జార్ఖండ్‌ ఎన్నికల్లో విచిత్రం.. సక్సెస్‌ @ 60 | Candidates Above 60 Years of Age Have Been Successful | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌ ఎన్నికల్లో విచిత్రం.. సక్సెస్‌ @ 60

Published Sat, Oct 26 2024 10:06 AM | Last Updated on Sat, Oct 26 2024 10:35 AM

Candidates Above 60 Years of Age Have Been Successful

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు యువ నాయకత్వానికి ఝలక్ ఇస్తూ, అనుభవజ్ఞులకు మద్దతు పలుకుతున్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన గణాకాంలను పరిశీలిస్తే, పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

2005 ఎన్నికల్లో రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన 18 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, వీరిలో ఐదుగురు విజయం సాధించారు. గెలుపొందిన 60 ఏళ్లు పైబడిన అభ్యర్థుల్లో కడియా ముండా, ఇందర్ సింగ్ నామ్‌ధారి లోక్‌నాథ్ మహతో తదితరులు ఉన్నారు. నాటి ఎ‍న్నికల్లో 60 ఏళ్లు పైబడిన రాజేంద్ర ప్రసాద్ సింగ్, యమునా సింగ్, సమరేష్ సింగ్ (ముగ్గురూ మరణించారు)  ఓడిపోయారు. 2005 ఎన్నికలలో కడియా ముండా, హరు రాజ్‌వర్‌లు  68 ఏళ్లు దాటిన అభ్యర్థులు వీరిద్దరూ ఎన్నికల్లో గెలిచారు.  అయితే అత్యంత వృద్ధ అభ్యర్థి డాక్టర్ విశేశ్వర్ ఖాన్ (83) నాటి ఎన్నికల్లో ఓడిపోయారు.

2009 ఎన్నికల్లో కూడా రాష్ట్ర ఓటర్లు అనుభవజ్ఞులపై నమ్మకం వ్యక్తం చేశారు. 2005తో పోలిస్తే జార్ఖండ్ అసెంబ్లీలో 60 ఏళ్లు పైబడిన నేతల సంఖ్య పెరిగింది. 2005లో ఈ సంఖ్య ఐదు కాగా, 2009లో ఎనిమిదికి పెరిగింది. ఈ ఎన్నికల్లో రాజేంద్ర సింగ్‌, సమేష్‌ సింగ్‌లు తిరిగి ఎన్నికల్లో పోటీచేశారు. రాజేంద్ర సింగ్ బెర్మో నుంచి, సమరేష్ సింగ్ బొకారో నుంచి గెలుపొందారు. అలాగే మాజీ స్పీకర్ ఇందర్ సింగ్ నామ్‌ధారి 2007లో తన 63 ఏళ్ల వయసులో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2009లో ఛత్ర ఎంపీ అయ్యారు. ఎన్నికల్లో గెలిచిన 60 ఏళ్లు పైబడిన అభ్యర్థుల్లో సైమన్ మరాండి (61), నలిన్ సోరెన్ (61), ఫూల్‌చంద్ మండల్ (66), మన్నన్ మల్లిక్ (64), సవన లక్రా (69), చంద్రశేఖర్ దూబే అలియాస్ దాదాయ్ దూబే (66) తదితరులు ఉన్నారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో  అత్యధిక వయసు కలిగిన అభ్యర్థి ఫూల్‌చంద్ మండల్ (71 సంవత్సరాలు)విజయం సాధించారు.  60 ఏళ్లు పైబడిన అభ్యర్థులు సరయూ రాయ్ (63), రామచంద్ర చంద్రవంశీ (68), రాజ్ కిషోర్ మహతో (68), యోగేశ్వర్ మహతో (60), అలంగీర్ ఆలం (60), స్టీఫెన్ మరాండి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 60 ఏళ్లు పైబడిన 20 మంది ప్రధాన అభ్యర్థులు ఉండగా, వారిలో 10 ఎన్నికల్లో విజయం సాధించగా, 10 ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో హాజీ హుస్సేన్ అన్సారీ (66), లాల్ చంద్ మహతో (62), మాధవ్ లాల్ సింగ్ (62), రాజేంద్ర ప్రసాద్ సింగ్ (68), సమరేష్ సింగ్ (73) తదితరులు ఉన్నారు.

2019లో 60 ఏళ్లు పైబడిన 27 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో 17 మంది విజేతలుగా నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన ప్రముఖులలో రాజేంద్ర ప్రసాద్ సింగ్ (73), రామచంద్ర చంద్రవంశీ (72), డాక్టర్ రామేశ్వర్ ఓరాన్ (72), నలిన్ సోరెన్ (71), హాజీ హుస్సేన్ అన్సారీ (70), అలంగీర్ ఆలం (69), సరయూ రాయ్ (68), లోబిన్ హెంబ్రామ్ (68), డాక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ (66), స్టీఫెన్ మరాండి (66), చంపై సోరెన్ (63), సిపి సింగ్ (63), ఉమాశంకర్ అకెలా (61), బాబులాల్ మరాండి (61), డా. రవీంద్ర నాథ్ మహతో (60) మరియు కమలేష్ కుమార్ సింగ్ (60) ఉన్నారు.

ఇది కూడా చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్ల సంఖ్య పెంపు..ఎంతంటే..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement