భారత రాజ్యాంగ రచన
రాజ్యాంగ పరిషత్ స్వభావం-వ్యాఖ్యానాలు
భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది - హెచ్. వి. కామత్
‘భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం’ అన్నది - సర్ ఐవర్ జెన్నింగ్‌స
రాజ్యాంగాన్ని ‘అందమైన అతుకుల బొంత’, ‘నలుగురి ముఠా (నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్)’గా అభివర్ణించింది - గ్రాన్‌విలే ఆస్టిన్
‘భారత రాజ్యాంగాన్ని ఇతర రాజ్యాంగాలన్నింటిని కొల్లగొట్టి రూపొందించిందిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమి కాదు. రాజ్యాంగం విఫలమైతే దాన్ని నిందించరాదు, అమలుపరిచేవారిని నిందించాలి. రాజ్యాంగం అనే దేవాలయంలోకి దెయ్యాలు చేరితే దాన్ని పగులగొట్టడానికి నేనే ముందుంటాను.’ అని వ్యాఖ్యానించినవారు - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
‘రాజ్యాంగం బహుళ అవసరాలకు ప్రతీక’ అన్నవారు - జవహర్‌లాల్ నెహ్రూ
డాక్టర్ అంబేద్కర్‌ను రాజ్యాంగ నిర్మాతగా అభివర్ణించింది
-అనంతశయనం అయ్యంగార్
అంబేద్కర్‌ను సుశిక్షితులైన పెలైట్‌గా అభివర్ణించింది - డాక్టర్ రాజేంద్రప్రసాద్
బి.ఎన్.రావును రాజ్యాంగ పరిషత్తుకు స్నేహితుడు, మార్గదర్శి, తాత్వికుడిగా పేర్కొంటారు.
అంకెల్లో రాజ్యాంగ పరిషత్తు
రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య - 389
బ్రిటిష్ సొంత ప్రాంతాల నుంచి ఎన్నికైన వారి సంఖ్య- 296
స్వదేశీ సంస్థానాల నుంచి నామినేట్ అయిన సభ్యుల సంఖ్య- 93
దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో వాస్తవ సభ్యుల సంఖ్య- 299
భారత జాతీయ కాంగ్రెస్ తరఫున ఎన్నికైన సభ్యుల సంఖ్య - 208
ముస్లింలీగ్ పార్టీ తరఫున ఎన్నికైనవారి సంఖ్య - 73
హిందువులు - 160
దళిత వర్గానికి చెందినవారు - 33
మహిళలు - 9 క్రిస్టియన్లు - 7
సిక్కులు - 5 పారశీకులు - 3
ఆంగ్లో ఇండియన్‌స - 3
తెలుగువారు- 11 మంది (టి. ప్రకాశం, నీలం సంజీవరెడ్డి,పట్టాభి సీతారామయ్య, ఎన్.జి. రంగా, వి.సి. కేశవరావ్, ఎం. తిరుమలరావ్, కళా వెంకటరావ్, కల్లూరు సుబ్బారావు, ఎం. సత్యనారాయణ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, బొబ్బిలి రాజా రామకృష్ణ రంగారావ్)
మొట్టమొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య- 211
చివరి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య- 284
రాజ్యాంగ రచనకు పట్టిన సమయం-
2 ఏళ్ల 11 నెలల 18 రోజులు
మొత్తం సమావేశాల సంఖ్య- 11(సెషన్‌స)
వాస్తవానికి సమావేశం జరిగిన రోజులు-
165
రాజ్యాంగ ముసాయిదా పరిశీలనకు పట్టిన రోజులు- 114
మొత్తం సంప్రదించిన రాజ్యాంగాలు- 60
రాజ్యాంగ రచన ఖర్చు- రూ. 64 లక్షలు
రాజ్యాంగ పరిషత్తు - వ్యక్తులు - హోదాలు
రాజ్యాంగ పరిషత్తు భావనను తొలిసారి ప్రతిపాదించింది - ఎం.ఎన్. రాయ్
రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడు
- సచ్చిదానంద సిన్హా
రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడు
- డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
రాజ్యాంగ పరిషత్తు ఉపాధ్యక్షుడు
- హెచ్.సి. ముఖర్జీ
రాజ్యాంగ పరిషత్తు ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించింది - జవహర్‌లాల్ నెహ్రూ
రాజ్యాంగ పరిషత్తు ముఖ్య సలహాదారు, ముఖ్య లేఖకుడు - బి.ఎన్. రావ్
రాజ్యాంగ పరిషత్తు కార్యదర్శి
- హెచ్.బి. అయ్యంగార్
రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ సవరణలను ప్రతిపాదించినవారు
- హెచ్.వి. కామత్
అతిపెద్ద లిఖిత రాజ్యాంగం
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. పెద్ద రాజ్యాంగమనే లక్షణా న్ని, రాజ్యాంగంలో ఉన్న అధికరణలు, భాగా లు, షెడ్యూళ్ల రూపంలో అర్థం చేసుకోవచ్చు.
అధికరణలు:
ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న ప్రకరణల సంఖ్య - 315
రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న ప్రకరణల సంఖ్య - 395
ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న ప్రకరణల సంఖ్య - 462
భాగాలు:
ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న భాగాలు - 21
రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న భాగాలు - 22
ప్రస్తుతం ఉన్న భాగాలు - 25
షెడ్యూళ్లు:
ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న షెడ్యూళ్లు- 9
రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న షెడ్యూళ్లు - 8
ప్రస్తుతం ఉన్న షెడ్యూళ్లు- 12
భాగాలు - విశ్లేషణ
రాజ్యాంగంలో అతిపెద్ద భాగం-5వ భాగం
రాజ్యాంగంలో రెండో అతిపెద్ద భాగం - 6వ భాగం
అతిచిన్న భాగాలు (కేవలం ఒక అధికరణ మాత్రమే ఉన్నవి) - ఐగఅ, గీ, గీగీ
జమ్మూ-కాశ్మీర్‌కు వర్తించే భాగం -6వ భాగం (జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉన్నందువల్ల)
తాత్కాలిక ఏర్పాట్లు ఉన్న భాగం -భాగం
కొత్తగా చేర్చిన భాగాలు -
ఐగఅ, ఐగీ, ఐగీఅ, ఐగీఆ, గీఐగఅ
తొలగించిన భాగం - గఐఐ
రాజ్యాంగ ఆధారాలు - గ్రహించిన అంశాలు
భారత ప్రభుత్వ చట్టం 1935: సమాఖ్య పద్ధతి, ఫెడరల్ కోర్టు, ఫెడరల్ పబ్లిక్ సర్వీసులు, రాష్ర్టపతి పాలన, గవర్నర్ నియామకం, ద్విసభా పద్ధతి, పరిపాలనా అంశాలు. ఇది అతి ముఖ్య ఆధారం. రాజ్యాంగాన్ని ఈ చట్టం నకలుగా వర్ణిస్తారు.
బ్రిటిష్ రాజ్యాంగం: పార్లమెంటరీ ప్రభుత్వం, సమన్యాయ పాలన, శాసన నిర్మాణ ప్రక్రియ, శాసనసభ్యుల సర్వాధికారాలు, స్పీకర్, డిప్యూ టి స్పీకర్ పదవులు, కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్, రిట్ల జారీ. ఇది రెండో ముఖ్య ఆధారం. ‘పార్లమెంట్’కు సంబంధించిన అన్ని విషయాలు దీని నుంచే తీసుకున్నారు.
అమెరికా రాజ్యాంగం: ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, పిల్-ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం, న్యాయశాఖ వ్యవస్థ- స్వయం ప్రతిపత్తి, ఉపరాష్ర్టపతి పదవి, ఉపరాష్ర్టపతి రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరించడం.
కెనడా రాజ్యాంగం: బలమైన కేంద్ర ప్రభుత్వం, అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం, గవర్నర్ నియామకం, రాష్ర్టపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాను కోరడం.
ఐర్లాండ్ రాజ్యాంగం: ఆదేశిక/ నిర్దేశిక నియమాలు, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, రాజ్యసభకు విశిష్ట సభ్యుల నామినేషన్.
జర్మనీ రాజ్యాంగం: అత్యవసర అధికారాలు, ప్రాథమిక హక్కుల రద్దు.
ఆస్ట్రేలియా రాజ్యాంగం: ఉమ్మడి జాబితాలు (కాంకరెంట్), ఉమ్మడి సమావేశం.
రష్యా రాజ్యాంగం: సామ్యవాదం, ప్రాథమిక విధులు, ప్రణాళికలు అంశాలను గ్రహించారు.
ఫ్రాన్‌స రాజ్యాంగం: స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్ర స్వభావం.
దక్షిణాఫ్రికా రాజ్యాంగం: రాజ్యాంగ సవరణ పద్ధతి, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం. జపాన్ రాజ్యాంగం: ప్రకరణ 21లో పేర్కొన్న చట్టం నిర్దేశించిన పద్ధతి, జీవించే హక్కు.
గమనిక: పంచాయతీ వ్యవస్థ, రాష్ర్టపతిని ఎన్నుకునే నియోజకం, ఏకీకృత, సమగ్ర న్యాయ వ్యవస్థ, అఖిలభారత సర్వీసులు, ఏకపౌరసత్వం, అల్ప సంఖ్యాక వర్గాలవారికి ప్రత్యేక హక్కులు, ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమీషన్లు, భాషా కమిషన్లు మొదలైనవి సొంతంగా రూపొందించిన అంశాలు.
జీవించే హక్కును ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
Published Mon, Jul 14 2014 10:17 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement