ఏ దేశ రాజ్యాంగ రచనకు ఎక్కువ కాలం పట్టింది? | a long time for writing the constitution of any country? | Sakshi
Sakshi News home page

ఏ దేశ రాజ్యాంగ రచనకు ఎక్కువ కాలం పట్టింది?

Published Fri, Nov 14 2014 10:21 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఏ దేశ రాజ్యాంగ రచనకు ఎక్కువ కాలం పట్టింది? - Sakshi

ఏ దేశ రాజ్యాంగ రచనకు ఎక్కువ కాలం పట్టింది?

 మాదిరి ప్రశ్నలు
 1.    రాజ్యాంగ పరిషత్ ముసాయిదా సంఘం లోని సభ్యుల సంఖ్య?
     1) అధ్యక్షుడితో కలిపి 7
     2) అధ్యక్షుడు కాకుండా 7
     3) అధ్యక్షుడితో కలిపి 10    
     4) ఏదీకాదు
 2.    ఉమ్మడి జాబితాను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
     1) ఐర్లాండ్    2) ఆస్ట్రేలియా    3) అమెరికా    4) కెనడా
 3.    కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
     ఎ. హెచ్.వి. కామత్ భారత రాజ్యాంగాన్ని ‘ఐరావతం’తో పోల్చారు.
     బి. రాజ్యాంగాన్ని ‘న్యాయవాదుల స్వర్గం’ గా ఐవర్ జెన్నింగ్‌‌స పేర్కొన్నారు.
     1) ఎ మాత్రమే    2) బి మాత్రమే
     3) ఎ, బి    4) ఎ, బి సరికావు
 4.    రాజ్యాంగ పరిషత్ సాధారణ చట్టాల రూపకల్పన కోసం సమావేశమైనప్పుడు అధ్యక్షుడిగా ఎవరు కొనసాగారు?
     1) రాజేంద్రప్రసాద్    2) జి.వి. మౌలాంకర్
     3) సచ్చిదానంద సిన్హా 4) ప్రాంక్ అంథోని
 5.    అంబేద్కర్‌ను ‘ఆధునిక మనువు’గా  పేర్కొన్నవారు?
     1) కె.ఎం. మున్షీ    2) పైలి ఎం.వి.
     3) గాంధీ        4) జవహర్ లాల్ నెహ్రూ
 6.    ఏ దేశ రాజ్యాంగ రచనకు ఎక్కువ కాలం పట్టింది?
     1) ఇండియా    2) అమెరికా    
     3) ఆస్ట్రేలియా    4) ఫ్రాన్‌‌స
 7.    సుప్రీంకోర్టు ఏ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రకటించింది?
     1) గోలక్‌నాథ్ - పంజాబ్
     2) శంకర ప్రసాద్ - భారత యూనియన్
     3) కేశవానంద భారతి - కేరళ
     4)    చంపకం దొరై రాజన్ - మద్రాస్ రాష్ట్రం
 8.    రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో ముఖ్యమైంది?
     1) ఆదేశిక సూత్రాలు
     2) పార్లమెంటరీ ప్రభుత్వం
     3) స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ
     4) ప్రాథమిక హక్కులు
 9.    మైనార్టీ వర్గాలకు ప్రత్యేకంగా రక్షణ కల్పించే హక్కు?
     1) మత స్వాతంత్య్రపు హక్కు
     2) విద్య, సాంస్కృతిక హక్కు
     3) సమానత్వపు హక్కు
     4) రాజ్యాంగ పరిహార హక్కు
 10.    కిందివాటిలో సరికానిది?
     1) గోలక్‌నాథ్ - 1967
     2) మినార్వా మిల్స్ - 1980
     3) ఇంద్రసహాని - 1992
     4) ఎస్.ఆర్. బొమ్మై - 1982
 11.    కిందివాటిలో సరైంది ఏది?
     ఎ.    జాతీయ అత్యవసర సమయంలో నిబంధన 358 ప్రకారం నిబంధన 19 స్వతహాగా రద్దు అవుతుంది.
     బి.    జాతీయ అత్యవసర సమయంలో నిబంధన 359 ప్రకారం ప్రాథమిక హక్కులను రద్దు చేయొచ్చు.
     1) ఎ మాత్రమే    2) బి మాత్రమే
     3) ఎ, బి సరికావు    4) ఎ, బి సరైనవి
 12.    అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించమని ఆదేశించే రిట్?
     1) హేబియస్ కార్పస్ 2) మాండమస్
     3) కో వారెంటో    4) సెర్షియోరరీ
 13.    ఆర్థిక సమానత్వాన్ని కలుగజేసేది?
     1) అవతారిక 2) ప్రాథమిక హక్కులు
     3) ఆదేశిక సూత్రాలు 4) కేంద్ర జాబితా
 14.    భారత రాజ్యాంగంలో 20వ ఆర్టికల్‌లోని  ‘డబుల్ జియోపార్డీ’ పదానికి అర్థం?
     1) నేరానికి మించి శిక్ష వేయరాదు
     2)    ఒక నేరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు శిక్షించరాదు
     3)    డిపార్‌‌టమెంట్ ప్రొసీడింగ్‌‌స ద్వారా శిక్షించరాదు
     4) ఏవీకావు
 15.    కిందివాటిలో సరికానిది?
     1)    ఆర్టికల్ - 17: అంటరానితనం నిషేధం
     2) ఆర్టికల్ - 24: బాల కార్మిక వ్యవస్థ           
         నిషేధం
     3)    ఆర్టికల్ -26: మత సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ
     4)    ఆర్టికల్ - 27: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మతబోధన నిషేధం
 16.    అత్యవసర పరిస్థితిలోనూ రద్దుకాని నిబంధనలేవి?
     1) 23, 24    2) 26, 27
     3) 29, 30    4) 20, 21
 17.    చట్టాల సమాన రక్షణను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
     1) ఐర్లాండ్    2) ఆస్ట్రేలియా
     3) అమెరికా    4) బ్రిటన్
 18.    రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్‌లో న్యాయ సమీక్ష అధికారం గురించి పరోక్షంగా ప్రస్తావించారు?
     1)  12       2) 13    3) 124    4)  32
 19.    రాజ్యాంగంలోని ఏ అధికరణం వార్తా ప్రచురణ హక్కును కల్పిస్తుంది?
     1) ఆర్టికల్ - 14    2) ఆర్టికల్ - 21
     3) ఆర్టికల్ - 16    4) ఆర్టికల్ - 19

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement