ఉత్తరప్రదేశ్‌లోని పది అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో బీఎస్పీ, చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొననున్నదనే మాట వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయించుకుంది. లోక్‌సభలో విజయం సాధించిన చంద్రశేఖర్ ఆజాద్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల పోరులోకి దూకారు. ఇప్పటి వరకూ మాయావతి రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) ఘజియాబాద్ సదర్ స్థానం నుండి చౌదరి సత్పాల్, ముజఫర్‌నగర్‌లోని మీరాపూర్ స్థానం నుండి జాహిద్ హసన్, మీర్జాపూర్‌లోని మజ్వాన్ స్థానం నుండి ధీరజ్ మౌర్యలను ఎన్నికల బరిలోకి దించినట్లు ప్రకటించింది. మిగిలిన ఏడు స్థానాల్లో పోటీకి దిగే అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని పార్టీ తెలిపింది.
ఇక బీఎస్పీ విషయానికొస్తే మిల్కిపూర్, మిరాపూర్ నుండి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించింది. మిల్కీపూర్ టిక్కెట్‌ను రామ్ గోపాల్ కోరికి ఇవ్వగా, మీరాపూర్ నుండి చంద్రశేఖర్ ఆజాద్‌కు సన్నిహితుడైన షా నాజర్‌ను అభ్యర్థిగా నిలబెట్టారు. షా నాజర్ ప్రస్తుతం బీఎస్పీ జిల్లా పంచాయతీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన చంద్రశేఖర్ ఆజాద్ పార్టీలో సభ్యునిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment