
లక్నో: బహుజన్ సమాజ్‌వాది పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయేతో గాని విపక్షాల ఇండియా కూటమితో గాని కలవబోవడంలేదని స్పష్టం చేశారు. వారితోనే కాదు మారె ఇతర పార్టీతోనూ పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పేశారు.
ఆదివారం బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యనేతలు, ఇతర కార్యవర్గంతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ యూపీలోనూ ఉత్తరాఖండ్‌లోనూ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మన సొంత బలాన్ని నమ్ముకుని ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి, ఎన్డీయే కూటమికి దూరంగా ఉంటూనే కార్యవర్గమంతా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు.
పార్టీ సభ్యులు అందరూ చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని ఫేక్ మెసేజులతో మన ప్రత్యర్ధులు రాజకీయ కుట్రలకు పాల్పడే అవకాశముందన్నారు. బీఎస్పీ వ్యతిరేక శక్తులు మన గెలుపును అడ్డుకునేందుకు ఏమి చేయడానికైనా వెనకాడవని ప్రతి దశలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, దీని కారణంగా మన ఎన్నికల ప్రణాళిక దెబ్బ తినకూడదని అన్నారు.
అధికార బీజేపీ పార్టీ పరిపాలనపై స్పందిస్తూ.. వారి పాలనలో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని.. ద్రవ్యోల్బణం,పేదరికం, నిరుద్యోగం, శాంతిభద్రతల లోపం, విద్య, వైద్యం వంటి సమస్యలతో సహా ఏదీ సరిగ్గా లేదని చెబుతూనే ప్రజా సంక్షేమం, ప్రజా ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ పార్టీల తీరు ఒకేలా ఉంటుందని పూర్తిగా ప్రజా వ్యతిరేక ధోరణిలో వారి వ్యవహారం ఉంటుందని అన్నారు.
నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి రిజర్వేషన్‌ను ప్రతిపాదికగా తీసుకోకూడదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న బుల్‌డోజర్ యాక్షన్లపై ఆమె స్పందిస్తూ ఒక వ్యక్తి దోషి అని నిరూపితం కాక ముందే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. పైగా ఆ వ్యక్తి చేసిన తప్పుకు ఆ కుటుంబాన్ని శిక్షిస్తున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదించదగినది కాదని పూర్తి ప్రజా వ్యతిరేక విధానమని అన్నారు.
01-10-2023-BSP PRESS NOTE-UP MEETING pic.twitter.com/PVgb7KdhiA
— Mayawati (@Mayawati) October 1, 2023
ఇది కూడా చదవండి: బీజేపీ సమరశంఖం.. పసుపు బోర్డుపై మోదీ కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment