మెదక్ ఏరియా ఆస్పత్రిలో కేక్‌కట్ చేస్తున్న నాయకులు
మెదక్‌జోన్ : టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. మెదక్ ఏరియా ఆస్పత్రిలో రోగులకు, చర్చి కాంపౌండ్‌లోగల ఓల్డేజి హోంలో వృద్ధలకు పండ్లు పంపిపెట్టారు. అలాగే స్థానిక రాజీవ్‌భవన్, ఏరియా ఆస్పత్రిలో కేక్‌కట్ చేసి శశిధర్‌రెడ్డి లాంగ్‌లీవ్ అంటూ నినాదాలుచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మామిళ్ల ఆంజనేయులు, మేడి మధుసూదన్‌రావు, గూడూరి ఆంజనేయులు రవి, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొండ శ్రీనివాస్, జట్కా సందీప్ తదితరులు పాల్గొన్నారు.
హవేళిఘణాపూర్(మెదక్) : మండల కేంద్రంలోని హవేళిఘణాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శశిధర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మామిండ్ల ఆంజనేయులు, నాయకులు ఏసురెడ్డి, సాప రవి, బచ్చు జగదీశ్వర్, నరేందర్ రెడ్డి, శ్రావణ్, కుమార్ తదితరులున్నారు.
రామయంపేట(మెదక్) : మెదక్ మాజీ ఎమ్మేల్యే శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం రామయంపేట నాయకులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అహ్మద్, రొయ్యల పాచయ్య, కర్రె రమేష్, దోమకొండ వెంకటి, గౌస్ తదితరులు ఉన్నారు.
చిన్నశంకరంపేట(మెదక్) : మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను చిన్నశంకరంపేట లో శుక్రవారం పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భర్త్‌డే కేక్ కట్‌చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, రమేష్ పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్) : మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి జన్మదిన వేడుకలను మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంతప్ప ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, డీసీసీ డైరెక్టర్ మల్లన్న, ఉప సర్పంచ్ కలీం, ఏడుపాయల మాజీ డైరెక్టర్ కిషన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు ఖాజా, నరేందర్‌గౌడ్, నసీరొద్దీన్, నిజాం, జకీర్, అన్నారం ఇమానియల్ పాల్గొన్నారు. ఇక ఏడుపాయల దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు శశిధర్‌రెడ్డి పేరిట పూజలు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment