Constituent Assembly
-
Haryana Elections-2024: ఆ సీట్లపైనే అందరి దృష్టి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అందరి దృష్టి హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై నిలిచింది. ఈ రాష్ట్రం రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్నందున ఈ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకం కానున్నాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ఈసారి బీజేపీతో పాటు కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), జేజేపీ, బీఎస్పీ, ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) పోటీలో ఉన్నాయి. జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీ కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.రాష్ట్రంలో మొత్తం 1,031 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఒక కోటి 5 లక్షల మంది పురుషులు, 95 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అధికార బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలనే తపనతో ఉండగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తన సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉంది. హర్యానా ఎన్నికల్లో తొలిసారిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విజయం కోసం ఉవ్విళ్లూరుతోంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కోర్టు నుంచి బెయిల్ పొందిన తర్వాత హర్యానా ఎన్నికల్లో ఆప్ సత్తాను చాటాలని ప్రయత్నిస్తున్నారు. కాగా హర్యానాలోని కొన్ని సీట్లు అధికార పీఠానికి చేరువ చేసేవిగా పరిగణిస్తారు. వాటి వివరాల్లోకి వెళితే..లాడ్వాలాడ్వా స్థానం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం కురుక్షేత్ర లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుండి బీజేపీకి 47 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఈ సీటు బీజేపీకి సురక్షితమైన సీటుగా చెబుతారు. ఈ సీటు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జోగా సింగ్, ఐఎన్ఎల్డీకి చెందిన షేర్ సింగ్ బర్సామి, కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్, జేజేపీకి చెందిన వినోద్ శర్మ పోటీపడుతున్నారు.జులానాహర్యానాలోని జులనా సీటు కూడా అధికారానికి కీలకమైనదని చెబుతారు. మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇక్కడ దాదాపు రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు. యోగేష్ బైరాగికి బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. గత ఎన్నికల్లో 49 శాతం ఓట్లతో గెలిచిన అమర్జీత్ ధండాకు జేజేపీ టికెట్ ఇచ్చింది. సురేంద్ర లాథర్‌కు ఐఎన్ఎల్డీ టికెట్ ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ కైత దలాల్‌కు టికెట్ కేటాయించింది.హిసార్ఈసారి అందరి చూపు హిసార్ స్థానంపైనే నిలిచింది. ఇక్కడి నుంచి సావిత్రి జిందాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తా ఇక్కడి నుంచి ఎన్నికల పోరులో దిగారు. ఆయన 2014 ఎన్నికల్లో జిందాల్ కమల్ గుప్తా చేతిలో ఓడిపోయారు. నాడు సావిత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ రామ్ నివాస్ రారాను బరిలోకి దింపింది. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇది కూడా చదవండి: మాగ్నైట్‌కు ఎగుమతి కేంద్రంగా భారత్ -
40 ఇయర్స్ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్ రియల్ సీఎం
ఏపీలో చిట్టచివరి నియోజకవర్గం, ఒక మూలకు విసిరేసినట్లు ఉండే కుప్పానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను చెప్పినట్లే తాగునీరు, సాగునీరు విడుదల చేశారు. ఇందుకు అవసరమైన కాల్వలను తవ్వించి, ఇతర ఏర్పాట్లు చేసి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా నీటిని కుప్పం వరకు తీసుకువెళ్లగలిగారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, ముప్పైఐదేళ్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేని పనిని జగన్ చేసి చూపించారు. తద్వారా ఈ ప్రజల దాహార్తిని తీర్చే యత్నం చేశారు. అలాగే ఆరువేల ఎకరాలకు సాగు నీరు కూడా ఇవ్వడానికి సంకల్పించారు. ఇందుకోసం సుమారు అరు వందల కోట్ల రూపాయలను వ్యయం చేశారు. కుప్పంలో జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ "ఇంతకాలం చంద్రబాబును ఈ నియోజకవర్గ ప్రజలు భరించినందుకు జోహార్లు" అని వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఈ సభలో చంద్రబాబు టైమ్‌లో కుప్పంకు జరిగిన పనులు, తన హయాంలో జరిగిన కార్యక్రమాలను వివరించారు. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గ ప్రజలకు వివిధ స్కీముల ద్వారా 1400 కోట్ల మేర లబ్ది జరిగిన విషయాలను లెక్కలతో సహా వివరించారు. తాను ప్రాంతం, కులం, మతం, పార్టీ చూడకుండా, ఎలాంటి వివక్ష లేకుండా స్కీములు అమలు చేశానని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు తనపై కోపం వచ్చినప్పుడల్లా, పులివెందుల , కడప, రాయలసీమ ప్రజలను దూషిస్తుంటారని, తాను మాత్రం ఎప్పుడు అలా చేయలేదని ప్రజల మనసులను ఆకట్టుకునే యత్నం చేశారు.ఇంతవరకు ఒప్పుకోవలసిందే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని వద్ద కాపు ఉద్యమకారులు రైలును దగ్దం చేస్తే, ఆ పని చేసింది కడప రౌడీలంటూ మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. కాని పోలీసులు అన్నిటిని విచారించి ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారిని అరెస్టు చేశారు. అలాగే ఆయన తనకు ఓటు వేయని వారికి తాను ఎందుకు సదుపాయాలు కల్పించాలని అనేవారు. తనకు ఓటు వేయకపోతే తాను వేసిన రోడ్డు, తాను మంజూరు చేసిన మరుగు దొడ్డి ఎలా వాడతారని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించేవారు. కానీ జగన్ అందుకు విరుద్దంగా తనకు ఓటు వేసినా, వేయకపోయినా, తన ప్రభుత్వ స్కీములు ప్రాంతం, కులం, పార్టీ,మతం వంటివాటితో సంబంధం లేకుండా అమలు చేస్తున్నారు. కుప్పం ప్రజలు సైతం అందులో భాగమేనని, అందుకే మాట ఇచ్చిన ప్రకారం నీరు అందించానని, వివిధ అబివృద్ది పనులు చేపట్టానని సీఎం జగన్ చెప్పారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కుప్పంలోని గ్రామీణ ప్రాంతంలో మీటింగ్ పెట్టినా భారీ ఎత్తున జనం రావడం, వారు ఆయా సమయాలలో అనుకూల నినాదాలతో హోరెత్తించడం కనిపించింది. దీంతో టిడిపి అధినేత కుప్పంలో తన పోటీపై గట్టిగా ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. కుప్పం ప్రజలు చంద్రబాబును ఇంతకాలం భరించినందుకు వారికి జోహార్లు అని జగన్ చమత్కరించారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ఆయన హామీ ఇవ్వడం ద్వారా కుప్పం ప్రాముఖ్యత తగ్గదని ప్రజలకు ఆయన సంకేతం ఇచ్చారు. గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలలో YSRCP విజయఢంకా మోగించడం, కుప్పానికి నీరు, బలహీనవర్గాలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు, కుప్పం మున్సిపాలిటీగా మారడం, రెవెన్యూ డివిజన్ ఇవ్వడం వంటివి పార్టీకి ప్లస్ అవుతాయి. జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న పట్టుదలతో పనులు చేశారు. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికైతే చంద్రబాబు గతంలో మాదిరి నల్లేరు మీద బండి మాదిరి ఎన్నిక చేసుకోలేకపోవచ్చని, తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన టైమ్ లో కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పూర్తి చేయలేకపోవడం పెద్ద వైఫల్యంగా చెప్పాలి. హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రతిపాదన ఎన్.టి.ఆర్.టైమ్ లో వచ్చినా,దానిని ఆచరణ లో పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు చివరిలో ఉన్న కుప్పంకు సైతం నీరు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. కుప్పం ప్రాంతానికి శాశ్వతంగా నీటి సమస్య తీర్చడానికి వీలుగా రెండు రిజర్వాయర్లను నిర్మించడానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రకంగా కుప్పం ప్రజల అభిమానం పొందడానికి జగన్ యత్నించారు. కాగా చంద్రబాబు మాత్రం పులివెందుల ప్రజలను తరచుగా అవమానించేవారు. కుప్పంకు నీరు ఇవ్వడంపై చంద్రబాబు స్పందించిన తీరు కూడా సరిగా లేదు. నిజానికి ఆయన హర్షం వ్యక్తం చేసి ఉంటే హుందాగా ఉండేది. ఆ పని చేయకపోగా, కుప్పం ప్రజలను దోచుకున్నారంటూ, ఏదో హింస జరిగిందంటూ పిచ్చి ఆరోపణలను చంద్రబాబు చేసి తన విలువను మరింత తగ్గించుకున్నారు. పులివెందులలో పొలాలు ఎండిపోతున్నాయని అంటూ ఏవేవో మాట్లాడారు. రాయలసీమలో నీటి పారుదల ప్రాజెక్టులకు అదికంగా ఖర్చు చేసింది తానేనని ఆయన ప్రకటించుకున్నారు. పదమూడు శాతం పనులు కుప్పం బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి మిగిలాయని, కాని జగన్ మొత్తం తానే చేసేసినట్లు చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అంతే తప్ప తాను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం కు ఎందుకు నీళ్లు తేలకపోయింది మాత్రం చెప్పలేకపోయారు. దీంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. కాకపోతే బుకాయింపులో దిట్ట కనుక యధాప్రకారం డబాయిస్తూ ప్రకటన చేశారు. దానిని ఈనాడు,ఆంధ్రజ్యోతి బాకా మీడియాలు ప్రచారం చేశాయి. ఈనాడు అయితే కుప్పంను తానే ఉద్దరించినట్లు జగన్ మాట్లాడడం విని స్థానికులు విస్మయం చెందుతున్నారని ఒక దిక్కుమాలిన కధనాన్ని ఇచ్చింది. కుప్పంకు 35 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్నప్పటికీ పట్టణాన్ని ఎందుకు మున్సిపాలిటీ చేయలేకపోయారు? ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు? ఎందుకు 15వేలమందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయారు? అసలు కుప్పంలో కొన్ని వార్డులకు వెళ్లడానికి సరైన రోడ్లే ఎందుకు లేవు? రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కుప్పం కన్నా పులివెందుల ఎంత చక్కగా ఉంటుందో స్వయంగా ఎవరైనా వెళ్లి చూడవచ్చు. పులివెందుల చుట్టూ రోడ్డు, పరిశ్రమలు, పలు విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీ మొదలైనవి ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి కాదా? కుప్పంకు ఎయిర్ పోర్టు ఇస్తానని పిచ్చి ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో ఒక పరిశ్రమనైనా ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? వీటన్నిటిని కప్పిపుచ్చుతూ, జగన్ కుప్పం కు నీళ్లు ఇవ్వడాన్ని చూసి ఓర్వలేక ఈనాడు ఇలాంటి దద్దమ్మ వార్తలు ఇస్తోంది. చంద్రబాబు ఇంతకాలం దొంగ ఓట్లపై ఆధారపడి ఎక్కువ మెజార్టీ పొందగలిగారన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం ఆ దొంగ ఓట్లను చాలావరకు తొలగించినట్లు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఆయన తీవ్రమైన పోటీని ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. అందుకే చంద్రబాబు ఎక్కువగా కంగారు పడుతున్నారు. దానికి తోడు జగన్ కుప్పంపై దృష్టి పెట్టి అభివృద్ది పనులు, సంక్షేమ స్కీములు అమలు చేశారు. కుప్పంకు నీరు కూడా వచ్చేలా చేశారు. ఇది YSRCPకి ప్లస్ గా మారే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టిడిపి మీడియాలు నీరు విడుదల చేసిన మరుసటి రోజు కాల్వలో నీరు లేదంటూ ఒక తప్పుడు కదనాన్ని వండి జనాన్ని ఏమార్చడానికి యత్నించారు. ఇంకా నీళ్లురాని కాల్వలో దిగి టిడిపి నేతలు యాగీ చేశారు. దీనిని బట్టే వారు ఎంత భయపడుతున్నదీ తెలుసుకోవచ్చు. గెలుపు ఓటములు సంగతి ఎలా ఉన్నా, జగన్ మాత్రం కచ్చితంగా తన రాజకీయ ప్రత్యర్ధి అని కూడా చూడకుండా, తన పార్టీకి ఓటు వేశారా? లేదా? అన్నదానితో నిమిత్తం లేకుండా కుప్పం ప్రజలకు కూడా మేలు చేశారన్నది నిజం. అందుకు ఎవరైనా అభినందించాల్సిందే. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు -
'జన గణ మన'ను జాతీయ గీతంగా స్వీకరించింది ఈరోజే!
'జన గణ మన'ను జాతీయ గీతంగా స్వీకరించింది ఈరోజే. భారత రాజ్యంగ సభ జనవరి 24 1950లో జన గణ మన గీతాన్ని భారత జాతీయ గీతంగా ఆమోదించింది. అయిదు పాదాలున్న ‘భారత భాగ్య విధాత’లోని మొదటి పాదాన్ని జాతీయ గీతంగా స్వీకరించారు. రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ఈ గీతానికి సంగీత బాణిని సమకూర్చింది కూడా ఆయనే.ఒకసారి మదనపల్లిలోని బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్‌ని 1919లో రవీంద్రనాద్ ఠాగూర్ సందర్శించాడు. ఆ కాలేజీలో ఉన్నప్పుడు జన గణ మన గీతాన్ని ‘మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు. 52 సెకండ్లలో జాతీయగీతం.. జాతీయ గీతం పూర్తిగా 52 సెకండ్ల కాలవ్యవధిలో ఆలపించాలి. జాతీయ గీతాన్ని ఈ కింది ప్రభుత్వ కార్యక్రమాలలో, వివిధ సందర్భాలలో పూర్తిగా వినిపించాలి. సివిల్, మిలటరీ ఇన్ స్టిట్యూట్స్, రాష్ట్రపతి, గవర్నర్ కు గౌరవందనం సందర్భాల్లో ఆలపించాలి. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ వంటి ప్రముఖులు లేకున్నప్పటికీ పరేడ్లలో ఆలపిస్తారు. రాష్ట్రప్రభుత్వ అధికార కార్యక్రమాలకు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజా సందోహ కార్యక్రమాలకు రాష్ట్రపతి వచ్చినప్పుడు, వెళ్తున్నప్పుడు, ఆకాశవాణిలో రాష్ట్రపతి జాతినుద్దేశించి చేసే ప్రంగానికి ముందు, వెనుక ఆలపిస్తారు. రాష్ట్ర గవర్నర్ తన రాష్ట్ర పరిధిలో అధికారిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు, నిష్క్రమించేటప్పుడు, జాతీయ పతాకాన్ని పరేడ్‌కు తెచ్చినప్పుడు, రెజిమెంటల్ కలర్స్ బహుకరించినప్పుడు, నౌకాదళంలో కలర్స్ ఆవిష్కరించినప్పుడు ఈ గీతాన్ని ఆలపిస్తారు. కొన్ని సందర్భాల్లో జాతీయ గీతాన్ని సంక్షిప్తంగా మొదటి, చివరి వరుసలను ఆలపించుకోవచ్చు. అలా ఆలపించడం 52 సెకండ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే? హడావిడిగా ఏదో పాడేశాం అన్నట్లుగానూ లేక సాగదీసినట్లుగా పాకుండా ఉండేదుకు ఇలా వ్యవధిని నిర్ణయించారు. మన జాతీయ గీతాన్ని గౌరవప్రదంగా ఆలపించదగినది అని చెప్పడానికే ఇలా వ్యవధిని ఏర్పాటు చేశారు. 1947లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జాతీయ గీతం గురించి భారత ప్రతినిధి బృందానికి అడిగినప్పుడు జన గణ మన రికార్డింగ్‌ను జనరల్‌అసెంబ్లీకి అందించారు. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతినిధుల ముందు జాతీయగీతాన్ని ఆలపించారు. అయితే మన జాతీయ గీతాన్ని అన్ని దేశాలు ప్రశంసించాయి. మూడు సంవత్సరాల తర్వాత అంటే 1950 జనవరి 24న భారత రాజ్యాంగంపై సంతకం చేయడానికి అసెంబ్లీ సమాశమైంది. ఈ సమయంలో దేశ మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ అధికారికంగా 'జన గణ మన' ను జాతీయ గీతంగా ప్రకటించారు. దీంతో మన గణతంత్ర దినోత్సవానికి రెండు రోజుల ముందు ఇవాళే(జనవరి 24)న 'జన గణ మన'ను జాతీయగీతంగా స్వీకరించింది. (చదవండి: తొలిసారిగా మొక్కలు మాట్లాడుకోవడాన్ని కెమెరాలో బంధించిన శాస్త్రవేత్తలు!) -
జనసేన x టీఢీపీ
గండేపల్లి/గోకవరం/మదనపల్లె/పెడన/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు)/తుమ్మపాల (అనకాపల్లి జిల్లా) : టీడీపీ–జనసేన ఆత్మియ సమావేశాలు ఇరు పార్టీ నేతల మధ్య అంతరాలను బట్టబయలు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల నేతలకు ఏ దశలోనూ అసలు పొసగడం లేదు. దీంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు బాహాబాహీకి దిగుతూ సమావేశాలను రసాభాసగా మార్చేస్తున్నారు. తాజాగా గురువారం జరిగిన సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ జనసేన నేతకు టికెట్ ఇస్తే మద్దతివ్వం: టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ప్రతిజ్ఞ టీడీపీ, జనసేన పొత్తు కాకినాడ జిల్లాలో ఆదిలోనే వికటిస్తోంది. ఇటీవల పిఠాపురంలో ఈ రెండు పార్టీల సమావేశం రసాభాసగా ముగియగా, తాజాగా గురువారం జగ్గంపేట నియోజకవర్గ సమావేశానిదీ అదే పరిస్థితి. సమావేశానికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల నెహ్రూ, ఆయన తనయుడు నవీన్‌కుమార్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పాటంశెట్టి సూర్యచంద్ర, పెద్దాపురం, పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జిలు తుమ్మల బాబు, తంగెళ్ల ఉదయశ్రీనివాస్ హాజరయ్యారు. గోకవరం మండల జనసేన పార్టీ కన్వినర్ ఉంగరాల మణిరత్నంపై ఇటీవల టీడీపీ నేత గణేష్ దాడి చేసిన అంశాన్ని సమావేశం ప్రారంభంలోనే సూర్యచంద్ర ప్రస్తావించారు. నెహ్రూ ప్రసంగిస్తుండగానే.. దాడి వ్యవహారాన్ని తేల్చాలంటూ పట్టుబట్టారు. జ్యోతుల నవీన్ కలుగజేసుకోవడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. సూర్యచంద్రను నవీన్ గెంటివేయడంతో ఒక్కసారిగా ఇరు పార్టీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. జనసేన టికెట్టు సూర్యచంద్రకు ఇస్తే మద్దతిచ్చేది లేదంటూ జ్యోతుల నెహ్రూ ప్రతిజ్ఞ చేశారు. దీంతో సూర్యచంద్ర, ఆ పార్టీ నాయకులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మాకన్నా తక్కువ స్థాయి నేతకు మైక్ ఎలా ఇస్తారు? అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో జరిగిన టీడీపీ–జనసేన ఆత్మియ సమావేశంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్, షాజహాన్‌బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు హాజరయ్యారు. జనసేన నుంచి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్, రాయలసీమ కోకన్వినర్ గంగారపు రాందాస్‌చౌదరి, చేనేత విభాగం అధ్యక్షుడు అడపా సురేంద్ర పాల్గొన్నారు. మొదట రాందాస్‌చౌదరి, తర్వాత రమేష్ ప్రసంగించారు. తర్వాత జనసేన తరఫున శివరాం, సురేంద్రకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనిని మైఫోర్స్ మహేష్ తమ్ముడు, అతడి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ నాయకుడికి కాకుండా తమకంటే తక్కువ స్థాయి నాయకుడికి మైక్ ఎలా ఇస్తారంటూ రాందాస్‌చౌదరిపై తిరుగుబాటు చేయడమేగాక.. గొడవకు దిగారు. కాగా, జనసేన మదనపల్లె అభ్యరి్థగా ప్రచారం చేసుకుంటున్న రామాంజనేయులు, దారం అనిత వర్గం సమావేశానికి డుమ్మా కొట్టారు. కుర్చిలతో కుమ్ములాట కృష్ణా జిల్లా పెడనలో సమావేశం జరుగుతుందని టీడీపీ, జనసేన పార్టీలోని కొందరికి సమాచారం వెళ్లింది. మరికొంతమంది ముఖ్య నేతలకు సమాచారం చేరకపోవడంతో.. తమ నాయకుడికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసేందుకు టీడీపీలోని మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ వర్గానికి చెందిన కొందరు ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. జనసేన పెడన నియోజకవర్గ ఇన్చార్జిగా ఇటీవల ఉరివి సర్పంచ్ సురేష్‌ను నియమించడం తెలిసిందే. నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహించిన రామ్‌సుదీర్‌ను కాదని వేరే వారికి పదవి ఇవ్వడంపై రామ్సు«దీర్ వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. టీడీపీ నేతలు జనసేన ఇన్చార్జి సురేష్ వేదికపైకి ఆహ్వనించి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు యత్నించారు. దీంతో రామ్‌సుదీర్ వర్గీయులు గొడవకు దిగారు. ఆ సమయంలోనే జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ సభావేదిక వద్దకు చేరుకున్నారు. సురేష్‌ను ఏ విధంగా పెడనకు ఇన్చార్జిగా నియమించారంటూ రామ్సు«దీర్ వర్గీయులు నిలదీశారు. అక్కడే ఉన్న జనసేనలోని మరో వర్గం వారు కూడా రామ్‌సుదీర్ వర్గంతో గొడవకు దిగడంతో రసాభాసగా మారింది. ఒక వర్గంపై మరో వర్గం వారు కుర్చిలు విసురుకున్నారు. జనసేన వాళ్లు కుమ్ములాడుకుంటున్న సమయంలో టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సభా వేదిక వద్దకు వచ్చారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించి బయటకు వెళ్లిపోయారు. జనసేన రాష్ట్ర నేత పిలిచినా.. డోంట్ కేర్! విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల ఆత్మియ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ వచ్చారు. ఆయన రాగానే జనసేన నాయకులు లేచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పక్కన కుర్చీ వేశారు. అయితే మూర్తియాదవ్ అక్కడ కాకుండా లైన్ చివరిలో కూర్చున్నాడు. సత్యనారాయణ పలుమార్లు పిలిచినా కనీసం ఆయన వైపు కూడా మూర్తియాదవ్ చూడలేదు. టీడీపీ నాయకులు సైతం పిలిచినా ఆయన స్పందించలేదు. జనసేన నేతలకు అధిష్టానం షోకాజ్.. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అడిగిన అనకాపల్లి నియోజకవర్గంలోని జనసేన నేతలకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులిచ్చింది. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న తమకు షోకాజ్ నోటీసులిచ్చి అవమానించడం అన్యాయమని దూలం గోపీనాథ్, మళ్ల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
54 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఇంచార్జ్‌ల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తొలి విడతగా 54 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్‌ల జాబితాను గురువారం.. బీఆర్ఎస్ విడుదల చేసింది. పార్టీ ఇంచార్జ్‌లతో జరిగిన టెలి కాన్ఫరెన్స్ సమావేశంలో కేటీఆర్.. వారికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితికి అద్భుతమైన సానుకూల వాతావరణం ఉందన్నారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్ధానంలో నిలిపేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్లిన కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు ముమ్మాటికి బ్రహ్మరథం పడుతున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణ పైన పార్టీ ఇంచార్జీలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని ఓట్లు అడగాలని, ఇందుకోసం 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రతి ఇంటి గడపకు తీసుకువెళ్లాలని పార్టీ ఇంచార్జ్‌లకు కేటీఆర్ సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికలు కేవలం హామీలు ఇచ్చేందుకు వేదికలు మాత్రమే అని బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 10 సంవత్సరాలలో చేసిన ప్రగతిని ప్రజలకు వివరించే ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం కావాలని పార్టీ నాయకులకు సూచించారు. -
ఓటమి భయంతోనే ‘కామారెడ్డికి’ కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. సీజన్ రాకముందే కోయిల కూసింది అన్నట్లుగా ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ప్రత్యేక అభివృద్ధి పేరుతో గజ్వేల్ నియోజకవర్గంలో లెక్కలేనంత ఖర్చు పెట్టినా.. అక్కడ గెలిచే పరిస్థితిలేదనే కేసీఆర్ మరో చోటుకు వెళ్తున్నారని విమర్శించారు. ఈసారి గజ్వేల్‌లో ఓడిపోతున్నారనే సర్వే ఫలితాల భయంతోనే కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని భట్టి అన్నారు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయాలన్న నిర్ణయంతోనే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందనేది అర్థం అవుతోందని.. బీఆర్ఎస్ నేతలు పార్టీలు మారుతారనే ఆందోళనలోనే కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన ముందే చేశారని అన్నారు. సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం ఢిల్లీలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్‌కే గెలిచే పరిస్థితి లేకపోతే, ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తంచేశారు. ఏ లక్ష్యాలకోసం తెలంగాణ సాధించుకున్నామో.. ఆ లక్ష్యాలన్నీ కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫిబ్రవరి, మార్చి నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిందని.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచి్చనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కాగా, సెల్ఫీ విత్ కాంగ్రెస్ అభివృద్ధి అనే కార్యక్రమంతో మరోసారి ప్రజల్లోకి వెళ్తామని.. కాంగ్రెస్ హయంలో చేసిన అభివృద్ధి పనులను సెల్ఫీ తీసుకొని ప్రజలతో పంచుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనతో నష్టపోయిన వారందరూ కాంగ్రెస్‌తో కలసిరావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. -
Congress Party: కచ్చితంగా గెలిచేవి..41.. కష్టపడితే గెలిచేవి.. 42
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు కోసం స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసుకున్న టీ కాంగ్రెస్... అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వస్తోంది. ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కసరత్తు నివేదిక ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కె.సి.వేణుగోపాల్‌కు అందినట్లు తెలుస్తోంది. శనివారం హైదరాబాద్‌లో ఆయన పర్యటనకు ముందే సునీల్ కనుగోలు ఈ నివేదికను వేణుగోపాల్‌కు అందజేశారు. ఈ నివేదిక ఆధారంగానే ఏఐసీసీ నియమించిన పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశంలో వేణుగోపాల్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. సునీల్ కనుగోలు మూడు రకాలుగా విభజన... వాస్తవానికి గత నెల 24న జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో పార్లమెంటు నియోజకవర్గాలవారీగా సునీల్ కనుగోలు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ స్థానాల పరిధిలో పార్టీ అంతంత మాత్రంగానే ఉందని, మిగిలిన చోట్ల ప్రత్యర్థులకు పోటీ ఇచ్చే స్థితిలో ఉన్నామని వివరించారు. అయితే ఏ అసెంబ్లీ స్థానంలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఆయన ఆ సమావేశంలో వెల్లడించలేదు. తాజాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకుగాను 41 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గెలిచే అవకాశముందని, మరో 42 చోట్ల గెలుపు కోసం కష్టపడాల్సి ఉంటుందని, 36 స్థానాల్లో గెలుపు అంత సులభం కాదని, ఆ స్థానాలపై ప్రస్తుత పరిస్థితుల్లో ఆశలు వదులుకోవాల్సిందేనని కె.సి.వేణుగోపాల్‌కు ఇచ్చిన నివేదికలో ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నివేదిక ప్రకా రం గెలుపు అవకాశాలున్న చోట్ల ఎన్నికల వరకు ఇదే ఊపును కొనసాగించాలని, గెలుపు కోసం కష్టపడాల్సిన స్థానాల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కె.సి.వేణుగోపాల్ సూచించినట్లు సమాచారం. ఇక, పరిస్థితి ఏమాత్రం బాగాలేని 36 స్థానాల్లో ఏం చేస్తే మెరుగుపడతామన్న దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని వేణుగోపాల్ మార్గనిర్దేశం చేసినట్టు తెలు స్తోంది. ఈ సమావేశంలో ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ సభ్యురాలు దీపాదాస్ మున్షీ, రాష్ట్ర ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షు డు రేవంత్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్‌బాబు, విష్ణునాథ్, మన్సూర్‌అలీఖాన్, రోహిత్‌చౌదరి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పొలిటికల్ కారిడార్: పాలేరు నాదే అంటున్న ఎర్రన్న..
-
డీలిమిటేషన్లో మార్పులు చేయలేం
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఆర్డర్ గెజిట్ నోటిఫికేషన్‌ను సవాల్ చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం, జమ్మూకశ్మీర్(యూటీ) స్పష్టం చేశాయి. ఈ పునర్విభజనకు సంబంధించి కమిషన్ ఏర్పాటు, దాని పరిధి, పదవీకాలం, అధికారాలపై ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో దీనిపైæ వ్యాఖ్యలు చేయదలచుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ హజీ అబ్దుల్ గనీ ఖాన్, మహమూద్ మట్టూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం, జమ్మూకశ్మీర్(యూటీ), ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశాయి. పునర్విభజనపై ఏర్పాటైన కమిషన్ గెజిట్‌లో ప్రచురణ అయిన తర్వాత డీలిమిటేషన్ చట్టం–2002లోని సెక్షన్ 10(2) ప్రకారం సవాల్ చేయడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. మేఘరాజ్ కొఠారీ వర్సెస్ డీలిమిటేషన్ కమిషన్ కేసులో ఈ సెక్షన్‌ను ఇప్పటికే కోర్టు సమర్థించిందని గుర్తుచేసింది. పిటిషన్లను అనుమతిస్తే గెజిట్ నిష్ఫలం అవుతుందని, ఇది ఆర్టికల్ 329ని ఉల్లంఘించడమేనని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంపునకు సంబంధించి ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇదే కేసుతో సుప్రీంకోర్టు గతంలో జత చేసింది. -
మూడు ముక్కలాట.. కమలాపురం టీడీపీలో వర్గపోరు
సాక్షి ప్రతినిధి, కడప: కమలాపురం నియోజకవర్గ టీడీపీలో మూడు ముక్కలాట పతాక స్థాయికి చేరింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న పుత్తా నరసింహారెడ్డి ఈసారి కూడా తనకే టీడీపీ టిక్కెట్ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే వరుసగా మూడుసార్లు ఓటమి చెందిన వ్యక్తికి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చేది లేదంటూ ఆ పార్టీ అధిష్టానం నిబంధన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పుత్తా నరసింహారెడ్డి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా వరుసగా మూడుసార్లు ఓటమి చెందగా, అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థిగా ఒకసారి ఓడిపోయారు. ఈ లెక్కన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం నాలుగుసార్లు ఓటమి చెందారు. పుత్తా టీడీపీ తరుపున మూడుసార్లు ఓటమి చెందిన నేపథ్యంలో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరని పార్టీలో ఆయన వ్యతిరేకవర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. మరోవైపు గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సైతం రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తానేనని విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవలే పార్టీ యువనేత లోకేష్‌ను సైతం కలిశారు. టిక్కెట్ తనదేనని ఖరాఖండిగా చెబుతున్నారు. ఇంకోవైపు కమలాపురం నియోజకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌శర్మ సైతం ఈ దఫా కమలాపురం టిక్కెట్ తనదేనని ప్రచా రం చేసుకుంటున్నారు. చాలాకాలంగా పుత్తా నరసింహారెడ్డి, సాయినాథ్‌శర్మల మధ్య విబేధాలు ఉన్నాయి. దీంతో సాయినాథ్‌శర్మ ‘పుత్తా’కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీలో జోరుగా ప్రచా రం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తనకే టీడీపీ టిక్కెట్ అంటూ ఆయన కూడా ప్రచారం చేసుకుంటున్నారు. టిక్కెట్ ఇస్తే ఎంత డబ్బు అయి నా ఖర్చు చేసేందుకు సిద్ధమని, ఇదే విషయం అధిష్టానానికి సైతం తెలిపినట్లు సాయినాథ్‌శర్మ వర్గం ప్రచారం చేస్తోంది. వరుసగా మూడుసార్లు ఓడిన వారికి పార్టీ టిక్కెట్టు ఇవ్వదని, ఈ లెక్కన తనకే టిక్కెట్టు అంటూ సాయినాథ్‌శర్మ క్యాడర్‌కు చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చెల్లాచెదురైన క్యాడర్ నియోజకవర్గంలో ఉన్న ముగ్గురు ముఖ్య నేతలు టిక్కెట్ నాకంటే నాకంటూ ప్రచారం చేసుకుంటుండడంతో ఉన్న క్యాడర్ ఇప్పటికే వర్గాలుగా విడిపోయింది. పైపెచ్చు తమ నేతకే టిక్కెట్టు అంటూ గ్రామ స్థాయిలోనే క్యాడర్ సైతం ప్రచారం చేస్తోంది. పుత్తా నరసింహారెడ్డికి నచ్చజెప్పి రాబోయే ఎన్నికల్లో తమ నేతకే టిక్కెట్టు ఇస్తారని వీరశివారెడ్డి వర్గం చెబుతోంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచామని, ఆర్థికంగా నష్టపోయామని, ఈ పరిస్థితుల్లో మరోమారు కూడా తమ నేతకే టిక్కెట్టు వస్తుందని ‘పుత్తా’వర్గం గట్టిగా చెబుతోంది. ఇదిలా ఉండగా ఒకవేళ తమ నాయకుడికి టిక్కెట్ రాకుంటే వీరశివారెడ్డికి మద్దతు ఇస్తాము తప్పించి పుత్తా నరసింహారెడ్డికి మద్దతు ఇచ్చేది లేదంటూ సాయినాథ్ అనుచర వర్గం చెబుతోంది. ముగ్గురిలో ఏ ఒక్కరికీ అధిష్టానం టిక్కెట్ ఇచ్చి నా మిగిలిన ఇద్దరు సదరు నేతకు మద్దతు పలికే పరిస్థితి లేదు. ఒకవేళ నాయకులు మద్దతు పలికినా కిందిస్థాయిలో క్యాడర్ సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉన్న కాస్త క్యాడర్ సైతం చెల్లాచెదురయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎటూ తేల్చుకోలేని అధిష్టానం తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. -
ఆత్మగౌరవ వజ్రాయుధం... దాక్షాయణి వేలాయుధం
రాజ్యాంగ రూపకల్పన ఒక మహాయజ్ఞంలా సాగింది. ఆనాటి రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 299 కాగా, అందులో 15 మంది మహిళలు ఉన్నారు. వారిలో ఒకరైన దాక్షాయణి వేలాయుధం రాజ్యాంగ సభకు ఎంపికైన తొలి దళిత మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. కొచ్చి (కేరళ)లోని ములవుకాడ్ అనే లంక గ్రామంలో పులయార్ కమ్యూనిటికీ చెందిన ఒక కుటుంబంలో 1912లో జన్మించింది దాక్షాయణి. పులయార్లు ప్రధానంగా వ్యవసాయకూలీలు. శ్రమదోపిడికి, అవమానాలకు గురయ్యేవాళ్లు. వాళ్ల చుట్టూ ఎన్నో ముళ్లకంచెలు ఉండేవి. ‘అందరూ నడిచే బాటలో నడవకూడదు’ ‘అందరూ వెళ్లే బావిలో నుంచి నీళ్లు తీసుకోకూడదు’ ‘ఖరీదైన దుస్తులే కాదు ఒక మాదిరి దుస్తులు కూడా ఒంటి మీద కనిపించకూడదు’... వంటివి. అయితే, దాక్షాయణి పుట్టిన కాలంలోనే ఒక ప్రశ్న కూడా పుట్టింది.‘అయ్యా! మేమూ మీలాగే మనుషులం కదా. మమ్మల్ని ఇలా ఎందుకు హీనంగా చూస్తున్నారు?’ అని అడిగింది ఆ ప్రశ్న.పులయార్ల సంస్కర్త అయ్యన్‌కాలీ ఉద్యమ గొంతు సవరించడానికి సిద్ధమవుతున్న కాలం అది. సాధారణంగా పులయార్ల ఇండ్లలో అమ్మాయి పుడితే అజ్కి, పుమల, చక్కి, కిలిపక్క.. అనే పేర్లు మాత్రమే పెట్టేవారు. అయితే ఒక అమ్మాయికి ‘దాక్షాయణి’ అని నామకరణం చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. నామకరణ సరళిలో మార్పు తీసుకువచ్చింది. ‘ఆమె జీవితంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో చారిత్రక అస్తిత్వాలు ఉన్నాయి’ అంటారు దాక్షాయణి కూతురు మీరా వేలాయుధం. ఆరోజుల్లో నిమ్నవర్గాలకు చెందిన పిల్లలు స్కూలు గడప తొక్కడం అనేది ఊహకు అందని విషయం. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, అవమానాలను తట్టుకొని ఉన్నత చదువులు చదువుకుంది దాక్షాయణి. 1945లో కొచ్చి లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎంపికైంది. విశిష్టమైన రాజ్యాంగ నిర్మాణంలో భాగమై తన సమకాలీన తరానికి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచింది దాక్షాయణి వేలాయుధం. -
ఆ ప్రాంతాల్లో రాజకీయ కార్యకలాపాలు ఆపాలి: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉప ఎన్నికలు జరిగే జిల్లాలు, నియోజకవర్గాలకు అనుకునే ఉండే ప్రాంతాల్లో ఉప ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని ఎన్నికల సంఘం (ఈసీ) రాజకీయ పార్టీలను కోరింది. కొన్ని రాజకీయ పార్టీలు ఉప ఎన్నికలు జరిగే జిల్లాలు, నియోజకవర్గాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నికల కార్యకలాపాలు చేపట్టడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉప ఎన్నికలు జరిగే పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గంలో అమలయ్యే ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలు సంబంధిత జిల్లా అంతటికీ వర్తిస్తాయని స్పష్టతనిచ్చింది. ఉప ఎన్నికలు జరిగే జిల్లా, నియోజకవర్గాన్ని ఆనుకుని ఉండే ప్రాంతాల్లో ఎన్నికల నియమావళితోపాటు భౌతికదూరం పాటించడం వంటి కోవిడ్–19 నిబంధనలు అమలయ్యేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. -
ముసురుకున్న సందేహాలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ను పునర్విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టికల్ –370ను రద్దు చేయడం జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సాంకేతికంగా సవరిస్తుందనే విమర్శలు ఎదురవుతున్నాయి. ఇవీ చిక్కులు ► ఆర్టికల్ 370 (3) ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులపై ‘రాజ్యాం గబద్ధమైన అసెంబ్లీ (కాన్‌స్టిట్యుయంట్ అసెంబ్లీ)’ సలహా తీసు కోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దీన్ని ‘శాసనసభ (లెజిస్లేటివ్ అసెంబ్లీ)’గా సవరించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో శాసనసభ లేనందున ఆ అధికారాలు గవర్నర్‌కు దఖలు పడ్డాయి. గవర్నర్ సూచనల మేరకే ఆర్టికల్ –370ను రద్దు చేశారు. అయితే, ఇది చెల్లదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు ‘ముందు’ రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ నుంచి ఏకాభ్రిపాయం సేకరించాలని ఆర్టికల్ 370 (3)పేర్కొంటోంది. ► శాసనసభ ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడుకున్నది కాగా గవర్నర్ కేంద్రం ప్రతినిధిగా నియమితులవుతారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల స్థానంలో గవర్నర్ సూచనల ఆధారంగా ఆర్టికల్ –370ను రద్దు చేయవచ్చా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ► మరోవైపు ఆర్టికల్ –370 తాత్కాలికం కాదని 2016లో ఎస్బీఐ వర్సెస్ సంతోష్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు పేర్కొంటున్నాయి. రాజ్యాంగ బద్ధమైన అసెంబ్లీ సూచనలు చేసే వరకు అది ‘పర్మినెంటే’ అని చెబుతోంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ నుంచి అలాంటి సూచనలు ఏవీ రాలేదు. ► రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించడం, మార్చడం చెల్లదని పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ –370 అందులో భాగమేనా? దాన్ని మార్చవచ్చా? ► ఆర్టికల్ –370 రద్దు భారత్‌లో జమ్మూకశ్మీర్ విలీనాన్ని సాంకేతికంగా సవరిస్తుంది. అంతర్జాతీయంగా అభ్యంతరం ► ఐరాస భద్రతా మండలి 47వ తీర్మానం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా కశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికార హక్కు కల్పించింది. ఆర్టికల్ –370 రద్దు, స్వయం ప్రతిపత్తిని తొలగించడం ఐరాస భద్రతా మండలి తీర్మానం ఉల్లంఘనగా మారే అవకాశం ఉంది. -
ఉద్యోగార్థులకు నైపుణ్య సోపానం
చేతిలో పట్టా ఉంది.. కానీ తగినంత నైపుణ్యం లేదు.. ఇదీ స్థానిక నిరుద్యోగ యువత ఆవేదన. సరిగ్గా ఇదే కారణంతో పరిశ్రమల యాజమన్యాలు స్థానికేతరులకు ఉద్యోగాలు కట్టబెట్టేస్తున్నాయి. ఇప్పటివరకు జరుగుతున్న ఈ తతంగం స్థానిక యువతను నిరుద్యోగులుగానే మిగిల్చేస్తోంది. ఈ దుస్థితిని గమనించిన వైఎస్ జగన్ సర్కార్ దేశంలోనే సంచలనాత్మకమైన.. ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. అదే పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు.. నిర్ణయం తీసుకున్నదే తడవుగా అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసి చట్టబద్దం చేసింది. అది సరే.. నైపుణ్యం లేకుండా స్థానికులను ఉద్యోగాల్లోకి ఎలా తీసుకుంటారు?.. దీని వల్ల పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా పోతాయన్న ప్రతిపక్షం వాదనను ప్రభుత్వం మరో కీలక నిర్ణయంతో తిప్పికొట్టింది. నోటమాట రాకుండా చేసింది. అదే నియోజకవర్గానికో నైపుణ్యాభివృద్ధి కేంద్రం(స్కిల్ డెవలప్మెంట్ సెంటర్) ఏర్పాటు.. ఇలా ఏర్పాటు చేసే కేంద్రాల్లో సాంకేతిక, ఇతరత్రా అర్హతలున్న నిరుద్యోగులు ఆయా రంగాల్లో తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చుకునే అవకాశం కల్పించి.. వారిని పరిశ్రమల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యేలా సహరించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విశాఖ జిల్లాలో 15 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. విశాఖ లాంటి పారిశ్రామిక జిల్లాలోని నిరుద్యోగులకు ఈ చర్యలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని.. ఉద్యోగాలు పొంది స్థానికంగానే నిలదొక్కుకునేందుకు దోహదపడుతాయని యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షనేతగా... ప్రజా సంకల్పయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు పాదయాత్రలో ఏవైతే హామీలిచ్చారో... వాటిని పక్కాగా అమలు చేసే దిశగా కార్యాచరణ ప్రారంభించారు. ఈ క్రమంలో యువతకు ఉపాధి కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. ఓవైపు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధితో పాటు వాటిని అందిపుచ్చుకునేందుకు అవసరమైన నైపుణ్యం పొందేందుకు అవసరమైన శిక్షణ తీసుకునే ఏర్పాట్లు చేస్తుండటంతో నిరుద్యోగ యువతలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఉన్న నిరుద్యోగ సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తాను చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే గ్రామ వలంటీర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. మరికొద్ది రోజుల్లో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడనుంది. ఇది కాకుండా రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు అందించే బిల్లు కూడా ప్రవేశపెట్టారు. పోటీ ప్రపంచంలో యువతకు చదువు మాత్రమే సరిపోదని, తగిన నైపుణ్యాలు ఉన్నప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయన్న విషయాన్ని గుర్తించి ప్రతి నియోజకవర్గంలో నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. వివిధ కోర్సుల్లో చదువు పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలనే తపన, ఆకాంక్షతో బయటకు వస్తున్న యువతకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల ఉపాధి లేకుండా పోతోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అధిక శాతం విఫలమవుతున్నారు. నిరుద్యోగ యువతకు సరైన మార్గనిర్దేశం చేసేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థను పకడ్బందీగా నడిపేందుకు దృష్టి సారించింది. యువత భవితకు భరోసా.. నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంచేందుకు వివిధ యూనివర్సిటీలు, సంస్థలతో కలిసి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల్ని పెంపొందింపజేయడమే కాకుండా వారి దృక్పథం లో మార్పును తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్‌మేళాలు నిర్వహించి, స్కిల్ కనెక్ట్, ఎంఎన్సీడ్రైవ్ ద్వారా ఉపాధి కల్పించనున్నారు. ఇవి కాకుండా యువతీ, యువకులకు వారి ఆసక్తి మేరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తారు. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తూ, రాష్ట్రంలోని యువతీ యువకులకు ఉద్యోగం పొందేందుకు అవసరమైన కోర్సులను అందించే విధంగా పథకానికి రూపకల్పన చేస్తున్నారు. శిక్షణ కేంద్రాలకు వివిధ కంపెనీల ప్రతినిధులను రప్పించి అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఇకపై పీపీసీ ప్రాజెక్టుల క్రింద చేపట్టిన పరిశ్రమలు లేదా ఫ్యాక్టరీలు, జాయింట్ వెంచర్లు, ప్రాజెక్టుల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. స్కిల్స్ లేక ఇబ్బందులు.. డిగ్రీ పట్టా చేతిలో ఉంది. దానికి అనుబంధంగా మరికొన్ని క్వాలిఫికేషన్లు ఉంటేనే ఉద్యోగం ఇస్తామని చాలా కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికో స్కిల్ డెవలప్‌సెంటర్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించడంతో మాకు కొత్త ఊపిరి పోసినట్లయింది. – కె. బాలు, డిగ్రీ విద్యార్థి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు ఉత్తరాంధ్ర యువతకు అన్ని అర్హతలున్నా.. సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ లేక చతికిల పడిపోతున్నారు. ఫలితంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నిరుద్యోగుల కష్టాల్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయనకు మా నిరుద్యోగులందరి తరఫున ధన్యవాదాలు. – శ్యామ్, పీజీ విద్యార్థి. -
విశేషాల సమాహారం.. ముమ్మిడివరం
సాక్షి, ముమ్మిడివరం(తూర్పు గోదావరి): జిల్లాలో చిట్టచివరి నియోజకవర్గంగా ఉన్న ముమ్మిడివరం అంతర్జాతీయ రాజకీయాలకు వేదికగా మారింది. ఇద్దరు రాజకీయ ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. దివంగత లోక్ సభస్పీకర్ జీఎంసీ బాలయోగి ఈ నియోజకవర్గానికి చెందిన వారే. ఈయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టడం, ఆ తర్వాత లోక్ సభ స్పీకరై ఈ నియోజకవర్గానికి ప్రత్యేకను తీసుకు వచ్చింది. ఆరుసార్లు గెలిచి జిల్లాలో రికార్డు సృష్టించిన మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలుపొందడం మరోవిశేషం. ఆధ్యాత్మిక కేంద్రంగా.. ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రాశస్త్యం ఉంది. ఆధ్యాత్మికంగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. శ్రీభగవాన్ బాలయోగీశ్వరుల తపో ఆశ్రమం ఈ నియోజకవర్గంలో ఉండడంతో ఈ ప్రాంతానికి ఈ ఖ్యాతి లభించింది. ఈ ఆశ్రమం సందర్శనకు భక్తులు విచ్చేస్తుంటారు. ఇలా రూపాంతరం చెంది.. చెయ్యేరు జనరల్ నియోజకవర్గం 1978లో ముమ్మిడివరం ఎస్సీ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. అంతకు ముందు చెయ్యేరు నియోజక వర్గంగా ఉన్న సమయంలో నాలుగు సార్లు ఎన్నికలు జరగగా రెండు సామాజిక వర్గాలు పోటీ పడ్డాయి. కాపు, క్షత్రియ సామాజిక వర్గాలు రెండేసి పర్యాయాలు ప్రాతినిధ్యం వహించాయి. మొదటి సారి 1955లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నడింపల్లి రామభద్రిరాజు సీపీఐ అభ్యర్థి సి.కృష్ణమూర్తిపై 8,637 ఓట్లతో గెలుపొందారు. 1962లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సీబీకే రాజుపై కాంగ్రెస్ అభ్యర్థి పళ్ల వెంకటరావు 2,066 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1967 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పళ్ల వెంకటరావును స్వతంత్ర అభ్యర్థి సీబీకే రాజు 15,365ఓట్ల తేడాతో ఓడించారు. 1972లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పళ్ల వెంకట రావు ఇండింపెండెంట్ అభ్యర్థి జీవీరావుపై 11,304 ఓట్ల తేడాతో గెలుపొంది రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. పోటాపోటీగా.. ముమ్మిడివరం ఎస్సీ రిజర్వ్డు నియోజకవర్గంగా మారాక తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి బి.అప్పలస్వామిపై కాంగ్రెస్ అభ్యర్థి మోకా విష్ణుప్రసాదరావు 13,228 ఓట్లతో గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పాందారు. 1983లో తెలుగు దేశం అభ్యర్థి వల్తాటి రాజా సక్కుబాయిపై కాంగ్రెస్ అభ్యర్థి మోకా విష్ణుప్రసాదరావు 36,225 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి జీకే వరప్రసాద్‌ను టీడీపీ అభ్యర్థి పండు కృష్ణమూర్తి 33,124 ఓట్ల తేడాతో ఓడించారు. 1989లో దేశం అభ్యర్థి పండు కృష్ణమూర్తిపై కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు 6,749 ఓట్లతో విజయం సాధించారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన సుబ్బారావు జిల్లలో తెలుగు దేశం ప్రభంజనాన్ని ఎదురొడ్డి టీడీపీ అభ్యర్థి మోకా ఆనందసాగర్పై 9,565 మోజార్టీతో రెండోసారి గెలుపొందారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా జిల్లాలో రికార్డు సృష్టించారు. బత్తిన మరణానంతరం 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావుపై టీడీపీ అభ్యర్థి జీఎంసీ బాలయోగి 14,496 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామంత్రిగా పనిచేశారు. 1998లో జరిగిన పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల్లో బాలయోగి అమలాపురం ఎంపీగా గెలుపు పొందడంతో మరోసారి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పినిపే విశ్వరూప్‌పై టీడీపీ అభ్యర్థి చెల్లి వివేకానంద 17,778 ఓట్లతేడాతో గెలుపొందారు. 1999లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులుగా విశ్వరూప్, వివేకానందలు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో వివేకానంద మరోసారి 10,742 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థి చెల్లి శేషకుమారిపై కాంగ్రెస్ అభ్యర్థి పినిపే విశ్వరూప్ 15,357 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గంలో.. మొత్తం ఓట్లు 2,20,223 పురుషులు 1,11.054 మహిళలు 1.09,164 ఇతరులు 5 కులాల వారీగా... శెట్టిబలిజలు 41,414 మాలలు 49,905 మాదిగలు 13,885 కాపులు 29,552 అగ్నికుల క్షత్రియలు 43,774 క్షత్రియులు 11,223 యాదవులు 2,870 రజకులు 2,070 విశ్వబ్రహ్మణులు 1.328 బ్రహ్మణులు 1.077 వైశ్యాస్ 1075 మండలాలు... ముమ్మిడివరం కాట్రేనికోన ఐ.పోలవరం తాళ్లరేవు నగర పంచాయతీ 1 పంచాయతీలు 63 పోలింగ్ స్టేషన్లు 268 భౌగోళికంగా.. రాజకీయంగా మార్పులు.. 2009లో నియోజకవర్గ పునర్విభజన అనంతరం నియోజకవర్గం భౌగోళికంగా, రాజకీయంగా కొన్ని మార్పులు చేసుకున్నాయి. తాళ్లరేవు మండలం ముమ్మిడివరం నియోజకవర్గంలో చేరింది. 30 ఏళ్లుగా ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ నియోజకవర్గం జనరల్‌గా మారింది. అప్పట్లో పీఆర్పీ ఆవిర్భావంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, టీడీపీ అభ్యర్థిగా నడింపల్లి శ్రీనివాసరాజు, పీఆర్పీ అభ్యర్థిగా కుడుపూడి సూర్యనారాయణరావులు పోటీ పడగా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ 1924 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గుత్తుల సాయిపై టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు 29,535 ఓట్ల మెజార్టీలో గెలుపొందారు. నియోజకవర్గంలో ఎస్సీ, శెట్టిబలిజ, అగ్నికుల క్షత్రియ, కాపు సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉన్నాయి. బీసీ ఓట్లు 60 శాతం పైబడి ఉండటంతో ఎన్నికల్లో వీరే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలుగుతారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ పోటీలో ఉండే అవకాశముంది. అలాగే టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన దాట్ల సుబ్బరాజు దాదాపు ఖరారైనట్టే. జనసేన పార్టీ అభ్యర్థిగా శెట్టిబలిజ సామాజికి వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ పోటీలో ఉంటారు. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్ పోటీలో ఉండే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెన్మత్స జగ్గప్పరాజు, గంగిరెడ్డి త్రినాథరావు, ముషిణి రామకృష్ణరావు, వేగేశ్న నరసింహరాజు, పి.ఉదయ భాస్కరవర్మ దరఖాస్తుల చేసుకున్నారు. -
ఏ దేశ రాజ్యాంగ రచనకు ఎక్కువ కాలం పట్టింది?
మాదిరి ప్రశ్నలు 1. రాజ్యాంగ పరిషత్ ముసాయిదా సంఘం లోని సభ్యుల సంఖ్య? 1) అధ్యక్షుడితో కలిపి 7 2) అధ్యక్షుడు కాకుండా 7 3) అధ్యక్షుడితో కలిపి 10 4) ఏదీకాదు 2. ఉమ్మడి జాబితాను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? 1) ఐర్లాండ్ 2) ఆస్ట్రేలియా 3) అమెరికా 4) కెనడా 3. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి. ఎ. హెచ్.వి. కామత్ భారత రాజ్యాంగాన్ని ‘ఐరావతం’తో పోల్చారు. బి. రాజ్యాంగాన్ని ‘న్యాయవాదుల స్వర్గం’ గా ఐవర్ జెన్నింగ్‌స పేర్కొన్నారు. 1) ఎ మాత్రమే 2) బి మాత్రమే 3) ఎ, బి 4) ఎ, బి సరికావు 4. రాజ్యాంగ పరిషత్ సాధారణ చట్టాల రూపకల్పన కోసం సమావేశమైనప్పుడు అధ్యక్షుడిగా ఎవరు కొనసాగారు? 1) రాజేంద్రప్రసాద్ 2) జి.వి. మౌలాంకర్ 3) సచ్చిదానంద సిన్హా 4) ప్రాంక్ అంథోని 5. అంబేద్కర్‌ను ‘ఆధునిక మనువు’గా పేర్కొన్నవారు? 1) కె.ఎం. మున్షీ 2) పైలి ఎం.వి. 3) గాంధీ 4) జవహర్ లాల్ నెహ్రూ 6. ఏ దేశ రాజ్యాంగ రచనకు ఎక్కువ కాలం పట్టింది? 1) ఇండియా 2) అమెరికా 3) ఆస్ట్రేలియా 4) ఫ్రాన్స 7. సుప్రీంకోర్టు ఏ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రకటించింది? 1) గోలక్‌నాథ్ - పంజాబ్ 2) శంకర ప్రసాద్ - భారత యూనియన్ 3) కేశవానంద భారతి - కేరళ 4) చంపకం దొరై రాజన్ - మద్రాస్ రాష్ట్రం 8. రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో ముఖ్యమైంది? 1) ఆదేశిక సూత్రాలు 2) పార్లమెంటరీ ప్రభుత్వం 3) స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ 4) ప్రాథమిక హక్కులు 9. మైనార్టీ వర్గాలకు ప్రత్యేకంగా రక్షణ కల్పించే హక్కు? 1) మత స్వాతంత్య్రపు హక్కు 2) విద్య, సాంస్కృతిక హక్కు 3) సమానత్వపు హక్కు 4) రాజ్యాంగ పరిహార హక్కు 10. కిందివాటిలో సరికానిది? 1) గోలక్‌నాథ్ - 1967 2) మినార్వా మిల్స్ - 1980 3) ఇంద్రసహాని - 1992 4) ఎస్.ఆర్. బొమ్మై - 1982 11. కిందివాటిలో సరైంది ఏది? ఎ. జాతీయ అత్యవసర సమయంలో నిబంధన 358 ప్రకారం నిబంధన 19 స్వతహాగా రద్దు అవుతుంది. బి. జాతీయ అత్యవసర సమయంలో నిబంధన 359 ప్రకారం ప్రాథమిక హక్కులను రద్దు చేయొచ్చు. 1) ఎ మాత్రమే 2) బి మాత్రమే 3) ఎ, బి సరికావు 4) ఎ, బి సరైనవి 12. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించమని ఆదేశించే రిట్? 1) హేబియస్ కార్పస్ 2) మాండమస్ 3) కో వారెంటో 4) సెర్షియోరరీ 13. ఆర్థిక సమానత్వాన్ని కలుగజేసేది? 1) అవతారిక 2) ప్రాథమిక హక్కులు 3) ఆదేశిక సూత్రాలు 4) కేంద్ర జాబితా 14. భారత రాజ్యాంగంలో 20వ ఆర్టికల్‌లోని ‘డబుల్ జియోపార్డీ’ పదానికి అర్థం? 1) నేరానికి మించి శిక్ష వేయరాదు 2) ఒక నేరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు శిక్షించరాదు 3) డిపార్టమెంట్ ప్రొసీడింగ్‌స ద్వారా శిక్షించరాదు 4) ఏవీకావు 15. కిందివాటిలో సరికానిది? 1) ఆర్టికల్ - 17: అంటరానితనం నిషేధం 2) ఆర్టికల్ - 24: బాల కార్మిక వ్యవస్థ నిషేధం 3) ఆర్టికల్ -26: మత సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ 4) ఆర్టికల్ - 27: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మతబోధన నిషేధం 16. అత్యవసర పరిస్థితిలోనూ రద్దుకాని నిబంధనలేవి? 1) 23, 24 2) 26, 27 3) 29, 30 4) 20, 21 17. చట్టాల సమాన రక్షణను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? 1) ఐర్లాండ్ 2) ఆస్ట్రేలియా 3) అమెరికా 4) బ్రిటన్ 18. రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్‌లో న్యాయ సమీక్ష అధికారం గురించి పరోక్షంగా ప్రస్తావించారు? 1) 12 2) 13 3) 124 4) 32 19. రాజ్యాంగంలోని ఏ అధికరణం వార్తా ప్రచురణ హక్కును కల్పిస్తుంది? 1) ఆర్టికల్ - 14 2) ఆర్టికల్ - 21 3) ఆర్టికల్ - 16 4) ఆర్టికల్ - 19 -
జీవించే హక్కును ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
భారత రాజ్యాంగ రచన రాజ్యాంగ పరిషత్ స్వభావం-వ్యాఖ్యానాలు భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది - హెచ్. వి. కామత్ ‘భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం’ అన్నది - సర్ ఐవర్ జెన్నింగ్‌స రాజ్యాంగాన్ని ‘అందమైన అతుకుల బొంత’, ‘నలుగురి ముఠా (నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్)’గా అభివర్ణించింది - గ్రాన్‌విలే ఆస్టిన్ ‘భారత రాజ్యాంగాన్ని ఇతర రాజ్యాంగాలన్నింటిని కొల్లగొట్టి రూపొందించిందిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమి కాదు. రాజ్యాంగం విఫలమైతే దాన్ని నిందించరాదు, అమలుపరిచేవారిని నిందించాలి. రాజ్యాంగం అనే దేవాలయంలోకి దెయ్యాలు చేరితే దాన్ని పగులగొట్టడానికి నేనే ముందుంటాను.’ అని వ్యాఖ్యానించినవారు - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ‘రాజ్యాంగం బహుళ అవసరాలకు ప్రతీక’ అన్నవారు - జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ అంబేద్కర్‌ను రాజ్యాంగ నిర్మాతగా అభివర్ణించింది -అనంతశయనం అయ్యంగార్ అంబేద్కర్‌ను సుశిక్షితులైన పెలైట్‌గా అభివర్ణించింది - డాక్టర్ రాజేంద్రప్రసాద్ బి.ఎన్.రావును రాజ్యాంగ పరిషత్తుకు స్నేహితుడు, మార్గదర్శి, తాత్వికుడిగా పేర్కొంటారు. అంకెల్లో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య - 389 బ్రిటిష్ సొంత ప్రాంతాల నుంచి ఎన్నికైన వారి సంఖ్య- 296 స్వదేశీ సంస్థానాల నుంచి నామినేట్ అయిన సభ్యుల సంఖ్య- 93 దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో వాస్తవ సభ్యుల సంఖ్య- 299 భారత జాతీయ కాంగ్రెస్ తరఫున ఎన్నికైన సభ్యుల సంఖ్య - 208 ముస్లింలీగ్ పార్టీ తరఫున ఎన్నికైనవారి సంఖ్య - 73 హిందువులు - 160 దళిత వర్గానికి చెందినవారు - 33 మహిళలు - 9 క్రిస్టియన్లు - 7 సిక్కులు - 5 పారశీకులు - 3 ఆంగ్లో ఇండియన్స - 3 తెలుగువారు- 11 మంది (టి. ప్రకాశం, నీలం సంజీవరెడ్డి,పట్టాభి సీతారామయ్య, ఎన్.జి. రంగా, వి.సి. కేశవరావ్, ఎం. తిరుమలరావ్, కళా వెంకటరావ్, కల్లూరు సుబ్బారావు, ఎం. సత్యనారాయణ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, బొబ్బిలి రాజా రామకృష్ణ రంగారావ్) మొట్టమొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య- 211 చివరి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య- 284 రాజ్యాంగ రచనకు పట్టిన సమయం- 2 ఏళ్ల 11 నెలల 18 రోజులు మొత్తం సమావేశాల సంఖ్య- 11(సెషన్స) వాస్తవానికి సమావేశం జరిగిన రోజులు- 165 రాజ్యాంగ ముసాయిదా పరిశీలనకు పట్టిన రోజులు- 114 మొత్తం సంప్రదించిన రాజ్యాంగాలు- 60 రాజ్యాంగ రచన ఖర్చు- రూ. 64 లక్షలు రాజ్యాంగ పరిషత్తు - వ్యక్తులు - హోదాలు రాజ్యాంగ పరిషత్తు భావనను తొలిసారి ప్రతిపాదించింది - ఎం.ఎన్. రాయ్ రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడు - సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడు - డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్తు ఉపాధ్యక్షుడు - హెచ్.సి. ముఖర్జీ రాజ్యాంగ పరిషత్తు ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించింది - జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తు ముఖ్య సలహాదారు, ముఖ్య లేఖకుడు - బి.ఎన్. రావ్ రాజ్యాంగ పరిషత్తు కార్యదర్శి - హెచ్.బి. అయ్యంగార్ రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ సవరణలను ప్రతిపాదించినవారు - హెచ్.వి. కామత్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. పెద్ద రాజ్యాంగమనే లక్షణా న్ని, రాజ్యాంగంలో ఉన్న అధికరణలు, భాగా లు, షెడ్యూళ్ల రూపంలో అర్థం చేసుకోవచ్చు. అధికరణలు: ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న ప్రకరణల సంఖ్య - 315 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న ప్రకరణల సంఖ్య - 395 ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న ప్రకరణల సంఖ్య - 462 భాగాలు: ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న భాగాలు - 21 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న భాగాలు - 22 ప్రస్తుతం ఉన్న భాగాలు - 25 షెడ్యూళ్లు: ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న షెడ్యూళ్లు- 9 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న షెడ్యూళ్లు - 8 ప్రస్తుతం ఉన్న షెడ్యూళ్లు- 12 భాగాలు - విశ్లేషణ రాజ్యాంగంలో అతిపెద్ద భాగం-5వ భాగం రాజ్యాంగంలో రెండో అతిపెద్ద భాగం - 6వ భాగం అతిచిన్న భాగాలు (కేవలం ఒక అధికరణ మాత్రమే ఉన్నవి) - ఐగఅ, గీ, గీగీ జమ్మూ-కాశ్మీర్‌కు వర్తించే భాగం -6వ భాగం (జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉన్నందువల్ల) తాత్కాలిక ఏర్పాట్లు ఉన్న భాగం -భాగం కొత్తగా చేర్చిన భాగాలు - ఐగఅ, ఐగీ, ఐగీఅ, ఐగీఆ, గీఐగఅ తొలగించిన భాగం - గఐఐ రాజ్యాంగ ఆధారాలు - గ్రహించిన అంశాలు భారత ప్రభుత్వ చట్టం 1935: సమాఖ్య పద్ధతి, ఫెడరల్ కోర్టు, ఫెడరల్ పబ్లిక్ సర్వీసులు, రాష్ర్టపతి పాలన, గవర్నర్ నియామకం, ద్విసభా పద్ధతి, పరిపాలనా అంశాలు. ఇది అతి ముఖ్య ఆధారం. రాజ్యాంగాన్ని ఈ చట్టం నకలుగా వర్ణిస్తారు. బ్రిటిష్ రాజ్యాంగం: పార్లమెంటరీ ప్రభుత్వం, సమన్యాయ పాలన, శాసన నిర్మాణ ప్రక్రియ, శాసనసభ్యుల సర్వాధికారాలు, స్పీకర్, డిప్యూ టి స్పీకర్ పదవులు, కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్, రిట్ల జారీ. ఇది రెండో ముఖ్య ఆధారం. ‘పార్లమెంట్’కు సంబంధించిన అన్ని విషయాలు దీని నుంచే తీసుకున్నారు. అమెరికా రాజ్యాంగం: ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, పిల్-ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం, న్యాయశాఖ వ్యవస్థ- స్వయం ప్రతిపత్తి, ఉపరాష్ర్టపతి పదవి, ఉపరాష్ర్టపతి రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరించడం. కెనడా రాజ్యాంగం: బలమైన కేంద్ర ప్రభుత్వం, అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం, గవర్నర్ నియామకం, రాష్ర్టపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాను కోరడం. ఐర్లాండ్ రాజ్యాంగం: ఆదేశిక/ నిర్దేశిక నియమాలు, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, రాజ్యసభకు విశిష్ట సభ్యుల నామినేషన్. జర్మనీ రాజ్యాంగం: అత్యవసర అధికారాలు, ప్రాథమిక హక్కుల రద్దు. ఆస్ట్రేలియా రాజ్యాంగం: ఉమ్మడి జాబితాలు (కాంకరెంట్), ఉమ్మడి సమావేశం. రష్యా రాజ్యాంగం: సామ్యవాదం, ప్రాథమిక విధులు, ప్రణాళికలు అంశాలను గ్రహించారు. ఫ్రాన్స రాజ్యాంగం: స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్ర స్వభావం. దక్షిణాఫ్రికా రాజ్యాంగం: రాజ్యాంగ సవరణ పద్ధతి, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం. జపాన్ రాజ్యాంగం: ప్రకరణ 21లో పేర్కొన్న చట్టం నిర్దేశించిన పద్ధతి, జీవించే హక్కు. గమనిక: పంచాయతీ వ్యవస్థ, రాష్ర్టపతిని ఎన్నుకునే నియోజకం, ఏకీకృత, సమగ్ర న్యాయ వ్యవస్థ, అఖిలభారత సర్వీసులు, ఏకపౌరసత్వం, అల్ప సంఖ్యాక వర్గాలవారికి ప్రత్యేక హక్కులు, ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమీషన్లు, భాషా కమిషన్లు మొదలైనవి సొంతంగా రూపొందించిన అంశాలు.