
పుల్వామా: నేడు(సోమవారం) హర్యానాతో పాటు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని 90 నియోజకవర్గాల్లో పుల్వామా అసెంబ్లీ స్థానం ఒకటి. పుల్వామా అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. ఈసారి పుల్వామా సీటుపై గట్టి పోటీ నెలకొంది.
నేషనల్ కాన్ఫరెన్స్ పుల్వామా సీటు నుంచి మహ్మద్ ఖలీల్ బంద్‌ను నిలబెట్టింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ వాహిద్ పారాకు టిక్కెట్ ఇచ్చింది. ఎన్నికలకు ముందు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండడంతో ఈ సీటు నేషనల్ కాన్ఫరెన్స్ ఖాతాలో చేరింది. ఈ స్థానానికి 1962లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ మాత్రమే ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తున్నాయి.ఈ సీటుపై బీజేపీ నేటికీ ఖాతా తెరవలేదు.
2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పీడీపీకి చెందిన మహ్మద్ ఖలీల్ విజయం సాధించారు. పుల్వామా జిల్లా మొత్తం జనాభా 5.60 లక్షలు. జిల్లా పరిపాలనా కేంద్రం శ్రీనగర్‌కు 31 కిలోమీటర్ల దూరంలో పుల్వామాలో ఉంది. జిల్లాలో 85.65శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో, 14.35శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. ఈ ప్రాంతం వరితో పాటు నాణ్యమైన కుంకుమపువ్వు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది.
ఇది కూడా చదవండి: Haryana Election Result : ఈ నేతల ఫలితంపైనే అందరి దృష్టి