-శ్రీరాంకృష్ణ బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి
లాలాపేట(హైదరాబాద్‌సిటీ)
ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలు బహెన్ మయావతిని విమర్శించే అర్హత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు లేదని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాంకృష్ణ అన్నారు. ఈ మేరకు మంగళవారం లాలాపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు.
భారతదేశంలోని దళిత బహుజనుల ప్రతిధిని అయిన మాయావతి దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను రాజ్యసభలో లేవనెత్తడం తప్పా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన ఆయన ప్రజల మద్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా సామాజిక మాద్యమాలలో వీడియోలు పెట్టం సరికాదన్నారు. రాజాసింగ్‌ను తక్షణమే ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, శాంతిభద్రతలు రక్షించే విభాగం స్పందించి అతినిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. దళితుల మనోభావాలు, దళిత నేతలను అకారణంగా విమర్శిండం మానుకోవాలని హితవు పలికారు.