న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అందరి దృష్టి హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై నిలిచింది. ఈ రాష్ట్రం రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్నందున ఈ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకం కానున్నాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ఈసారి బీజేపీతో పాటు కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), జేజేపీ, బీఎస్పీ, ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) పోటీలో ఉన్నాయి. జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీ కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 1,031 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఒక కోటి 5 లక్షల మంది పురుషులు, 95 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అధికార బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలనే తపనతో ఉండగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉంది. హర్యానా ఎన్నికల్లో తొలిసారిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కోర్టు నుంచి బెయిల్ పొందిన తర్వాత హర్యానా ఎన్నికల్లో ఆప్ సత్తాను చాటాలని ప్రయత్నిస్తున్నారు. కాగా హర్యానాలోని కొన్ని సీట్లు అధికార పీఠానికి చేరువ చేసేవిగా పరిగణిస్తారు. వాటి వివరాల్లోకి వెళితే..
లాడ్వా
లాడ్వా స్థానం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం కురుక్షేత్ర లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి బీజేపీకి 47 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఈ సీటు బీజేపీకి సురక్షితమైన సీటుగా చెబుతారు. ఈ సీటు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జోగా సింగ్, ఐఎన్‌ఎల్‌డీకి చెందిన షేర్ సింగ్ బర్సామి, కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్, జేజేపీకి చెందిన వినోద్ శర్మ పోటీపడుతున్నారు.
జులానా
హర్యానాలోని జులనా సీటు కూడా అధికారానికి కీలకమైనదని చెబుతారు. మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇక్కడ దాదాపు రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. యోగేష్ బైరాగికి బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. గత ఎన్నికల్లో 49 శాతం ఓట్లతో గెలిచిన అమర్జీత్ ధండాకు జేజేపీ టికెట్ ఇచ్చింది. సురేంద్ర లాథర్‌కు ఐఎన్‌ఎల్‌డీ టికెట్ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ కైత దలాల్‌కు టికెట్ కేటాయించింది.
హిసార్
ఈసారి అందరి చూపు హిసార్ స్థానంపైనే నిలిచింది. ఇక్కడి నుంచి సావిత్రి జిందాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తా ఇక్కడి నుంచి ఎన్నికల పోరులో దిగారు. ఆయన 2014 ఎన్నికల్లో జిందాల్ కమల్ గుప్తా చేతిలో ఓడిపోయారు. నాడు సావిత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ రామ్ నివాస్ రారాను బరిలోకి దింపింది. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇది కూడా చదవండి: మాగ్నైట్‌కు ఎగుమతి కేంద్రంగా భారత్
Comments
Please login to add a commentAdd a comment