని ఆమె భావన. అందుకే ఆమె వీటికి దూరంగా ఉన్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 20 స్థానాలకు పరిమితమైన ఆమె పార్టీ 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూశారు. అనంతరం 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెల్చుకోలేకపోయారు. రాష్ట్రంలో ఫలానా కులం లేదా మతం ఓట్లు లభించడానికి ఆ వర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్నా మని చెప్పే పార్టీలతో పొత్తు కంటే... నేరుగా ఆ వర్గాలవారికి రాయితీలిస్తామని చెప్పడమే మార్గ మని ఆమె నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ–బీఎస్పీ కూటమిగా ఏర్పడాలని నిర్ణ యించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్న రెండు ప్రాంతీయ పార్టీలు సన్నిహితం కావడం సాధారణ విషయం కాదు. అఖిలేష్ యాదవ్ గట్టిగా కృషి చేయకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు. బీజేపీని దెబ్బతీయడానికి బీఎస్పీతో కలిసి నడ వటం అవసరమని ఆయన గుర్తించటంతోపాటు మాయావతిని కూడా అందుకు ఒప్పించారు. ఉత్తరప్రదేశ్‌లో సాగుతున్న వరస ఎన్కౌంటర్లు, గోరక్షణ పేరుతో కొన్ని ముఠాలు సాగిస్తున్న దాడులతో ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీతో విసుగెత్తి ఉన్న మాట వాస్తవం. కానీ ఆ అసంతృప్తి మాత్రమే ఎస్పీ–బీఎస్పీ కూటమికి అధిక స్థానాలు సాధించిపెట్టదు. జనం ఎదుర్కొంటున్న సమస్యలపై తమ వైఖరేమిటో, వాటికి తమ పరిష్కారాలేమిటో అవి చెప్పగలగాలి. ఆ రెండు పార్టీలూ తనను ఎందుకు దూరం పెట్టాయో కాంగ్రెస్ సైతం ఆత్మ విమర్శ చేసుకోవాలి. తనకు బలమున్న చోట ఎవరినీ లెక్క చేయకపోతే తనకూ వేరేచోట అదే పరిస్థితి ఏర్పడుతుందని యూపీ అనుభవంతో కాంగ్రెస్ గ్రహించాలి. -
ఆమెను విమర్శించే అర్హత రాజాసింగ్‌కు లేదు
-శ్రీరాంకృష్ణ బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి లాలాపేట(హైదరాబాద్‌సిటీ) ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలు బహెన్ మయావతిని విమర్శించే అర్హత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు లేదని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాంకృష్ణ అన్నారు. ఈ మేరకు మంగళవారం లాలాపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. భారతదేశంలోని దళిత బహుజనుల ప్రతిధిని అయిన మాయావతి దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను రాజ్యసభలో లేవనెత్తడం తప్పా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన ఆయన ప్రజల మద్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా సామాజిక మాద్యమాలలో వీడియోలు పెట్టం సరికాదన్నారు. రాజాసింగ్‌ను తక్షణమే ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, శాంతిభద్రతలు రక్షించే విభాగం స్పందించి అతినిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. దళితుల మనోభావాలు, దళిత నేతలను అకారణంగా విమర్శిండం మానుకోవాలని హితవు పలికారు. -
బీఎస్పీ ఖాతా తెరవనుందా...?
* నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డికి అవకాశం, సిర్పూర్లో గట్టి పోటీ * ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి: ఈ ఎన్నికల్లో రాష్ర్టంలో బీఎస్పీ తన ఖాతాను తెరవనుందా ? పరిస్థితులను అంచనా వేస్తే...ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు చెందిన ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేసి....టిక్కెట్ రాకపోవడంతో చివరకు బహుజన సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పోటీలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. సిర్పూర్లో బీఎస్పీ అభ్యర్థి ప్రధాన పోటీలో ఉన్నారు. నిర్మల్‌లో బీఏస్పీ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే ఎ. మహేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ తరపున కె. శ్రీహరిరావు, వైఎస్సార్సీపీ నుంచి ఎ. మల్లారెడ్డి, టీడీపీ అభ్యర్థిగా మీర్జా యాసిన్ బేగ్ రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో పీఆర్పీ నుంచి గెలిచిన మహేశ్వర్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి సుమారు 2,500 ఓట్ల తేడాతో ఇంద్రకరణ్‌రెడ్డి రెండవ స్థానంలో నిలిచారు. టీడీపీ-టీఆర్ఎస్ (పొత్తు) తరఫున పోటీ చేసిన ప్రస్తుత టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీహరిరావు మూడవ స్థానంలో నిలిచారు. అంటే...గత ఎన్నికల్లో 1,2,3వ స్థానాలను పొందిన అభ్యర్థులు మళ్లీ ఈ సారి రంగంలో ఉన్నారు. నియోజకవర్గంలో సుమారు 2.10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో నిర్మల్ పట్టణంలోనే సుమారు 63 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ పట్టణంలో ఇంద్రకరణ్‌రెడ్డికి మంచి పట్టు ఉంది. సొంత మండలం అయిన నిర్మల్ రూరల్‌లో కూడా ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నది. మొదటి నుంచి ప్రజల మధ్యనే ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశం. దాంతోపాటు సిటింగ్ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉండడం ఇంద్రకరణ్‌రెడ్డికి ఉపయోగకరంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వరరెడ్డి ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పనిచేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే అయ్యారు. దాంతో స్థానికులు ఆయన నుంచి మంచి జరుగుతుందని ఆశించారు. మొదట్లో పీఆర్పీలో ఉన్న ఆయన పార్టీ విలీనంతో కాంగ్రెస్‌లో కలిసారు. తర్వాత ప్రత్యేక ఉద్యమాలు వంటి వాటితోనే గత ఐదేళ్లు గడచిపోయాయి. దాంతో ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిది మానడ మండలం. ఆయనకు సొంత మండలంలో కొంత పట్టు ఉంది. పైగా గత ఎన్నికల్లో చెప్పుకోదగ్గ పోటీని ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ అంశంలో టీఆర్ఎస్కు కొంత సానుకూలత నెలకొంది. దాంతో పోటీ ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీహరిరావు (టీఆర్ఎస్) మధ్యనే నెలకొంది. కాగా వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి కూడా ఇక్కడ గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉంది. న్యాయవాద వృత్తిలో ఉన్న ఆయనకు పలు ప్రాంతాల ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల ప్రచార విషయంలో చురుకుగా పనిచేస్తున్నారు. సిర్పూర్ కూడా... సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న కోనేరు కోనప్ప కూడా ప్రత్యర్థి అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. గెలుపు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రేమ్‌సాగర్, టీఆర్ఎస్ నుంచి కావేటి సమ్మయ్య (సిటింగ్ ఎమ్మెల్యే), వైఎస్సార్సీపీ నుంచి షబ్బీర్ హుస్సేన్, టీడీపీ నుంచి రావి శ్రీనివాస్ రంగంలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం కోనేరు కోనప్ప, ప్రేమ్‌సాగర్, కావేటి సమ్మయ్య మధ్యలోనే నెలకొంది. సిటింగ్ ఎమ్మెల్యేపై అభివృద్ది విషయంలో ప్రజలకు కొంత అసంతృప్తి ఉంది. చిన్న నియోజకవర్గమైన ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొని ఉంది.